Saturday, July 30, 2016

సదనపు విషయముల పైన చతురత జేర్చన్ !



 
 
 
సుధయొప్పె సుధా కుండలి
క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్


చీర్స్
జిలేబి

Wednesday, July 27, 2016

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)


అయ్యరు వాళ్ ! అంటూ పిలిచా;

ఎందుకోయ్ అట్లా అరుస్తున్నావ్ ? పక్కనే గా ఉన్నా ? అయ్యరు గారు అదిరిపడి హిందూ పేపరు నించి తల బయట పెట్టి చూసారు.

అబ్బబ్బ ! మీ కెప్పుడూ ఆ పనిలేని నసలేని హిందూ పేపరే నా ? నా మాట వినరుస్మీ అన్నా విసుక్కుంటూ .

అబ్బే ! జిలేబి నీ మాట వినక బోవట మేమిటి ? బ్లాగ్ లోకం కోడై కూస్తోంది కదా నీ గురించి ;

హిందూ పేపర్ లో అదీ వచ్చే సిందీ ? హాశ్చర్య పోయా !

లేదులే ! నిన్న రాత్రి నిద్రలో నువ్వే ఏదో మాట్లడేసు కుంటూ ఉంటేనూ ?

ఏమని మాట్లా డా నండీ ?

గాంధీ గిరి - దాదాగిరి ప్రైవేట్ బ్లాగ్గిరి  అంటూ గిర గిర తిరిగి పోతూంటే నూ ?

ప్రైవేట్ బ్లాగ్గిరి అన్నానా :! దాంతో తలే ఉంగళీ దబాయా మైనే !

అవునోయ్ ! కాఫీ ఏమన్నా కావాలా నిద్ర మత్తు వదల టానికి !

అయ్యరు వాళ్ మీ చేత్తో కాఫీ ఇస్తే నేనెప్పుడైనా వద్దంటానా ? మారాము బోయా !


***

అయ్యరు వాళ్ అట్లా కాఫీ పెట్టటానికి కిచెను గదిలోకి వెళుతూ నే జిలేబి బ్లాగు మూట విప్పి

గిరిగిరి బ్లాగ్గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి చుట్టూ తా చుట్ట సాగింది !


ఏదో చెప్పండి చూద్దాం వేగం గా ఈ వాక్యాన్ని

గిరిగిరి గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి గిరి గిరిగిరి గిరీ :)



ఈ రోజు జిలేబి కి ఏమి వాయింపులు ఉంటా యో యేమో ! :)

చీర్స్
జిలేబి
అతి త్వరలో జిలేబి కూడా  ప్రైవేట్ అయిపోతూంది :)




 

Friday, July 22, 2016

హమ్మయ్య ! నారదుల వారి పని ముగిసింది :) అంతా మన మంచికే !

హమ్మయ్య ! నారదుల వారి పని ముగిసింది :)

యిది చాలా సీరియస్ టపా .

గుండె దిటవు చేసుకుని చదవవలె ! జేకే !

నారదుల వారి ఎట్లాంటి కార్య'కళా' 'పాము' లకున్నూ కొంత ఉపోద్ఘాతం ఉండాలి ; అంటే బ్యాక్ డ్రాప్ అన్న మాట !

క్రితం సంవత్సరం డిసెంబర్ నెల లో బ్లాగు లోకం లో ఒక అన్నానిమస్సు జిలేబి ని కస్సు మనటం తో (చాలా సున్నితం గా :) జిలేబి కూడా కస్సు మంది !

దెబ్బకు టా ! బ్లాగు లోకం ఉలిక్కి పడింది ! జిలేబి యిట్లా నువ్వు దేవ భాష మాట్లాడటం బాగో లేదు అని ప్రొటెస్ట్ చేసింది !

మా గురువులుంగారేమో ఫత్వా జారీ చేసారు - జిలేబి కి నా బ్లాగు లో కామింట డ టానికి నో ఎంట్రీ ఫార్ ఒన్ ఇయర్ ! 

అంతే గాకుండా ఆయన రామ నామ జపం లో మునిగి పోయారు !

అంతా మన మంచికే ! ఎవరి కో దెబ్బ కొడితే పండు ఎక్కడో రాలింది ! జిలేబి దెబ్బ కి గురుని భక్తి ప్రపత్తులు పెరిగేయి అదే పది వేలు అని నారదాయ నమః అనుకున్నా !

అప్పట్లో వారు పద్యాల మీద టపాలు పెట్టడం తో ఇదేదో బాగుందే పద్యాలు (హరి బాబు గారి మాటల్లో పజ్జ్యాలు - పిజ్జ్జాలనే  పజ్జ్యాలన్నారు కామోసు !) అల్లటం నేర్చు కుందా మని వారి బ్లాగు ఫాలో అయిపోతూ వారి రామ నామ సంకీర్త నని ఆస్వాదిస్తో , పద్యాల పోటీ టపా (జిలేబి కెప్పుడూ సెటైర్ / పేరడీ లైకింగు కాబట్టి ఓ డబల్ మోస్తరు పేరడీ కామిడీ బ్లాగ్జనాల తల తినే టపా లని పెట్టేస్తో ) పెట్టుకుంటూ స్వయం పాకం లా పద్యాలతో కుస్తీ పడుతో మొత్తం మీద కంది వారి బ్లాగు లోకి జిలేబి కాలు పెట్టడటం వరకు జరిగి పోయింది ! (హమ్మయ్య ఐరన్ లెగ్గు కాదను కుంటా :) జేకే !)

ఇట్లా సజావు గా పోతున్నవి  దినములు, అహో రాత్రములు  (రోజులు అన్నవి గ్రామ్యం ; మేం వాడం : మేమిప్పుడు గ్రాంధికాల నే నెమరు వేస్తాం :) )  పద్యాలోయ్ పద్యాలు అంటూ బ్లాగ్లోకం హోరెత్తి టారెత్తి పోయే స్టేజీ కి వచ్చేసే టట్టు అయిపోయే ! (ఈ మధ్య ఒక కామింటు దారుడు మండి,  యిదే మండి బ్లాగు లోకమంతా పద్యాల హోరు తో నిండి పోయింది అని వాపోయాడు గూడా :)  పజ్జ్యాలా మజాకా !


అప్పటి దాకా రామ నామ జపం చేసుకుంటున్న అయ్య వారు సడెన్ గా మే నెల లో దారి తప్పారు ! మళ్ళీ కామింటు లోకం లో కి వచ్చి పనికి మాలిన రాజ కీయాల పై చర్చల లో పాలు గొంటూ మొట్టి కాయలు తినడం మొద లేట్టేరు !తమ బాలాగు లో రాముల వారూ గాయబ్ !

ఔరా ! విధి నెవరిని విడిచి పెట్టింది అనుకోకుండా ఉండ లేక పోయా ! సజావు గా రామ నామ జపం చేసు కుంటూ వున్న పెద్దాయన ఇట్లా రాజకీయ నాన్సెన్స్ కామింటు ల గో ల లో గురువు గారు బుక్కయి పోయెనే అనుకుంటూ సరే అనుకుంటూ కొంత హింటిచ్చా !

మే నెల ఇరవై తారీఖు !



రామ రామ రామ యని నారాముగ కవి
యుండె! దారి విడిచెనుగ ! యుద్ధ భూమి
యనగ పాలిటిక్సును నాడి యతను బోయె
కాల మహిమ యనగ నిది కద జిలేబి !

జిలేబి 
 
౦౦౦
 
శిష్యులు దారి తప్పితే గురువు వారిని దారిన బెడతారు ! అదే గురువులు దారి తప్పితే ఏమి చేయాలి ? శిష్యులే దారిన బెట్టాలి గదా ! అదిన్నూ ప్రథమ శిష్యురాలు జిలేబి ! (జిలేబి శతకాన్ని గూడా గురువులుంగారు ఆవిష్కరించి ఉన్నారు ఆ పాటి అయినా వారి మీద మక్కువ ఉండవలె గదా !)
 
 
సో, అప్పటి నించి వారి వెంబడి వేటాడటం మొదలెట్టా ! హోరెత్తేను మరో మారు బ్లాగు లోకం. జిలేబి కి నానా తిట్లూ దీవెనలూ దక్కేయి ! అయినా వదిలి పెడతా మా ? హూ ! హూ ! నలుగురు తిట్టి పోదురు గాని నాకేంటి భయ్యం ఓ జిలేబి యమ్మా అనుకుంటూ చలో ఆగే కదం కదం (కందం కందం) మిలాకే అనుకుంటూ వెళ్ళటం మొదలెట్టా !
 
 
మధ్య లో జూన్  రెండన తారీఖు , తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని అంత గా తిట్టు కోవాల్సిన పని ఒక రామ భక్తునికి ఉందా ? తారీఫు తో మళ్ళీ మరో డోసు :) యతో కర్మః తతో ఫలః ! తారీఫు కి డోసు పడ కుండా కర్మ కి భోగం తప్పు తుందా ! మరో మారో జిలేబి కి డోసులు పడేయి దండి గా !
 
 
అయినా వదులుతా మా ! హూ హూ ! చలో కందం కందం మిలాకే హైలేసా !
 
నారదుల వారి పనికి ఆ శ్రీ మన్నారాయణుడే వచ్చి నట్టు దేవుడు / దేముడు సంభాషణ వచ్చె ! హా హా ! యిది కదా రాముల వారి మహిమ అనుకోకుండా ఉండ లేక పోయా ! దేముడు బాబాయ్ కలలో కనబడి బంతాట ఆడేసు కో మన్నాడు అంటూ దేముడు బాబాయ్ టపా వచ్చెను ! ఈ టపా జూలై తొమ్మిది న వచ్చింది ! మరో మారు దుమారం !
 
మరో దుమారం కంది వారి టపాలో సౌజన్యుడు సాధువా కాదా అన్నది :) సౌజన్యుడు సాధువు కాకుంటే దుర్జనుండు సాధువ వుతాడా అనుకుంటూ  కొంత పడతాదనం, పదభిఘావళి జేయటం టాప్ పీక్ (టాపీక్ :) అయి కూర్చుంది !
 
ఇట్లా వీర విహారం గావిస్తో పిల్ల గాలి ఈదురు గాలి గా మారటం తో ,  మొన్న జూలై ఇరవై గురుపూర్ణిమ నాడు మా గురువులుం గారు మళ్ళీ రామ జపం కి మారేస్తా అనటం తో జిలేబి మహాదానంద పడి పోయింది !
 
పవులో కొల్హో తన నవల 'The Alchemist' లో ఒక చోట "And, when you want something , all the universe conspires in helping you to achieve it" అంటాడు !
 
సో రెండు మూడు రోజులుగా చూసినాక  ఈ టపా స్వస్తి వాచకం !
 
గురువులుంగారిని రామ నామ జపమను బడు బృహత్తర కార్య క్రమానికి త్రిప్పిన బ్లాగోదర బ్లాగూదరిణీ లందరికీ నమో వాకాలు ! అందులో కొందరు తమకు తెలియ కుండా నే ( వెనక్కి తిరిగి చూసు కుంటే !) నిర్వ హించి న పాత్రలు !
 
మబ్బుల మాటున దాక్కుని చల్లని కాలాన్ని ఇచ్చిన మా కష్టే ఫలే భాస్కరులు ! (మళ్ళీ మబ్బుల మాటి నించి బయటకు ఎప్పడు వస్తున్నారండీ :)
 
కామింట్ కింగ్ - విన్న కోట నరసింహా రావు (వీరు నారదుల వారి రైట్ హ్యాండ్ వీరికి గురువులుంగారి బ్లాగు లో కూడా ఎక్సెస్ ఉంది కాబట్టి తమకు తగు రీతి లో అక్కడ కొంత నారదాయ నమః అంటూ కార్యానికి కొంత ఊపు నిచ్చారు :)  (వీరి బ్లాగు కోసం నేను వెతుకుతా నే ఉండా ! కనబడ నంటోందిస్మీ :)
 
మా లక్కాకుల రాజావారు - వీరు దేముడు వెర్సస్ దేవుడు లో ప్రవేశించి రాముని / రావణు ని తెచ్చి సెహ భేషు గా గురువులుం గారి ని తమ స్వకార్య నిర్వహణ లో త్రిప్ప టానికి పూనిక నిచ్చారు .
 
అలాగే హరి బాబు గారు ( వీరు మహా భాష్య కారులు రెండు పదాలిస్తే దాంట్లోంచి వేద సారాన్ని చటుక్కు లాక్కోచేస్తారు :) దేముడు బాబాయ్ ! హరి నస నాథుడే :)
 
భండారు వారు ! వీరి టపాలో మరో పెద్ద లక్ష్మీ పటాకా ! అనానిమస్సు ల హవా ! భండారు వారు అనానిమస్సుల హవేల్దారు కామోసు :) జేకే !
 
క్షీరగంగ శ్రీధర్ గారు - వీరు జాతకాన్ని చూసుకోండని కొంత సూక్ష్మమ్ చెప్పారు ! వీరికి జవ్వని కన్నుల గురించి మాత్రమే బాగా తెలుసనుకున్నా ! జాతకాల గురించి కూడా ఇంత బాగా తెలుసునని తెలుసుకుని హాశ్చర్య పోయా !
 
డీ జీ గారు - వీరు వేదాంత పరం గా కాలం యొక్క ప్రాముఖ్యత ని గురువులుం గారికి విడమర్చి చెప్పారు ! ఆహా ! కాల మహిమ యిది కాకుంటే వేరొకటుందా !
 
గురు పూర్ణిమ కి మూడు రోజుల ముందు హై సీన్ - కంది వారు సౌజన్యుండి ని తెచ్చి వదిలి పెట్టారు ! టపా లక్ష్మీ బాంబు లా పేలింది ! సౌజన్యుడైన మా గురువులుం గారి గురించి మరో గురువులుం గారికే కదా బాగా తెలియును :)
 
సో, ప్రస్తుతానికి రామ నామ జపం లో మళ్ళీ గురువులుం గారు మునిగి పోవటం శిష్య పరమాణువు కి ఆహ్లాదం కలిగిస్తోంది !
 
నారదాయ నమః పని బాగా జరిగిన దానికి తోడ్పాటు గా తమ వంతు కార్య క్రమాన్ని / ప్రోత్సాహాన్ని , ఇచ్చిన బ్లాగోదరీ బ్లాగోదరులకు నమః శ్శివాయ అనుకుంటూ
 
మా ఏడు కొండల పెరుమాళ్ళ ని కలలో దేముడు బాబాయ్ ని తెప్పించి నందులకు , ఇట్లా అందరికీ నమో వాకాలు అర్పించే సు కుంటూ జిలేబి సావేజిత సైనింగ్ ఆఫ్ ఫార్ ది డే !
 
౦౦౦

అదిరెను శ్యామల రాయా !
కుదురుగ రాముని మనంబు కూజిత జేయన్
మదిని తనివి జేసెడి ఆ
మదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా

జిలేబి
౦౦౦


అంతా మన మంచికే ! జగమంతా రామ మయం

దేవుడని మొన్న తెలిసెను
రావుడు రాముని గనంగ రాస్తా ద్రిప్పెన్
కోవా జిలేబి పలుకుల
తావులు సరియయ్యెగాద తరుణీ భేషూ !

జిలేబి

నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
 
జిలేబి 

Saturday, July 16, 2016

మాదొరుభాగన్ - మాదు ఒరు భాగన్ - అర్ధనారి - జిలేబీయం - 1

మాదొరుభాగన్ - మాదు ఒరు భాగన్ - అర్ధనారి - జిలేబీయం -1

రెండు వేల పది లో మొదటి మారు పబ్లిష్ అయిన మాదొరు భాగన్ నవల రచయిత పెరుమాళ్ మురుగన్ . ఇతని ఈ తమిళ నవల రెండు వేల పదునాలుగు లో ఆంగ్లం లో One Part Woman గా అనువదింప బడింది .

ఆ రెండు వేల పదునాలుగు లో ఈ నవల పై , ఆ నవలకు ఆధార మంటున్న విషయాల పై తిరుచెంగోడ్ నగర వాసుల నిరసన ఆ పై ఆ నవలా రచయిత క్షమాపణలు ; పుస్తకాన్ని నిషేధించా లని కోరటం ;

నిషేధించాలా వద్దా ? భావ ప్రకటనా స్వేచ్చ అంటే ఏమిటి ? ఎంత వరకు ?

'కట్ట తీర్పు' (ప్రజా పంచాయితి తీర్పు ?) వర్సెస్ ప్రభుత్వ బాధ్యతలు

మద్రాసు హైకోర్టు వారి సమగ్ర విచారణ ఆ పై వారి జడ్జిమెంట్

ఈ నేపధ్యం లో కొన్ని లింకులు

మాదొరు భాగన్

మాదు ఒరు భాగన్

మాదు = నారి ; ఒరు = ఒక ; భాగన్ = భాగం (భాగం గా ఉన్న వాడు ); వెరసి అర్ధనారి  ; ఆంగ్లం లో One Part Woman.

అరవ పుస్తకం పీ డీ ఎఫ్ లింకు

http://padippakam.com/index.php?option=com_content&view=article&id=8820:2015-07-18-11-34-34&catid=107

ఆంగ్లానువాదం పుస్తకం లింకు

https://books.google.co.in/books?id=4mhBAgAAQBAJ&pg=PT8&lpg=PT8&dq=The+Hindu+Business+Line+one+part+woman+novel&source=bl&ots=pdke618hOK&sig=8j0w0ZIgpkUrNxsvQ1fLW4bsGyY&hl=te&sa=X&ved=0ahUKEwjOrbP2nvTNAhWLNo8KHRZSCd0Q6AEIYDAI#v=onepage&q=The%20Hindu%20Business%20Line%20one%20part%20woman%20novel&f=false

మద్రాసు హై కోర్టు వారి జడ్జిమెంట్ కాపీ పీ డీ ఎఫ్ లింకు

http://www.thehindu.com/news/national/tamil-nadu/perumal-murugan-case-full-court-judgment-ordered-on-july-5-2016/article8812060.ece?homepage=true


In short what the Novel about ->

A short note from the judgment  copy :

It is a heart-rending story of a husband and wife, who are at peace with themselves, but are
constantly reminded by the society of their status – of being childless. In order to meet the societal requirement, they do everything within their might, visit every temple, even traversing difficult terrains where not many would dare venture, endangering their lives and performing all kinds of
poojas. Such are the levels of desperation to which the couple is driven.




I may not agree with what you say, but will defend to the death, y our right to say it- Voltaire

===


Kudos to the judges and the judgment of Madras High court !

In the context of  controversy on the book revolving around ethics, accepted norms, societal beliefs, folk lore versus historical evidences on festivities, traditions that intermingle with societal acceptances and non-acceptances, dogmas around morality and sex,  begetting a child, one of the  delivering judges being woman, Mrs. Justice Pushpa Sathyanarayana , this case gets quite significance in the discussion on freedom of expression vs literary criticism.

Perumal Murugan has articulated well the issue of trauma of lack of child in the novel.


చీర్స్
జిలేబి

Monday, July 11, 2016

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! నారదాయ నమః !

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! నారదాయ నమః !
 

మా నాన్నే ! మా నాన్నే !

వంక సన్నం వాగు (ట) లావు అనబడు బ్లాగోదరుడు జిలేబి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అట ! జిలేబి తో ఫేస్ టు ఫేస్ విత్ అర్నాబ్ లా ఒక ముఖా ముఖి పెట్టాలని అందులో ఎవరైనా జిలేబి ని కొచ్చనించని చెప్పడం తో జిలేబి కి కడుపు నిండి పోయింది !


మొన్ననే రాసా, జిలేబి కి టపా కి మేటరు కరువై ఓ నెలరోజుల బాటు టపా ఏమీ లేకుండా ఆయాసం తీర కుండా  ఉండే !;

ఆ పై దేముడు బాబాయ్ కనంబడి వరమిచ్చే టపా వ్రాయటానికి ;

ఆ వరానికి కష్టే ఫలే వారు బుర్రలో గుంజు అన్నారు !

ఈ బుర్రలో గుంజు ఏమిటబ్బా సినబ్బా అనుకుంటా ఉన్నా !

గుంజు అంటే తీటా లేక రంధ్రమా ( జిలేబి కేమన్నా బ్రహ్మ రంధ్రం ఓపెన్ అయి పోయినాదా అని బహు సంతోష పడి పోయి ఆంద్ర భారతి ని కొచ్చనిస్తే గుంజు అంటే -> చిక్కి పోవు అని చూపించి నాది :) అన్నా ! కష్టే ఫలే వారు సూక్ష్మం పట్టేసారుస్మీ అనుకోకుండా ఉండ లేక పోయా ! ఎంతైనా తాత తాతే ! బామ్మ బామ్మే ! జేకే !


సరే ఇక వంక సన్నం వాగు (ట) లావు వారి ఫర్మానా కి వస్తా !

పద్మార్పిత ఫాన్స్ అసోసియేషన్ అన్న బ్లాగు చూసి హన్నా ! జిలేబి కి ఫాన్స్ అసోసియేషన్ లేక పోయినాదే అని బహు కష్టపడి దుక్ఖించి, చిట్కి వేసారి పోయా అప్పుడెప్పుడో !

ఆ కొరత తీర్చ డానికి వంక సన్నం వాగు (ట) లావు వారు ఇప్పుడు జిలేబి బ్లాగ్ముఖీయం పెట్టమనటం తో చీర్సు సహిత జిలేబి టపా కి మేటరు లభ్యం తధ్యం అన్న పేరాశ తో ఇట్లా మరో టపా బారి పడి నాది :)

బ్లాగోదరులారా ! బ్లాగోదరిణీ లారా ! కమింటు కింగు లారా ! కామింటు క్వీను లారా! ఇదే మీకు స్వాగతం ! సుస్వాగతం !

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! మీరే అర్నాబ్ ! నేనే ఆపొసిట్ చైర్ లో కూర్చున్న 'అంబో' అనబడు గెస్టు :)

జిలేబి కి కష్టం కలిగించ కుండా వంక సన్నం వాగు(ట) లావు వారు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశారు కూడానూ :)

We, the fans of “జిలేబి”, wish to conduct an interw with you. Be pleased to consider.
Let us follow the following guide lines.
1.Let the interview be in the form of questions and answers. (అబ్బా ! జిలేబి కి జోష్ వచ్చేసే !)

2.Please open a post by name MY INTERVIEW WITH PUBLIC in your own blog, or with your favourite title “ Naradaayanamah”.


The questions will be posted in the comment box, the replies also to be in the form of reply comment.

4. జిలేబి, Please answer all questions. This interview may continue for days. Any question irritating you, you are at liberty to skip, but at the same time answer that you are ‘’skipping’’ the question. 
For skipping the question జిలేబి need not give any reason; No reasons should be asked by questioners;


5. This is for fun and as you are much interested in fun let us enjoy.

6.Let the interview to be conducted in telugu  ; మా నాన్నే మా నాన్నే టెల్గూ అంటే ఎంత మక్కువ :)


7.I also wish to remain incognito, you are at liberty to add conditions before starting the interview.
(వంక సన్నం ఇంకాగ్నిటో అనబడు ఇంకిన అగ్ని కాదా ! జేకే !)


కాచుకోండి జిలేబి దెబ్బ ! సత్తే పే సత్తా !

జిలేబి తయారు ! హాట్ హాట్ !

వడ్డనలకి వెరవం !


చీర్స్
జిలేబి 
శుభోదయం !

Saturday, July 9, 2016

దేముడు బాబాయ్ :)

దేముడు బాబాయ్ :)
 
రాముడిని వెతుకబోవ దేముడు కనబడెన్ !

ఈ మధ్య బ్లాగులో దేముడు బాబాయ్ ఎక్కువ గా కనబడటం మొదలెట్టడం తో బెత్తం మేష్టారు దేముడు లో ము గాదోయ్ వు ఉండాలోయ్ అంటూ వెనుక బడేరు :)

గురువు గారి వెనుకే శిష్య పరమాణువు గూడా బడేను !

ఈ ము కారము ఎట్లా వచ్చి ఉండ వచ్చు ? అని ఆలోచిస్తే ఓ మోస్తరు కాముడు అన్న పదం గుర్తు కొచ్చింది !


కాముడు కాముడు అంటూ కావుడు కావుడు అనటం కూడా కద్దు అనుకుంటా :)


అట్లా ముకారము వు కారము అయినట్టు యిక్కడ వు కారము ము కారమయి పోయిందేమో అను కున్నా !

మొత్తం మీద చాలా రోజుల తరువాయి టపా వ్రాత కి మోక్ష మొచ్చేను !

ఈ మధ్య ఒక నెల రోజుల బాటు కమింట్ల తో నే భుక్తా యాసం గడిచి పోయింది !

ఈ నేపధ్యం లో ఈ దేముడు బాబాయ్ కనబడి జిలేబి నీ మొర ఆలకించితి ! నీ టపా కు మేటరు గా వచ్చితి ;

బంతాట ఆడేసు కో అన్నాడు !
మా ఏడు కొండల పెరుమాళ్ళు ఇంత దయ తలిచే డన్న మాట !

దేముడా ! నీకు జోహారు !


సో, బ్లాగు మిత్రోదరు లారా ! ఈ దేముడు బాబాయ్ ఎట్లా వచ్చి ఉంటా డను కుంటారు ?


చీర్స్
జిలేబి