Monday, May 6, 2013

స్వామి బ్లాగానంద వారితో ముఖాముఖీయం


నమస్కారం స్వామీ బ్లాగానంద గారు . తెలుగు బ్లాగు సముదాయము తరపున మీకు ఇవే జిలేబీ శుభాకాంక్షలు .
మీ గురించి 'స్వల్ప' పరిచయం ?

జిలేబీ సిద్ధి రస్తు ! నన్ను పూర్వాశ్రమం లో వీక్లీ ఆనందా అనేవారు . ఈ పంచ దశ లోకం లో స్వామీ బ్లాగానందా అన్న పేరుతో వెలసి ఉన్నాను

మీ పేరు బ్లాగానందా  కావడానికి మీరేమి తపము చేసిరి స్వామీ ?

సంవత్సరాల కొలది ఘోరమైన కామెంటు తపము చేసినాము . వేల కొద్ది కామెంటు సమిధలు సమర్పించి బ్లాగు లోకమున ఆనందము గాంచినాము . దానితో బాటు 'కై' 'వలయ' విద్య గా అందరిని మెచ్చు కున్నాము . తపము ఫలించి 'టా పెశ్వరీ ' మాత అనుగ్రహము మాకు నిండు గా దక్కింది . 'మాతా టా పే శ్వరీ  వర ప్రసాదమున మాకు 'బ్లాగ్బ్లిస్సు' కలిగింది .

స్వామీ బ్లాగానందా  గారు ... బ్లాగు టపాలు మీరేమన్నా వెలు వరిం చారా ?

అంతా విష్ణు మాయ ! మేమే సర్వ బ్లాగు లలోను మీ 'వేలు' నించి వారు తున్నాము ! ఇక మాకంటూ ఒక్క బ్లాగు ఎందుకు ? మీ టపా ఆనందమే మా కర ఘోష !!

స్వామీ అంటే మీరేమీ టపాలు రాయ లేదా !?

చెప్పాను కదా జిలేబీ ? జిలేబీయం ఎచ్చట ఉండునో అచ్చటంతా  అది నా టపా యే  !
ఆహా ఏమి చెప్పినారు స్వామీ !!

స్వామీ !!

ఏమీ !!

నన్ను కరుణిం చండి ! నన్ను దీవించండి !!

హాం ఫట్ !! భామా, బ్లాగు మాని ఇంటి పని చూసుకో ! అంతా సవ్యం గా జరుగు తుంది నీకు !!

ఆ!!! ---!! ఆ ఒక్కటి చెప్పమాకండి  స్వామీ !

అంతా 'టపేశ్వరీ ' ఇచ్చ ! మనం నిమిత్త మాత్రులం మాత్రమె !!


చీర్స్
జిలేబి
(జిలేబీ చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆరంభం!)

4 comments:

  1. నాలుగు వారాలే కదా! ఎంత లొకి తిరిగి వచ్చును. వేచి చూచెదం జిలేబీ !

    హాపీ "నిర్టపా" వ్రతం.

    అయ్యరు గారు జాగ్రత్తండోయ్! ఠపాల కోపం అంతా వారి పైన ప్రదర్శించకండీ.

    చీర్స్ జిలేబీ జీ!!

    ReplyDelete
  2. ఉండలేరుండలేరుండలేరు
    మీరు టపారాయక ఉండలేరు
    గోక్కుంటే పోయే దురదకాదు
    ఇదిఒక వ్యసనం,

    నిర్టపా వ్రత సిద్ధిరస్తు, కామెంట్లకి మన్నాలేదుగా :)

    ReplyDelete
  3. మన శర్మ గారన్నట్లు ఇది గోక్కుంటే పోయే దురద కాదు , వ్యసనమే మరి ఆస్వాదించలేనివారికి .

    ReplyDelete
  4. Very Nice :)
    Cheers Jilebi gaaru :) :D

    ReplyDelete