ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా
చాలా సీరియస్ గా ఆలోచించి ఇక మీదట జిలేబీలు వేయటం ఆపేయ దలచుకున్నా !
బ్లాగుల టపాలు గెలకటం జిలేబీ లు వేయటం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లో మొదలయ్యింది . అంటే ఇప్పటి దాకా దాదాపు ఆరు సంవత్సరాలు గా వేస్తున్నా .
ఈ ఆరు సంవత్సరాల లో అప్పుడప్పడు జిలేబీ లు హాట్ హాట్ అయ్యేయి . కొన్ని సమయాల్లో 'పులిసేయి' . కొన్ని సమయాల్లో జిలేబి లు బూమ్ రాంగ్ అయి మీద పడ్డేయి
ఇవన్నీ చూసుకుంటూ , ఆ పై కూడా రాయకుండా ఉండకుండా జిలేబీ లు 'ఘీ'మ్ కరించ కుండా ఉండ లేక పోయా .
ముదుసలి కాలం లో ఓయ్ జిలేబి నీకు ఇది ఏమి ఈ ఆరాటం, యంగ్ జనరేషన్ తో పోటీ పడుతో కామెంట్ల పంటలు పండిచడం నీకు తరమా అని మా అయ్యరు గారు అప్పుడప్పుడు అనడం కూడా పరిపాటి అయి పోయే
అందుకే చాలా సీరియస్సు గా ఆలోచించి ఇక మీదట జిలేబీ లు వేయకుండా ఉండాలని టపాల కి స్వస్తి వాచకం పలికి రిటైర్ అయి పోవాలని అనుకుంటున్నా .
ఇక ఈ టపా వీక్షకులు కాదూ కూడదూ అంటే ప్చ్ ప్చ్ అని రెండు రోజుల్లో మరో మారు టపా పునః 'ఘీం' కీ కరణం కావించక తప్పదని కూడా అనుకుంటున్నా !!
కాబట్టి అరివీర బ్లాగు వీరుల్లారా , వీర నారీ మణుల్లారా ! ఇదియే 'బ్లేడు' జిలేబి వేయు ఆఖరి జిలేబి !!
చీర్స్
జిలేబి
(బ్లాగు లోకం లో ఇది ఒక సదాచారం - అప్పుడప్పుడు ఇట్లా 'అస్త్ర సన్యాసం' చేస్తున్నా అని టపా రాయటం ఇది ఒక ఆచారం/పరిపాటి . కాబట్టి నేను కూడా ఈ ఆచారాన్ని, సదాచారాన్ని పరిపాటి ని మన్నించి ఈ టపా వేయటం జరిగినది ! కాబట్టి బ్లాగోదరుల్లారా ఈ టపా సీరియస్సు ని మీరు గమనించగలరని నా అఖండ విశ్వాసం ! --దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ !!)
'నాయనా పులివచ్చె' అన్నట్లు చేయకండి జిలేబీగారూ. అంతగా వైరాగ్యం కలిగితే జిలేబీశతకం మరోసారి చదువుకోండి. కావాలంటే మీ కోసం జిలేబీశతకం-2 వడ్డించటానికి నేను రెడీ. మీరు రెడీ యేనా? ఎప్పుడు మొదలేద్దాం చెప్పండి. మీదే ఆలస్యం. శుభస్య శీఘ్రం అన్నారు కదా పెద్దలు.
ReplyDeleteనిజం చెబుతున్నా, మెరమెచ్చు కాదు, అందరిలోనూ ఉత్సాహం తగ్గింది, కారణాలనేకం. మాట ప్రాణం పోస్తుంది, తీస్తుంది కూడా, ఎందుకో అందరూ తడిసిపోయిన నులక మంచాల్లా బిగుసుకుపోతున్నారు మాటాడటానికి. మాటాడండి, మరో కొత్త ఆలోచనొస్తుంది, మీరు జిలేబీలు చుట్టడం మానేస్తే ఎలా? చుట్టండి, అన్నీ బాగోక పోవచ్చు, బాగున్నవాటినే ఆస్వాదిద్దాం, ఆశావాదులంకదా! ఓపికున్నంతవరకు కొనసాగించండి.
ReplyDeleteకాదూ కూడదు మానేస్తానంటారా? అస్తు, మీవెనకే నేనూ, ఓపిక ఉండి రాయడం లేదు :) ఓపిక తెచ్చుకుని రాస్తున్నా.
ReplyDeleteశర్మగారూ, బ్లాగుల్లో రాజకీయవాతావరణకాలుష్యప్రభావతీవ్రత హెచ్చుతోంది. దానితో ఈ రాజకీయబ్లాగర్లరొదలో పాతతరం బ్లాగర్లు చెప్పే కబుర్లూకాకరకాయలూ వినబడటం కష్టంగా ఉంటోంది. దానితో ఉత్సాహవంతులైన బ్లాగర్లకు ఓపిక చచ్చిపోతోంది. ఓపిక ఉన్న బ్లాగర్లకు ఉత్సాహం చచ్చిపోతోంది. దాంతో అస్త్రసన్యాసపుటాలోచనలు మొదలుతున్నాయి. అంతా కాలప్రభావం! ఐనా తుఫాను ఎంత తీవ్రంగా వచ్చినా దాని గొప్ప కొన్నాళ్ళే. మరలా ప్రశాంతవాతావరణం రాదా మంచి కబుర్ల తరుణమూ రాదా! వేచి ఉండాలి. అంతే
ReplyDeleteమిత్రులు శ్యామలీయం గారు,
Deleteఈ వాతవరణం దగ్గరగా సంవత్సరం నుంచి ఉంది. గత ఆరు నెలలుగా మరీ పెరిగిపోయింది.
Baaga cheppaaru syamaleeyam garuu....
ReplyDeleteఏమిటీ విధి వైపరీత్యము !
ReplyDeleteఈ మధ్య అందరికీ "బ్లాగు" వైరాగ్యము పట్టుకుంటున్నది ?
శ్యామలీయంగారు చెప్పినట్లు బ్లాగులలో రాజకీయ వాతావరణం ఎక్కువై నాణ్యతగల బ్లాగర్ల మాటలు వినపడే సందు లేకుండా పోయింది.
మీరు అంతలా డీలా పడిపోవడం తగదు జిలేబీగారూ .. ఎదో ఒకటి చేద్దాం !
బ్లాగిల్లు తరపున నేను మంచి బ్లాగులను అన్నింటినీ ఒక గుంపుగా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.
అయినా మీ బ్జిలేబీల కాపీరైట్ 2030 వరకూ రాసి ఇచ్చి ఇప్పుడు ఆపెస్తానంతే కుదర్దు .. అంతే :)
ReplyDeleteఉత్సాహం అందరికి మంచిదే. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. మనకేమయిందీ.........జిలేబీ గారు మీరు మాటాడండి....
ReplyDeleteమీ గుమ్మంలో నిలబడి మాటాడుతున్నవాళ్ళకి సమాధానం చెప్పకుండా తలుపులేసుకుని వెళిపోడం న్యాయంకాదు. మీకిష్టం లేకపోతే మానెయ్యండి, బలవంతం లేదు, కాని మాతో మాటాడాటానికేం? లేదంటే నీ తో మాటాడను వెళిపోమని ఒక్క మాట చెప్పెయ్యండి చాలు, మరి కనపడం,మాతో మాటాడితే పట్టేసుకుంటామని భయమా :)
ReplyDeleteశర్మగారూ, జిలేబీగారికి కొంచెం సమయం ఇవ్వండి మరి!
ReplyDeleteఅస్తు. పెద్దల మాట చద్ది మూట.
ReplyDeleteనేనొల్లనుగాక ఒల్లను.....చుట్టేవాళ్ళు కూడా చుట్టడం మానేస్తే మాబోటివాళ్ళు ఎలా బ్రతికేది జిలేబీ జీ :-)
ReplyDeleteWish u happy in dependence day
ReplyDelete