ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా
చాలా సీరియస్ గా ఆలోచించి ఇక మీదట జిలేబీలు వేయటం ఆపేయ దలచుకున్నా !
బ్లాగుల టపాలు గెలకటం జిలేబీ లు వేయటం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లో మొదలయ్యింది . అంటే ఇప్పటి దాకా దాదాపు ఆరు సంవత్సరాలు గా వేస్తున్నా .
ఈ ఆరు సంవత్సరాల లో అప్పుడప్పడు జిలేబీ లు హాట్ హాట్ అయ్యేయి . కొన్ని సమయాల్లో 'పులిసేయి' . కొన్ని సమయాల్లో జిలేబి లు బూమ్ రాంగ్ అయి మీద పడ్డేయి
ఇవన్నీ చూసుకుంటూ , ఆ పై కూడా రాయకుండా ఉండకుండా జిలేబీ లు 'ఘీ'మ్ కరించ కుండా ఉండ లేక పోయా .
ముదుసలి కాలం లో ఓయ్ జిలేబి నీకు ఇది ఏమి ఈ ఆరాటం, యంగ్ జనరేషన్ తో పోటీ పడుతో కామెంట్ల పంటలు పండిచడం నీకు తరమా అని మా అయ్యరు గారు అప్పుడప్పుడు అనడం కూడా పరిపాటి అయి పోయే
అందుకే చాలా సీరియస్సు గా ఆలోచించి ఇక మీదట జిలేబీ లు వేయకుండా ఉండాలని టపాల కి స్వస్తి వాచకం పలికి రిటైర్ అయి పోవాలని అనుకుంటున్నా .
ఇక ఈ టపా వీక్షకులు కాదూ కూడదూ అంటే ప్చ్ ప్చ్ అని రెండు రోజుల్లో మరో మారు టపా పునః 'ఘీం' కీ కరణం కావించక తప్పదని కూడా అనుకుంటున్నా !!
కాబట్టి అరివీర బ్లాగు వీరుల్లారా , వీర నారీ మణుల్లారా ! ఇదియే 'బ్లేడు' జిలేబి వేయు ఆఖరి జిలేబి !!
చీర్స్
జిలేబి
(బ్లాగు లోకం లో ఇది ఒక సదాచారం - అప్పుడప్పుడు ఇట్లా 'అస్త్ర సన్యాసం' చేస్తున్నా అని టపా రాయటం ఇది ఒక ఆచారం/పరిపాటి . కాబట్టి నేను కూడా ఈ ఆచారాన్ని, సదాచారాన్ని పరిపాటి ని మన్నించి ఈ టపా వేయటం జరిగినది ! కాబట్టి బ్లాగోదరుల్లారా ఈ టపా సీరియస్సు ని మీరు గమనించగలరని నా అఖండ విశ్వాసం ! --దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ !!)