శ్రీ కష్టే ఫలే !- వడియాలు - 'కండ' కావ్యం !
బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శ్రీ శర్మ గారు,
మీ మే ఇరవై అయిదు తారీఖు తారీఫ్ :)
మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!)
ఇది సరిగ్గా ఓ యాభై నాలుగు సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు.
సో , మీ కిదే , యాభై నాలుగు వసంతాల గ్రీటింగ్స్!
మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయులై మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.
శ్రీ కష్టే ఫలే బ్లాగు లోని వడియాల టపా ఈ 'కండ' కావ్యానికి స్పూర్తి !
****
కష్టే ఫలే -వడియాలు -'కండ' కావ్యం !
---------------------------------
బండగ గాడిద గంపెడు
తిండియు వోలెన్ తినంగ దిటవు గలుగునా !
నిండుగ, చూపుకు బాగగు,
మెండగు, రుచికర జిలేబి మేలిమి, వలయున్ !
తిండియు వోలెన్ తినంగ దిటవు గలుగునా !
నిండుగ, చూపుకు బాగగు,
మెండగు, రుచికర జిలేబి మేలిమి, వలయున్ !
కండలు ఊరక పెంచిన
దండగ ! మేధా జిలేబి ధారణ వలయున్
గుండెలు తీసిన బంటుకు
దండము వేయ మనిషికి నిదానము వలయున్ !
దండగ ! మేధా జిలేబి ధారణ వలయున్
గుండెలు తీసిన బంటుకు
దండము వేయ మనిషికి నిదానము వలయున్ !
గ్లాసెడన కొట్టు పిండి
ధ్యాసగ నుప్పు జిలకరయు తగు కారములున్
ఆ సెగ నెసరున నీళ్లున్
ఆశగ బెట్టె నిట నొజ్జ మాచన జూడన్
ధ్యాసగ నుప్పు జిలకరయు తగు కారములున్
ఆ సెగ నెసరున నీళ్లున్
ఆశగ బెట్టె నిట నొజ్జ మాచన జూడన్
మరియొక గ్లాసెడు నీళ్ళన
నురగగ పిండిని గలుపుము ఉండలు గాకన్
మరిగిన నీళ్ళన పోయుడు
సరిసరి కారపు దినుసును చక్క గలుపుమా !
నురగగ పిండిని గలుపుము ఉండలు గాకన్
మరిగిన నీళ్ళన పోయుడు
సరిసరి కారపు దినుసును చక్క గలుపుమా !
దరి నుండుము సరి కలుపుము
మరి యుండలు కట్టక మరిమరి కలుపవలెన్
సరి జూచి గరిట జారుగ
తిరికగ ముద్దయునుగాక దించు జిలేబీ!
మరి యుండలు కట్టక మరిమరి కలుపవలెన్
సరి జూచి గరిట జారుగ
తిరికగ ముద్దయునుగాక దించు జిలేబీ!
యిదియొక కళ !సాఫ్టుస్కి
ల్లిది! తెలుసుకొను వడియాల లీలను గను!స
న్నదయిన తడిబట్టను పిం
డదగును ! ఎండన పరిచి బడయ వలయు గనన్ !
ల్లిది! తెలుసుకొను వడియాల లీలను గను!స
న్నదయిన తడిబట్టను పిం
డదగును ! ఎండన పరిచి బడయ వలయు గనన్ !
నాలుగు పక్కల రాళ్ళను
వీలుగ, బట్ట యెగురకను, వేగిర నిడుమా !
గోలుగ ఉడికిన పిండిని
వాలుగ పెట్టుకుని వెళ్ళవలెను జిలేబీ !
వీలుగ, బట్ట యెగురకను, వేగిర నిడుమా !
గోలుగ ఉడికిన పిండిని
వాలుగ పెట్టుకుని వెళ్ళవలెను జిలేబీ !
ఎండల వాటుగ వడియం
ఎండును, మధ్య తడిపచ్చి ఎంచక మరు నా
డెండన నిడుమా వాటిన్
మెండుగ యగునే జిలేబి మేటి వడియముల్ !
ఎండును, మధ్య తడిపచ్చి ఎంచక మరు నా
డెండన నిడుమా వాటిన్
మెండుగ యగునే జిలేబి మేటి వడియముల్ !
ఆపై వాటిని తియ్యడ
మో? పై బట్టను వడియము మొత్తము లోనన్
కోపుగ ఉండునటుల జే
యన్! పై నీళ్ళచిలికి వడియాలను మీటన్ !
మో? పై బట్టను వడియము మొత్తము లోనన్
కోపుగ ఉండునటుల జే
యన్! పై నీళ్ళచిలికి వడియాలను మీటన్ !
చకచక వచ్చును నొకటొక
టిగ, యొక పళ్ళెము న యుంచు ! టీచరు జెప్పెన్ !
నికరముగ వడియముల మరి
యొక దినమున నెండ బెట్ట యోగ్యము వినుమా
టిగ, యొక పళ్ళెము న యుంచు ! టీచరు జెప్పెన్ !
నికరముగ వడియముల మరి
యొక దినమున నెండ బెట్ట యోగ్యము వినుమా
చక్కగ నారగ వాటిని
టక్కని డబ్బా నిడవలె టపటప యనగన్ !
మిక్కిలి ముదము జిలేబీ !
చెక్కితి వీ కండ కావ్య చెణుకుల నిచటన్ !
టక్కని డబ్బా నిడవలె టపటప యనగన్ !
మిక్కిలి ముదము జిలేబీ !
చెక్కితి వీ కండ కావ్య చెణుకుల నిచటన్ !
శ్రీ మాచన వడియముల ట
పా మూలము గొని జిలేబి పద్యము గూర్చెన్ !
రామా ! ఆ దంపతులకు
రామా ! ఆ దంపతులకు
నీ మాటగ యీ దినమున నిధియన నిత్తున్ !
శుభాకాంక్షల తో
చీర్సు సహిత
జిలేబి