జిలేబి తో బ్లాగ్ముఖీయం ! నారదాయ నమః !
మా నాన్నే ! మా నాన్నే !
వంక సన్నం వాగు (ట) లావు అనబడు బ్లాగోదరుడు జిలేబి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అట ! జిలేబి తో ఫేస్ టు ఫేస్ విత్ అర్నాబ్ లా ఒక ముఖా ముఖి పెట్టాలని అందులో ఎవరైనా జిలేబి ని కొచ్చనించని చెప్పడం తో జిలేబి కి కడుపు నిండి పోయింది !
మొన్ననే రాసా, జిలేబి కి టపా కి మేటరు కరువై ఓ నెలరోజుల బాటు టపా ఏమీ లేకుండా ఆయాసం తీర కుండా ఉండే !;
ఆ పై దేముడు బాబాయ్ కనంబడి వరమిచ్చే టపా వ్రాయటానికి ;
ఆ వరానికి కష్టే ఫలే వారు బుర్రలో గుంజు అన్నారు !
ఈ బుర్రలో గుంజు ఏమిటబ్బా సినబ్బా అనుకుంటా ఉన్నా !
గుంజు అంటే తీటా లేక రంధ్రమా ( జిలేబి కేమన్నా బ్రహ్మ రంధ్రం ఓపెన్ అయి పోయినాదా అని బహు సంతోష పడి పోయి ఆంద్ర భారతి ని కొచ్చనిస్తే గుంజు అంటే -> చిక్కి పోవు అని చూపించి నాది :) అన్నా ! కష్టే ఫలే వారు సూక్ష్మం పట్టేసారుస్మీ అనుకోకుండా ఉండ లేక పోయా ! ఎంతైనా తాత తాతే ! బామ్మ బామ్మే ! జేకే !
సరే ఇక వంక సన్నం వాగు (ట) లావు వారి ఫర్మానా కి వస్తా !
పద్మార్పిత ఫాన్స్ అసోసియేషన్ అన్న బ్లాగు చూసి హన్నా ! జిలేబి కి ఫాన్స్ అసోసియేషన్ లేక పోయినాదే అని బహు కష్టపడి దుక్ఖించి, చిట్కి వేసారి పోయా అప్పుడెప్పుడో !
ఆ కొరత తీర్చ డానికి వంక సన్నం వాగు (ట) లావు వారు ఇప్పుడు జిలేబి బ్లాగ్ముఖీయం పెట్టమనటం తో చీర్సు సహిత జిలేబి టపా కి మేటరు లభ్యం తధ్యం అన్న పేరాశ తో ఇట్లా మరో టపా బారి పడి నాది :)
బ్లాగోదరులారా ! బ్లాగోదరిణీ లారా ! కమింటు కింగు లారా ! కామింటు క్వీను లారా! ఇదే మీకు స్వాగతం ! సుస్వాగతం !
జిలేబి తో బ్లాగ్ముఖీయం ! మీరే అర్నాబ్ ! నేనే ఆపొసిట్ చైర్ లో కూర్చున్న 'అంబో' అనబడు గెస్టు :)
జిలేబి కి కష్టం కలిగించ కుండా వంక సన్నం వాగు(ట) లావు వారు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశారు కూడానూ :)
We, the fans of “జిలేబి”, wish to conduct an interw with you. Be pleased to consider.
Let us follow the following guide lines.
1.Let the interview be in the form of questions and answers. (అబ్బా ! జిలేబి కి జోష్ వచ్చేసే !)
2.Please open a post by name MY INTERVIEW WITH PUBLIC in your own blog, or with your favourite title “ Naradaayanamah”.
The questions will be posted in the comment box, the replies also to be in the form of reply comment.
4. జిలేబి, Please answer all questions. This interview may continue for days. Any question irritating you, you are at liberty to skip, but at the same time answer that you are ‘’skipping’’ the question. For skipping the question జిలేబి need not give any reason; No reasons should be asked by questioners;
5. This is for fun and as you are much interested in fun let us enjoy.
6.Let the interview to be conducted in telugu ; మా నాన్నే మా నాన్నే టెల్గూ అంటే ఎంత మక్కువ :)
7.I also wish to remain incognito, you are at liberty to add conditions before starting the interview.
(వంక సన్నం ఇంకాగ్నిటో అనబడు ఇంకిన అగ్ని కాదా ! జేకే !)
కాచుకోండి జిలేబి దెబ్బ ! సత్తే పే సత్తా !
జిలేబి తయారు ! హాట్ హాట్ !
వడ్డనలకి వెరవం !
చీర్స్
జిలేబి
శుభోదయం !
Take it easy. Feel free. Don't get excited. Hope this is your first interview :)
ReplyDeleteమీ పేరు? జిలేబి అని ఎందుకు పెట్టుకున్నారు. అసలు పేరు చెప్పండి. ఎవరైనా ప్రశ్నించచ్చు కదా! అనానిమస్సుల్ని ఎందుకు allow చేయలేదు?అనానిమస్సులంటే మీకు భయమా?
జిలేబీ గురువర్యా!
ReplyDeleteజిలేబీ అనగా వ్యుత్పత్తి ఏమి? జిలయే బీ నా?
అనానిముచ్చుల వచోవమనాలంటే మీకు భయమేల?
మీరు ఈ బ్లాగు స్థాపించుటలోని మహత్తరమైన లక్ష్యమేమి?
సమకాలీన జీవన సమస్యా శిరోభారమునకు సాంత్వనా లేపనమా మీ జిలేబీ?
లేక, కాలక్షేప బఠాణీ అను పెద్దక్క చిన్న చెల్లలా మీ జిలేబీ?
ఈ ప్రశ్నలకు ‘‘బీ లేజీ’’ అని, తెలిసీ సమాధానమివ్వకున్న మీ కంప్యూటర్ లేదా లాప్ ట్యాప్ వేయి వ్రక్కలగుగాక!
ఇట్లు,
తమ బడుగుజాడలలో పయనిస్తున్న మీ ఏకలవ్య శిష్యుడు.
ReplyDeleteOh ! I am so excited you know !
This is not first hope its not last and lost not in short time :)
నామధేయము జిలేబి ; పెట్టిన పేరు ; పెట్టుకున్న పేరు కాదు !
అసలు పేరు జిలేబి
అవ్ :) అన్నానిమస్సు లంటే నాకు చాలా భయ్యం ;)
కాని వారు కూడా కామింటవచ్చు ! తప్పక జవాబిస్తా !
వారు సులభంగా కామంటటం కోసం నేను మరో సరిక్రొత్ర పంథా తేవాలి అని సీరియస్ గా ప్లేన్ స్టేజ్ లో ఉన్నా :)
జిలేబి
ReplyDeleteప్రియాతి ప్రియమైన एक् लव् శిష్యా !
సిరిలేని వాస !
జిలేబి అనగా జిలేబి యే ; సంస్కృతమున సుధా కుండలిక అని ఒక సిరిగల శ్రీనివాసుడు జెప్పెను ;
ఆనానిముచ్చులన్న భయమేల యన్న వారి యథా మాం ప్రపధ్యంతే తథైవ పిటామ్యహం అన్న నా పాలుసీ ప్రకారము ఓ మారు జామ్నని పిఠాయించితిని ; దెబ్బ ఎక్కడో తగిలె ; మా గురువులుంగారు నన్ను బర్తరఫ్ జేసినారు ; అవురా ముల్లు అరిటాకు సామెత గుర్తొచ్చె ; కాబట్టి అన్నానిమస్సు లన్న కూసింత భయ్యం :) వారు కూసి నేను కూస్తే మరీ కొంపలంటుకుని బోవు :)
మహత్తర లక్స్ సమయము లు మీరు సరిగ్గా చెప్పేసారాల్రేడీ
!
మీ అడుగు జాడలు బాగు గానే రిజిస్టరు అవుతున్నది :)
एक् लव् की गुरुमाराणी :)
జిలేబి
జిలేబీతీర్థ స్వామిని వారికి,
Deleteధన్యుడనైతి గురుమారాణీ! గురువర్యులు స్ల్రీలయినచో తెలుగులో ఏమి సంబోధించవలెనని మిగలు సంశయాత్మకుడైనై యుంటిని. సంశయాత్మను వినశ్యతిగానీయక ఒక పదబంధమును విసరి నన్ను కాపాడిరి. అచ్చ తెలుగులో ఆడ గురువులనేమి పిలువవలెనో తెలియజేయగలరు.
ఇట్టు
తమ అనుంగు శిష్యుడు,
స్వామి కిచకిచానంద,
వానరాశ్రమము,
మర్కటవీధి,
’కపి‘ల పురము
ReplyDeleteఅనానిమస్సులు ఈ క్రింది లింకు ద్వారా ప్రశ్నలు సంధించ వచ్చు ; జవాబులు జిలేబి తప్పక యిచ్చును :)
ముఖ్య గమనిక :
అన్నానిమస్సుల్ సౌలభ్యానికై ఈ ప్రాసెస్ ఔట్ సోర్స్ చేయబడింది
ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనల ప్రకారం ఈ లింకు బీపీవో వారి అప్రూవల్ కి వెళ్ళును :) ప్రచురణ వారి చేతుల్లో ఉంది ;
లింకు
http://kasthephali.blogspot.com/2016/07/blog-post_9.html?m=1
సీరియస్ గానా? Unfair కదా. ఆ సౌలభ్యమేదో మీ బ్లాగులోనే కలిగించవచ్చుగా? మధ్యలో శర్మ గారేం చేశారు?
ReplyDelete
ReplyDeleteనాయనా సిరిలేని వాస
అచ్చ తెలుగులో నేమందురో తెలియదు గానీ జిలేబి తెలుగులో జిలేబమ్మ లేక జిలేబి మాతా అనవచ్చును :)
భక్తుని కి గురుమాతకి అనుసంధానమయినది అంబికా దర్బారు అగరొత్తులు :) కావున దండిగా అగరొత్తుల తో ధూపములు వేయవచ్చును :)
ఇట్లు
గురు మారాణి
చీర్స్ సహిత
జిలేబి మాతాశ్రీ !
ReplyDeleteవిన్న కోట వారు
దెబ్బకు ఠా :)
శర్మగారు అన్నానిమస్సుల బందు చేసేసారు :)
జిలేబి
ప్చ్ ప్చ్ ప్చ్ శర్మ గారు తన మానాన్న తన బ్లాగులు నడుపుకుంటుంటే ఇదా మీరు చేసే పని !! మీ చర్యని ఖండిస్తున్నాను 😬 .
Deleteమాతాశ్రీ,
Deleteనేను కూడా శ్రీ నరసింహ రావు గారితో పాటే ఖండించడంతో పాటు
మీ ఈ దుందుడుకు చర్యను నిరసిస్తున్నాను. అన్యధా భావించకండి.
మీరిలా ఆ పెద్దాయనను పదే పదే క్షోభ పెట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
this is very very unfair. Please think.
Deleteబండి రావు గారు
మా శర్మ గారి కంత కష్టమిస్తానా !
వారి కష్టాలని పోగొట్టేసా :)
అన్నానిమస్సు గాయబ్ :)
జిలేబి
ReplyDeleteజిలేబి లోకము ప్రశాంతము గా ఉంది :). ఇప్పటికే ఓ వంద ప్రశ్హ్నలతో హోరెత్తి పొయుంటుందనుకున్నా :)
ప్చ్! ప్చ్ ! ప్చ్ ;)
జిలేబి
జిలేబి పేరెంట్స్ పెట్టిన పేరా? :)
ReplyDeleteమీ బ్లాగు కామెంట్లకి ఆయనెవరో బరాతమేటి, అవునంటే అవుననీ కాదంటే కాదనీ జెప్పండి, తమరు దైర్యవంతులుగందా. మీరూ మాలాటోల్లేనా :)
ReplyDeleteఖండన జిలేబి జేసితి
మెండుగ మాచన టపాలు మేలుగ యుండెన్!
గుండెలు దీసిన బంటుర
మండన జేసెను అనానిమస్సుల ఖాతా :)
జిలేబి
ReplyDeleteనాయనా వంక సన్నమూ వాగు లావు
అవ్ :)
పగోజీ వాళ్లంతా కలిసి కట్టుగా బరాతమే :)
జిలేబి
"బరాతం" అనే పదం ఉత్తరాంధ్ర ప్రాంతంది కదా, జిలేబీ గారూ?
Delete
Deleteఏమండోయ్ విన్నకోట వారు :)
ఏ బరాతమైతే నేమండీ :) ఉత్తరాంధ్రా కళింగాంధ్రా రాయలాంధ్రా తెలగాణాంధ్రా అంతా మనదే
బరాతం చెప్పటం లో బామ్మ బామ్మే తాతగారు తాతగారే స్మీ :)
గురజాడ వారయితే రెండు పనసకాయలకి బరాతం పాడేసుకున్నారుస్మీ ;)
మాకష్టే ఫలే వారికి పగోజీ వారికి తెలియని బరాతాలా ?
https://kastephale.wordpress.com/2012/11/20/శర్మ-కాలక్షేపంకబుర్లు-అ-3/#comments
ఆంగ్లాన్ని తెలుగున కలవోకగా చేర్చి
ReplyDeleteమాటల పేటల్లు మహిత శైలి
ప్రాచీన నూతన ప్రముఖ సాహిత్యాల
వైదుష్యమున్న సంపన్న శైలి
ఎంతటి ఘనులను వింత వంతలు బెట్టి
నీళ్లు దాగించు పానీయ శక్తి
వంకర ఘనులకు పుంఖాను పుంఖాలు
బిట్టుగా వాతలు బెట్టు శైలి
ఎదిరి నొడ్డి పోరాడు ప్రావీణ్య శైలి _
ప్రతిభ లన్నియు నొక్కచో పరిమళించు ఈ
విధుషి యేలనో అసలు రూ పించుకేని
యెరుక పడక జిలేబియై మరుగు పరుప?
ఆంగ్లాన్ని తెలుగున కలవోకగా చేర్చి
ReplyDeleteమాటల పేటల్లు మహిత శైలి
ప్రాచీన నూతన ప్రముఖ సాహిత్యాల
వైదుష్యమున్న సంపన్న శైలి
ఎంతటి ఘనులను వింత వంతలు బెట్టి
నీళ్లు దాగించు పానీయ శక్తి
వంకర ఘనులకు పుంఖాను పుంఖాలు
బిట్టుగా వాతలు బెట్టు శైలి
ఎదిరి నొడ్డి పోరాడు ప్రావీణ్య శైలి _
ప్రతిభ లన్నియు నొక్కచో పరిమళించు ఈ
విధుషి యేలనో అసలు రూ పించుకేని
యెరుక పడక జిలేబియై మరుగు పరుప?
ReplyDeleteలక్కాకుల వారు
నమో నమః !
మీ దయ మా ప్రాప్తం
నెనరస్య నెనరః
గురువులుంగారు మా, మీ కని మామీ ఓ కొత్త టపా తెనిగించినారు కొంత సమయము క్రితము ; కొంత పస జూడవలె :)
నారదా !
జిలేబి
వారలు పెద్ద పెద్ద బుధ వర్గపు వారలు, తీరు తీరులా
Deleteనేరుతురెన్నియో, ఎరుక నేరిచినందున నిందు నందు నిం
పారెడు నేది జెప్పినను , వారల జోలికి వెల్లు సాహసం
బారయలేదు నేను, విడువందగు నన్ను జిలేబి మిత్రమా!
Deleteలక్కాకులవారు ,
తగువులాడి అలిగి వేసారినా గాని కోపగించుకొకుండా పలకరించే మనసున్నవారు మీరు ;
అపార్దం చేసుకుని బంధాన్ని వెలివేయ కూడదనే సద్భావన కలిగిన వారు ;
జోహారు
జిలేబి
తెలుగులో మీరు వ్రాసిన కధగానీ నవలగానీ ఉన్నదా ?
ReplyDelete
ReplyDeleteనీహారిక గారు
లేదు
జిలేబి
ఇంటర్వ్యూ ఇస్తున్నారా? భంశు :)
ReplyDelete
ReplyDeleteకష్టే ఫలే వారు :)
పిల్ల బుడంకాయల ఆశ ఎందుకు కాదనకూడదని ! అంతే నండీ ! యిందులో జిలేబి ప్రమేయము ఏమీ లేదు :)/జిలేబి కిట్ల్లాంటి ప్రచారాలు నచ్చవని మీరెరుగనిదా !
జిలేబి
భామ సున్న :) భంశు :)
"జిలేబి మామూలుగా మాటాడితేనే అర్ధంకాదు"
ReplyDelete"జిలేబియే పెద్ద అనానిమస్సు"
"అనానిమస్సులను allow చేయకపోడమే జిలేబి equality"
బ్లాగ్ నగర పౌరుల మాటలివి.మిమ్మల్ని చూసినవ్వుకుంటున్నారు :)
మీరు ఫేన్స్ తో కూడా అర్ధంకానట్టే మాటాడతారా?
బ్లాగ్ నగరపౌరుల మాటలపై మీ reaction?
ఫాంస్ అందరి తరపున వకాల్తా పుచ్చుకున్నవంక సన్నపువారికి
ReplyDeleteజిలేబి సర్వ భూతములను సమదృష్టి తో జూచును ;
జిలేబి మాటలు తనకే అర్థం కావు :)
ఇక ఫాంసూ జీంసూ ల మాట తానేమి జెప్పు :)
నలుగురు నవ్వి పోదురు గాని అని కూనలమ్న పదాలుపాడేసు కుని ఆరేసు కోడమే :)
చీర్స్
జిలేబి
Deleteమరో కొచ్చనేస్తే మీ ఆబోరు దక్కదు.
off the record (మీకు Interview కొత్త బ్లాగుల్లో గ(వ)మనం చేసుకున్నట్టు చేసుకోకండి. నగరపౌరులు చూస్తున్నారు)
జిలేబి,జాంగిరి,డింగిరి,బోంగిరి,పోరంబోకు...ఎన్నిపేర్లు మీకు? ఇన్ని పేర్లతో బ్లాగుల్లో గ(వ)మనం చేస్తుంటుంటారని బ్లాగ్ నగర పౌరుల మాట. మీ reaction ?
ReplyDelete
ReplyDeleteదేర్ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ జిలేబి
మిగిలిన వాళ్ళెవరో కొండ మీదున్న పెరు మాలిక కెరుక ! :) జిలేబి మాత్రం కాదు
ఆబోరు అనగా ఏమి వంక సన్నపు అబ్బయ్యా ?
జిలేబి
బంక సున్నం లాంటి చిత్రాతి చిత్ర పద సృష్టికర్త .'నజభజజజరశ్రీ'
Deleteశ్రీమాన్ జిలేబీనే ఆబోరన అర్ధమేమి అబ్బయ్యో అని బోరు బోరని
శరణు జొచ్చేలా చేసిన వంకసన్నం వారికి వీరతాళ్ళు. జయహో
వంకసన్నం. అందుకోండింక దణ్ణం.
హహ...
:) లోల...
Deleteబండి రావు గారు
మహా లోల !
అంతా ఆబోరు బరాతమే :)
జిలేబి
ReplyDeleteమీరు తెలుగువారేనా? పుట్టిందెక్కడ? ఏ జిల్లా?
భారతీయులా? మరేదేశపౌరులా? ఎక్కడుంటున్నారు?
ReplyDeleteకాదు ;
మిగిలిన ప్రశ్నలన్నీ స్కిప్పడమయ్యింది :)
పప్పడం డమాల్ :)
జిలేబి
ReplyDeleteమీరు తెలుగువారు కాదు, ఊరూ పేరు చెప్పుకోలేరు, కనీసం భారతీయులు కూడా కాదు.
బ్లాగ్ నగర పౌరులు గమనిస్తున్నారు.
Deleteఆహా ఏమి గ(వ) మనము ;)
వంక నన్నపు వారి ఈ బ్లాగ్ముఖీయము ద్వారా గవనము ఇంకా పెరుగు చున్నది !
జిలేబి నీవు బుట్టలో పడినట్లే !
జిలేబి
జిలేబి
ReplyDeleteమీకు ఇష్టమైన స్లోగన్ నారదాయనమః ఇద్దరు భారతీయులు, తెలుగువారు దెబ్బలాడుకోవాలని, వారు విడిపోవాలని, వారి మధ్య దెబ్బలాట పెట్టాలని, దెబ్బలాటని మరికొంత రెచ్చకొట్టాలని మీ aim
ఇది భారతీయ తెలుగు బ్లాగ్ నగర పౌరుల మాట. మీ reaction?
వంక సన్న అవ్ మల్ల వారికి
ReplyDeleteమాట్లాడితే తెలుగు వాళ్ల సమైక్యత గూర్చి జిలేబి యే యెక్కువ మాట్లాడి యుండె !
భారతీయ తెలుగు వాళ్లు అనటం లో మీ ఉద్దేశ్యం ఏమిటి ?
మిగిలిన తెలుగు వాళ్లు భారతీయ సంప్రదాయం వారు కారనా ? విశదీకరించుడు
నారదా !
జిలేబి
నారదుడు భారతీయ తెలుగు వాడేనా ? సమాధానం తెలిసిన వారు చెప్పగలరు :)
జిలేబి
మీలాగా, తెలుగు నేర్చుకున్నంతలో తెలుగువారు కారు, తెలుగు నేర్చుకున్నంతలో భారతీయులూ కారు. మీరు తెలుగు తెలిసిన విదేశీయులు మాత్రమే! మా అంతర్గత విషయాలలో తలదూర్చి అందరి మధ్య తగవులు రాజేస్తున్నారు. భారతీయ తెలుగు బ్లాగ్ నగర పౌరులు గమనిస్తున్నారు.
ReplyDeleteఒకప్పుడు మీ బ్లాగులో మంచి మంచి పోస్టులు రాసేవారు. దానితో మీ ఫేన్స్ అయ్యాము. మీ బ్లాగిప్పుడు శౌచాలయం స్థాయికి పడిపోయింది. మా జిలేబి అభిమాన సంఘం రద్దు చేసుకుంటున్నాము.
మీరు ఇంటర్యూ చేసేవారిని కొచ్చెన్లేస్తున్నారంటే You are a spent force.
ఇంటర్వ్యూ క్లోస్ చేస్తున్నాం.
మరెప్పుడూ మీకు కనపడని
ఒకప్పటి మీ అభిమాని.
భారతీయ తెలుగు బ్లాగ్ నగరపౌరులందరికి వందనాలు.
Off the record వీరిని వారింటి దగ్గర వదలిపెట్టిరండి.అది మన భారత సంస్కృతి.
Deleteహమ్మయ్య ! యాపిలు సఫారి అయిపాడు భంశు !
శుభం !
నెనర్లు వంక సన్నపు అవ్ మల్ల వారు !
జిలేబి పద తాడన ములే గావు, బ్లాగ్ముఖీయం కి గూడా గిట్టు బాట్లు లేకున్నట్టుంది !
ఏమి చేద్దాం !
ఏ కంత కా బొంత !
మీ ఈ స్మార్ట్ మిషన్ ఇంత త్వరలో భంశు పాడేస్తారని అను కో లేదుస్మీ !
ఎంతైనా ఈ టపా కి మీరు ఉత్ప్రేరకం కాబట్టి మీ కోసం ఒక కందం మందం గా సమర్పించు కుంటున్నా !
ఆ వంక సన్న ఫానిట
మా వంక కుతూహలముగ మా సరి కొచ్చెన్
గావంగ వచ్చె అంకిత
భావంబనుకొంటిగాద ! బాయ్ యనె గదవే ! :)
ఈ టపాలో పాలు పంచుకొని ఆనందం అందుకున్న వారి కంతా,జిలేబి ని తిట్ల దీవెన ల తో వడ్డించిన వారికంతా, (We should be surrounded by criticizers always :) అని ఎవరో ఆంగ్ల మహానుభావుడు అన్నాడట !) నెనరస్య నెనరః అంటూ
నెనర్లతో
చీర్స్ సహిత
జిలేబి
nmrao bandiగారు
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు.
లోల! లోల!!
Special Thanks for both of you.
Thanks
Deleteమహా లోల !
జిలేబి బ్లాగ్ముఖీయం పరి సమాప్తము !
మరో ఫ్రెష్ అగ్గి బరాటా షార్ట్ లీ మొదలగును :)
బ్లాగ్వెండి తెర పై వేచి చూడుడు !
చీర్స్
జిలేబి
@jilebi
ReplyDeleteIt is very easy not to be offended by a book, you simply have to close it ;
So why so much of hungama ?
దానివల్ల నష్టమేమిటో శ్రీరామ్ గారు చెప్పేరు, చూడండి.
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
జిలేబీ మాతా! మరి, మీ బ్లాగులో మిమ్ములను కించపరుస్తూ వ్రాసిన వ్యాఖ్యలకు కూడా మీరు సమాధానం ఎందుకివ్వడం? నచ్చితే చదవండి, లేకపోతే సమాధానమివ్వకండి. మీ దోవన మీరు తవికలు అల్లుకోండి.
విషయం చాలా గంభీరమైనది తల్లీ! మీరు ఆడవారైయుండి కూడా ఇలా స్పందించడం తగదు. జీవితంలో మొదటిసారి అయినా ఈ అంశంపై కొంత మనస్సుపెట్టి ఆలోచించండి. భావస్వేచ్ఛ అంటే బాధ్యతల పట్ల అలసత్వం వహించడం కాదు. మనం బ్రతికేది సమాజంలో, అడవిలో కాదు.
మీనుండి ఈ విషయమై నిష్ఠతో కూడిన స్పందనను ఆశిస్తున్నాను,
........శ్రీనివాసుడు.
ReplyDeleteశ్రీనివాసుడి గారికి,
కించ పరచడ మన్నది వారి సంస్కారం ;
దానికి రిటార్టు ఇవ్వడ మన్నది మా మనో ధైర్యం . సత్తే పే సత్తా ! సవాలే సవాల్
జిలేబి
జిలేబీ గారూ!
Deleteఇంతకాలానికి నిష్ఠగా స్పందించినందుకు ధన్యవాదాలు. మనకు జ్ఞానం ఎన్నిరకాలుగా వస్తుందో మీకు తెలిసేవుంటుంది.
ప్రత్యక్షం, అనుమానం, గ్రంథం, మిత్రవాక్యం - ఈ నాలుగు విధాలుగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం. దాని ఆధారంగా అవగాహన, నిర్ణయాలు వస్తాయి. ప్రతి ఒక్కటీ ప్రత్యక్షంగానే తెలుసుకోదలచుకుంటే ఏ భావవాహికలనూ మనం ఉపయోగించనేకూడదు. పుస్తకం చదవడంమీద నా అభిప్రాయం అది.
రెండవది,
ప్రధానవిషయం ఏమిటంటే పుస్తకం రాయడానికి మురుగన్‌కి వున్న స్చేచ్ఛ ఇతరుల మనోభావాలని గాయపరచేది కాకూడదు అనేది ప్రాథమిక సూత్రం. ఆ సూత్రాన్ని పాటిస్తే ఈ మొదటి వాక్యంతోనే మీ వాదన ఆగిపోతుంది. అది మురుగన్ చేయనప్పుడు పౌరసమాజానికి స్పందించవలసిన అవసరం వుంటుంది.
నేనయితే జడ్జిమెంట్ గురించి మాత్రమే మాట్లాడడంలేదు, మనలో సంవేదనాశీలతా రాహిత్యం ఎంతవరకూ పోయిందో తెలియజెప్పడమే నా లక్ష్యం.
స్త్రీలుగా మీలో కూడా ఆ సంవేదనాశీలత లేకపోవడమే నా విచారానికి కారణం.
శ్రీనివాసుడు
one part woman పెరుమాళ్ మురుగన్ అరవ పుస్తకానికి ఆంగ్ల అనువాదంలో ఒక ఘట్టం.
Deletehttp://scroll.in/article/697759/one-part-woman-the-novel-that-tamil-writer-perumal-murugan-is-being-hounded-for
మరొక లింకు
http://www.frontline.in/the-nation/rage-over-a-custom/article6756685.ece
మీరిక్కడ ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవవచ్చు.
https://books.google.co.in/books?id=4mhBAgAAQBAJ&pg=PT8&lpg=PT8&dq=The+Hindu+Business+Line+one+part+woman+novel&source=bl&ots=pdke618hOK&sig=8j0w0ZIgpkUrNxsvQ1fLW4bsGyY&hl=te&sa=X&ved=0ahUKEwjOrbP2nvTNAhWLNo8KHRZSCd0Q6AEIYDAI#v=onepage&q=The%20Hindu%20Business%20Line%20one%20part%20woman%20novel&f=false
జిలేబీ గారూ!
పైన ఆ పుస్తక ఆంగ్ల అనువాదం లంకెలు, మరియు సమీక్షలు ఇచ్చాను. ఇది చదవి కాలక్షేపం దశనుండి బయటకు మీరు రావచ్చు.
......శ్రీనివాసుడు.
Deleteశ్రీనివాసుడు గారు,
యిప్పుడు వచ్చారు సరియైన దారికి; పుస్తకం మొత్తం చదవండి (నాకు కూడా యిది వర్తిస్తుంది :) ఆ పై పుస్తకం గురించి (రాయాలనిపిస్తే ) రాస్తాం :)
నిన్న చెప్పినట్టు అరవం లో పుస్తకం నూట తొంభై పేజీలు ; ఆ కోర్టు వారి జడ్జి మెంటు నూట అరవై పేజీలు ; సిగ దరగ పుస్తకం చదవటమే బెటరు
(ఆంగ్లం లో కొంత 'వన్నె' తగ్గించారు ; అరవం లో నే ఘాటెక్కువ అని ఒక వాదం ; సో బెటర్ అరవం పుస్తకం :) )
చీర్స్
జిలేబి
అరవం నాకు రాదు. ఇప్పుడు వేగిరంగా నేర్చుకుని ఆ పుస్తకం చదవలేను. కొంకువెల్లలార్ కులానికి చెందిన స్త్రీలకి అరవం తెలుసు గనుక వారు ఆ పుస్తకం చదవి తమ మానాభిమానాలను ఎంత అవమానకరమో చెప్పేరు. నేను అదే ప్రమాణంగా తీసుకుంటాను. అలాగాక మీరు ప్రత్యక్ష ప్రమాణాన్నే కోరుకున్నట్లయితే ఆ కాలానికి టైమ్ ట్రావెల్ ద్వారా వెళ్ళి తెలుసుకోండి, పుస్తకం చదవడం కూడా పరోక్ష ప్రమాణమే కదా?
ReplyDeleteఏది ఏమైనా మీ బాధ్యతనుండి తప్పించుకోడానికి తర్కాన్ని ఆశ్రయించడం ఎల్లవేళలా వివేకపూరితమైన కార్యం కాదు.
మీరు ఇకనైనా కార్యక్షేత్రంలోకి దూకక, కేవలం కాలక్షేపమే నా జీవిత పరమావధి అనుకుంటే మీ ఇష్టం.
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
ReplyDeleteయిప్పటి దాకా నేను చదివిన దాంట్లో నా కనిపించింది యిది ఆంగ్ల పుస్తకాని కి పబ్లిసిటీ తేవడాని కి చేసిన స్టంట్ అని అనుమాన మొస్తొంది :)
యిందులో పెరుమాళ్ బక్రా యా లేక తానూ ఒక తానా ?
ఖచ్చితంగా ఆ ఊరి జనం మాత్రం బకరాయే !
అనుమానం అప్రతిహత మగు గాక !
జిలేబి
నేను ఆ విషయాన్ని హరిబాబుగారి బ్లాగులో మనవిచేసేను. పెరుమాళ్ ఒక కుట్రదారే.
ReplyDelete
ReplyDelete*మాదొరుభాగన్
అరవం లో ప ఫ బ భ క ఖ గ ఘ అన్నీ ఒక్జటి గా ఏడ్వడం తో వచ్చిన చిక్కు :)
మాదొరుభాగన్ - మాదు ఒరు భాగన్
మాదు - నారి
ఒరు - ఒక
భాగన్ - భాగం
అర్థ నారి అన్న సంపుష్ట పదం మరీ సంక్లిష్ట మరవంబునయ్యె :) జేకే
ఆంగ్లం లో నారి ఒక భాగం one part woman అయికూర్చుంది :)
జిలేబి
ReplyDeleteKudos to the judges and the judgment of Madras High court !
One of the judges , the chief justice being a woman , Mrs. Justice Pushpa Sathyanarayana , this case gets quite significance in the freedom of expression vs literary criticism;
Perumal Murugan has articulated well the issue of trauma of lack of child in the novel ;
జిలేబి
ఇదేదో తమిళ పైత్యంలాఉందే! :)
Deleteమహాకవి భారవి వ్రాసిన ఈ పద్యాన్ని గట్టిగా చదవండి.
ReplyDeleteనోటికి వ్యాయామాన్ని అందించండి.
పద్యాన్ని తప్పులుపోకుండా చదవగలిగినందుకు తెలుగు వాడిగా గర్వించండి.
షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే,
జడ్జట్కిట్కి ధరాడ్జ రేడ్ఫన ఘనఃఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్ట్రియపదా
ట్డ్గ్రడడ్గ్రడ్గ్రహా,
పాదౌటేట్పర్టటట్ప్రటప్రటట్రస ప్రఖ్యాత సఖ్యోదయా.
ఇది ఎవరు రాశారు ? ఎప్పుడు రాసారు ? భావం చెప్పగలరు
Delete
ReplyDeleteబోనగిరి గారు
అద్భుతః ; పంచ పాషాణ ఖండాలలో ఒకటి చెప్పారు ; మిగిలినవీ చెప్పండి :)
జిలేబి
ReplyDeleteయు జి శ్రీరాం గారు
నల్ల పయ్యన్ :)
జిలేబి
< "ఇంతకీ మా శర్మ గారే మయ్యారబ్బా ? మబ్బుల చాటున దాక్కున్నారు ?" అని మీరు "బోల్డన్ని కబుర్లు" బ్లాగ్‌లో బోల్డంత ఆశ్చర్యపోయారు కదా.
ReplyDeleteమీ ఈ టపాలో మీరు శర్మ గారిని పెట్టిన అల్లరి కారణమయ్యుండచ్చని మీకు అనిపించడంలేదా?
అల్లరిపెడితే గిల్లకుండా ఆయనూరుకుంటాడేవిటీ ?
Delete
ReplyDeleteకనుక్కున్నానండీ
వారు మబ్బుల మాటున దాక్కోటానికీ దీనికీ సంబంధం లేదటా
ప్రస్తుతం "పంచన చేరి కమింట్ల దంచు యోగ కాలము ఉందట ; ఆ కాలము అయిపోయేక మబ్బుల చాట్ నించి
వస్తామని చెప్పేరు
జిలేబి
ఛాట్ నుంచి వచ్చాక కూడా దంచితే ?
Delete
Deleteఏమండీ నీహారిక గారు
రేపు మీరు కూడా ఏదో దంచు కార్యక్రమం పెట్టినట్టున్నారు :) గిట్టు బాట్లు బానే ఉంటుందను కుంటా :)
చీర్స్
జిలేబి