Wednesday, May 29, 2013

ఆవకాయ ఫ్లోర్ టపా కి 'లక్ష్మీ' 'టపా క్యాప్! - హన్నా శరవేగం !


Derivatives world లో ఫ్లోర్ అండ్ క్యాప్ అన్న పదజాలం ఉంది .

అట్లా , నిన్న భమిడి పాటి అయ్య వారు మా ఆవిడ నన్ను ఫ్లోర్ చేసింది అంటే (నిన్నటి లింకు చూడ వలే ) భమిడి పాటి అమ్మగారు 'ఆయ్ ' అని 'ఏదో ఒక మారు పని జెబ్తే, వెంటనే 'టముకు' కొట్టు కోవాలా అంటున్నారు !

భమిడి పాటి అమ్మగారు రిటార్టు ఇస్తారని అనుకున్నా గాని, ఇంత త్వరగా రిటార్టు ఇస్తారని ఊహించలే ! అయ్య వారు చేసిన ఆవకాయ టపా కారం వెంటనే పని జేసి టపా రిటార్టు అమ్మగారు వేసేసేరు !

ఇక ఎందుకు ఆలస్యం !

పిల్లలు టూర్ వెళితే, మనకు ఇక 'హనీ  డేస్ గదా !!

''' ఈ ఏడాది ఆవకాయ కలపడం మా వారికి outsource చేసేశాను. ఏమిటో ఎంతో శ్రమపడిపోయినట్టూ, నేనేదో ఆయన్ని ఆరళ్ళు పెట్టేస్తున్నట్టూ ఓ టపా కూడా పెట్టేసికున్నారు. మరి ఇన్నేళ్ళూ,మింగినట్టు లేదూ? ఒక్క రోజంటే ఒక్కరోజైనా ఆవకాయ లేకుండగా ముద్ద దిగిందా? పైగా బయటినుంచి తేకూడదూ, ఇంట్లోనే, పిల్లల్ని చూసుకుంటూ, ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ, వంటపనీ, ఇంటిపనీ చూసుకుంటూ ప్రతీ ఏడాదీ ఊరగాయలు పెట్టడమంటే మాటలా మరి? అదేం జాతకమో నాది, ఓ పనిమనిషికూడా లేదు'''



చీర్స్
జిలేబి 

अरे भाय आंध्रा पिकिल नही है क्या?!


ఆవకాయ మన అందరిది .... గోంగూర పచ్చడి మనదేలే ...ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ లెందుకు లే ! అంటూ హ్యాపీ గా పాడే సు కుంటుం న్నారు భమిడి పాటి వారు ...

స్వచ్చమైన ఆవకాయ టపా చదవడానికి ఈ క్లిక్కు నొక్క వలె !


,,,, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्‍ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్రమంగా ఈ “ఆవకాయ” మనకోసం కంటే బయటివాళ్ళకోసం ఓ status symbol గా తయారయింది. ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సుకరాలన్నీనూ..... 



చీర్స్
జిలేబి 

Monday, May 27, 2013

బాబా బ్లాక్ షీప్ ఆనందా వారి ప్రసంగోపన్యాసం


'బాబా బ్లాక్ షీప్ హేవ్ యు ఎనీ వూల్  అంటే, ఎస్ సర్ ఎస్ సర్ త్రీ బాగ్స్ ఫుల్ ' ఇందులో నిగూఢ మైన అర్థం దాగి ఉన్నది ' తన బవిరి గడ్డాన్ని దువ్వుకుంటూ చెప్పారు బాబా బ్లాక్ షీప్ ఆనందా స్వామి వారు.

జనవాహిని 'ఆహా ' అని స్వామి వారి ప్రసంగో పన్యాసాన్ని వినడానికి ఉత్సుకతో 'జై బోలో స్వామీ షీప్ ఆనందా మహారాజ్ కీ' అని దీర్ఘ ఘోష పెట్టేరు .

స్వామీ వారు చేయెత్తి అందర్నీ తడుము తున్నట్టు చెయ్యూపుతూ ఆశీర్వదించేరు  !

భక్తుల కళ్ళలో కన్నీళ్లు తప తప మని రాలేయి . ఆహా స్వామి వారికి ఎంత 'అవ్యాజ మైన' 'ఘాటు' 'గోటు' ప్రేమ మన మీద అని వారు అనందం తో తడిసి ముద్దయ్యేరు .

స్వామీ వారు తమ ప్రసంగాన్ని కొనసాగించేరు .

భక్త 'శిఖా' మణులారా  ! త్రీ బేగ్స్  అనటం ఎందుకు ? చార్ బాగ్ అని ఉండ వచ్చు కదా ? కాదె ! త్రీ బేగ్స్ అనే చెప్పారు ! దీని లో నిగూఢ మైన అర్థం ఏమిటి ! అని మళ్ళీ బవిరి గడ్డం తడి మేరు .

జనవాహిని కి ఈ మారు ఏమి చెయ్యాలో పాలు పోలేదు జై కొట్టాలో లేదో తెలియ లెదు.

స్వామి వారు అన్నారు.... త్రీ బేగ్స్  అనగా, ముక్కంటి ఈశ్వరుడు . త్రీ బేగ్స్  అనగా మూడు గుణములు సత్, రజో తమో గుణములు అన్నమాట త్రీ బేగ్స్  అనగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు . త్రీ బేగ్స్  అనగా గాయిత్రి .

ఇట్లా సర్వం 'త్రిభువన భూషితం' ! అంతా 'త్రీ' లో నే ఉంది

one for my master అనగా నేమి ! ఆ పరమ ప్రభువు ! one for the dame అనగా నేమి ! ఆ పర దేవత ! one for the little boy down the lane ' అనగా ఎవరు ?

ఎవరూ ఎవరూ 'జై బోలో బ్లాక్ షీపా నందా స్వామీ వారికీ !"

బాబా వారు బవిరి గడ్డం తడిమేరు  ! 'ఎవరు' అంటూ కళ్ళ లో చమక్కు చూపిస్తూ అడిగేరు .

జై జై జై అంటూ జనవాహిని ... ఇంకెవరు మన బాబా గారే ఆ లిటిల్ బాయ్ డౌన్ ది లేన్ !' అంటూ కర ఘోష ఆ హాలు ప్రతిధ్వనించే లా చేసేరు .


స్వామీ వారి శిష్య పరమాణువులు భక్తులందరికీ మూడు మూడు బాగులు ఇచ్చేరు ... ఇందులో మీరు మీ కానుకలు చెల్లించ వచ్చు ! అంతా స్వామీ వారి ముందు పెట్టండి . స్వామీ వారు పరమ ప్రభువు వాటా, పరదేవత వాటా, తమ వాటా అంతా సరి సమానంగా పంచెదరు  '

జనవాహిని ఎగ బడ్డది  ! స్వామీ వారు అక్కడే ఉన్న గొర్రె నెక్కి 'వాహన' స్వామీ వారి గా మారేరు !

కథ కంచి కి మన మింటికి !

వెల్కం బెక బెక !

జిలేబి ఈజ్ బ్యాక్ అగైన్ !

చీర్స్
జిలేబి 

Monday, May 6, 2013

స్వామి బ్లాగానంద వారితో ముఖాముఖీయం


నమస్కారం స్వామీ బ్లాగానంద గారు . తెలుగు బ్లాగు సముదాయము తరపున మీకు ఇవే జిలేబీ శుభాకాంక్షలు .
మీ గురించి 'స్వల్ప' పరిచయం ?

జిలేబీ సిద్ధి రస్తు ! నన్ను పూర్వాశ్రమం లో వీక్లీ ఆనందా అనేవారు . ఈ పంచ దశ లోకం లో స్వామీ బ్లాగానందా అన్న పేరుతో వెలసి ఉన్నాను

మీ పేరు బ్లాగానందా  కావడానికి మీరేమి తపము చేసిరి స్వామీ ?

సంవత్సరాల కొలది ఘోరమైన కామెంటు తపము చేసినాము . వేల కొద్ది కామెంటు సమిధలు సమర్పించి బ్లాగు లోకమున ఆనందము గాంచినాము . దానితో బాటు 'కై' 'వలయ' విద్య గా అందరిని మెచ్చు కున్నాము . తపము ఫలించి 'టా పెశ్వరీ ' మాత అనుగ్రహము మాకు నిండు గా దక్కింది . 'మాతా టా పే శ్వరీ  వర ప్రసాదమున మాకు 'బ్లాగ్బ్లిస్సు' కలిగింది .

స్వామీ బ్లాగానందా  గారు ... బ్లాగు టపాలు మీరేమన్నా వెలు వరిం చారా ?

అంతా విష్ణు మాయ ! మేమే సర్వ బ్లాగు లలోను మీ 'వేలు' నించి వారు తున్నాము ! ఇక మాకంటూ ఒక్క బ్లాగు ఎందుకు ? మీ టపా ఆనందమే మా కర ఘోష !!

స్వామీ అంటే మీరేమీ టపాలు రాయ లేదా !?

చెప్పాను కదా జిలేబీ ? జిలేబీయం ఎచ్చట ఉండునో అచ్చటంతా  అది నా టపా యే  !
ఆహా ఏమి చెప్పినారు స్వామీ !!

స్వామీ !!

ఏమీ !!

నన్ను కరుణిం చండి ! నన్ను దీవించండి !!

హాం ఫట్ !! భామా, బ్లాగు మాని ఇంటి పని చూసుకో ! అంతా సవ్యం గా జరుగు తుంది నీకు !!

ఆ!!! ---!! ఆ ఒక్కటి చెప్పమాకండి  స్వామీ !

అంతా 'టపేశ్వరీ ' ఇచ్చ ! మనం నిమిత్త మాత్రులం మాత్రమె !!


చీర్స్
జిలేబి
(జిలేబీ చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆరంభం!)