Thursday, November 7, 2013

జిలేబి కవితా గోల !


హమ్మయ్య అనుకుని ఈ వాల్టికి ఏదైనా రాసి బ్లాగు పోష్టు ముఖం లో పడేసి ఎంచక్కా ముసుగు తన్ని నిదుర పోతే, పోష్టు లు చదివే వాళ్ళు వాళ్ళ తంటా వాళ్ళు పడతారని ఓ నాలుగు వాక్యాలని కత్తిరించి నిలువుగా నాలుగు పదాలు గా పేర్చేసి వావ్ వావ్ నా ఇవ్వాళ్టి కవిత తయారై పోయిందోచ్ అని బుగ్గ న వేలు పెట్టేసుకుని మహదానంద పడి పోయా , నా పద కవిత ని నేనే మెచ్చేసు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివేసు కుంటూ !

వెనుక నించి అయ్యరు గారు డ్రాఫ్ట్ పేడ్ లో తలబెట్టి , ఏమోయ్ జిలేబి ఏమి రాస్తున్నావ్ అన్నారు !

ఆయ్ ఇవ్వాళ్టి నా కవిత ! అసలే మీకు తెలుగు అర్థం కాదు . మరి ఇది చదివి ఏమి అర్థమవుతుంది మీకు లెండి అన్నా కొంత వీరిని గీచి చూద్డా మని పించి . అయ్యరు గారిని గోకితే గాని రత్నాలు రాలవాయే మరి జిలేబి కి !

మాత్రా సమకం లేదోయ్ అన్నారు కూడబలుక్కుని చదివేసి !

ఏమి లేదు ?

మాత్రా సమకం !

మాత్ర? బీపీ మాత్రలు ఏమైనా ఎక్కువయ్యా యా ఏమిటి మీకు ? మాత్రలు గట్రా అంటున్నారు ' అడిగా నిజంగా నే వీరం టున్నారా లేక 'గాలి' పీకుతున్నారా అని సందేహ పడి పోయా కూడాను !

అవునోయ్ మాత్రా సమకం లేదు ఖచ్చితం గా .

సరే వీరిని ఒకమారు ఆట పట్టిద్దా మని అక్షరాలని తారు మారు చేసి మళ్ళీ నా కవితా పటిమ ని చూపించా .

ప్చ్ యతి దోష ముందోయ్ అన్నారు ఈ మారు .

అదిరి పడ్డా ! ఈ యతి దోషం గట్రా మనకు తెలియ వాయె !

ఎక్కడ ?

'ఆది అంత్య రెండులో ను ' మళ్ళీ టాం అని రిటార్టు ఇచ్చేరు పరిశీలించి !

'ఇదిగో అయ్యరు గారు యతి గీతి మనకీ జానతా నాయ్ ! ఏదో పదాలని విరగ్గోడితే అదే మా కవిత '

'సరేలే జిలేబి ; నువ్వు రాసే నాలుగు ముక్కలు చదవడానికి టీం పాస్ టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇట్లా బాధ పెట్టడం నీకు తగునా ? '  మళ్ళీ అయ్యరు గారు ప్రశ్నార్థకం గా ముఖం పెట్టేరు .

దీర్ఘ ఉచ్చరిక తో ఓ హ్రస్వ అక్షరం కలిపి హూమ్ అన్నా !

సరెలేవే ! నీ రాతలు కోతలు నీవే ! చెప్పే వాళ్ళు వినే వాళ్లకి లోకువ అని ...


చీర్స్
జిలేబి
 

14 comments:

  1. అయ్యరుగారికి తెలుగేరాదన్నారు, మీదగ్గర నేర్చుకుని ఉంటారు, మాత్రా ఛందస్సు దాకా చెబుతోంటే :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      అంతా శ్యామలీయం వారి మాయ !

      నెనర్లు
      జిలేబి

      Delete
  2. జిలేబీ అసాధ్యురాలన్నది నిరూపించుకున్నారు మరొకసారి.
    నిన్నటి నా వ్యాఖ్య ఒకదానిని ఒడిసి పట్టుకుని దాన్నించి ఒక టపా లాగారే!
    బ్రహ్మాండం!

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం గారు,

      కనబెట్ట లేరనుకున్నా!| వామ్మో ! మీరు మరీ ఐటీ మానవులే ఖచ్చితం గా సుమీ !!

      జిలేబి

      Delete
  3. అయ్యరు గారూ జిలేబీ గారూ ఇద్దరూ ఒకరే గదా త్వమేవాహం లాగా. అయ్యరు గారు మాత్రా సమకం గురించి మాట్లాడడంలో హాశ్చెర్యమేముంది?కదా జిలేబీ సారూ!

    ReplyDelete
    Replies
    1. హరి బాబ గారు,

      జిలేబి సారూ అన్నారు కాబట్టి అయ్యరు మామి అనాలేమో మరి నేను !

      త్వమేవాహం ! 'నాటీ' చార్మీ- నాతి చరామి !!

      జిలేబి

      Delete
  4. తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి!చూస్తే అత్తారింటికి దారేదే చూడాలి!చదివితే జిలేబి కవిత్వమే చదవాలి!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      నెనరస్య నెనరః జిలేబీ నామ్యాః !!

      ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి

      జిలేబి

      Delete
  5. Chaalaa chaalaa sweetgaa undi..jilebilaa mee post:-):-):-)

    ReplyDelete
    Replies

    1. ఎగిసే అలలు గారు,

      నెనర్లు మీ అభిమానానికి !!

      జిలేబి

      Delete
  6. ఏదో కవిత ఉంటుందని వచ్చి బాగా నిరుత్సాహ పడ్డా. నేను deeply hurt!

    ReplyDelete
  7. మాత్రా సమకం, యతి దోషము ఇవన్నీ ఏమిటండీ కొత్తరకం అరవ వంటలా? నాకు తెలిసి అయ్యారు వారికి వంట తప్ప ఇంకేమీ రాదు :)

    ReplyDelete
    Replies
    1. గొట్టిముక్క్లలవారూ
      మాత్రాసమత అనేది కవిత్వానికి గాన యోగ్యత కల్పించటంలో చాలా ముఖ్యమైన పాత్రవహిస్తుంది. సాంప్రదాయిక ఛందంలో చాల వరకు ఇది సులువుగానే కుదురుతుంది. వచన ఛందాల్లోకి వచ్చేసరికి గానయోగ్యత కాస్తా పఠనీయతగా మారుతుందని అనుకున్నా, ఒక లయ అనేది అంతర్లీనంగా పాదాలమధ్య సాధించాలని భావించే సందర్భాల్లో ఈ మాత్రా సమత పాటించటం అవసరం.

      ఇకపోతే యతి అనేదాని గురించి. ఒక కవితలో పాదం ఎక్కడ విరగాలీ, ఎలా విరగాలీ అనేది ఛందస్సు నిర్ణయిస్తుంది. ఆధునికకవితలో ఐతే కవి లయ అనేదాని మర్మం తెలిసినవాడైతే అది సులువుగానే నిర్ణయించుకుంటాడు. ఇతర కవుల గురించి ఇక్కడ విచారం లేదు. ఈ పాదం అనేది విరిగే స్థానం స్థూలంగా యతిమైత్రిస్థానం. సంస్కృతభాషామర్యాదను తీసుకుని కేవలం విరుపు సరిపోతుందని వచన కవిత విషయంలో కవి నిర్ణయించుకోవచ్చు. లేదా, తెలుగుభాషాకవిత్వమర్యాదని తీసుకుని అక్షరమైత్రి పాటించవచ్చును. కవి ఇష్టం. కాని తెలుగు పధ్ధతిలో వ్రాసేటప్పుడు అక్షరమైత్రి కుదరకపోతే అది యతిదోషం. సంస్కృతభాషామర్యాదను తీసుకుంటే అక్కడ పదం విరుగక పోతే అది మరొక రకమైన యతిదోషం. వచన కవితల్లో పదం విరగటం అనేది ప్రధానంగా తీసుకోవటమే సబబు.

      Delete
    2. Sir, I was just pulling Mr. Iyer's leg!

      Delete