'బాబా బ్లాక్ షీప్ హేవ్ యు ఎనీ వూల్ అంటే, ఎస్ సర్ ఎస్ సర్ త్రీ బాగ్స్ ఫుల్ ' ఇందులో నిగూఢ మైన అర్థం దాగి ఉన్నది ' తన బవిరి గడ్డాన్ని దువ్వుకుంటూ చెప్పారు బాబా బ్లాక్ షీప్ ఆనందా స్వామి వారు.
జనవాహిని 'ఆహా ' అని స్వామి వారి ప్రసంగో పన్యాసాన్ని వినడానికి ఉత్సుకతో 'జై బోలో స్వామీ షీప్ ఆనందా మహారాజ్ కీ' అని దీర్ఘ ఘోష పెట్టేరు .
స్వామీ వారు చేయెత్తి అందర్నీ తడుము తున్నట్టు చెయ్యూపుతూ ఆశీర్వదించేరు !
భక్తుల కళ్ళలో కన్నీళ్లు తప తప మని రాలేయి . ఆహా స్వామి వారికి ఎంత 'అవ్యాజ మైన' 'ఘాటు' 'గోటు' ప్రేమ మన మీద అని వారు అనందం తో తడిసి ముద్దయ్యేరు .
స్వామీ వారు తమ ప్రసంగాన్ని కొనసాగించేరు .
భక్త 'శిఖా' మణులారా ! త్రీ బేగ్స్ అనటం ఎందుకు ? చార్ బాగ్ అని ఉండ వచ్చు కదా ? కాదె ! త్రీ బేగ్స్ అనే చెప్పారు ! దీని లో నిగూఢ మైన అర్థం ఏమిటి ! అని మళ్ళీ బవిరి గడ్డం తడి మేరు .
జనవాహిని కి ఈ మారు ఏమి చెయ్యాలో పాలు పోలేదు జై కొట్టాలో లేదో తెలియ లెదు.
స్వామి వారు అన్నారు.... త్రీ బేగ్స్ అనగా, ముక్కంటి ఈశ్వరుడు . త్రీ బేగ్స్ అనగా మూడు గుణములు సత్, రజో తమో గుణములు అన్నమాట త్రీ బేగ్స్ అనగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు . త్రీ బేగ్స్ అనగా గాయిత్రి .
ఇట్లా సర్వం 'త్రిభువన భూషితం' ! అంతా 'త్రీ' లో నే ఉంది
one for my master అనగా నేమి ! ఆ పరమ ప్రభువు ! one for the dame అనగా నేమి ! ఆ పర దేవత ! one for the little boy down the lane ' అనగా ఎవరు ?
ఎవరూ ఎవరూ 'జై బోలో బ్లాక్ షీపా నందా స్వామీ వారికీ !"
బాబా వారు బవిరి గడ్డం తడిమేరు ! 'ఎవరు' అంటూ కళ్ళ లో చమక్కు చూపిస్తూ అడిగేరు .
జై జై జై అంటూ జనవాహిని ... ఇంకెవరు మన బాబా గారే ఆ లిటిల్ బాయ్ డౌన్ ది లేన్ !' అంటూ కర ఘోష ఆ హాలు ప్రతిధ్వనించే లా చేసేరు .
స్వామీ వారి శిష్య పరమాణువులు భక్తులందరికీ మూడు మూడు బాగులు ఇచ్చేరు ... ఇందులో మీరు మీ కానుకలు చెల్లించ వచ్చు ! అంతా స్వామీ వారి ముందు పెట్టండి . స్వామీ వారు పరమ ప్రభువు వాటా, పరదేవత వాటా, తమ వాటా అంతా సరి సమానంగా పంచెదరు '
జనవాహిని ఎగ బడ్డది ! స్వామీ వారు అక్కడే ఉన్న గొర్రె నెక్కి 'వాహన' స్వామీ వారి గా మారేరు !
కథ కంచి కి మన మింటికి !
వెల్కం బెక బెక !
జిలేబి ఈజ్ బ్యాక్ అగైన్ !
చీర్స్
జిలేబి
Ha :-) ha :-) no comments
ReplyDelete
ReplyDeleteఇదే కదా ఈ నాటి గురు శిష్య బంధం , అలా స్వామివారిని అర్ధం చేసుకొని ఎలా రాబట్టాలో ఆ దిశగా అడ్గూలు వేస్తుంటుంటారు . చక్కగా సెలవిచ్చారు .