దెబ్బకు టా , బ్లాగు కి మూత - :)
మొత్తం మీద ఆ మధ్య పరిచయం చేసిన 'ఒక మంచి బ్లాగు పరిచయం' దెబ్బకు టా, దొంగల ముటా అన్న చందాన మూత బెట్టేరు . అంటే పూర్తిగా మూత బెట్టినట్టు కాదనుకుంటా . అదేమిటో 'పాసు' 'వారుడు' వారిస్తే గాని అందులో దొంగల ఖజానా ఏమిటో తెలీకుండా పెట్టేసేరు ! కష్టే ఫలే వారి ప్రయత్నాలు ఫలించేయి !
సో, ఇప్పుడు తాళా ల వెనుక మరీ సేఫ్ గా కాపీ కౌపీనం లాగించ వచ్చు ఎవరికీ ఇక అభ్యంతరం ఉండదను కుంటా !
-౦
ఇక మన మోడీ గారి మాటకు వస్తాం ! మా మీడియా వాళ్ళు వరసబెట్టి రెండు వారాలు గా నమో మోడీ జపం చేసేరు . అమెరికా లో జుట్లు పీక్కున్నారు ! జట్లు జట్లు గా వార్తా లాహిరి లాగించేరు ! సర్దేశాయ్ గారేమో మరీ మోడీ వాహిని తో కుస్తీ కి దిగేరు .
మోడీ గారేమో , 'మంగళ' జపం చేసేరు . ప్రతి మీటింగు లో నూ చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పినా , జనాలు అదే జోకుల కి మళ్ళీ మళ్ళీ అలవాటు పడ్డా ప్రతి సారీ చప్పట్లోయ్ తాల్ మే తాల్ మిళాయించేరు .
-)
మధ్య లో - సందులో సడే మియా అంటూ మా యమ్మ - ముద్దుల యమ్మ - ని కోర్టు వారు లోపలి కి నెట్టి తాళాలు పెట్టేరు . దరి దాపుల్లో రెండు దశాబ్దాల కథ కి ఓ ట్విస్టు ఇచ్చి అమ్మ ని దశరా సమయం జూసి కర్నాటకం లో (కర్నాటకం లో దశరా అంటే ఇక అన్నిటి కీ తాళాల సమయం అని అందరికి తెలిసిన విషయమే మరి ! ) కోర్టు నడిపి అగ్ర హారం లో చేతికి హారం వేయించేరు ఇక్కడా తాళా లే మరి !!
అరవ దేశం లో పని లేక రమణ గారి మాటల్లో చెప్పాలంటే 'గృహిణుడి' రాజ్యం మొదలయ్యింది !
-)))
ఆయ్ మా రాజ్యం కాని వారి విగ్రహాలు మాకు వద్దే వద్దు - వాళ్ళని ఆంధ్ర ప్రదేశ్ కి పంపేస్తాం అంటూ ఒక చంద్రుడు తాళం పెడితే , మరో చంద్రుడు గొప్పో ళ్ళం దరూ మా వాళ్లే అంటూ వారికి తాళం మేం వేస్తాం అన్నారు !
-+)
సరే స్వచ్చ అభియాన్ అంటూ మళ్ళీ మోడీ గారు 'రోడ్డున' పడ్డారు . దేశం లో కల్మషానికి తాళా లు పెట్టండి అంటూ నినాదం ఇచ్చి, కొద్ది గా సేఫ్ గా, ఇది నా డ్యూటీ కాదు, మా మినిస్టర్ల డ్యూటీ కాదు, మా అధికారుల డ్యూటీ కాదు , ప్రజ లారా , ఇది మీ అందరి డ్యూటీ - అంటే శుభ్రం గా దేశాన్ని ఉంచడం మీ కర్తవ్యమ్ అంటూ 'కిం' కరోతి' అన్న చందం గా తాళాలు జనవాహిని కి అందించేరు !!
-+))
మరో మారు రేడియో పెట్టె లకి జనాలు తాళాలు ఊడ బెరి కేరు . దుమ్ము పట్టి మూల పడి ఉన్న రేడియో కి మళ్ళీ మోక్షం వచ్చింది . గొంతు పూడి పోయిన రేడియో కి మళ్ళీ ఊపిరి వచ్చి మోడీ గారి 'మన్ కీ బాత్ - దిల్ కీ బాత్ తో బకాళా బాత్ మేళ మాడింది !
సో, జనులారా ! ఇవ్వాళ్టి తాళా ల టపా ఇంతటి తో సమాప్తం !
మీరూ మీ మీ ఐడీ లతో గూగుల్ వారి తాళాలు విడదీసి , కామెంట్ల వరదలు కురిపిస్తారని ఆశిస్తో !!
'తాళా' తపేలా
జిలేబి
(చాయ్ కే సాత్, జిలేబి కీ వికాస్ )
చెంబు పుచ్చుకు బయల్దేరేవారంతా చీపురుచ్చుకొని బయల్దేరాలన్నమాట...దహా.
ReplyDeleteబాగుందండి .. మనవారి "తాళాల" గోల
ReplyDeleteతాళాల వెనకఏమయినా చేయచ్చు... :)
ReplyDeleteతాళాల టపా బాగుందండి.
ReplyDeleteరెండు రోజుల క్రితం మరో హఠాత్ పరిణామంలో ఎంతో పోప్యులర్ గా నడుస్తున్న "పని లేక" బ్లాగు డాక్టర్ గారి సంచలనాత్మక నిర్ణయం చదివే ఉంటారు కదా - అక్టోబర్ 6 న వ్రాసిన "నా బ్లాగులో మార్పులు" అనే పోస్ట్ ద్వారా డా.రమణ గారు తన బ్లాగులో కామెంట్ల ఆప్షన్ కి తాళం పెట్టేసానని చెప్పారు. అది చూడగానే వారి బ్లాగు అభిమానులు నిరాశ వ్యక్తపరుస్తూ తమ బ్లాగుల్లో పోస్టులో / వేరే బ్లాగుల్లో కామెంట్లో పుంఖానుపుంఖాలుగా వ్రాస్తారనుకున్నానే. నాకు స్వంత బ్లాగు ఉన్నట్లయితే నేను తప్పక వ్రాసేవాడిని. లేకపోవటంతో నా కామెంటు వ్రాయటానికి మీ బ్లాగు ఎన్నుకున్నాను ఏమనుకోకండి (ఎలాగూ మీ బ్లాగులో తాళాల టపా మీరు వ్రాసుంచారు కదా అని).
రమణ గారి విషయానికొస్తే, ఆయన బ్లాగు ఆయన ఇష్టం అనుకోండి, కాని కామెంట్లు లేని బ్లాగు (టపాల మీద చర్చలకు అవకాశం ఇవ్వకపోవటం వలన) ఉప్పు లేని వంట లాంటిది అనిపిస్తుంది. శ్యామలీయం గారు ప్రభృతులు కామెంట్ల గురించి నచ్చజెప్పటానికి ప్రయత్నించినా డాక్టరు గారు మరీ సున్నితం అనుకుంటాను. వారి 6వ తారీఖు టపా క్రింద Reactions లో "బాలేదు" అనే వర్గం రోజు రోజుకీ పెరిగిపోతోంది. అది చూసైనా రమణ గారు తన నిర్ణయం మార్చుకుని తాళం తీసేస్తారని ఆశిద్దాం.