ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు వరుసగా జ్యోతిష్యం గురించి బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అది చదివిన తరువాయీ ఈ శీర్షిక - జ్యోతిష్యం గురించి ఆలోచిస్తుంటే - అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి అన్న సందేహం రాక మానదు. ఈ ఒక్క లాజిక్ చాలు జ్యోతిష్యాన్ని తీసి పారేయడానికి. కాని దీనికి కారణం చెబ్తారు- జ్యోతిష్యులు- అంటే- మీ జాతకం లో - మీరు కష్టించి పైకి వస్తారని ఉంది కాబట్టి- మీ ఆలోచన ఆ పరిధి లోకి వెళ్లి మీరు అభివృద్ధి లోకి వస్తున్నారానో కాకుంటే- అధోగతి పాలవు తున్నారానో - దీనికి సమాధానం చెప్పుకొస్తారు.
సో, ఈ నేపధ్యం లో ఈ సబ్జెక్టు ఎల్లప్పుడూ వివాదాస్పదమే. కర్మ సిద్ధాంతం, మానవుని సంకల్పం, దైవ నిర్ణయం, ఇట్లా వేరు వేరు సిద్ధాంతాలు - కలగలపుగా ఉన్న మన దేశం లో - ఈ సిద్ధాంతాలు - ఒక దాని మీద ఒకటి పోటి గా మానవ మేధస్సుకి దాటీ గా - ఓ లాంటి చాలెంజ్ లేవదీస్తాయి - మనిషి మేధస్సుకి పరీక్ష పెడతాయి కూడా- వాదం, ప్రతి వాదం తార్కిక చింతన, ధ్యానం, నిర్వకల్పం, శరణాగతి, ఇట్లాంటి వేర్వేరు సిద్ధాంతాలతో - ఓ పాటి విలక్షణం గా ఉన్న భారత సంస్కృతి - ఓ విభిన్న ప్రకృతిని ప్రతిపాదిస్తున్దనడం లో సందేహం లేదు. ఎవరి ఆలోచన పరిధికి ఏది అందుతుందో అక్కడినుంచి వాళ్ళు - ఆ పై గతి కి ప్రయాణం సాగించ డానికి దోహద కారి అనిపిస్తోంది కూడా ఈ భారత చింతనా స్రవంతి !
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
నాకు తెలిసినంతలో నేను దీన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను.
ReplyDeleteమన సంసృతిలో కర్మ లేక పని కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నిజానికి భగవద్గీత ను 'హిమ్ టు యాక్షన్' అని ఆంగ్లీకరించారంటే దాన్ని సరిగ్గా అర్దంచేసుకొన్నారని తెలుసుకోవాలి. అసలు కృష్ణుడు అర్జునునికి చెప్పిందే లేచి యుధ్ధంచెయ్యమని కదా. ప్రాప్తం అని కూర్చోమని కాదు.
అయితే అదే సమయంలో మనం గమనించాల్సింది ఏమిటంటే మన ప్రమేయం లేని ఎన్నొ విషయాలు ప్రకృతి పరంగా, ప్రభుత్వ నిర్ణయాల ఫలంగా పక్కదేశంవాడి పిచ్చి వల్ల, మరోపక్క వాడి కుళ్ళు వల్ల జరుగు తాయి. వాటి ప్రభావం మన పైన ఉంటుంది. ఇవి ఇలా ఎందుకు జరుగు తున్నాయి అనేదానికి సమాధానం జ్యోతిష్యం. జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలకు నిరాశ పడకుండా కొంత ధైర్యం కొంత సంయమనం కొంత ఉపశమనం పొందటానికి, కొంత మన అంచనాలను తగ్గించుకొని లేక పెంచుకొని ముందుకు పోవటానికి ఇది ఉపయోగిస్తుంది.
నాకు తెలిసి ఏ జోతిష్యుడూ పని చెయ్యకు నీకు ఎలాగూ కలిసిరాదు అని చెప్పరు. నీకు పీరియడ్ బాగాలేదు కనుక వెంటనే ఫలితం లేక పోయినా ఇంకా కష్టపడు అంటారు. లేక పీరియడ్ సూపర్ గా ఉంది కనుక ఇప్పుడే బాగా శ్రమ పడి మరీ ఎక్కువ ఫలితాన్ని పొందు అంటారు.
ఇది ఇండస్ట్రీలలో బాగా వాడే స్టాటిస్టిక్స్ లోని హూరిస్టిక్స్ లాంటిదని నా ఉద్దేస్యం.
"....ఇది ఇండస్ట్రీలలో బాగా వాడే స్టాటిస్టిక్స్ లోని హూరిస్టిక్స్ లాంటిదని నా ఉద్దేస్యం...."
ReplyDeleteGood example. I like it.
మన పరిధుల్లో లేని ఏ విషయాలు మనను ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి అనుభవం, జ్ఞానం, ఎదుర్కొనగల సామర్ధ్యం పనికి వస్తాయి కదండి. ఇక్కడకూడ మనకి కావలసింది strategist లు కానీ జ్యోతిష్యులు కాదు.
ReplyDeleteకొన్నిటికి మరో సైన్స్ లేదండి. ఈ గెస్ వర్క్ మనకు మాత్రమే సొంతం కాదు కదా అన్ని నాగరికతల్లోనూ ఉన్నాయి.
ReplyDeleteఅయితే అందరికీ దీని అవసరం కలగక పోవచ్చు. ఎక్కువ కోరికలు లేకుండా జీవితాన్ని ఎలా వస్తే అలా తీసుకొనే వాళ్ళకు, మానసికంగా బలవంతులకు దేవుడు కూడా అక్కరలేదు. అయితే అందరూ ఆ స్ఠాయిలో ఉండరు కదా! మానసిక వైద్యుడి అవసరం ఆ మాటకి వస్తే మామూలు వైద్యుడి అవసరం అందరికీ ఉండదు కదా అంత మాత్రాన ఆ చదువులు పనికి రానివనలేము కదా!
అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి?
ReplyDeleteఅల్లా అయితే మన జీన్స్ DNA మన గురించి చాలా చెబుతుంది. మనము ఎల్లా జీవిస్తామో చూ చాయగా చెబుతాయి. మన జీవితం లో మనకు ఎఏ రోగాలు వస్తాయి, మనము తాగు బాతులు అవుతామా కాదా మొదలయినవి. మీ వాదన దీనికి గూడా వర్తిస్తుంది. ఉదా: మనము ఎల్లాగు తాగు బోతూ లవు తామని ఇప్పటి నుండే తాగటం మొదలెడితే ఎల్లావుంటుంది.
"మన జీన్స్ DNA మన గురించి చాలా చెబుతుంది. మనము ఎల్లా జీవిస్తామో చూ చాయగా చెబుతాయి. మన జీవితం లో మనకు ఎఏ రోగాలు వస్తాయి, మనము తాగు బాతులు అవుతామా కాదా మొదలయినవి"
ReplyDeleteDNA గూర్చి నాకు తెలియదండి.
ఇక జాతకం విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు నువ్వు తప్పక తాగుబోతువు అవుతావు అని కంక్లూజన్ ఉండదు.,బలహీన మనస్సు కల వాడు చెడు అలవాట్లు కావటానికి అవకాశం ఉంది అని ఉండవచ్చు. అది తెలిసి చాతనైనంత మనసును గట్టి చేసి జాగ్రత్త పడితే మరీ మాదక ద్రవ్యాలు కాకుండా కాఫీ లాంటి చిన్న చిన్న బలహీనతలతో సరిపెట్టవచ్చు అచుకొంటా. ఉపయోగించుకొనే వాళ్ళను బట్టే వస్తువు విలువ. మీకు తెలుసుగదా మొగలిపువ్వు మీద ముతక సామెత.
This comment has been removed by the author.
ReplyDeleteమనకు స్వాతంత్ర్యం లేదు. మన జీవితాలు 99 శాతం ప్రోగ్రామింగ్ చేయబడ్డమాట వాస్తవం. కానీ అదే సమయంలో మనకి 1 శాతం స్వేచ్ఛ మాత్రం అనుమతించబడింది. (వారివారి పుణ్యాన్ని బట్టి ఈ స్వేచ్ఛలో మనిషికీ, మనిషికీ మధ్య చాలా హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి) ఈ వొక్కశాతాన్ని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మన భవిష్యద్ జన్మ నిర్ణయమవుతుంది. కాబట్టి మానవసంకల్పం, దైవసంకల్పం (జాతకం) రెండూ పరస్పరవిరుద్ధ అంశాలు కావు, పరస్పర పూరకాలే (mutually complementary).
ReplyDeleteఅందరి జాతకాలలోనూ యోగాలుంటాయి. కొన్ని బలహీనయోగాలూ, మరికొన్ని బలీయమైన యోగాలూ ! బలీయమైన యోగాలున్నవారు నిజంగానే దేని గురించీ ప్రయత్నం చేయాల్సిన పనిలేదు. కానీ బలహీనమైన యోగాలున్నవారు కొన్నికొన్ని కావాలంటే జ్యోతిశ్శాస్త్రపరమైన పరిహారాలతో పాటు లౌకికమైన కృషి కూడా చేయాల్సివస్తుంది. ఎవరి జాతకంలో ఏ యోగాలు బలీయంగా ఉన్నాయి, ఏవి బలహీనంగా ఉన్నాయి, వేటికి రెమెడీస్ అవసరం, వేటికి కాదు అనేది తెలుసుకోవాలంటే మంచి జ్యోతిష్కుడు కావాలి.
అదే విధంగా జాతకాలలో గండాలు ఉంటాయి. అన్ని గండాలూ మరణాన్ని తేకపోవచ్చు. కాని కొన్ని గండాలు మారకలక్షణాలు గలిగినవి. అవి ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకొని ఆ గండాల నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే చిన్నచిన్నగండాలు, తప్పించుకోవడానికి అనువైనవి కూడా మారకాలుగా పరిణమిస్తాయి.
అలాగే, అందరు దేవుళ్ళూ అందరి జాతకాలకీ పనికిరారు. మన ఫ్రెండుకి త్వరగా అనుగ్రహాన్నిచ్చిన దేవుడు మనకివ్వడు. కారణం - పూర్వజన్మసంస్కారబలం. మన పూర్వజన్మసంస్కారబలానికి అనుగుణమైన దేవుణ్ణే మనం ఉపాసించాలి. ఆ దేవుడు ఎవరు అని తెలుసుకోవడానిక్కూడా జ్యోతిశ్శాస్త్రమే శరణ్యం. అదే విధంగా ఎవరో ఏదో వ్యాపారం చేసి బాగుపడ్డారు కనుక తామూ అదే చేద్దామనే ఉత్సాహంతో దిగి నష్టపోయేవాళ్ళుంటారు. అలా జరగడానిక్కారణం ఆ వ్యాపారం వారి జాతకానికి సరిపడేది కాకపోవడం. మన జాతకానికి సరిగ్గా సరిపడే కెరియర్ ఛాయిసెస్ చేసుకోవడానికి జ్యోతిశ్సాస్త్రం సహకరిస్తుంది. అంతేకాక మన సన్నిహితులూ పరిచయస్థులూ అయినవాళ్ళలో క్రిమినల్ మెంటాలిటీస్ ఎవరున్నారో కనిపెట్టడానిక్కూడా అది తోడ్పడుతుంది.
ఏ పాపాల వల్ల ప్రస్తుతజన్మలో కొన్నికొన్ని కష్టాలెదురయ్యాయో కూడా జ్యోతిశ్శాస్త్రం తెలియజేస్తుంది. ఆ పాపాల్ని రిపీట్ చేయకుండా జీవించడానికి కావాల్సిన సంకల్పబలాన్ని అది అందిస్తుంది.
జ్యోతిశ్శాస్త్రం కేవలం భవిష్యత్తు తెలిపే శాస్త్రం కాదు. ఇందులో మంచి ప్రారంభసమయాల్ని తెలియజేసే ముహూర్తభాగం, దేశగోచారం వగైరా చాలా విషయాలున్నాయి.
జ్యోతిశ్శాస్త్రం శాసించదు, సూచిస్తుందంతే !
ReplyDeleteజ్యోతిశ్శాస్త్రం శాసించదు, సూచిస్తుందంతే
ReplyDeleteఎంత చక్కగా చెప్పారు. జనేటిక్స్, మెడిసిన్ కూడా అంతే. సూచనలు స్టాటిస్టిక్స్ ద్వారా చెపుతాయి తప్పితే 100% ఖచ్చితంగా చెప్పవు. అందుకని అవి తప్పు అనలేము కదా.
మేఘాలు వస్తుంటే వర్షం వస్తుందని ఊహిస్తాము ,కానీ వర్షం పడాలని సిద్ధాంతం లేదు గట్టి గాలి కొడితే అవి చెడిపోయి వర్షం పడదు అలాగే జ్యోతిష్యం జరగబోయే దాన్ని సూచిస్తాయి ,చాల గట్టి ప్రయత్నం తో జరిగేదాన్ని ముద్ను గానేఆపవచ్చు.ఎలా అంటే చీకటి లో వెళ్ళేటప్పుడు దేపం సాయం తో ముందు వున్నది నుయ్యో గొయ్యో తెలుస్తే జాగ్రత్త పడతాము , అలానే జ్యోత్యిస్యం కూడానూ
ReplyDelete