Wednesday, October 29, 2014

'నరేంద్రుని' తరువాయి భావి భారత ప్రధాని - దేవేంద్ర ఫడ్నవీస్


'నరేంద్రుని' తరువాయి భావి భారత ప్రధాని - దేవేంద్ర ఫడ్నవీస్ 

అక్టోబరు 29 2014 -->

మహారాష్ట్ర రాజకీయ చరిత్ర లో అతి ముఖ్య మైన మార్పు - భాజపా ప్రభుత్వ రాక.

ఈ రాక కూడా ఆషామాషీ రాక కాదు.

నా కెందుకో ఆర్ ఎస్ ఎస్ కన్నా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్న పూర్తి పేరు తో నే వీళ్ళు పిలవ బడాలని ఉంటుంది - ఆ ఆర్ ఎస్ ఎస్ అన్న షార్ట్ ఫార్మ్ తో వారి అతి కీలక మైన 'స్వయం సేవక్' అన్న వారి ముఖ్య మైన , కీలక మైన ప్రశంసాత్మక మైన , శ్రద్ధా, నిబద్దత కలిగిన ట్రైనింగ్ మరుగున పడి పోతుందని అని పిస్తుంది . 

రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ తన పరిధి ని దాటి భాజపా కి సరి కొత్త తరపు నేతల్ని - సుశిక్షిత నేతల్ని  భాజపా కి ఇవ్వడం ఇది మరో మారు విజయపు వీచిక వైపు సాధించిన మరో ప్రయాణం . నరేంద్రు ని తరువాయి దేవేంద్రుడు !

జిలేబి ఈ సందర్భం లో ఇదే వ్రాయు రాబోవు కాలపు 'జిలేబి జ్ఞానం - నరేంద్రుని తరువాయి దేవేంద్ర ఫడ్నవీస్ భావి భారత ప్రధాని . నరేంద్రుడు తన డబ్బైవ వయస్సు తరువాయి దేవేంద్రుణ్ణి ప్రధాన మంత్రి చేసి మినిస్టర్ మెంటార్ రోల్ అందుకుంటా డని జిలేబి కాల జ్ఞానం 

మహారాష్త్ర ముఖ్య మంత్రి గా ప్రస్తుతానికి,
రాబోయే కాలపు భారత ప్రధాని 
దేవేంద్ర ఫడ్నవీస్  కి శుభా కాంక్షల తో 
 
శుభోదయం 
జిలేబి 

8 comments:

  1. అలా కాదేమో?హరి కాలం నుంచి భావి కాలం లోకి తొంగిచూస్తే నేను రాజకీయాల్లోకి వెళ్తానేమో!భావి భారత ప్రధాని ఆంధ్రా నుంచి రావచ్చునేమో?!

    ReplyDelete
    Replies
    1. ప్రధాని అయ్యే సీన్ తెలుగువారికి ప్రస్తుతం లేదు. భావి తెలుగు ముఖమంత్రులు బిజెపి నుంచి వస్తారు. ఒక్క నాలుగేళ్లు ఓపికపట్టండి తెలంగాణ లో,ఆంధ్రాలో పరిస్థితులు ఎలా తారుమారౌతాయో!

      Delete
    2. అంటే ఒకే దేశం ఒకే బీజేపీ నో ప్రతిపక్షం అనే భాజపా ప్లాను అమలు జరుగుతుందంతారా?ఈ ఇద్దరు బుద్ధూల వరస చూస్తుంతే నాకూ అలాగే అనిపిస్తున్నది లెండి!

      Delete

    3. హరి బాబు గారు,

      మీరు నిజంగా రాజకీయం లో కి దూకేద్దా మనే అనుకుంటున్నారా !!

      జిలేబి

      Delete

    4. యు జి శ్రీనివాస్ గారు,

      అదేమిటండి అట్లా అంటారు పీ వీ నరసింహా రావు గారు తెలుగు వారే కదా ? వారు ప్రధాని కాలేదా ??

      రెండు ఎప్పుడూ నార్త్ వాళ్లే ప్రధాన మంత్రులు అవ్వాలా ?? ఎందుకు దక్షిణ భారత దేశం పట్ల ఇంత నైరాస్యత !

      జిలేబి

      Delete
    5. మీరు నిజంగా రాజకీయం లో కి దూకేద్దా మనే అనుకుంటున్నారా !!
      >>
      వూర్కే,సరదాగా అన్నా!వెళ్ళే ఆలోచన వస్తే ముందుగా మీకే చెప్తా:-)

      Delete
  2. మీ జిలేబి జ్ఞానం బాగానే ఉంది కాని, మెజారిటి లేని ఈ ముఖ్యమంత్రిని అయిదేళ్ళూ పదవిలో ఉండనిస్తారా అని?
    అన్నట్టు మీరూ మా బెంగళూరు వారేనా?

    ReplyDelete
    Replies

    1. బోన గిరి గారు,

      పదవి వీర భోజ్యం ! వేచి చూడ వలె మరి !!

      బెంగళూరు మహా నగరం మనదే నండీ !!

      జిలేబి

      Delete