Saturday, April 9, 2016

జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


వడివడి చదువగ పదముల నటునిటు గుదురుగ వేసితి యీ వ్యాఖ్యను ఓ వాద్యమ్ముగ గావన్ !
బడబడ నటునిటు తిరుగుచు చకచక పనులను చాకువలే భార్యయు గాపాడన్, మరి సోఫా
నటునిటు జరుపుచు కుదురుగ జలజల నడకలు గూడన, “ఓహ్! నా,పని రాణమ్మా ” యని ఓ నా
డటు బిలువ మరి మురిపెము గొనెను గద! పెనిమిటి తోడను నీ డంగగు పాడన్రా యన, “పోడా”
సడి వలదని యరవపు సరి చెణుకుల విసిరె జిలేబి! సదా సౌమ్యము గా సాగాల మదీశా !


***

కుదురుగ నొకరికొకరు నిటు పరిమితముగ గదియే గుడిగా కూర్చుని నీకున్నూ మరిమాకూ
యిది సరస సమయమనుచు గడుపుదము విను !రమణీ !నిజమే ఈ రవి సాయిత్తే మనదోయీ !
విధిగను వినుదము నతని పలుకులను !మనలకు మేలుయనన్ వీరుడు గావించే నిది సువ్వీ !
గదిన మనము కులుకు చిలుకలవలె పరవశముగా నిటు యీ కాలము ఓంకారంబని రాగా
ల ధునిగ కలకలముల గనగ సరసపు పలుకులన్ మురిపాలాటల వేళాయే జవరాలా !



జిలేబి
(త్రిభంగి)

4 comments:

  1. Namaste! Could you plea add my blog in your aggregator?

    http://therateeyagaraadaa.blogspot.com.au

    Thank you.
    Sri.

    ReplyDelete
    Replies
    1. శ్రీ ! తెర తీయగ రాదా ! వారికి !

      డన్.

      జిలేబి

      Delete
  2. మరి మరి చదువగ చేసే పద్యము కని కని కవనము పలుకులు సతిని మెచ్చుట మచ్చుతునక మీ మతమునకున్....

    ReplyDelete
  3. Thank you Zilebi garu!, for adding my blog to your aggregator.

    ReplyDelete