ఓ పుష్పాన్ని
తుమ్మెదలు కామించేయి. రమించేయి.
వడలి సడలి పోయిన పుష్పం
కొమ్మన ఊగిస లాడింది కొస ప్రాణం తో .
మాలి పుష్పాన్ని కోసి
సింగారి సిగలో పెట్టేడు
పుష్పమా పుష్పమా నీవు సింగారి వయ్యేవే అని.
సిగలో కెక్కిన పుష్పం
ఉక్కిరి బిక్కిరి అయి నేల రాలింది.
కొమ్మనించి రాలితే మాలి హేతువు.
సింగారి సిగ నించి రాలితే
ప్చ్.. కాలం తీరిపోయిన పుష్పం.
జిలేబి.
కోసిన పువ్వుని సింగారించకుండానే నలిపిపారేస్తే?????
ReplyDeleteపద్మార్పిత గారు,
Deleteఈ మధ్య అదే గా అయ్యింది మరి?
జిలేబి.