కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
ధనజాతకమునకు జిలే
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteకష్టేఫలే శర్మగారి సాయిన్సు తేట గీతి - ట్వీటు ట్రీటు :)
బిందె నీటిని తలకిందు బెట్టి చక్క
గాను పలుచని వస్త్రము గట్టి కొంకి
నసరి గట్టి దానిచలువ నతల నిడిన
మండు వేసవిలో చలి మెండు సుమ్ము
జిలేబి
ReplyDeleteభీముని పలుకులు చంద్రశ్రీ వృత్తము
ప్రకోపమ్ముల్గూడున్, రణమున పారింతు రక్త
మ్మకో! శాపమ్ముల్ తీర జనుల మారాటముల్ ప
న్నుకో! పాపమ్ముల్ పండగ మిము నూర్చంగ నిక్క
మ్మకో! తాపమ్మున్ తీర్చనిక సమాఘాతమే కో !
జిలేబి
ReplyDeleteజిలేబీ! పద్యమ్ముల్ చదువను చింతించ లేనౌ!
భలే! పన్నుల్ వేయన్ తగుదువు భాసించ వమ్మా!
చలాకీ ! నీ భాగ్యమ్ము గద సొసాయించ లేద
మ్మ లాఠీదెబ్బల్లన్ గురువులు మాసక్క గానౌ :)
జిలేబి
ReplyDeleteఓయమ్మా! ప్రాసలకై
న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
వేయించడము జిలేబీ !
సోయగముల నోలలాడు సొగసరి వలదే !
జిలేబి
ReplyDeleteకోయంటే కొల్లలుగా
నేయగ పదముల జిలేబి నేతరి వోలెన్
మేయము లాయెన్ పద్యము
లౌ యతి గణముల జతగని లావుగ నిచటన్ !
జిలేబి
ReplyDeleteకలికి! కౌగిలి ప్రాణాంతకారి గాదె,
పలుకుల కొలికి! నెలతుక! పదముల వలె
నను పిడినిడుచు పట్టుగ నలిపి పిండి
జేయ వలదు జిలేబియ! చేవిడు చెలి :)
జిలేబి
ReplyDeleteకోపము నషాళమున కం
టే! పాగల్పన్ జిలేబి టేటే పలుకుల్ !
సాపాటు రాయుల టపా
మా పై తోసితివి గాద మర్కట రమణీ :)
జిలేబి
ReplyDeleteధారా ళంబుగ గాధల
నేరాలంబుగ జిలేబి యెన్నిటి నో శ
య్యై రాసెన్నందులనన్
శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్!
జిలేబి
ReplyDeleteపద్యలక్షణాల గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన “అనుభవాలూ – జ్ఞాపకాలూను” పుస్తకంలో ఇలా అన్నారు (రెండవ భాగంలో 23వ అంకం/Chapter లో) :-
” ఛందస్సు తెలిస్తే కవే అయివుండనక్కరలేదే దెవరయినా కట్టెయవచ్చు పద్యాలు.
అయితే, అవి కమ్మెచ్చున లాగినట్టు నడిపించడం వొక విశేషం.
కొలతలు తప్పకుండా సమపాళాల్లో బొమ్మ గియ్యడం యెలాంటిదో, వ్యాకరణ దోషాలు దొర్లకుండా రచన చెయ్యడం యెలాంటిదో, నడక చెడకుండా పద్యం కట్టడమూ అలాంటిదే. పద్యాని కుండవలసిన యోగ్యతల్లో మొదటి దిది.
నడక అంటే యెగుడు ల్లేకపోడం మాత్రమే కాదు, రెయిలు పెట్టెలకు లాగ అనుస్యూతత యేర్పడాలి.
ఏమంటే?
ఎంత నేర్పుండినా యిటుకలు పేర్చినంతమాత్రాన గోడ కాదు, బెందడీ – సున్నమూ – లేక సిమెంటూ వంటి బంధకాలుండాలి, యథోచితంగా.
అలాగే, గణయతిప్రాసలు సరిపుచ్చి మాటలు బిగించినంతమాత్రానా పద్యం కాదు, ఆ మాటలకు పొందికా, బిగువూ ఏర్పడాలి, విశిష్ట సంధానంతో.
అలా చెయ్యగలగడానికి చాలా సాధన చెయ్యాలి, ప్రత్యేక శ్రద్ధతో.
గురువుల మాట గురుతెరిగి పలుకౌ :)
జిలేబి
రావాడ కృష్ణ గారని ఒక హైస్కూలు మాష్టారు గారుండేవారు. ఆయన నాకన్నా చాలా పెద్ద వారు. కాని నాపై ఎంతో స్నేహాభిమానాలు కలిగి ఉండేవారు. అప్పట్లో నాకింకా హైదరాబాదులో ఉద్యోగం కాలేదు. కొంతమంది పిల్లలకి కాలక్షేపానికి ట్యూషన్‌లు చెప్పేవాణ్ణి. అందులో సీఐగారమ్మాయి కూడా ఉండేది. ఒకనాడు నాదగ్గర పాఠం చెప్పించుకొని వెడుతూ కృష్ణగారిని చూసి మాష్టారూ నా బొమ్మవేయరా అని బ్రతిమాలింది.
ReplyDeleteఅన్నట్లు ఆయన మా ప్రక్కవాటాలోనే ఉండేవారు. పైగా చాలాపేరున్న చిత్రకారులు. ఆ అమ్మాయి బ్రతిమాలితే అలవోకగా నాలుగ్గీతల్లో ఆమె బొమ్మ వేసేసారు! పోలికలు నూటికి నూరుపాళ్ళూను!
అయన బాగా చేయితిరిగిన కళాకారుడు కనుక ఆయన అలా కొద్దినిముషాల్లో కాసిని గీతల్లో ఆమెచిత్రం గీయగలిగారు.
లలితకళల్లో దేనిలోనైనా అటువంటి స్థాయి ఒకటి తప్పక ఉంటుంది. అలా అలా సులువుగా బొమ్మగీసేయగల ప్రజ్ఞ ఎలాగో అతి ధారాళంగా పద్యం చెప్పగలిగే ప్రజ్ఞకూడా అటువంటిదే.
మొదట కళ అన్నది పుట్టుకతో కొంత వస్తుంది. సాధన వలన మరింత మోరుగవుతుంది. పెద్దలవద్ద మెళుకువలు గ్రహిస్తే అది మహోన్నతమైన దశకు వెడుతుంది.
గళ్ళుకట్టి బొమ్మలు వేసే దశ ప్రాధమికం. అలాగే గణాల్లో అక్షరాలు పేర్చుకుంటూ వ్రాయటం కూడా ప్రాథమికం. గళ్ళుకట్టివేసిన బొమ్మను అంతర్జాతీయప్రదర్శనకు ఎవరూ ఎలా పంపరో - గణాల్లో అక్షరాలుపొదిగి కిట్టించిన పద్యాలవంటి వాటిని అందరిముందూ ప్రదర్శించటమూ ఎవరూ చేయకూడదు సుమా అని విజ్ఞులు గ్రహించగలరు.
Deleteసృష్టి సమస్తము జిలేబియే గద !
సృష్టి విలాసము జిలేబియే గద !
చీర్స్
జిలేబి
శివశివా
Delete
Deleteహరి ఓం తత్సత్ !
జిలేబి
ReplyDeleteతమ కలహ యత్నములికన్
గమనించదగును జిలేబి గట్టేరదు సూ
వె! మదియు రాపాడ తగదు
సుమముల కురిపించవమ్మ సుందరి నీవున్ :)
జిలేబి
ReplyDeleteకలయైన జీవితమున
న్నిలకడ లేని మదికోరె నిచట నలుగురిన్ !
నలుగురి కోసము పాపము
వలలో చిక్కిరి జిలేబివరులిచటగదా !
జిలేబి
ReplyDeleteసీరియలుల గనన్నట చిత్ర మెల్ల
మానసమ్మును చెట్టగ మంకిపట్టు
నేరమగుఁ, జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము
మేలగు జిలేబి విడువమ్మ మేరమీఱ!
జిలేబి
ReplyDeleteఇటుకల పేర్పుల పద్యము
లటుగావు వినవలెనమ్మ లకుమికి పిట్టా !
దిటవుగనవమ్మ యీ పలు
కు టమారమ్ముల సడి సణుగుడు మన కేలా !
జిలేబి
ReplyDeleteమాంచెస్టరు మారణ హో
మం!చెట్టగు విధము గాద మనుజుల తీరుల్ !
సాంచహు లోచిక్కిరిబో
బాంచెను జనులటు జిలేబి బద్మాష్ గాళ్లై !
జిలేబి
ReplyDeleteమాంచెస్టరు మారణ హో
మం!చెట్టకు కారణంబు మా జ్యోతిష్యం
టంచను గా గాంచెనహో !
సోంచా యించిరి జిలేబి సోకుడుబుడుగుల్ !
జిలేబి
ReplyDeleteరగడల దినముల పదముల
పగడము గడగడ సరియగు పసగుల గననౌ
సగపడ, కవనపు పలుకుల
బిగువుల గురుడటు నెలకొన బిరబిర వచ్చెన్ !
జిలేబి
ReplyDeleteపునర్జన్మల్ మీదన్ గురుడటు పూచీగ తాన
య్యెనమ్మా !మాయాజా లమిదనియే యేసు జెప్పె
న్ననెన్ ! యేమా యెన్బో యమెరిక! నాగాడుచుండెన్!
సునాయాసంబౌ ధ్యానము మనసున్నన్ ఫలించున్ !
జిలేబి
ReplyDeleteహా!తల్కము! దాశరథికి
సీతను బెండ్లాడి, శివుఁడు శిశువుం గనియె
న్నా తామసి పెనిమిటియై,
లేతరి కమ్మన జిలేబు లేమరి యేనౌ !
జిలేబి
ReplyDeleteశయ్యాసౌభాగ్యంబుల్
వయ్యా రపునడక పద్య వాగ్ఝరి బాగుం
దయ్యా మీ మధురగతియు
సయ్యాటగ సాగెనయ్య శ్యామల రాయా !
జిలేబి
ReplyDeleteమనదేశమునన్ ప్రాచీ
న, నవ్య కథయౌ ధరణిజ నాగటిచాలున్
తనుబుట్టెను,పెనిమిటి రా
ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్!
జిలేబి
ReplyDeleteహ! తు పా కులబెది రించి నె
లతుకను పెండ్లాడెనుగద లాపర్వాహీ
వెతలు తొలగ పడతి తిరిగె
బతుకున్నీడ్చన్ జిలేబి బార్డర్ వాగ్వా !
జిలేబి
ReplyDeleteబుడతా బడికొస్తావా?
పెడతా బువ్వను జిలేబి పేర్మిని గూడన్
సడిజేస్తో ఆడుకొన
మ్మ డమడమల యాడు వయసు మరియిదియేనౌ !
జిలేబి
ReplyDeleteపెళ్ళికి ముందే తల్లై
కళ్ళెము వేస్తా జిలేబి కన్నడి కనుచున్
భళ్ళన కుండను కొట్టెను
చెళ్ళని హాసనుడి పిల్ల చెకుముకి రాయీ :)
జిలేబి
ReplyDeleteఓ! వైవీ ! యీ రాత
న్నేవో మారెక్కడో గనేనుగ ద? జిలే
బీవోలెవున్న దే ! య
బ్బీ! వూ రేదో ? విషయము బిగిబిగి తెలుపన్ :)
జిలేబి
ReplyDeleteఎక్కడి కథలన్ పట్టితి
వక్కమ్మా ! మజ జిలేబి వార్చితివిగదా
చిక్కుల్ బడితిని సుమ్మీ
తక్కిడి జేయంగ వాడు తప్పే వెదుకున్ :)
జిలేబి
ReplyDeleteఅమా వాస్యా ! నీవే సుమ జన భారమ్ము లెల్లన్
సమానమ్మై జేయన్ కడియము సంజోకమున్ జే
సి మా ప్రాణమ్ముల్లాగితివి మసిన్ బూసి! ఓ చం
ద్రమా ! మా పాడెన్గట్టితివి సుతారమ్ము గానన్
జిలేబి
ReplyDeleteణిసిధాత్వర్థము కోరగ
ముసిముసి నవ్వుల జిలేబి ముగ్ధగ నిలువన్
మిసుకుల తడబాటుల పడి
పసదనములను తొలగింప పతి దరి జేరెన్ :)
జిలేబి
ReplyDeleteఅర్నాబదిగో మళ్ళీ
చర్నాకోల గొనివచ్చె సందడి జేయన్
ధర్నాలన్ జేయన్నం
తర్నగరమునన్ జిలేబి తాటన్వొల్చున్ :)
జిలేబి
ReplyDeleteమానవుడు మనసు పెట్టిన
కాని పని యని యిల నేది గలదు జిలేబీ
ఆ నింగి నీది యత్నము
పూనించగ నీవు సృష్టి పుట్టించెదవోయ్ !
జిలేబి
ReplyDeleteసమసంఘనోటు ఫైవున
జమగట్టి మనుజుడు చిత్ర చామర వీచన్
గమనింపవచ్చి గురుడొక
సమస్యను కెలికె జిలేబి సహచరుడుగదా :)
జిలేబి
ReplyDeleteకొండలచట మునులవలెన్
నిండుగ వినయముగ నిలిచె నిర్మల జలమున్
మెండుగ యర్ఘ్యంబిడనౌ
చండాంశునికిన్ జిలేబి చక్కటి చుక్కా !
జిలేబి
ReplyDeleteకాఫీ త్రాగుచు కందము
సాఫీ గా తేటగీతి చంద్రశ్రీల
న్నాఫీసులోన సరసీ
యే ఫీచరునైన లేమ యెక్ రంగీలా :)
జిలేబి
ReplyDeleteటీకా తాత్పర్యములన్
బాకా జేయుచు జిలేబి బాగుగ జేసెన్ !
మా కాలపు మడిసి గదా !
రాకింగుల వైవి సూవె రంగం జాలం !
జిలేబి
ReplyDeleteమెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు
మండు టెండలో కురిసెను మంచు జల్లు
యండగొట్టక చల్లని యాశుగమ్మె
చండ రుక్కటు దాగెను జలధరమున !
జిలేబి
ఏమయ్యారండీ జిలేబి గారు !! మీ పద్యాలని మిస్ అవుతున్నామండీ :)
ReplyDelete
ReplyDeleteబాబాయని నమ్మ జిలే
బీ_ బా యని బిల్వ నతడు, బిత్తరు బోయెన్,
తోబాయని రమణియు ఠా
ణా పోలీసును బిలచెను నలుగులు బెట్టన్ :)
జిలేబి
ReplyDeleteమాతా! యేటైమ్ జోన్లో
ఖాతా లోనన్ జిలేబి కబురుల మా కం
తా తాయిలంబు గానౌ
నాతతముగ తెలి యజేయు నాట్యంబిదియౌ :).
జిలేబి
ReplyDeleteకొలగారమ్ముల సరసన
పలుకుబడులు ముత్యమాయె పంతుల కథలన్
కొలవెరి కాలంబిదియౌ
కొలతలు తీయన్ జిలేబి కోపుల్ గలవో :)
జిలేబి
ReplyDeleteతక్షణమటుకుల వడ, సతతము జాంగ్రి,
వలయు నన్న పదముల సువాసనల జి
లేబి, గర్మా గరమ్ముగ లెస్స ! తెలుగు
భక్ష్యముల నా? ముదము తోడ వండ దగును :)
జిలేబి
ReplyDeleteరెండద్దంబుల తోడన్
డండం బనుచున్ జిలేబి ఢమరుక పదముల్
గుండము లో రుబ్బెనహో
భాండాగారమ్ములోన పద్యపు కవటల్ :)
జిలేబి
ReplyDeleteపందికి వేయుదు రంటా
జందెము పండుగ దినంబు జరజాగ్రత్తా
పందియు వరాహ మూర్తిగ
అందరి పూజలను గైకొన వెలయు తంబీ :)
జిలేబి
ReplyDeleteఓసోసీ రమణీ నీ
వేసము మాకు తెలియదని వేడుక వలదోయ్ :)
జాసూసీ తాతల్ బా
జా సూవె జిలేబి నీకు జాతర యికనోయ్ :)
జిలేబి
ReplyDeleteఎంత వారలైన జిలేబి, యీడు నందు
కాంతకై తపింతురు, వార్ధకమున మిగుల
వింతగానగుపించును విషయ మెల్ల
కొంత కాలపు సరదాలు కోతి పుండు :)
జిలేబి
ReplyDeleteఅనిసా కథలన్ పారుడు
సునిశితముగ లొసుగుల గని సూక్ష్మము బట్టెన్ !
వినియోగదారులెవరో
కనిబెట్టి సరసన జేరక పరుగిడుదురో :)
జిలేబి
// అనిసా కథలన్ పారుడు....//
ReplyDelete👌👌👌 😊
ReplyDeleteనిను తెలుసుకొనగ లేదని
మనుజుండా చింత యేల మదిలో! సతతం
నిను వీడకయున్నా మరి
నను నీవటు చూడలేక నకనక లేలన్ !
జిలేబి
ReplyDeleteపద్యము వ్రాసిన యేమిటి
చోద్యం బందురు జిలేబి జోజో బజ్జో :)
ఆద్యులు పారులు గదవే
సేద్యము జేయుచు పలుకుల సేవధి బేర్చున్ :)
జిలేబి
ReplyDeleteసెల్ఫోనుదండ కంబును
కుల్ఫీ వోలె కవివరుడు కూర్పుగ జేసెన్!
జల్పంబుల దేవి గదా
బల్, "ఫం"బులతో నమనము బంహిమ జేయన్ :)
జిలేబి
ReplyDeleteకాలేజీ ధర్మాత్ముల
మేలగు రీతుల్, విధవల మేల్మిని గను! యీ
కాలము లోను విరివిగ వి
శాలంబగు హృది జిలేబి సాధ్యము గనవే !
జిలేబి
ReplyDeleteఇది యందమైన కథ యని
పదిలము గా విశ్వనాథ భాషా సరణిన్
సదనము నందున దాఖలు
కుదురుగ జేసెను గురుండు కుహుకుహు యనుచున్ :)
జిలేబి
ReplyDeleteప్రజలటు మరువరు దేశపు
సుజనుల రీతుల జిలేబి శోభిల్లగనన్
నిజమౌ ! భారత భూమియు
యజకము యజరామరంబు యవనిన్ భామా !
జిలేబి
ReplyDeleteరామా ఫలము జిలేబీ
లేమా ! సీతాఫలమ్ము లే మాకిచటన్ !
ఈ మారు లక్ష్మణ ఫలము
కై మేము వెతికెదమమ్మ ! కైమోడ్పు గొనూ !
జిలేబి
ReplyDeleteఅసలైన మాటకారి గ
ద సుదతి యని గురుడటు పలుదఫ పలికిన హా,
మిసమిస బోకు జిలేబీ !
కసకస కోయును నిను మరి కామాక్షీ భో :)
జిలేబి
ReplyDeleteపద్మార్పిత గారండీ!
బద్మాష్బ్లాగ్లో కమందు పాదమ్మూనన్
యిద్మాన్ చేయన తమ కర
పద్మముల కమలకు నాంది పలుకగ రండీ :)
నేను సైతం మరో సమిథ నయ్యెద
కమలముగ విరిసెద పంచదశ లోకమందు :)
జిలేబి
ReplyDeleteశుభమగునుగాక యెల్లరు సుఖము గాను
క్రతువుల నిట చేతురు గాక! కలిమి చెలియ
వాహినిగ వెలయవలయు వరము గాను
రండి! రారండి ! కొల్వగ రక్ష రక్ష!
శుభాకాంక్షలతో
జిలేబి"
ReplyDeleteఅదిగో దుర్యోధనుడు
న్నిదిగిదిగో శకుని మామ యింగ్లీషున చీ
ల్చి దుమారము గావించిరి
గద! రావయ్య యభిషేకు గప్పున రమ్మా :)
జిలేబి
ReplyDeleteమా యొజ్జ దీర్ఘదర్శి ! స
మాయత్తంబై జిలేబి మాణీకంబై
సాయంబు జేసెనుగదా
రాయంచవలెన్నితరులు రమణించగనౌ !
జిలేబి
ReplyDeleteప్రేమ నొలక బోసారా ?
ఓమా పద్మార్పితమ్మ ! హోయని తిట్టా
రా? మావా యని బిల్చా
రా? మాటలు మూగబోయె ! రమణీ యబలా !
జిలేబి
ReplyDeleteకేసేస్తా న్రోయ్ ! యభిషే
కూ!శూరుడ! సూరనేని ! కూసిన వంటే
నీ సైటును లాగించే
స్తా! సూస్కోర!హరిబాబు సై యంటే సై !
జిలేబి
ReplyDeleteహరిబాబునిర! నిను వదల
నుర! ముష్టాకు!యభిషేకు ! నుయ్యో గొయ్యో
బిరబిర చూస్కోర! సవా
లుర! నడిరోడ్డున పడెదవు లుకలుక యనుచున్ !
బస్తీ మే సవాల్
జిలేబి
ReplyDeleteపదునెనిమిది యధ్యాయము
ల దుమారంబు హరిబాబు లబ్జుగ జేసెన్
సదనంబందున దాఖలు
చెదపురుగుల కిట సవాలు చెకుముకి రాయీ !
సెహభాషోయ్ !
జిలేబి
ReplyDeleteరామానుజాచార్య ఉవాచ (యట)
1- గురువుకు -శిష్యుడికి ఉన్న తేడా.
మనము గురువులము కాబట్టి ఇతరులకు జ్ఞాన బోధ చెయ్యడానికి దేశాలు పట్టుకు తిరగాలి. వాళ్లకు అటువంటి బాధ్యత లేదు కాబట్టి ఒక్క చోటనే ఉండి, ప్రపంచ బాధ్యతలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు.
2 - ఒక పుణ్య క్షేత్రానికి ఇతర క్షేత్రాలకు ఉన్న తేడా.
వాళ్లు ఒక్క చోట ఉండి ఒక క్షేత్రం లో దేవుడ్ని పట్టుకొని నిశ్చిత గా ఉంటారు. మనం దేశాలు తిరుగుతూ చాలా మందిని ప్రార్థిస్తూ ఉంటాము. చివరకు మనకు మిగిలేయిది సంశయమే నిశ్చింత కాదు.
3 - ఇతర ఆళ్వార్లకు భక్తులకు - విష్ణు చిత్తులకు (పెరియ ఆళ్వార్) కు ఉన్న తేడా.
మనం ఇతర ఆళ్వార్ల లాగా కొన్ని సార్లు దేవుణ్ణి దూషిస్తుంటాము కూడా. వాళ్లు (పెరియాల్వార్లు) "విష్ణు చిత్తుల" లాగా ఎప్పుడు దేవుణ్ణి సంశయ బుద్ధి తో చూడరు .
4 - సముద్రము- తీరానికి ఉన్న తేడా.
మనము సంసారం అనే సముద్రం లో ఉన్న నావ లాగా ఒడిదుడుకులు లోనవుతుంటాము. . వాళ్ళు తీరంలో ఉన్న నావ లాగ దేవుణ్ణి పట్టుకొని నిశ్చింత గా ఉంటారు
5 -అణువు - పర్వతం లాంటి తేడా
మనం మన కులం, గోత్రం, జాతి లాంటి వాటి లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల భక్తి వల్ల తమకు భగవంతునికి ఉన్న సంబంధం , భక్తి యొక్క ఆచరణ నే తమ జాతి, కులం అని అనుకుంటారు.
6 -చెరుకు - చక్కర లాంటిది
మనం వేదాలనే చెరుకును నమలడం లో ఇరుక్కు పోయి ఉంటాము. వాళ్ళు భగవంతుని పట్ల శరణాగతి అనే చక్కెరను సులువుగా ఆస్వాదిస్తూ ఉంటారు.
7 -భూమి- ఆకాశం లాంటి తేడా
మనం భూమిమీద ఉన్న జంతువుల లాగ అన్నిటికీ భయపడుతూ , అయోమయం లో ఉంటాము. వాళ్ళు ఆకాశం లోని పక్షులలాగా నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు.
8 -రాత్రి -పగలు లాంటి తేడా
మనం వేదములు అనే రాత్రి లో దారి తెలియక తడుము కుంటూ ఉంటాము. వాళ్ళు భగవద్గీత లో కృష్ణుడు చెప్పినట్టు అయన శరణాగతి వల్ల భగవద్భక్తి అనే పగటిపూట వెలుగు లో సరియైన దారి లో సంచరిస్తుంటారు.
9 -సామాన్యమయిన రాయి - రత్నానికి ఉన్న తేడా
మనము రోజుకు మూడు సార్లు గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తుంటాము. వాళ్ళు రత్నం లాంటి శరణాగతి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు.
10 - జార లక్షణం ఉన్న స్త్రీకి -మంచి స్త్రీకి ఉన్న తేడా
మనం ఒక జార లక్షణం ఉన్న స్త్రీ లాగా రకరకాల దేవుళ్లను ప్రార్థిస్తుంటాము. వాళ్లు మంచి స్త్రీలాగా పరమాత్ముడిని తప్ప వేరే ఎవ్వరిని లెక్క చేయరు.
ఏకం సత్ విప్రాః బహుధా వదంతి
జిలేబి
ReplyDeleteసంధ్య వేళ లందు సహృదయత గనుచు
సర్వ జనుల హితము శాంతి గోరి,
హృదయ మాదిలక్ష్మి గృహమను చును యగ్ర
మాంస మిష్టపడు సుమా ద్విజుండు
సర్వేజనాః సుఖినోభవంతు
జిలేబి
ReplyDeleteప్రేమా? తల్లా? కామం
బా! మనుజుల తీరు మారె పచ్చటి చిలకా!
భామలు మారిరి కాలపు
నీమము తప్పుచు జిలేబి నిలకడ తప్పెన్ !
జిలేబి
ReplyDeleteరావట మే ఆహా! బా
డ్కోవని బలుపులకు తీట డొక్కలు చీల్చెన్
ఈ వనిత ఫైరు బ్రాండుగ
దే! వరుసగ వచ్చు చెప్పు దెబ్బలును మరీ :)
జిలేబి
ReplyDeleteనాబోటి నిశాచరులకు
పూబోడీ ! యర్ధరాత్రి పువ్వారు సమ
స్యా పూరణలౌ సుమ్మీ,
రాభస్యము శంకరాభరణ కొల్వుననౌ :)
జిలేబి
ReplyDeleteకందంబౌ మూలమిదం
బృందా వనమందు లేమ, బృందిష్టముగన్
విందార గింప శంకరు
డందంబగు రమ్యమైన రంగమొనర్చెన్ !
జిలేబి
ReplyDeleteబాధా తప్తుల గాచుచు
మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
శోధన జేసె నసురులకు
రాధనమును జేర్చి, యౌర ! రన్తృ విభుండే!
జిలేబి
ReplyDeleteఅష్టమి దినమది జిలేబి యహిరిపువున
కు, మన రాముని జన్మము కుదిరెనమ్మ
నవమినాఁడు; రక్షాబంధనమ్ము వచ్చు
పున్నమి దినపు శ్రావణ పుణ్య వేళ!
జిలేబి
ReplyDeleteఆహా ! వకార పంచక
మా! హార్నీ మీ సొబగులు మాచన గాంచెన్
ఓహో! వడ్రంగి కథన
జోహారులు యిల్లుకట్టి జూచిన చవియో:)
జిలేబి
ReplyDeleteఆరాటమ్మును వీడెన్
శ్రీరామునిఁ గని యహల్య ! శిలగా మారె
న్తూరుపు దొర రన్తృవవన్
కోరికలే గద జిలేబి కుంపటి గాల్చున్
జిలేబి
ReplyDeleteవ్యాసుడుచ్చరింపగ యాఖు వాహనుండు
ఘంటముగ దంతమునుగొన గణుతి కెక్కె
భారతము; వ్రాసి వాల్మీకి వాసికెక్కె
రామ చరిత సీతకథను రమ్యముగను !
జిలేబి
ReplyDeleteమనుషుల్లా బతికెదమ
మ్మ! నోటి కొచ్చిన పలుకులు మానన్ తగునౌ !
వనమిది బృందావనమిది
జనవాహిని వివిధములు సుజనులై ఉందాం !
జిలేబి
ReplyDeleteపాక్షిక చంద్రగ్రహణం !
సాక్షి యిదే చూడుడిచట సాయిన్సు జిలే
బీ! క్షీణించు, పెరుగున
మ్మా ! క్షమతగ ప్రకృతి తీరు మాలిని గనుమా !
జిలేబి
ReplyDeleteవేదనలకు దగ్గరగా
సాధించగ మేల్కలయిక సాధ్యంబగునౌ
శోధింపని మమతా, ప్రే
మాదరణలు నెలతుకకు సమాశ్రయమగుచున్ !
జిలేబి
ReplyDeleteమసక మసక చీకటిలోన మల్లె తోట
వెనుక మాపటి వేళన వెక్కి వెక్కి
కర్మ కారణ మనియేడ్చు కామనీయ
రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె
జిలేబి
అందమైన ఆ కాంచన పాటిట
Deleteకందములో దూరిపోయి
ఛందముగా డాన్సు జేయ,ఆ
నందము కలిగెన్ 😀
అందమైన ఆ కాంచన పాటిట
Deleteకందములో దూరిపోయి
ఛందముగా డాన్సు జేయ,ఆ
నందము కలిగెన్ 😀
Deleteవైవీ యార్ గారు
అది ఆరుద్ర గారి గొప్పదనము (బై ది వే పైది తేటగీతి కందము కాదు) - ఆరుద్ర వారు పలికితే చందం జాలువారుతుంది ; యిక సినిమా కంటే చెప్పాలా !
నెనర్లు
జిలేబి
అందమైన ఆ కాంచన పాటిట
Deleteకందములో దూరిపోయి
ఛందముగా డాన్సు జేయ,ఆ
నందము కలిగెన్ 😀
జిలేబిగారు,వివరణకు థాంక్యూ!🙏
Deleteప్రాసప్రయాసలో కందాన్ని పద్యానికి పర్యాయపదంగా వాడేశాను.అలాగని అది తేటగీతి అనేది తెలుసని కాదనుకోండి.😀
Deleteవైవియారు గారు
బాగు బాగు ! రేపట్నించి శంకరాభరణ అడ్డా లోకి వచ్చేసేయండి :) - கலன்து உரயாடலாம் :)
చీర్స్
జిలేబి
Delete*கலந்து உரையாடலாம் :)
ReplyDeleteతమిళుల చతురుత మంకుత
నము మన కెట్లొచ్చునమ్మ నాస్తికు లనుచున్
తమ తమ యిండ్లన దేవు
ళ్ళ ముదముగ నిలిపి డియెంకె లవలవ యనెనౌ :)
జిలేబి
ReplyDeleteమైండు "చెదల" గొట్టె పదపు
సౌండుల పంచదశలోక సామ్రాజ్ఞిగదా !
బెండులు తీయగ భయపడి
గుండులు తడిమిరి జనులట గురువిట పలికెన్ :)
చీర్స్
జిలేబి
మన్నించాలి
ReplyDeleteమీరు వ్రాసిన
పద్యాలు
కొన్ని అర్థమై
మరికొన్ని
అర్థం కాకున్నవి.
Deleteమధు గారికి
కొన్నైనా అర్థమయ్యాయన్నారు చూసారు, దానికే పదివేల నెనర్లు :)
రాసాక నాకే కొన్ని అర్థం కావు :)
జిలేబి
ReplyDeleteకలయో నిజమో యనుచు
న్నిలలో తహతహ జిలేబి నీలుగుడేలా!
వలలో పడినావు గదా
సలసల కాగెడు చమురిక సరి సరి మనకే !
జిలేబి
ReplyDeleteఓ బ్రహ్మచారి ! కోతుల
తో బ్రాహ్మణుడు నినుబోల్చె తొకతొక వలదోయ్ !
హా! బ్రామిక లే తెలియని
యేబ్రాసి బతుకు జిలేబి యెవరికి వలయున్ :)
జిలేబి
ReplyDeleteమరువకు మరువకు మావా!
పరువపు పడుచును నలిగితి పానుపు మీదన్
పరిమళ మంతా పరచుకొ
ని,రాధనము గోరుచుంటిని, సఖిన్ రమ్మా !
జిలేబి
ReplyDeleteఅవకతవక పద్యముల ని
ట వడ్డనగ సల్పమాకు టంకుటమారీ !
గవనము వలయును గురుడని
కువకువ లాడకు జిలేబి కుమరిప్పెణ్ణే :)
జిలేబి
ReplyDeleteగురుడిని గోకన్నేలా
పరుగుల బిరబిర జిలేబి పద్యము తోడన్!
విరసములో సరసమ్మా!
చరచర పేర్చుము పదముల చక్కని చుక్కా:)
జిలేబి
ReplyDeleteనిర్దయ గా నన్ను విడువ
నర్దన ! పూర్వస్మృతులిట నను తాకెనుగా!
వర్దా! నీ యూసుల తో
పర్దా లై యార్ద్రమయ్యె పద్మార్పితమై !
జిలేబి
ReplyDeleteగోకగ గోకగ గురువుల
బాగౌ విన్నాణమున్ను పద్యములు జిలే
బీ! కావున గోకవలయు
బాకా యూదుచు మరిమరి పారుల వార్నీ :)
జిలేబి
ReplyDeleteగుర్రము మీదన్ స్వారీ !
బర్రున జేసిరి జిలేబి పారులు గనవే !
చర్రున వ్రాయన్ భళిభళి
గిర్రున తిరుగవలె తలయు గిరికీ గిరికీ :)
జిలేబి
ReplyDeleteవేంకట రమణుండాతని
శంకటముల తిమిరము నిను చప్పున వీడన్
చెంగట యైన హృదయమున
తంకము వీడుచు జిలేబి తరముగ నమ్మూ !
జిలేబి
స్వస్తి
ReplyDeleteవడవడ వణుకుచు చచ్చిరి
పడు రాళ్ళధ్వనికి గారె భటులౌ! పూరిం
ప, డుగుడు డుగుమని నాదము
గడగట్టగ, యరి సెగలుగ గర్జన చేసెన్ !
సావేజిత
జిలేబి
ReplyDeleteవెంకయ్యనాయుడు భళీ!
జంకును బింకమును లేక ఝాడించెను తా
రంకాడు మీ డియా నటు
యాంకల బోవగ జిలేబి యా రాజ్యసభన్ !
చీర్స్
జిలేబి
ReplyDeleteతానే తానని తానము
తానట గ్రహియించెనోయి తనకుపడుచహో!
తానవము తెలియ గురుడట
తేనుకొనుట వీడెనోయి తిరముగ సుమతీ
జిలేబి
ReplyDeleteనమ్ముము! నిను వరించిన నల్ల వాడు
తమ్ముని కొడుకు! పెండ్లికిఁ దగదు చనగ,
పిండి, పప్పుబెల్లములని బేర మిచట
వరునికి వలయు కట్నము వస్తుచయము !
జిలేబి
ReplyDeleteమెయిలయ్య మాలతమ్మను
చయమున ఝాడింపబోవ చప్పున ఢామ్మం
చు యయేవ కరోతి సయే
వ యనుచు తిక్కను కుదిర్చె వనిత జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅంతర్నేత్రము తెరిచిన
నంతర్భాగము న వెలయు నలతలు కలతల్
వింతగ తొలంగి సత్యము
శాంతంబై యాత్మ కాంతి చక్కగ నెలయున్
జిలేబి
ReplyDeleteజ్ఞానత్రిపుటియు లేదని
లేనే లేదేదియనుచు లేదను పాటల్
గానమ్ములు, పద్యమ్ములు
మాను జిలేబీ! విభుడు సమముగని నిలుపెన్ !
జిలేబి
ఆజ్ఞాపిస్తున్నారా?
Delete
ReplyDeleteమోహాంధకారుల, జిలే
బీ, హానిని జేయు జనుల, భీకరులగుచున్
సౌహార్దృత విడు సంఘపు
ద్రోహుల, శిక్షించుట ఘనదోషము గాదే.
జిలేబి
ReplyDeleteనెనరుల్ జిలేబి గారికి !
పనసతొనల పదముల నొక పద్యంబున, హా!
ఘనముగ పేర్చుచు కవనం
బును గూర్చు చతురులు సూవె! బొరుగుల్ వోలెన్ :)
జిలేబి
ReplyDeleteపైవా రుల్, మన వారుల్
నీవారుల్ నా జనులని, నెరనమ్ముము రా
జీవా! యేవారైనా
నావారే ! భేదము మరి నాలో లేదోయ్ !
జిలేబి
ReplyDeleteఆజ్ఞాపిస్తున్నారా?
విజ్ఞాపనయా! జిలేబి వివరింపదగున్ !
యే జ్ఞానంబై న గురుడ
యజ్ఞానంబే విభుని లయమ్మును తప్పన్ !
జిలేబి
ReplyDeleteమీమా అనాత వరపు క
మామిషు గ లలలితనే సుమా! హ! జిలేబీ!
యీ మాలిని యూరందరి
కీ మా బాగా తెలిసిన క్షేత్రము సుమ్మీ !
జిలేబి
ReplyDeleteశాంతము! ధర్మజుడు సుమా
కుంతీపుత్రుఁడు! వినాయకుఁడు గద శిష్యా
యంతకహరునికి, నంబకు
నెంతయు ముద్దుల తనయుడు! నెరనమ్ముమురా!
జిలేబి
ReplyDeleteకొందరు రంధ్రాన్వేషణ
డెందంబరయన జిలేబి రేయింబవలున్,
కొందరు పదముల సొబగు
ల్లందం బులగనిరిట నుబలాటంబులనన్ !
జిలేబి
ReplyDeleteకమ్మటి తెలుగండీ! మీ
తెమ్మర గానన్నిటొచ్చి తేలితి మయ్యా
అమ్మ చలువన కవీశ్వర,
నెమ్మది యటమటములవిడి నెలకొనెనయ్యా!
జిలేబి
ReplyDeleteఈనా తెలుగున్ గననౌ
హా! నెట్ జనులు పరుగిడిరి ! ఆనందంబౌ
మానవతీ ఓ లలితా!
మా నస మందు పరితుష్టి మాటయనిరిగా!
జిలేబి
ReplyDeleteమరికొంచెము తూగులకై
సరిజేయగ రమ్యమై పసగను పదమ్ముల్
మరిమరి జేయన లలితా
మరియొక నెలతుక జిలేబి మాదిరి యగునౌ :)
జిలేబి
ReplyDeleteసన్నిధి సన్నిధి యనుచున్
పెన్నిధి యై వెలయు భువిని పేరోలగము
న్నెన్నక నిలచితివి గదా
కన్నడి లోకము జిలేబి కాన దగనిదో ?
జిలేబి
ReplyDeleteకలయట! జగత్తు గనవే
నెలతుక! యిలలో గురువులు నేర్పిరి సుదతీ!
వల, యింద్రజాల మిదియే
కలకల లాడుచు కనబడు కాష్టంబిదియే
జిలేబి
ReplyDeleteమూన్నాళ్లముచ్చటాయెగ
దన్నా శిశువులకు బతుకు ధర్మంబేనా ?
యెన్నికలలో ! చిదిమెనుర!
మన్నిక బోయెనుర ప్రభుత మరువన్న్యాయం !
జిలేబి
ReplyDeleteఉసురుల్ బోయె శిశువులకు
కసాబు వర్తకులు ప్రభుత కర్తృత్వంబై
పసికూనల యుసురుల్ మిము
మసిజేయక విడువదు, యిది మదిలో గనుడూ !
జిలేబి
ReplyDeleteలంకించుకొనెను హరిబా
బంకిత మగుచున్ జులాయి బ్లాగుల రాతల్
సంకుచితంబౌ కోత
ల్నంకుశమున పొడచి మదముల నడచెను భళీ !
జిలేబి
ReplyDeleteఏకాంతమునట, సీత య
ధీకారంబు, జితనారిధీ! యవని తనూ
జాకారంబై! రామా !
నీ కారుణ్యమగు వరము నిత్యము మాకున్ !
దత్త పది - కాంత, మగువ, నారి, వనిత
జిలేబి
ReplyDeleteస్వాతంత్రంబెట్లోయీ
మీ దారులవచ్చు సూవె! మేష్టారట వే
ణీ తనువులతో పలికిం
చే! తంత్రముల చదువ వగచెనుర కచేరుల్ :)
జిలేబి
ReplyDeleteకెలికిరి నీహారికనట
చెలువపు గురువులు ఫెడేలు చెలియా రమ్మా!
నలుగులు బెట్టన్ తరుణము
వల విసురమ్మా జిలేబి వణుకన లోకం :)
జిలేబి
ReplyDeleteఓయమ్మ జిలేబీ! కొరి
యా, యాపాను రమణుల సయాటల బండిన్
రాయలు పాడిన గీతము
లాయెను సూపరు ధమాక లాల్ దుప్పట్టా :)
జిలేబి
ReplyDeleteనను పాలింపగ పద్యం
బను పాలన సాకుచు మురిపాలన్ గురువుల్
జొనిపారిటన్ జిలేబీ !
మునిపుంగవుల పలుకులు సముచితము నాకున్ !
జిలేబి
ReplyDeleteచిన్నోడీడే మొగుడౌ!
విన్నాణంబధికమయ్యె విజ్ఞత గలిగెన్
సన్నాహంబుల జేసితి
సన్నాసిని నౌత సూవె చక్కని చుక్కా :)
జిలేబి
ReplyDeleteమనసున్న మావ, మురిపా
ల నాకొమరునికి పితరుడి లగ నను మనువా
డ, నెలతుక! యతని ముద్దుల
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో !
జిలేబి
ReplyDeleteభామయు చేయగ పూరణ
"కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"
సామి, సరిజేసిరి గదా
"కాముడు తనను గురి జూడ కాంతయు మెచ్చెన్"!
జిలేబి
ReplyDeleteపన్నుల తో పన్ను విరిచి
మిన్నగ తేల్చ లలితమ్మ మీగడ వోలెన్
కన్నడు నాపన్నుల గా
వన్నేడిటవచ్చెనోయి వన్నెలు గూడన్ :)
జిలేబి
ReplyDeleteపద్యము లైనను గద్యము లైనను
విద్యగ నేర్వన వివరముగను
నేర్వగ నేర్వగ నెక్కొను నేర్పులు
చెంగట వచ్చుచు చెలువముగను
ముంగిట దీర్చిన ముగ్గుల సొగసుగ
రంగము నందున రసనయుగను
తిరముగ యత్నము తీరుగ జేయన
వరముగ నవ్యత వరవడిగను
జిలేబి
ReplyDeleteఅన్నపు గరిటయు సన్నని గరిటయు
మనుజులు బట్టిరి మాలిని గను
లేమలు వచ్చిరి లెస్సగ చూడన
కన్నుల మిన్నగ గానను భళి !
మారెను లోకము మార్పును చూడగ
మగువల పనినిట మనసు గనుచు
గరిటల వంటకు గానము జేయుచు
బారులు తీరిరి పారులు సరి :)
జిలేబి
ReplyDeleteచదువంటలేదు గానం
డి! దుముకు డబ్బాయి రైతుడిలలో నయ్యెన్ !
సదరు నెలతుక కనబడలె
యిది వినికిడి,హస్తినాపురినగల దనుచున్ !
జిలేబి
ReplyDeleteపెద్ద వయసు ముచ్చటలో
ముద్దుగ ఒద్దుగ జిలేబి మురిసితిమి సుమా !
హద్దులు లేవుగ దా మా
సుద్దుల రాతల కును, శుభ సూక్తులకున్నూ !
జిలేబి
ReplyDeleteఆకయింటిలో నడిరేయి యరుగు దెంచె
విజయసారథి ; జన్మించె విపిన మందు
భరతుడమ్మ ,జిలేబి, సభను తెలుపుము
జనులు మెచ్చ వలయునమ్మ చక్కగాను
జిలేబి
ReplyDeleteఇచ్చట దెయ్యము లహహో
వెచ్చగ నిదురోయి సూవె , వెండితె రలపై
తచ్చట్లాడి సమర్పణ
విచ్చల విడిగన జిలేబి విరివిగ జేయున్ :)
జిలేబి
ReplyDeleteఏమిది యేమిది యనుచున్
మా మారుతిని యడుగంగ మాస్టారూ తా
నేమయ్య జెప్పును సుమీ !
భీమా వుంటే జిలేబి బిరబిర బోవున్ :)
జిలేబి
ReplyDeleteస్పెయిను! హటాత్తు గ నులికి ప
డె! యా యిలాహి యని జనుల డెరిజా పైనన్
కయికట్టుగాంచి బండిని
భయానకముగ నడిపించి ప్రాణము గొనిరే !
జిలేబి
ReplyDeleteఓయమ్మ జిలేబీ! మా
ప్రాయపు ముచ్చట్ల నరయ వయసే రా లే
దాయె సుమా నీకున్, రమ
ణీ యామపు కబురులమ్మి ణిసిధాత్వర్థం !
జిలేబి
ReplyDeleteపరుపుల పైనన్ సుఖముగ
పరుండు కొని కులుకుచు సరపణుల కెలుకుచున్
కరపోకరాయి చందపు
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
ReplyDeleteకొండ మీది పరకామణి కి పోయినా నాలుగు కాసులు గిట్టు బాటవుతాయ్ :)
పరగడపు పద్యములతో
గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
పురట,పరకామణికి వెడ
ల రయ్యన గలుగును మంగళాశాసనముల్ :)
జిలేబి
ReplyDeleteపేరున గలదోయ్ రమణీ
పేరోలగ రూపములు సుభిక్షము గానన్
సారధియై వ్యక్తిత్వపు
వారధి యై నిలచునవి సవాలుగ మనకున్ !
జిలేబి
ReplyDeleteఅసలు మగవారివే నోయ్
పసగల్గిన వంట లెల్ల, భామల్లాపై!
వసుధన్నలభీములు గద
రసమయ వంటకములకును రాట్టులు రమణీ !
జిలేబి
ReplyDeleteసరపణులతో జిలేబీ
సరసపు సయ్యాటలాడి చయ్యన పదముల్
వరుసగ వేయన్ కందము
పరుగుల తేలి దరిజేరి పదనిసలాడెన్ !
జిలేబి
ReplyDeleteఅట్లాగేనండీ పెస
రట్లాంటి శుభాంగి ! చక్కెర తునక ! రమణీ
యిట్లా రాస్తా వుంటే
గట్లా తెలుగు బిరబిర సుఖకరంబగునౌ !
జిలేబి
<"తెలుగు బిరబిర సుఖకరంబగునౌ!"
Delete--------------
తెలుగుభాష గురించి మీరీమాటలు (అసలీ పద్యం) ఏ సందర్భంగా అన్నారో తెలియదు. "పెసరట్ల శుభాంగి" అంటే?? (వేరేవారినుద్దేశ్యించిన మీ పద్యాలు కూడా మీ పర్సనల్ రికార్డ్ కోసం మీ ఈ బ్లాగులో వ్రాసుకుంటున్నట్లున్నారు బాగానే ఉంది. కానీ చిన్నప్పుడు context reference అని ప్రశ్నలడిగేవారు గుర్తుందా, అది మీరు ఇక్కడ కూడా పాటిస్తే బాగుంటుందని మాబోంట్ల మనవి).
నేను చెప్పేది కూడా భాష గురించే కాబట్టి, ఇక్కడ అతక్కపోయినా, చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతానికి తెలుగు టీవీ ఛాన్నెళ్ళలో కనపించి మనల్ని 'పులకింప' చేసే తెలుగు భాషకు కొన్ని మచ్చుతునకలు చూడండి.
(1). "జుబిలీహిల్స్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్"
(ఆ నేరం చేసినవారి కోసం పోలీసులు తనిఖీ చేస్తారని భావం?)
(2). "Contact Dy E.O (Pub & Press)". ఇది తెలుగు కాదులెండి కానీ టి.టి.డి. వారి తెలుగు ఛానెల్లో స్క్రోలింగులో కనిపించి, ఆసక్తికరంగా అనిపించి, చెప్పాలనిపించింది. కనీసం ఆ Pub అన్నది Publicity (అనే వారి భావం అనుకుంటాను) అని పూర్తిగా వ్రాసినా కొంత నయం ��.
ReplyDeleteగుండుకి కూడా యనుమతి
నిండాలేదోయ్ జిలేబి నిక్కము గనుమా!
మెండుగ నేలా పదముల
దండగ గుచ్చుచు మరిమరి ధమధమ లాటల్ :)
జిలేబి
ReplyDeleteచెదురగ, షేర్ మార్కెట్టే
కుదేలు మనె! యిన్ఫొసిస్సుకు తిలోదకముల్
సదనంబందు విశాలుడు
పదునౌ వ్యాఖ్యల జవాబు పరుషంబులనన్ !
జిలేబి
అతిచేస్తే గతి చెడుతుంది.సిక్కాతో 7% కోసుకుపోయింది.
Delete
ReplyDeleteకథలో “లా” చిక్కుల తా
పథమున బోవుచు జిలేబి పట్టుగ చూడ
న్నధరపు కోపము తోడై
విధాత తలపునకు వచ్చె విరివిగ సుమ్మా !
--
వక్రంబేమియు గాదయ!
సక్రమమే! తల్లి నిజము ! సదనంబునకున్
చక్రంద్రిప్పన తండ్రి ప
రాక్రమ మువలయు సమాజ రావంబదియే !
జిలేబి
ReplyDeleteన్యాయమ్మా!ధర్మమ్మా!
సాయంబట్టుడు జిలేబి సారము గానన్ !
ఓయంతర రంగపు సా
మీ!యిది తెలిసిన విదురులు మీరే మీరే :)
జిలేబి
ReplyDeleteతన కంపెనీకి నారా
యణమూ ర్తి యెసరును బెట్టి యాడుకొనుటయా !
వనితా ! జిలేబి ! సూక్షిని
గనవలెను సమరములకు జగడగంటి చెలీ !
జిలేబి
ReplyDeleteజల్దు కొనవమ్మ పూరణ చకచకయని
గాంచి చదువుమమ్మ యితర కవుల కైపు!
సహృదయుల హత్తుకొను పద్య సౌరభముల
మత్తుమందు సేవించుట మంచిదె కద !
జిలేబి
ReplyDeleteమత్తునట తూగుచు జిలేబి మరువకమ్మ
యింటి పనులెల్లనాగిపోయెను గదమ్మ !
వదుల వమ్మ పైత్యములను వంట గదిని
గాను అయ్యరు ఫిల్టరు కాఫి కోరె !
బిలేజి
ReplyDeleteయువతీ! జిలేబి ! సరపణు
లువలయు ననుచున్ రుసరుస లుకలుక లేలా !
సవరము బంగారు ధరల
వివర మెఱుఁగ, లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్:)
జిలేబి
ReplyDeleteమతిలేని వారలౌ శ్రీ
మతులెల్లను పడతి ! సీత! మగవారలటుల్
నుతిజేయ తమ్ము, తనివిన్
బతుకుల నీడ్చు సుదతులు శుభాంగీ రమణుల్ :)
జిలేబి
ReplyDeleteమౌనము పెదవుల పైనన్
మానని చిరునగవులే సుమా మానవులన్
స్థానము తప్పక నిలుపున్!
ఓ నరుడా వినవలెనుర నోర్మియు గూడన్ !
జిలేబి
ReplyDeleteమన బిడ్డయైననన్ నే
మి! నమ్మి మనసంపదల సుమీ నివ్వకుమా!
మనుజుడ ! యే కైపుల పు
త్రుని పెంచితివయ్య దాని రూపము భవితా !
జిలేబి
ReplyDeleteతన కంపెనీకి నారా
యణమూర్తి యెసరును బెట్టి యాడుకొనుటయా!
మునుగక మునుపే సరిది
ద్దన నాతని యత్నమయ్య దమ్మున్నోడూ !
జిలేబి
ReplyDeleteఏడిస్తే మీ మదిలో
భారము తీరంగ వచ్చు పద్మార్పిత ! కా
నీ రవ్వంతయు కష్టము
లారవు తీరవు జిలేబి లావుల్ దప్పున్ !
జిలేబి
ReplyDeleteప్రాసల ఊసులు మనకే
లా! సారూ ! యేడ్పుగొట్టులకు కొదవే లే
దౌ ! సమరంబున కైనా
ఓ సామే, సరసపు సరిజోదులు గురువుల్ :)
జిలేబి
గురువుల ' సరిజోదుగ ' మి
Deleteమ్మరయమిచే చేటు వచ్చె , మహితాత్మా ! ఓ
గురువా ! గురుతెరిగితి , మీ
గురువుల దరిజేర నాకు గుండె కుదేలౌ .
ReplyDeleteఆశ్చర్యంగా ఉంది - అభినవగుప్తుని ప్రస్తావన లేకుండా ఛిన్నముండ కథయా ?
శ్రీ విద్యల గురువులటన్
తావరుసగ ఛిన్నముండ తాలూకు కథ
ల్నావిష్కరించె రమణీ
తావిడిచె యభినవ గుప్త తంత్రంబేలన్ ?
జిలేబి.
ReplyDeleteసరికొత్తకోక నిచ్చెను
మురిపాల మొగుడు జిలేబి ముద్దుల గుమ్మా !
నెరయన్ గొట్టగ తాళవ
లె రసికత యిది యనుకొనుచు లెస్సగ లేమా :)
జిలేబి
ReplyDeleteకైవార తాత పల్కుల
తావారమున తెలిపారు తరమై మీరున్
శ్రీవారి పొత్తమునచట
యావత్తును స్కాను జేసి యందించండీ !
జిలేబి
ReplyDeleteకాననముల పడగొట్టెడి
మానవుఁడే దానవుఁడును; మాధవుఁ డయ్యెన్
వేణువు నూదుచు నందరి
మానసమును దోచు విభుడు మహిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteమానసములోని యలజడి,
యానందములన్ జిలేబి యరయగ మహిలో
హానము, హితముల జేయుచు
మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్!
జిలేబి
ReplyDeleteమరువన్ తగునా యనుచున్
మురిపెము తో యడిగినారు ముద్దుగ లేమా !
కరిమింగిన వెలగ కథయు
గురుతుకు వచ్చెను జిలేబి గుమ్మా గుమ్మా :)
జిలేబి
ReplyDeleteమీ పూరణలెల్లను బా
గౌ ! పాఠకులకు జిలేబి గౌరవ మిమ్మా !
ఓ పారి తిరిగి చూడ
మ్మా! పాత రచన లనెల్ల, మాన్యంబేనో ?
జిలేబి
ReplyDeleteదేశము పంక్తిగ మారక
రోశము గా భక్తిగాన రోమాంచితమౌ !
కోశాగారము నిండక
మా సాహస శకుని నాయమది మన కేలా :)
జిలేబి
ReplyDeleteఓ "నా " జిలేబి! వినవే !
యా "ణా" ప్రాసగన సాటి యవ్వదు నీకున్ !
దీనత్వము వలదు సఖీ !
వీనుల విందుగ పదములు విరిసెను నీకై :)
జిలేబి
ReplyDeleteచంపక మాలలతో మా
దుంపల త్రెంచవలదమ్మ దూకుడు లలనా!
గంపల కొలదిగ కందపు
లంపట మాయె నిక యేల లసితపు వృత్తమ్ :)
జిలేబి
ReplyDeleteకథల నెలా చదవాలోయ్?
విధవిధములుగద జిలేబి విదురుల వ్రాతల్ !
పథమది యొకటే లేదోయ్
కథనము మనకైపు కొలది కావాలనకోయ్ !
జిలేబి
ReplyDeleteవయ్యారమ్ముగ చదువుగ
దెయ్యపు కథలను జిలేబి దిమ్మయు తిరుగన్
సుయ్యను శబ్ధము జల్లన,
తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్!
జిలేబి
ReplyDeleteజల్లనె మేని గుభిల్లన
యుల్లము కాష్మో ర బిలువ యువతీ రావే
చల్లగ షికారు కన, యా
పిల్ల చరచర వెడలె సుమ పిట్టల కాల్చన్ :)
జిలేబి
ReplyDeleteఅక్త్రము తొడుగవలదు ! యను
వక్త్రముల కిది సమయంబు వనితా రావే!
పక్త్రిమ భంగిమలమరగ
వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే :)
జిలేబి
ReplyDeleteఆ రాహుకేతు వులటన్
ఆరామంబులను మారినారట గానన్
ఘోరప్రమాదములకు
న్నారాటంబులకు కారణమది జిలేబీ !
జిలేబి
ReplyDeleteఆనంతానంతానం
తానమ్మానంతనంతతానంతానం
తానమనంతానంతం
తానంనంతాతనంతతానంనంతా !
జిలేబి
ReplyDeleteకథయొకటి రాసెద జిలే
బి! ధరణి వీడి జనులెల్ల భీతిన్ పరుగె
త్త ధనా ధన్ననుచు సుమా!
ప్రధానముగ రేపు వచ్చు పాఠకులకటన్ :)
జిలేబి
ReplyDeleteఓరీ !హరి!యజ్ఞానివి
రా !రాతల చదవుమోయి! రభసల్లేలా !
వారో గాబ్రియలుగదా !
హీరో యనుకోకు బాబు, హిజరత్ కతయౌ !
జిలేబి
ReplyDeleteకథకన్న కథనెలా చదు
వ ధర్మమనునది నరయగ వలెను జిలేబీ !
విధముల తెలిపిరి వనజయు
సధర్మపు పలుకుల గనుము చాలా భేషౌ !
జిలేబి
ReplyDeleteజగణపు తలాకు కిక స్వ
స్తి! కాంత లెల్లరకు ముక్తి! స్త్రీ శక్తి యికన్
వగచక తమ వంతుగనౌ
సగర్వముగ సమ సమాజ సాపుల గానన్ !
జిలేబి
ReplyDeleteకపటపు ధోరణి లేక, య
క ! పలుకులను తూచ తప్పక వినుచు, మజ, చా
న పొసగుల యుండెడు పరా
కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కెలు మించన్ :)
జిలేబి
ReplyDeleteధ్వంసంబగును జిలేబీ
హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
వంశాభివృద్ధి కటు ని
స్సంశయముగ మేలుగోరు సజ్జనుడు సుమీ !
--
ధ్వంసంబగును జిలేబీ
హింసకుఁ బాల్పడెడివాఁడె; హితమును గూర్చున్
శంసల గొను సజ్జనుడౌ
యంసము పై భార మెల్ల యంశము గనుచున్ !
---
ఓం! సంకల్పము గాంచి య
హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్
హ్రీం! సద్భుద్ధిని నివ్వన్
క్రీం! సమరసములను గాంచి కీర్తిని బడయున్ !
జిలేబి
ReplyDeleteమకుటమే దక్కె రాజ్యమ్ము మనకు లేక
బోయె నమ్మ జిలేబి! సపోర్టు బోవ
నిలిచి నావమ్మ దేశపు నీడ లోన,
శకటమే దక్కె నశ్వమ్ము జారుకొనియె!
జిలేబి
ReplyDeleteఓ ప్రశ్నడగొచ్చా రమ
ణీ! ప్రారబ్దంపు కర్మ నిలదీయంగన్
ఏ ప్రాణియైన మనలన్
యేబ్రాసిగ జూడవచ్చు యేమర మాకోయ్ !
జిలేబి
ReplyDeleteఅడుగక మరియడుగన పర
గడుపున నెలతుక, వలదనక సరిసరి యనన్
పిడుగుల పలుకులు,దబదబ
గడగడ విసురులు మన తలకడచు జిలేబీ :)
నారదా!
జిలేబి
ReplyDeleteఓ విన్న కోట నరస
న్నా! విదుషీమణి పలుకుల నసుగుడు నసుగుల్ :)
ఏవన్నా తప్పే గా
దా! వినునా మన నొడుగు ముదముద జిలేబీ !
జిలేబి
ReplyDeleteకుర్రతనపు పనులవి!మా
యర్రులు జాచిన మజ మజ యనదగు దినముల్
గుర్రము లెక్కితి మీ! పై
కర్రల కై యత్నములవి కష్టే ఫలమై !
జిలేబి
ReplyDeleteఆలోచనలన్దాటుచు
నీలోని యనుభవములు వినిర్గము గానన్
ఆ లోకేశుని హృదయము
లోలోపల నిల్పి వృద్ధి లోనికి రమ్మా !
జిలేబి
ReplyDeleteబొంకగ నౌ యతుక వలెను
బొంగరమువలె తిరుగాడు బొమ్మా ! యెచటే
సింగారీ తెలుపదగును
వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్ ?
జిలేబి
ReplyDeleteఓయమ్మ జిలేబీ ! అది
గో యవ్వారమ్ముల సరి గూర్చన్ శ్యామ
ల్రాయరు మరి రాలేదే
సాయం గాంచుచు సమస్య సానల్దేల్చన్ ?
జిలేబి
ReplyDeleteసెహభేషౌ! తన రైల్వే
నహరహ చిక్కులకు చక్క నయ్య వివరణల్!
కుహనా నేతల నీడన
నహంకరించుయధికార నటనలకు బలై !
జిలేబి
ReplyDeleteశ్యామల రాయా ! స్వేఛ్ఛను
ధీమా, గన యాంధ్రభారతిన పదమగు ప
ళ్ళే! మా బ్రౌణ్యంబున కూ
డా మాస్టారు కనబడలె ! రావడి గాదోయ్ :)
జిలేబి
Delete*స్వేఛ్ఛాధీమా
ReplyDeleteఅనగనగా కుర్రాడొక
డు నాడు, వత్సరములట కడు మునుపు, కవితన్
తనకై రాసుకొనెనట! న
మనము తెలిపెనిప్పటి జన మర్యాదలకున్ !
జిలేబి
ReplyDeleteమీరీ మధ్యన టీవీ
పోరుల లోకన బడక కపోణిన్నడ్డే
సారే? యేలమ్మా నీ
హారిక? మరదేల నమ్మ హంగులు తగ్గెన్ ?
జిలేబి
ReplyDeleteపదముల అతుకుల బొంతను
మధురాతిమధుర మనిరి సమంచితముగనౌ
విదురుల సభలో కవివర
పదివేలదియేను మాకు పబ్బపు దినమున్ !
జిలేబి