అబ్బా, ఈ మధ్య సబ్బటికల్ పోయి ఉద్యోగం లో వచ్చినప్పటి నించి అసలు మస్సాంతి లేకుండా పోతోంది.
సబ్బాటికల్ రోజుల్లో ఎంత హాయిగా టపా కట్టే వాళ్ళం. ఎంత హాయిగా కామెంటే వాళ్ళం
మరి ఇప్పుడో అసలు టపాలు చదవ టానికే సమయం దొరకడం లేదు మరి.
ఛ, ఛ, అసలు బుద్దుంటే ఎవరూ సబ్బాటికల్ మానుకుని ఉద్యోగం లో చేర కూడదు సుమీ.
ఎవరైనా మీలో మరి సబ్బటికల్ తరువాయి ఉద్యోగం లో చేరాలనే నిర్ణయం తో ఉంటే అది మనసులోకే రానివ్వ మా కండి మరి.
సో, ఇవ్వాళ అందుకే ఎట్లా గైనా టపా కట్టేద్దామని నిర్ణ యించి ఈ టపా కట్టేశాను మీరు చదివి తీరాల్సిందే సుమీ అని తీర్మానించు కునేసా.
ఇంతకీ టపా విశేషం ఏమిటం టారా ?
అబ్బే, మన టపాల్లో విశేషాలు ఏమీ ఉండవు సుమండీ అంతా ఉట్టి టీం పాస్ అండ్ టైం పాస్ అంతే మరి.
జోక్స్ అపార్ట్ ఈ మధ్య నాకో సందేహం వచ్చిందండీ . దాని గురించి మీకు చెప్పాలని అనిపించి ఈ టపా
మాయా బజార్ చిత్రం చూసా రాండీ ?
ఛ ఛ మాయా బజార్ గురించి మీరు మాకు చెప్పాలా అంటారా ?
నాకు అందరికీ తెలిసిన విషయాలే తెలుసండీ మరి ఎం చేద్దా మంటారు ?
ఇంతకీ మాయా బజార్ మాట ఎందుకం టారా ?
నాకో సందేహం. మాయా బజార్ లో సావిత్రి పాత్ర పేరు ఏమిటీ ? ఎవరైనా ఖచ్చితం గా తెలిస్తే తెలియ జెయ్య గలరు.
అదీ అన్నమాట సందేహం
ఎందుకంటే అభిమన్యు ప్రేమించిన అమ్మాయి ఈవిడ. ఈవిడ పేరు ఏమిటబ్బా అని ఆలోచిస్తూంటే అసలు ఆ అమ్మాయి పేరు ఎక్కడైనా చిత్రం లో ఉదాహరించారా అన్న సందేహం నాకు కలిగే. అందుకే ఈ ప్రశ్న మరి. !
చీర్స్
జిలేబి.
sasirekha
ReplyDeleteమాయా బజార్ అను శశిరేఖా పరిణయం
ReplyDeleteశశిరేఖ పెళ్లి గురించి శ్రీ కృష్ణుడు బలరాముడితో ప్రస్తావిస్తాడు .. శశిరేఖ పేరు చాలా సార్లే పలికినట్టు గుర్తు
ReplyDeleteఅబ్బా ఆశ....ఆ అందగత్తె పేరు శశిరేఖ అని నేను చెప్పనుగా:-)
ReplyDeleteahaha
ReplyDeleteLOL..........Tapa kattesaanu ante vere artham vastundi emo............
ReplyDelete
ReplyDeleteశశిరేఖ.ఆపేరు సినిమాలో సంభాషణలో వస్తుంది కూడా.మీరు గమనించలేదు.అంతేకాదు.ఆమెకి ఇంకొక పేరు 'వత్సల '.ఇంతకీ శశిరెఖాపరిణయకథ మహాభారతంలో ఎక్కడాలేదు.అభిమన్యుడు 'ఉత్తర ' ను పెళ్ళాడినట్లు మాత్రమే ఉంది.ఈకథ బహుశా వేరే గ్రంథంలో ఉందేమో.(వ్యాసభారతానికి,జైమిని భారతానికి కొన్ని తేడాలు ఉన్నవి.)
ఒకరు point out చేసినట్లు టపా కట్టేస్తున్నాను అనకూడదు.అశుభం పలుకుతుంది.
శశిరేఖాపరిణయం ప్రక్షిప్తం....అది వేరే విషయం...
ReplyDeleteకమనీయం గారు చెప్పినట్లు టపా కట్టేయడం అనకూడదు..
బాల్చీ తన్నేయటం లాంటిదన్నమాట....:-)
@శ్రీ