డాలరు మొగుడు రూపాయి పెండ్లాము !
పెండ్లాము కొంగు
మరీ ఖరీదై పోనాది
డాలరు మొగుడు ఆకాశానికి
ఎగురు తున్నాడు ఓలమ్మో !
పెండ్లాము గోల్డు అడిగినాది
అడిగినంత కోరినంత అలుక తీరిస్తే
ఇప్పుడు మరీ సంకట మై పోనాది
మెకన్నాస్ గోల్డ్ రష్ లా
వెంకన్నాస్ గోల్డ్ నిలువ ఎంతో మరి !
దేశం లో డాలరు బిళ్ళ
మాంగల్యం అంత పవిత్ర మై పోనాది
వద్దనుకుంటే మరి జీవితం ఇరకాటం
ముద్దనుకుంటే మరి జీవనం గందర గోళం
గోల్డు
జిలేబి
మొగుడికి వయసు వెనకపడుతోంది. పెళ్ళానికి ముందు పడుతోంది. :)
ReplyDelete
Deleteశర్మ గారు,
ముందు పడ్డా, వెనుక పడ్డా ఇప్పుడున్న జమానాలో క్రిందా మీదా పడాల్సిందే మరి !
జిలేబి
మొగుడు పైన వుండటం , పెండ్లాము క్రింద వుండటం అనాదిగా వస్తున్న ఆనవాయితీయే కదా జిలేబి గారు . ఇది యూనివర్సల్ ట్రూథ్ కదా ! అంగీకరించక తప్పదు మరి . పెండ్లాముని చూసి కనికరించక తప్పదు మరి .
ReplyDelete
Deleteశర్మ గారు,
మా బాగా సెలవిచ్చారు !
జిలేబి
నేనొప్ప.. ప్రస్తుతం ట్రెండుకు అనుకూలంగా "డాలరు భార్య - రూపాయి మొగుడు" అనాలని మనవి.
ReplyDelete
Deleteశ్రీ కాంత్ గారు,
అంతే అంతే ! డాలరు పెండ్లాము రూపాయ మొగుడు ! బాగు బాగు !
జిలేబి
యెంతైనా లేడీసు లేడీసే!డాలరు కీ రూపాయికీ మొగుడూ పెళ్ళాల సంబంధం అంటగట్టేశారు:-)
ReplyDelete
Deleteహరీష్ బాబు గారు,
కాదంటారా మరి !
జిలేబి
రూపాయి పెళ్ళాం, డాలరి మొగుడు అయితే మరి పౌండు (GBP)?
ReplyDelete
Deleteసూర్య గారు,
రూపాయ పెండ్లాము, డాలరు మొగుడు అయితే పౌండు మరి పౌలస్త్య పుత్రః కుబేరః !!
జిలేబి
ఎంత గొప్ప డాలర్ అయినా పెళ్ళాం కొంగుబంగారంగా మారాల్సిందే కదా ! కాదంటారా ?
ReplyDelete
Deleteవనజ గారు,
సరిగ్గా సెలవిచ్చారు ! అందుకే కదా కొంగు బంగారం 'ఖంగు' బంగారం అయ్యింది మరి !!
కుశలమా !
జిలేబి