Saturday, November 9, 2013

జిలేబి నువ్వు చచ్చావా లేక బతికే ఉన్నావా ?


'జిలేబి నువ్వు చచ్చావా లేక బతికే ఉన్నావా ? ' అయ్యరు గారు అడిగేరు .

ఏమండీ మీ ముందర నిమ్మళం గా నిలబడి ఉంటె చచ్చావా అంటా రేమిటి ?

నేను కాదోయ్ మీ బ్యాంకు వారు నిన్ను రమ్మన్నారు

ఓహ్ చలో 'సేటు బేంకు' కి - 'సేటు బేంకు మీ బ్యాంకు అనబడే మా  బ్యాంకు కి వెళ్ళా .

అదిన్నూ బాతాఖానీ ఫణి బాబు గారి టపా చదివాక వెళ్ళా కాబట్టి ఎక్కువ గా ఎక్స్ పెక్టేషన్ ఏమీ లేదు !

నెక్స్ట్ అంది అక్కడ ఉన్న డెస్క్ దేవరి .

మీ పేరు ?

జిలేబి

కిసుక్కుమని నవ్వ బోయి మరీ ఆపెసుకుంది నవ్వుని ఆ కౌంటరు కనకాంగి .

వయస్సు ?

స్వాతంత్ర్యం వచ్చిన వయస్సమ్మాయ్ జెప్పా

ఇంకా బతికే ఉన్నారా ?

సోరాజ్జెం బతికే ఉందమ్మాయ్ అన్నా .

నేనడుగు తుంట మీ గురించి ఆ తుంటరి కస్సు మన్నది .

అబ్బే నీ ముందర ఉన్నా కదమ్మాయి  అన్నా .

సర్లెండి ఈ ఫారం లో సంతకం చేయండి .

సంతకం జేసా .

టాలీ కాలే ' టాట్ టాట్ అన్నది ఆ తారామణి .

ఏమిటి తల్లే టాలీ కాలే ?

సంతకం !

ఏమి జెయ్యను ?

మునుపటి సంతకం పెట్టండి

మునుపటి సంతకం ఎట్లా పెట్టడం ?

ఇదిగో అమ్మాయ్ మీరిచ్చిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎ టీ ఎమ్ గట్రా లతో సంతకం బెట్టి చాలా రోజులయ్యింది అసలు ఇప్పుడు ఉన్న లోకం లో చేతి తో లేఖ రాసే చాలా సంవత్సరా లయ్యింది అసలు నా చేతి వ్రాత గుండు గుండు గా ముత్యంలా ఉండేది ఈ ఈ-మెయిల్ ల పుణ్యమా అని కాస్తా జిలేబీ లా తయారయ్యింది - ఏమి చెయ్య మంటావ్ చెప్పు  అన్నా .


మీరు మీరేనా ?

అవును !

సరే మీకు తెలిసిన వాళ్ళ దగ్గిర సాక్షి సంతకం పెట్టించండి ...

జుట్టూ కలయ జూసా .

తెలిసిన ముఖం ఒక్కటీ కనబడ దేమిటి !

ప్చ్ ...

మనుషుల లోకం నించి మొబైల్, ఎసెమెస్ , ఇంటర్నెట్ బాంకింగ్ లోకానికి వచ్చేసాక అస్సలు మనుషుల ముఖమే చూడడం తక్కువై పోయే  ఇక తెలిసిన ముఖం ఎట్లా తెచ్చేది ?

అమ్మాయి , మీ బ్యాంకు వారి ఆన్లైన్ బ్యాంకు లో లాగిన్ అయి జూపిస్తా అప్పుడైనా ఒప్పేసు కుంటా వా నేను నేనే నని  ?

ఆ అమ్మాయి కాస్తా సందిగ్ధం లో పడ్డది .

అట్లాంటి వెరిఫికేషన్ పద్ధతి లేదండీ !


పోనీ అమ్మాయ్, మీ సాఫ్టు వేరు నించి ఒక ఎసెమెస్ నా మొబైల్ కి కొట్టు . మీ ముందరే ఆ ఎసెమెస్ కి నేను రిప్లై కొడతా ! చాలెంజ్ చేశా ..

ప్చ్ అట్లాంటి వెరిఫికేషన్ లేదండీ !

పోనీ మీరంతా ఎలెక్ట్రా నిక్ లోకం లోకి మారి పోయేరు కదా ఇప్పుడు మరీ పాపులర్ గా ఉన్న ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగించ రాదూ నేను నేనే నా బతికి ఉన్నా నా ఒక్క క్షణం లో తెలిస్ పోయేది అన్నా ఘాటు గా

ఇంకా అట్లాంటి టెక్నాలజీ రాలేదండీ మాకు !
హూం మరీ త్రిశంకు స్వర్గమే ఇది ...

మరో క్షణం లో రూపం మార్చేసా ..  సూరే కాంత మయి పోయా ...

పిండా కూడు, బ్యాంకింగు పద్ధతులు మారేయి గాని వెరిఫికేషన్ పధ్ధతి మార లేదేంటి మరి !! అంటూ ఇంతెత్తు కి ఎగిరా ... గయ్యాళి ఐ పోయా మరో నిమిషం లో .... లేడీస్ కి రెస్పెక్ట్ మీ బ్యాంకు లో లేదని ఆ మేనేజర్ ముందే ధర్నా చేశా ...

వెంటనే

సర్లెండి మీరు మీరే ! కాళ్ళ బేరానికి ఒచ్చేసేరు ...

హమ్మయ్య ఏ వెరిఫికేషన్ లు కొత్త పద్దతులు వచ్చినా ఇంకా సూరే కాంతం పధ్ధతి అట్లీస్ట్ మా ఆండోళ్ళ కి పనికి వస్తోన్నందుకు సూరేకాంతానికి నమో వాకాలు తెలియ జేసేసు కున్నా !!


జిలేబి 

16 comments:

  1. అనుకున్నా, మీరిది వ్రాస్తారని.
    ఐనా, సూరేకాంతం మాటకు తిరుగు లేదు.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం వారు నమో నమః ! ధన్యవాదాలు !

      వెరీ హ్యాపీ మీ ఎదురు చూపుని నేను పూరించి నందులకు !!

      చీర్స్
      జిలేబి

      Delete
  2. ఆ కౌంటర్లో చాయాదేవి ఉంటే, ఏం చేసేవాళ్ళు?

    ReplyDelete
    Replies
    1. ఇద్దరి కిద్దరే! సరిజోడీ.

      Delete

    2. అబ్బే, చాయాదేవి చాయా దేవే ! సూరే కాంతం సూరే కాంత మే !

      జిలేబి

      Delete
  3. కీలెరిగి వాత పెట్టమనే సామెత మీనుంచే నేర్చుకోవాలి.

    ReplyDelete
    Replies

    1. హరేఫలా గారు (బాతాఖానీ గారేనా ?)

      అంతే కదా ! పాలిసీ పనికి రాక బోతే , ఫేడేల్ మని రెండు బాదుళ్ళు ! అన్నీ సరి దిద్దు కుంటా యి !!

      జిలేబి

      Delete
  4. ఏమండీ, మీరు మీరేనా అని అడిగితే లేడీస్ కి రెస్పెక్ట్ మీ బ్యాంకు లో లేదని ఆ మేనేజర్ ముందే ధర్నా చేస్తారా?
    అందుకే లేడీస్ ని చూస్తే భయం వేస్తుంది……….. :-P

    ReplyDelete
    Replies

    1. బాల గారు,

      భయ పడకండి ! మానవ మాత్రులమే అయినా కూడా !!

      జిలేబి

      Delete
  5. Replies
    1. మూర్తి గారు,

      నెనర్లు !!

      జిలేబి

      Delete
  6. super shot. tit for tat

    ReplyDelete
    Replies
    1. ఆహా , పురాణ పండ ఫణి వారు,

      బహుకాల దర్శనం ! ధన్యవాదాలు !!

      జిలేబి

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. వచ్చే నవంబర్ నాటికి
    వామ హస్తం లో
    అప్పడాల కర్ర పట్టుకొని
    మరీ దులిపి పారేయండి!!

    ReplyDelete