Wednesday, December 2, 2015

సిరి వెన్నలా , సిరి వెన్నెల :)

సిరి వెన్నలా , సిరి వెన్నెల :)

ఈ మధ్య బలపం బట్టి బామ్మ  ఒళ్లో ఏ బీ సి డీ లు నేర్చు కున్నా పాట మావయ్య రాసింది అంటే బోనగిరి గారు అబ్బే కాదండీ అన్నయ్య /తమ్ములుం గారు శాస్త్రి గారిది అని సరి చేసారు.

ఓహో సిరి వెన్నల వారిదా ఆ పాట అన్నా .

వెన్నలా ? వెన్నెలా అని వారు రిటార్టు ఇచ్చారు ?

అబ్బే మా ఆండోళ్ళకి తెల్సింది వెన్నా, నెయ్యీ, గియ్యీ గట్రా యే ! వెన్నెలా గట్రా మగరాయుళ్ళ కే తెలుసునుస్మీ అని మనం రాసింది కవర్ జేసేసు కున్నాం :)

అబ్బే ఆండోళ్లు తప్పుగా రాసినా అది సబబే అని చెప్పేసు కోవాలె ; మనకు మనమై ఎప్పుడూ మనం జేసింది తప్పు అని చెప్పుకోరాదు; చెబ్తే మగరాయుళ్ళ కి మన కి వంక బెట్ట డానికి కారణం దొరికి పోతుందిస్మీ అని బామ్మ పోతూ పోతూ చెప్పేసి వెళ్ళింది. అప్పటి నించి బామ్మ వారి ఈ స్వకపోల భట్టీయ మంత్రాన్ని జపించు కుంటూ అయ్యరు వార్ని మేనేజు చేసేసు కుంటూ వచ్చేస్తున్నా ;)

అట్లాంటిది మనం తప్పుగా రాయడమా అబ్బే :) సుతరామూ తప్పు కాదు తప్పున్నర కూడా కాదు.

అక్షరం పరం బ్రహ్మం ! మన తల్లోంచి, 'కీబోర్డు వాతల్లోంచి', ఘంటం ఊకదంపుడు ఏది వస్తుందో ఏదో అదే సత్యం :)  అది అప్పు తచ్చై ఉండ వచ్చు గాక ! దానిని మనం సముదాయించి , అందులో నించి అర్థమును పరమార్థమును లాగి జిలేబి చెప్పిందే వేదం అని జెప్పు కోవాలన్న మాట !

సిరి అనగా ఎవరు ? శ్రీ మహాలక్ష్మి ! సముద్ర మంథనము న పుట్టినది . దాని తో బాటు వెన్న గట్రా కూడా పుట్టినది అని ఉవాచ !

అనగా సిరి వెన్నలా తోడు బుట్టువులు ! కావున సిరి వెన్నల అన్నదే సరి ఐనది !

మరి సిరివెన్నెల వారు అట్లా ఎందుకు శ్రీ చంద్రమా అని పేరెట్టేసు కున్నారు ? ఆ కాలం లో వారు జిలేబి ని సంప్రదించి ఉంటె వారు సిరి వెన్నలా అని విశ్వనాథ్ వారి కి సినిమా పేరు సరి జేసి ఉండే వారు :)

ఈ తెలుగు వాళ్ళు ఇది శుద్ధ తెలుగు పదం అంటారు గారి వెన్నెల అన్నది అరవం పదం 'వెణ్' నిలా కాదూ ? వెళ్ళఅయిన నిలా తెల్లని నిలా తెల్లని చందురూడు .

అట్లాగే వెన్న అన్న పదం ఎట్లా వచ్చింది ? అదిన్నూ అరవం నించే స్మీ:) వెన్నై అని అరవం. డానికి తెలు 'ఘీ' కారం ( చూడండి ఇక్కడ కూడా ఘీ అన్న హిందీ పదం ఎట్లా తెలుగు లో ఇమిడి పోయిందో :) వెన్న !

సిరి అనగా నవ్వు అని అరవం లో ; సో (ఈ మధ్య ఎవరో ఈ 'సో' అన్నది తెలుగా అన్నారు కూడాను ; కానీ ఈ సో సో ఎంత సొబగు గా ఉందో చూడండి అది కూడా తెలుగు లో పాల లో నీళ్ళ లా  ఎంత గా కరిగి పోయింది )


సిరి వెన్నలా అనగా నవ్వు తో ఉన్న వెన్న ! అనగా అముల్ బట్టర్ !

సో, సీతారామశాస్త్రి గారి రచనలు కూడా అముల్ బట్టర్ అంత తియ్యందనాల టేస్టి టేస్టి :)

అందుకే వారు సిరి వెన్నల సీతారామ శాస్త్రి గారే ! సిరివెన్నెల కాదు అని జిలేబి తీర్మానించు కునేసింది !

అట్టర్లీ బట్టర్లీ సిరి వెన్నలా !

కొస తునక -> బోనగిరి అనగా నేమి ? అని ఆంధ్ర భారతి వారిని 'కొచ్చనించగా' వారు జెప్పింది -> 

-->
  • పెండ్లిలో మగపెండ్లివారికి ఆడు పెండ్లివారు పంపు ఫలహారాలు అని :)


  • ఆడువారలకు 'ఫల' హారములు' కూర్చుట 'వెన్నతో' బెట్టిన విద్య :) ఈ శుభోదయ 'ఫల' హారమును అటులే స్వీకరించెరదని ఆశిస్తో :)

    నేటి కి ఫలహరముల భుక్తాయాసము తో
    సైనింగ్ ఆఫ్
    చీర్స్ సహిత
    జిలేబి

    No comments:

    Post a Comment