Thursday, December 10, 2015

బ్లాగ్కామెంట్ హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

బ్లాగ్కామెంట్  హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

నిన్న జరిగిన బ్లాగార్ల మెంట్ లో అతలా కుతలమైన బ్లాగ్ కామెంట్ ఫ్లోర్ !

 
బ్లాగ్ కామెంట్ల హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం  ఓం ప్రథమం వారి కాన్సిపిరసీ అని ప్రముఖ వయోవృద్ధ బ్లాగిణి జిలేబి చెబ్తూ 'నేను నా బామ్మ గారి మనవరాలిని నన్ను ఎవ్వరూ భయ పెట్టలేరు ' అని ఉద్ఘాటిం చేరు !

ఈ సందర్భం లో ఆవిడ నుదిటి పై రూపాయి బిళ్ళ  సింధూరం తో , ఒక వైపు చూస్తె మిధిలాపురి మైధిలి లా , మరో వైపు నించి చూస్తే విజయవాడ కనక దుర్గమ్మ లా ,  అసమదీయులు , తల్లీ కంచి కామాక్షి, మధుర మీనాక్షి , కాశీ విశాలాక్షీ, అంటూ జేజేలు పలుకుతూ వస్తోంటే , 'కెలు కేశ్వరాంబ'   అంటూ తసమదీయులు కిసు కిసు లాడుతూ  వస్తోంటే బ్లాగ్మీడియా వారికి "నీలాంబరి"  లా ఫోటో షాట్ ఇచ్చారు :)

క్రితం కొన్ని రోజులు గా ముమ్మరం గా బ్లాగాగ్ర గ ణ్యు లు  ఏది చెప్పినా 'జీ' , 'ఎస్' అనాల్సిందే తప్పించి వారి కి ఎదురుగా 'తీటి' తే ధర్మాగ్రహం ,  అవమాన పరుస్తున్నారన్న ఆరోపణ ల తో బ్లాగ్ లోకపు కామెంట్ల లోకం అల్లకల్లోలం అయి పోయిన విషయం బ్లాగర్లందరికి ఎరుకైన విషయం 'ఇరుకైన' విషయమని విదితమే !

కామెంటుల చెండుల తో చెడుగుడు ఆడుతూ , నారదాయ నమః అంటూ అక్కడక్కడ ఘ్రుతం లాగిస్తూ విన్యాసాలు చేస్తూ ఒక వైపు జిలేబి 'ఆగడాలు' , మరో వైపు జిలేబి పై కేసు బనాయించి ఇది ఆవిడ, ఆవిడ అనుయాయుల కుట్ర , బ్లాగ్ దేశానికి నమ్మక ద్రోహం అంటూ ఉర్రూత లూగిస్తున్న పవనాలు ఈ 'హవా' లో ఎన్నేసి 'కామింట్లు' ద్రవ్య విలం బితం అయ్యే యో ఎవరి కెరుక అని ప్రముఖ పొలిటికల్ సెటై రిస్ట్ 'తేట 'గీతి  ట్వీటారు :)


ఇప్పుడు ఈ నమ్మక ద్రోహం కేసు 'జీ' ఎస్' లు తప్పించి టీకాలు పెట్ట కూడదన్న ధర్మాగ్రహం సమయం లో మళ్ళీ తెరపై రావడం,  రసవత్తరం గా జిలేబి ఇందులో ఓం ప్రథమం వారి కాన్స్పిరసీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తూంటే తన తల తిరిగి పోతోందని  పిస్తుందని బ్లాగ్ పొలిటికల్ అనలిస్ట్ హర్రీ బర్రీ  తన అభిప్రాయాన్ని తెలియ జేసారు :)

ఇంతటి తో ఈ నాటి కాన్స్పిరసీ ఘట్టపు ఫ్లాష్ న్యూస్ పరి సమాప్తం !

రేపు మళ్ళీ ఏమి జరుగునో ఎవరి కెరుక !

శుభోదయం
జిలేబి
జీ , ఎస్ ఓన్లీ ; నో 'టీ' :) (యు ఆర్ వెరీ నాటీ:)
 

Tuesday, December 8, 2015

తెలుగు బ్లాగ్లోకపు పునాదుల్ని కుదిపేస్తున్న ఆ నాలుగు ప్రశ్నలు !

తెలుగు బ్లాగ్లోకపు పునాదుల్ని కుదిపేస్తున్న ఆ నాలుగు ప్రశ్నలు 

ఈ టపా సదుద్దేశం తో బెట్ట బడినది ; తెలుగు బ్లాగ్లోకం పునాదులు కదిలి పోవచ్చు గాక; వయస్సు తో పై బడ్డ వారు జిలేబి ని నిందించు గాక; జ్ఞాన వృద్ధులు చీత్కరించు గాక; నలుగురు నవ్వి పోదురు గాక;

కానీ సనాతన ధర్మపు పునాదులు ఇట్లాంటి ప్రశ్నల తో నే కాలా కాలం గా పటిష్టాత్మక మవుతున్నది అన్న ఆలోచనే ఈ టపా పెట్టడానికి కారణం .

పదుగురారు మాట పాడి అయి కొంత కాలం ధర న జెల్ల వచ్చు; సనాతన ధర్మం మాత్రం కొంత కాలం కాదు సనాతనం గా నిత్య నూతనం గా ఉండటానికి కారణం మూలాన్ని ప్రశ్నించటం ;


నీహారిక గారు కొన్ని మరీ నిఖార్సైన , సూటి ఐన  ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి . 

నీహారిక సంధించిన  ప్రశ్నలు -

పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ? 

ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ?  

చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?



జిలేబి
ధైర్యే సాహసే జ్ఞానం !
యథో ధర్మః తతో జయః !

Monday, December 7, 2015

జిలేబి దర్శకత్వం లో 'బ్లాగు బలి' - మెగా చిత్రరాజం అతి త్వరలో వెండి తెరపై :)


జిలేబి దర్శకత్వం లో 'బ్లాగు బలి' - మెగా చిత్రరాజం అతి త్వరలో వెండి తెరపై :)

బ్లాగ్ ఉడ్-> గ్రేప్ వైన్ స్టొరీ  -> ఆదరాబాదరా నగరం -> డిసెంబర్ ఆరు - ౨౦౧౫ ->

ప్రముఖ దర్శకురాలు బీలేజీ జిలేబి దర్శకత్వం లో బ్లాగు బలి అనే మెగా చిత్ర రాజం  అతి త్వర లో వెండి తెరపై వస్తోందన్న వార్త బ్లాగు లోకం లో సంచలనం గావిస్తోంది :)

ఈ మెగా చిత్రం రాకమునుపే బ్లాగు లోకం లో సంచలనం కనిపిస్తోందని  బ్లాగు లోకం లో ఆరి తేరిన కథా రచయిత బ్లాగ్ గాంధీ  వారు రీ ట్వీట్ చేసారు !

ఈ మెగా చిత్రం తెర వెనుక కథ చాలా పకడ్బందీ గా జరుగు తోందని దీని విషయమై మీడియా కి ఏలాంటి 'మేత' దొరక కుండా కట్టుదిట్టం చేసారని బ్లాగ్ ఉడ్ లో ని పలువురు 'కిసు కిసు' మంటున్నారు !

జిలేబి 'బ్లాగు బలి' చిత్రం తరువాయి దర్శకేంద్రులందరినీ  తల దన్ని తానొక్కతే బ్లాగ్ ఉడ్ లో ఏక 'చట్టాధి' పైత్యం గా వెలుగొంద వచ్చునని విశ్రాంతి తీసుకుంటున్న బ్లాగ్మూవీ డిస్ట్రిబ్యూటర్ ఏడుకొండల రావు ఊహాగానం చేసారు :)

ఈ చిత్రం లో బ్లాగు 'షార్ప్' నఖ సఖీ  గా పేరొందిన నటీ మణి ప్రముఖ 'విల్లీ' పాత్ర వహిస్తోందని అట్లాంటి పాత్ర ని ఆవిడ తన నట జీవితం లో ఇంత వరకు చేసినట్లు ధాకలాలు లేవని , రాబోయే బ్లాగు చరిత్ర లో 'బ్లాగు బలి' ముందు ఆ తరువాయి అన్నంత గా ఆవిడ 'రోలు' కర్ర స్వారీ చేస్తుందని బ్లాగు సింగం ఉద్ఘాటించారు !

అట్లాగే ప్రముఖ హీరో హర్రీబర్రీ శూర్పణఖ ప్రతి ఎత్తు కి పై ఎత్తు వేస్తూ జన బాహుళ్యాన్ని మనోరంజకం గావిస్తారని కూడా బ్లాగు కామెంట్ల లోకం భోగట్టా :)

ఈ చిత్ర వార్త చేస్తున్న 'హల్' చల్ తో  కలవరం చెందిన ప్రముఖ బ్లాగ్కవి  తాను బ్లాగు డిస్ట్రిబ్యూటర్ ల ద్వారా కాకుండా తన చిత్రాలని  ప్రైవేట్ చానల్స్ 'రూట్' ద్వారా అందిస్తా నని  ప్రకటన చేసారు .

కాని ఇంత జరుగుతున్నా దర్శకురాలు జిలేబి ఏ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తాను జేస్తున్న పనిని మోడీ వారి లా చేస్తూ పోతోందని మీడియా కి మేత అందివ్వడం లేదని విచారణ వెలుబుచ్చారు పద్యాల రావు గారు .

ఇంతటి తో నేటి బ్లాగ్ ఉడ్ సినెమా సమాచారం పరి సమాప్తం.

సైనింగ్ ఆఫ్

చీర్స్  సహిత :)  
జిలేబి  

Saturday, December 5, 2015

గాడ్ ది గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ :)

గాడ్ ది గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ :)

మేం కమ్యూనిస్ట్ లం మాకూ మీ గాడ్ కి లంకె కుదరదు చెప్పా మా అయ్యరు గారితో .

అయ్యరు గారు ఫక్కున నవ్వేరు!

ఏమోయ్ జిలేబి నువ్వు నిజంగా పదహారణాల పక్కా కమ్యూనిస్ట్ వే నా ?

అందులో ఏమీ సందేహం లేదు కొద్దిగా సందేహం పీకుతున్నా అబ్బే మనం దీరోదాత్తురాలం కాబట్టి ధీమా గా చెప్పేయాలి  అని చెప్పా .

మరి దేముడు కూడా కమ్యూ నిస్టే . అట్లా అయితే నీకూ దేవుడి కి లంకె కుదర దంట్లే ఎట్లా ?

ఆయ్ కమ్యూనిజం పందొమ్మిదో శతాబ్దపు యూనివర్సల్ కాన్సెప్ట్ ;  దేవుడు పాతోడు . పాతోడు ఎట్లా కమ్యూనిస్ట్ అవుతాడు ? తీసి పారేసా .  పాతోళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే - క్యాపిట లిస్ట్లే .

అట్లాగా ? గాడ్ యూనివర్సల్ అవునా కాదా ?

అవును అట్లా అనే మీ వేదం చెబ్తుంది కదా దాని ని మేం నమ్మం కాని మీరు నమ్ముతారు గాబట్టి మీ నమ్మకం ప్రకారం యూనివర్సల్ .

గాడ్ కనిపిస్తాడా ?

ఫక్కున నవ్వా . అసలు వినిపించు కోనే వినిపించు కోడు ; ఇంకా ఎట్లా కనిపిస్తాడు ?

సో , కనిపించడూ వినిపించడు అంటావ్ !

అవ్ మల్లా ;

పై కి పంపిం చే టప్పుడు తర తమ బేధాలు పాటి స్తాడా ?

అబ్బే అంతా ఒకే ఘాట్ కే శ్మశాన ఘాట్ కే !

గాడ్ నిరంతరం ఉండే వాడా ?

అట్లా అని మీ వేదాలు చెబ్తాయి మళ్ళీ చూపుడు వేలు వారి వైపే ఎక్కు పెట్టా .

మీ కమ్యూనిస్ట్ లు తర తమ బేధాలు పాటిస్తారా ?

చస్తే నో .

పోనీ నిరంతరం గా మనీ ఫ్లో ఉండా లంటారా కాదా ?

అవును !

మరి చూడు ఎంత సామరస్యమో గాడ్ కి మీ కమ్యూనిజానికి ; గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ :)

అయ్యరు గారు ఈ టపా పెట్ట మంటారా ?

పెట్టు ;

పెడితే మళ్ళీ ఈ జిలేబి చేతలే కాదు మాటలు కూడా అర్థం కావడం లేదంటారేమో ?

నలుగురు నవ్వి పోదురు గాని జిలేబి ఎవరూ పుట్టించక టపాలు ఎలా పుడతాయి ? కాన్సెప్టులు ఎలా పుడతాయి ? వృత్తాలు ఎలా పుడతాయి ? పదాలు ఎలా పుడతాయి ?

నువ్వు రాస్తూ పో ! చదివే వాళ్ళు చదువుతారు ; కామెంట్ల తో కుమ్మాలనుకే వారు కుమ్ముతారు;

జిలేబి నిన్ను గారెలు అన్నా ఏమి బూరెలు అన్నా ఏమి :)

గీత లో శ్రీ కృష్ణుల వారేం చెప్పారు ? నీ కర్మను నువ్వు చేసుకుంటూ పో ; ఫలాన్ని ఆశించకు అని కదూ ?

ఫలాన్ని ఇవ్వని కర్మ చేసి ఏమి చేయకున్న ఏమి ?

సిం పుల్ జిలేబి - చేసిన కర్మ ఫలం ఇవ్వక పోతే కర్మని సంస్కరించు, పరిష్కరించు , సరియైన కర్మ చేయడానికి ప్రయత్నించు ;

నన్ను  చూడు వంట ఓ నలభై సంవత్సారులుగా నీ కోసం చేస్తున్నా; ఒక రోజు వంట సరిగా రాక పోతే మరో రోజు దాన్ని సరిజేయడానికి ప్రయత్నించడం లేదూ ?

అబ్బా ! ఈ అయ్యరు గారు దేనినైనా దేనికైనా ముడి పెట్ట గలరు ;

ఆండో ళ్ళు మరీ ఆలోచనలు వస్తే కిచెన్ లో కెళ్ళి కాయగూరలు తరిగే టట్టు :) ; వంట గది నే తమ సైకాలజీ ల్యాబ్ గా మార్చి పరిపూర్ణత్వం చెంద గలరు ;

అబ్బే ; నో ; నేను ఈ ట్రాప్ లో  పడ కూడదు ; ఇట్లా వంట గదుల గురించి చెప్పి అయ్యరు గారు నన్ను వంట గది కి కట్టి పడేసా లా ఉన్నారు :

నో జిలేబి; బామ్మ చెప్పిందే వేదం ; అయ్యరు గారి మాటలు అంతా బూటకం :)

చీర్స్
జిలేబి 

Friday, December 4, 2015

పదభిఘావళి !


పదభిఘావళి !
 
ఆలోచనలకి 
 
ఆకలెక్కువ 
 
 
-శర్కరి 
 
చీర్స్
జిలేబి

Thursday, December 3, 2015

శ్రీ రామాగ్రహం !

శ్రీ రామాగ్రహం !
 
ఎవడురా మేథావి ?
 
ఎవడు ? రామే తావి !



శుభోదయం
జిలేబి

Wednesday, December 2, 2015

సిరి వెన్నలా , సిరి వెన్నెల :)

సిరి వెన్నలా , సిరి వెన్నెల :)

ఈ మధ్య బలపం బట్టి బామ్మ  ఒళ్లో ఏ బీ సి డీ లు నేర్చు కున్నా పాట మావయ్య రాసింది అంటే బోనగిరి గారు అబ్బే కాదండీ అన్నయ్య /తమ్ములుం గారు శాస్త్రి గారిది అని సరి చేసారు.

ఓహో సిరి వెన్నల వారిదా ఆ పాట అన్నా .

వెన్నలా ? వెన్నెలా అని వారు రిటార్టు ఇచ్చారు ?

అబ్బే మా ఆండోళ్ళకి తెల్సింది వెన్నా, నెయ్యీ, గియ్యీ గట్రా యే ! వెన్నెలా గట్రా మగరాయుళ్ళ కే తెలుసునుస్మీ అని మనం రాసింది కవర్ జేసేసు కున్నాం :)

అబ్బే ఆండోళ్లు తప్పుగా రాసినా అది సబబే అని చెప్పేసు కోవాలె ; మనకు మనమై ఎప్పుడూ మనం జేసింది తప్పు అని చెప్పుకోరాదు; చెబ్తే మగరాయుళ్ళ కి మన కి వంక బెట్ట డానికి కారణం దొరికి పోతుందిస్మీ అని బామ్మ పోతూ పోతూ చెప్పేసి వెళ్ళింది. అప్పటి నించి బామ్మ వారి ఈ స్వకపోల భట్టీయ మంత్రాన్ని జపించు కుంటూ అయ్యరు వార్ని మేనేజు చేసేసు కుంటూ వచ్చేస్తున్నా ;)

అట్లాంటిది మనం తప్పుగా రాయడమా అబ్బే :) సుతరామూ తప్పు కాదు తప్పున్నర కూడా కాదు.

అక్షరం పరం బ్రహ్మం ! మన తల్లోంచి, 'కీబోర్డు వాతల్లోంచి', ఘంటం ఊకదంపుడు ఏది వస్తుందో ఏదో అదే సత్యం :)  అది అప్పు తచ్చై ఉండ వచ్చు గాక ! దానిని మనం సముదాయించి , అందులో నించి అర్థమును పరమార్థమును లాగి జిలేబి చెప్పిందే వేదం అని జెప్పు కోవాలన్న మాట !

సిరి అనగా ఎవరు ? శ్రీ మహాలక్ష్మి ! సముద్ర మంథనము న పుట్టినది . దాని తో బాటు వెన్న గట్రా కూడా పుట్టినది అని ఉవాచ !

అనగా సిరి వెన్నలా తోడు బుట్టువులు ! కావున సిరి వెన్నల అన్నదే సరి ఐనది !

మరి సిరివెన్నెల వారు అట్లా ఎందుకు శ్రీ చంద్రమా అని పేరెట్టేసు కున్నారు ? ఆ కాలం లో వారు జిలేబి ని సంప్రదించి ఉంటె వారు సిరి వెన్నలా అని విశ్వనాథ్ వారి కి సినిమా పేరు సరి జేసి ఉండే వారు :)

ఈ తెలుగు వాళ్ళు ఇది శుద్ధ తెలుగు పదం అంటారు గారి వెన్నెల అన్నది అరవం పదం 'వెణ్' నిలా కాదూ ? వెళ్ళఅయిన నిలా తెల్లని నిలా తెల్లని చందురూడు .

అట్లాగే వెన్న అన్న పదం ఎట్లా వచ్చింది ? అదిన్నూ అరవం నించే స్మీ:) వెన్నై అని అరవం. డానికి తెలు 'ఘీ' కారం ( చూడండి ఇక్కడ కూడా ఘీ అన్న హిందీ పదం ఎట్లా తెలుగు లో ఇమిడి పోయిందో :) వెన్న !

సిరి అనగా నవ్వు అని అరవం లో ; సో (ఈ మధ్య ఎవరో ఈ 'సో' అన్నది తెలుగా అన్నారు కూడాను ; కానీ ఈ సో సో ఎంత సొబగు గా ఉందో చూడండి అది కూడా తెలుగు లో పాల లో నీళ్ళ లా  ఎంత గా కరిగి పోయింది )


సిరి వెన్నలా అనగా నవ్వు తో ఉన్న వెన్న ! అనగా అముల్ బట్టర్ !

సో, సీతారామశాస్త్రి గారి రచనలు కూడా అముల్ బట్టర్ అంత తియ్యందనాల టేస్టి టేస్టి :)

అందుకే వారు సిరి వెన్నల సీతారామ శాస్త్రి గారే ! సిరివెన్నెల కాదు అని జిలేబి తీర్మానించు కునేసింది !

అట్టర్లీ బట్టర్లీ సిరి వెన్నలా !

కొస తునక -> బోనగిరి అనగా నేమి ? అని ఆంధ్ర భారతి వారిని 'కొచ్చనించగా' వారు జెప్పింది -> 

-->
  • పెండ్లిలో మగపెండ్లివారికి ఆడు పెండ్లివారు పంపు ఫలహారాలు అని :)


  • ఆడువారలకు 'ఫల' హారములు' కూర్చుట 'వెన్నతో' బెట్టిన విద్య :) ఈ శుభోదయ 'ఫల' హారమును అటులే స్వీకరించెరదని ఆశిస్తో :)

    నేటి కి ఫలహరముల భుక్తాయాసము తో
    సైనింగ్ ఆఫ్
    చీర్స్ సహిత
    జిలేబి

    Tuesday, December 1, 2015

    రామ నీ సమాన మెవరు !

    రామ నీ సమాన మెవరు !

    రామ నీ సమాన మెవరు అని పాడినారు కాకర్ల వారు .



    నిజంగా నే రాములవారు వారి కాలం లో నే గాదు (వారి యుగం లో మాత్రమె గాదు) ఆ పై యుగాలలో కూడా చిరస్థాయి గా ఉన్నవారే !

    రామాయణం లో పిడకల వేట చేయడానికి వాల్మీకి చాలా 'ఆస్కార్' లు  అందుకోవాలి (ఆస్కారాలు ఇచ్చాడు కాబట్టి :)

    రాముల వారిని పొగడటానికి ఎన్నెన్ని ఘట్టాలు ఉన్నాయో తెగడటానికి (వంకలు వెదక టానికి ) అన్నేసి ఘట్టాలు.

    సాదా సీదా గా చెప్పాలంటే రాముల వారిని పుంసాం మోహన రూపాయ అని జెప్పి మానవ మాత్రుల లో ఉండే అన్ని గుణ గణా లను వారి లో చూడ గలిగాడు కవి .

    మానవు లకి ఔరా ఒక మనిషి మనీషి గా నిలబడటానికి కాల వ్యవధి లో ఎన్నేసి కష్టాలు నష్టాలు చూడ వలసి వస్తుంది అనిపించక మానదు .

    మరి సీతమ్మ ? పుట్టని అమ్మ అని ఈ మధ్య ఒకరన్నారు . భూదేవి ఒడి లో నాగలి కి తగిలిన నారి .  జనకాత్మజ . జానకి .

    రాముల వారి తో సరి సమానంగా కష్టాలను స్వీకరించింది . నువ్వు వనవాసం చేసి రావోయ్ అని ఈ కాలం లో జిలేబిలు చెప్పగలరు .

    తమ్ముడు - లక్ష్మణుడు - వాడిని ఎవరూ అడగలేదు వెళ్ళ వోయ్ వనవాసానికి అని. తనకు తానై అన్నకు తోడుగా వెళ్ళాడు .

    వీటన్నిటి కి మించి ఊర్మిళ . హిందీ సాహిత్యం లో ఊర్మిళా కీ విరహ్ అనిమైథిలి శరణ్ గుప్త వారి దను కుంటా ఒక ఖండిక ఉంది . ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా .  సాకేత్ అన్నది పుస్తకం పేరు .

    భారతీయ భాషల్లో నే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా అద్బుతం గా అనువదింప బడి , కల్పవృక్షం గా పేర్కొనబడి , విష వృక్షం గా చెప్పబడి పరి పరి కోణాల నించీ విశ్లేషించ బడినది రాముల వారి చరిత్ర .

    అంతే కాదు ; మనకు దగ్గిర గా తెలిసిన కాల ఘట్టం లో త్యాగయ్య వారి చేత కొనియాడ బడి , వారి కి రాముల వారి కన్న వేరెవ్వరు లేరు అని రామాయణం మొత్తం వారి సంగీతం లో ఇమిడి మనకు ఈ నాటికీ పాటల రూపం తో ఆవిష్కరించ బడి ఉన్నది .

    రాబోవు కాలం లో మరిన్ని విశ్లేషణలు  పరి పరి విధాల పరిశోధనలు వాటి మీద రావచ్చు గాక.

    ఎంత వచ్చినా ఏమి వ్రాసినా కాలం లో ఇమిడి పోయి వాటిని స్వకీయం చేసుకునే భారత సంస్క్రతి కళ కళ లాడు తున్న సంస్కృతీ .సజీవ సంస్కృతీ .అందులో ఇది అది అని లేకుండా అన్నీ కలిసి మహా సాగరమై మహోన్నతం గా వెలుగొందటం తధ్యం.

    రామ నీ సమాన మెవరు.

    శుభోదయం
    జిలేబి


     

    Monday, November 30, 2015

    సులభః పురుషః రాజన్ ....


    కామెంటు చెండులు

    కం. విపరీతంగా చదవా
    లపుడప్పుడు తోచినట్లు వ్యాఖ్యానించా
    లపుడప్పుడు మౌనాన్నీ
    ఉపయోగించాలి తెలివి యొప్ప జిలేబీ
     
    కామెంటు ఉత్ప్రేరకం

    కం. రమ్మా చక్కని కామెం
    ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
    నమ్మా జిలిబిలి పలికుల
    కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ
     
    జిలేబీ తెలుగు వ్యాఖ్య !

    కం. నలభై పంక్తుల వ్యాసము
    సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
    తల కెక్కక పొగరణచెను
    కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.
     
    వినమ్రత

    కం. బందమొ ముందరి కాళ్ళకు
    నందముగా భావమమర నగు పరికరమో
    ఛందం బనునది దేవుం
    డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.

    కం. ఛందములాడించునొ నను
    ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
    నందముగా వ్రాయుదునో
    యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ
     
    తాడి గడప వారి జిలేబీయం.

    Sunday, November 29, 2015

    క్రెడిట్ కార్డ్ ఆఫర్ ! - మీరు బాల్చీ తన్నితే - మీ దహనక్రియాల ఖర్చు కి క్రెడిట్ ఫ్రీ ఆఫర్ ! :)

    క్రెడిట్ కార్డ్ ఆఫర్ ! -
     
    మీరు బాల్చీ తన్నితే -
     
    మీ దహనక్రియాల ఖర్చు కి క్రెడిట్ ఫ్రీ ఆఫర్ ! :)

    ఆలశించిన ఆశాభంగం !
     


    వెంటనే రండి !
    ఆఫర్ కొన్ని రోజులు మాత్రమె !
     
    మా మయానం క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ !
     


    అంతే కాదు !
    మీరు బాల్చీ తన్నేస్తే
     
    మీ దహన క్రియల ఖర్చులు
     
    మీ క్రెడిట్ కార్డ్ కి స్వైప్ చెయ్యండి :)
     
    మొత్తం ఖర్చులు మా మయానం క్రెడిట్ కార్డ్ కంపెనీ యే భరిస్తుంది :-
     
    వెంటనే ఆఫర్ అందుకోండి ! మీ మయానం ఖర్చులని ఆదా చేసుకోండి !
     
    ఆఫర్ వేలిడ్ నవంబెర్ ముప్పయ్యో తారీఖు దాక మాత్రమె !
     
    భలే మంచి చౌక బేరము !
     
     
    చీర్స్
    జిలేబి