జిలేబి బ్రాండ్ - రభసోత్సవం :)
ఈ మధ్య పంచ దశ లోకం లో పద్య లోకం లో పడి జిలేబి ట్రెండ్ మరీ రభస అయి పోయింది !
ఏది జూసిన ఒకటి రెండు మూడు అని గణిస్తూ ఉండటం పరి పాటి అయి పోయింది !
కాబట్టి సరదా గా "శారద" అనుమతి తో !
జిలేబి బ్రాండ్ రభసోత్సవం - అనగా ర ,భ స గణాల తో రగడ లాడటం ఎట్లా అన్న మాట :)
జిలేబి ట్రెండ్ కాబట్టి ఏది గెలికి నా అది అరవై శాతం పై బడి 'రగడ' కేటగిరీ లో చేరి పోతోంది !
పూర్వ జన్మ ప్రారబ్ధం అనుకుంటా ! జేకే !
ఇక ర, భ స గురించి
ర గణం - గురువు లఘువు గురువు - U | U
భ గణం - గురువు లఘువు లఘువు - U | |
స గణం - లఘువు లఘువు గురువు - | | U
దీన్ని సులభం గా గురువు ఆదియు అంతము - రగణము ఉదా: శ్రీరమా - ఐదు మాత్రలు
గురువు ఆది భగణము - ఉదా :- శ్రీరమ - నాలుగు మాత్రలు
గురువు అంతము స గణము - ఉదా: రమణా - నాలుగు మాత్రలు
మొత్తం వెరసి పదమూడు మాత్రలు మరీ బేసి గా ఉంది :)
శ్రీరమా శ్రీరమ రమణా
(గురువు గారిని లెఫ్ట్ రైట్, లెఫ్ట్, రైట్ కొట్టించ డమని అనుకుంటే కూడా అనుకోవచ్చు ! జేకే )
మొదట సింపుల్ గా ర భ స తో చూద్దాం (ఇది చాలా తేలిక ! ర భ స రిపీట్ నాలుగు మార్లు !)
శ్రీరమా శ్రీరమ రమణా
మాటయే సీతకు జెపితీ
వేగమే వారధి గనుమా
లంకయే బోవలె వినుమా !
మాటయే సీతకు జెపితీ
వేగమే వారధి గనుమా
లంకయే బోవలె వినుమా !
ఇప్పుడు ర భ స లని అవి మారుతూ వస్తోంటే ఎట్లా వ్రాయొచ్చు ?
ర భ స భ స ర స ర భ ర భ స
దీన్నే నాలుగు పాదాలు రిపీట్ చేస్తే చాలు
ర భ స
భ స ర
స ర భ
ర భ స
శ్రీరమా శ్రీరమ రమణా
సీతయు జతతో వేగమే
కావుమా శ్రీపతీ వేడెద
నీవుమా రాముడు గదరా!
సీతయు జతతో వేగమే
కావుమా శ్రీపతీ వేడెద
నీవుమా రాముడు గదరా!
జస్ట్ ర భ స తో చేసే పదము హరిణ గతి వోలె ఉండు :)
కాని ర భ స ల ని మారుస్తూ చేస్తున్నది జిలేబి రగడ ! ఇది జిలేబి రగడ రభసోత్సవం :)
శుభోదయం
చీర్స్
జిలేబి
జిలేబి "రభస" ఉత్సవం - హరిణ గతి రగడ మార్పుల తో :)