Saturday, August 29, 2009

అడమానం తాకట్టు ఆమ్యామ్య

ఈ మధ్య పేపర్లు చదువుతూంటే శ్రీ శ్రీ గారిలా ఈ పేపరు తిరగేసినా ఏమున్నది గర్వ కారణం - అడమానం తాకట్టు ఆమ్యామ్య అనాలనిపిస్తుంది.

ఛీర్స్
జిలేబి.

Friday, August 28, 2009

వెంకన్నాస్ గోల్డ్ !

మెకన్నాస్ గోల్డ్ చిత్రంలో పొలోమని గోల్డ్ రష్ కోసం రోగ్ కారెక్టర్లు తో బాటు ఓ ఫాదరీ కూడా ఉంటాడు. ఆయన్ని మీరెందుకు గోల్డ్ కోసం పరుగులాట అంటే ఆ డబ్బులతో పెద్ద చర్చి కట్టిస్తాని చెబ్తాడు జవాబుగా!
ఈ బ్లాగులో కొంత కాలం క్రితం ఏడుకొండలవాడి బంగారం గోవిందా గోవిందా వ్రాసాక ఈ మధ్య పేపర్లో తిరుపతి దేవాలయం పూజార్లు వారు స్వామీ వారి బంగారు నగల్ని అడమానం పెట్టి జీవిత సాగరాన్ని నడపుతున్న వైనం చదివాక నిజం గా చాల బాధ వేసింది. వెంకన్నన్ను నమ్ముకుని రాముల వారిని నమ్ముకుని ఇట్లాంటి పరిస్తుతులలో సాంప్రదాయ బద్ధం గా బ్రతకవలసిన పంతులవారు జీవితాని సాగించడానికి బంగారాన్ని అడమానం పెట్టి నెగ్గుకు రావడం అఆలోచింప దాగిన విషయం. స్వామీ వారి ఆదాయం కోట్లు! వారి పూజారి వారి జీతాలు అంత అంత మాత్రమే! స్వామీ వారి ఆదాయాన్ని కార్పొరేట్ తీరులో గణిస్తూ వారి వద్ద పనిచేసే పూజార్లు వారి జీతాలు ఇంతే ఉంటే ఇక ఇట్లాంటి దురవస్త రాక మానుతుందా అనిపిస్తుంది! వెంకన్న వారు కల్యాణం చేసుకోవడానికి కుబెర్లు వారి దగ్గిరి బకాయి పడ్డా రట ఆ కాలం లో! ఇప్పుడు వారి సేవకులు అడమానం దుకాణానికి బకాయ్! ధర్మో రక్షతి రక్షితః!
ఛీర్స్
జిలేబి.

Saturday, August 22, 2009

సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్

ఈ మధ్య బ్రాడ్ పిట్ చిత్రం సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్ చూసాను. ఈ చిత్రం గురించి చెప్పాలనుకుని ఈ టపా. దీంట్లో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఫ్రెంచ్ డైరెక్టర్. కథ ఒక ఆస్ట్రియన్ జర్మన్ మౌంటైన్ క్లిమ్బెర్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఆస్ట్రియన్ తన జీవితంలో చిన్నప్పటి దలైలామా ని కలుసుకోవడం ఈ కథలో ముఖ్య వస్తువు. ఇది నిజంగా జరిగిన కథ అని దాన్ని జర్మన్ రచయితా రాసాడని విన్నాను. ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి భారత ప్రభుత్వం ఇండియా లో చిత్రీకరించడానికి అనుమతి ఇవ్వక పోవడం తో వీళ్ళు ఈ చిత్రాన్ని సెట్స్ వేసి వేరే దేశంలో తీసారు!

ఒక అద్భుత కథా కావ్యం!
చూడ దలిస్తే ఈ క్రింది లింకు ద్వారా చూడొచ్చు.


http://www.veoh.com/search/videos/q/seven+years+in+tibet#watch%3Dv18604085anyWhqSP

ఛీర్స్
జిలేబి.

Sunday, August 16, 2009

అజ్ఞాత టపాలు కామెంట్లు

ఈ మధ్య ఒక బ్లాగోదరుడు/బ్లాగోదరి కమేంట దానికి అందరికి సమాన హక్కులు ఉండాలి అని వాపోయారు! అంటే ప్రతి ఒక్కరు గూగుల్ లాంటి ఐడీ లతో లాగిన్ అయ్యి పోస్ట్ లకి కామెంట్ రాయాలని ఓ మోస్తరు అందరు బ్లాగు దార్లు సెట్టింగ్స్ పెట్టడంతో స్వేచ్ఛా విహన్గాలైన అజ్ఞాతలకి కామెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా పోతోందని వారి కంట తడి కాకుంటే కంఠ శోష! ఈ కామెంట్ చదివాక అయ్యో పాపం అని పించింది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరి కి తమ అభిప్రాయాలు తెలుపడానికి హక్కులున్నాయీ! మరి ఇలా లాగిన్ అయి కామెంట్ ఇవ్వడమంటే ఆలాంటి స్వేచా కామెంట్ దార్లకి చెయ్యి కట్టేసినట్టే! అంతే గాకుండా ఓ లాంటి అసౌకర్యం కూడా! ఈ విషయం గా కూడలి గాని హారం గాని ఏదైనా ఓ కొత్త టెక్నిక్ కనుక్కుంటే బాగుణ్ణు! ఈ లాంటి వారు ఆ టెక్నిక్ ఉపయోగించి స్వేచ్ఛా కామెంట్ చెయ్య దాని కి సావకాశం కల్పించిన వారవుతారు! అంతే గాకుండా అజ్ఞాతలకి కూడా సులభతరం గా ఉంటుంది!

ఛీర్స్
జిలేబి
స్వేచ్ఛా విహంగం అని ఆ టెక్నిక్ కి పేరు పెట్ట వచ్చని నా అభిప్రాయం! మీరే మంటారు?

Tuesday, August 4, 2009

ఏడు కొండలవాడా వెంకటరమణ బంగారం గోవింద గోవింద?

ఇవ్వాళ హిందూ దిన పత్రిక లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారి ఆదేశం - తీ తీ దే వారికి - స్వామీ వారి బంగారం లిస్టు సమర్పించందహోయీ అన్న వార్త చదివాక - అందులోని ముఖ్య అంశం గా ఈ బంగారు నగలు లాకర్ లో సింగెల్ కీ సిస్టం ద్వారా ఉన్నట్టు వినికిడి. అంటే ఆ ఒక వ్యక్తి పరం లో ఉన్న నగలకి గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది! సాదా సీదా బ్యాంకు లాకర్ లకే రెండు కీ లతో ఆపరేట్ చేస్తారు ! ఇంక కోటానుకోట్ల విలువ గల స్వామీ బంగారు నగల బాగోతం ఒక్క మనిషి ద్వారా నిర్వహణ అంటే ఇది నిజం గా ఆశ్చర్యం అని పిస్తోంది ఇప్పటిదాకా ఎలాంటి కుంభకోణాలు లేకుంటే ! మనిషన్నాక సందేహం మొదట్లోనే ఉంటుంది కదదండి మరి! అయిన తీ తీ దే వారు ఇన్ని సంవత్సరాల బట్టి ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ? ఈ లాంటి సందేహాలకి తావు ఇవ్వడం సబబేనా? ప్రజల బంగారం (అంతా స్వామీ వారిదే అనుకోండి) ఇట్లా స్వామీ వారికి వారి వారి మొక్కులతో ఇవ్వ బడ్డ బంగారం నిజం గా స్వామీ వారి దగ్గిరే అంటే తీ తీ దే వారి దగ్గిరే ఉందా?????? లేకుంటే ------ అంతా విష్ణు మాయ కాకుంటే కలికాలం మహిమ అనుకోవాలి!

ఈ టపాలు కి ఈ క్రింద ఇవ్వ బడ్డ హిందూ వారి వార్త చదివాక వచ్చిన నా సందేహాలు అప్రతిహమగు గాక!

http://www.hindu.com/2009/08/04/stories/2009080455500100.htm

జిలేబి

Monday, August 3, 2009

హాలికులు కుశలమా?

చిత్తూరు జిల్లా ప్రముఖ రచయితలలో పేరెన్నికగన్న శ్రీ మధురాంతకం రాజారాం గారి గురించి ప్రత్యేకం గా చెప్పవలస్సిన అవసరం ఎప్పుడు ఉందనే చెప్పాలి. ఈ మధ్య పులికంటి వారి జన్మ దిన సందర్భం గా వారి ఫోటో చూసాక మధురాంతకం రాజారాం గారు గుర్తుకి రావటం తో వారి పై చేసిన గూగుల్ సెర్చ్ లో శ్రీ రాజారాం గారి " హాలికులు కుశలమా" కథానిక గుచ్ఛం కంట పడింది. ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింక్ ద్వారా పీ డీ ఎఫ్ఫ్ రూపేణడౌన్లోడ్ చేసికొని చదువుకోవచ్చు. వారి పేరిన్నికగన్న ఎన్నో కథలు ఇందులో ఉన్నాయి!
లింక్:
http://www.archive.org/details/halikulukushalam019993mbp

ఛీర్స్
జిలేబి.

Sunday, August 2, 2009

తెలుగు కామెడి - ఆరవ కామెడి

ఆరవ దేశానికి బోర్డర్ లో ఉండటం వల్ల చిత్తూరోల్లకి ఆరవ కామెడి తో మంచి పరిచయం కొంచం ఎక్కువే. నిజం చెప్పాలంటే అరవం వాళ్ల కామెడి ఓ మోస్తరు ఫాస్ట్ కామెడియే. తెలుగు లో అంత ఫాస్ట్ గా కామెడి సఫలం కాదేమో అనిపిస్తుంది. జంధ్యాలగారు కొంత ఈ ఫాస్ట్ కామెడి కి బ్రహ్మానందం గారి తో ప్రయత్నించి చూసారు. కాని అంత క్లిక్ అయినట్టు అనిపించదు. భాష సౌలభ్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది.

అరవం భాష సౌలభ్యం అనుకుంట లేకుంటే కామెడి డ్రామాలు తెలుగు కంటే అరవం లో నే ఎక్కువగా రావడం కూడా కావచ్చు. ఉదాహరణకి క్రేజీ మోహన్ , ఎస్.వి. శేకర్ లాంటి కామెడి కింగ్ లు ఆరవ సామ్రాజ్యాన్ని కామెడి ద్రామలతో , పన్ లతో మరీ ఎక్కువగా ప్రాచుర్యం లో ఉంచడం కూడా కారణమై ఉండవచ్చు. మద్రాసు నగరం లో ఈ మధ్య "చాకొలేట్ కృష్ణ" ఆన్నపేరుతొ క్రేజీ మోహన్ సీరియల్ చాల రోజులుగా నడుస్తోంది డ్రామా థియేటర్ ల లో!

జిలేబి.