Monday, September 7, 2015

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్ !

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్

చా, మరీ ఇట్లా అడ్డ దిడ్డ మైన ప్రశ్న వేస్తే ఎట్లా జిలేబి అంటారా ?

లేకుంటే ఏమిటండీ ?

పురాతన కాలం నించి ఈ ప్రశ్న వేధిస్తో నే ఉంది . వేధిస్తో నే ఉంది ; ఇంకా ఒక ఒకే నిర్ధారణ కి రాలే !

ఆత్మ ఉందంటూ కొందరు , లేదంటూ ఇంకొందరు వాదిస్తూ నే ఉంటున్నారు .

దీనికి తోడు జోదు ఆ సో కాల్డ్ 'పరమాత్మ :) కలడు కలండనే వాడు కలడో లేదో అంటూ సందేహం వెలిబరుస్తూనే మహా భాగవతం రాసి మన మొఖాన పడేసి కుదేసి టా టా చెప్పి తా చక్కా పోయాడు పరంధాముని సన్నిధికి అంటూ ఒక పుణ్యాత్ముడు :) మళ్ళీ ఇక్కడా ఆత్మే పుణ్యాత్ముడు , పాపాత్ముడు గట్రా :)

ఆత్మ కి అసలు రూపం లేదు ; ఎక్కడ ఉంది అని మన కష్టే ఫలే వారి లా వివేక చూడామణి ని పట్టు కు ఈది, (ఇదేమన్నా గోదావరి యా ఈ తటం కని పిస్తే , ఖచ్చితం గా ఆ వైపు మరో తటం ఉందని అనుకోవడానికి :)) ఈది కోశాల కోణాల ని కొన లని పట్టు కోవడానికి 'బాహుబలి' ప్రయత్నం చేస్తున్నారు !

మరి కొందరేమో యోగః అంటూ జోగాడుతూ ఆ సో కాల్డ్ ఆత్మా వారిని సందర్శించ డానికి శీర్షాశనాలు వేస్తున్నారు .

మరి కొందరేమో , స్వామీ వివేకా నందా వారికీ జెయ్ అంటూ మన నరేంద్ర మోడీ వారి లా (ఈ నరేంద్ర మోడీ పేరు ఎందుకు జిలేబి అంటే , బ్లాగార్పీ రేటింగు కోసం అని బ్లాగ్ రీడర్లు చెబుతారు కాని జిలేబి అది ఒప్పుకోదు  !) దరిద్ర నారాయణ్ సేవ లో కర్మ యోగం లో మునిగి తేలి ఆత్మ దర్శనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు .

మరి కొందరేమో , హూ యాం ఐ అంటూ తల గోక్కుంటూ బుర్రె తడుముకుంటూ దీర్ఘాలోచనలో పడి ఆత్మా ఎక్కడ ఉన్నావా అసలున్నావా అంటూ బవిరి గడ్డం తడివేసు కుంటున్నారు.

వీటి మధ్య లో నగర జీవనం లో క్రిందా పైనా పడి నోటి బువ్వ కి చేతి పని కి ఏమైనా పొత్తు కుదురుతుందా అంటూ సగటు మానవుడు ,తనకున్న కొద్ది పాటి సమయం లో గణపతి బప్పా మోరియా అంటూ రెండు చెంపలు వేసేసుకుని , గుంజిళ్ళూ తీసేసు కుని వచ్చేస్తోంటే , సో కాల్డ్  'శాస్త్ర పారంగతులు ' అసలు శాస్త్రం లో విగ్రహారాధన ఉందా అంటూ తర్కించి తర్కించి శుష్కించి శుష్కించి అలసి సొలసి నిదుర పోయి లేసి ఆహా కల గంటిని అంటూ ఇదియేరా పరమాత్మ తత్త్వం అంటూ సెటిల్ అయి పోతున్నారు .

ఏమిటో , జిలేబి నాకు ఒక్క ముక్కా అర్థం కావడం లేదంటారా !

అంతా మాయ ! విష్ణు మాయ ! అంటూ జిలేబి చక్కా వెళ్లి పోతుంది !

అబ్బబ్బా , ఈ ఆత్మా వారికి అంత టెక్కు ఎందుకో ? ఉంటె , ముందుకొచ్చి నేనే అని జేప్పోచ్చు గా ?

ఊ హూ ! చస్తే  రాడు, రాదు  - చస్తే గాని రాడు, రాదు, ముందుకి అదే ఏమి చావడం  అంటే వెతుక్కో జిలేబి  ఏది చావాలో అంటూ ఉపనిషత్తుల వారు (వీరు డైరెక్ట్ గా చెప్పరు గాక చెప్పరు - ఉపనిషత్తుల వారిది ఎప్పుడూ ఇండైరేక్ట్ మార్కెటింగ్ టెక్నీక్ :) ముక్తాయించి ఆయ్ ఇక మరో ఉపనిషత్తు కి వెళదామని చక్కా వెళ్లి పోతారు !

ఇక మిగిలింది ఈ కాలపు స్వామీ వారలు, మహారాజ్ లు , వీళ్ళు కాలాని కి తగ్గట్టు ఏది కావాలో అది చెప్పుకుంటూ టైం పాస్ టీం పాస్ చేసి వారికి తగిన జ్ఞాన బోధ ఇంకొంచం గట్టి వారైతే తరుణో పాయ మంత్రం జెప్పి నీ తంటాలు నువ్వు పడవోయ్ జిలేబి అని చక్కా ఆ హిమాలయాల కేసి తిరిగి దండం పెట్టేసు కుంటారు !

ఇక హిమాలయాల మాట అంటారా ? 'కాలా కాలం' గా వీటన్నికి సాక్షీ భూతం గా (ఈ సాక్షీ భూతం ఏమిటి మధ్య లో !) నిలబడి గంగై , సుగంగై , ఆకాశ గంగై , సాగరమై , మేఘమై, నీలి మేఘమై , ఘనీ భూతమై ( మళ్ళీ భూతం ) , హోరై, జోరై , వానై వరదై , మళ్ళీ హిమమై , మళ్ళీ ......


శుభోదయం
జిలేబి
(కష్టే ఫలే వారి వివేక చూడామణి టపా శర పరంపరలు చదివేక )

4 comments:

 1. గంగై , సుగంగై , ఆకాశ గంగై , సాగరమై , మేఘమై, నీలి మేఘమై , ఘనీ భూతమై ( మళ్ళీ భూతం ) , హోరై, జోరై , వానై వరదై , మళ్ళీ హిమమై , మళ్ళీ ......asam srinivasa avaahayami....

  ReplyDelete
 2. ముందు "ఆత్మ" అంటే ఏమిటో సరియైన సమాధానం చెప్పండి.

  ReplyDelete
 3. సీసాలో నీళ్ళు వున్నంత వరకే సీసాకి విలువ..నీళ్ళు తాగేసాక..ఖాళీ సీసాను విసిరి పారేస్తాం...నీళ్ళు వున్నాయో లేవో సీసాకి తెలీదు.. మామూలుగా చూస్తే నిండు సీసాలో నీళ్ళు వున్నాయో లేవో మనకీ కనిపించదు..అంతమాత్రం చేత నీళ్ళు లేవని అనుకోవడం మూర్ఖత్వం కాక మరేవిటి?? సీసా ఎవరో నీళ్ళు ఎవరో తెలిసింది అనుకుంటాను..

  ReplyDelete
 4. జిలేబీ కి లింగబేధం లేనట్లే ఆత్మకి కూడా లింగబేధం లేదు..

  ReplyDelete