Saturday, August 26, 2017

సోయగముల నోలలాడు సొగసరి వలదే !





ఓయమ్మా! ప్రాసలకై
న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
వేయించడము జిలేబీ !
సోయగముల నోలలాడు సొగసరి వలదే !

జిలేబి

207 comments:



  1. రేపుల బాబా నకటా
    లోపల వేయన్ జిలేబి లుచ్చా గాళ్లై
    ఆ పరమ భక్తులంతా
    తాపము తో భీకర సయితానులయిరి, ఛీ !

    జిలేబి

    ReplyDelete

  2. మానసంబున సంకల్ప మై వెలయగ
    మహిని దుష్టశిక్షణజేయ మసగు నరుల
    పార్థసారథి పరిమార్చెఁ ,బాండవులను
    గాచె నన్నది శిష్టముగద జిలేబి !

    జిలేబి

    ReplyDelete


  3. మంచిగ యిలనుండకు, నిను
    ముంచెద రౌ యన్యగామి ములుగుల పలుకుల్
    కొంచెం బై నను వినవోయ్
    కొంచదనము వలదు తాట కొదలున్ గనుమా !

    జిలేబి.

    ReplyDelete


  4. పరమ మహా మేధావీ !
    సరి కాదోయీ జవాబు చక్కని చుక్కా !
    కడవన్నెల నాణ్యంబుల
    నెరుగుదువా ?పుట్టినావ యెన్క? జిలేబీ !

    బస్తీ మే సవాల్ :)

    జిలేబి

    ReplyDelete


  5. శ్యామలుడా వెంకయ్యను
    తోమెను గద కూనలమ్మ తొక్కుచు సుమ్మీ !
    జాముమనిషి గాదె జిలే
    బీ ముప్పవరపు మనోడు, పెలుచ మరేలా ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మొదటి మూడు నాలుగు ముక్కలు తప్ప మరొక్క ముక్క కూడా అర్థం కాలేదండీ జిలేబీ గారూ! అయ్యో నాతెలుగూ నేనూ!

      Delete

    2. శ్యామలీయం వారు

      ఇప్పుడర్థమవుతోందా జనాలు మీ పద్యాలను చదివి ఎట్లా తలగోక్కుంటారో నని :) జెకె :)

      నెనర్లు మీ కామింట్లకి

      ఏ పదమర్థం కాక పోయినా ఆంధభారతి చూడుడు.

      ఇట్లు
      పదపేర్పేశ్వరి
      జిలేబి

      Delete

    3. ఇటుకల్ని పేర్చేవాళ్ళకో పేరుందిట :) తెలియని కొత్త కొత్తకొత్త మాటల్ని పేర్చేవాళ్ళనేమంటారు జిలేబీ గారూ
      నెనర్లు.

      Delete
    4. శర్మ గారు,

      అంబాజీ పేట ఆముదం అంటారట :)

      పదపేర్పేశ్వరి అనుకుంటా !

      చీర్స్
      జిలేబి

      Delete
    5. జిలేబీ తీర్థ స్వామినీ మాతా,
      తమకు ఈ బిరుదులను కూడా పరిగణించగలరు
      మాటిక పేర్పేశ్వరి, మాటికేశ్వరి, పదదంచేశ్వరి, పతికమకేశ్వరి. దపదపేశ్వరి....

      తమ ప్రియ శిష్యుడు
      స్వామి కిచకిచానంద,
      తమ మర్కటాశ్రమ అధికారిక ప్రతినిధి.

      Delete

    6. ప్రియ శిష్యా !

      శ్రీ నివాస పరమాణు వా !

      ఆహా కడుపు నిండింది ! బిరుదుల తో !

      "ఫట్" గమ కేశ్వరి :)

      నెనర్లు మీ అభి మానానికి (దురభిమానము రాం రహీము గాకుండు గాక ! ఆమెన్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    7. తప్పు తప్పు మాతా, అప్పు తచ్చు.
      అది ’ఫన్‘ నారదేశ్వరి, లేదా ‘ఫన్’ దురదేశ్వరి యని యుండవలె కదా?

      ఇట్టు
      మెసెంజర్ ఆప్ జిలేబీ (MSG) Part 1
      శ్రీ లేని వాసుడు

      Delete
    8. వరదాయె బిరుదు పర్వము
      కరమరు దిది శ్రీనివాస ! గణుతింపంగన్
      తిరు నామపు సన్మానము
      లిరవుగ జేయంగ ఘనము , ప్రియ శిష్యలకున్ .

      Delete
    9. నెనర్లు రాజారావు గారూ,

      నా ప్రతిభను మా గురుమారాణి నుతించక, వ్యంగ్యానబోధను చేయక నా గురుకులవాసాన్ని పొడిగిస్తూ పోతున్నప్పటికీ మీరు గుర్తించి పద్యోగతాపత్రాన్నిచ్చినందుకు.

      ఇట్లు
      మెసెంజర్ ఆప్ గిలేబీ (MSG)

      Delete


    10. ఫన్నారదేశ్వరీ ! మా
      విన్నా ణంబై వెలుంగు "విట్" నేశ్వరి ! మా
      యన్నల దంచేశ్వరి ! ఓ
      కన్నాంబా! కంద పద్య గమక జిలేబీ !

      జిలేబి
      ఈ పద్య "పాదుక" ప్రియ శిష్యునికి అంకితం :)

      Delete
    11. ఆహా, గురుమారాణి పద్య పాదుక నా ఈ వ్యాఖ్య నెత్తిన వున్నది, ధన్యుండ! కానీ, మాతా, సింగిల్ పాదుక దేనికి పనికివచ్చును? దయయుంచి డబుల్ ధమాకా పాదుకలను ఒసగుడు. వాటిని కాలకౌశికునకు విక్రయించి నా శ్రీ లేమి తనమును తీర్చుకొనద.

      తమ
      మెసెంజర్ ఆఫ్ గిలేబి
      పాదుకా పట్టాభిషేక నిర్మాత.

      Delete

    12. ప్రియ శిష్యా !

      ఎవరినైనను కొట్ట వలయు నన్న ఏకపాదుకాస్త్రమే
      సబబైన అస్త్రమ్ము :)

      అయినను మీరు కోరినారు గనుక మరియొక
      శిష్య పాదుకాకందము :)

      సిరిలేని వాడ!శిష్యుడ!
      మురిసితి సుమ నీదు భక్తి ముదమును జూడన్ !
      కురిపించితిమి పదమ్ముల
      మరమరలను మర్కటమ్ము మనసా గోరన్ !


      ఫన్ ధామేశ్వరి
      జిలేబి


      Delete
    13. మర్కటాశ్రమ అధిపత్రి, వానరీ తీర్థ స్వామిని వారు తాము సాహిత్య మొర్మోరాల భోషాణాన్ని కొల్లగొట్టి, చోరించుకొచ్చిన పదాల గాదెనుండి ఓ రెండు దురదకందాస్త్రములను విసిరిరి. ఇప్పటికిదియే దక్కుదల. ఇక కాలకౌశికుని వెదక బోయెద. తమ దారిన తాము బోయెడు ఫన్నారదీశ్వరిని కెలికి తలంటించుకొనుట యనగా నిదియే.

      మెసెంజర్ ఆఫ్ గిలేబీ (AKA) జిలయే బి.
      తమ ఆధిపత్యంలోని వానర నగర్ పౌరశేఖరుడు.

      Delete


  6. ఇలలో ముదముగ పదుగురు
    బిలువన మరిమరి జిలేబి బిగువులు గూడన్
    పలుమార్ల యత్న ముగ పలు
    కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్ !

    జిలేబి

    ReplyDelete


  7. పోలికలగుపించె జిలే
    బీ! లింకుల్గాన్పడెను సుభిక్షము గానన్
    జాలమున వైవి యారుకు
    లీలగ మీకున్ సుమా పలికిరట యొజ్జల్ !

    జిలేబి

    ReplyDelete


  8. ఏకాంతముగ జిలేబీ
    ఓ కూసింత సమయంబు ఓంహరి యనవోయ్
    నీకాలము బాగుపడును
    పోగాలంబు దరి జేర బోదు నిను సుమా !

    జిలేబి

    ReplyDelete


  9. వ్యాపారములో ఓ ర
    య్యా పర మార్థపు విషయము యాధ్యాత్మికతల్
    సోపానంబగుచుండును
    ఆ పరమానందుడే బడా వ్యాపారీ !

    జిలేబి

    ReplyDelete


  10. అమ్మాయి మదిజల్లనగన్
    చుమ్మా కోరగ పెనిమిటి కొంగెట్టుకున
    న్నమ్మీ !తారాడుచహో
    కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘులుఘలు మనియెన్ !

    జిలేబి

    ReplyDelete


  11. రాముండయ్యెగ రావుల్
    మామాష్టారుల కలమున మంచిపదములన్
    ఓ మాలినీ జిలేబీ !
    ఓ మారు సలాము జెప్ప ఓయీ డుండుం !

    జిలేబి

    ReplyDelete


  12. విచ్చల విడిగా రెచ్చితి
    పిచ్చి రమణి పదములెల్ల పిచ్చగ చదివీ
    చచ్చెను నాతెలుగిచ్చట
    వచ్చితినిట కూనలమ్మ బరబర బరుకన్ :)

    జిలేబి

    ReplyDelete
  13. "సుశ్రీ" బ్లాగ్ లో "అబద్ధం నచ్చింది" అని ఓ చక్కటి కథని బ్లాగోనర్ సుంకర శ్రీనివాసరావు గారు 25న టపాగా పెట్టారు. ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కథ. ఏం లాభం, బాగుంది అని వ్యాఖ్య పెడదామన్నా కూడా మా టీం మెంబర్స్ కి మాత్రమే అనుమతి అని సుశ్రీ గారి హెచ్చరిక అడ్డుపడుతుంటుంది 🙂. ఆ టపా చదివుండకపోతే ఇప్పుడు చదవండి జిలేబి గారు.

    ReplyDelete


  14. విసురుల జీవన రేఖలు
    హసనపు కలయిక లతో వహంతము గానన్
    కొసమెరుపు కథల సుశ్రీ
    పసగల్గిన రాతల మురిపాల జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  15. కష్టే ఫలీ! జిలేబీ !
    స్ప్రష్టంగా విజయమునకు సంవరణమదే!
    ఇష్టంగా పని జేయ న
    భీష్టము లెల్ల నెరవేరు బిగువుల తోడన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. *స్పష్టంగా :)

      సవరించినవారు స్ప్రష్టంగా మొదటి పాదము లోని
      వారు :)

      వారికే ఈ కందం అంకితం !
      జిలేబి

      Delete
  16. జిలేబిగారూ, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీద నమ్మకంతో అడిగేస్తున్నా ...
    పద్యం చతుష్పాదం కదా?(🙈 🙉 🙊)ఏకపాదుకాస్త్రమెటులయ్యెను?

    ReplyDelete
    Replies

    1. అంత రంగం వారు

      మూడు పాదాలు (నామాలు :)) ఆ పరంధామునివి - వామనుడివి :)

      ఒకటే మనది :) అందుకే ఏక్ నిరంజన్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. వికట కందాస్త్రముతో చతుష్పాదములను ఏకముచేయి ఒంటిబూటు వీరేంద్రపాటిల్ సోదరీమణి దపదపేశ్వరిగారినా తమరు సందేహించునది? (షాడో నవలలు చదివిన వారికి ఒంటిబూటు వీరేంద్రపాటిల్ అంటే ఎవరో తెలుస్తుంది)

      Delete
  17. కనిపించే మూడు పాదాలే ‘చెడు అనము, చెడు వినము, చెడు కనము.....’ 🙈 🙉 🙊 అయితే

    కనిపించని నాలుగోపాదమే ‘చెడు తినము’ 🤐

    జిలేబీనే భుజింతుము.

    👻 👻 👻 👻 👻 👻 👻 👻 👻 👻



    ReplyDelete
  18. ఇంకా కిష్కింధా పురి
    కంకిత మైనట్లె దోచు ఘన బుధు లారా !
    పంకిలమున దొర్లి బురద
    అంకమ్మున కంటె ననుచు నరువగ నేలా ?

    ReplyDelete
  19. బురద గురించి చింత మాకు లేదు. ఏలయన, పరిణామక్రమమున మానవుడు జనించినది పంకిలమున నున్న జీవులనుండియే అనగా ’మత్స్యముల‘ నుండియే అను విషయము మేమెప్పుడూ మరువము. ఇది హాస్య సన్నివేశమేగాని వగచు అనుభవమని మేమెన్నడూ భావింపము. అయిననూ, పంకిలమునుండియే కదా పంకజము జనించునది? ఒక భ్రాంతిమయ ప్రపంచమున జీవించుచూ మనకు మనం గౌరవాన్ని ఆపాదించుకుని, అనుక్షణమూ ఎదుటివారి గుర్తింపుకొరకు అఱ్ఱులు చాచుటయే నేటి విషాదము.

    ReplyDelete
  20. వివరణకు ధన్యవాదములు .
    ఐననూ ,
    అట కిష్కింథా పురిలో
    పటుతరముగ ' రాము 'జేరి భాషాంబుధులై
    చటుల వచో రావమ్ముల
    నిటు నటు దుముకాడిన తరి మిము గన మనఘా !

    ReplyDelete


  21. డ, ర కున్ ప్రాస కుదరదా !
    మురిసితి కొత్త పదమొకటి ముద్దుగ గానన్
    వరమయ్యెనని జిలేబి రె
    పరెపయని హృదయము తూగె పద్యపు రమణీ :)

    బిలేజి

    ReplyDelete
    Replies
    1. యతులను ప్రాసల గణముల
      ప్రతి నిమిషము వల్లెవేయ వలదుర రాజా!
      అతి మధురమైన పద్యము
      మితిమీరును బంధనముల మృతసూత్రములన్

      Delete


  22. వేదన లో బా ధలలో
    శోధన లోయీ శుని మన సునగన నిమిషం
    బౌ దిక్కులు తెలియక యు
    న్నా, దారిన్ గానలేక నాధుని గొల్వన్ !

    జిలేబి

    ReplyDelete


  23. ధరణిజను చెరగొనంగన్
    పడిహారుల యెన్కటి దిన బాళిని దీర్చన్
    నరుడై విష్ణువు గాన్పడ
    వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్!

    జిలేబి

    ReplyDelete


  24. పత్తేదారుండారే
    ళ్ళత్తరి యిత్తరి జిలేబి లాంగిట్యూడ్లన్
    సత్తుగ గానన్ యత్నము
    లొత్తగ నరసన్న ! మధ్య ఒళపులు తెలిసెన్ !

    జిలేబి

    ReplyDelete

  25. అడుగుల జాడల పత్తా
    విడువక సిరి లేని వాసు విహరించుట జూ
    డ, డుబా కోరుమనుజుడో ?
    తడవల జరజాగురూకత వలయు నమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
  26. గురుమారాణీ,
    ఈ పద్యపాదము నా మట్టిబుఱ్ఱకు అర్థం కాలేదు, నామీద కరుణతో వివరించగలరు.
    ‘‘డుబా కోరుమనుజుడో ?
    తడవల జరజాగురూకత వలయు నమ్మీ :)‘‘

    తమ ప్రియ శిష్యుడు
    మెసెంజర్ ఆప్ గిలేబీ... ఎక్స్‌టెండెడ్...

    ReplyDelete
    Replies

    1. నాట్ శిష్యా

      సోమవారం కోర్టు వారించు వర్డిక్టులో హర్యానా లో తేలును

      జిలేబి

      Delete


  27. ఏమీ పేలదు రమణీ !
    మామీ, సమజోదులనఘ ! మాటల గనుమోయ్ !
    సామంజస్యము గల వా
    రీ మనుజులిరువురు సూవె రీఢము లేదోయ్ !

    జిలేబి

    ReplyDelete

  28. ఈ జిలేబి కంద ట్వీటుల కన్న కోయంబేడు మార్కెట్టే బెటరు :)

    ఓయీ ! అఖండ సాధకి !
    మీ యాలాపముల కైపు మించారెను బో !
    ఓ! యామినీ జిలేబీ !
    కోయంబేడ్మార్కెటే, యకో, మేల్మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  29. గీసేవు యగ్గి పుల్ల
    న్నోసీ రమణీ జిలేబి నొక్కెదరు సుమా !
    మాసము భూతములదిగద,
    రోసములు భువిని యనేక రూపంబులగన్ !

    జిలేబి

    ReplyDelete


  30. నీ యంగభంగిమలు రమ
    ణీయంబగు పూర్ణ రూప ణిసిధాత్వర్థం
    బాయెను గదా జిలేబీ,
    మీ యయ్యరుగారు మురిసి మిడిసిపడ భళీ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ ...టాకీస్‌లో "అర్జున్‌రెడ్డి"సినిమా చూసి రాసినట్టుందండి 😊

      Delete

    2. వైవియారు గారికి

      మేము కొట్టాయి లోనే సిన్మా చూస్తామండి ; టాకీసు గట్రా తెలీవు మాకు :)

      పై కందం కు రెడ్డి గారికి లింకు ఏమిటి ? వివరించుడు !


      ఇట్లు
      కోయెంబేడు మార్కెట్ :)

      Delete
    3. ణిసిధాత్వర్ధానికి (ఈ మాటొకటుందని ఇవాళే తెలిసింది), "అర్జున్‌రెడ్డి"కి చాలా దగ్గర సంబంధం ఉందండి.ఈ మధ్య దీనిపై రామాంజనేయ(ఐ మీన్,రాము-హనుమ) "యుద్ధం",కూడా జరిగింది కదా?

      Delete

    4. వైవియారు గారికి

      అర్జున్ రెడ్డి ఎవరు ?
      రామ హనుమ యుద్ధమేమిటి ?
      అంతా "గండర" గోళంగా అయోమయము గా ఉన్నది

      సవివరణ కావలె

      జిలేబి

      Delete
    5. YVR గారు, మధ్యలో వస్తున్నాను ఏమనుకోకండి. "రామాంజనేయ "యుద్ధం" " 😀😀 - బ్రహ్మాండంగా చెప్పారు 👌. కాకపోతే ఈ "రాము"డికి సమరోత్సాహం కించిత్తు ఎక్కువే అనిపిస్తుంది కదా.
      --------
      మా స్కూల్ చదువు రోజులలో కొంతమంది టీచర్ల మీద జోకులుండేవి - ఆ టీచర్ తో కష్టంరా బాబూ, పిల్లి అంటే ఏమిటి మాస్టారూ అని అడిగితే, పిల్లి అంటే మార్జాలంరా అని చెబుతారని 🙂. అలాగే సింపుల్ గా "ముద్దు " అనేదానికి అదేదో నోరు తిరగని పదం వాడినవారు మనకి భాషాజ్ణానం పెరగడానికి దోహదం చేస్తున్నట్లు 🙂.
      అయిననూ : మనకేల చింత,
      ఆంధ్రభారతి యుండ మన చెంత 👍

      Delete
    6. _/\_ త్రిలోకసంచారులకు తెలియని విషయమా🤔? ఐనా, అడిగారు కనక - "అర్జున్ రెడ్డి" = విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ రిలీజ్ ;; రాము-హనుమ యుద్ధం = కాంగ్రెస్ ‌పార్టీ వారి హనుమన్న(VH) ఈ సినిమా పోస్టర్స్ చించివేయడంతో, నాస్తిక రాము(డు)అంటే RGV ట్వీట్-బాణములతో యుద్ధము చేసెను.

      Delete
    7. అన్నట్టు చెప్పడం మరిచాను, ఆ హనుమన్న కోపానికి ఆ సినిమాలో చూపిన ణిసిధాత్వర్ధాలే కారణం (ట)

      Delete
    8. వీన్నార్ సర్, నేను విన్న మరో వెర్షన్ ఇది > మార్జాలము అనగా బిడాలము

      Delete
    9. ఆ "అ.రె" సినిమా మీద ఓ రివ్యూ "అంతర్లోచన" బ్లాగ్ లో "...... అటాప్సీ ..... " అనే టపాలో చదవచ్చు.

      Delete


    10. పచ్చిగను మంచి ఫీల్తో
      బుచ్చమ్మా బోల్డుగాను భుగభుగ సినిమా
      పిచ్చల వాస్తవ ధైర్యము
      నచ్చితి వోయ్ రెడ్డి ! యర్జునా ! భళి భళిరా :)

      జిలేబి

      Delete


  31. అజనాయను మీటి అఠా
    ణ జావళుల నాలపించి నాదంబగుచున్
    రజతగిరీశుని గానన్
    భజియించు నమశ్శివాయ పదిలము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  32. శోక‌మ్మదేల రమణీ !
    మా కందపదమ్ముల సుమ మాలల లేమా,
    యేకథ లైన సుమా దిగ
    జోకపడున్, బా, పనసల జుర్రుకొను భళీ !

    దత్తపది - కమ్మ మాల మాదిగ బాపన అన్యార్థంలో

    జిలేబి

    ReplyDelete


  33. అర్జునుడు నాల్గు సోదరులనఘ! కట్టి
    రి గద మంగళ సూత్రము, రిత్త గాదు,
    ద్రౌపది మెడలోఁ! గృష్ణుఁడు తాళిఁ గట్టె
    జాంబవతికి, జిలేబియ, చట్ట గాదు !

    జిలేబి

    ReplyDelete


  34. బాబా రామురహీంసింగ్!
    మా బాగౌ బ్లాగు జోస్యమయ్యలది జిలే
    బీ! పే పరుకథ లను మా
    బాబే! జోడించినావు భగముల కథలన్ !

    జిలేబి

    ReplyDelete


  35. భవబంధములను జూచుచు
    భువనంబందు నెలతుకకు భూమాతవలెన్
    కవనంబుల రింగులమర
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

    జిలేబి

    ReplyDelete


  36. కందము చంపకమాలయు
    యందంబగు తేటగీతి యాటవెలది నీ
    డెందంబౌ శార్దూలము
    ఛందంబెల్లయు జిలేబి, సరసంబేనో ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తెచ్చి నిఘంటు పదావళి
      గుచ్చినచో పద్యావళి
      మెచ్చదుగా సుజనావళి
      ఓ కూనలమ్మా

      Delete


    2. ఘాటుగానే పడింది మరో ఢోసు కూనలమ్మ :)

      జిలేబి

      Delete


  37. ఒక కూనలమ్మ కొత్తగ
    కుకు కూ యనుచున్ జిలేబి కులుకుచు నదిగో
    బిగువులలర పదనిసల స
    రిగమల జేర్చుచు కమింటు రింగులమర్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  38. ఆహా! బ్లాగ్జ్యోతిష్యుల
    మాహాత్మ్యపుకథ లలోన మరిసొంత కథా
    నూ!హత విధీ! జిలేబీ !
    ఓహో యని యాముకమ్ము సోసో యాయెన్ :)

    జిలేబి

    ReplyDelete
  39. అవునండీ జిలేబీ గారూ, మళ్ళీ మొదటికి వస్తున్నాను. "సోయగముల నోలలాడు సొగసరి " అన్న ప్రయోగం ఎంతమాత్రమూ సరైనది కాదండి. "సోయగముల నోలలాడించు సొగసరి" అన్నది సబబు కాని ఏ సొగసరైనా తన సోయగాల్లో తాను ఓలలాడుతూ‌ ఉంటుందా. ఏదో‌ పదాలు పేర్చటం‌ కాదండీ కాస్త సారస్యం కూడా చూసుకోవాలండీ!

    ReplyDelete
    Replies

    1. రండి‌ ! రండి !

      నిజంగానే జిలేబి సోయగముల నోలలాడించే సొగసరి ఐతే మీరన్నట్లు అలా రాయొచ్చు , మరీ జిలేబి యేమో పదపేర్పేశ్వరి తన పద్య
      ముల తానే యగముల లాడు సొగసరి ; అందుకే వలదు వలదే మొర్రో అంటున్నారు అక్కడ

      ఏమంటారు ? :)

      జిలేబి
      గురువులకు గూటము వలదు
      సరిగమ పదనిస జిలేబి సరిసరి వలదోయ్ :)

      Delete
    2. ఏమిటో మీ పద్యా లెలాగూ అర్థంకావు మీ వచనమూ ఒక్కముక్కా అర్థం కావటంలేదండీ.

      Delete

    3. హమ్మయ్య‌ ఇప్పటికి అర్థమయ్యిందా మీ కామింట్ల చదివి జనాలు ఎలా బుర్ర గోక్కుంటారో నని :)

      జిలేబి

      Delete
    4. అదేం ముక్క. నేనేమీ ఆంధ్రభారతి నిఘంటువు నుండి పదాలు ఏరుకొచ్చి (అడ్డదిడ్దంగా పేర్చి) మరీ వ్రాయనే వ్రాయను కదా!

      Delete


    5. ఆంధ్రభారతి నుండి కొట్టుకొస్తేనే అర్థం కాకుండా పోతూంటే, కొట్టుకు రాని పదాల తో మీరు ఆడేసుకుంటా ఉంటే ముక్కాలా ముకాబలా కాదండీ :) భలేవారండి మీరు :)

      జిలేబి

      Delete


  40. రారండీ ! దయ చేయం
    డీ! రంగీ కూనలమ్మ డిగనురుకన్ ర
    మ్మా! రంగమ్మున సావే
    రీ రంగుల రాట్న మందు రింఝిం రింఝిం :)

    జిలేబి
    కామెంట్ కాలే సంప్రాప్తే
    కాకః కాకః పికః పికః !
    నారదా !

    ReplyDelete


  41. బలమెవ్వరు మా యమ్మా,
    విలవిల లాడెడు మనసుకు విభువెవ్వండో!
    కలయై గాంచితి నమ్మా
    యిలలో నిలకడ నెరయన యీకువ గనుమా !

    జిలేబి

    ReplyDelete
  42. జిలేబిగారు,సోయగముల నోలలాడు సొగసరి = (తెలుగు)సోయగముల నోలలాడు So!గడుసరి 😊
    (విశేషార్ధం)

    ReplyDelete
    Replies

    1. ఇచ్చట మరో జిలేబి తయార్ :)

      అదురహో వైవీయారు గారు

      అర్జున్ రెడ్డి కో కందం సమర్పించునున్నా మీ పేరు చెప్పి కేటీయార్ "సహృదయత" న :)

      చీర్స్
      జిలేబి

      Delete

    2. *సమర్పించుకున్నా

      Delete


  43. కైజార నీయకు ధృతిని,
    రాజా,ఉత్తర కుమార, రథము నడుపుమా !
    జాజర లాడుచు చివ్వన
    గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్!

    జిలేబి

    ReplyDelete


  44. పచ్చిగను మంచి ఫీల్తో
    బుచ్చమ్మా బోల్డుగాను భుగభుగ సినిమా
    పిచ్చల వాస్తవ ధైర్యము
    నచ్చితి వోయ్ రెడ్డి ! యర్జునా ! భళి భళిరా :)

    జిలేబి

    ReplyDelete


  45. ప్రాసా వేదన లన్ "సా"
    స్త్రీ సాధించితిరి గాద తీరుగ మీరున్
    హా! సరిపోయె సమానత
    ఓ సారూ మీకు, మాకు ఒద్దిగ గానౌ :)

    జిలేబి

    ReplyDelete


  46. జత పథకమ్ముల పద్మా
    ర్పితమ్మ సోయగపు సొగసరివలె జిలేబీ
    యుతమై బావను గాంచన్
    సతతంప్రియమై సొబగుల సారంబాయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  47. డేరా బాబా జగనుడు
    నారా చంద్రన్న వారి నగుమోముగనన్
    హోరా హోరుల పోరులు
    యేరాలంబుగ జిలేబి యెతమతమగునో ?

    జిలేబి

    ReplyDelete


  48. బురిడీలు జన్మ హక్కోయ్!
    గురువులము! జిలేబులైన గుత్తపు దాసీ
    పరివారము, వలయును మా
    కు రంజుగ రమణులు, రంతు, కులుకుచు బతుకన్ !

    జిలేబి

    ReplyDelete


  49. పిచ్చో డా! మా ట్లాడ
    న్నచ్చొచ్చనివాడ! యాచనకుడా! యనుచున్
    గుచ్చన్ పెట్రేగుచు "వా
    చచ్చిన" వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్!

    జిలేబి

    ReplyDelete


  50. వింతైన జీవితంబిది!
    చింతన జేయ చితికేగు చితికెడి బతుకున్
    శాంతము గానన్ నిర్వృతి
    కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్!

    జిలేబి

    ReplyDelete


  51. విషయంబేదైన సుమా,
    కషాయ మైనన్ జిలేబి కాజూయైనన్
    మిషగనుచు పద్య కందము
    మిషినువలె తిరుగుచు కుట్టుమిషను నడుపునౌ !

    జిలేబి

    ReplyDelete


  52. తెలుగెప్పుడు రెం డో భా
    ష! లెస్స యనియన్న నేమి క్షవరం బాయెన్
    పలుకక బోవగ జనులున్
    కులుకుచు యాంగ్లంబు జేర్చి కురుచన జేయన్ !

    జిలేబి

    ReplyDelete


  53. పరువుల్ బోవు జిలేబీ
    దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్,
    వరమివ్వ లచ్చు మమ్మ, స
    వరమ్ము లకొలది, శుభాంగి వందన మిడుమా !

    జిలేబి

    ReplyDelete


  54. తెచ్చె నిఘంటువు పదముల
    గుచ్చుచు పద్యము ల మేలు గుచ్ఛము లను జో
    బుచ్చగ గురువుల లఘువుల
    వచ్చెను కందము జిలేబి వరుసల గనవే :)

    జిలేబి

    ReplyDelete


  55. తెలుగో యమ్మ తెలుగు! మా
    ములుగుల గనుమా జిలేబి ములుగే ములుగౌ !
    గిలిగింతలార్చు చు మనకు
    వలకువు జూపెట్టు చుండె వలమురితాల్పౌ !

    జిలేబి

    ReplyDelete

  56. మా యిస్కూలున బాషా
    చాయగ బోయెను జిలేబి చానా దూరం !
    ఆయింద పరేషాన్ వల
    దోయి,పలారముల చేసి దొబ్బేయండీ !



    జిలేబి

    ReplyDelete


  57. కరములు మోడ్చి జిలేబీ
    నిరతము సేవించెడు మన నిఖిల జగన్మా
    త, రజత గిరీశుని సతికి
    సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా !

    జిలేబి

    ReplyDelete


  58. బ్లాగ్జ్యోతిష్యుల వారు డేరా బాబాకు రావణునికి దగ్గర పోలికల చూపారు ; మీడియా లో వస్తున్న డేరా కతల్ని చూస్తా వుంటే మన కాలపు రావణుడే !

    తన యడ్డాలోని మనుజు
    లను మా బాగా జిలేబులవలెన్ గాచె
    న్నను వార్తల చదువగ బాం
    చను కాల్మొక్త యనువారి చక్కని రావణ్ !

    జిలేబి

    ReplyDelete


  59. జానా బెత్తెడు గురువుల
    నానాటికి తెలియు వంచనల జూడగనౌ
    యేనాటికైన మేలౌ ,
    మానవులారా! భజనలు మానుట శుభమౌ

    జిలేబి

    ReplyDelete

  60. వరముగ నిలిచె భువిలోన వనము లన్ని
    నీవు నిలువ, కర్తవ్యము నీరజాక్షి
    తరువులన్ రక్ష సేయుట,తగని చర్య
    వాటిని పడగొట్టుట లేమ, వలదు వలదు!

    జిలేబి

    ReplyDelete


  61. జాంగ్రీ జిలేబు లొకరై
    భాంగ్రా డాన్సుల తకధిమి బ్లాగ్లోకమునన్ !
    యాంగ్రీ ఓల్డీస్ చూడన్
    షాంగ్రీ లావలె, షకీర షాకుల్ ఫట్ ఫట్ :)

    జిలేబి

    ReplyDelete


  62. రారండోయ్ రారండీ !

    కవిసమ్మేళనమందున
    నవనవలాడు కవుల కవనమ్ముల జతగన్
    రవణంబగు చర్చలనన్
    మవురిగ గుంటూరునన్ జమాయించెదమోయ్!

    గుంటూరు
    జిలేబి

    ReplyDelete


  63. అప్పనపు కీర్తి వచ్చెను
    కుప్పించగ పద్య మెల్ల కుకుకూ యనుచు
    న్నబ్బోయనగ జనులటన్
    సుబ్బాయమ్మ సొబగులకు చుక్కెదురేదీ :)

    జిలేబి

    ReplyDelete


  64. నీ దారిన నీవు జిలే
    బీ దండిగ పద్యములను భీకరముగనన్
    రాదారిన బోవు జనుల
    భేతాళమువలెను పట్టి పీడించు సుమా!

    జిలేబి

    ReplyDelete


  65. హా! జాంగ్రి ! జిలేబీ ! చీర్స్ !
    కాజూ బర్ఫీలు! బూంది! కాదన మాకోయ్ !
    చేజారనీకు పాకము
    ఓ జనులారా! పసందు నోరూరగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  66. నడిరేయి భూతములిటన్
    పడిగాపులు గాచె సూవె పద్య సమస్యల్
    వడివడి గా పూర్తిగనన్
    బడి, శంకరునిది మరియు నెపంబున్నతడే !

    జిలేబి

    ReplyDelete

  67. అరదండలు వేయండ
    య్యరుగారు జిలేబి పజ్జ యాగీ లడచన్ !
    పరుగుల పిచ్చిగ పంచద
    శ రాక్షసి యిట తలలెల్ల శకలము జేసెన్ !

    జిలేబి

    ReplyDelete


  68. నిష్ణాతులైన శాస్త్రిన్
    జిష్ణువు గా తీర్చిదిద్ద చిత్రిక బట్టెన్
    తృష్ణల దీర్చు గురువులన
    ధిష్ణులు మరియున్ సహిష్ణు ధీశక్తిమతుల్ !

    జిలేబి

    ReplyDelete


  69. కృష్ణా ! శ్యామా ! యనగన్
    విష్ణువె! హాలాహలమను విషమును గ్రోలెన్
    జిష్ణువునకు బావమరిది
    తృష్ణాలువువలె జిలేబి తృప్తిగ తానౌ!

    జిలేబి

    ReplyDelete


  70. ఒట్టి యజిరమ్ము గామోయ్
    చట్టని మెరయు మనుకంద చక్కగ నిచ్చెన్
    మట్టి గణపతయ్యనిటన్
    గట్టి ప్రతిన బూని బెట్టగతగు జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  71. చంపా ! విడువుము విడువుము
    సంపాదన లేని మగని , సాధ్వి నుతించెన్
    నింపాదిగ గాచు మగడు
    గంపెడు చీరలన దేల్చు గండడు వలయున్ !

    జిలేబి

    ReplyDelete


  72. ఆశ్రయము లేదు! మీదు స
    మాశ్రయ మసలే శుభాంగి మాకు తెలియద
    మ్మా! శ్రీ మతీ ! జిలేబీ
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా ?

    జిలేబి

    ReplyDelete


  73. శ్రీ కూనలమ్మ కలమున్
    తాగైకొని కవనవీర తారా పథమున్
    జోగితిరుగుల జిలేబీ
    మా గాయల వేయుచు కసమస వచ్చె గదా !

    జిలేబి

    ReplyDelete


  74. ఓ పాఠకులారా! మీ
    రాపాడు కమింట్లను ప్రచురణ జేయను సు
    మ్మీ! పలుచ యనానిమసుల
    నే పట్టించుకొననోయి! నెట్టును గడితిన్

    జిలేబి

    ReplyDelete


  75. వ్యక్తిత్వమాదిగ సుమా
    శక్తిగ సిద్ధాంతములు మసకలన్వీడున్
    యుక్తంబైయది గాన్పడ
    పక్తంబై వృధ్ధి గాంచు పథమెల్లెడలన్ !

    జిలేబి

    ReplyDelete


  76. ఏలింగంబో ! గురువా
    మాలా మణిమయ జిలేబి మాచన వర్యా !
    మాలిని యో! మగ రాయుం
    డో! లవలేశంబు మాకు రువ్వడి తెలుపన్ !

    జిలేబి

    ReplyDelete


  77. ఉత్తర శివాయి మాదోయ్!
    మొత్తెద బెత్తమును బట్టి ముదముద యనుచు
    న్నత్తా కుకుకూ యనినన్
    చిత్తమని వినుము జిలేబి చిత్రిక పలుకుల్ :)

    జిలేబి

    ReplyDelete


  78. కోజేరుల తాకకుమా !
    బేజారగుదవు జిలేబి బెంబే లెత్తన్
    భాజా యింతురు నిన్ను, క
    లేజా వలయును శుభాంగి లెంపలు వేస్కో :)

    జిలేబి

    ReplyDelete


  79. ఖండపు రాయి గనవలెను
    భండన వలదోయ్ జిలేబి భగభగ యనుచున్
    గుండెలు తీసెద రమ్మా
    చెండులు విసిరినది చాలు చెకచెక వలదే :)

    జిలేబి

    ReplyDelete


  80. నీ గమిడి తెలుసు కోవ
    మ్మా !గరికవలె యెగురుదువు మాలిని వినవే !
    పాగెము లేకన్నేదియు
    తా గవగవలాడ దోయి తరుణి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  81. జోతలు చంద్రుని ధృతికిన్
    రాతిరి, రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
    చేతము వందనము జిలే
    బీ తను వొప్పంగ సూవె బిరబిర దినమున్ !

    జిలేబి

    ReplyDelete

  82. గొప్పలకు గాను వైద్యం
    బప్పా వలయునని బోవ భారము గాన
    న్నప్పటి కప్పుడు, సుదతీ
    యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్ !

    జిలేబి

    ReplyDelete


  83. బోలెడు సూచన లిచ్చా
    మే! లక లకయను జిలేబి మేడము మేమూ
    చాలా వేరని యన్నా !
    యేలన్ మరి యన్యగామి యెకసెక్కంబౌ ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అమ్మా, మీతో పరాచికాలా? మరో చోట మీ బాణీలో ఉన్న కొన్ని వాక్యాలు మీరేమో అని భ్రమ పడ్డాను. అవతలి వారు నొచ్చుకున్నట్టు ఈవాళ చూసాను. వారు మీరు ఒకటి కాదని తెలిసింది కాబట్టి ఇక ఊహించి రచయితలని గుర్తించే పని మానేస్తాను. మీరు నాలాంటి వాడిని కొంత దయతో చూడాలి.

      Delete
    2. అన్యగామి గారికి,

      హన్నా! ఎంత మాట ! మా 'బాణీ' అనే స్టేజ్ కు వచ్చేసమన్న మాట !

      వావ్ ! మా బాణీ లో రాసే దానికి మనుజులు యత్నిస్తున్నా రని తెలిసి కడుంగడు ముదావహము గా ఉన్నది.


      నారదా!
      జిలేబి

      Delete

  84. అవ్వల చక్రంబున్ గొని
    కవ్వడి కై యత్తరి యుడుగణవీధి నహో
    జవ్వాడన్ శ్యామా! మగ
    చువ్వనె తా తలను తుంచుచు జయద్రథునిన్ !

    దత్తపది - అవ్వ అత్త తాత మామ

    జిలేబి

    ReplyDelete


  85. ఉడుగణ వీధిన్ గనుచున్
    గడగడ పదముల జిలేబి ఘంటము గానన్
    బడబడ లాడుచు పద్యము
    సడిజేయుచు కందముగ పసగనుచు వచ్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  86. విను ! పద్యమ్మును రాయక
    మనుజులటన్, కార్యములను మరచుచు తపియిం
    చి నిజ‌ముగ నేడ్తు రను కొని
    వనమాలి వలెన్ జిలేబి వగచన్నేలా !

    జిలేబి

    ReplyDelete


  87. అదిగో! పౌర్ణమికిక రెం
    డుదినమ్ముల్నార్తు కొరియనుడిక జిలేబీ
    పదరుచు బాంబుల తోడన్
    మొదలిడునో యుద్ధ కాలమున్నెపములతో !

    జిలేబి

    ReplyDelete


  88. పవరు సెంటరు కథలను పల్సు బట్టి
    బ్లాగ్గురువులట కొత్తగ పార దర్శ
    కతను జూపిరి శిష్యులు గట్టి గాన
    వెతలు మొదలౌ జిలేబియ వేగుఱిక్క !

    జిలేబి

    ReplyDelete


  89. తెగులోయమ్మ తెగులది ! మ
    న గురుడి తెగులే జిలేబి నస పల్కులహో !
    తెగులు కడు కమ్మగను తెగు
    లు గిరగిర తిరిగెను గాద లుకలుక యనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  90. సూర్యోదయమస్తమయము
    శౌర్యపు కైపుల జిలేబి సౌభాగ్యంబై
    యార్యుల తలపుల రమణీ
    పర్యావరణపు తలంపు‌ భగవతి గాదే !

    జిలేబి

    ReplyDelete


  91. పొరపాటాయెను మిత్రుడ !
    సరసము గాపలికియున్న చక్కద నంబౌ !
    గురువులకిది మామూలే
    బిరబిర చిర్రెత్తు జనులు బిత్తరు బోవన్ :)

    జిలేబి :)

    ReplyDelete


  92. పరమాత్ముని మత్తేభము
    వరదల బారిన బడి వడి వాడి జిలేబీ
    తిరమై యిల వరదాభయ
    కరి, మాలను చూడగానె కన్నులు మూసెన్ !

    జిలేబి

    ReplyDelete

  93. ఈ మధ్య ఎక్కడ చూసినా పద్యములాయె ! మాలిక పత్రిక లో వికటకవి :(

    http://maalika.org/magazine/2017/09/04/21-వ-శతాబ్దంలోవికటకవి-2/


    వికటకవి పద్యములలరె
    ను కిభశ్రీ కలములోన నూత్నము గానన్
    తకిటతధిమియనుచు జిలే
    బి కందమును గూర్చెను సెహభేషౌ యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  94. గుణములను తెలిపెనతడు గోము గాను
    రుక్కులను వల్లె వేయించె, రూఢి గాన
    పూనుకొని కళలను నేర్పె పూర్తి గాను
    జయము గురువులకు జిలేబి జయతి జయతి !

    జిలేబి

    ReplyDelete

  95. కొట్టు కొచ్చిన పదాలతో కందం

    భంగము జేయుచు ధర్మము
    రంగడిని మరిచి విధులను రంకాడుచు సా
    రంగికులై సంపదలన్
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !


    జిలేబి

    ReplyDelete


  96. పదముల నటునిటు మార్చుచు
    కుదురుగ బేర్చుచు జిలేబి గూర్చన్ మీరున్
    సదనపు మెప్పుల బడయగ
    కదన తురంగమగు పద్య కవనము బండీ !

    జిలేబి

    ReplyDelete


  97. ఇంగనమిదియె జిలేబీ !
    కొంగజపముజేయువారు, కోట్లకొలదిగ
    న్నంగందప్పి నడచుకొను
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !

    జిలేబి

    ReplyDelete


  98. అమ్మా ! పరాచి కాలా !
    బామ్మా ! మీతో కుదరదు పారుని విడువన్ !
    జమ్మనుచు బాణి మీ రా
    వమ్ము వలె గనపడెనోయి వసవస పిట్టా !

    జిలేబి

    ReplyDelete


  99. జీవితపు పజిలు విప్పగ
    ఓ వనితా సాధ్యమౌన ? మోకరిలదగు
    న్బోవె సుఖమయముగ బతుక
    నీవున్ మహిలో జిలేబి నిక్కంబిదియే !

    జిలేబి

    ReplyDelete


  100. చాలెంజుల విసురుచు మది
    లో లావణ్యము జిలేబు లొప్పారంగ
    న్నో లైలా! ‌తుళ్ళిపడకు
    మా లావుగ నొక్కెదరు సుమా యిలలోనన్ !

    జిలేబి

    ReplyDelete


  101. మతిపోగొట్టే తవిక క
    వితల జిలేబి శతముఖి తివియగన్నోరీ
    వెతల బడెదవన్నానిమ
    సు,తగ్గు నీవెవరని తెలుసును తగ్గు సుమా !

    జిలేబి

    ReplyDelete


  102. బిలువన్నిద్రా దేవి మ
    రలుకొన చట్టను సమయము రల్ పడె రలుకున్
    విలుకాడివలెన్ గమనిం
    చి లఘువు గన్మార్చిరి సురుచిరముగ శాస్త్రీ :)

    జిలేబి

    ReplyDelete

  103. మానావతిగన్ పద్యము
    లే నా ప్రాణంబనుచు జిలేబుల దొరలిం
    చే నాట్యసుందరీ! దొర
    సానీ! నీసాటి గలరె సాధ్వులలోనన్!

    జిలేబి

    ReplyDelete


  104. నిదురించే బ్లాగున కై
    త దుముకుచు జిలేబి వచ్చె తరమై గనుమా
    సదనము మానస వీణగ
    చెదురు ముదురు వర్షముల కచేరీ గనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  105. శతముఖిని బుచ్చు కొనవలె
    మతలబు గానన్ జిలేబి మనుజుల తీరుల్
    కుతకుతల నడచ మహిలో
    బతుకును సుఖమయముగా సబబుగా గడుపన్ !

    జిలేబి

    ReplyDelete


  106. మనసే భూతద్దంబోయ్!
    మనమాయా లోకమున సమస్తము నీ యూ
    హన జరుగుచున్నది జిలే
    బి! నమ్ముము గురువు పలుకుల బింగమ్ముగనన్ !



    జిలేబి

    ReplyDelete


  107. నచికేతుని కథను గురుడ
    ట చిన్నగాను మొదలెట్టె టకటకలాడిం
    చుచు రమణీయంబుగనన్
    వచనపు రేడౌ, కఫారి, వాసుర వాసీ :)

    జిలేబి

    ReplyDelete


  108. గోత్రస్ఖలనముల జిలే
    బీ త్రవ్వితివట గద జుజుబీ మనుజుల సు
    మ్మీ! త్రచ్చన హా! వెన్నడు
    చిత్రము గానన్ గనపడె చెకుముకి రాయీ :)

    జిలేబి

    ReplyDelete


  109. గూగులు వెదుకుము సరిగా!
    బాగుగ గాన్పడు పరంగి బాబుల కథల
    న్నా! గురి జూతురు వారౌ
    జీగురు మనవలదు నీవు చిక్కెద వయ్యా !

    జిలేబి

    ReplyDelete


  110. పరుషంబగు పలుకులు వల
    దు, రుసరుసలు వలదు మీదు దూకుడు వలదోయ్ !
    పురుషుడు, నాతియు వేరౌ
    గరళమ్మున్ ద్రావు నొక్కు కంఠంబున్నూ !

    జిలేబి

    ReplyDelete


  111. శాంతము లేకన్ సౌఖ్యము
    కొంతయు గలుగదు మనుజులు కుకుకూ యనుచు
    న్నెంతయు కూవగను ఫలం
    బెంతయు జేరదు సుకవి కుబేరా వినవోయ్ !

    జిలేబి

    ReplyDelete


  112. ఈ వారాంతము లో స్టాకులు పేలునా ఫట్టనుచూ ? :)

    లచ్చుమి మాయమ్మగదా
    యిచ్చును కొండంతగన్ పయికములనుకొనన్
    హెచ్చుగ కిక్కుల నిచ్చుచు
    బొచ్చెమిగిల్చెను జిలేబి బోణీ బోవన్ !

    జిలేబి

    ReplyDelete


  113. రాళ్ళేయడమన్నది తెలు
    గోళ్ళకు అచ్చొచ్చినది! పగోడుల గోడున్
    వాళ్ళకు విడిచి జిలేబీ
    ముళ్ళను తొలగించుకొనుచు ముందుకు పొమ్మా !

    జిలేబి

    ReplyDelete


  114. అనుభూతులలోన జిలే
    బి, నూతనంబైన కైపు భిన్నత్వములన్
    గనుమా జీవన నౌక క
    వనమ్ములకు మాత్రమే చవణమనుకోకే !

    జిలేబి

    ReplyDelete


  115. స్వాదనమై సహజీవన
    మై దర్శనమై జిలేబిమయమై నిజమై
    ఛాదనమై మనమై యా
    హ్లాదనమై నైజమై సలాపంబయ్యెన్ !

    జిలేబి

    ReplyDelete


  116. జీవన ప్రహేళి లోన
    న్నో వనితా! పయనపు గతి లోన జిలేబీ ,
    కావక మై యుండవలదు
    నీ వల్ల యొనరు చెయివుల నింకెఱ గనుమా !

    జిలేబి

    ReplyDelete


  117. ఇంగనమిదియె జిలేబీ !
    కొంగజపముజేయువారు, కోట్లకొలదిగ
    న్నంగందప్పి నడచుకొను
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !

    జిలేబి

    ReplyDelete


  118. బింకముగా యెదు రొడ్డిన
    జింకను గని తత్క్షణమ్మె సింహము పారె
    న్నంకము కవి కైపదమౌ,
    "జంకును లేక చలనమ్ము జగడముగనగన్" !

    జిలేబి
    మరీ యింతగా జిలేబి
    చుట్టిన యెలా మరి :)

    ReplyDelete

  119. ఈ వారం అమెరికా గతి యేమిటి ?

    దుర్దశ వెనువచ్చు పడతి,
    యర్దనములనౌ దురాశ యవనిక యగుచున్
    తర్దువు వేయచు ముందుకు
    యర్దిత మై వెడలు యక్క ! యారలిరువురౌ !


    జిలేబి

    ReplyDelete


  120. తెనుగింటి కోడలౌ యిం
    తి నిర్మలమ్మ వరకట్న తీపులనుకొనన్
    మన తెలుగువారి పని బ
    ట్టును వలదు వలదు పడతి పటుక్కున కొట్టున్ :)

    జిలేబి

    ReplyDelete


  121. ఎల్లపుడున్ కోపంబును,
    కల్లా కపటంబెరుగను గర్జన నెరుగన్
    మల్ల చరపుల్లెరుంగన్
    పిల్లా యేలన్ గరువపు బిలిబిలి యేలన్ !

    జిలేబి

    ReplyDelete


  122. కూడలి విష్వక్సేనుడ !
    ఓడము లేని తెలుగునకు ఓహో యనుచున్
    బోడంచు చీర మరదే
    లా ! డమ డమల మరియొక విలాసంబేలా :)

    జిలేబి

    ReplyDelete


  123. గోప్యంబగు జాడీ కథ
    లాప్యాయనమయ్యె గాద లావుగ నెట్టున్!
    జాప్యంబికవలదు సుమా
    యాప్యాయతల గురిపించు యాంధ్రా పైనన్ :)

    జిలేబి

    ReplyDelete


  124. సోడా ! సోడా ఆంధ్రా
    సోడా! జిల్ జిల్ జిలేబి సోడా! సోహం
    సో, డాబూ దర్పం గో
    ళీ డోసులన తెలుగోడి లిరికారుద్రా :)

    జిలేబి

    ReplyDelete


  125. తమ్మి మొగ్గరమ్మునట ఛేదనము జేయ
    తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండ
    గు నభిమన్యుడు బాలుడు ! కూల్చి రకట
    సూరుడసహాయుడాతని చుట్టు కొనుచు !

    జిలేబి

    ReplyDelete


  126. పోచిరాజు కామేశ్వర రావు

    16) అభేద ప్రాస -
    ‘లళయో రభేదః, లడయో రభేదః’ అనే సూత్రాల వలన లళడలు అభేదాలు కనుక వానికి పరస్పరం ప్రాసమైత్రి చెల్లుతుంది.
    ఉదా.
    (అ). కేళీ ...., ప్రాలేయాచల .... నిద్రవో, వే లావణ్య ..., జోల (రాజశేఖర చరిత్ర. 2-4)
    (ఆ). పాలును ... వా, హ్యాళి ...., బాల ... ప్రో, యాలు ... (రామాభ్యుదయము. 1-8)
    (ఇ).
    ప్రల్లద మేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రితుల్యుఁడై
    త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము ... (భార. సభా. 2-69)
    (ఈ).
    కొడుకులుఁ దానును గుఱ్ఱపు
    దళములఁ గరిఘటల భటరథవ్రాతములం ... (భార. ఉద్యో. 1-220)
    (ఉ). జలనిధి ..., వెడలి ...., కడు ....తన, రెడు ... (ప్రభావతీప్రద్యుమ్నము. 1-57)

    ల ర లకు యతి మైత్రి కలదు కాని ప్రాస మైత్రి లేదెందుకనో

    ---

    అభేదయతి :- i) వ-బ; ii) ల-డ; iii) ల-ళ; iv) ళ-డ. పై నాలుగు వర్గాలలో ఆయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. v) ర-ల; vi) ఱ-ల; vii) ద-డ లకు కూడా యతి చెల్లుతుందని కూచిమంచి వెంకటరాయడు చెప్పినాడు.
    ఉదా-
    *వసుమతీకళత్ర *బకజైత్ర గానక
    *లాలసత్కలాప *డంభగోప
    *లలితదేహ పింగ*ళపుర దక్షిణగేహ... [అప్పక. ౩.౮౮]
    *డే కదలక జలధిఁ బవ్వ*ళించె ననఁగ. [అనం.ఛంద. ౧.౯౫]
    *లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రే [కాశీ. ౬.౨౧౦.]
    *దంతునే కాలదం*డమున నభవ. [కాశీ. ౭.౮౦]

    ---

    ReplyDelete


  127. భేదంబేమియు లేకన్
    వేదనపడు జనుల నమ్మ పిరిమిగ బిలువన్
    ఛేదించుచు భవ బంధము
    పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్!

    జిలేబి

    ReplyDelete

  128. పరగడుపున మజ్జిగ గొను
    ము రంజుగొను తిన్నదనము ముగ్ధ జిలేబీ !
    వరమౌను జీవితమునకు
    సరళంబైన బతుకునకు చక్కని మందై!

    జిలేబి

    ReplyDelete


  129. ముందర దురాశ వెడల క
    బంధము వలె దుర్దశ వెనువచ్చు నరయగన్
    డెందపు సవితులిరువురౌ
    గంధములను విడువ దగును కాంతుని గానన్

    జిలేబి

    ReplyDelete


  130. బలులిచ్చిరి జంతువులను
    పలువిధముల జోతలిడిరి పరమాత్మునికై!
    పిలిచిరి గొంతుల బెంచుచు
    కలడు కలండను విభుండు గాన్పడడేలా !

    జిలేబి

    ReplyDelete

  131. ఇర్మా ! ముందుకు చొచ్చెను
    మర్మంబేదో గలదు సమస్యల గానన్ !
    నిర్మానుష్యంబగునో
    కర్మానుభవముగ మనిషి కష్టంబులటన్ !

    జిలేబి

    ReplyDelete


  132. చనువున్న చోట సఖ్యత
    మనవదు వినవే జిలేబి మనుజులకిలలో !
    కనకన లాడుచు వచ్చును
    మినమిన గర్వము శుభాంగి మిరిచూపులనౌ !

    జిలేబి

    ReplyDelete


  133. అనపర్తీశుడు మొదలిడె
    ను నగర సందర్శనము కునుకుల విడచుచున్
    వనసంచారము జేయుచు
    జనుల కుశలముల నడుగుచు చక్కని చుక్కా !

    జిలేబి

    ReplyDelete


  134. వ్యాపారంబాయెన్ వి
    ద్యా! పారెను దస్కముల్ నిదానము బోవన్
    సాపాటు రాయులగుచున్
    పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్!

    జిలేబి

    ReplyDelete


  135. ఇర్మా కై విడి చామోయ్
    నిర్మానుష్యంబుగాను, నింగి విరుగునో!
    హర్ముటుడు చంద్రుడు కలియ
    మర్మంబెరుగని సముద్ర మది పొంగెనుగా !

    జిలేబి

    ReplyDelete


  136. దిఙ్మాత్రముగ పలుకుజెలి
    వాఙ్మయమున నున్నదెల్ల! వ్యర్థము సుమ్మీ,
    వాఙ్ముఖముగ తెలిపితిని, ప
    రాఙ్ముఖతగనుటయు సూవె !రావంబేలా !

    జిలేబి

    ReplyDelete


  137. చక్కని చుక్కా యెక్కువ
    మెక్కుడ దేదైన సూవె మేల్గాదు సుమా,
    మిక్కుట మైన జిలేబీ
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    జిలేబి

    ReplyDelete


  138. అత్తింటి కాపురమ్ములు
    మొత్తముగా మారెనయ్య మొత్తిరి భామల్
    కొత్తగ వచ్చిన మగడిని
    కుత్తుక బట్టుచు శతముఖి కుదురుగ గనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  139. తిరుకట్టె బట్టుము జిలే
    బి, రుసరుసల్లాడుచు పతి బిత్తరు బోవన్
    గురిజూచి కొట్టుము సుమా
    మరి సారెలడుగరు పడతి మహిలో యెవరున్ :)

    జిలేబి

    ReplyDelete


  140. జాలము లోనన్ పద్యపు
    హాలికులగుచు కవులెల్ల హారము లిడిరౌ
    చాలాయద్భుత మైనటి
    మేలౌ పూరణల గొనుచు మేధా జీవుల్ !

    జిలేబి

    ReplyDelete


  141. సావాస దోష మమ్మా
    మీ వాణియు మాది గాన మించారెన్బో
    వే విష్ణుమాయ వలెను సు
    మా! వనితా రమణి నమనమమ్మ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  142. కన్యా శుల్కపు రోజులు
    విన్యాసము జేయుచు మరి విరివిగ వచ్చె
    న్నన్యతమ మెల్లపుడునౌ
    కన్యాత్వమునకు జిలేబి కండ్లన నలుసే !

    జిలేబి

    ReplyDelete

  143. జై హరిబాబు ! జైజై హరిబాబు!

    హిందువులను చవటలుగా
    హిందూత్వమును చులకనగ హింకాయింపుల్
    గందరగోళము వలదోయ్
    చిందర వందర యగుదురు చిక్కుచు మీరున్ !

    జిలేబి

    ReplyDelete


  144. పదతాడనమున కష్టము
    లు దరిమిలా తీరుననగ లుకసానికలే
    దు, దరువుల దెబ్బలు తినుము
    పదరుచు బోవును జిలేబి బడపంబులటన్ !

    జిలేబి

    ReplyDelete


  145. రంగీలా షోకులతో
    భంగుల దట్టించుచున్ సభలలోనన్ శ్రీ
    రంగపు నీతుల చెప్పెడు
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!

    జిలేబి

    ReplyDelete


  146. కొండల రావు మహాశయ !
    దండగ ప్రశ్నముల వేయ దగదయ్యా ! కై
    దండగొను మొదట నిపుణుల
    తండసవలె జాలమందు తంగవనేలా !

    జిలేబి

    ReplyDelete


  147. వయసాయెను ముప్పై యేం
    డ్లు ;యవ్వనము బోయెనమ్మ డుమ్మా యనుచున్
    శయనమ్మున నిదురయు బో
    వ యోషిత వలపుల చిగురు వగచుచు బోయెన్ !

    జిలేబి

    ReplyDelete


  148. పదివేలకు చేరె జిలే
    బి దిటవుగా నిఫ్టి స్టాకు బిగువుగ తానౌ !
    మది తూగుచు పాడెదరో
    సదనమ్మున రేపు, మోడి సారధ్యమనీ :)

    జిలేబి

    ReplyDelete

  149. కథలు కట్టితే సంస్కృతంలోనే కట్టాలి :) అన్నీ మహాత్మ్యాలు పురాణాలు మోక్ష సాధకాలూ అయిపోతాయి :)

    కట్టగ నౌ సంస్కృతమున
    గట్టి కతల్, హా! పురాణ గాథలవియగున్ !
    భట్టరు జెప్పిన రీతిగ
    మొట్టుచు చెప్పుము జిలేబి ముఖ్యంబుగునౌ :)

    జిలేబి

    ReplyDelete


  150. కంచె ఐలయ్య!

    నేనేదన్నా రాస్తా!
    యే నా కొడుకైన కసిరి యేదైనా య
    న్నా నేనొల్లను నొల్లను
    వా! నా కివ్వండ్ర బందవస్తు భటులతో !

    ReplyDelete

  151. ---

    మిద్దెల్ స్మారక మేడల్
    శుద్ధగ దండగ జిలేబి సూక్ష్మము గనుమా
    పెద్దనిదురగన నాత్మకు
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    జిలేబి

    వేమన తాత ఉవాచ (యట!)

    పిండములను జేసి పితరుల దలపోసి
    కాకులకును బెట్టు గాడ్దె లార !
    పియ్య తినెడు కాకి పితరుడెట్లాయెర !
    విశ్వదాభిరామ వినుర వేమ !

    ReplyDelete


  152. వాగిండొకచౌదరియున్
    బాగు మజాగలదు సూవె బ్లాగుల్లోనన్
    వాగుడు కాయల పలుకుల
    సాగుడు కందము జిలేబి చానా రాయీ :)

    జిలేబి

    ReplyDelete


  153. కన్నడాతడు గద కన్నుల నిండుగ
    రాధికాప్రియుండు! రావణుండు
    మోహమున పడతుల మొండరియై చెర
    బట్టెను; మనుజులకు పదవియె యరి !

    జిలేబి

    ReplyDelete


  154. కైపదముల పూరించ
    న్నే పాట్లైన పడదగును! నేర్పును బడయ
    న్నే పదములైన పద్యము
    లో పదిలంబుగను కులుకు లోపము లేకన్ !

    జిలేబి

    ReplyDelete


  155. గురవయ్య తులా రాశి చ
    తురుండగుచు నిలచెనమ్మ ! తుమ్మెద వోలెన్
    పరదుకొనెదవు జిలేబి యి
    క రయ్యనుచు నీవు పద్య కమలము తోడన్ :)

    జిలేబి

    ReplyDelete


  156. మా వూళ్ళో ఓ పడుచుం
    దీ! వూ యంటే బెదరుచు దెయ్యంబనునోయ్ !
    ఆ వూళ్ళో చిన్నోడే
    రావే భామా జిలేబి రమ్మన్నాడే !

    జిలేబి

    ReplyDelete


  157. పలుమార్లు చదివి నావే
    జిలేబి రామాయణమ్ము !చిలుకపలుకలే
    న? లవట్లాడితివి ? యెచట
    బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్?

    జిలేబి

    ReplyDelete


  158. హరిబాబూ! మీ ప్రశ్నల
    కు రహీముండు బదులిచ్చు కొనునంటారా ?
    పరమతముల మాత్రము ము
    మ్మరముగ యేకెదము !స్వంత మతము కుదరదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  159. హస్తంబునయంకోపరి,
    మస్తిష్కము శూన్యము! మజ మధురా పానమ్
    బస్తీ తిరుగుళ్ళ మురిసి
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్!

    జిలేబి

    ReplyDelete


  160. ఓనా! సికరాణి! మురిసి
    నానిల్లాపె! దవులేల ! నాపలు వరుసే
    నేను? యురల గడ్డ ముఖం
    బైనాడన! నోట బుగ్గ బడ పొక్కళ్ళై !

    జిలేబి

    ReplyDelete