Sunday, June 16, 2019

టోల్ ఫ్రీ నెంబరు బిజీ గా వున్నది :)


టోల్ ఫ్రీ నెంబరు బిజీ గా వున్నది :)

అప్పుడప్పుడు‌ టెలిఫోన్ చేస్తుంటే మీరు "కాల్చేసిన‌వారు" మాట్లేడే పరిస్థితుల్లో లేరని " ఆవాజ్" విని‌ మా‌ అయ్యరు గారితో చెబ్తే ( ఆయన ' కవి ' కష్టేఫలి‌ వారిలా :)) ఓయ్‌ జిలేబి నువ్వు "కాల్చేస్తే " వాళ్లింకా యెట్లా‌ మాట్లాడతారే అంటూ బోసి నవ్వు నవ్వే జంబునాథన్ కృష్ణ స్వామి‌గారు ఇవ్వాళ పిలిచి " ఇదిగో చూడు మోడీ గారికి సలహాలు‌ కావాలంటా టోల్ ఫ్రీ నెంబరు ఇదీ ఫోన్‌ చేసి నా సలహాలు చెప్పు అన్నారు


సరే పెద్దాయన చెప్పేరు కదా అని‌ మోడీ జీ ఇవిగో మా‌ అయ్యరు గారి సలహాలని టోల్ ఫ్రీ నెంబరు‌ కు‌ ఫోన్ చేస్తే ఎంతకీ కలవదే మరి :) ఫ్రీ నెంబరు ఆల్ వేస్ బిజీ :)


వామ్మో ! దేశం లో ఇంత మంది సలహాలిచ్చే వారున్నారే
అని మురిసి పోయా ! ఆ మాటే మా అయ్యరు గారితో అంటే  " ఒసేయ్ మొద్దూ దేశంలో సలహాలిచ్చేవారు మాత్రమే ఉన్నారని ఓ నవ్వు నవ్వేసి పోన్లే నెంబరు‌ బిజీ గా వుంది అదే పది వేలని ఊరుకునేసేరు :)


మీరూ ప్రయత్నిద్దురూ :)

మోదీ కి ఐడియా లివ్వండి

టోల్ ఫ్రీ - 1800 117 800


Best of luck :)



చీర్స్
జిలేబి



208 comments:



  1. అక్కడ యిక్కడ చక్కగ
    నెక్కడ చూసిన జిలేబి నెమ్మియు తోడై
    మక్కువ మీరగ నీకై
    పక్కన కలడే దయాళువా రాఘవుడే !


    జిలేబి

    ReplyDelete


  2. జగనన్నా అత్యంతము
    గ గాట్టి సంపాదనకల కరుణా మయుడా !
    భగవంతుడేను పంపిం
    చెగదా నిన్ను జనులెల్ల శ్రీమంతులవన్ !


    జిలేబి

    ReplyDelete


  3. కోవా, జిలేబి, జాంగ్రీ,
    జీవా కాంక్షలు, పరమునుఁ జేకూర్చును, లే
    రావమ్మా భోజనమును
    గావింపంగ నిహపర సుఖమ్ముల పొందన్ !


    ఎప్పుడూ తిండి యావే ? :)


    జిలేబి

    ReplyDelete


  4. నీవా కొండని గుండు కొట్టు కొని పన్నీటన్ తటాకమ్ములో
    దేవా! కావుమటంచు వేడి మునుగన్, దేహమ్ము హాయిన్ గనన్
    కోవా జాంగ్రి జిలేబి లడ్డుల గొనన్ గోవిందు నామమ్ముతో
    జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్!


    ఏడుకొండల వాడా గోవిందా గో విందా


    జిలేబి

    ReplyDelete


  5. జీవన తరంగముల, రా
    జీవా రఘురామ యంచు, శీఘ్రము దాటన్,
    నీవే శరణని వేడన్,
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


    ***

    రావణ! చెర విడు సీతను
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
    నీ వనుట తప్పు ! రాముం
    డావల సంద్రమ్ము దాటడా హత మార్చన్ ?


    ***

    త్రోవయు లక్ష్యంబతడే
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
    నావల కలడతడు సుమా
    నీ విలలో గట్టి బతుకు నీడ్వ జిలేబీ !

    ***

    ఆవారపారము కడచ
    నావ యొకటి వలయు నటులె నా బతుకునకై
    జీవము వరలంగ వలయు
    జీవా కాంక్షలు, పరమునుఁ జేకూర్చునులే!


    ***

    నీవే దిక్కిక రామా
    యీ వాహిని దాటగా నొకింత బలిమికై
    సేవా సదనమ్మున రా
    జీవా! కాంక్షలు, పరమునుఁ జేకూర్చునులే!


    ***

    ఓ వరలెడు పరలోకపు
    నా వప్రుడ! ఓ దయాళు ! నాప్రాణము నీ
    వే! వరముగ హలెలూయా!
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


    ఆమెన్!

    ***

    జీవంబిచ్చిన వాడవు
    నీవే! ప్రభు! కోరికలకు నీవే వైనం
    బై వెలసినాడవు! కనుక
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


    జిలేబి

    ReplyDelete


  6. మా బాబుగారి పాలన
    బాబోయ్ డొల్లయట ! జగను బాబుతెలిపిర
    బ్బా! బోసి నవ్వులన్ గాం
    ధీ బాసింపట్టు వేసి తీరుగ కాచెన్ :)


    జిలేబి

    ReplyDelete


  7. పోలవరము మూలకు పో
    యే! లెక్కలనింక తోడి యెత్తి ఘరానా
    లాలూచీల కెలికి వా
    టాలన్ పసిగట్టెదమ్ము ! టాస్క్ఫోర్సిదిగో!


    జిలేబి

    ReplyDelete


  8. వాలంటీర్లిక నిత్తురు
    బాలా ! వెచ్చంబులెల్ల వాకిటలో ! దం
    దాలే రాజ్యము లేలున
    కో లెస్సగ రాష్ట్రమందు గుమ్మా చూడన్ :)


    జిలేబి

    ReplyDelete


  9. మావా! మనువాడుమురా!
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే
    రా! వనితను నే వరుడవు
    నీవు ధ్రువమ్ములు కలువగ నిక్కము సుఖముల్!


    ***

    నీ వాడగు కొండలపై
    కోవెల లో వెలసినట్టి కొంగుపసిడి యా
    శ్రీవారిని చూచుటకై
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చునులే!


    ***

    ఆవల కలడని చెప్పుదు
    రే, వాడు కలడని నమ్ము!; రేయింబవలున్
    కోవెల ముంగట నిలువకు!
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


    ***

    శంకరాభరణము :)


    నీ వార్ధక్యపు పయనము
    లో విదురుల సభ జిలేబులొసగు బతుకులో
    లావాపొంగుల వలె నీ
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


    జిలేబి

    శతకము వ్రాయనా :)


    జిలేబి

    ReplyDelete


  10. గోవిందా కృతిని జిలే
    బీ విభుడే సర్వమమ్మ భీతిల కమ్మా
    జీవితములో సమాశ్రయ
    జీవా కాంక్షలు పరమునుఁ జేకూర్చును, లే!


    జిలేబి

    ReplyDelete
  11. మొన్న 25-06-2019 నాటి Deccan Chronicle (Hyd) దినపత్రికలోని sports pages లో వచ్చిన వార్త ఇది 👇.
    ఒకప్పటి ప్రముఖ టెన్నిస్ ఆటగాడు, తన 17 యేళ్ళ వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్ అయిన చిచ్చరపిడుగు Boris Beckerకు అప్పులు ఎక్కువైపోయాయిట, కొంతైనా ఋుణబాధ నుండి విముక్తి పొందడానికి తన ట్రోఫీలు, మెడల్స్ వగైరా వేలానికి పెడుతున్నాడట.

    ఆదాయ సంబంధిత ఇక్కట్లలోనున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటువంటి ఆలోచనేమన్నా ఉపయోగిస్తుందంటారా ?

    Boris Becker selling his trophies to pay his debts

    ReplyDelete
    Replies

    1. అతని దగ్గిర‌ ట్రోఫీలు గట్రా వున్నాయి‌ కాబట్టి‌ అమ్ముకో గలిగేడు! అసలే ఆదాయ సంబంధిత‌ ఇక్కట్ల రాష్ట్రం‌ అమ్ముకోడానికి యేముంటాయంటారు వికోన గారండీ ? :)



      జిలేబి

      Delete
  12. ఐడియా ఇవ్వాలా? నాకేంటి? అహ నాకేంటని?!

    ReplyDelete


  13. పెప్సీ కోలా స్ప్రయిటుల
    తాప్సీ యధరామృతముగ స్థాపించి భళా
    లిప్సువులుగ మది తొరలిచి
    యీప్సితములఁ దీర్చు వారలే కద చోరుల్ !


    జిలేబి

    ReplyDelete
  14. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది.
    అసలు అప్పులున్నాయి అని ఇరుప్రభుత్వాలు గుర్తిస్తున్నాయా ? ఇద్దరూ జోరుమీద శంఖుస్థాపనలు చేసేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ముళ్ళపూడి వెంకట రమణ గారి "అప్పారావు" హలో ఓ ఫైవుందా అని అడుగుతూ ఎడాపెడా అప్పులు చేస్తుంటాడు కదా. కొత్త అప్పులో కొంత భాగంతో కొన్ని ఇతర పాత అప్పులు కూడా తీరుస్తున్నాడు "తన సొమ్మేం పోయిందని" .... అంటారు ముళ్ళపూడి తన కథల్లో 😀.

      Delete


  15. ఇవ్వాలా నేనైడియ
    నివ్వాలా ? నా కికన్ మనీ వస్తుందా ?
    రువ్వాలా నే నా పై
    దువ్వాలా మరి జిలేబి‌ దురదయు తీరన్ :)



    జిలేబి

    ReplyDelete


  16. మీకు తెలియని విషయమే
    లోకము లో లేదయా! చలో! నరసన్నా
    దాకలు లూపను మాటా
    ఆ కంప్యూటరు పదముల నాజూకున్నూ :)



    జిలేబి
    బ్రేవ్ :)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ. "పల్లెప్రపంచం" బ్లాగులో నీహారిక గారికి నేనిచ్చిన జవాబును చూడగలరు.

      Delete


  17. వెళ్ళా లక్నో చూసా
    ఫెళ్లుమనెడు నెగడు యెండ విపరీతముగా
    మళ్ళీ చెబుతున్నా నే
    చళ్ళను కాలమ్ము ముందు చంపును మనలన్ !


    జిలేబి

    ReplyDelete


  18. అప్సరసల్ జిలేబులు విహారము చేయుచు ప్రేమ మీరగా
    తాప్సి తమన్న మాళవిక తాగిన డ్రింకని జోరు జోరుగా
    లిప్సువు లై ముదమ్ము జనులీ దినమే కొన గోరు రీతిగా
    యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!


    జిలేబి

    ReplyDelete
  19. ప్రముఖ కథకురాలు శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు (వయసు 85) ఈ రోజు ఉదయం కాలం చేశారుట. కృష్ణా కరకట్ట సందడి, ఇరు ము.మం ల మీటింగు, విజయనిర్మల గారి అంత్యక్రియలు ... ఈ హడావుడిల మధ్య పాపం ఛాయాదేవి గారి మరణవార్త మీడియాలో నామమాత్రంగానే కనిపించింది, అంతకు మించిన కవరేజేమీ లేదు 🙁 .

    కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఛాయాదేవి గారు. వారు వృద్ధాశ్రమంలో (హైదరాబాద్ లో కొండాపూర్-హఫీజ్ పేటల దగ్గరున్న చండ్ర రాజేశ్వరరావు వృద్దాశ్రమం) గడిపారని / గతించారని విని ఆశ్చర్యం వేసింది. వారి ఆత్మకు సద్గతులు కలుగు గాక.

    ReplyDelete
    Replies
    1. ఇవాళ ఆమె లేరు. అలాగని విచారంగా కూచుంటే ఆమెకిష్టం ఉండదు. ఏదో ఒక పనిలో నిమగ్నమై పోవాలి. మరణాన్ని జీవితమంత సహజంగా నిర్లిప్తంగా తీసుకోవాలని అంటారు. వరదరాజేశ్వరరావు గారు మరణించినపుడు ఆమె ఎంత హుందాగా ఆ విషయాన్ని స్వీకరించారో దానినుంచి నేర్చుకోవాలి. Death is part of life కదా అనేవారు. అది Celebration of life కూడా అనేవారు. ఇవాళ మనం ఛాయాదేవిగారి జీవితాన్ని, సాహిత్యాన్ని, సంబరంగా తలచుకోవాలి. ఇలాంటి ఒక మనిషి మనందరి మధ్యా జీవించి చిరకాలం జీవించే తన సాహిత్య సృజన ద్వారా భవిష్యత్ తరాల ప్రేమను పొందగలరనే ఆశను పెంచుకోవాలి. అది అత్యాశ కానే కాదు. 'సుఖాంతం'.

      Volga.

      Delete
    2. Volga గారు సముచితమైన నివాళి ఘటించారు. ముగింపు మాటగా వాడిన “సుఖాంతం” అన్న పదం ఛాయాదేవి గారి ఒక కథ పేరులో భాగం.

      ఈ చక్కటి నివాళి ఎక్కడ ప్రచురితమైంది నీహారిక గారూ ?

      Delete
    3. విన్నకోటవారూ, మీ కమెంట్ ఇపుడే చూసాను. మీరడిగిన లింక్..
      https://www.google.com/amp/s/www.bbc.com/telugu/amp/india-48802980

      Delete
    4. థాంక్యూ నీహారిక గారూ.
      వ్యాసం పూర్తిపాఠం చదివాను మీరిచ్చిన లింక్ లో. "ఓల్గా" గారు చాలా బాగా వ్రాశారు 🙏.

      Delete
  20. >>>కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఛాయాదేవి గారు. వారు వృద్ధాశ్రమంలో (హైదరాబాద్ లో కొండాపూర్-హఫీజ్ పేటల దగ్గరున్న చండ్ర రాజేశ్వరరావు వృద్దాశ్రమం) గడిపారని / గతించారని విని ఆశ్చర్యం వేసింది. వారి ఆత్మకు సద్గతులు కలుగు గాక.>>

    ఆశ్చర్యం దేనికండీ ? వంట చేయడం, గట్లుతుడవడం, ఇల్లుసర్దుకోవడం లాంటి పనులు ఎగ్గొట్టేయవచ్చు కదా అని నేను కూడా జంప్ అయిపోదామని చూస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. అ .. ప్పు .. డే 🤔?
      అబ్బూరి ఛాయాదేవి గారి వయసు 85. మీ వయసేమో ఆ నెంబరును తిరగేసినంత కూడా ఉండకపోవచ్చు .... ఇది నా ఊహాగానం మాత్రమే సుమండీ (ఆడవారి వయసు అడగకూడదు కదా, అందుకని ఊహించడం అన్నమాట).

      నేను వృద్ధాశ్రమం అన్నాను. అంత కానీ మీలాంటి energetic వారి గురించి కాదు (“energy levels” అనాలేమో కదా ఈ నాటి టీవీ షోల పరిభాషలో 🙂?). కాబట్టి హపీగా ఉండండి 👍.

      Delete
    2. మా క్వీన్ సులోచనారాణిగారు ఓ మాట చెప్పారు.20 సం ల తర్వాత మనం ఎలా బ్రతకాలో ముందుగానే ప్లాన్ వేసుకుని ఆ ప్రకారంగా సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. 60 సం వచ్చే వరకూ ఎవరూ వృద్ధాశ్రమంలో చేర్చుకోరు కనుక ఆగామన్నమాట !

      Delete
    3. ఓహో, ఇక్కడ కూడా సీనియర్ సిటిజన్ వయసు నిబంధన అన్నమాట?

      సులోచనా రాణి గారి సలహా తప్పక ఆచరణీయమే. అయితే సకాలంలో బాధ్యతలు పూర్తి చెయ్యడం కూడా సిద్ధంగా ఉండే ప్రయత్నంలో భాగమే 🙂.

      Delete

  21. సిరివెన్నెల వారి పై అద్భుత వ్యాసం


    http://vanalakshmi.blogspot.com/2017/07/blog-post.html


    జిలేబి

    ReplyDelete


  22. మోసగాండ్రకె లభియించుఁ బుణ్యఫలము!
    ఆశ దోసె అప్పడము వడా జిలేబి!
    కుదర దే బామ్మ యిట్లాంటి కుంటి సాకు
    నీతియు నిజాయితి వలయు నిక్కమమ్మ !


    జిలేబి

    ReplyDelete


  23. నీ సుఖ సౌఖ్యముల్ బతుకు నీదకొ? ఈశుని తోడు లేనిదే
    యీ సువిశాల జీవితమ దెట్లు విలాసము గాంచు ? పల్కకే
    మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్,
    కాసులు దస్కముల్ సఖియ కాటికి దానిని‌దాటి వచ్చునా ?


    జిలేబి

    ReplyDelete


  24. ఆకాశవాణి వారికి పంపినది


    దాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్
    మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
    వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదా
    కాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్



    జిలేబి

    ReplyDelete


  25. వేరైనా రాష్ట్రమ్ములు
    ప్రేరేపణ తెలుగుతల్లి వేదన జగనూ
    పోరాడ తొలగు, రా, గో
    దారీ కృష్ణలను కలుప దారిద్ర్యమికన్


    జిలేబి

    ReplyDelete


  26. విలువల శిఖరము మనకై
    తలవంచక మన తలపులు తరముగ నా యం
    చలమును తాకన్ శక్తిని
    సులభమ్ముగ నిమ్మటుంచు సుమతీ వేడన్ !


    జిలేబి

    ReplyDelete


  27. శ్రీమతి మరణము జోకా
    యే మన బ్లాగుల రమణుల వేవే వో వ్రా
    సేమను కొనుచు సెబాసని
    తాము భుజముల చరచుకొని తరియించిరిగా !


    జిలేబి

    ReplyDelete


  28. మోడీ ట్రంపూ ఆబే !
    బాడీ లాంగ్వేజి చూడ భళి మారునకో
    తేడాలు కేల్క్యు లేషను
    లూ? డామేజీ జిలేబి‌ లుప్తంబగునో ?


    జిలేబి

    ReplyDelete


  29. భారతదేశ మమెరికా
    చేరాలొకటిగ వ్యవస్థ సెహభేషనగా
    మారాలోయ్ సంబంధము
    లే రాధనమివ్వగ జనులే మేలుగనన్


    జిలేబి

    ReplyDelete


  30. కలిపెన్ పుత్లీతో భళి
    కలిపెన్ జిన్ పాంగు తోడు కరముల మోడీ
    నిలిచె నడుమ వారధిగా
    కలుగునకో కొంత మేలు కంద జిలేబీ ?

    జిలేబి

    ReplyDelete


  31. వెనుక జయశంకరుడచట
    తనహర్నిశములు పునాది తరముగ వేయన్
    మునుముందర మోడీ తను
    వును శక్తిని చేర్చగా మవురి మ్రోగె గదా!


    జిలేబి

    ReplyDelete


  32. జీ ట్వంటీలో ఢంకా
    ఆ ట్విట్టరులో జిలేబు లాడెన్ మోడీ
    తా ట్వీటింగుల తోడై
    భట్వాడాయగున మనకు ఫలితమ్ములికన్ ?


    జిలేబి

    ReplyDelete
  33. 97 లో చదవడానికి ఎట్లా మిస్సైయ్యా?
    What is the meaning of this comment ?

    ReplyDelete
  34. ఆండాళ్ళూ...ఈవిడ గిద్యాలే కాదు గద్యాలు కూడా అర్ధం కావడం లేదు.నీకేమయినా అర్ధం అయిందా ?

    బ్రోచేవారెవరురా....ట..ట..ట...

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు,
      "ముఖ్యంగా మీలాంటి ఛాందసులు" వారి లాంటి "మేధావులు చేసే ప్రయోగాలు తప్పక" చదివి తీరాలి 😀😀.
      "బ్రోచేవారెవరురా" 😀.

      Delete
    2. 97 లో చదవడానికి ఎట్లా మిస్సైయ్యా?
      🦁 మీరన్నా అర్ధం చెప్పండి.

      Delete
    3. మీరూ నేనూ ఒకే పడవలో ఉన్నామండీ 🙁.
      🦁

      Delete


  35. ఈవిడ గిద్యము లర్థ‌ము
    కావు! భళా గద్యములును కావర్థంబౌ !
    యీ విద్యనెట్లు నేర్చెక
    దా వనితామణి జిలేబి దాష్టీకముగా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పద్యరచనలోకి దూకక ముందు మీ గద్యం బాగానే అర్థమయ్యేది "జిలేబి" గారూ 🙄🙂.

      Delete


  36. ఓరిమి లేదు మీదు మనమొక్కర మే సరి యంచు మాటలున్
    పోరుల సేసి లోక సభ పోకడ నిల్పి హితమ్ము చేర్చకన్
    పేరుకు నేత లయ్యిరి ! గుభిల్లను మోసము తోడు చేరగా
    జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్!


    జిలేబి

    ReplyDelete


  37. యోనో! మా స్టేట్బ్యాంకూ!
    ఆనాడూ క్రిక్కిరిసిరి గా జనులు! భళా
    యీనాడూ నీకై క్యూ !
    యేనాడైనను జిలేబి‌వి‌ భళా నీవే :)


    జిలేబి

    ReplyDelete


  38. ఈ గిద్యమ్ములిచట రా
    నా గద్యములర్థమింక కాలె! జిలేబీ
    మా గడుసు బామ్మ గన్ మా
    రే! గాచారంబిదియె సరే యేం చేద్దాం :)


    జిలేబి

    ReplyDelete


  39. భగవద్గీతయు బైబిలు
    భగినీ గురు గ్రంథసాహెబదియె కురానూ
    బిగి జెందవస్త భళి న
    మ్మిగ శ్రీ విద్యా రహస్య మిదిగో రండీ‌!

    జిలేబి

    ReplyDelete
  40. టోరా Torah (యూదుల పవిత్ర గ్రంథం) వదిలేశారేం?

    ReplyDelete
    Replies

    1. లిస్టులో లేదాయె :)


      జిలేబి

      Delete
    2. ఏమా "లిస్టు", ఎవరిచ్చినదా "లిస్టు"?
      ఏ సందర్భంగా మీ పద్యాన్ని వ్రాశారో ఆ రిఫరెన్స్ ఇక్కడ వెల్లడించకపోతే .... ఇదిగో ఇలాగే ఉంటుంది.

      Delete
    3. http://www.teluguyogi.net/2019/06/blog-post.html?m=1

      Delete
    4. తెలిసింది. థాంక్యూ నీహారిక గారు.


      Delete


    5. ధమ్మపదంబిదియె జిలే
      బమ్మా! టోరా కురాను భగవద్గీతై
      నిమ్మళముగ బైబిలుగా
      సమ్మత మైన గురు గ్రంథ సాహిబ్బిదియే!


      జిలేబి

      Delete


    6. ధమ్మపదము గీతా సా
      రమ్ము! కురాన్ జెందవస్త రా! బైబిలిదే
      నమ్ము! గురు గ్రంథ సాహిబు
      సమ్మత టోరాయిదియె యశస్ శ్రీవిద్యౌ!


      జిలేబి

      Delete


  41. అనుమానమేల కవిరాట్
    చనిరా మద్రాసునగర చట్టసభలకే
    పని లేని పిల్ల గాండ్రే
    సినిమాలను జూచువాఁడు శ్రీమంతుఁ డగున్


    జిలేబి

    ReplyDelete
  42. నీహారిక గారు,
    'మాంటెస్సొరి" కోటేశ్వరమ్మ గారు ఈరోజు కాలం చేశారని వార్త👇. ఆనాటి విజయవాడ విద్యారంగంలో ప్రముఖురాలు. మీరు కూడా ఆవిడ మాంటెస్సోరీ స్కూల్లో చదివారా?

    మాంటెస్సొరి కోటేశ్వరమ్మ గారు

    ReplyDelete
    Replies
    1. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చదివాను.మాంటిస్సోరి కాలేజ్ లో మా అక్క చదివింది. ఒక్కొక్కరూ ఇలా వరుసగా పరిగెడుతున్నారేవిటీ ? పైన కబుర్లు చెప్పుకుంటారు కాబోలు...

      Delete
    2. ఎంతకాలమైనా జీవించవచ్చనుకోండి. ఆవిడ వయ‌సు 94. దాదాపు పూర్ణాయుష్షు. సమాజానికి తన వంతు సేవ చేశారు🙏.
      పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్నాడుగా సినిమాకవి గారు.

      Delete


  43. పరుగిడు తున్నా రేమిటి
    పరలోకానికి వరుసగ పసకల్గు కబు
    ర్ల రహస్యముగ జిలేబీ
    లరయగ చేతురచటనొకొ లబ్జుగ వరలన్ !


    జిలేబి

    ReplyDelete


  44. ఎవరెంతకాలమైనను
    జవరాలా బతుకవచ్చు జగతిని పూర్ణా
    యువుగా తొంభై పైబడి
    యు వరలిరి సమాజము‌న ప్రయుక్తంబుగనే!


    జిలేబి

    ReplyDelete


  45. కోపము చెందెను చంద్రుడు
    తా పరుగున వచ్చి చెప్పె తపనుడ! జగనుం
    డా! పాటించుము ధర్మము
    నా పరిపాలనని తప్పనకు! సరి సరియే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చంద్రుఁడు కోపమున సూర్యుని మ్రింగినాఁడు...

      Delete


  46. రంగుల జెర్సీ కొత్తగ
    భంగిమ ల సయితము క్రికెటు బ్యాటును చేరన్
    చెంగున దూకిరి భారత
    రంగీలా వీరులు భళిరా భళి భళిరా!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మనవాళ్ళా, పొరుగు దేశపు ఆటగాళ్ళా అనిపించేటట్లు దాదాపు అందరి మొహాల మీద (ధోనీ మినహా) ఫ్యాషన్ పేరిట ఇంతింత గడ్డాలు (Wodehouse గారి భాషలో face-fungus), కురుపులు వేసి తగ్గిన తరువాత మిగిలిపోయిన మచ్చలా అనిపించేటట్లు ముంజేతి నుండి భుజాల వరకు వికారపు టాటూలు, మైదానం మీద అదే uncouth behaviour ... జెర్సీ రంగులో ఏముంది? కాబట్టి ఏ రంగు జెర్సీ తొడిగినా ఏం తేడా లేదు ... నా దృష్టిలో.

      Delete


  47. ఆ గడ్డాలింతింతగ
    సాగెను టాటూలు చూడ ఛా! మచ్చెలలా
    రోగుల లాకని పించుచు
    తూగెడు వీరా దువాళి? తూచ్!పో పోవే !



    జిలేబి

    ReplyDelete


  48. సంపూర్ణ హృదయ ధ్యానము
    పెంపొందించగ వరలెడు పేర్మిని నీలో
    నింపాదిగ నాధ్యాత్మిక
    సంపద సంసారమందు సాధింప తగున్ !


    జిలేబి

    ReplyDelete


  49. భువిలో పరిణామపు గతి
    జవరాల నిదానమేను ! సాధన వలయున్
    భవుని నతి శీఘ్రముగ పొం
    దవలెననెడి కాంక్ష, సఖి, ప్రధానము తెలియన్!


    జిలేబి

    ReplyDelete


  50. కలడా భవుండు హృదయక
    మలమందున నిక్కమిద్ది మరువకు రమణీ
    యిలలో చేయగ సాధన
    వలయపు జీవితమును విడివడ సాధ్యమగున్


    జిలేబి

    ReplyDelete


  51. కలడను వాడినిక హృదయ
    ములోన గాంచక వెలుపల ముంగట వెతుకన్
    ఫలితము బాహ్యపు గతియే
    ను! లివ్వు గాంచవలె భక్తి నూత్నపు విభమై!


    జిలేబి

    ReplyDelete


  52. ప్రహరించినట్టి దోహరి
    వి! హరుడ! లోకేశ! వామ! విజయేశుడ! యీ
    శ! హిరణ్యకవచ! మా ధవ!
    అహర్నిశలుకొలుతుమయ్య యచ్యుతయనుచున్


    జిలేబి

    ReplyDelete


  53. ఏదయ్యా శివ యచ్యుతా! అచలుడా! యేదయ్య నీరూపమౌ?
    వేదాధ్యాయియె జూచి దోహరిగ నన్వేషించె నద్వైతమున్
    కాదా శంకరుడేను మా ధవ! కృపన్ ఖట్వాంగి లోకేశ! వా
    మా! దాంతమ్మును చేర్చుమయ్య విధుడా! మల్లారి!భృంగీశుడా!


    జిలేబి

    ReplyDelete


  54. హరిభక్తుడెవడయా దో
    హరియెవడయ్య? నిజమైన హాంత్రంబెద్దీ
    సరిసరి తెలియగ మనుజుల్ ;
    విరిసిన పువ్వు పరిమళము విభునిది కాదా ?


    జిలేబి

    ReplyDelete


  55. పట్రమ్మా కలమును భళి
    తొట్రేమియు పడక వ్రాయి ద్రువయములో నా
    చట్రములో పట్టని కత!
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్!


    జిలేబి

    ReplyDelete


  56. మేలగు నా కుక్కయె సూ
    జాలియు లేనట్టి కొమరు జంబము కన్నా
    వేళకు విశ్వాసముతో
    మా లావుగకాచునద్ది మహిని జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  57. ఇది తెల్ల యేనుగయ్యెడు
    సొద కనబడు చుండెనోయి! సోకులు మాడ్రన్
    కద తప్పకుండ యగు చె
    ప్పెద నే భవితను, జిలేబి పెట్టితిని సవాల్!


    జిలేబి

    ReplyDelete


  58. ప్రేమయె పెన్నిధి నరుడా
    నీమము తప్పక నడువ వినీలపు ఛాయల్
    నీమదిని తాకవిక నీ
    కా మాధవుడే యొడుపగు కష్టేఫలిగా!


    జిలేబి

    ReplyDelete


  59. అర్వాచీనపు వ్రాతల
    నిర్వాకపరచు మతపర నిర్దుష్ట జనుల్
    సర్వము తప్పందురుగా!
    చార్వాకుం డాస్తికుండు సద్భక్తుఁడె పో!


    జిలేబి

    ReplyDelete


  60. आज तक नया भगवान नही बनाया है ! इस्को भगवान बना येंगे ! ఓహ్ మై గాడ్ OMG హిందీ చిత్రం :)


    జిలేబి



    అర్వాచీనము లెల్ల తప్పనుచు పన్నాగంబులన్ పన్ని యా
    నిర్వాకమ్మును చేయు ఛాందస ‌బుధుల్ నెవ్వారినైనా తృటిన్
    దర్వీమార్చుచు భక్తుడంచు భువిలో దైవంబుగాకొల్తురే
    చార్వాకుండను మౌని యాస్తికుఁడుగా సద్భక్తుఁడై యొప్పెఁ బో!

    జిలేబి

    ReplyDelete


  61. ముదితలు ముంగట కూర్చు
    న్న దరసలిక వేదిక పయి నాకిక పనిలే
    సదనము వీడిరి గురువులు
    యిది నా మర్యాద యంచు యేమాయెన్ బో :)


    జిలేబి

    ReplyDelete


  62. చండీ యాగంబాయెను
    గండమ్ములు గడిచి రాష్ట్ర కార్యములున్ మా
    భాండాగారము నిండును
    దండిగ చూడండి మా ప్రతాపమ్ములికన్ !


    జిలేబి

    ReplyDelete


  63. దాపరికము లేదాయె స
    దా పరమానందమున్ ప్రధానిగ బొందెన్
    తా పరుగిడె నను దినమున్
    కాపరి యన్నను జిలేబిగా తీసుకొనెన్ !


    జిలేబి

    ReplyDelete


  64. అమెజాను :) ఆమె జాన్ :)


    బిలియను డాలర్ల విడా
    కులటా అరరే జిలేబి కొంచెము యత్నిం
    చి లిఖించు కొనుము నీవున్
    భళి అయ్యరుతో విడాకు బాపురె యనగా :)


    జిలేబి

    ReplyDelete


  65. ఓ యబ్బో మా మైనింగు క్వారీ కింగుల మహిమ :)


    ఎట్టెట్టా ? అబ్బోడా!
    చుట్టా లింటికని దారి చూపింప భళా
    చట్టపు చేతిని చిక్కక
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్?


    జిలేబి

    ReplyDelete


  66. కట్టిన యిళ్ళల్లోనూ
    యెట్టేవంటన్న బొక్క యెంతో యెంతో
    పట్టేసేడయ్య దొరా
    గుట్టిక రట్టే యవుతది గువ్వల చెన్నా :)


    జిలేబి

    ReplyDelete


  67. ఏటి కావల బోడికొండ యెక్కాలంటే ఏట్లో దిగక తప్పదోయ్ :)

    చట్టని చూడగ నదిగో
    గుట్టలు! మున్నీటిలోన గునగున నడచెన్
    పట్టమ్మాళు జిలేబియె
    తట్టా బుట్టా నిడుకొని తక్షణమెక్కన్ !

    జిలేబి

    ReplyDelete


  68. భుగభుగ మండుచుండె నట భూర్ణియు లేదకటా! స్థిరమ్ముగా
    జగతియు లేదు! పూర్ణమున సందడి కల్గెను! కాంక్షకల్గగా
    జగముల చేయ నాదికవి శాసన మాయె! విమాన మెక్కి యా
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్!


    జిలేబి

    ReplyDelete


  69. అవకాశమొచ్చి నన్ చా
    లు వరుస టాక్స్ల నెగవేత క్లూ కూడా లే
    క వడివడి వేయు నేతల
    కవాతు తెలిసిన జనులు సుఖము నొదిలెదరా :)

    జిలేబి

    ReplyDelete


  70. తొక్కను తీయంగనదే
    లక్కా మామిడి నటులె ఫలమునివ్వ తినం
    గక్కా మేలగు నక్కా
    చక్కంగా సూర్య రశ్మి సరసంబక్కా :)


    జిలేబి

    ReplyDelete


  71. పదపోడిమి దుష్కర ప్రా
    స! దయవలయు నమ్మ తెలుగు చక్కగ బతుకన్
    సదనమున జిలేబుల సరి
    వదులక వేయు జవరాల వందన మిదియే!


    జిలేబి

    ReplyDelete


  72. సమపాళ్ళలోవినోదం
    బమరి విషాదమ్ము కూడ ప్రతిబింబించెన్
    సమతకు పేరగు పద్మా
    సమదర్శిని వీవె సూవె చంపకమాలా !


    జిలేబి

    ReplyDelete


  73. మామిడి కాయల గీరన్
    సామీ పీలర్లకో ! కసబిసయిదె గదా
    సోమర్లై తోలొలువక
    మేము తినము సూర్య దేవ మేధాజీవీ !


    జిలేబి

    ReplyDelete


  74. విటమిన్లరరె జిలేబీ
    దిటవుగ నీమధ్య వెలసె ధీమత గా సూ
    వె టముకుల రాణి ! వాస్తువ
    కటా నరయగాను పాత కాలపు కిచిడీ !


    జిలేబి

    ReplyDelete


  75. విరచితులన్న పదమ్మరె
    నరయగ లే విరచితములన సరియగు నయా
    అరకొర జిలేబి తెలివిడి
    గిరగిర చుట్టు సదనమ్ము గెస తెలియనిదా :)


    జిలేబి

    ReplyDelete


  76. మనిషా ! పశువా !దెయ్యం
    బనుకోనా ! యెవరితడు? గభాల్మని‌ కబళిం
    పను వచ్చినాడ రాష్ట్రము
    లను? చదవండి యిపుడే ఫలము దక్కు సుమా !


    జిలేబి

    ReplyDelete


  77. ఏమీ చేయించకనే
    మామా మురిపించినావు మగువను మగధీ
    రా! మా పద్మార్పితనే
    నే మార్చితి వయ్యరొ మది నెమ్మది వీడన్ :)


    జిలేబి

    ReplyDelete


  78. పుస్తక ముల్ పునాదియగు భూర్ణి ద్రవింపగ వెన్నముద్దలా
    మస్తుగ చేతి కందు నిక మస్తక మయ్యది వృద్ధి నొందగా
    హస్తము వ్రాయ మేలగు ప్రహాదపు రేకల జాగృతమ్మగున్
    వస్తము దేశమున్ సఖియ వాగఱ గైకొను పాముకోఱవే


    జిలేబి

    ReplyDelete


  79. సారంబొప్ప మధురమగు
    పూరణఁ జేయంగ వాణి! బొమ్మల తరమే
    మీ రసగుల్లా మయముగ
    భారతి దయవల్ల యౌను పడతులకున్ పో!


    జిలేబి

    ReplyDelete


  80. చేరక కంది శంకరుల శ్రేష్టతరమ్మగు కైపదమ్ములన్
    ప్రేరణ తోడుగా మడత పెట్టు సమస్యల చూడగానటన్
    కోరిక యున్న నేమయ వికోనయు వైవియు భీతినొందిరే
    "పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?"


    జిలేబి

    ReplyDelete


  81. సారూ! కందివరార్యా
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
    మీరీరీతి యనుదినం
    బేరాలము కైపదముల వేయగ సభలోన్ !


    జిలేబి

    ReplyDelete


  82. సోరణి దివ్వె వెల్గులు రజోరసమున్ భళి పార ద్రోలగా
    ధారణ తోడు యత్నమిక తత్వము బుద్ధిని చేర్చుకొంచునా
    పూరణఁ జేయఁగాఁ, బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
    ప్రేరణ గూర్చి దీవనల భేషుగ నీకొసగన్ జిలేబియా !


    జిలేబి

    ReplyDelete


  83. ప్రేరణ గూడి పద్యముల భేషుగ వ్రాయన కోరగా జిలే
    బీ, రస రమ్య మాధురి సువిస్తృత మయ్యెడు‌రీతి దక్కునే
    బూరె జిలేబి గారెలని బువ్వల నివ్వ మటంచు కోరగా
    బూరణ సేయగా బలుకుబోడికి, బ్రహ్మకునైన సాధ్యమే?

    ReplyDelete


  84. తెలివై నోడండీ మా
    వ! లిప్పు లిప్పుకి నడుమ కువకువయనంగన్
    సలలితముగ మాటల మూ
    టలతో కనుగప్పినాడు టవలి తెలియకన్


    జిలేబి

    ReplyDelete


  85. వ్రాసిరి యా శ్రీ హరియే
    రాసిగ తోడ్పడ పదముల రాశుల తో వా
    రాశిగ శతకము నొక్కటి
    వాసిగ సిగకొప్పునమర ప్రజ-పద్యమునన్


    సెబాసో

    శుభాకాంక్షలతో

    జిలేబి

    ReplyDelete


  86. సమతుల్యత చెడి నేడా
    యె మన పుడమి కలుషితమ్ము ! యెన్నో‌ ప్రాణుల్
    తమ యుసురుల బాసెనిచట
    తమకపడు మనుజుల మూర్ఖతయె కారణమై


    జిలేబి

    ReplyDelete


  87. అన్నార్తులకిక చేసెద
    నన్నా సేవయు విడువక నమ్మిక గా నే
    నున్నా మీకై యనుచున్
    మిన్నగ నావల్లయిన కమికిలి మెతుకులన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఉన్నాడు లెస్స వెంకయ ,
      ఉన్నాడిదె కొలువుదీరి యొద్దిక నెదలో ,
      అన్నీ తానై జూచును ,
      అన్నము బెట్టంగ కొదువయా ? మన కింకన్ .

      Delete


    2. ఉన్నాడా వెంకయ్యా
      ఉన్నాడనుకున్న వారి కున్నాడు సుమా
      సన్నద్ధునిగా నిల్పును
      కన్నుల నిన్నిడుకొనున్ సకలముగ నెపుడున్


      జిలేబి

      Delete


  88. ఓరీ! పార్షియలుగ నో
    రోరీ కామింట్ల ద్రోసి రోసెదవక్కో ?
    సారీ! ఇమ్మీడియెటుగ
    నా రిక్తపు వ్యాఖ్య కూడ నాకై తీయన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారి బ్లాగ్ "మాలిక"లో కనబడదు.

      Delete


    2. మాలికలో కనబడదం
      డీ లెఫ్ట్రైటని సదా ఫెడేల్మను హరిబా
      బాలాపన! మీరై వెత
      కాలె! వదులక చదవాలె కంద జిలేబీ!


      జిలేబి

      Delete


  89. హరి యనెడా సింహము లే
    క రయ్యనెడు కయ్యముల్ వకాలతులున్ లే
    క, రభసలున్ లేక యిదే
    మి రంగ మిది ఉప్పు చప్పు మించారక పో!


    జిలేబి

    ReplyDelete


  90. ఉన్నాడా వెంకయ్యా
    ఉన్నాడనుకున్న వారి కున్నాడు సుమా
    సన్నద్ధునిగా నిల్పును
    కన్నుల నిన్నిడుకొనున్ సకలముగ నెపుడున్


    జిలేబి

    ReplyDelete


  91. నత్తలని బెట్టి రాహా
    మెత్తగ నాహారముగ సమిష్టిగ తినెనా
    చెత్తని పశుపక్ష్యాదులు
    కొత్తయిదేమి? మనుజుల ప్రకోపంబనగా !


    జిలేబి

    ReplyDelete


  92. నిలువెత్తు మేలిమి పసిడి
    చిలకా యనగా జిలేబి ఛీఛీ యంటే
    కొలికీ యెలాగ ! వద్దే
    పలుకుల మాయని జనులను బాదెయ్యకుమా !


    జిలేబి

    ReplyDelete


  93. ఓసీ ! నాతింగరి! ప
    ద్మా! సిత్రాలను కలుపుచు దాష్టీకంబున్
    సేసి మగవాండ్ల రోయుచు
    కోసి విలాసముగ తోసి కొమ్మూదితివే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "పైపైన సంసార బంధముల కట్టేవు
      నా పలుకు చెల్లునా నారాయణా"

      అంటూ అన్నమయ్యంతటి వాడే వాపోతాడు తన "నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప" పాటలో. ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది? 🙁

      నిగమ నిగమాంత వర్ణిత (అన్నమయ్య పాట)

      Delete
    2. మీ వ్యాఖ్య అర్ధం కాలేదు విన్నకోటవారూ ?
      ☝ఆ పాట ఎందుకు ఉదహరించారు ?

      Delete
    3. // "సంసార సాగరంలోకి తోసేసేవు . ఇపుడేదీ దారి?" //
      .... అంటూ రాజారావు మాస్టారు విచారపడుతున్నట్లనిపిస్తేనూ (వేరే బ్లాగ్ లో తన కామెంట్ లో), ఆ సందర్భంగా "జిలేబి" గారు ఇక్కడొక పద్యం కడితేనూ .. అన్నమయ్య గారి ఆ పాటలోని ఆ రెండు చరణాలూ గుర్తొచ్చి ఆ పాట రిఫరెన్స్ ఇచ్చానన్నమాట. ఆ రెండు చరణాలే ఇక్కడ ఎక్కువ apply అవుతాయి కానీ చాలా గొప్ప పాట కదా (నా దృష్టిలో) ఆసక్తి కలవారు మొత్తం పాట విని ఆస్వాదిస్తారులే అని పాట లింక్ కూడా ఇచ్చానన్నమాట.

      ఏమిటో, రిఫరెన్స్ లు ఇవ్వడం నిన్నటి నుండీ అచ్చిరావడం లేదండీ నాకు 😥.

      Delete
    4. బొమ్మలోని మౌని పుఱ్ఱెలో తలపును
      తడివి వ్యాఖ్య నిడిన తడవు జూచి
      మాటు వేసి నన్ను ఘాటుగా మన్నించె
      నాదు తలపు గాగ నరస విభులు .

      కంటే ! తంటాల తబిసి
      కొంటె తనము లొడిసి నరస గోవిందుల కె
      ట్లంటు కొనెను ? నారద ?
      ఘంటములో దూరు లోక కళ్యాణ మిదా ?

      Delete


    5. ఏమో ! యేమౌతాదే
      మో!మాయామోహమాయె! మోమే మోహ
      మ్మై మామని క్రమ్మెనుగా
      రామా కృష్ణా ! డుబుక్కు రమ్మా కావన్ :)


      జిలేబి

      Delete
    6. ఒక మాటే పట్టుకుని కామెంట్ పెట్టేసెయ్యడం లాంటి లక్షణాలు బ్లాగులోక సావాసదోషం, మాస్టారూ.

      Delete


    7. సావాసదోషమండీ
      కోవా జాంగ్రీ జిలేబి కూడిన దాయే !
      ఓ వార్తో వ్యాఖ్యో మన
      కై వచ్చీ రాంగనే టకాల్మని వేయన్ :)


      జిలేబి

      Delete
    8. ఆఁ యేముందిలెండి యిందున ,
      మీయభిమానమ్ము తెలుసు , మిత్రత్వ వచ
      స్శ్రీయుత చతుర వినోదపు
      పాయసమున కిస్మి , కాజు పలుకులు టేస్టే .

      Delete

    9. మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)


      వావ్ ! మరీ జిలేబీయమే యిది :)


      జిలేబి

      Delete


  94. దేవుని కుందా మరణము ?
    నీవతడిని మరిచినట్టి నిమిషంబతడ
    య్యేవల్లకాటి విభునిగ
    చావాయే, చచ్చె సూవె సత్యంబిదియే !


    జిలేబి

    ReplyDelete

  95. ఏ విషయమైనా చెప్పండీ మా గోరేటాయన యెప్పుడో వ్రాసేసేడాటి పయిన :)


    మా గోరేటాయన సా
    మీ! గీ విషయము పయి వినుమీ చెప్పిండూ
    పాగలు మడుసులు సేసిం
    డ్రీ గోలల! మతలబు గనుడీ శర్మాజీ :)



    జిలేబి


    ReplyDelete


  96. ఆ పాటెందుకు చెప్పే
    రో? పోస్టు విశేషముల్ మరోమారిక చె
    బ్తే పులకరించెదము ! ఓ
    గోపాలా యేడ చూచి కొట్టేరిచటన్ ? :)


    జిలేబి

    ReplyDelete


  97. మతిలేనోడే బంగా
    రి! తింగరి యని పిలిచెను! మరే పద్మమ్మా
    అతిగా లొల్లి యదేలా !
    పతియే దైవమగు సతికి బాలాడకు మా !:)


    జిలేబి

    ReplyDelete


  98. నిన్నటి నుండీ అబ్బే
    అన్నన్నా అచ్చిరాలె నన్నియు సుమ్మీ
    మున్నొక రోజిట్లే నా
    కన్నియు విపరీతమాయె కలగా నిలిచెన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఏమిటోనండీ, అలా జరిగిపోయింది 🙁.

      Delete


  99. వ్రాయను వరద శతకము వ్యాఖ్యల పిద
    పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె
    పేరు శ్రీశంకరయ్య!నివేద్య మైన
    వార్త యిద్ది ! రా రండి సెబాసనంగ !



    జిలేబి

    ReplyDelete


  100. అయినాడాతడె బెల్టు షాపు యజమానైనాడు! ఆమత్తులో
    సయి తానాడక వ్రాసె వాసి గనెడా సాహిత్యమున్ ధారగా
    పయికమ్మేమియు రాక పోయినను ప్రాప్తంబాయె విద్వత్తు! స
    న్నయ దూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్!



    జిలేబి

    ReplyDelete


  101. వయసే మీరని బెంగా
    లు యువకుడాతండు! భళి తెలుగు పద్యంబే
    నయ! దూరుండగు పారుం
    డయె! కడు సన్మానపాత్రు డయ్యె భళారే :)

    జిలేబి

    ReplyDelete


  102. వీయెన్నార్ గారండీ
    మాయీ యెస్టీని నొక్క మారుగనుడి యీ
    మాయాజాలము మొత్తము
    భాయీ కను ముంగట నిలబడు నొద్దికగా!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎస్టీ ఏమిటి, మాయాజాలం ఏమిటి? ప్చ్ బోధ పడలా 🙁. మీ ఉద్దేశం సేల్స్ టాక్స్ అనా? రిఫరెన్సులండీ, రిఫరెన్సులివ్వాలి.

      మీ పద్యాలు, గద్యాలు అర్థం కావు అని మొన్న నీహారిక గారన్న మాటే గుర్తొచ్చింది.

      Delete
    2. రిఫరెన్స్ లు ఇస్తే నారదులవారు బుక్కయిపోతారు కదండీ...ఆవిడ ఇవ్వరు. మనమే వెతుక్కోవాలి.

      Delete
    3. కరక్టండీ 👍. నారదోపాసకుల తీరే అంతేమో 🙂?

      Delete


  103. చిప్పల హెడ్డింగులతో
    గొప్పగ పెట్టగ టపా సుగుణవంతుండా
    యప్పయు ప్రశ్నల వేసిరి
    చెప్పండీ లింకులెట్లు చెప్పండనుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  104. దేశము లోనే వున్నా
    రా?శంకో శంక! ఔర! రాత్రింబవలున్
    ప్రాసారంబౌ ఐపీ
    ప్రాసెస్సుల వెతికి నార పట్టిక చూడన్ :)


    జిలేబి

    ReplyDelete


  105. బంగారానికి భళిరా
    లొంగు జిలేబులు ముదితలు లొసుగు తెలిసి తా
    చెంగున దూకి నెలతుకుల
    కొంగున ముడి రోసి త్రిప్పు కూచి మగోడోయ్ !


    జిలేబి

    ReplyDelete


  106. రసవత్తర ప్రణయములో
    పసిడికి పనిలేదటంచు పంతులు వద్దం
    చు సొబగును జిలేబీ పొగి
    డె! సిగ్గు దొంతరలలో పడేవు కద సఖీ !


    జిలేబి

    ReplyDelete


  107. అయిపోయిండు ము మం గా
    నయగారమ్ముల పెరిగిన నాయకు డయ్యే
    పయనానికి పరి పాలన
    కు, యుక్తి శక్తికలదా ? మకుటమవ గలడో ?


    నే చెప్లే :)

    జిలేబి

    ReplyDelete


  108. పన్నెండు మేళ్లివియె! రై
    తన్నల కెల్ల జగనన్న తన తండ్రిని, రా
    జన్నను తలిచి భరోసా !
    కన్నారా యెప్పుడైన కారుణ్యమిలన్‌!


    జిలేబి

    ReplyDelete


  109. కలయా ! నిజమా ! జై గా
    రిలాగు రాహులుడి సైడు రివ్వున దాటెన్ !
    మిలమిల లాడునకో రా
    హులుడిక దేశంబులోన హుర్రే హుర్రే :)


    జిలేబి

    ReplyDelete


  110. చేసాడిన్ని జగనుడే
    నౌ! సారూ విన్నకోట నరసింహా రా
    యా సారీ అవగాహన
    వీసెంబెత్తెడును లేక వీలగునంటా ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సెహబాసు సెహబాసు 👏.
      "అధికారంలోకి వచ్చి" పూర్తిగా "నెలైనా తిరగక ముందే" ఇన్ని ప్రజాహిత పనులు చేసాడని "గర్వంగా" చెప్పడానికి గర్వించాల్సిన మాటే ☝️.

      Delete


    2. సెహబాసు! జిలేబీయం
      బహొ! అధికారంబు వచ్చి వరుసగ వారం
      బిహ నాల్గైనను కాలె! జ
      నహితప నులుచేసిరి జగనన్నకు జై జై !


      జిలేబి

      Delete


  111. అనుభవ మది లేకున్నను
    మన రాజన్న తనయుండు మాంఛిగ యవగా
    హన చూపేడు నరసరా
    య! నమ్మకము వలయునయ్య యద్భుత మిదియే


    జిలేబి

    ReplyDelete


  112. వారాని కొక రకముగా
    పేరాల కొలదిగ పద్మ ఫెళఫెళ వాయి
    స్తా రండి మీరు ! తప్పక
    మేరు సమానముగ నెదిగి మించారెదరూ !

    జిలేబి

    ReplyDelete



  113. ఆ యాగపు వేళన తా
    నై యిచ్చిన యాన నూరనగ తప్పులు తా
    చేయగ శిశుపాలుడి నా
    వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!


    జిలేబి

    ReplyDelete


  114. ఆయాసమ్మున రొప్పుచున్ హరిహరీ! రావయ్య కాపాడ! నీ
    వే యావత్తగు నాకు కావు మయ ! నిర్వీర్యంబుతో బిల్వగా
    మాయన్ వీడిన గబ్బుచెంకమెకమున్ మన్నించి కావంగ నా
    వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్


    జిలేబి

    ReplyDelete


  115. అహమును భోంచేయుటయా !
    సెహబాసొక ముక్క కూడ చేజిక్కలె పో!
    కుహుకుహు పద్మార్పిత ! ప్రీ
    తి హాయి హాయిగ మదిమది దిగలే సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  116. పరమాత్మా! నను కావుమయ్య నిలలో ప్రారబ్ధ కర్మానుసా
    ర రసాభాసపు మాయ లోమునిగి నే రాత్రింబవళ్ళున్ ప్రభో
    చెరసాలన్ పడి నానయా! బతుకులో చీకాకులన్చేర్చెనా
    యరిషడ్వర్గము; ముక్తిగొల్పునిలనాత్మానందమున్ గూర్చుతన్!


    జిలేబి

    ReplyDelete


  117. ఈ భువి లో నేది సరి జి
    లేబి? విభుని చేర గావలెన్ తుద కెవరై
    నా! భవితకు మార్గమ్మది
    యే! బతుకిక సాగని విభుడే దిక్కనుచున్!


    జిలేబి

    ReplyDelete


  118. చోద్యము! రాజశేఖరుని‌ చొక్కపు టౌరసుడా!యిదేమయా
    మద్యము త్రాగి మూలని ఢమాలని కూలుచు తొంగు మావలే
    మద్యము లేక తొంగుటకు మార్పును చెందక బాదు చుండగా
    మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!


    జిలేబి

    ReplyDelete


  119. అన్నింటా నేనుంటా
    అన్నను తమ్ముణ్ణి మీకు! అమ్మల్లారా
    పిన్నల్లారా! పిల్లో
    ణ్ణన్నా! అభివృద్ధి గాన నాణ్యత పెరుగున్ !


    జిలేబి

    ReplyDelete


  120. అన్నింటా నేనుంటా
    వెన్నంటి రయితులకు తమ వేదన తీరన్
    కన్నకొడుకు గానుంటా
    మున్నెన్నడు చూడనట్టి ముయ్యల తోడన్ !


    జిలేబి

    ReplyDelete


  121. చేతి కిచ్చి పోయె చెంగల్వ మని పిల్ల
    కాయ నొకడిని మరి కాన రాలె !
    చేటు చేసి నాడు చెంగట తొంగొని
    మాట తీపి కాలకూట మెడఁద!


    జిలేబి

    ReplyDelete


  122. బుచ్చి! పదా! జిలేబులివె! బూరెలు సారెలు చూడవే ప్రియా!
    అచ్చికబుచ్చికమ్మని సయాటల దేల్చె విలాస వంతుడా
    ముచ్చిక చేతికిచ్చి కను ముందర మాయమయేను! మత్తుగా
    మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే!


    జిలేబి

    ReplyDelete


  123. అడుగుననే ఉండని ! త
    మ్ముడు! తవికలతో జిలేబి, మురుకులతో జి
    మ్మడ! మా తలల తినిరిగా
    చెడుగుడు లాడు పదముల కచేరీలాయెన్ :)


    జిలేబి

    ReplyDelete


  124. అడుగుననే ఉండని ! త
    మ్ముడు! తవికలతో జిలేబి, మురుకులతో జి
    మ్మడ! సంపక తింటున్నా
    రడుగడునా శంకరాభరణమని విదురుల్!


    నారదా!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మెంటల్ పట్టివ వాడే
      ఘంటము పట్టేను , మంచి కవి చెడుకవి యం
      చుంట విపరీతము , చదివి
      తంటా పడుటేల ? పిచ్చి తల కంటు కొనన్ .

      Delete

    2. మెంటలు తంటా :)



      జిలేబి

      Delete


  125. అరె!విన్నకోట రవిశం
    కరులట! మన బ్లాగులోన కామింట్లాడే
    నరసన్న వారి తాలూ
    కు రావులకొ? బుచికి కూడ కొంటెగ రాసెన్ ?


    జిలేబి

    ReplyDelete
  126. బుచికి కొంటెగా వ్రాసాడా ? జిమ్మడ !
    రవిశంకర్ గారి కవిత బాగుంది కదా ?

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ నీహారిక గారూ, "జిలేబి" గారూ.
      చి. విన్నకోట రవిశంకర్ కాస్తో కూస్తో పేరు గాంచిన కవే. ప్రవాస తెలుగు కవులలో ఎన్నదగినవాడే. వివిధ తెలుగు సాహితీసమావేశాలకు ఆహ్వానితుడుగా వెడుతుంటాడు. ఇస్మాయిల్ అవార్డ్ గ్రహీత. అతని కవితలను మెచ్చుకునేవారే అధికం. అయితే ఆ Anonymous గారికి మాత్రం నచ్చినట్లు లేదు, అంతే. వేయేల, లోకోభిన్నరుచిః కదా.

      Delete


  127. కరకట్టమీది భవనము
    లరరే యక్రమములవి! భళా కొట్టంగన్
    పరిణామంబొచ్చు సుమా
    పరిస్థితులు మారు సూవె బాగు జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  128. తవికా ప్రక్రియ కొత్తది
    కవనముగ జిలేబి పైకు కందంబాయెన్
    పవలున్ రేయియు తిరుగును
    జవగట్టి సదనములో గజ గజయన జనుల్


    జిలేబి

    ReplyDelete


  129. కవులు జిలేబులు మాకే
    మవసరమూ? ప్లంబరులు సుమావల యున్ మా
    కు! విదురులార సమాజం
    బువర్ధిలును! బ్రదరు లార! బుద్ధిని గొనుడీ :)


    జిలేబి

    ReplyDelete


  130. సంపక తింటున్నారే
    గంపల కొలదిగ పదముల కట్టుచు పద్యాల్
    కొంపలు కూలే రీతిని
    దుంపతెగా రాసిరిగద దుష్టు జిలేబీల్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆల్ ది బెష్టు భ్రష్టు భడవాయ్ 👌👌👌👌👌

      Delete
    2. పరశురాముడికి క్షత్రియద్వేషం లాగా వీరికి కవితలంటే ద్వేషమేమో, పోనిద్దురూ.

      Delete


    3. ఆ పరశురాముడి వలెన్
      కోపము చెందెనకొ బుచికి ? కోరల చూపెన్
      శాపము పెట్టుచు తిరిగెను
      పాపము తవికల లిఖించు వారల చూడన్ :)



      నారదా!

      జిలేబి

      Delete


  131. అదిరె బనానా కతలన
    సదనమ్మున సాఫ్టువేరు సాఫగు రీతుల్
    ముదురున మళ్లీ మాంద్యము ?
    కుదురుకొనున మూతపడక ? కొచ్చెను మార్కే !


    జిలేబి

    ReplyDelete


  132. తలలను మాలిషు చేస్తు
    న్న! లెంప లేసుకొని వారె నా వైపొస్తా
    రిల పద్యములన్ వ్రాయుట
    వలదు వలదటంచు సూవె వారిజ నేత్రా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కందాన్ని గిద్యమని మిము
      కందుక క్రీడాడుకొనిరి ఘను లద్దానిన్
      ఎందుకు నిరసించ రనఘ !
      అందరు మనవాళ్ళు గనకనా ? పరమహితా !!

      Delete


  133. పరమాపచారపు పలుకు
    ల,రభసలన్ చేయ మీకు లాభంబేమీ ?
    అరరె! తమకు తెలియనిదా
    గురు! పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్!


    జిలేబి

    ReplyDelete


  134. మేమెన్నారైలము ! మా
    భూమి భరతమాత! గొప్ప పుడమి! తను జిలే
    బీ మాదిరి మా కయ్యా
    ఓ మోస్తరు ఓకె దూరముగనున్నంతే :)


    జిలేబి

    ReplyDelete


  135. రాజన్న రాజ్యము దిశై
    మా జగనుడు రాజ్య మేలు మహిని జిలేబీ
    కూజా లో రాళ్లే సై
    నా జలమును పైకి తెచ్చు నమ్మిక గొనుమీ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కూజాలో గులకరాళ్ళు వెయ్యడం అంటూ ఏ సందర్భంగా మీరీ పద్యం కట్టారో తెలియదు (ఎనీవే మీరు చెప్పరుగా). పోనీలెండి, ఈ చిత్రాన్ని అవధరించండి 👇🙂:-
      కాకి - కుండలో గులకరాళ్ళు 🙂

      Delete
    2. అదేవిటండీ 🦁... కాకి సొమ్మసిల్లిందా? చచ్చిపోయిందా ? కాళేశ్వరం వెళితే బోళెడు నీళ్ళు.

      Delete
    3. నీహారిక గారు,

      దప్పిక తీరకపోతే ముందు సొమ్మసిల్లుతారు, తరువాత చనిపోతారు - మనిషి అయినా, కాకి అయినా, ఏ ప్రాణి అయినా.

      అవును కదా, కాళేశ్వరం వెళితే బోలెడు నీళ్ళు. పాపం కాకికే ఆ సంగతి తెలియలేదు. Poor creature.

      Delete


  136. పాయెన్ మ్యాచూ ఫైనలు
    పాయెను జనులెల్లరున్ లబలబయనంగన్
    సాయంకాలపు సమయము
    పోయెను పీసాఫు మైండు పువుబోడి‌ తృటిన్ :)


    జిలేబి

    ReplyDelete


  137. ఆధ్యాత్మిక సాధనలో
    నీ ధ్యాసను కేంద్రము పయి నిండుగ వుండే
    లా ధ్యానము సల్పుము బా
    లా!ధ్యాసయు వేరుపడని లాఘవము వలెన్ !


    జిలేబి

    ReplyDelete


  138. హింసా భరితం బాయెన్
    ధ్వంసమ్మే లక్షణముగ ధాంధూమ్ చిత్రాల్
    మాంసపు ముక్కల కైమా
    కంసుని తలదన్ను రీతి కక్షల్ సినిమా :)


    జిలేబి

    ReplyDelete


  139. ఓవైటీ క్రింద జిలే
    బీ, వేల కొలదిగ డబ్బు బీయెస్సెన్నల్
    లో వెచ్చించి గులాముల
    మై వేచితిమి ఫలితము సుమా శూన్యమ్మే !


    జిలేబి

    ReplyDelete


  140. నీటి రిక్క నెలని నీళ్లు లేవు జిలేబి
    మార్గశీర్షమందు మాఘ మలరె!
    చూడ చూడ బతుకు చూర్ణమగుచుపోయె
    విశ్వదాభిరమణి వినవె భామ!


    జిలేబి

    ReplyDelete


  141. Zilebiనవంబర్ 12, 2018 10:14 AM




    ప్రకామాఘము -

    ప్రకామ -అధిక
    అఘ - దుఃఖము

    ప్రకామాఘము - అధికమైన‌‌ దుఃఖము

    ఋతువులు మారి పోతే దుఃఖదాయకమే
    అలాంటి అధికమైన దుఃఖము సంక్రమించినది
    దు

    జాఘనిరాయుడంట మన జానకి మాతను గాంచె లంకలో!
    మా ఘన సార్వ భౌమ! వినుమా!అనుమానమదేల సీతయే
    రాఘవ! రావణాసురుని రచ్చకుదీయుచు చంపుమీ! ప్రకా
    మాఘము సంక్రమించినది మార్గ శిరంబునఁ గార్తికం బనన్!


    జిలేబి


    ప్రత్యుత్తరం


    కంది శంకరయ్యనవంబర్ 12, 2018 11:07 AM
    జిలేబీ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

    ReplyDelete
  142. ఇవాళ్టి (12-07-2019) "ఆంధ్రజ్యోతి" హైదరాబాద్ ఎడిషన్లో 5వ పేజీలో "గాడిదలు కాశారా?" అన్న వార్త చూడండి 👇. మన నాయకులూ, వారి భాషానూ 😡. వీధికొట్టాటల్లోనూ, కాంపౌండ్ గోడకు ఇరు వైపుల వాళ్ళు పడే గొడవల్లోనూ మాట్లాడే భాష లాగా తయారయింది చట్టసభలో వాడుతున్న పదజాలం. ఈ మాట అన్న నాయకుడు తను చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు వలన భాషాసంస్కారం అలవరచుకోలేదా?

    తమ నాయకుడు మాట్లాడిన దానికి ఒక మంత్రి గారి పొంతన లేని సమర్థింపు. అసలు నిలదీసిన ఆ టి.డి.పి. పెద్దమనిషి ... "గాడిదలు కాశారా?" అంటే రాష్ట్ర ప్రజలందరూ గాడిదలు అని మీ ఉద్దేశమా ... అని అడిగుండవలసింది.

    We got the leaders we deserve?? మేరా భారత్ మహాన్ 🙏.

    "గాడిదలు కాశారా?" :: చట్టసభలో వాడిన భాష

    ReplyDelete