Friday, January 15, 2016

సంక్రాంతి శుభాకాంక్షలు అనబడు హ్యాపీ పొంగల్ :)

సంక్రాంతి శుభాకాంక్షలు అనబడు హ్యాపీ పొంగల్ :)

 
అందరికీ  సంక్రాంతి శుభాకాంక్షల తో

(అందరికీ అనగా బ్లాగ్వీరులకు, బ్లాగ్వీరాంగణలకు, కామెంటుకర్మచోదులకు అందరికిన్నూ :)
 
సంక్రాంతి కి జిలేబి వేయు సరికొత్త వృత్తము - దీని పేరు జిలేబి వృత్తము
 
దీని గణము జ గణమే పూర్తి గా  నాలుగు మార్లు;  అనగా లఘువు గురువు లఘువు  = | U |
 
దీనిని నాలుగు మార్లు  త్రిప్పి త్రిప్పి వేయ జిలేబి వృత్తము వచ్చును .
 
ఉదాహరణ
 
బిలేజి ఉడాలు బిజీగ మరీను
భలేగ   టపాలు  భళీర వళీ న  
గలేసి   ధడాలు   కరాన బిగీన 
భలేగ  టపాలు భగీలు మనేను
 
 
శుభోదయం :)
 
బ్లేడు
జిలేబి
 
 
జిలేబి పద్య లక్షణములు
 
జిలేబి పద్య లక్షణము - మధురగతి రగడ వోలె ఉండు :)
జాతి(రగడలు) రకానికి చెందినది
 1. 8 నుండి 16 అక్షరములు ఉండును.
 2. 4 పాదములు ఉండును.
 3. ప్రాస నియమం కలదు
 4. అంత్య ప్రాస నియమం కలదు
 5. ప్రాస యతి నియమం కలదు
 6. ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 7. ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును

20 comments:

 1. ఢమాలు ఢమాలు ధబీలు ధబీలు
  గుభీలు గుభీలు దడేలు దడేలు
  ధబీడ ధబీడ దిబీడ దిబీడ
  ఫటేలు ఫటేలు శభాషు శభాషు

  ReplyDelete
  Replies

  1. కష్టే ఫలే వారు !

   బాగు బాగు మళ్ళీ ఫార్మ్ లో కి వచ్చేసి నట్టున్నారు !

   మిగిలింది గురువు గారొక్కరే :)

   జిలేబి

   Delete
 2. జిలేబి బిలేజి లేబిజి జిబిలే
  లేజిబి బిజిలే లబిజి లిబిజి
  జిబిలి జిలిబి లజిబి బిజిలి
  జిబిల లబిజి లెభజి భలెజి

  భలేజీ ...
  :-------))


  జిలేబీ *గడాలు భలేగా మరీను *ఆగడాలు
  భళీరా టపాలు భలేగా ధడాలు
  మెలేసి నరాలు కుదేసి జొరాలు
  ఎగేసి నెగళ్లు తినేసె మెదళ్ళు ...


  భలేజీ పద్య లక్షణము - మరపు రాని రగడ వోలె ఉండు :)

  లోల...
  :)

  ReplyDelete
  Replies
  1. ఏ వృత్తమో మరి ... ఆ వృత్తము ...
   hahaha...

   Delete
  2. భళీర భళీర జిలేబి బిలేజి
   భలేగ భలేగ ఢమాలు ఢమాలు
   జిలేబి లెజీబు గలీజు గలీజు
   ఎగేసి దిగేసి మెలేసె కుదేసె

   Delete
  3. లోల! లోల!! లోల!!!
   లోలాయం! హర! లోలాయాం!! హరలోలాలాయాం!! :)

   Delete

  4. బండి రావు గారు,

   "పెర్ముటేషణ్" "కాంబినేషన్" ల తో షాన్ దార్ అయి పోయేటట్టు ఉన్నారు !

   జిలేబి

   Delete
  5. అదేమో గానీ ఓ వెండార్ గా
   ఆల్రెడీ మార్చేసినట్లుగా అనుమానంగా ఉంది ...
   :)

   Delete
  6. ఇంకేముందండి
   అప్పుడు దొండకాయలండి
   ఇప్పుడిక 'జిలేబీ'ల 'బండి' ...

   --------------------------------

   అయ్యర్'స్ జిలేబీ భవన్
   HO : CHENNAI
   BRNACHES : HYDERABAD
   AMARAVATI
   (మరెక్కడా మాకు బ్రాంచీలు లేవు)

   ---------------------------------


   జిలేబీలు ... జిలేబీలు
   వేడి వేడి ... జిలేబీలు
   వాడి వాడి ... జిలేబీలు ...

   101 రకాల జిలేబీలు
   వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ...
   కారం జిలేబీలు మా ప్రత్యేకత
   వారం లో అన్ని రోజులూ లభ్యం


   ట్యాగ్ :

   వచ్చినోడు కొనాల్సిందే
   చచ్చినట్లు తినాల్సిందే ...

   JK :)
   JF :)

   Delete

  7. బండి వారు,

   நான் only வெஜிடேரியன் :)

   ஜிலேபி

   Delete
  8. ఇదెక్కడి అరవ ఆగడం తల్లీ ...
   ఆ ప్రక్క పురచ్చి తలైవి
   ఈ ప్రక్క *ముడుచ్చి జిలేబి
   ఎందుకమ్మా మీరిద్దరూ తెలుగు
   వాళ్ళపై ఇంత కక్ష కట్టారు?

   అరవం అర ముక్క కూడా రాని నాపై
   అరవ పదభిగావళిని సంధిస్తే ఎలా ...
   సమయానికి అయ్యరు స్వాములోరెవరూ
   తెలిసినోళ్ళు లేరే !
   phone a friend చేద్దామంటే ...
   శర్మ గారు, లక్కాకుల వారి
   ఫోన్ నెంబర్లూ తెలియవు -
   అరవమొచ్చో రాదో తెలియదు ...
   ఎన్నడా మురుగా! ఏమి సేస్తు !?

   దిక్కు లేనోళ్లకి గూగులే దిక్కు (దేవుణ్నడిగితే ఆన్సర్ ఎప్పుడొస్తదో తెలియదుగా మరి)
   మరి ఆలస్యమెందుకు మొక్కు ...

   நான் : Nana
   வெஜிடேரியன : Vejiteriyana
   ஜிலேப : Jilepa

   మీరు శాఖాహార జిలేబీయన్న నొకానొక సాత్విక
   ప్రకటనకు ప్రొద్దున్నే నేనాహారమైపోయానుగా !!!
   (అరవంలో ఏం తిట్టరోనని హడలి చచ్చానంటే నమ్మండి -
   సెనక్కాయ నమిలినట్టు నమిలేశారు).

   వణక్కం వణక్కం ...
   :-)

   *(అప్పుడెప్పుడో నేను చూసిన మూడు ముళ్ళు సినిమా కి
   మాతృక 'మూండ్రు ముడుచ్చు" చిత్రం అని ఇప్పుడు గుర్తుకు
   రావడం భలే పనికొచ్చింది)

   Delete
 3. ఇచటి వృత్త జిలేబీయ మెవరి మీది
  కో శరము గురిచూచు లాగుండె , నదియు
  గురువు మీదికి కాదుగా , గురుడు మాంచి
  కాక మీదుండె కాస్త జాగ్రత్త సుమ్మి .

  ReplyDelete
  Replies
  1. అది ఉన్నమాట, జరుగుతున్నమాట

   Delete

  2. @లక్కాకుల వారు,

   వేరే మాట ఏదైనా చెప్పండి :) గురువు గారి మీదే ! ప్రేమ మీరగ ! ఎంతైనా మా గరువు గారే కదా !

   జ గణానికి పోటీ గా గురువు గారు మూడు 'జ' ల తో ఒక రగణం చేర్చి అధ్బుత మైన వృత్తం అందించారు ! అదే కదా వారి గొప్ప దనం !


   @కష్టే ఫలే వారు ->

   మీ లోలాయాం బాగున్నది !

   @బండి రావు గారు,

   ___/\____ అంటే ఏమిటో సెలవియ్య వలె !

   :)))

   రెండు చుక్కలు మూడు బ్రాకెట్ల ఆట ఆడుకుందాము రండి :)

   చీర్స్
   జిలేబి

   Delete
  3. గురువు లఘువుగాడు
   లఘువు గురువెట్లౌను?
   గురువు కి నమస్కారమె
   గురువు లఘువుజేయు

   :)

   Delete
 4. కష్టే ఫలే వారు :)

  గురువు కైన "మస్కా" రమె
  లఘువు గురువుని జేయు :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 5. @ లక్కాకుల వారూ ...
  "ఇచటి వృత్త జిలేబీయ మెవరి మీది
  కో శరము గురిచూచు లాగుండె , నదియు
  గురువు మీదికి కాదుగా , గురుడు మాంచి
  కాక మీదుండె కాస్త జాగ్రత్త సుమ్మి ." ...

  http://nmraobandi.blogspot.in/2016/01/nmraobandi-zilebis.html


  ___/\___

  :)))

  జేకే ...

  ReplyDelete