Saturday, May 13, 2017

సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


ఈ మధ్య ఆహా ఓహో సాహోరే అంటున్న మహా చిత్ర రాజం - బాహుబలి !

జిలేబి కూడా సాహోరే అంటూ శార్దూలాల పొగిడేసిన చిత్రం - చిత్ర రాజ మౌళి :) - బాహుబలి !



సిన్మా చూసాక అనిపించినది సామాజిక స్పృహ లేని ఓ మా బోరింగు చిత్రం . ఈ చిత్రం ఫీవర్ తగ్గాక చూద్డా మని వెయిట్ చేయాల్సిన పని లేదు . చూడక పోయినా జీవితంలో లాస్ ఏమీ లేదు

భారతం లో ఏముంది బొంకు తప్పా అన్నట్టు ఈ బాహుబలి లో ఏముంది సినిమాటిక్ ట్రిక్కులు తప్పా అనాలి అంతే.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోట్లాట వీరాంగనలు , వీరులు బ్లా బ్లా బ్లా అంతే.

ట్రిక్కులు డిజిటల్ మాజిక్కులు దీనివల్ల జన సామాన్యానికి ఒరిగే స్పృహ ఏమిటి ?

జన బాహుళ్యానికి కలిగే మేలు ఏమిటి అన్నది ఆలోచిస్తే పూజ్యం అంతే.

సో , బాహుబలి మరో బాగు బలి .

బాక్సాఫీసు హిట్టు ; ఓకే; దాని వల్ల జనానికి బొక్క అంతే :) ఆస్కార్లు నంది అవార్డ్లు గట్టా వస్తే ఇండియా గ్రేట్ ; తెలుగోడు గ్రేట్ అనేద్దాం ; అప్పటి దాకా


జిలేబి
సైనింగ్ ఆఫ్
బీ లేజీ.

17 comments:

  1. సినిమా అంటే వ్యాపారం. సామాజిక స్పృహ బ్ల బ్లా అనుకోడం మీ పొరపాటు :) నేనే సినిమా చూడలేదు,చూడను,చూడబోను కూడా :)

    ReplyDelete
  2. బాహుబలి1 చూసి ఆస్కార్ వాళ్ళు అవార్డుకి కన్సిడర్ చేద్దామని, ఫర్ సపోజ్, అనుకున్నా 2 చూసాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటార్లెండి 🤗 నంది అవార్డు సంగతంటారా 🤔.... 😃

    ReplyDelete
  3. బాహుబలి1 చూసి ఆస్కార్ వాళ్ళు అవార్డుకి కన్సిడర్ చేద్దామని, ఫర్ సపోజ్, అనుకున్నా 2 చూసాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటార్లెండి 🤗 నంది అవార్డు సంగతంటారా 🤔.... 😃

    ReplyDelete
  4. మరంతే !! ఏదేదో ఊహించుకుని సినిమా చూస్తే అలాగే ఉంటుంది. మూడు గంటలు ఎలా భరించాలా అని వెళ్ళాలి. అప్పుడు బావుంటుంది :)
    -శరచ్చంద్రిక

    ReplyDelete
  5. బాహుబలిని మీరే పొగిడి, మీరే తెగిడితే అదోలా ఉంది. ఇంతకీ తెలుగు సినిమాలో సామాజిక స్పృహ అంటే ఏమిటండి? మా బందువు ఒకాయన చెప్పినట్టు సినిమా పూర్తిగా వినోదానికి మాత్రమే అని మరో ప్రయోజనంలేదని మనం అనుకోవాలి.

    ReplyDelete
  6. Mem US lo untaam. Padihedella maa babu ee movie chusi Amarendra Bahubali is going to have a lasting impact on me for his values etc annadu. Padahaarella maa ammaayi I want to be like Devasena what a self respect and courage annadi

    ReplyDelete
  7. సినిమా వినోదానికే అంటుంటారు సరే. అయితే ఎంత వినోదం కోసమైనా, వ్యాపారం కోసమైనా కాస్తైనా సమాజం పట్ల బాధ్యత చూపించాలిగా. ఒక వయసు దాటిన ప్రేక్షకులు ఆఁ ఏదో తీసారులే అనుకుని పెద్దగా పట్టించుకోపోవచ్చు. కానీ యువత మీద, అంతగా విశ్లేషణ చేయలేనివారి మీద, సినిమా వారిని పిచ్చిగా వ్యక్తిపూజ చేసే వారి మీద సినిమాల ప్రభావం ఎంత తీవ్రంగా పడుతోందో ఈనాటి సమాజంలో కనిపిస్తూనే ఉంది. పాతకాలంలో నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల నిర్మాణంలో బాధ్యతారాహిత్యం చూపించలేదే. మరి వారు మాత్రం వినోదం కోసం తీయలేదా, వ్యాపారం చేయలేదా?
    తర్వాత తర్వాత సినిమాలు మాస్ కోసం తీస్తున్నాం అనే ధోరణి ఎక్కువైపోయింది. మాసే బాసూ మనల్ని ఈరోజున ఈ లెవెల్లో నిలబెట్టింది అంటూ అన్యాపదేశంగా తన గురించి సినిమాలో తనే డైలాగులు చెప్పుకున్న "ఘనమైన" స్టార్లూ ఉన్నారు. మాస్ కోసమంటూ అర్ధంపర్ధంలేని, భౌతికశాస్త్ర సూత్రాలకు కూడా అతీతమైన విన్యాసాలు ఎక్కువైపోయినాయి - గ్రాఫిక్స్ వచ్చిన తరవాత మరీ కోతికి కొబ్బరికాయ దొరికినట్లయపోయింది. అడుగడుగునా విపరీతమైన హింస చూపించడం రివాజయిపోయింది - బహుశః అదే హీరోయిజం అనే భ్రమలో, మాస్ కి నచ్చుతుంది అనే భ్రమలో.

    నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమించానంటూ వెంటబడడం, పెళ్ళింట్లోనుంచి పెళ్ళికూతుర్ని తప్పించడం - హీరోయిజమా? వికారమా? సంస్కారరాహిత్యమా? బాధ్యతారాహిత్యమా? మనకి పంచే వినోదమా? అటువంటి సినిమాలు యువత మీద చెడు ప్రభావం చూపించవంటారా? అది సమాజానికి మంచేనా?

    ఇక ఆ డాన్స్ లు చెప్పనక్కరలేదు - హీరో వెనకాలో 20 మంది, హీరోయిన్ వెనకాలో 20 మంది హఠాత్తుగా ప్రత్యక్షమౌతారు. అసలవి "డాన్సులా"? చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ మాస్టారు చేయించిన డ్రిల్ లాగానూ, కుంటి నడక లాగానూ, ఒళ్ళు నెప్పులన్నవాళ్ళు ఒళ్ళు విరుచుకున్నట్లూనూ ఉంటాయి. పైగా జుగుప్స కలిగించేట్లు వెనక్కి తిరిగి పృష్టభాగం ఊపులు - అదీ కెమేరా మీదకొచ్చి - అంటే ప్రేక్షకుల మొహాలమీద ఊపడం. అదేమంటే మాస్ కోసం. పాతకాలం సినిమాల్లోనూ డాన్సులుండేవి (ఇప్పుడంత అసభ్యంగా కాదు), ఫైట్లుండేవి (ఇప్పుడంత బీభత్సంగా కాదు), మరి ఆ రోజుల్లోనూ మాస్ ఉండేవారు, వాళ్ళూ సినిమాలు చూసేవారు, శతదినోత్సవాలూ జరిగేవి.

    సినిమా తీసేవాళ్ళ దృక్పథం ఎంతలా మారిపోయిందో తెలుస్తోంది. వీళ్ళని బయట జనాలు గుడ్డిగా అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే జనం ఎంతగా ప్రభావితులైపోతున్నారో అనిపిస్తుంది. వీళ్ళని ప్రత్యక్షదైవాలన్నట్లు జనాలు వెర్రిగా ఆరాధించడం - వాళ్ళని చూసి చొంగ కారిపోవడమొకటే తక్కువ.

    ఇటువంటి ధోరణులు సామాజిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయనే బాధ్యత కరువైపోతోందే అన్నదే "సామాజిక స్పృహ" కొరవడింది అంటే. పైగా నిరంతర మీడియా కవరేజ్ లు, వీళ్ళనే ఆధారం చేసుకునే టీవీ షో లు 24 గంటలూ. జనాలకి వేరే ప్రపంచం లేకుండా తయారయేంత ప్రభావం పడుతోంది.

    తాము నటించే సినిమాలలోనే కాక ఇటువంటి బాధ్యతారాహిత్యం ఈ సోకాల్డ్ "సెలెబ్రిటీలు" మోడల్ చేసే అడ్వర్టైజ్మెంట్లలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి : ఓ సాఫ్ట్ డ్రింక్ సీసా కోసం భవనాల మీదనుంచీ, బ్రిడ్జిల మీదనుంచీ, కొండల మీదనుంచీ దూకినట్లు చూపిస్తున్న ప్రకటనలలో నటించే మోడల్ - పైగా పేరున్న నటుడు కూడానూ - కొంచమయినా బాధ్యత కలిగున్నవాడు అనగలమా? నిజజీవితంలో ఇటువంటి విన్యాసమే అనుకరించబోయి ఓ కుర్రవాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న సంగతి తెలిసి కూడా ఆ కంపెనీ తమ పద్ధతి మార్చుకోలేదంటే, ఆ "సెలెబ్రిటీ" వాటికి మోడల్ చేస్తూనే ఉన్నాడంటే - డబ్బు వ్యామోహానికి, బాధ్యతారాహిత్యానికి, సమాజంపట్ల నిర్లక్ష్యానికి, insensitivity కి పరాకాష్ఠ అనవద్దూ ! తెర మీద ఓ disclaimer పడేసి చేతులు దులుపుకోవడం. పైగా స్వేచ్ఛ అనే సాకుతో ప్రభుత్వాన్ని టీవీ మీద ఆంక్షలు సెన్సార్ పెట్టనీయకపోవడం.

    మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటుంటారు సినిమా వాళ్ళు చాలా తెలివిగా. మీరు తీస్తున్నవే మేం చూస్తున్నాం అని జనాలు అనే వాదమే సరైనది. ఎందుకంటే జనాలకి ఛాయిస్ ఏమీ లేదు, చిత్రనిర్మాణంలో జనాల పాత్ర ఏమీ లేదు. విడుదలకు ముందు కీలక పాత్ర పోషించవలసిన ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ వారే న్యాయం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి - ఎందుకంటే డబ్బొకటే ప్రాధాన్యమైపోయిన నిర్మాతలు, దర్శకులు, నటులు ఈ విలువలు పట్టించుకుంటారని ఆశించడం అనవసరం.

    ఇంతలా భ్రష్టు పట్టిపోయిన రంగంలో కె.విశ్వనాథ్ లాంటి మహానుభావుడు వంటరిగా ధైర్యం చేసి సంస్కారవంతమైన సినిమాలు తీస్తే ఆయనకు అత్యున్నత పురస్కారం వచ్చినప్పుడు తప్పులు పట్టే ప్రయత్నం చెయ్యడం మాత్రమే కొంతమంది జనాలకు చేతనయినదిలా తోస్తోంది.
    ---------------
    ఎవరి అభిప్రాయాలు, అభిరుచులు వారివి, కానీ సినిమాలు బాధ్యతాయుతమైన వినోదం అందించాలి, తాము జీవిస్తున్న సమాజం యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం అనే స్పృహ కలిగుండాలి అని సమాజం expect చేస్తుంది అని సినిమా వాళ్ళు తెలుసుకోవాలి. అర్థవంతమైన టపా రాసిన "జిలేబి" గారికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. సినిమా వ్యాపారం, కాదు వ్యాపారం కూడా అని ఒప్పుకున్నారా?
      వ్యాపారమైతే నీతులు,రీతులు ఉండవు, బూతులే ఉండాలి....చౌడప్ప మాటేంటి? బూతాడక...అన్నాడు, న బూతో, న సినిమా...మీకిష్టమైతే చూడండి...లేదూ?????

      Delete
    2. "లేదూ?????" 🙏 పెట్టి ఊరుకోండి అంటారా? మనలాంటి వాళ్ళు చేస్తున్నదదేగా.

      Delete
  8. మొదట జిలేబి/వరూధినిగారికి క్షమాపణలు. నేను వ్రాసినది ఆవిడ ప్రజ్ఞని కానీ, వ్యాసంలో ముఖ్యాంశాన్ని కానీ చిన్న చూపు చూపటానికి కాదు. ఆవిడ ఇచ్చిన సందేశాన్ని చెవుల్లోకి తీసుకొని తలకెక్కించుకొనే వాళ్ళెవరా అని అడుగుదామని చేసిన ప్రయత్నానికి వచ్చిన తంటా. .

    విన్నకోట వారు, గతంలో మిమ్మల్ని చాలా మంది మీ స్వంత బ్లాగ్ మొదలెట్టమని కోరినట్టు గుర్తు. మీరు ఇప్పుడైనా ఆపని చేసి మీ అభిమానుల్ని మెప్పించ ప్రార్థన. మీ ఇవాళ్టి వ్యాఖ్య ఒక వ్యాసమే. ఇకపోతే మీరు చెప్పినవన్నీ సహేతుకమే. ఎప్పుడైతే సినిమాలు భౌతికసూత్రాలని, సామాజిక సూత్రాలని విస్మరించి మరోలా కథలు మొదలెట్టాయో, అప్పటినుంచి నాలాంటి సినిమా చూసే వాళ్ళ పతనం ప్రారంభం అయ్యింది. అది ఒక మత్తు. మత్తులో ఉన్న వాడికి మంచి చెడు స్పృహ ఉండదు. సినిమాలను చూసి నేరాలు చేస్తున్న వ్యక్తులు ఈ కోవకు చెందినవాళ్ళే. ఎక్కువమంది సినిమాలు చూసినా స్వీయ నియంత్రణ వల్ల ఏది తప్పు ఏది ఒప్పు అన్న విచక్షణ వల్ల, వేరు వేరు సాంఘిక కారణాల వల్ల సరైన మార్గంలోనే ఉంటూ వచ్చారు. ఇకముందు అది సాధ్యం కాకపోవచ్చు. జనాలు చూస్తున్నారని సినిమా వాళ్లు, వాళ్ళు తయారుచేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని జనాలు, జనుల బాగోగులు చూడని ప్రభుత్వాలు, ఎవరిని తప్పుపట్టడానికి లేకుండా తయారయ్యింది. మీలాంటి వాళ్ళు సినిమాలు చూడమని అన్నా, అల్పసంఖ్యాకుల వల్ల మీరు కోరుతున్న మార్పు సాధ్యమేనా?

    ReplyDelete
  9. 🙏 అన్యగామి గారు.
    లేదు, మార్పు సాధ్యం కాదు. ఏదో "బ్లాగ్ శోష" అంతే.

    ReplyDelete
  10. విన్నకోట గారు. నేనూ సినిమాలు అసలు చూడను. కానీ బాహుబలి-2 typical తెలుగు సినిమాలాగాలేదు. కాస్తో కూస్తో పురాణాల్ని తెచ్చి పెట్టారు. హీరోయిన్ లకి పాటలకేపరిమితం చేయలేదు. మీరు చెప్పినట్లు నిశ్చితార్ధం అయ్యాకా హీరోయిన్ హీరో తో ప్రేమలో పడటం లాంటివి చాలా చిరాకొస్తాయి. ఆ పాటలు అంతకంటే రోత కలిగిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. అయ్యో చంద్రిక గారు, బాహుబలి సినిమా గురించి గానీ ఆ సినిమా చూసినవారి గురించి గానీ ఉద్దేశ్యించి నేను నా వ్యాఖ్య రాయలేదు. జనరల్ గా రాసాను. వినోదం పేరుతో అర్థంపర్థం లేని, తలాతోకా లేని కథలో అసభ్య హాస్యం బీభత్స హింస దట్టించి సినిమాలు తీస్తున్న ట్రెండ్ గురించి రాసాను. నా ముందరి వ్యాఖ్యలో అన్నట్లు సినిమాల విషయంలో జనాలకేమీ ఛాయిస్ లేదు (చూడడం పూర్తిగా మానెయ్యడం తప్ప).

      Delete

  11. The Hindu Matrubhootam UvAcha on Bahubali 2 :)

    Baahubali II: majestic kingdom undone by bad public works: http://www.thehindu.com/thread/reflections/baahubali-ii-majestic-kingdom-undone-by-bad-public-works/article18514936.ece

    Cheers
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మాతృభూతం interesting వ్యక్తిలా ఉన్నాడే! ☺

      Delete
    2. భూతాలకు ఇమేజినేషన్ పవర్ ఉంట్టుందా? అవి అందాన్ని,అద్భుతాన్ని చూసి ఆనందించగలవా? మల్లెపువ్వు విలువ కోతికేమితెలుసు? మల్లెపువ్వు ఇస్తే, కోతికి ఎక్కడ పెట్టుకొంట్టుందో, బాహుబలి ని చూసి మాత్రుభూతం, కోతిబుద్దిని గుర్తుకు తెచ్చేలా రాశాడు.

      ఇంతచెత్త ఆర్టికల్ చదివించి, సమయం వృథా చేసినందుకు మీపై కోపం నషాళానికి అంట్టింది.

      Delete
  12. అందరూ మెచ్చింది మీరు మెచ్చితే గొప్పకాదుగా...అసలు విషయం బయటపెట్టారు..దట్ ఈస్ జిలేబీ :)

    ReplyDelete