Friday, August 19, 2016

కారాగారపు టపాలు కనకన మనవోయ్ !కారాగారపు టపాలు కనకన మనవోయ్ !


పారా హుషారు సారూ
కారాగారపు టపాలు కనకన మనవోయ్ !
వీరావేశము వలదోయ్
బారా తలుపులు తెరువుము  బాగుగ మనవోయ్ !చీర్స్
జిలేబి
 

13 comments: 1. కార్ఖానా పద్యములను
  గూర్ఖాలా తిరుగుచుండి గూర్చె జిలేబీ !
  చెర్ఖా చక్రము త్రిప్పగ
  దర్ఖాస్తు నిడితిమి మేలు దర్బారు గనన్ !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 2. మందుని గురించి మేలు ప
  సందగు సోమలత వేద సరకు గురించీ
  బిందాసు జెబితివిగ! ఆ
  నందము! ఆ బ్లాగ్విమోచన యెపుడు యొజ్జా :)

  జిలేబి

  ReplyDelete


 3. పని పాటా లేదనుచున్
  అనుదినపు టపాల మాటు మాచన దాగెన్
  అనుభవశాలి గదా శ్యా
  ముని కూడా బ్లా గులోకమును వీడమనెన్ !

  జిలేబి

  ReplyDelete


 4. దీర్ఘతముని జనన కథల
  మార్గము గనుచు సరొగేటు మదరుల కథలం
  తర్గత విషయముల తెలిపె !
  అర్ఘము భాస్కర! జిలేబి అడిగన మాటో ?

  జిలేబి

  ReplyDelete


 5. అద్దెకు గర్భా లిచటన్
  మిద్దెల రమణీ మణులకు మిక్కిలి సొగసౌ!
  సుద్ధి గరిపిరిగదా బ్లా
  గోద్ధారక మాచనార్య, గోప్యము వలదోయ్

  జిలేబి

  ReplyDelete


 6. నెత్తురు గెడ్డెలు చిట్కా
  లొత్తగ చూ మంత్రకాళి లొంగెను గదవే !
  మెత్తగ నూరుము కందము
  కొత్త టపాలకు విముక్తి కొంతయు గలుగన్ :)

  జిలేబి

  ReplyDelete

 7. ఆధారు కార్డులనుచు ని
  రాధరణను చూపెనోయి రాజ్యాంగమముల్
  బాధాకరమగు జీవన
  గాధల మరియొక ప్రహేళిక యిది జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 8. అలకలు తీరక చిలుకయు
  అలజడి జేయుచు టపాలు‌ అచ్చట దాగెన్
  కలకల లాడిన కష్టే
  ఫలముల అలకలు తొలుగగ పబ్లికు‌ యెపుడో :)


  జిలేబి

  ReplyDelete

 9. అన్నీ ఉన్నా అల్లుడి
  కన్నీ శనియే జిలేబి కలకల మండెన్ !
  సున్నగ మమ్ముల జేసిన
  మిన్నగ మీరెట్లగుదురు మీగయి యేలన్ !

  జిలేబి

  ReplyDelete


 10. చెప్పడము తేలిక! జిలే
  బప్పటి కాలపు కథలను బాగుగ జెప్పెన్ !
  యిప్పటి మా మాటేమిటి !
  విప్పుడు సంకెళ్ళ యొజ్జ ! విరివిగ మేలౌ !

  జిలేబి

  ReplyDelete


 11. ఓదార్పుల వేళాయే!
  సోదాహరణముగ నేటి చోద్యము చెప్పెన్ !
  రాదారిని వీడిన రా
  జా దాదా యిటు జిలేబి జావళి బిలిచెన్ :)

  జిలేబి

  ReplyDelete


 12. షీకాయాకూ కరివే
  పాకూ ! మరువకు జిలేబి పారుడు చెప్పెన్
  బాకా యూదెను మార్కెటు
  మా కూరలలోన శక్తి మాచన తెలుపన్ :)

  జిలేబి

  ReplyDelete

 13. ఆస్కా రము లేదాయే
  భాస్కర! యొజ్జను జిలేబి పద పొమ్మనునౌ?
  రాస్కెల్సెవరో యే కో
  న్కిస్కా గాళ్ళో సలిపిన కింకరి పనులౌ !

  జిలేబి

  ReplyDelete