మెకన్నాస్ గోల్డ్ చిత్రంలో పొలోమని గోల్డ్ రష్ కోసం రోగ్ కారెక్టర్లు తో బాటు ఓ ఫాదరీ కూడా ఉంటాడు. ఆయన్ని మీరెందుకు గోల్డ్ కోసం పరుగులాట అంటే ఆ డబ్బులతో పెద్ద చర్చి కట్టిస్తాని చెబ్తాడు జవాబుగా!
ఈ బ్లాగులో కొంత కాలం క్రితం ఏడుకొండలవాడి బంగారం గోవిందా గోవిందా వ్రాసాక ఈ మధ్య పేపర్లో తిరుపతి దేవాలయం పూజార్లు వారు స్వామీ వారి బంగారు నగల్ని అడమానం పెట్టి జీవిత సాగరాన్ని నడపుతున్న వైనం చదివాక నిజం గా చాల బాధ వేసింది. వెంకన్నన్ను నమ్ముకుని రాముల వారిని నమ్ముకుని ఇట్లాంటి పరిస్తుతులలో సాంప్రదాయ బద్ధం గా బ్రతకవలసిన పంతులవారు జీవితాని సాగించడానికి బంగారాన్ని అడమానం పెట్టి నెగ్గుకు రావడం అఆలోచింప దాగిన విషయం. స్వామీ వారి ఆదాయం కోట్లు! వారి పూజారి వారి జీతాలు అంత అంత మాత్రమే! స్వామీ వారి ఆదాయాన్ని కార్పొరేట్ తీరులో గణిస్తూ వారి వద్ద పనిచేసే పూజార్లు వారి జీతాలు ఇంతే ఉంటే ఇక ఇట్లాంటి దురవస్త రాక మానుతుందా అనిపిస్తుంది! వెంకన్న వారు కల్యాణం చేసుకోవడానికి కుబెర్లు వారి దగ్గిరి బకాయి పడ్డా రట ఆ కాలం లో! ఇప్పుడు వారి సేవకులు అడమానం దుకాణానికి బకాయ్! ధర్మో రక్షతి రక్షితః!
ఛీర్స్
జిలేబి.
సమస్య - 4951
-
24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ ...
23 hours ago
టపా సంగత్సరే .. టైటిల్ మాత్రం కేక, రంకె, etc.
ReplyDeleteటైటిల్ బాగుంది.... పోస్ట్ కూడా. అడమానం అంటే? తాకట్టు అనా?
ReplyDeleteఅవును. టైటిల్ అదిరింది.
ReplyDeleteటైటిల్ కెవ్వు కేకండి.
ReplyDeleteసూపర్! ఈ పూజారిని జైల్లో పెడితే తెలుగు సాహిత్యానికి ఇంకో రామదాసు. అధికార భాషా సంఘం వాళ్లు ఈ విషయం ఆలోచించాలి.
ReplyDeleteటైటిల్ కెవ్వు కేక.
ReplyDeleteభావనగారు-
ReplyDeleteఅడమానం అన్నది చిత్తూరు జిల్లా వ్యావహారికం. తాకట్టు కి సమానార్థం.
చీర్స్
జిలేబి.