మధ్య తరగతి తెలుగు అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఆంద్ర దేశం దాటితే అంతా విచిత్రం గానే ఉంటుంది. అట్లాంటిది ఏకం గా మూడు వేల కిలో మీటర్ దూరం లో అస్సాం వెళ్ళ వలసి వస్తే ఎలా ఉంటుంది? అదీను అస్సలు హిందీ రాకపోతే అసలు నువ్వు నార్త్ లో జీవితపు బండి నడప లేవు అని ఎవరైనా ఇంకా బెదర గోడ్తే మన ధైర్యం అంతా హుష్ కాకి అయి పోతుంది!
అట్లాంటిది ఓ మోస్తరు హిందీ కూడా అంతగా చలామణి కాని దేశం కాని దేశం లాంటి అస్సాం లో అదీ పీక్ భజరంగ్ భళి ఆపరేషన్ పిరియడ్ లో కాలు పెట్టడం జరిగింది.
వెళ్ళడం ఏప్రిల్ నెల లో . సూర్యోదయం పొద్దు ఐదు గంటలకు పై చూసే అలవాటున్న 'సో కాల్డ్ మద్రాసీ' లకు (సౌత్ వాళ్ళంతా నార్త్ వాలాకి మద్రాసీ లే - మన రామా రావు గారు వచ్చాకే - ఓహో - ఆంధ్ర దేశం ఒకటి ఉన్నదని వాళ్లకి తెలిసి వచ్చిందంటే అతిశయోక్తి గాదు ! ) అక్కడ సూర్యోదయమ్ మూడు మూడున్నర గంటల మధ్య చూడడం ఒక లాంటి 'భయాన్ని' కలిగించడం సర్వ సాధారణం !
నాకైతే అంత పొద్దే సూర్యోదయం చూడడం భయాన్నే కలిగించింది ( అప్పటి వాతావరణం - ఆ నలభై ఎనిమిది గంటల రైలు లేటు తో రైలు గువాహతి చేరడం దానికి కారణమై ఉండ వచ్చానుకుంటా) వార్నీ ప్రపంచానికి ఏదో అయ్యిందన్న మాటే - సూర్యుడు ఇంత పొద్దునే ఊడి పడ్డా డంటే అనుకున్న!
(ఇది మన telugu యోగి sarma గారి బ్లాగులు చదివి అలా కిటికీ నించి చూస్తె మామూలుగా ఎగిరే పక్షి కూడా ఏదో అవాంతరం ముంచుకొచ్చే పరిస్తితులలో ఉందేమో అన్నటు వంటి సందేహం కలగడం లాంటి దన్న మాట !)
ఆ తరువాతే తెల్సి వచ్చింది - కాకుంటే అర్థం అయింది మన 'కాల గీత' మధ్య భారత దేశం లో వెళ్ళడం వల్ల నార్త్ ఈస్ట్ కి ఓ కనీసం ఒకటిన్నర గంటల వ్యత్యాసం ఉండవచ్చు అన్న విషయం !
అట్లాగే చలికాలం లో సాయంత్రం నాలుగు గంటలకే నక్షాత్రాలు ఆకాశం లో కనిపిస్తే మరో వింత ! (భయం కొద్ది పోయి వింత ప్రవేసిన్చందన్నమాట ఆ ఆరు నెలల కాల వ్యవధి లో )
ఇక భోజన విషయానికి వస్తే - అన్నం, కాసిన్ని పచ్చి మిరపకాయ లు , అంత ఉప్పు , ఒక చేప బస్ ఫుల్ మీల్స్ అయినట్టే!
ఇట్లా చెప్పుకుంటూ పోతూంటే జ్ఞాపకాలు పొర్లుతూ వస్తాయి. రాయడానికి ఓపిక తెచ్చుకోవలంతే!
ఈ టపా రాయడానికి కారణం యధేచ్చ గా ఇంటర్నెట్ లో అస్సామీ ఇంటర్నెట్ రేడియో తటస్త పడటం! ఆ అస్సామీ పాటలు వింటుంటే - యాద్గారే రావడం ! (ఆ పై శర్మ గారి బ్లాగు చదవడం - భయ భ్రాన్తులకి లోనవడం - అది వేరే విషయం అనుకోండి!!- )
చీర్స్
జిలేబి.
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
-
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
*కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు.
ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాది...
8 hours ago
ఇంకా వణుకుతూనే ఉన్నారా?భయభ్రాంతిలోంచి బయటికొచ్చారా లేదా?
ReplyDeleteప్రతీ పోస్టుకిందా చీర్స్ అంటుంటారు గ్లాసులు కొట్టుకోడమేనా,ఇంకేమన్నా గూడార్ధం ఉందా నోరూరించే జిలేబీ గారూ. :D