Friday, October 11, 2024

టాటా జనుల మది నిండుగా నీవె సుమా !

 

టాటా అనుట సులభమా

బాటయు బాసటయు నీవు ప్రజల ప్రగతికిన్

మేటి గమికాడవు! రతను

టాటా! జనుల మది నిండు గా నీవె సుమా


జిలేబి



18 comments:

  1. -

    పశ్యామి! పాహి దుర్గే!
    దృశ్యాదృశ్యపు వివేక దృంహిత వైరా
    గ్యస్యాది సాధనకు స
    స్యశ్యామల సంపదలకు శాంకరి ప్రణతుల్


    ReplyDelete
  2. -

    ఏది విదేశమేది ? ఏది దేశమేది :)

    చాలా హాశ్చర్యమయెన్
    మీలో "బా" వుకత యెంత మించారె! విదే
    శాల నివసించినను వే
    షాలేయక మరువ లేదు సంస్కృతిని సుమీ!




    ReplyDelete
  3. రామచంద్రుని బాణము , రాజసమున
    వెలిగి , చెడుపయి మ్రోగించె విజయ భేరి ,
    గాన , విజయదశమి నేడు , కాంక్షదీర
    ఘన శుభాకాంక్ష లందింతు , కరము 🙏 మోడ్చి .

    ReplyDelete
  4. -

    చాన్స్ దొరికితే చాలు :)

    భండారువారి నెంబరు
    తిండాడగ దొరికె ! కాలు చేయుడి! ఫారి
    న్నుండి తిరిగి వచ్చిరి గా
    దండిగ కాహళపు గుడ్లు దట్టింపదగున్ :

    ReplyDelete
  5. -
    యేసు గలడెల్ల చదువుల
    యేసు గలడు భూతనాధునిగ నలినజుడై
    యేసు గలడు మన ప్రభునిగ
    యేసుని ప్రార్థింప దక్కు నే హలె లూయా!


    ReplyDelete
  6. -
    పెద్దలు వినరా ? వారికి
    సుద్దుల నేర్పంగ మనకు సులభతరమ్మా ?
    తద్దయు బండి టకుటకుల
    నిద్దుర పట్టునకొ మనకు నీరజనేత్రా !

    ReplyDelete
    Replies
    1. మునగచెట్టు, మునగచెట్టు 😳

      Delete
    2. సుద్దులు నేర్పంగ జనిన
      తద్దయు వినువారె తమరు ? తంటా మీతో ,
      హద్దులు లేవాయె తమకు ,
      యెద్దేవా సేయు టొకటె యెరుగుదురు , కదే !

      Delete
  7. -
    హా! మందు పాటలయొ లే
    వే! మగువల మదిని విరహ వేదనలయొ లే
    వే! మా బండిదొర! యెచట?
    వేమార్లు పిలువను రారె! వినరా! తెలుపన్


    ReplyDelete
  8. వలదయ్య వ్యావహారిక
    ములు గ్రాంధికమె తగు పద్యములకున్ లక్కా
    కుల రాజన్నా! గురువ
    ర్యుల మాటలు వినవలె నెపుడున్ ఖ్యాతి గనన్


    ReplyDelete
  9. గురువర్యు లెవరు మనకున్ ?
    గురువులకే గురువు శాస్త్రి , గూబలు వగులున్ ,
    గురువీ ' రాజా ' , తక్కొరు
    గురువంటిర , వాడు గుడ్లగూబ గదన్నా !

    ReplyDelete
  10. -
    ఎవరా గురువులు ? ననుమిం
    చు వరేణ్యులెవరు ? తెలిపినచో గూబల్వా
    యు వరకు వాయించెద; నే
    నెవరన్ ? నెల్లూరు రాజు నే పువుబోడీ !


    ReplyDelete
  11. వి లే క రి / వి లే ఖరి అంటే ఏమనుకున్నావోయ్ ?
    తస్మాత్ జాగ్రత్త !

    అతి వర్జయేతని జిలే
    బి తెలివిడిగొనవె విలేకరి తలచినచొ నీ
    దు తలయెగురు ! మంచిగ ఉం
    డు తిక్క పనులువలదు చెడుగుడులాడకుమా


    ReplyDelete
  12. -

    పనిలేని జిలేబి యొకతె
    పనిగట్టుకు పద్యములను వ్రాయన్ గురువుల్
    కనికరము జూపి సరె నే
    ర్వని సభలో తలము నిచ్చి రన్నా రాజా!

    ReplyDelete
  13. గురువులకు పంగ నామా
    లరయంగా బెట్టువారె , అచ్చపు శిష్యుల్ ,
    తిరుపతి కెళ్ళక , ఇంటనె
    గొరిగి మరీ , నామ మెట్టు , గొప్పగ విబుధా !

    ReplyDelete
  14. -

    ప్రభొ! తమకు తెలియని విషయ
    ము, బుంగ నామమ్ముల విధములు గలవా రా
    జ! బుడిబుడి మేమెరుగుట త
    డబడి తడబడి పదముల గెడన్ జేర్చుటయే

    ReplyDelete
  15. ఏముంది , తెలుగు పద్యము
    గ్రామీణ పదాల తోడ గ్రాలగ వలయున్ ,
    నామాల వాళ్ళ శష భిష
    లేమాత్రము లెక్క సేయ నేల వయస్యా ?


    ReplyDelete
  16. -

    మీరెటుల బల్కగ నదియె
    సారూ సరి యగు గురువులు చల్లని రావుల్
    మీరు! యతి, ప్రాసల హొయలు
    నేరుపు తెలిసి‌న విదురులు నెవ్వడి తోడై

    ReplyDelete