కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన
ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.
శార్దూలం లో కందం ఇమడాలంటే -
మొదటి, మూడవ పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది (గుడ్డి గుర్తు :))
ఉదాహరణ
ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌర పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!
---
ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్
చీర్స్
జిలేబి
ReplyDeleteక గ శా వి
ధారాళంబుగ జేయ సిద్ధి బడయన్ ధామంబిదేనమ్మ నో
రారా రావము జేయు సూవె రసికా రావే శుభమ్ముల్గనన్
ఏరాలంబు జిలేబు లూర వరమై పేరోలగంబుల్ భళీ
రా రారాయని బిల్చు నిన్ను రమణీ రావే శుభాంగీ చెలీ !
--
ధారాళంబుగ జేయ సి
రా రావము జేయు సూవె రసికా రావే !
ఏరాలంబు జిలేబులు
రారాయని బిల్చు నిన్ను రమణీ రావే !
జిలేబి
జిలేబి
జిలేబీగారు,
ReplyDeleteమీ ప్రయత్నాలు అభినందనీయం. కాని ప్రతిప్రయత్నమూ ప్రచురణార్హం కాదన్న సంగతి మీరు గుర్తెరగాలని నా ఆకాంక్ష. ఒక సారి ఎవరో విశ్వనాథవారిని అడిగారు - ఇప్పటికి మీరెన్ని పద్యాలు వ్రాసి ఉంటారూ అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ప్రచురించిన ఒక నలభైవేలుంటాయేమో. వ్రాసి చింపేసినవి మరొక యభైవేలపైననే ఉంటాయి అని. ఆయన ఎందుకలా అన్నారో/చేసారో ఆలోచించి గ్రహించ ప్రార్థన. సామెత చెప్పినట్లు ఏదివ్రాసినా ఎక్కడో అక్కడ అచ్చేసి వదిలేయటం సరైన విధానం కాదు. అభ్యాసదశలో వ్రాసినవన్నీ నిజానికి హెచ్చుభాగం సిల్లీగా ఉంటాయి. పెద్దల సహాయంతో తప్పులు దిద్దుకోవటం ద్వారా పురోగతి కలుగుతుంది. అక్షరాలను గణబంధాల్లో ఇరికించటమే కవిత్వం అని భావించే పక్షంలో ఎవరికీ ఎవరూ ఏమీ చెప్పలేరు. స్వస్తిరస్తు.
ReplyDeleteధన్యవాదాలండీ శ్యామలీయం వారు
ఈ టపా పెట్టిందందుకే నెనర్లు
బ్లాగున్నది దేనికయా
ఓ గురుడా మజ జిలేబు లూరన్ గదయా !
మాగూడిది పద్యములన్
సాగింపగ యత్నముల్ పసగన తలమహో !
జిలేబి
ReplyDeleteక గ శా వి
ఓమా శ్యామల రాయ రస్తు మకరందోత్సాహమంతే! ధమా
కా! మామత్తమిదేనయా సుమములై గానన్నిటన్ పద్యమున్
స్వామీ యత్నమిదౌ; మరింత గరిమన్ సాధింపగన్నౌ సయా
టా; మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై జిలేబుల్ గనన్ !
---
ఓమాశ్యామల రాయర!
మామత్తమిదేనయా సుమములై గానన్
స్వామీ యత్నమిదౌ మరి
మేమిచ్చట జేయ సూవె మెకమాటంబై !
ஜிலேபி
ReplyDeleteక గ శా వి
సాహోరేయని సాగు ముచ్చటగనన్ సాహిత్యమౌ పాడియా
వౌ! హాహుండటదేవదూత హవణీ ! పారించుమా పాదముల్
బాహాటమ్ముగ వచ్చు నున్నతి భళా పద్యంబులై సాగు న
మ్మా!హాహారవముల్ జిలేబి హసనమ్మౌనౌ సఖీ వీడుమా !
---
సాహోరేయని సాగుము
హాహుండటదేవదూత హవణీ ! పారన్
బాహాటమ్ముగ వచ్చును
హాహారవముల జిలేబి హసనమ్మౌనౌ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteక గ శా వి
పుంసాంమోహన రూప ముత్యపు జిగిన్ పుంఖానుపుంఖమ్ముభా
సీంసంసక్తితదేవరూప సఖుడై సీతా సమేతంబుగా
సంసారస్థితుఁడై, యతీశ్వరుడు పూజా భాజనుండయ్యెడు
న్నంశాంశాశ్వతుడౌ వృషాంక సమమై నాడౌ రమానాధుడున్
---
పుంసాంమోహన రూపము
సంసక్తితదేవరూప సఖుడై సీతా
సంసారస్థితుఁడై, యతి
శాంశాశ్వతుడై వృషాంక సమమై నాడౌ !
జిలేబి
ReplyDeleteక గ శా వి
ఆకాశమ్మున మబ్బులన్ గనుచు స్వప్నావస్థ లో యేలన
మ్మో! కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంతన్విడంగన్తగు
న్నౌ కీలాలము లొల్కయమ్మ రమణీ? నాట్యమ్ము లేలన్ సుధా
ర్నాకో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?మదాలాపి లే !
---
ఆకాశమ్మున మబ్బుల
కాకమ్మ కబుర్ల నీవు గయినన్ ముంత
న్నౌకీలాలము లొల్కయ
కో! కావకమౌ జిలేబి కొమరారౌనో ?
జిలేబి
ReplyDeleteక గ శా వి
కౌసల్యాయని వీరుడున్ననుజుడున్ కాకుత్స్థ వంశస్థుల
గ్గో!సాసుళ్ళట యూతగాన సరసన్ క్రోతుల్లటన్రాళ్ళ నె
ల్లా శంఖిన్నురుకన్ సరాతి వలెనౌ లాగించె లంకేశ! రా
జా! సాసేతును గట్టి నారు ఝకటా సాగున్నికన్గానురా !
---
కౌసల్యాయని వీరుడు
సాసుండట యూతగాన సరసన్ క్రోతు
ల్లా శంఖిన్నురుకన్ సర
సా!సేతువు గట్టి నారు ఝకటా సాగున్ !
జిలేబి
--
శ్రీ కంది శంకరయ్య ఉవాచ
కంద గర్భ వృత్తాన్ని బాగానే వ్రాశారు. కాని చదువుతుంటే ఇది తెలుగు కాక మరేదో భాష అనిపిస్తున్నది. పద్యం అర్థమయితే ఒట్టు! :)
మొత్తము జిలేబి మయము :)
Deleteకౌసల్యాయని - శ్రీరాముడు
వీరుడు అనుజుడు లక్ష్మణుడు
కాకుత్స్థ వంశస్థులు
అగ్గో -అదిగో
సాసుడు - విలుకాడు
ఊత - సాయం
శంఖి - సముద్రము
ఉరుకన్ - దాటన్
సరాతి - ఒక తెర లా ( వానరులు రాళ్ళని ఒక తెరలా వేసి ) సాసేతువు - సేతువు లాంటిదానిని
ఝకటా - జగడము
రాముని, లక్ష్మణుని సాయంతో వానరులు రాళ్లతో వారధి కట్టి యుద్ధానికి బయలు దేరారు
( ఈ పాటి ఒక వాక్యం వ్రాయడానికి అంత తల క్రిందుల తపస్సు చేయాలా ! జిలేబి కమాల్ హై ;))
జిలేబి
కం. పద్యం బగు గద్యంబగు
Deleteహృద్యంబుగ నుండవలయు నెంతే శ్రమతో
పద్యంగణంబుల పదముల
విద్యావిలసనము పేర పేర్చ దగదయా.
ReplyDeleteవిద్యారంభము జేయ వీడుట జిలేబీవల్ల గాదోయ్ కవీ
సద్యోగంబిదియే సుమా సరసనే సాహిత్యముల్నేర్వనౌ !
పద్యంబైనను మాటలైన గురుడా పంకావలెన్ ద్రిప్పుచున్
హృద్యంబైనటి రీతిగాన నుడులన్ నృత్యంబులాడించెదన్ :)
జిలేబి
ReplyDeleteక గ శా వి
హా సీతా! యన రావముల్ వనపు హాహాకారముల్ గానుమ
య్యా, శాసించెను గోముగాను శరమై యా రన్, పతిన్ రోయ గ
న్నా సౌమిత్రిని వాసిటన్ననుజుడా, నాధున్గనన్ వెళ్ళు మ
య్యా సాసించుము కమ్ముదెంచు సధియై యావద్బలమ్ముల్ గనన్
---
హా సీతా! యన రావము
శాసించెను గోముగాను శరమై యార
న్నా సౌమిత్రిని వాసిట
సాసించుము కమ్ముదెంచు సధియై యావన్
జిలేబి
నిన్న లక్కాకుల వారిచ్చిన శార్దూల కిక్కు,
ReplyDeleteహరిబాబు గారిచ్చిన కందపు జోషు లతో
హుషారొచ్చి, చాన్నాళ్ళ తరువాయి
క గ శా వి !
శార్దూలవిక్రీడితము
చానా బాగుగ యుండెనయ్య గనుమీ సాహిత్య జిజ్ఞాసల
న్నా నానా విధ యత్నముల్గన హరీ, నారిన్ సమాళింపనౌ,
తానాడన్ మది యాడునయ్య పదముల్ తావిన్ గుభాళించు తా
మై, నానాటి సయాటలన్ గనవయా మాయాద్యుతిన్నీవిటన్ !
****
కందం
చానా బాగుగ యుండెను
నానా విధ యత్నముల్గన హరీ నారిన్
తానాడన్ మదియాడును
నానాటి సయాటలన్ గనవయా మాయన్ !
చీర్స్
జిలేబి
అమ్మో ! అమ్మో ! అమ్మో !
Deleteఅమ్మోరి హుషారు చూడ , ఆగదు , శార్దూ
లమ్మున కందం బిరికె గ
దమ్మా ! ఈ కళలు గూడ తవరికి కలవా ?
ReplyDeleteఏరుల్ పారని యూరు మా రువణమున్ రేకంటు మాడ్చన్ సదా
కోరన్ పల్లెల వైభవమ్ము నకటా గూర్తున్నెటుల్ పద్యమున్ ?
చేరెన్ రైతు సిటీని భాగ్యమను గోచీ గాన నీనాడు తా
మారెన్ గాదయ కూలినాలి బతుకున్ మాన్యంబుగా జూచుచున్ !
జిలేబి
ReplyDeleteఓ మోడీ!వినుమయ్య! పొత్తులకికన్ గోరీలుతప్పవ్ సుమీ
మీ మోసంబిక సాగదయ్య భజనల్ మించారగన్ సేయమ
య్యా!మీదారిక మీది! తెల్గు ప్రజ సాయంబట్టరయ్యా !జయ
మ్మౌ మాదే యిక! భాజపా కిక సవాల్మారాష్ట్రమే కాచుకో
జిలేబి
ReplyDeleteఅక్కా! తెల్లని తల్లి భారతి సభా ప్రాంగమ్ము మారెన్గదా !
పక్కాపచ్చని రంగు బోయె నెచటన్? భామా ! జిలేబీ ! అరే !
టెక్కుల్హెచ్చెను శంకరాభరణమున్ టెంప్లేటు లే మారె! నెం
చక్కా కొత్తగ వచ్చె యామికగ సంచారమ్ము జేయన్ గదా :)
చీర్స్
జిలేబి
ReplyDeleteకుండల్బ్రద్దలు గొట్టి చెప్పెదనయా కూపస్థమండూకమా
కుండీలోనయ మర్రిచెట్టు? గనుమా కుందాపనన్ మానవా
బండన్గట్టుచు చావగొట్ట తగునా వాంఛింప నిట్లన్నకో
నిండైనట్టి సజీవమైన నుసురున్? నీపాశగూలా యిలా
జిలేబి
Say no to Bonsai :)
Yes, say no to Bonsai 👎.
Delete
ReplyDeleteవిత్రాసమ్మది మానసమ్ము కుదుపన్ వేసారి బోవన్ మది
న్నాత్రించున్ కలతల్ వెతల్! కుదురదే నాధ్యానముద్రల్ ! భువిన్
చిత్రంబైనది జీవితమ్ము ! మదిలో చింతల్ సమాళింపగన్
పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్!
జిలేబి
ReplyDeleteక్షేత్రంబవ్వగ భార్య భర్తకునటన్ క్షేమంబుగా నిమ్మదిన్
పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా,పోఁగాలమే వచ్చినన్
తత్రత్యుండట పైన దీవెనలిడన్!తంకమ్ము వీడన్ దగున్
యాత్రల్జేయగ తీరునయ్యనలతల్ యానమ్ము సాగింపుమా!
జిలేబి
ReplyDeleteమూడంతస్తులసొంత మేడ!భళి! సొమ్ముల్జేర్చినావా! జిలే
బీ! ఢంఢంబను గుండు మామి! గలరే బింబోష్ఠి లోకమ్ములో
నీ డాంకారపు సాటి ! వేల్పువు గదా! నెక్కొల్పి నావే మజా!
జోడిన్గట్టెద నీకు వృత్తములతో జొత్తిల్ల వేడిన్ సుమా !
చీర్స్
జిలేబి
ReplyDeleteశంఖమ్మయ్యెగ శంకరాభరణ కాసారమ్ము !మేల్గాంచగన్
తంఖీహ్లన్గని సారమొప్పు పదముల్ తట్టంచు వేయన్నిటన్,
పుంఖాపుంఖముగాను పద్యములనే పూరింప నేర్చానయా
పంఖానైతిని నేను శంకరవరా! ప్రారబ్ధపుణ్యమ్మునన్!
జిలేబి
ReplyDeleteక్లోనింగన్న నదేల భీతి ! నరుడా! కోతిన్, భళా హిట్లరున్
నానా రీతి జిలేబులన్ సృజన చానా చేతురో?బుద్ధుడిన్
తానే జేయగలండతండు గదరా! ధైర్యమ్ముగా బొమ్మురా!
యేనాడైనను దిక్కు దేవుడుగదా యెవ్వారికైనన్ హరీ!
జిలేబి
ReplyDeleteఏరాలమ్మగుచిత్రమందున నటించెన్ తార! శ్రీబాపు! గా
నీ రామయ్యకు భార్య గాను నటిగా నిల్పేవు! సీతమ్మ తా
నై రామయ్యగ బాలకృష్ణ సరసన్ నైపుణ్య మున్గాంచి నో
రారా రమ్మని పిల్చె సీత, యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్!!
జీరాడెన్ నయనంపుతారగ సుమీ జివ్వాజి ! శ్రీరామరా
జ్యారాజ్ఞీయముగన్ జిలేబి వెలిగెన్ ! జవ్వాడి సీతమ్మ తా
నై రామయ్యగ బాలకృష్ణ సరసన్ నైపుణ్య మున్గాంచి నో
రారా రమ్మని పిల్చె సీత, యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్!!
చీర్స్
జిలేబి
ReplyDeleteఅంసమ్ముల్ పయి భారమౌను మన చింతల్ గాని, యేకాంగికిన్
హంసోయా యను సందియమ్ము సయి సోహంబున్ గదా చూడగన్
సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ!
సాంసిద్ధమ్ము జిలేబి దైవ కృపగన్ సంద్రమ్ము దాటన్ సుమీ !
జిలేబి
ReplyDeleteఇచ్చట చచ్చినోళ్ళ జాతకము చూడబడును :)
చచ్చిందయ్య గురో జిలేబి! సిసువా చక్రమ్మిదే చూసుకో!
మెచ్చంగన్ జనులెల్లరున్ నటిగతా మేరున్ తలంపించురా
వెచ్చించున్ ధనమెల్ల ముక్కు నెఱికై వేవేల కోట్లున్ సదా
అచ్చంగా తన కూతురున్నుఱిదిగా సాక్షాత్కరించున్ సుమా!
జిలేబి
ReplyDeleteఇచ్చట చచ్చినోళ్ళ జాతకము చూడబడును 2
మాగండమ్ముల నొడ్డి ధాటిగ నసామాన్యంబుగాపోరురా
జేగంటన్నిలుపున్ మఠమ్మున జనుల్ చేరంగ వేవేల రా!
సాగించున్ యతనమ్ములన్ సమసమాజంబైన రీతిన్ గనన్
యోగంబన్నయిదేర శిష్య! శివ సాయుజ్యంబునొందెన్ గదా!
జిలేబి
ReplyDeleteనీమంబున్విడి యోగి రూపమున తా నేమార్చి గొంపోయె, నీ
వా మారీచుని లేడిగా తరుమ తా వాపోవ హా లక్ష్మణా!
కామాంధుండయి రావణుండవనిజన్ కార్కశ్యమున్జూపుచున్!
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్
జిలేబి
ReplyDeleteవాతల్ బెట్టిరిగాద నేతలు, జనుల్ భారీగ నష్టమ్ములన్
కోతల్గాన జిలేబులే యనుకొనన్; కోటల్భళాగట్టిరే
యేతావాత జనాళి నమ్మ గనహో; యెంకన్న సత్తెమ్ముగా
పోతోందండయ దేశ మేగతి గదా పోగాలమై నేడిటన్!
జిలేబి
ReplyDeleteమీ సంఘంబున కొత్తవాడిని గురో! మీరే సుమాదిక్కు మా
కాశంతమ్మిలలోన మాచనవరా! కష్టేఫలంబై జనుల్
మీసాంగత్యముకోరిరయ్య కవిరాట్! మించారగన్ బ్లాగులో
కోశాగారము గట్టిరే కథల సోకుల్ కైపు జవ్వాదియై!
జిలేబి
ఆహా, “జిలేబి” గారు తిరిగి బ్లాగు ప్రవేశం; వెల్కం బాక్ 💐. హమ్మయ్య మళ్ళా కళకళలాడిపోతోంది 🤓.
ReplyDelete
ReplyDeleteఖాళీలేదుర చెయ్యి ! పోయనిన పోకన్ నిల్చినావేలరా ?
భోళా శంకరు కాదొరేయ్ ! హరినిరా! పో చేయి ఖాళీగ లే !
గోళాకారముగాను త్రిప్పుచు కథల్ గోరీల గట్టావు రా?
వేళాకోళముచేయ మార్జనినికన్ వేగంబుగాబట్టెదన్ !
జిలేబి
ReplyDeleteఆశ్వాసమ్మతడే జిలేబి వినుమా ఆగాత్యమే మేలహో !
విశ్వాసమ్ము గొనమ్మ దుష్టుడయినన్ వేంచేపు చేయన్ దగున్
విశ్వంబంతయు నమ్ము రీతి పలుకున్ వేణీ శకారుండహో !
"అశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్"
చీర్స్
సావేజిత
జిలేబి
ReplyDeleteనార్వేలో బసయా! టపా అదురహో! నచ్చింది సుమ్మీ భళీ
ఫర్వాలేదయ మీకు వీలు గలుగన్ ఫ్యార్డ్లన్ సమీక్షించుడీ!
హర్వుంబెల్ల సచిత్రరూపకముగా హత్తించు రీతిన్నిడన్
పర్వంబౌనయ రావుగారు పఠియింపన్మాకు క్రొంగొత్తగన్
జిలేబి
హేవిటో "జిలేబి" గారూ, ఈ పద్యరత్నాన్ని ఆ "మన'సు'లో మాట" బ్లాగ్ లో upendrao.blogspot.in కూడా పెడితే ఆ బ్లాగర్ కుర్రవాడు మరింత సంతోషించేవాడుగా.
Delete
ReplyDeleteస్మగ్లింగా ? ప్రయివేటు స్కూళ్ళన యదృచ్ఛా ఫీజులన్ చూచుచున్
పగ్లాయైవెలుగొందు మాన్య ప్రభుతల్! పబ్లిక్కురేట్రేసు లన్
హా! గ్లస్తంబయినారు పిల్లలకటా!ఆశ్చర్యమేముందయా!
ఈగ్లానిన్ జనులెల్ల థగ్గులుగ, సీ! పిండారి గామారరే ?
జిలేబి
ReplyDeleteఈ కేసూ మరి దీర్ఘసూత్ర రహదారిన్ బోవునేమో గదా !
సోకుల్బోయెడు ఖాను జైలు ఒడిలో సోండెల్ భుజించున్? నెవర్!
కాకల్దీరిన అడ్వకేట్లు వరుసన్ కాపాడగా నిల్తుర
య్యా!కారుణ్యము జూపు జడ్జిని సునాయాసమ్ముగా కొందురే!
జిలేబి
ReplyDeleteఆహాహా యని జోతలెల్ల నిడగన్నాంధ్రుల్ త్సునామీ వలెన్
బాహాటమ్ముగ తెల్గుదేశము సెభాష్పాటల్గుభాళించునే!
సాహిత్యమ్ములతోపనేమి గలదోయ్ సారంబులేలన్ సినీ
మా హిట్టవ్వ జిలేబులెల్ల జొనుపన్ మాలావు పాటౌనయా
జిలేబి
ReplyDeleteనీవేనే సఖి నా జిలేబివి సుమా ! నీనీడయేజాడయున్
కోవా! నీ దరి చింత లేక నిలువన్ కొంతైనతీరున్ వ్యధల్!
బావాజీ లవలెన్నిరాశ వలదే బద్మాషు గాళ్ళమ్ము కా
మేవయ్యారియ! మేము నీయనుగుకై మెండాడి నామే ప్రియా!
జిలేబి
ReplyDeleteజంభాల్గొట్టుటగాదు చూపెదను నాశక్తిన్ వశిష్టున్ వలెన్
జంభారాతియుభీతినొందె తపమున్ శల్కంబొనర్పన్,హ! వి
స్రంభన్ గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై,
స్తంభింపన్ హృది మేనకన్ గని మనోదండమ్ము దారిన్ గనన్!
జిలేబి
ReplyDeleteదోగాడే పిలకాయతో గురుడ పందుంపుల్ల సంవాదమే
లా!గాఢమ్ముగ వాళ్ళతోపరుగులేలా!రామనామంబు నీ
వేగా లావుగ బల్క వీడితివయా! బేజారవన్నేలయా!
బాగోగుల్మనవన్నియున్మనదయా!బాంగ్రూలనన్ జూతురే
జిలేబి
ReplyDeleteఅప్పాయింట్ మెంట్ నో :)
రారా చంద్రుడ!ఆంధ్ర దేశ ప్రభువా ! రారమ్మ! భాజ్పాయనన్
ధారాళమ్ముగ దస్కమెల్ల దొరకున్ దారెంబడిన్నన్కొనన్
హేరాఫేరి! తలాకు లిచ్చి వెడలెన్ హేరాలమై పోరుకున్ !
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ!
సంద్రము - దామోదర్ దాసు :)
జిలేబి
ReplyDeleteరారా! ఖమ్మము ! తేల్చెదమ్ము నిజమున్ ! రావంబిదే బాబు నే
నేరాళమ్ముగనమ్మినాను డయటున్నెవ్వారికైనన్ వెసన్
ధారాళమ్ముగ నేర్పెదన్ ! వినుమయా దమ్మున్న రమ్మా వురేయ్
దారిన్బోయెడు కుక్కలెన్ని మొరుగన్ త్రాసంబగున్నద్రికిన్?
జిలేబి
పరార్ :)
ReplyDeleteబయ్యా!కొండల రావు వ్యాఖ్యకు భళా ప్రాముఖ్యతన్ జేర్చనే
లయ్యా! ఓ హరిబాబు వీలగునకో ! లాభమ్ము లేదయ్య రో!
సయ్యాటల్ విషయమ్ముగాదు డయటున్ సాధించినేర్వన్ గదా
కయ్యంబేలర కోరుమయ్య శరణున్ కష్టంబుతీరున్ సుమా!
జిలేబి
ReplyDeleteపోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మా
నారా వారు తెలుంగు తేజమిదిగో నాలాయకీ వీడి మో
డీ!రమ్మా!దిగిరమ్మ ! ఆంధ్ర ప్రజలొడ్డేరయ్య చాలెంజు!భా
జ్పా!రాష్ట్రమ్మునుతీర్చిదిద్ద సలుపన్ సాయమ్ము జైహిందనన్
జిలేబి
ReplyDeleteమోడీవారి ప్రభుత్వ మొండితనమున్ మోదెన్ భళా చంద్రుడీ
నాడే! రాష్ట్రపు ధర్మ దీక్ష యిదియే ! నాణ్యంబుగా జేసి రీ
నాడే!రండిక చేయి కల్పుదమయా ! నా జన్మభూమీ యనన్!
వాడా వాడల యెల్లరున్నడువ జావంకమ్ము గా నిల్తురే!
జిలేబి
ReplyDeleteవీరావేశము జూపగా నెలతుకల్ వెక్కెక్కి రోదింతురే?
దారిన్బోయెడు కుక్కలెన్ని మొరుగన్త్రాసంబగున్నద్రికిన్?
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు?సూ
డ్రా!రామక్కను! పూలిడన్ వలదొరేయ్! డ్రామా కతల్చెప్పకోయ్ :)
జిలేబి
ReplyDeleteమోక్షంబున్గన విశ్వనాథుడట రామున్కల్పవృక్షంబనెన్
కక్షల్గట్టుచు రంగనాయకి యొరేయ్ కాఠిన్యమూర్తీ యనెన్
సాక్షాత్కారము చేసుకున్న దెవరో ? సాధింప సత్సంఘమున్,
రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్!
జిలేబి
ReplyDeleteRamayana and project management :)
సాక్షీభూతుడు రామచంద్రు కథలో సాధ్యమ్ము మేనేజిమెం
టే క్షంతవ్యము నేర్వ మేలగునంటం చీక్షించి మోడీ భళా
దక్షత్వమ్మును పెంచుకొమ్మనగ మేధాజీవులున్నాయకుల్,
"రక్షస్సంఘ" మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్
జిలేబి
ReplyDeleteఓ కౌంతేయ! కిరీటి! కయ్యమిది! ధర్మోద్ధారణంబైన నీ
దౌ కర్తవ్యము!మానరాదు వినుమా ! దామమ్ము గా సైన్యము
న్నా కింశారువు కూల్చ గోరితివయా ! నాదర్పమున్బోయె! బా
వా!కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!!
జిలేబి
ReplyDeleteఆరాటంబదియేల మైలవరపయ్యా!యిర్వురున్నొక్కరే
శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
స్వారాట్వైరిని దుర్జయున్ కుశుడు! నిస్వార్థమ్ముగా నేలెన
య్యా రాజ్యంబు కుశస్థలిన్నిలిపెనయ్యా!యింద్రుడిన్కొల్చెనే!
జిలేబి
ReplyDeleteఘోరారణ్యము తానమవ్వ సతికిన్ కుందై స్తుతించంగ నా
శ్రీ రాముండు,త్రినేత్రుఁ, జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
శ్రీరామున్నహమున్, కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
శ్రీరామాయణ గానమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో !
జిలేబి
ReplyDeleteక్షీరాన్నంబును గైకొనంగనొకడౌ! కేదారుడైయొక్కడౌ!
శ్రీరాముండు! త్రినేత్రుఁ! ; జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
శ్రీరామున్నహమున్ కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
శ్రీరామాయణసారమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో!
హమ్మయ్య
కిట్డించాను
జిలేబి
ReplyDeleteపేరాయెన్ శివరామకృష్ణ! తగునా వేవేళ గోటేరుతో
మారామున్ భళి దున్ని కైపదముగన్ మార్చన్! జిలేబీయమే!
యోరోరీ! కవిరాట్! సయోధ్యయవదే!యోక్త్రంబదెద్దానితో
శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై?
జిలేబి
ReplyDeleteచేరన్సంద్రపు తీరమున్ప్లవగముల్ చేయూతనివ్వన్నట
న్నారాళ్లన్దళపమ్ముజేసుకొనగన్నాంత్రమ్ము జేసెన్ గదా
శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
వారాశిన్ సయి దాటి రాత్రిచరులన్ ప్రాభంజనుండే భళా
జిలేబి
ReplyDeleteహీనంబై చరియించుదుర్గుణులకున్ హేఠమ్ములన్జేయు వా
రై నట్టింట జిలేబులై తిరుగుచున్ రావమ్ము తో తర్జనల్
స్థానంబుల్విడి జేయుమానవులకున్ జ్ఞానమ్ము జేర్చన్, "ఇ"కున్
హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!
"ఇ" = కోపము
జిలేబి
కంది వారి కామింటు
'ఇ' శబ్దానికి తెలుగులో వ్యస్త ప్రయోగం ఉన్నదా? చింత్యం!
Deleteపోచిరాజు కామేశ్వరరావు గారి వ్యాఖ్య
... జ్ఞానమ్ము గూర్చన్నిభీ / హానిన్... అనండి.
ఇ భీ హాని = రోష భయముల హాని; ఇ = రోషము [గర్వమను నర్థము సందేహము.]
వ్యస్త ప్రయోగమంటే సమాసమున గాకుండా విడిగా స్వతంత్రముగా నని యర్థము. మన్మథుఁడు వచ్చెను దీనికి ఇ వచ్చె ననుట సరి గాదు. ఇ = మన్మథుఁడు
ReplyDeleteఎట్టెట్టా!! అరె! చిట్టిపిట్ట ననఘా మీస్టైలనన్ పొట్టిగన్
పెట్టేరండిట పద్యమందు? మజ! భేష్! భేష్! మీరు దిట్టే సుమా !
చట్టంచున్ సయి విన్నకోట వరులున్ సారూ! సలీంఆలియై
కొట్టెట్టేస్తరటంచు మెచ్చిరిగదా కొండంత యండై భళా!
జిలేబి
ReplyDeleteసాదాదోసె మసాల్వడా బకెటులో సాంబారుగా కల్పినా
రేద్రావంగజిలేబులూర జనులున్! రేకంటు లానింగినన్
బాధామీటరుగా భళా కొలిచిరే! ప్రార్థించెదన్ మిమ్ములన్
పాదాలంకితమిచ్చినాను సొబగై భాగ్యంబుగానొప్పగన్!
జిలేబి
ReplyDeleteఅర్జునుడు - కృష్ణుడు
ఆహాకారములన్ గనన్ కుదరదయ్యా!నేనశక్తుండ! నే
నీ హాంత్రమ్ముల చూడలేను విడుతున్నీరంగమున్నిప్పుడే!
సాహాయ్యంబగుదున్!కిరీటి!నెఱియౌ సారంగమున్బట్టి,సం
దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్ !
జిలేబి
ReplyDeleteఓహోనాదని నీదనన్ జగడముల్ కొట్లాటలేలా ! భళా
దేహమ్మున్ విడనాడి చూడుముసఖా ధీరత్వమేపారగన్
నీహర్మ్యంబెట? నీశుడేల నినుతన్నీరమ్ముగాజేసెనో?
సోహంబో మరి హంసవో? యెరుకయెన్? శోభిల్ల మార్గంబెటన్?
జిలేబి
ReplyDeleteసౌహార్ద్రంబును చేగొనంగ వలయున్ సాంగత్యముల్మేలవన్
మోహంబేలర?మానవా! బతుకునన్ మొండించుమా కోరికల్
సాహోరేయనజీవితమ్ము జనుడా సాధింపుమానీహృదిన్
దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వమేపారగన్
జిలేబి
ReplyDeleteబేజారాయెను కార్డు స్వైపు సయి బెంబేలెత్తి యాడించెనే
రోజూ తప్పదు దీని కర్మ మనకున్ రోబోలయే మయ్యరో
తాజా కూరలకున్ను యన్నిటికి యేతావాత తప్పేట్లు లే
బాజార్లోమరి దేనికైన నిదియే భాగ్యంబుగా దోచునే :)
జిలేబి
ReplyDeleteఇవ్వాళ సందర్భం రాయాలె :)
సుబ్రహ్మణ్యుడు ఐటి మానవుడు; మగడు; సదా ఆఫీసే ఇల్లు ఇల్లే ఆఫీసు; చెవిలో ఎప్పడూ బ్లూటూత్ 'జాబ్రా' బ్రాండ్ (ఇది చాలా ఎక్స్ పెన్సివ్ :)) 'ఇన్ ఇయర్' ఫోన్ తో తిరుగు తూంటాడు
భార్య తో షికారు కు పోయినా ఇన్ యియర్ విడువడు !
అట్లాంటి మగడి ని ఎట్లా మరి మూడు మార్చేది :)
నారాయణ ! శేష శైల వాసా !
నీ దరికి వెళ్లి వస్తే కోబ్రా లు కనబడట మేమి ట యా !
అంతా విష్ణు మాయ !
జాబ్రాయిన్నియరై సదా తనకు బేజారున్ ప్రచారించు శ్రీ
సుబ్రహ్మణ్యుని, పెన్మిటిన్ గనుచు,యుస్సూరంచు,చొప్పించగన్
తా బ్రాంతిన్ తన పైన, బిల్చి, "మగడా ! తాంతమ్ము గానుండె! నా
కో బ్రా తెమ్మని" కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్!
జిలేబి
ReplyDeleteఇదేదో కొంత కిట్టింపే
తా బ్రాంతిన్,మరులున్ ఘటిల్ల తనతో తాంబూలమున్దూకొన
న్నాబ్రాజిష్ణువు సంతసమ్ము గనుచున్నారిన్, మహారాణి! యిం
కో "బ్రా" తెమ్మని కోరె; భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్
తాబ్రాగబ్బముగామదిన్ తలచి ప్రాతాంబూలమున్దెచ్చెనే!
ప్రా - శ్రేష్టము
జిలేబి
ReplyDeleteఖోప్రా - కొబ్బరి తెమ్మని రాయమంటే పరమానందయ్య శిష్యపరమాణువు కోబ్రా అని రాయటం తో వచ్చిన చిక్కు :)
"కోబ్రా తెమ్మని కోరె భార్య మగనిన్ కోర్కెల్ పిసాళింపఁగన్"
ఏబ్రాసీ! నిను రాయమన్నదిదియే? యేమయ్యెరా బుర్రయున్?
ప్రా "బ్రా" గయ్యెను "ఖో " యయేనుగద "కో"! ప్రాతఃసభాప్రాంగణం
బే బ్రోచెన్ గద బ్రాను లాగుచుమరీ బెంబేల కోబ్రానిటన్ :)
జిలేబి
ReplyDeleteరమేశు గారి భావనకు :)
ఓఁబ్రాయంపు సతీ ! జిలేబి వినవమ్మో పాము లాటే సుమా
యీ బ్రాంతిన్ కలిగించు జీవనము!ఓయీ నీవు కీలాల పా
మై బ్రాకన్నన కొండ నేను! సఖుడా! మైకమ్ములో త్రోసెద
న్నీ బ్రాకెట్టు కిలంబు నందు!జడియన్నీవున్కొనాలయ్య నా
కై,బ్రాంచత్యహిరూప కౌను గతిలన్! కయ్యాటలో నోడగన్
కోబ్రా తెమ్మని కోరె భార్య మగనింగోర్కెల్ పిసాళింపఁగన్!
జిలేబి
హమ్మయ్య కిట్టించా :)
ReplyDeleteదేవకి - యశోద - సుభద్ర - రాధ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
రామా రాధనమాయెరా మనసు ! భద్రా!దేవ! కీరమ్ములి
వ్వే మీకై ! దయతో యశోదయ గొనన్! వేడెన్పరంధాము, తా
నే మున్ముందున మంచి పండ్లివియెనో ? నే స్వాదువున్గాంచి నా
రామున్గై కొన మందు నంచు సయి సౌరస్యంపు పండ్లిచ్చెగా !
జిలేబి
ReplyDeleteపిండాకూడయె విద్యలన్ని భళిరా పింజారు లైరే జనుల్ !
నిండెన్పాతిక యేండ్లు బుద్ధి విరియన్నెక్కొల్ప లేరయ్యిరే !
భాండాగారపు పొత్త ముల్ చదివిరే !పాగెంబు లేమాయె ? యే
మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్?
జిలేబి
ReplyDeleteజెండర్మార్పిడి :) క్లోనింగు :) సోలారు విద్యుత్తు :) కలువాయి :)
జెండర్మార్పిడి కాలమందు జనులే జేజేలు పల్కంగ మా
ర్తాండుండండగ వైద్య విద్యయు మహాత్మ్యంబయ్యె! టెస్ట్యూబులో
పిండంబుల్కలువాయి చేయ, భళిరా పెట్రేగ మండ్రాటమే
మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్!
జిలేబి
ReplyDeleteవీణా తంత్రుల నాదమై పలుకులున్ వీకాశమై జొప్పిలన్
నాణెమ్మై నిలువన్ జనాళి వసుధన్ నాంత్రమ్ము నేర్వన్ భళా
మాణిక్యంబుగ నిల్తురమ్మ భువిలో మాన్యంబిదే నమ్ము, శ్రీ
వాణీ, ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!
జిలేబి
ReplyDeleteప్రాణంబై నిలిచేవు సూవె! జలజా! వాల్గంటి!శాతోదరీ!
జాణా!తొయ్యలియా! జిలేబి మగువా! శంపాంగి!లోలాక్షి!నా
రాణీ!మంజుల వాణి! భామ ! లలనా !రత్నాంగి ! పూబోడి! శ్రీ
వాణీ! ప్రేమ జలంబు గాదె యిహమున్ భవ్యంబుగా దాటగన్!
జిలేబి
ReplyDeleteబాబాయౌతరు! విన్న కోట నరసింహారావు పల్కిద్ది ! కా
ఫీబాబా! యని పేరు బెట్టి తినయా ! ఫీచర్లతో మీ కతల్
గాబాగూబిగ సాగు చుండె! జనులున్ కావారి తో కొల్తుర
య్యా బారాది, గృహస్థ జీవనపు సయ్యాటల్ దిగద్రోచకన్
రాబోయే రిటయిర్డు లైఫునకిదే రాచందమౌ వైవియార్ !
జిలేబి
ReplyDeleteవయ్యారంపు జిలేబి, కంజముఖి,యా వాల్గంటి, శంపాంగి, యే
భయ్యోయేట పడన్ మగండమెరికా భాగ్యంబు గా బోవగా
నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
సయ్యాటల్లధరమ్ములున్, పదములున్, సంభావ్యమౌకైపులున్ !
జిలేబి
పరార్ :)
ReplyDeleteభయ్యా! భావ జిలేబి! ఓ!చనవరీ! వాహ్వాహ్ సెబాసో సెబా
సయ్యా! మీ కవితల్ ! పదమ్ములు భళా ! స్వామీ ! జిలేబీల మీ
వయ్యారంపు కబంధ మందు నిడిరో! వార్నీ ! రమేశా ! గన
న్నయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్ !
జిలేబి
ReplyDeleteఅయ్యారేయని నీ జిలేబులకు సయ్యాటల్ గనన్ ఓసఖా!
నయ్యయ్యో కడు పయ్యెనేమి! కవినాథా నీకుఁ జిత్రంబుగన్
వయ్యారంపుకొమార్తె గల్గు ప్రియుడా! వర్ధిల్ల నీకీర్తి మే
లయ్యాతాళిని గట్టగన్! సుకవి!లోలాక్షిన్ దిగద్రోచకోయ్!
జిలేబి
ReplyDeleteమా మత్తల్లిక సత్యసంధకు సభామర్యాద నేజేతురా!
కామయ్యా భయశీలురైన మనుజుల్ కామయ్య! మా మానినిన్
నీమమ్ముల్తొలగించి నీడ్చితివిగా! నీరక్తమున్ద్రాగెదన్
రా!మత్తేభముగా క్రమించెదనురా రావంబిదే! భీముడన్
జిలేబి
ReplyDeleteసారీ చెప్పగ మోడియంట విను వైస్చాంస్లర్రుహోదాన, దే
శారిష్టంబులు కండ్ల ముందగుపడన్ సాధ్యంబయెన్! పౌరులా
రా రయ్యంచిక నీటికష్టముల ధారాళంబుగా తీర్చు న
ర్రా రారాజగు మోడి యే! చనవరీ రా వందనాల్జెప్పు, భో! :)
జిలేబి
ReplyDeleteవద్దొద్దంచు గులాబులన్ తడుముచున్ వాచాటు లౌతారయా,
సుద్దుల్నేర్చి జిలేబులౌదురు గదా చోద్యంబిదే నయ్యరో
మొద్దబ్బాయిలు ముద్దుగుమ్మలకటన్ ముద్దివ్వ బోవంగనే,
రాద్ధాంతంబుల వీడి జూచుదురయా,రాధమ్మ బుగ్గల్ సదా :)
జిలేబి
ReplyDeleteస్మైలీలన్ వెస నేర్చి నామయ !అనుస్వారమ్ము నేర్పుల్ తెలీ
లే! లీలై యగు పించె మాకు గురువా ! లే! శిష్య! లెమ్మా! భళా
చాలా యీజి సుమా! జిలేబులవలెన్ చక్కంగ దీర్చన్నదే
వీలై నీ జత గూడు శాస్త్రి ! వినుమా వేగమ్ము యత్నింపు మా !
జిలేబి
ReplyDeleteహర్మ్యంబీ భువి! యిందు మానవులటన్ హాకంబు మేమంచు సా
ధర్మ్యంబున్ వడిగా త్యజించిరి;మనోధర్మంబు మాదంచు, నై
ష్కర్యంబంచు జిలేబు లై తిరిగిరే ; శాంతమ్ము గోల్పోవుచున్
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?
జిలేబి
ReplyDeleteనెట్వర్కింగుల కాలమయ్యె రచనా నేర్పుల్ మరేలా? హయా
రే ట్వీటింగులు మార్కెటింగులు గదా రేటింగు పెంచున్, సఖీ
బట్వాడా కరపత్రముల్, గరము టీ పార్టీల తో కుల్కుచున్
జెట్వేగంబుగ పేరుగాంచుము జగజ్జెట్టీ జిలేబీగవన్!
జిలేబి
ReplyDeleteఆధారంబెవడో? అనాది యెవడో? ఆత్మై ప్రకాశించు మూ
లాధారంబెవడో? రమేశుడెవడో? లావై బలమ్మై జనుల్
రాధాకృష్ణులుగా భువిన్ పరిణితిన్ రాజిల్ల వైనంబెవం
డో?ధర్మంబెవడో?ప్రభాకర! గనన్ డోలాయమానంబహో
జిలేబి
ReplyDeleteచాలామంది తెలుంగు బ్లాగరులు సోచాయించకన్ ఫేసు బు
క్లో లాగించిరహో టపాలనకటా క్లోజ్చేసి బ్లాగ్లోకమున్
మీలా కొందరు పద్యముల్ కవితలన్ మేల్గూర్చ బోవంగనే
బాలా! డస్సుచు నాంధ్రులెల్ల రకటా బ్లాగ్లోకమే వీడిరే :)
జిలేబి
ReplyDeleteసాయంబివ్వకు వాటినెల్లనిక నిస్సారంబుగా జేయుమా
సైయంటే సయి సయ్యనన్ నెలతుకా సాతానులా వెన్బడున్
నీయంతమ్మును చూడు నమ్మ పడతీ నీడై సదా సోదరీ
పోయే కాలపు బుద్ధులివ్వి వినవే పోనిమ్మ పద్మార్పితా
జిలేబి
ReplyDeleteబిడ్డల్నిచ్చెనునాకొకండు విడిచెన్ పీడించి పీడించుచున్
దుడ్డుల్లేవయ చేతిలో, తడవుగా దూకంగ నేస్తమ్ములు
న్నడ్డంబుల్తొలగింప లేరు, ధరణిన్ నాయన్నవారేరయా
వడ్డీలెక్కలజీవనమ్ము చిదిమెన్ వాణిజ్యమైనాను! నా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్
జిలేబి
ReplyDeleteమా నారా వారి పల్కు :)
విడ్డూరంబిది! స్టేటసిత్తుమని నీవే సోదరా చంద్ర మా
చడ్డీల్గాచితి వంచు బల్కిరి గదా! సాధ్యంబు కాదిప్పుడం
చడ్డాల్పల్కుచు కేంద్రమేల గునిసెన్ ? సాగింపనీ పొత్తులన్
నడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
ReplyDeleteప్రధాని ఆలోచన - కాశ్మీరు
అడ్డాల్నాడు జిలేబులౌత!రిపులై యడ్డంబడన్పౌరులున్
గడ్డాల్బట్టుచు వేడనేల నికనో? కాశ్మీర రాష్ట్రంబు లో
నడ్డంబై నిలువన్ సమున్నతికి నానారీతి నేనొప్ప! నా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
ReplyDeleteరమేశు గారి భావనకు
బుడ్డీలన్, సయి వోటు నోట్ల భళిరా పోయించి పారించుచున్
చడ్డీల్దాల్చి రిసార్టులందు భళి వేశ్యారూపులై యాడుచున్
రడ్డుల్నేలగ హార్సు ట్రేడు గలదర్రా కోపుగా, యేల, మా
కడ్డం బయ్యెను, ధర్మవర్తనము, కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
ReplyDeleteపోరాటంబగు జీవితమ్ము భగవత్ప్రోక్తమ్ము రా మానవా
ప్రేరేపించిరినాడు శంకరులటన్ పేత్వంపు నద్వైతమున్
ధారాళంబుగ విశ్వమెల్ల నరయన్ ధర్మంబు మార్గంబుగా
సారా కంపెని నేడు శంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!
జిలేబి
ReplyDeleteఛందోబద్దము కాకపోదకొ భళా సాధింప సాధింపగా :)
ఏరాలమ్ముగ నేను నీవు ఒకటే, నెవ్వారికైనన్ సుమా,
సారాతాగగ విన్నకోటవరుడా సారంబు బోధిల్లు, తా
నైరాశ్యంబును వీడు నయ్య,వినుమా నద్వైతమార్గంబిదే !
సారా కంపెని ఆదిశంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!
జిలేబి
ReplyDeleteజాలంబందు జిలేబి చీర్సులగనన్ జంబమ్ము లన్గానగా ?
కోలాటమ్ముల చేయు బాల యెవరో? కోలంకిపిట్టెవ్వరో ?
బాలారాజము రాముడెవ్వరి సమాప్తాలుండు చెప్పన్ సఖీ !
వాలం బొక్కటి తక్కువయ్యె నకటా; వామాక్షి ; సీతమ్మకున్!
జిలేబి
ReplyDeleteకాపాడెన్ క్రతువా యహల్యకొసగెన్ కైవల్యమున్, రొయ్యనన్
చేపట్టెన్ తను కాశ్యపీ తనయ నే సింగాణి ఛేదింపగా
వప్రుండానగ నేగె కాననము,హా!ప్రాణేశుయే నత్తరిన్
తాప్లావిన్ గని తెమ్మనన్ వెడల సీతాయంచు నేమార్చెనే
జిలేబి
ReplyDeleteఆ పూర్ణుండు జిలేబి భేదముల తానై జూడ డెవ్వారిలో
తాపంబుల్ మదమత్సరమ్ములనటన్ తాద్రోలి వేడంగ సాం
గోపాంగంబుగ నోరచూపుల సదా గోవిందుడే ప్రాపు కా
గా పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ
జిలేబి
ReplyDeleteకొత్తమ్మాయి భళారె నేర్చె తెకినీకుల్ విల్లు సంధించెనే !
ఖత్తేమాయెను చేరలేదకొ? హ! మాకందంబు లేమాయెనో!
మత్తాయిన్ గనెనో జిలేబి రుచులన్ మాన్యుండు గ్రోలంగనే
పొత్తంబొచ్చినదాయనన్ మరి జవాబున్ తెల్పరే మిత్రులున్ :)
జిలేబి
ReplyDeleteKalidasa delights!
King Bhoja declares: I will give you the fourth line of a four-line verse; the challenge for you is to complete the verse most appropriately by filling in the remaining lines of the verse. The fourth line that he gave was the following:
अम्भोधिर्जलधिः पयोधिरुदधिर्वारां निधिर्वारिधिः ||
The funny part of this proposition is that there are six words in this line of verse, but they all mean the same, namely, ‘ocean’! The poets of the assembly including Kalidasa dispersed for the day carrying the uneasy burden of this challenge which required to fill three lines of a verse which in its fourth line did nothing but to repeat the word ‘ocean’ six times. The next day when the assembly reconvened, Kalidasa brought a delightful verse:
अम्बा कुप्यति तात मूर्ध्नि निहता गङ्गेयमुत्सृज्यताम्
विद्वन् षण्मुख कागतिस्त्विह भवेत्तस्याः स्थिरायाश्चिरम् ।
कोपारोपकरालशेषवदनैः प्रत्युत्तरं दत्तवान्
अम्भोधिर्जलधिः पयोधिरुदधिर्वारां निधिर्वारिधिः ॥
Ambā kupyati tāta mūrdhni nihatā gaṅgēyamutsr̥jyatām
vidvan ṣaṇmukha kāgatistviha bhavēttasyāḥ sthirāyāściram.
Kōpārōpakarālaśēṣavadanaiḥ pratyuttaraṁ dattavān
ambhōdhirjaladhiḥ payōdhirudadhirvārāṁ nidhirvāridhiḥ.
Subrahmanya, the little son of Lord Shiva and Goddess Parvati, goes angrily and complains to his father. ‘'Father, please get rid of this Ganga on your head, Mother is very much upset about it'’. The Father replies, '‘Oh Six-headed One, she has been living on my head for long. Where shall I ask her to go?''
The six-headed son, angry beyond words, replied with each of his six heads in succession: ''Ocean, ocean, ocean, ocean, ocean, ocean!’'
Source
https://www.rasikas.org/forums/viewtopic.php?t=20261&start=25#p287406
*****
హమ్మయ్య శార్దూలమొకటి వచ్చె :)
శంభో!గంగను కైవిడన్తగునయా శర్వాణి యాశంసగా"
"అంభశ్ఛారము తానెటన్ చనునయా యాగ్నేయ? " కాంతాళసం
రంభారూపపు షణ్ము ఖుండనెనథర్వా! తండ్రి!ఈశానుడా!
అంభోధిర్జలధీపయోధితవిషాయంభోనిధీతర్షమున్"
జిలేబి
***
శంభో శంకర! మా జిలేబి కిడుమా శార్దూల మత్తేభముల్
జీపీ శాస్త్రి
ReplyDeleteకంటిన్ మోహన మేడసాని వరులన్, కాంక్షించి వెంకన్నకై
వింటిన్వీడిన మిట్టకోలవలె నే వేగమ్ము గాబోవగా
ఘంటానాదము!శేషశైలమదిగో ! కార్మేఘముల్దాటుచున్,
టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే!
జిలేబి
కార్మేఘమ్ములను దాటుచు సన్నబడి డమ డమ టం టం అయిపోయేయి :)
జిలేబి
ReplyDeleteమాడర్న్ టైమ్స్ కుచేలులు జిలేబుల వలలో చిక్కుబడి :)
నా కష్టంబుల కెల్ల నీవు గద వైనంబయ్య! పద్నారు వే
లౌ కళ్ళాలను లాగినావు గదయా లౌక్యంబుగా నొక్కతెన్
నీకూచిన్ మనువాడి ప్రేమ బడయన్ నిండారుగా నమ్మి నే
రోకట్లో తలదూర్చినానయ సఖా! రొంజుళ్ళ చెండాడెరా!
శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుండయో !
జిలేబి
ReplyDeleteపుల్లమ్మాయని పేరునిచ్చి తగుకైపున్ గౌరవమ్మిచ్చిరే
యెల్లోరుమ్ యిని పోట్రి వాழ்తిడ యిదో యెన్ సీయెమాన్ వృత్తముమ్
పల్లాండాయిర కాలమిద్ది నిలువన్ పాండిత్యలోకంబులో
మల్లాగుల్లల చేసి చూడ కవులున్ మా పద్యమర్థంబవన్
జిలేబి
ReplyDeleteరావద్దండిక నాదు బ్లాగు నకు సారాకంపు కామింట్లతో
కోవాలాంటి జిలేబి పై నెగురుచున్ కొట్లాడుచున్ !వ్యాఖ్యలన్
తావిల్లంబులు బట్టి వేయ నరుడా తండోపతండంబుగా
రావంబై నిను తాకు సూవె వినుమా రాద్ధాంతముల్ చేయకోయ్!
జిలేబి
ReplyDeleteగోల్ గోల్ జిలేబి :)
పశ్చాత్తాపము నిన్ను శృంఖలముతో బందీని చేయంగ నా
పశ్చాత్తాపము నీకు కానిది సుమా ! ప్రాణమ్ము లేపోవగా
పశ్చాత్తాపమదేమి తిన్నదనమో ? బాధింప నిన్ మానవా
పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా!
జిలేబి
Deleteరాజన్నా! మరి భాస్క రన్న యెవరో ప్రాంగమ్ము లోతెల్పుడీ!
సాజాత్యంబగుపించె మీరిరువురిన్ సామీప్యమున్గానగా
తాజుబ్బయ్యిరి విన్న కోట వరులున్ తారీఫులన్ చూడగా
మోజాయెన్ మరి మాకు కూడ కవిరాట్ మోదంబుగా జెప్పుడీ !
జిలేబి
ReplyDeleteImran khan to address 19th August - 800 PM PST starts in couple of minutes !
ఇమ్రాన్కాను ప్రధాన మంత్రి! కిరికెట్కీసారి సిక్సర్ భళా!
సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్
టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్
హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?
జిలేబి
Deletehttps://youtu.be/z-l5HDpyFwE
Deleteఆది లోనే హంసపాదు :)
జిలేబి
నో టైము సెన్సు :)
ReplyDeleteఛిన్నాభిన్నము నైతి నావిభవముల్ ఛిద్రంబయెన్! బామ్మ, రా
జన్నా చంపుచు నుండె కందములతో సాధ్యమ్ము గాలేదయా
నన్నీ మాదిరి గా జిలేబి సరసన్ నాయన్న వారెల్లరున్
తన్నూర్లోన పడేసి పోయిరిగదా! తాళంగలేనయ్యరో
జిలేబి
ReplyDeleteముంబై వచ్చితి నిన్ను చూడ ననుజా మోపాదులన్తోలగన్
జంబాలమ్మిది కాలపక్వతన సాజాత్యంబులన్ తెచ్చెగా
కంబాలాటల కాలమున్ మది యనీకస్థంబు గావించెనే!
తంబీ గైకొను నంశువున్ సహమిదే తంకమ్ము బోవన్ సుమా!
జిలేబి
ReplyDeleteవెల్కం బెకబెక ! పద్మార్పిత తిరిగొచ్చె :)
ఇక పంకాల వెల్లువ, జిలేబి కందాలకు కొదవే వుండదు :)
ఏనాడో నిను కూడినాను ప్రియుడా యేతంబుగా సూవె నీ
వే నాప్రాణము! స్నేహశీలిని సఖా వేవేల నీదాననై
మానా లేక జిలేబి గా నిలిచితిన్ మందార్ప పద్మార్పితన్
నానీడైనను కూడ రాదు వెలుగై నాపైన నీవాడకన్ !
జిలేబి
ReplyDeleteవామ్మో!అయ్యరు ధైర్యశాలియె సుమా ! వాత్సాయునిన్ శిష్యుడే !
కొమ్మా కోనలబట్టి బోవు తరుణిన్ కొండాడ పెండ్లాముగా
బొమ్మాళీ యని ముద్దుగా బిలుచుచున్ పోరీ వయారీ జిలే
బమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్ !
ReplyDeleteవచ్చెన్ బట్టల నమ్ముకోవ భళిరా వాణిజ్య మున్ దాటి తా
జొచ్చెన్ రాజుగ, భారతీయులను బొజ్జోయించె నాంగ్లంబుతో
గుచ్చెన్ మాయని గాయ మొక్కటిని గగ్గోలై జనుల్ బోవగా
పిచ్చోళ్ళై, తమ సంసృతిన్ మరచి హా భిక్షంబు కై దేశముల్!
जिलेबी
ReplyDeleteగో గ్రీన్ విఘ్నవినాయకుండనెను "మైక్రోసాఫ్టు మృత్స్నంబు నీ
వై, గ్రీన్హౌసు ప్రభావముల్నడచగా వానీరకంబున్ జిలే
బీ గ్రావన్ వలె తారకాణముగ గుంభింపన్ దగున్, క్షాంతి తా
నుగ్రంబై జనులన్ గ్రసింపగ భళా నూబిండియే మీరు సూ"!
జిలేబి
ReplyDeleteఓ నాగమ్మ! శుభాంగి! పంకజముఖీ! ఓజస్వితా! తొయ్యలీ!
నీ నామంబును బండి వారడుగగా నీహారికా దేవి తా
నీనామంబును రాజ్యలక్ష్మి యనెపో!నీపేరికన్ మ్రోగు పూ
బోణీ జాలము లో జిలేబి యగుచున్ బొమ్మాళి! శార్దూలమా!
జిలేబి
ReplyDeleteగో గ్రీన్ యేనుగు మోముసామి యనె "మైక్రోసాఫ్టు మృత్స్నంబు గ
మ్మా గ్రీన్హౌసు ప్రభావముల్నడచనమ్మా గాతి సంప్రశ్రయ
మ్మై గ్రామంగమిగా నుదాహృతిగ గొన్మాదానినే! లేదకో
యుగ్రంబై యిల నాశనంబగును సూ!యోచింపు భామామణీ!
జిలేబి
ReplyDeleteగారూ గీరన నేల ! మాకు బుచికీ గారంటు మర్యాద లే
లా? రావుల్ మము గారు గీరనక యేరా రార పోరా యనన్
సారూ బాగుగ నుండునయ్య వినుమా సామీ గుభాళించు మా
పేరున్పో సభ లో జిలేబి దరువై పెద్దయ్య శోభిల్లెదన్ :)
జిలేబి
ReplyDeleteలారీలెక్కితి వీవ దెట్లు హరిణీ ? లాగేము కూపీ! జిలే
బీ! రాచెప్పు మగోండ్ల వోలె నదెటుల్ బింబోష్టులున్ చే తు రే?
యేరాలమ్ముగ కట్టినావు కతలన్! నేమార్చుచున్నావు బా
మ్మా! రమ్మమ్మ జవాబు తెల్పుమిపుడే మాతంగివో జోగివో?
జిలేబి
ReplyDeleteపోదారీ మన బండి రావు వరులే పో! పేరడీకింగు లే
గా!దాష్టీకము చూపకోయి లలనా! కాదంబరీగీతలి
వ్వే!దారెంబడి గాలి తీరుగనుచున్ వింజామరైవచ్చె నీ
కై దర్బారున పద్యమొక్కటి భళా కైకట్టు గా వేయవే :)
జిలేబి
ReplyDeleteనాలో రేగె గుహాశయుండు! భళి నానారీతి యాలో చనల్
తేలాడెన్ మరి యేల నోయనుచునుద్వేగమ్ముతో వేసితిన్
మూలాధారము తట్టదాయె జనులమ్మో వైవి యారేయనన్
చాలా చక్కగ నంతరంగమును భాజాయించితిన్చిత్రమై
జిలేబి
ReplyDeleteలచ్చిందేవికి కుర్చి తామరకదా ! లావెక్కువేగాద సూ!
బిచ్చంబెత్తిరి నాడు సైకిలుని, తాపీగాన తూతూ యనన్
కచ్చల్గట్టి రణంబు జేసిరయ! పంకాతో సమాధానమో ?
బొచ్చుల్రాలున కారు తోడు పయనంబొప్పారునా మానవా !
జిలేబి
ReplyDeleteమానక్షత్రము కాపు చిహ్నమును భామా! చామ! నీహారిక
మ్మీనాడిచ్చట త్రోసి పుచ్చిరకొ సుమ్మీ యంచువచ్చా ను! లే!
మా నాణ్యంబగు సూర్య వంశమును వాహ్ మల్లాడి కాపాడిరే!
యీనాడే భళి జేర్తు మీకు వరదాయీయంచు పేరున్ వెసన్ :)
జిలేబి
ReplyDeleteరావే లక్ష్మి జిలేబి పంకజముఖీ రాస్తా దిఖావో హమే !
నీవేనమ్మరొ దిక్కు మాకు లలనా నీహారికా సుందరీ !
భావావేశము తోడు రమ్మ నుతుకన్ భాజ్పాను బండ్రాయిపై
తావుల్దప్పన నేతలెల్ల సుదతీ దారెంబడిన్ కాల్బడన్!
జిలేబి
ReplyDeleteసత్కార్యంబుల జేయ ధైర్యము మనోస్థైర్యంబులున్ గావలెన్
ఉత్కంఠంబును ద్రోలి ప్రైష్యముల నత్యుత్కృష్టమై చేయగా
తత్కాలంబున దాని సార్థకత సాధ్యంబౌను కైసేతగా
సత్కారంబుల బాలు గైకొనుడయా! సర్వోన్నతంబీ సెసెల్!
జిలేబి
ReplyDeleteరంభాహో యను పాటలన్, సరసమై రాణించు గీతమ్ములన్
భంభంబంచు జిలేబులన్ కవివరా బారాన చారానగా
సంభారమ్మున వేయు చుంటి నయ మాస్టారూ నిదానంబుగా
భంభీరీ భళి నేడు రీటయిరవన్ వర్రోడె వేగంబుగా :)
జిలేబి
घराना का तराना अब बनगया चार आना बारा आना ...
Deleteक्या हाल होगया ... कैसे जमाना आगया ...
चुप नहीं रझूंगा ... मैं इन्तेक़ाम लूंगा ...
दोस्तों को प्यार किया ... दुश्मनों से बदलालिया ...
शान से ... गान से ...
हाहाहा ... :)
ReplyDeleteవాడే వీడనుకొంటి కాదనుచు యీ భాయీ, చిరంజీవి వీ
రాడేనాటక మెల్ల గాంచియనెనర్రా ధీరుడున్ శూరుడున్,
పీడై బట్టిరి తెల్గు లోకమునకున్ పిచ్చోళ్ళు సుమ్మీ, జిలే
బీ,డాకూ మనుజుల్ సభాసదనమున్ పీడించిరమ్మా సదా
జిలేబి
ReplyDeleteహేరాలమ్ముగ లంభ! వమ్మవక మాహేశీ! భవానీ హర
మ్మై రమ్మా ! ఉమ ! యీ శరత్తు వసతిన్ మాధుర్య మొప్పార గా
నేరాలమ్ముగ నిమ్మ నీశి వరముల్ ! నేర్పించ వమ్మా శివున్
ధారాళమ్ముగ చేరు మార్గముల గాంధర్వీ!శివానీ ! నతుల్ !
జిలేబి
ReplyDeleteఛీఛీ ఆచారముల్ :)
దీనారమ్ముల దేశమందు భళిరా దీమమ్ము, తీర్థమ్ము లౌ
పానీయమ్ములు గంధమాదని సుమా ! బారుల్ సదాచారముల్,
మీ నాగా నెఱి యేల నాకు, కలదోయ్ మించారు జోష్ ఓ ఖరోష్!
స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా!
జిలేబి
ReplyDeleteబసవన్న
ఏనాడైనను నన్ను వీడి భగుడా యేడైన వెళ్ళావకో?
నీ నాట్యంబును చూడకుండ గడిపానే నేను? శంభో శివా!
నీ నందిన్! జడదారి! తెల్లనిదొరా! నీవాడ, సేనాపతీ!
స్నానంబుల్ జప నిష్ఠ లేల ,మడియున్ జంధ్యంబు నా కేలరా?
జిలేబి
ReplyDeleteకైశోరంపుల బుచ్చి గాడి నకొ ? చా, కైపెక్కు కైపుల్ భళా
యీ శాండో బలిసెన్ పలమ్ముల సుమా ! యీప్రొద్దు రావాడ, గ
ర్తా! శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ? లతాతన్వి,ఓ,
వైశాలీ ! రమణీ జిలేబి వలయున్ వర్రోడు మద్యంబహో !
జిలేబి
ReplyDeleteనీ నాథుండను జంబు నాధుడను ! కన్నీరుల్ సదా గార్చక
మ్మా! నీ బాంచను కాలు మొక్కదను! కొమ్మా రమ్మ! పూబోడియా !
ఓ నాగారి! జిలేబి ప్రాణ సఖియా! ఓ నా బసాలా ! ఖులా
సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!
మా అయ్యరు ఉవాచ :)
జిలేబి
ReplyDeleteకోనాడుల్ నిను గాంచిరే ద్రుహినుడా ! కొండల్ నివాసమ్ముగా
నీనామమ్ముల సుప్రభాతముగ నా నెమ్మాను రీతిన్ సదా
శ్రీనాథుండ!అధోక్షజుండ! అజుడా! శ్రీమంతుడా! శ్రీనివా
సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!
జిలేబి
ReplyDeleteధర్మ్యంబెల్లపుడున్ సఖీ విడువకన్ ధర్మార్థ మోక్షంబు, నై
ష్కర్మ్యంబుల్ మరి తోడుగాన భువిలో షట్కాలముల్వెల్గి సా
ధర్మ్యంబైజను లెల్ల నెమ్మది గనన్ ,ధాత్రిన్ సదా దోచునా
హర్మ్యంబందున మఱ్ఱిచెట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్!
జిలేబి
ReplyDeleteAngkorwat temple :)
హర్మ్యంబుల్ భళి కట్టి రచ్చట గదా హాహాయనంగన్ మహా
హర్మ్యంబైనిలిచెన్ గదాగ్రజునికై నంగ్కోరువాటున్ భళా
హర్మ్యంబద్దియె! నాటి ధర్మ మున కాహార్యంబు ! కాంబోడియా
హర్మ్యంబందున మఱ్ఱిచెట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్!
ఇది మర్రిచెట్టో కాదో తెలియదు అయినా హర్మ్యంబు లో చెట్టే ఊర్ధ్వ మూలముగా :)
ఫోటో !
https://en.wikipedia.org/wiki/Ta_Prohm#/media/File:Angkor_SiemReap_Cambodia_Tha-Prom-Temple-01.jpg
జిలేబి
ReplyDeleteజైగొట్టన్ దగు చంద్రబాబునకు! భాజ్పాతీరులన్కొట్టగా
భాగంబాయెను కాంగిరేసుకడ తా ప్రాంతీయతన్ దాటుచున్
వేగంబున్గొని మిత్ర కూటమిని తా వెల్గంగ తేజోమయం
బై గొప్పోడగు రాహు లయ్య సరసన్ భారీగ ఫోటోదిగెన్!
జిలేబి
ReplyDeleteహోరాహోరిగ పోరి యా శశికళన్ హోసూరు దాటింపగా
పోరాడెన్ తను వెళ్ళనంచు భళి కోపోద్రిక్తతన్ సాయెబా!
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే!
సారీ మేడము మీరు వెళ్ళవలె నీసారీ సుమాతప్పకన్!
జిలేబి
ReplyDeleteశార్దూలమ్ముల మధ్య తానెదిగె నో చంపెన్ కదాయన్ననే :)
గూడారమ్ముల వేసి సర్కసులతో కూడెట్టి తా డబ్బులన్,
మేడారమ్మున చెల్లి కొక్క మగడిన్ మేల్గాంచి కల్యాణమున్
తేడా యేమియు లేక చేయగ నరే తెన్కాశి లో చంపె పె
ద్దోడిన్దస్కము లివ్వ మంచు స్వసయున్,తోడైన బామ్మర్దియున్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
జిలేబి
ReplyDeleteగోజీవారము గాధలన్నిటిని సాంగోపాంగమై తెల్పగో
రే జీవుణ్ణి సుమా! జనాళి చదువన్ రేయింబవళ్ళైన నే
మీ జీరాడును నాదు పల్కులు భళా మించారుచున్ తీపిగా
బాజీయిద్దియె రండి సంతసముతో పల్లాండు పాడన్ సుమా!
జిలేబి
ReplyDeleteసర్కారెక్స్ప్రెసు నెక్కి మధ్విజనటన్ సంసేవనల్ జేయుచున్
సర్కాయింపగ కోరగా జనుల పై సారించె మేధావి యీ
కిర్కట్లన్ సయి గూర్చు కైపదమయా కించిత్తు పూరించుడీ !
"మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"
జిలేబి
ReplyDeleteహ్యాపీడేసు మహాలయాదివసముల్! హ్యాపీ రిటర్న్సాఫు లి
వ్వే పిండమ్ముల పెట్టు తద్దినపు నైవేద్యాలకున్! వేయగా
టోపీ ఫారెను సంప్రదాయపు పటాటోపమ్ములన్ జేర్చుచున్,
తాపీగా మనదేశ నేతలకు చేద్దామోయ్ నివాళుల్ భళా !
జిలేబి
ReplyDeleteపోచిరాజు వారి ఉభయము గా ఒక శార్దూలము గిట్టు బాటయ్యె :)
ఆర్యాంబా! కొదవేమి పేరులకు హయ్యారే జిలేబమ్మవో?
సూర్యారావకొ? భాస్కరార్యుడివకో? సోంబేరివో? లేమవో?
పర్యంకంబున నిద్రపోవక సదా బ్లాగింగు లన్ చేయు యై
శ్వర్యా!చెప్పుచు విప్పుమీ ముడిని ఓ బంగారుబోడీ వెసన్!:)
జిలేబి
ReplyDeleteఇవ్వాళ శార్దూలమే శార్దూలము:)
గోమూత్రమ్ము భళారె గొప్పదనుచున్ గోమాత పేడల్ జిలే
బీ మాకంచు జనాళి ప్రార్థ నల గొబ్బిళ్ళన్ భళా తట్టిరే
యేమాత్రమ్మిది శాస్త్ర సమ్మ తమురా యేమారి పోయేరు మి
మ్మేమార్చేరయ పండితాళి ప్రముఖుల్ మేధావి వర్గంబులున్ :)
జిలేబి
ReplyDeleteఈ కోణంగితనమ్ము నాకు పడదోయీ! వూరికే మాటలే
లా! కాదంబరి! తుస్సు బుస్సు కతలేలా!రావడేలన్ జిలే
బీ? కుల్లూరున కెళ్ళి నావకొ? యెలా? పీయెమ్ము మోడీవలెన్
నీకేమైన గవర్నమెంటు విడిగా నింపార ప్లేనిచ్చెనో ?
జిలేబి
ReplyDeleteమాకందానికి బండివారదురహో మాకందమున్ చేర్చిరే
మీ కందంబది పారె బండివలె సుమ్మీ రావు గారూ భళా
రే!కందమ్మున కారవోకెలను హుర్రే యంచుపారించుడీ!
పాకంబై మన బామ్మగారిని సభాప్రాంగమ్ములోతాకగన్ :)
జిలేబి
ReplyDeleteఆహా!పల్లె ప్రపంచ మయ్యె భళి బేవారీసుగా తీటగన్
బాహాటమ్ముగ కొట్టు కోవడమె పో ప్రాంగమ్ములోయింకనా
హాహాయంచును బాకి !చూతమిక హాహాకారముల్ దుమ్ములే
తాహత్తున్ మరి నిర్ణయించునకొ వాదమ్ముల్ జిలేబీయమై :)
జిలేబి
ReplyDeleteకాశ్మీరమ్మొక నాడు భూతలపు స్వర్గంబై భళా వెల్గె! తా
పశ్మీనాలకు పేరు గాంచెను! సదా వైదుష్యమున్ చేర్చె! హా
కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్?
కాశ్మీరమ్ము జిలేబి గా తనరగా గాదే సఖీ మేల్ సుమా ?
జిలేబి
ReplyDeleteవేశ్మంబౌనయ కశ్మలమ్ములకు, ప్రావీణ్యమ్ము వీడన్ పురిన్
కాశ్మీరమ్మది చేయిదాటును వెసన్, కాంగ్రెస్సు లాలింపులే
కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్, గళ్యాణ మిద్ధాత్రికిన్
కాశ్మీరమ్ము మిలట్రి సాయముగ మోకారింప దుర్మార్గులన్!
జిలేబి
ReplyDeleteపశ్మీనా యను షాలు చుట్టుకొని కాపాడన్ భళా విట్టుబా
బాశ్మాన్లో తిరుగాడుచున్ జనులనే, పద్యంబులన్ పాడగా,
వేశ్మంబందున వేడిపుట్టగ భళా వేగమ్ము వేగమ్ముగా
కాశ్మీరమ్మున నుగ్ర,"వాద" మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్!
జిలేబి
ReplyDeleteమేస్టారండి! జిలేబులూరెను సుమా! మీరొక్క పద్యమ్ములో
నే స్టోరీకి సమీక్ష రాసిరిగదా నేర్పున్న లక్కాకుల
య్యా! స్టైలన్నయిదేగదయ్య! తెలుగొయ్యారంబులాడెన్! ధమా
కా స్టారైరి తెలుంగు పంచ దశలోకంబందుమీరే సుమా:)
జిలేబి
ReplyDeleteచూసే దృష్టిని బట్టి యుండును సుమా చొక్కారు రీతుల్ గదా
జీసెస్సైనను కృష్ణుడైన నరయన్ సింహాద్రియప్పన్నయున్
వేసాల్గట్టెడు స్వాములైన తెలియన్ విస్తార మైనట్టి వి
శ్వాసంబుల్! కనరాడతండు సుదతీ సారూప్య సాలోక్యమై
జిలేబి
ReplyDeleteతాతావారి సుపుత్రుడా! మురిపెముల్ తవ్వాయిలున్ చెల్లు న
న్నే తీరున్ సరి చూచు కొందువకొ, నన్నేలంగ మాతామహీ
పుత్రా, రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్,
"పోతీస్లో" మరి చీరలన్ కొనుటకై పోదాము రమ్మా ! సఖా !
జిలేబి
సంయుతా సంయుత ప్రాస
ReplyDeleteచిత్రంబాయెను బాలకృష్ణునిది వైచిత్రిన్ భళాచూపగాన్
పాత్రల్ వేషము మార్చి వచ్చిరట రంభాహో హొ రంభాయనన్
పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్
ఛా!త్రాగంగను రమ్ము విస్కి లనటన్ జంగ్లీలవేషమ్ములోన్ !
జిలేబి
ReplyDeleteశార్దూలమంటే అదో యిది :)
ఛాత్రాలోకపు స్నేహితుండతడు పాశ్చాత్యుండు,ప్రేమింపగా
మైత్రిన్మీరి జిలేబి తో మనువయెన్ మద్రాసులో, శోభతో
రాత్రమ్ముల్ కొనియాడ హృచ్ఛయముగా ప్రాణేశ! రారమ్మ, శ్రీ
పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్!
జిలేబి
ReplyDeleteపొత్రంబీవయ! సన్నికల్లు సరసిన్ పూబోడి నే పెండ్లి తో
గోత్రంబున్ భళి మార్చి నావు గదరా గోపాల నా రంగడా!
క్షేత్రంబైతిని నీకు క్షేత్రివగుచున్ క్రీడా వనంబేగ శ్రీ
పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్!
జిలేబి
ReplyDeleteచాలింపన్ దగు బాలసమ్ము సఖియా సౌఖ్యంబులన్గాన నీ
వీ లాలూచిని వీడి మంచి నడతన్ వెన్నంటి బోవన్ దగున్
కైలాసంబును వాంఛచేయ వినవే కాంతామణీ నీవు కో
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!
జిలేబి
ReplyDeleteఅన్నాలెల్లను బెట్టడానికయినా కాబళ్ళ ? కూలోళ్ళకున్
చిన్నా శర్కరి కోళ్ళు నాల్గయిన? తా జెప్పొచ్చినాడే సుమా
రాన్నా! యంచును మావ యందరికి హోరాహోరి ! నిప్పట్లకై
చిన్నమ్మమ్మను కూడ బిల్చెనుగదా చిత్రంబు యమ్మమ్మయున్
జిలేబి
ReplyDeleteవిద్వాంసుండు! వివేకి! సద్వసధమున్ వీక్షించె గాంచెన్ మహా
సాధ్విన్ సీతను! చెట్టు పుట్టల భళా సాగింప యుల్లంఘనం
బద్వందుండగు రామబంటు సవరంబయ్యారె నిప్పంటి, యం
గద్వాలప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్!
జిలేబి
ReplyDeleteదత్తపది - క్రియ సమాస కారక సంధి
భారతార్థములో
శ్రీకృష్ణ ఉవాచ :
ఉత్సాహంబది దోసమాసయని నయ్యోయంచు బీభత్సుడా
తాత్సర్యంబును జేయకయ్య! క్రియగా ధైర్యంబుగా యుద్ధమున్
మాత్సర్యంబును వీడి కారకపు కర్మాంగమ్ముగా జూడు మీ!
యుత్సాదించుము శత్రు కూటమిని నీ వ్యూహంబుతో సంధియై!
జిలేబి
ReplyDeleteమన జీపీయెస్ వారు :)
ఉల్లాసంబుగ శంకరాభరణ పద్యోత్సాహ శూరుండు తా
నల్లాటమ్ములు లేని వాడు సభలో నైర్భర్యమున్ గల్గి యా
కొల్లాబండిని జోరు గా నడుపుచున్ కోఆట గా పద్య మౌ
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్!
జిలేబి
ReplyDeleteకల్లోలంబుగ చేర పెన్మిటిని తాకన్ వేడియున్ యుజ్యమే
యుల్లాసంబుగ మారి సేదగొన నాయుత్సాహమున్ భామినీ
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్
పిల్లాడై తన రార, జీవితము శోభించెన్ మహారాజ్ఞిగా!
జిలేబి
ReplyDeleteమేధాజీవి యొనర్చు కార్యములు సుమ్మీ బమ్మి మారున్ వెసన్
సాధారణ్యపు తిమ్మిగాను మనమైసై పోవుచున్ వారినే
సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము! దురాచారున్ జనుల్ మెచ్చఁగన్
రాధావల్లభ! కీడుమూడు భువిలో రాడ్వంశుడైవెల్గు తా!
జిలేబి
ReplyDeleteవాగ్దానంబిదియే జిలేబి వినుమా వాగఱ్ఱ నాడించుచున్
దిగ్దంతిన్ తలపించు రీతి పదముల్ ధీమంతుడై వేయునా
వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే, వ్యర్థుండు పో యిద్ధరన్
దుగ్దన్గాను సరస్వతిన్ తలవకన్ ధూర్తుండుగా బోవగా!
జిలేబి
ReplyDeleteఉద్బాష్పంబులవేల? యిష్టసఖుడా!యూగాడనేలన్ వ్యధన్?
హృద్బాధల్ చను నంతరాత్మయు సదా హృత్సారమున్గానగా
నుద్బోధించెద వీడు నెంజిలను మున్నున్ నిప్డు తప్పేసుమా
క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే?
జిలేబి
ReplyDeleteఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!
హమ్మయ్య!
జిలేబి
ReplyDeleteఈ రూపంబిది చారకమ్మగు ప్రభో! యీడేర్చ నీ సన్నిధిన్
"మీరా కే ప్రభు" యంచు భక్తి మయమై మించారు రీతిన్ సదా
కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్
హేరాళమ్ముగ భక్తిమార్గమున "చాహే కృష్ణ యా రామ్ కహో" !
జిలేబి
ReplyDeleteశంకర శతకావిష్కరణకు వెళుతూ వెళుతు కంది వారి ఆలోచన :)
పంథాగా భళి సాగుతున్న సభలో పద్యమ్ములన్ రాయుచున్
సంథాగా వెలుగొందు పండితుల ప్రాశస్త్యమ్ము దివ్యోజ్వలా
మాంథర్యమ్మును గాన కైపదమసామాన్యంబుగా వేయకన్
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్!
అని ఇట్లాంటి థ ప్రాస వేసి చక్కా బోయేరు కంది వారు :)
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteహమ్మయ్య !
సిన్మాకై తను పాటలన్ ధనమునే చెంగల్వ పూదండగా
సన్మార్గమ్మగు పద్యసంపదను భాషాలక్ష్మినే త్రోయుచున్
తన్మాత్రల్, విడి, పారనొత్తి పదముల్ తాళమ్ముకై వ్రాయగా
సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్!
జిలేబి