ఈ మధ్య ఒక బ్లాగోదరుడు/బ్లాగోదరి కమేంట దానికి అందరికి సమాన హక్కులు ఉండాలి అని వాపోయారు! అంటే ప్రతి ఒక్కరు గూగుల్ లాంటి ఐడీ లతో లాగిన్ అయ్యి పోస్ట్ లకి కామెంట్ రాయాలని ఓ మోస్తరు అందరు బ్లాగు దార్లు సెట్టింగ్స్ పెట్టడంతో స్వేచ్ఛా విహన్గాలైన అజ్ఞాతలకి కామెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా పోతోందని వారి కంట తడి కాకుంటే కంఠ శోష! ఈ కామెంట్ చదివాక అయ్యో పాపం అని పించింది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరి కి తమ అభిప్రాయాలు తెలుపడానికి హక్కులున్నాయీ! మరి ఇలా లాగిన్ అయి కామెంట్ ఇవ్వడమంటే ఆలాంటి స్వేచా కామెంట్ దార్లకి చెయ్యి కట్టేసినట్టే! అంతే గాకుండా ఓ లాంటి అసౌకర్యం కూడా! ఈ విషయం గా కూడలి గాని హారం గాని ఏదైనా ఓ కొత్త టెక్నిక్ కనుక్కుంటే బాగుణ్ణు! ఈ లాంటి వారు ఆ టెక్నిక్ ఉపయోగించి స్వేచ్ఛా కామెంట్ చెయ్య దాని కి సావకాశం కల్పించిన వారవుతారు! అంతే గాకుండా అజ్ఞాతలకి కూడా సులభతరం గా ఉంటుంది!
ఛీర్స్
జిలేబి
స్వేచ్ఛా విహంగం అని ఆ టెక్నిక్ కి పేరు పెట్ట వచ్చని నా అభిప్రాయం! మీరే మంటారు?
సమస్య - 4951
-
24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ ...
20 hours ago
ఆమధ్య అజ్ఞాతలు కామెంటెయ్యకుండా మూసుకోవాలని బ్లాగుబన్ లు (బ్లాగు తాలిబాన్లు) ఓ ఫత్వా జారీ చేసారు లెండి. ఈ సమస్యకు పరిష్కారం ఆ ఫత్వా రద్దు చేయడం.
ReplyDeleteమీరేమీ అనుకోనంటే ఒక మాట -
ReplyDeleteబ్లాగోదరుడేంటి నా బొంద :)
చాలా వరకూ బ్లాగర్లు కామెంట్ మోడరేషన్లో పెట్టారు. కొందరు మెయిల్ ID ఉంటేతప్ప కామెంట్ పెట్టకుండా చూస్తున్నారు. ఇక అజ్ఞాతలకు బాధలు తప్పవు.
ReplyDeleteదీనికి పరిష్కారం ఓపెన్ బ్లాగింగ్, ఓపెన్ వ్యాఖ్యింగ్ ;-)
ReplyDelete@వేమన:
ReplyDeleteబ్లాగోదరుడు = బ్లాగు ఉదరమున కలవాడు :-) వీళ్లు బ్లాగుల్నే భోంచేస్తారు రామాహరే.