గాడ్ ది గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ :)
మేం కమ్యూనిస్ట్ లం మాకూ మీ గాడ్ కి లంకె కుదరదు చెప్పా మా అయ్యరు గారితో .
అయ్యరు గారు ఫక్కున నవ్వేరు!
ఏమోయ్ జిలేబి నువ్వు నిజంగా పదహారణాల పక్కా కమ్యూనిస్ట్ వే నా ?
అందులో ఏమీ సందేహం లేదు కొద్దిగా సందేహం పీకుతున్నా అబ్బే మనం దీరోదాత్తురాలం కాబట్టి ధీమా గా చెప్పేయాలి అని చెప్పా .
మరి దేముడు కూడా కమ్యూ నిస్టే . అట్లా అయితే నీకూ దేవుడి కి లంకె కుదర దంట్లే ఎట్లా ?
ఆయ్ కమ్యూనిజం పందొమ్మిదో శతాబ్దపు యూనివర్సల్ కాన్సెప్ట్ ; దేవుడు పాతోడు . పాతోడు ఎట్లా కమ్యూనిస్ట్ అవుతాడు ? తీసి పారేసా . పాతోళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే - క్యాపిట లిస్ట్లే .
అట్లాగా ? గాడ్ యూనివర్సల్ అవునా కాదా ?
అవును అట్లా అనే మీ వేదం చెబ్తుంది కదా దాని ని మేం నమ్మం కాని మీరు నమ్ముతారు గాబట్టి మీ నమ్మకం ప్రకారం యూనివర్సల్ .
గాడ్ కనిపిస్తాడా ?
ఫక్కున నవ్వా . అసలు వినిపించు కోనే వినిపించు కోడు ; ఇంకా ఎట్లా కనిపిస్తాడు ?
సో , కనిపించడూ వినిపించడు అంటావ్ !
అవ్ మల్లా ;
పై కి పంపిం చే టప్పుడు తర తమ బేధాలు పాటి స్తాడా ?
అబ్బే అంతా ఒకే ఘాట్ కే శ్మశాన ఘాట్ కే !
గాడ్ నిరంతరం ఉండే వాడా ?
అట్లా అని మీ వేదాలు చెబ్తాయి మళ్ళీ చూపుడు వేలు వారి వైపే ఎక్కు పెట్టా .
మీ కమ్యూనిస్ట్ లు తర తమ బేధాలు పాటిస్తారా ?
చస్తే నో .
పోనీ నిరంతరం గా మనీ ఫ్లో ఉండా లంటారా కాదా ?
అవును !
మరి చూడు ఎంత సామరస్యమో గాడ్ కి మీ కమ్యూనిజానికి ; గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ :)
అయ్యరు గారు ఈ టపా పెట్ట మంటారా ?
పెట్టు ;
పెడితే మళ్ళీ ఈ జిలేబి చేతలే కాదు మాటలు కూడా అర్థం కావడం లేదంటారేమో ?
నలుగురు నవ్వి పోదురు గాని జిలేబి ఎవరూ పుట్టించక టపాలు ఎలా పుడతాయి ? కాన్సెప్టులు ఎలా పుడతాయి ? వృత్తాలు ఎలా పుడతాయి ? పదాలు ఎలా పుడతాయి ?
నువ్వు రాస్తూ పో ! చదివే వాళ్ళు చదువుతారు ; కామెంట్ల తో కుమ్మాలనుకే వారు కుమ్ముతారు;
జిలేబి నిన్ను గారెలు అన్నా ఏమి బూరెలు అన్నా ఏమి :)
గీత లో శ్రీ కృష్ణుల వారేం చెప్పారు ? నీ కర్మను నువ్వు చేసుకుంటూ పో ; ఫలాన్ని ఆశించకు అని కదూ ?
ఫలాన్ని ఇవ్వని కర్మ చేసి ఏమి చేయకున్న ఏమి ?
సిం పుల్ జిలేబి - చేసిన కర్మ ఫలం ఇవ్వక పోతే కర్మని సంస్కరించు, పరిష్కరించు , సరియైన కర్మ చేయడానికి ప్రయత్నించు ;
నన్ను చూడు వంట ఓ నలభై సంవత్సారులుగా నీ కోసం చేస్తున్నా; ఒక రోజు వంట సరిగా రాక పోతే మరో రోజు దాన్ని సరిజేయడానికి ప్రయత్నించడం లేదూ ?
అబ్బా ! ఈ అయ్యరు గారు దేనినైనా దేనికైనా ముడి పెట్ట గలరు ;
ఆండో ళ్ళు మరీ ఆలోచనలు వస్తే కిచెన్ లో కెళ్ళి కాయగూరలు తరిగే టట్టు :) ; వంట గది నే తమ సైకాలజీ ల్యాబ్ గా మార్చి పరిపూర్ణత్వం చెంద గలరు ;
అబ్బే ; నో ; నేను ఈ ట్రాప్ లో పడ కూడదు ; ఇట్లా వంట గదుల గురించి చెప్పి అయ్యరు గారు నన్ను వంట గది కి కట్టి పడేసా లా ఉన్నారు :
నో జిలేబి; బామ్మ చెప్పిందే వేదం ; అయ్యరు గారి మాటలు అంతా బూటకం :)
చీర్స్
జిలేబి
No comments:
Post a Comment