Tuesday, May 17, 2016

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

అయ్యా! యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు !

మీరీ  బ్లాగ్లేఖ చదువుతారో లేదో తెలియదు !

పై బడి తెలుగు బ్లాగు లోకపు కబుర్లు జనవాహిని లోకి వెళతాయో లేదో కూడా తెలియదు ! (ఇది మరో క్లోజేడ్ సిర్క్యూట్ జాలమేమో అన్న అనుమానం కూడాను !:)

అయినా చెప్పాలని అనిపించింది కాబట్టి !

ఈ మధ్య మీరు నిర్వహించిన లోక్ నాయక్ పురస్కార సభా  కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో చూడడం కాకతాళీయం గా జరిగింది !

పురస్కారాన్ని మహా సహస్రావధాని ధారణా బ్రహ్మ రాక్షస శ్రీ గరికిపాటి నరసింహా రావు వారికివ్వడం ముదావహం !

శ్రీ గరికిపాటి వారు ఆ సభలో చేసిన ప్రసంగం వారి అమోఘ ప్రతిభా పాటవానికి మచ్చు తునక !

సరే , అంతా బాగున్నది ఈ పాటి దానికి విన్నపాలు ఏమిటీ అంటారా ?  అవధరించండి !

ఒక పురస్కార గ్రహీత ని పిలిచి అదిన్నూ  శ్రీ గరికిపాటి లాంటి సహస్రావధాని వారిని పిలిచి , వారిచే   ఒకటిన్నర గంట సేపు బాటు ప్రసంగం చేయించి వారు నిలబడి మంచి నీళ్ళు కూడా తాగ నిచ్చే వీలు లేకుండా మాట లాడ జేయించడం ఎంతవరకు సబబు ?

సభా మర్యాద గా వారిని సుఖాసీనుల జేసి , వారికి తగు మర్యాద ఇచ్చి, మీరందరు  కూడా హాయిగా వారి ముందు కూర్చుని  ప్రసంగాన్ని ఆస్వాదించి ఉంటే , చూసి ఉంటే  ఎంత బాగుండేది ?  ఈ సహృద్భావం చూపడం సభా మర్యాద గాదా ?

ఒక్క సారి ఆలోచించి చూడండి !

శ్రీ గరికి పాటి వారు వారు మంచి నీరు తాగడానికై సైగ చేస్తే , అడిగితే,  ఆ తెచ్చిన వ్యక్తి మంచి నీళ్ళు వెనుక కుర్చీ పై పెట్టేసి వారు తాగడానికి సౌకర్యం కలిగించ కుండా చేయడం ఎంత వరకు సబబు ?

వారు మాటల మధ్యలో ఖచ్చితం గా నీరు త్రాగడం ఎన్నో సభల్లో మనం చూడ వచ్చు ; మాట్లాడే వారికది అవసరం . ఆ వేగం లో మాట్లాడే టప్పుడు గొంతుక పిడచకట్టుకు పోవడం సర్వ సాధారణం !

అట్లాంటి ది మీరు సన్మానానికి పిలిచి వారిని ఇట్లా చెమటలు కక్కించే లా వారి చేత నిలబడి ప్రసంగం చేయించడం ఎంత వరకు సబబు ? *ఈ క్రింది వీడియో లో ప్రస్ఫుటం గా స్వేదం తో తడిసిన శ్రీ గరికి పాటి వారి క్లిప్పింగ్ చూడ వచ్చు );

యిది యేమి సభా మర్యాద ? స్వేద సేద్యము చేయకున్న కవివరులకు పురస్కారము దక్కునా అన్నట్టు ఉన్నది :)

ఈ టపా  వ్రాసినందు వల్ల అయిపోయిన కార్య క్రమానికి జరిగే లాభం ఏమీ లేదు అని తెలుసు ,అయినా వ్రాస్తున్నది ఎందు కంటే , రాబోయే  ఉత్సవాల లో నైనా సన్మాన గ్రహీత లకు ఉచిత స్థానాన్ని ఇస్తారనే నమ్మకం తో !.

మీరు పిలిచే సన్మాన గ్రహీత లు ఎట్లాగూ అరవై వసంతం దరిదాపుల్లోని వారే ఉంటారు ఖచ్చితం ఇది మన సంప్రదాయం పాటించండి !

ఇట్లాంటి సుదీర్ఘ సంభాషణ ఉన్నప్పుడు మీరు కూడా హాయిగా వారి ముందు వైపు కూర్చుని ఆస్వాదించండి వారి పాండిత్యాన్ని !

వేదిక మీద నిలబడి మాట్లాడే వారికి వీలుగా మంచి నీటి కమండలం కాకున్నా కనీసం వాటర్ బాటిల్ నైనా వీలుగా పెట్టండి !

ఒక సభలో గరికిపాటి లాంటి వారు మంచి నీళ్ళు తాగకుండా ఒకటిన్నర గంట సేపు వారి ధాటి కి మాట్లాడటం అంత సుళువైన విషయం కాదు !

నాకు తెలిసినంత వరకు యిదే అట్లాంటి వారి మొదటి సభ అయి ఉంటుంది అనుకుంటా ! ఆ క్రెడిట్ యార్ల గడ్డ వారికే దక్కే ! జేకే !


కార్య నిర్వాహకులు గా ఉన్న మీరు పని ఒత్తిడి లో మరవటం సహజమే !

అయినా కనీసం రాబోయే మీ సభ ల లో నైనా ఈ కనీస సభా మర్యాద పురస్కార గ్రహీత ల బాగోగులు వేదిక పై చూడ వలసినది గా విన్నపాలు !

సన్మాన గ్రహీత లు నిలబడే మాట్లాడా లనుకునే పక్షం లో కనీసం వారి దగ్గిర వీలుగా త్రాగడానికి మంచి నీళ్ళైనా ఉంచండి ; కనీస మర్యాద ఇదే వారికి మనమివ్వడం.

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం ! లోక్ నాయక్ పురస్కార గ్రహీత గా వారి ప్రసంగం క్రింది లింక్ లో ఒక గంట పది నిముషాల దాపుల్లో నించి మొదలవు తుంది ! వీలు చేసుకుని వినండి !

చెమటలు ధారా పాతము
గ, మన గరికి పాటి వారి కంఠపు శోషన్
విమలాకృతియన పద్యము
లమరెను నరసింహము ! కవి లాఘవము గనన్ !
 
ఆణి ముత్యపు బిందువు లనగ నచట
నయ్య వారికి తలపయినమరె; కొంచు
చెణుకులవి యన కవివర్య చెంప తడిసె
యార్ల గడ్డ లక్ష్మీప్రసాధ్యాత  చలువ ! :)
 

శ్రీ గరికిపాటి వారు తమ బట్ట తల మీద చెణుకులు ప్రతి సభ లోనూ వేస్తూంటారు ! అట్లాంటి వారి బట్ట తల మీద ఆణిముత్యాల్లాంటి స్వేద బిందువులను తెప్పించిన యార్లగడ్డ వారు మరెంత గొప్ప వారు :)

క్రింది యు ట్యూబ్ లింక్ లో శ్రీ గరికిపాటి వారి ప్రసంగం సుమారు ఒక గంటా పది నిముషాల ప్రాంతం నించి మొదలవు తుంది ! హాట్సాఫ్ టు శ్రీ గరికిపాటి !



చీర్స్
జిలేబి

16 comments:

  1. కంఠ శోష అంటే అదే,ఇదే

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు

      కాంత శోష !

      నెనర్లు !

      జిలేబి

      Delete
  2. వారిది కంఠశోష అనుకుంటే మీది బ్లాగుశోష.
    బ్లాగు వ్రాతలు జనవాహినిలోకి వెడతాయా అనే మీ సందేహం చాలా వరకు నిజమేనని నా అభిప్రాయం కూడా. చదవవలసిన వారు చదువుతారా - తెలియదు. అందువల్ల మీరు ఇక్కడ వ్రాసినదంతా ఏ వార్తాపత్రికకో పంపించండి - ఎలాగూ మీరు మీడియా వ్యక్తని మీ బ్లాగువ్రాతల ద్వారా నేను గ్రహించినది. గరికపాటివారు "మాజీ ముఖ్యమంత్రి", "మాజీ ప్రధానమంత్రి" అన్నట్లుగా మీరు మాజీ మీడియా వ్యక్తేమో తెలియదు మరి 🙂
    ఆ చేత్తోటే మీ ఈ బ్లాగువ్యాసాన్ని సరాసరి యార్లగడ్డ వారికే ylp1953@gmail.com అనే అడ్రస్సుకు మెయిల్ చేసి చూడండి, స్పందన ఉండచ్చు (ylp గారి ఈమెయిల్ అడ్రస్ www.loknayakfoundation.com అనే వెబ్సైట్లో దొరికింది).
    నా "శోష" కొంత - పక్క కుర్చీలో కూర్చునున్న పెద్దమనిషయినా మంచినీళ్ళ సీసాని గరికపాటివారికి పంపించే ప్రయత్నం చేయలేదు, పైపెచ్చు కుర్చీలోంచి కింద పడిపోతుందేమోనని ఆ సీసాని కుర్చీలో ఇంకా వెనక్కి జరిపి పదిలపరిచారు 🙁
    గరికపాటి వారి అనర్గళ ప్రసంగంలో చివర ఐదారునిమిషాలపాటు గుడ్డినమ్మకాల మీద విసిరిన చెణుకులు అక్షరసత్యాలు.
    మంచి లింక్ అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు,

      చాలా మంచి విషయం సెలవిచ్చారు !

      మీరు చెప్పిన మేరకు వారికి పంపడం జరిగింది ;

      Now the ball is in their court :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. Dear Sir, Please Go Through This
      Inbox
      x

      Sundaram Sonti 09:24 (9 hours ago)
      http://varudhini.blogspot.in/2016/05/blog-post_17.html#comment-form వరూధిని P...

      YLP
      15:27 (3 hours ago)

      to me
      అయ్యా!
      హృదయ పూర్వకంగా క్షమించండి.
      గత 12 సంవత్సరాలు గా పురస్కార సమర్పణ కార్యక్రమంలో
      ఎవరు 15 నిముషాలకు మించి మాట్లాడలేదు .
      మా అదృష్టం కొద్ది గరికిపాటి వారు అంత సేపు ప్రసంగంచారు.
      వారి అద్భుత ప్రసంగ ధార లో మునిగి పోయిన మాకు మీరు ఎత్తిచూపిన పొరపాటులు తెలియరాలేదు.
      తెలిసి చేసిన తప్పుకాదు.
      గతంలో వారి ప్రవచనం ఏర్పాటు చేసినప్పుడు మీరు చెప్పినట్లే చేసాము.
      మీ సూచన మాభవిష్యత్ కార్యక్రమాలలో శిరోధార్యం గా స్వీకరిస్తాము.
      ఇటువంటి సహృదయ సూచనలు ఆప్తంగా వుంటే బాగుండేదేమో చూడండి
      వ్యంగ్యం పాలు ఎక్కువనిపించింది.
      ఏది ఏమైనా మంచి సూచనను హృదయపూర్వకంగా గౌరవిస్తాము.
      కృతజ్ఞతలతో
      భవదీయ
      యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్



      Yarlagadda Lakshmi Prasad

      Sent from my iPad

      १८/०५/२०१६ को पू ९:२४ पर Sundaram Sonti ने लिखा :

      Delete
  3. వరూధిని/జిలేబి గారూ,
    మీ బ్లాగ్ చదివిన వెంటనే శ్రీ యార్లగడ్డ ప్రసాద్ గారికి మెయిల్ పంపాను.... పైన వచ్చినతిరుగు టపా ​మీకోసం :)
    సుందరం

    (శ్రీ గరికిపాటి వారిది మా కాకినాడే :) )

    --

    ReplyDelete

  4. మీకోసం గారు !

    నెనర్లు ! చాలా మంచి గా రెస్పాన్స్ ఇచ్చారు యార్ల గడ్డ వారు !

    వ్యంగం పాలు ఎక్కువ గా ఉందన్న వారి మాట కూడా సమంజసమే !

    జిలేబి = వ్యంగ్యం అయిపోయినట్టుంది !

    (మోతాదు మించెను వ్యంగ్యం ! జీవితమే ఒక నాటక రంగం !)

    మీ సహృదయతకి జోహార్లు !

    నా వ్యంగాస్త్రానికి చీవాట్లు :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies

    1. మరొక్క మాట !

      ఆ వ్యంగ్యం వెనుక ఆత్మా రాముని క్షోభ ! అందుకే మరీ మోతాదు మించింది !

      (జి) లేబి !

      Delete
    2. మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం వల్లనే వేగంగా స్పందించటం దానికితోడు శ్రీ విన్నకోటనరసింహారావుగారు ఇచ్చిన వివరంవల్లనే శ్రీ యార్లగడ్డ వారికి మెయిల్ ఇవ్వడం జరిగింది ధన్యవాదములు
      సుందరం

      Delete
    3. మీది ఆత్మాసీత క్షోభ అయివుండాలేమో ;)

      Delete

    4. మీ కోసం వారు !

      రాముండొకడే, అనఘా !
      ఆమూలాగ్రము జిలేబి ఆత్మా రామం !
      స్వామీ ! పురుషుండతడే ,
      మీ, మనకందరికి జోడు ! ,మీ కోసమనన్ !


      జిలేబి

      Delete
  5. చూశారా యార్లగడ్డ వారి సహృదయత. వారి దృష్టికి రాగానే వెంటనే జవాబిచ్చారు. మీరు, శొంఠి సుందరం ("మీకోసం") గారు చొరవ తీసుకుని చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. మీకిద్దరికీ అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. శ్రీ విన్నకోటనరసింహారావుగారూ,
      మీరిచ్చిన వివరంవల్లనే శ్రీ యార్లగడ్డ వారికి మెయిల్ ఇవ్వడం జరిగింది ధన్యవాదములు
      సుందరం

      Delete


  6. అలసెను సొలసెను మది కల
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్
    నిలకడ రాగన్ పద్యము
    నలవోకగజేయ వాణి నవ్యత గూర్చెన్ !

    సావేజిత
    జిలేబి

    ReplyDelete
  7. హై హై నాయకా..!Super result..!

    ReplyDelete
    Replies

    1. హై హై అయ్యా :)

      చీర్స్
      జిలేబి

      Delete