Friday, November 24, 2017

చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ :)







చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
 
 
చుక్క కనిపించి నదకో ?
పక్కా గాదోయ్  జిలేబి పరమాత్ముడనన్ !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !


జిలేబి

Saturday, November 18, 2017

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా-డబ్బైయ వ వడి లో నా ఆలోచనలు



నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ !

ఈ పాటండీ నా ముప్పై ఏళ్ల ప్రాయం లో నండి కన్నదండి, విన్నదండి ఆయ్ !
కానండీ, ఇప్పుడో డబ్బై పైబడి వయసొచ్చేసినాదండి
కాళ్ళు కాట్ వదల నంటోందండీ కాట్ వదిలితే  కాట్ కి ఐ చేరే చోటికే కాబట్టి నో నో అంటోందండి ఆయ్ !
ఆ జుజుబి ప్రాయం లో విన్న పాటండీ, చిత్రమండి మరో చరిత్ర దాని దర్శకుడు బాలచందర్ బాల్చీ తన్నేసే రండీ ఆ మధ్యే, మరో చరిత్ర పైన ఇంద్ర లోకం లో రాసేసు కుందామని వెళ్లి పోయే డండి.
అంతకు మునుపే రాసినాయనా  ఆత్రేయ (కిలంబి వెంకట నరసింహాచార్యులు) అండి, ఆ చిత్రం తరువాయి దశకం లో విష్ణు సేవ కై వైకుంఠం వెళ్ళి పోయే  రండి ; అంటే ఓ ముప్పై దరిదాపుల్లో సంవత్సారా లై పోయే నండి ఆయ్ 
అదే చిత్రం లో నాయకి సరిత అండి ఈ మధ్యే త్సునామీ అక్క గా సిలోన్ సినెమా లో  కనిపించిందండి
ఆ చిత్రం నాయకుడండి, 'తమిళ నాట రాజకీయ ప్రక్షాళనం' కోసం ఈ మధ్య నడుము కట్టేడండి,
అంటే పురచ్చి తలైవి బాల్చీ కట్టేసే కండి,
కళ్ళజోడు ఆసామి బాల్చి కోసం చూస్తున్న తరుణం లోనండి,
అదేదో సినిమా హీరోయిన్ల నడుమును కట్టేసు కున్నంత సుళువు అనుకుంటూ !
అంతంత ఎం జీ ఆర్ కూడా కట్టేసు కో లేంది, కట్టేసు కుని ఫ్లాప్ అయి పోయిన శివాజీ గణేశన్ కట్టేసు కో లేనిది, తా కట్టు కో లేనా అనుకుంటూ .
ఆయ్ దారి తప్పినట్టున్నా కదండి 'సావాస కష్టే ఫలి ' దోషమండి :) 
సరే ఈ పాట ని ఓ మోస్తరు డబ్బై పై బడి వయసు లో మనమూ రివ్యూ చేసి పారేద్దా మని చదివే నండీ !
అయ్య బాబోయ్ ! ఎంత వేదాంత మండీ ఆత్రేయ కలం లో అనిపించిందండి ; అందుకే నండి టపా కట్టేసే నండి (ఇందులో పన్నేమి లేదండి :))
మా వెంకన్న అంటున్నాడండి
"
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా"
నేనే నండి గమనించ లే ! స్వామి వారిని అడుగు తామే  ఉండాము  కాని వారూ ఏనాడైనా లేదన్నా నా  అంటూ ఉబ్బెస్తున్నారే  కానీండి  , తనని రా రా నాతో అని ఎప్పుడు పిలవనే లేదండి ; అయ్యో అయ్యో అని అయిపోయినాదండి మనసు :)
ఉబ్బెసే సాముల్నే గమనిస్తున్నాం కానీండి, దరి నీవుండ రా కొండల రాయని పిలవటం లేదని పించి నాదండి
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా  అంటూ సామి కూడా దోబూచు లాడ తానే ఉండాడండి :)
కాట్ ఐ కాలం లో "నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ" అనుకుంటున్నామండి ఆయ్ !
మా అయ్యర్ గారే మో నండి , ఏడు కొండల వాడా " నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకేమీ  జోడంటని అడుగు తోందని" వాపోతున్నారండి
అదండీ కథ !

ఆఖర్నండి ,
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
కోరికలేవీ ఉండ కూడదటండి , కానీ కొండల రాయని చేరే ఒక్క కోరిక మాత్రం ఓకే అన్నారండి ; అందుకే సామీ , "ఎన్కటి" సామీ, నీ కోరిక చూపె , నను తొందర చేసే అనుకోవచ్చండి  అని అనుకుంటున్నానండి 

మీరేమంటారండి ?
చీర్స్
జిలేబి 

Friday, November 17, 2017

నందనోద్యోగభ్రాంతులు :)

 
 
నందనోద్యోగభ్రాంతులు :)
 
అదిగో మానవుడు
బ్యాకు పేకును
భుజాల మీదేసుకుని
బయలుదేరాడు !
 
వాడే నందనోద్యోగభ్రాంతి !
 
రేతిరి పగలనక
జీవిత మంతా
కర్మవీరుడిలా !
 
హృషీకేశా !
కర్మసిద్దాంత మార్తాండా !
ఈ భ్రాంతి ని క్రాంతి గా
చేసి నీ పథము
చేరే దెట్లా ?
 
 
శుభోదయం !
జిలేబి

Sunday, November 12, 2017

పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?



పంచ పండ వుల శంకువు ల పేర్లేమితో మీకు తెలుసా ?  :)
 
(తెలుగు లో టైటిల్స్
ఇట్లాగే వుంటాయి కాబట్టి
మన బ్లాగ్లోకం లో :) జేకే జే ఎఫ్ :))
 
పంచ పాండవుల శంఖముల పేర్లేమిటి ?
 
 
 
అనంత విజయము - ధర్మరాజు
పౌండ్రము - భీముడు
దేవదత్తము - అర్జునుడు
సుఘోష - నకులుడు
మణిపుష్పకము - సహదేవుడు
 
పాంచజన్యము - శ్రీ కృష్ణుడు
 
భగవద్గీత
అధ్యాయం ఒకటి 15-16 శ్లోకములు ఆధారము
 
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః  1-15
 
అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః
నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ     1-16
 
శుభోదయం
జిలేబి

 

Monday, November 6, 2017

కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



 
 
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
 
నీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)



జిలేబి
 
 
 

Thursday, November 2, 2017

ప్రియతము డతడే జిలేబి విభుడున్నతడే !



ప్రియతము డతడే జిలేబి  విభుడున్నతడే !



సంతానము పెద్దదయా !
చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
న్నింతి యొలయుమని వేడె
న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !


పిరియపు చిపిటములను చెలి
మరి తెచ్చెననుచు ముచుటిని మరిమరి యొలయన్
సిరి, యవనారిని విడువన్
సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !


పయిపంచెన చిపిటములన్
సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
రి యెలమి యాదరువులనన్
ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !


శుభోదయం
జిలేబి





నిషిద్ధాక్షరి
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.