Tuesday, February 9, 2016

బండెనక బండి కట్టి :)

బండెనక బండి కట్టి :)
 
బండెన్న బండి కట్టి
పదహారు బళ్ళు కట్టి
నీవేడ ఉంటి వయ్యో
బండోళ్ళ గురువు లయ్యో
 
బండెనక బండి మీద
పదహారు బళ్ళు మీద
పడుసూల పలుకులాట
పలుకూల పలువరుస
 
నీవేడ ఆగితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
నీవేడ నిలిచితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
బండెనక బళ్ల దారి
బళ్ళెళ్ళే ముళ్ళ దారి
దారెంతో దూర మల్లె
బారమయెర రాదారి
 
నీవేడ కునికెదవో
బండోళ్ళ గురువులయ్యా
నీవేడ ఓరిగితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
(డా: అనసూయా దేవి గారి జానపద గేయాలు పుస్తకము నించి)
 
జిలేబి

8 comments:

  1. అద్దిరబన్నా!ఇది గద్దరు నోటబడి ఎర్రబారి నిజాముకు గోరీ కట్టిందిగా!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్తున్నా పాట నలభయ్యో దశాబ్దంలో రాసింది అప్పటికి గద్దర్ ఇంకా పుట్టలేదు అనసూయా దేవి గారి సంగతి తెలీదు.

      Delete
  2. నిండింద బుర్ర తిక్కా
    తుండెయ్యి తలను చక్కా
    బండెనక బండి లెక్కా
    ఆండాళ్ళ కెరుక చక్కా

    చండించి జ్యాద అక్కా
    దండించ వలదు పక్కా
    పిండాను దినుసు చెక్కా
    వండాను పదము చక్కా


    టైటిల్ చూసి నాకేదో
    మూడిందనుకున్నా !!
    చివరంటా చదివి
    అమ్మ 'ya' కనుగొన్నా !!!
    'అమ్మ' yo! అనుకున్నా !!!

    lol ...

    ReplyDelete
    Replies
    1. బండి గారి ఉలికిపాటున్ను సహజమే ,
      మొదట బుర్ర తిరిగి - కుదుటబడెను ,
      మన జిలేబి గారు మారిపోయారండి
      వారి గురువు సాక్షి వారిజాక్షి .

      Delete
    2. @ వెంకట రాజారావు . లక్కాకుల

      పట్టెడు జిలేబీలెట్ట తల
      పెట్ట తల్లి జిలేబీ అయ్యో! సరి
      పట్టక తల పెట్టక పొడ
      గిట్టక వంకలెట్టుదురయ్యో అన్యాయమిది !


      ఆ మధ్య జాగ్రత్త సుమీ బహు పరాక్ అని అదిలించారు
      ఇంతలోనే బహు చక్కగా ఫర్లేదంటూ నోట పలికించారు
      ఏమైనా మీ పండితులంతా ఒకటేనండీ ... ఒకటే మండీ ...

      లక్కాకుల వారూ కేవలం సరదాయేనండీ,
      ఆవిడ నిజంగానే మారిపోయారుటండీ ?! ...

      ఫర్లేదులేవోయీ ...
      ............... అని మీరు భరోసా ఇస్తే
      ఓ చిన్న రుబాయీ ...


      బ్లాగు బ్లాగున వెళ్లి పేరు పేరున గిల్లి
      చీర్సు చివరన అల్లి శకునమిచ్చెడి బల్లి
      మారునా మది మళ్ళి మారునా మన తల్లి
      రాదుగా ఇటు మళ్ళి మరి కానుగా నే హళ్లి !!!

      ::::---))).)..))...)))
      jk.jf.lol...

      Delete
    3. పండితుల బండి నెక్కిరి ,
      నిండా గణ యతుల మునిగి నీరై యున్నా
      రండీ , సమయాభావము
      కండూతికి బండిరావుగారూ ! సమజా ?

      Delete

  3. జై బోలో గురు మహారాజ్ కీ :)

    నీదు నిరంతర వ్యాఖ్యలు
    నీదు కలహ నారదాయ నిరుపమ దరువూ
    నీదు ప్రకటన కుతూహల
    మూ దురదయు నేమి విషమము జిలేబి భళీ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete