Thursday, May 4, 2017

తేటగీతి - హైకూలు - ఒక పరిశీలన


తేటగీతి - హైకూలు - ఒక పరిశీలన



ఆ మధ్య శంకరాభరణం లో శ్రీ జీ పీ యెస్ గారు ఎందుకో హైకూ ల ప్రస్తావన తెచ్చారు ; అబ్బా తెలుగు ఛందస్సు లో లేనివి ఏమైనా ఉంటాయా అనుకున్నా.

సరే ఈ హైకూలేమిటో అని గూగులిస్తే మొత్తం మీద తేలిందేమి టంటే అదీ ఓ మోస్తరు చందమే :)

మరీ చాలా సరళమైనది తేట గీతి లో ఒక వాక్యాన్ని విడ గొట్టితే మూడు పాదాలు గా హైకూ రెడీ అని పించింది.

(కొంత భావగర్భితం గా ఉండాలి - 'ఎంత ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండి, ఎంత ఎక్కువ పరేషాన్ చేస్తే అంత మంచి హైకూ :) జేకే :)-

చదివిన ప్రతి వారి కీ వేరే వేరే భావాలు అర్థం అయితే మరీ మంచిది (జిలేబి మాటల్లా అన్న మాట :)

సరే
ఇప్పుడు తేట గీతి ఏమిటి ? హైకూ ఏమిటి అన్నది చూద్దాం

తేటగీతి  - ఒక సూర్య రెండు ఇంద్ర రెండు సూర్య గణాలు (మూడు , నాలుగు,నాలుగు,మూడు మూడు మాత్రలు సరళం గా అర్థం చేసు కోవటానికి.  -

3+4+4+3+3 = 17

తేటగీతి
పద్య లక్షణములు:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం లేదు
  3. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.

హైకూ ? - వికి పీడియా ప్రకారం ->  గమనిస్తే పది హేడు అక్షరాలు (వారి ప్రకారం)

3+4+4+3+3 = 17 = 5+7+5 = 17

The best-known Japanese haiku[15] is Bashō's "old pond":
古池や蛙飛び込む水の音
ふるいけやかわずとびこむみずのおと (transliterated into 17 hiragana)
furu ike ya kawazu tobikomu mizu no oto (transliterated into rōmaji)
This separates into on as:
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu-no-o-to (5)
Translated:[16]
old pond
frog leaps in
water's sound
ఇప్పుడు ఒక తేట గీతి రాసి దాన్ని విడగొడితే హైకూ ఎట్లా వస్తుందో చూద్దాం : )

 (జిలేబి కి అన్నీ విడ గొడితే గాని అర్థం కాదు మరి :)

తేటగీతి

రోడ్డును డివైడు చేస్తోంది రొష్టు గీర
బొడ్డు అందాన్ని తిరగేసె బోడి గుండు
మెట్ల పైనించి బొమ్మలమ్మి తిరిగింది
గిట్ల రాయి హైకూలను జిగి జిలేబి‌

హైకూలు :)



రోడ్డును
డివైడు
చేస్తోంది
రొష్టు గీర

**
బొడ్డు
అందాన్ని
తిరగేసె
బోడి గుండు

**
మెట్ల
పైనించి
బొమ్మలమ్మి
తిరిగింది

*"
గిట్ల
రాయి
హైకూలను
జిగి జిలేబి‌
**

చీర్స్
జిలేబి
నారదాయ నమః !

 

7 comments:


  1. కొండలో
    మరుమల్లియ
    కోడి గాంచె

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. My English Haiku for you:

      Blog world is fun place
      I would like to thank you for
      All your funny ways

      Delete

  2. నిప్పు
    నాకము భీతిగ
    నింగి జూచె

    జిలేబొ

    ReplyDelete
  3. You are funny only to yourself lady!

    People are laughing "at" your jokes not "for" your jokes. Hope you know that.

    ReplyDelete


  4. చెణుకులు హాస్యము లర్థము
    గనలే నని కేతనుండు కట్టెను టాగ్ లైన్
    వినవమ్మ జిలేబి వినద
    గు నెవ్వరు పలుకగనౌ సుగుణముల పలుకౌ !

    జిలేబి

    ReplyDelete

  5. వై వీ ఆర్ యెస్ గారి హైకు

    జీవితం = జీవం + జీతం

    జీవితం - జీతం = వితం

    జిలేబి ఈక్వేషన్ జీవితం - వితం = జీవం

    ReplyDelete
    Replies
    1. బీలేజీ
      జిలేబిజీ
      హాపీలీజీ
      తే రహో!
      పోశారు జీ
      వం హైకూకహో !!

      Delete