Thursday, February 20, 2020

నక్షత్రాల కిటికి





నక్షత్రాల కిటికి

ఆకాశం 
నక్షత్రాల కిటికీ 
వెనుకనుండి
జిలేబి తో కనులు 
కలుపుదామని చూస్తోంది

జిలేబి ముసుగు తన్నుకొని
జోగుతోంది.



శుభోదయం
జిలేబి 

212 comments:

  1. అలసిన నారదముని

    అలసిపోయింది
    కాబోలు మనసు!
    పైన ఏడు
    క్రింద యేడు
    పద్నాలుగులోకాల్లో...
    మసలాడి!మసలాడీ!!
    గాదిరాజు మధుసూదనరాజు



    ReplyDelete
  2. పడమర పడగలపై మెరిసే తారలకై
    పడమర పడగలపై మెరిసే తారలకై
    రాత్రిని వరించకే సంధ్యాసుందరి

    తూరుపు వేదికపై వేకువ నర్తకివై
    తూరుపు వేదికపై వేకువ నర్తకివై
    ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ

    నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
    నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ

    శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ
    సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
    మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
    సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

    ReplyDelete
    Replies
    1. ఈ పాట ఉన్న “స్వర్ణకమలం” సినిమా ఇవాళ “ఈటీవీ మూవీస్ “ ఛానెల్లో వేశారండి ☹️. మంచి పాట, మంచి సినిమా. కె.విశ్వనాథ్ గారికి a feather in his cap. .

      Delete


  3. అడపాదడపా తప్పులు
    వడి దొరలునయా టపాల పబ్లిషు చేయం
    గ డిగనురుకు శ్యామలరా
    యుడ! మన్నింపుడను మాటయున్ మనకేలా


    జిలేబి

    ReplyDelete


  4. ఐపీ కూపీలాసామి బుట్టలో పడెను :)


    మీ కేమో చలికాలము
    మా కేమో యెండ కాచి మాడించెనయా
    ఆ కాయలు పుల్లటివ
    య్యా కాయవు సర్వవేళలందున్ పవనూ :)


    జిలేబి

    ReplyDelete


  5. వాడు సుందరుడు ప్రవాసి పేర్మి గనుచు
    గంగఁ బెండ్లియాడెఁ, గన్య యొకతె
    బహుమ తిగొని తెచ్చె వారిరువురికి ప్ర
    భాత వేళ కథ సభను సమాప్తి


    జిలేబి

    ReplyDelete


  6. పేరడీ నేను వ్రాయగ వెక్కిరించె
    నెవ్వడో దాని తనదిగా నేర్పు గాను
    పాడి నా పేరు కూడ చెప్పక! జిలేబి
    చేతు నేనేమి యమ్మరొ చెప్పవమ్మ

    ReplyDelete


  7. కతల్రాయడమెలా :)


    కావలెను సినిమాకొక కథ జిలేబి
    యనగ వ్రాసెను చప్పున నద్భుతముగ
    ట్యాగు లైనుబెట్టె భళి తటాలు‌ నిటుల
    "కన్నవారినిఁ దల్లియే కాటికంపె"!



    ***

    వింతగ వ్రాయవే కథ పవిత్రత గాన్పడ గా జిలేబి యొ
    ళ్ళంతయు గర్జనమ్మున తలారిగ వేషము వేసి తీర్పుగా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    వంతులవారిగా పడతి బైసిని వారలె తీయ ద్రోహులై!



    జిలేబి

    ReplyDelete


  8. https://www.youtube.com/channel/UCWGG2Hl4IHzH4_O44uEK8lA?


    కరోనా పై బండి రావు గారి పేరడీ లింకు.


    ReplyDelete


  9. ఇచ్చిన సమస్యా పాదమెక్కడే జిలేబి :)


    అడుసున కాలెట్టియరే
    ముడికారియనుచు వడివడి "మూర్ఖుండు శకా
    రుఁ డనుట పోలునె మీకున్"
    తడబాటు పడడతడే వితథము పలుకగా!







    జిలేబి

    ReplyDelete


  10. జిలేబి చుట్టుటెట్లు :)

    మూర్ఖుడు మాట కారుడగు? ముద్దుగ తిట్టుటదేల సోదరా?
    మూర్ఖుడెవండు? బుద్ధిని సమున్నత గల్గిన వాడెవండగున్?
    మూర్ఖుడు వీడు మూర్ఖుడని ముచ్చటగా వడి బల్కుటేలనో
    మూర్ఖుఁ డటంచు మీర నుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్!


    ఇట్లే జిలేబి చుట్టవలె :) వృత్తమనగా జిలేబి జిలేబి అనగా వృత్తము :)


    జిలేబి

    ReplyDelete


  11. అతడే ఆమె జిలేబీ
    జత కలిపెను ఫేసుబుక్కు చాటున సుమ్మీ
    కతలిక బ్లాగ్లోకమ్మున
    వతిగ మనకు కానవచ్చు పలువిధములుగా


    జిలేబి

    ReplyDelete


  12. ఎంతందంగా పద్మా
    వింతగొలుపు రీతి నీవు విరిబోణీ కే
    రింతల నడుక్కునేవే
    యింతటి తెకినీకు లెట్లు నీకబ్బె మదిన్!




    జిలేబి



    ReplyDelete


  13. నీకని వేచె జిలేబీ
    రాకాశశివదన వలెని రమణిని గనుమా
    పోకిరి రాజ! ముఠా మే
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!


    ***

    నూకలు వండి వార్చునిదె నొక్కులు దిద్దెడు ముద్దుగుమ్మతో
    పోకడ మారు! జీవితము పొక్కిలిపాపడి వ్రాత చూడుమా
    నీకని వేచె చించిలిక! నీరజనేత్ర జిలేబి! రాజ! మే
    స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్


    ***

    ఆ కంప్యూటరు జతగా
    నీకింకెన్నాళ్ళు ముడి! వనిత వేచెనిదే
    నీ కరమునకై! ఓ శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!


    ***

    రాకాసిననుకొనకురా!
    పోకిరి పిల్లననుకొనకు పువుబోడిని రా
    రా కౌగిలిలోనికి! శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!


    ***

    కోకిల వలె పాడు! జిలే
    బీ, కారప్పూస కలిపి విరిసిన మోమౌ!
    జూకాలులూగు మది! శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!



    ***

    మైకమ్మున తూగునయా
    నీ కనులు పడతుక మోముని గనన్! మదిలో
    బ్రాకునిదె ! ప్రభాకర శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!



    జిలేబి

    ReplyDelete


  14. ఆకారమో జిలేబీ
    లా కడు మోదంబిడు మది లావుగ తూగున్
    సై కొట్టునయా ఓ శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!



    శతకానికి పోదామా :)


    ***

    కాకరవత్తి చురుక్కుల
    నీకాలంబింక సాగు నిరవధికముగా
    రాకెట్టువేగముగ శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!



    ***

    మోకాలి లోతు దిగితివి
    పో కన్యను ప్రేముడించి ! పూర్తిగ మగ్నం
    బై కొందలపడుమోయ్ శా
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!



    ***

    నీ కెట్లు తోచె నోయీ?
    పోకారుచు దానినింక! బుద్ధి గలదె? సీ!
    సీ! కశ్మలము పలుకకు
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్?



    ***

    ఈ కాలము నీదే నో
    యీ! కమలాక్షి! పరువంపు టింపుల జుర్రం
    గా కలదోయి వసతి ఓ
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!


    ***

    వాకబు చేసితి గలదట
    పీకల దాక మదిరాక్షి విరిబోణులకై
    మైకమ్ములకు తలము! ఓ
    స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!


    ప్రతిపాదన 2017 లో పెట్టినారట?



    జిలేబి

    ReplyDelete


  15. వందనమిడి దత్తపది పదములనిచ్చి
    "ఎలుక పాము నెమలి యెద్దు కపులు"
    సీత కష్టములను చెప్పగోరెను పృచ్ఛ
    కుడు జిలేబిని పదుగుండ్రు చూడ


    జిలేబి

    ReplyDelete


  16. భళారే చిత్రం :)


    మెలకువ గాంచె కాననము మెంగతనమ్మును వీడె ధాటిగా
    పలికె జిలేబి యాంగ్లమున బాలల డిస్ని వరల్డు చిత్రమం
    దు లసుకు తోడు మానవుడు దొమ్మిని చేయగ మంథరమ్ముతో
    డెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!


    జిలేబి

    ReplyDelete
  17. కవిభుజంగమాలు , కవిమూషికమ్ములు
    కవిశిఖి , కవియెద్దు , కవికిచకిచ ,
    ఘనతదాల్చినారు కవులు బిరుదు వట్టి
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు .

    ReplyDelete
    Replies

    1. మీకు మీరే సాటి రాజసింహా :)



      జిలేబి

      Delete


  18. మా శివయ్యే గొప్పోడు.



    శివుని యింట నుండె చీకుచింతయులేక
    యెలుక, పాము నెమలి యెద్దు, కపులు
    రాముని కెడ చేరి శ్రమ బడిరి! హరుని
    కొలువె మేల్మి పట్టుగొమ్మ మనకు!


    జిలేబి

    ReplyDelete


  19. ఆయ్ :) గోదారోళ్ళమండీ :)


    గోదారోళ్ళము మేమం
    డీ దారిని బోవు వార్ని ఢీకొంటామం
    డీ! దాష్టీకము లెంతయొ
    సాదాసీదాగ చేయు సరసులమండీ :)



    ఎటకారం మా జన్మ హక్కు :)



    జిలేబి

    ReplyDelete


  20. మా జన్మ హక్కు విడువము
    బేజారెత్తించెదమ్ము వెటకారముతో
    బాజారున చూడగ సు
    మ్మీ జనులన్ పలకరించి మించారు నలిన్



    జిలేబి

    ReplyDelete


  21. గోజీ నీళ్లను త్రాగిన
    తాజాగా నెమరు వేసెదరు జను లెపుడున్
    మా జిల్లా గొప్ప సుమా
    రాజన్నా వినుడు నరస రాయా వినుడీ :)


    జిలేబి

    ReplyDelete
  22. మీరూ మీరూ వొహటే
    సారూ !, గోజీలరు ,నరసవిభులు సగమే ,
    సారీ జిలేబిగా మీ
    పేరు ప్రసిధ్ధమయినన్ , జపింతురు గోజీల్ .

    ReplyDelete
    Replies

    1. రెణ్ణెల్ల కోమారైనా కలుస్తా వున్నాంగా జపించక‌ పోతే యెట్లా మరి :)



      జిలేబి

      Delete


  23. విట్టుబాబు గారి అప్రస్తుత ప్రసంగ వేగం గాలి లా వేగం ! ప+ ఆత్ముడు - ప- గాలి ; గాలి యే ఆత్మ గా గల వారు :)


    లేపుచు ప్రశ్నల వేగము
    గా పండిన తలల చూచి కయ్యాటములన్
    దాపరికము లేకన్ చం
    పా, పాత్ముఁడు విట్టుబాబు! పక్కున నవ్వెన్



    జిలేబి

    ReplyDelete


  24. ఓ పండిన తల అవధాని ! అప్రస్తుతమునకు గాలి కన్నా వేగపు మనం విట్టుబాబు గారు :)

    అవధానిని , ముసలీ ! శాస్త్రము తెలుసా అంటే వారన్నారు కదా


    ముసలీశాస్త్రము చెప్పె నోయి విను నీ ముంగాళ్ళకా బంధమై
    దుసికిళ్ళాడకనీక వచ్చు సితయే దువ్వాడు జవ్వాదియై
    అసలే బాలుడు! పృచ్ఛకుండు! పనియో నప్రస్తుతంబాయెనే
    వెస పా! పాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్


    ముసలీశాస్త్రము - బల్లి శాస్త్రము

    జిలేబి

    ReplyDelete


  25. మక్కువ దేని పయిననో
    టక్కని ప్రకృతి వరమిచ్చుటయు కోరినదే
    యెక్కువగుట భళి తధ్యము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!



    జిలేబి

    ReplyDelete


  26. తక్కువ చేయదోయ్ ప్రకృతి ధారణ తోడుత నేది కోరగా
    మక్కువ గా జనాళి కదె మంచి యటంచును పంచి పెట్టునోయ్
    టక్కున తద్యమిద్దియె పటాగ్రపుబంగరుగా విశేషమై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై;



    జిలేబి

    ReplyDelete


  27. అక్కా జిలేబి నీకా
    పెక్కు సమస్యలు గలుగుట, పెన్నిధియె కదా
    తక్కువ సమయము లోనవి
    నిక్కముగా తీరుట! యిది నీ పుణ్యంబే!


    ***

    ఎక్కువ తక్కువలె కదా
    నిక్కము గా దేల్చునోయి నిగ్గుని రమణీ
    చుక్కానిగా బతుకునకు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    ***

    జాల్రా జిలేబి :)


    నిక్కము మోడికి కప్పెను
    తొక్కటపాటు సమయములె దుశ్శాలువలన్
    ముక్కాకలుదీఱుటకై
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!



    ***

    మిక్కిలిగా పండగ తన
    కెక్కువ రాళ్ళు తగులు గురి యెక్కువగా! చూ
    డక్కా! చింతించకుమా
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    ***
    ముక్కుచు మూల్గుచు రాహుల్
    తక్కువ గా బతుకుటేల ? దావానలమై
    తెక్కలి సభ్యుల మార్చుము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    ***

    టక్కున వచ్చె కరోనా
    మిక్కిలి గా తంపరై సుమీ ధోరణులన్
    చక్కగ మార్చెను తృటిలో
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    జిలేబి

    ReplyDelete


  28. ప్చ్ ! కింగ్ హరి :)


    ఓరి హరిబాబు బుచికీ
    వారి వెనుక పడెదవేల పనిలేదోయీ ?
    ఓరీ మరో దఫా యి
    ట్లా రాసావంటె తోక టాం కట్ చేస్తా :)


    నేనన్లే


    జిలేబి

    ReplyDelete


  29. ఏమీ! అకాల వర్షము
    లా మీ తూగోజి లో ? యిలా అయితే నం
    డీ మాగాయను పెట్టుట
    కే మీకిక కష్టమగునొకింత కదాండీ ?


    మాగాయ వేయు మగవాండ్రుల కనాకష్టాలు :)


    జిలేబి

    ReplyDelete


  30. నిక్కము బుచికీ ధ్యాసయె
    మిక్కుటముగ చేయు గాదె మేదిని హరికిన్
    చక్కగ కిరికిరి పెంచెడు
    పెక్కు కమెంట్లే గలుగుట పెన్నిధియె కదా! :)


    జిలేబి

    ReplyDelete
  31. కనులు తెరచినా బుచికాయె కనులు మూసినా బుచికాయె.

    ఎదుటా నీవే. ఎదలోనా నీవే బుచికీ . బుచికోయమ్మ బుచికి

    ReplyDelete


  32. భుగభుగ సెగగక్కు నొకటి!
    పగ తోడుత రక్తికట్టు వడి మరియొకటీ
    రగిలింప జిలేబి నెరవు
    సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బులుసు వారు గుబులుగున్నారా
      ధూపము లేక దిగులు పడ్డారా
      ఇష్టము దొరక్క కష్టము వచ్చెనా
      పెద్దలు పాపం చిన్నబోయినారా

      Delete
    2. బులుసు వారు జాగ్రత్త పడే ఉంటారు లెండి 🙂. నిత్యాగ్నిహోత్రులు కదా 🙂.

      Delete
    3. విన్నకోట వారూ, let us hope so. ఇంపుట్ స్టాకు కొరత మూలాన ఔటుపుట్ సంఖ్య లేదా నాణ్యత దెబ్బ తింటే
      వారి బ్లాగాభిమానులుగా మనకే కష్టం!

      Delete


  33. పొగతోడై రగులంగ వేడి జతగా బుగ్గారు నుద్రిక్తతల్
    పగతో గూడుచు చల్లకవ్వముగ సై పల్లార్చు కొట్లాటలన్
    జగడాలేలనటంచు కూర్చొనకురా సన్నాసియై మానవా
    సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్!


    నారదీయము

    జిలేబి

    ReplyDelete


  34. ఇబ్బందులుకొన్నండీ
    ముబ్బడిగా ఉంది మీదు ముదుసలి తనమో
    తబ్బిబ్బులపడవేసెన్
    జబ్బల బలమె నిలిపె నను సదనము లోనన్

    జిలేబి

    ReplyDelete


  35. ఏమాయె ప్రకాష్ రాజో ?
    ఆ! మూలని కూర్చొనెన్ తనదు మిత్రులతో
    డై మీదు దెబ్బలుపడగ
    మామూలుగ లేవగన్ సుమా నాన్నాళౌ!


    జిలేబి

    ReplyDelete
  36. ఇంతకుముందు వరకు ఇక్కడ ఉన్న నీహారిక గారి కామెంటు (“సన్నాసుల” గురించి), నా స్పందనా ఇప్పుడు కనబడడం లేదే బ్లాగ్ ఓనర్ గారూ? విష్ణుమాయా?

    ReplyDelete


  37. బ్లాగోనరు గారండీ
    ఈ గారడి యేమిటండి ? యిక్కడి కామెం
    ట్లే గాలికి పోయె జిలే
    బీ గారండి ? నరసన్న! విదుర తెలియదే !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Jai GottimukkalaApril 25, 2020 at 8:19:00 PM GMT+5:30

      మన బ్లాగులలో సైతం కొందరు "రైతులు" కుళ్ళు ఆపుకోలేక యమ కుమిలిపోతున్నారు పాపం.

      Jai Gottimukkala29 April 2020 at 14:23
      బీదరికం, నిర్లక్ష్యం, అణిచివేత, & వివక్షలనే ఘోరమయిన రోగాలకు తరతరాలుగా అలవాటు పడిన భారత పల్లెల బీదాబిక్కీ జనాన్ని నిన్నగాక మొన్న వచ్చిన కరోనా ఏమీ చేయలేకపోయిందని సంతోషించాలా, బడుగు బతుకులు ఎప్పుడు బాగు పడతాయోనని బాధ పడాలా తెలువడం లేదు.

      Delete


  38. ఎంత సరదాగ చెప్పే
    రింతటి యీగో కతను గురించి సుమా మీ
    యంతఃకరణపు మెరుపుల
    తంతుల వర్ణించి శారదా పద్మముఖీ!


    జిలేబి

    ReplyDelete
  39. నీహారిక గారూ, బ్లాగర్లు కాలక్షేపానికి కాట్లాడుకోవటంలో కొత్తా లేదు వింతా లేదు. కాని ఈ గొడవల లోనికి త్యాగరాజస్వామి వారిని ఎందుకు లాగుతున్నారు? 'త్యాగయ్య కాషాయపు పైత్యం' ఏమిటి? త్యాగరాజస్వామి వారు మీకు ఎందుకు చులకన అయ్యారో!

    ReplyDelete
    Replies
    1. త్యాగయ్య అంటే ఆ త్యాగరాజస్వామి కాదండీ...ఈ త్యాగయ్య సినిమాల్లో విలన్ త్యాగరాజ్ లాంటివాడు, పల్లవులు అనుపల్లవులు వ్రాస్తూ త్యాగరాజస్వామి లెవల్లో ఫీలవుతాడు. సాధువులను చంపితే బ్రాహ్మణులే ఎందుకు మొత్తుకోవాలీ అన్నది నా ప్రశ్న. పైగా ఎవరూ అడగడం లేదేమిటీ అని దబాయింపు ఒకటి, కాషాయ పైత్యం కాదూ ?

      Delete


  40. ముడిసరకేలేక జిలే
    బి డిగనురుకి కైత యనెడు విన్నాణముతో
    గడగడ వ్రాయు విధము గని
    గడియారము సిగ్గుపడును గమనము నాపున్



    జిలేబి

    ReplyDelete


  41. కులుకుదనమ్ములన్ వడి నిగూహనమున్ తొలగింపు రమ్మ! కో
    మలి! గజయాన! చంద్రముఖి! మాపటి వేళ కలాపయామినీ
    యలకలకొల్కి మాధురి! సయాటల దేల్చుము! నీదు మోహమం
    దలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవు! రా!



    జిలేబి

    ReplyDelete


  42. అట్లా సమస్య వస్తే యిట్లా టక్కని వృత్తము చుట్టు జీపీయెస్ వారి వంగతురంగ వేగము :)


    వడి వృత్తము చుట్టు నతడు
    నడిరేయి ప్రభాకరుండు నడగడి వేగం
    బు డిగబడి! చూడనతడిని
    గడియారము సిగ్గుపడును గమనము నాపున్!


    జిలేబి

    ReplyDelete


  43. Beating corona times అవధానుల డయనము వాట్సాపు :)


    వడి వాట్సాపవధానము!
    కొడికట్టె కరోన వేళ కూకటిరత్నం
    బు డవిణ మ్రోగించి! గనన్
    గడియారము సిగ్గుపడును గమనము నాపున్!



    జిలేబి

    ReplyDelete


  44. అడడడ మామర కిళియే
    సుడసుడ పోడుడి జిలేబి సుర్రెండ్రదువే
    నొడియల్ సిమిట్ట కణ్ణై
    గడియారము సిగ్గుపడును గమనము నాపున్


    జిలేబి :)

    ReplyDelete


  45. ఎక్కడో చదివినట్టుంటే నా బాధ్యత గాదు :)



    ఎడలను పలుకుల పలికెడు
    గడుగడు నిపుణులు తెగ చిలుక తెఱగుల కడుం
    గడు మురిసెడు కవులను గని
    గడియారము సిగ్గుపడును గమనము నాపున్!



    జిలేబి

    ReplyDelete


  46. ఒబ్బిడికి బోకు మమ్మా
    గుబ్బెత ! తకరారు లవియె గూడు జిలేబీ
    సుబ్బాయమ్మ వెతల చూ
    డబ్బబ్బో యెంత గా పడవలసి వచ్చెన్ :)


    జిలేబి

    ***

    ఒబ్బిడి
    గొప్పలకు పోక పోవడం అని అర్థం .
    ఉబ్బు ఇడి
    ఉబ్బు _ అతిశయం
    ఇడి _ లేకపోవడం (తదభావద్యోతకం గా ఇడి చేరుతుంది
    ఉబ్బిడి వ్యవహారంలో ఒబ్బిడిగా మారింది


    రాజన్న గారి మాట

    ReplyDelete


  47. వ్యవసాయము నాదు బతుకు
    న వారధి జనులకు బువ్వ నావల్లయినం
    త విరివిగా పండింప! వి
    డువనండీ వృత్తి పిడికెడు మెతుకు నిత్తున్


    జిలేబి

    ReplyDelete


  48. Will NIFTY grease today 10000 Mark briefly ? :)



    పదివేలు దాటునా ని
    ఫ్టి? దివాళాదినములింక ట్రెండదె మారం
    గ దినకరుండుదయించునొ?
    యిదె! యీదినమె తెలుపున పయిదలి జిలేబీ? :)



    జిలేబి

    ReplyDelete
    Replies

    1. అదిగో కొంత దూరం లో నిఫ్టీ టెన్ కె ని ముద్దెట్టుకొనుటకు ఆగిపోయె మొహమాటపడి :)


      ముద్దెట్టుకొనగ భళి తా
      నద్దరి పోయి మొహమాటమయ్యె కరోనా
      సద్దుమణగలేదనుచున్
      కొద్దిగ యెడమై నిలిచి చకోరంబాయెన్ :)



      మే మూడో తారీఖు లాకుడవును‌ ఓపెనింగు సాంగు టెన్ కె అగునో :)

      జిలేబి

      Delete


  49. దయరాదెందుకురా నీ
    దయరాదెందుకని వగచి దయకై ప్రతి రో
    జు యిలా ప్రార్థనలేలా
    పయనించుము రాజమార్గ పథమున నరుడా!



    జిలేబి

    ReplyDelete


  50. చేస్తున్న పనిని విడువక
    విస్తారముగ కడవరకు విధిగా చేయం
    గా స్తిమితమదియెనిచ్చు! భ
    ళా స్తోమపుదాత! వందనాలయ విదురా!



    జిలేబి

    ReplyDelete


  51. శ్రమయున్ శ్రద్ధయు కలిపిన
    సమయము కూడుచు ఫలితము శాతము వందై
    సుమనోహరి పద్మా విజ
    యము తధ్యంబగు భళారె యశమున్ గూడున్!



    జిలేబి

    ReplyDelete


  52. రాజులనిక నడచ రాచబిడ్డలనదె
    చంపి వేయ గాను శపథము ! సుడి
    గాలి వలె తిరిగె పగ రగుల! పరశురా
    మునిఁ గని భయ పడిరి పుడమి దొరలు!


    జిలేబి

    ReplyDelete


  53. అనిలపు వేగమాతడి ప్రయాణము! రాజుల చంపి వేయ బూ
    నెను శపథమ్ము! బ్రాహ్మణుడు నెమ్మిని వీడెను! తండ్రి చావుకై
    తనయుని స్తీర్వితర్పణము దావము గా రగిలెన్! పరశ్వథా
    మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్!



    జిలేబి

    ReplyDelete


  54. సమస్యా పాదమెక్కడే జిలేబి ? :)


    నిమిషము కూడ వృధా చే
    య మనసు రాదాయె! లేడయా యెపుడున్ "రా
    ట్నము విడి; గాంధి యిదె స్వరా
    జ్యముఁ దెచ్చెన్" మనకు సూవె చల్లగ బతుకన్!



    జిలేబి

    ReplyDelete


  55. ఇవ్వాళ పూసపాటి వారు పూనినారు :)
    ఇచ్చిన పాదము చంపకమాల పూరణ కందములో :)



    నిమిషము కూడ వృధాచే
    యమనసు రాదాయె! లేడయాయెపుడున్ "రా
    ట్నము వీడి; తెచ్చెను స్వరా
    జ్యము గాంధి మహా త్ముఁ డొప్పుగన్" మనకు సుమా



    జిలేబి

    నాల్గవపాదంలోని యతి సరి కాదు. సరిచేసే అవకాశం లేదు.

    యతి ఢోకా :)

    ReplyDelete


  56. జై ఖాదీ గ్రామోద్యోగ్ :) కరోనా ఖాదీ‌‌ భాండార్


    కొట్నంబదేల జనులకు
    రాట్నము విడి? గాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్
    రాట్నమ్ము వడికి! ఖాదీ
    పట్నములందమ్ముటకిక వడకండర్రా!



    జిలేబి

    ReplyDelete


  57. విజయా మజ్జిగ పత్రిక
    లు జోగుచు ప్రయాణము మొదలు మజా! తుదక
    య్యె జిలేబి చుట్టు వలెనా
    గజిబిజి గా పూణె చేరిక తెలుగు బాలా:)


    జిలేబి

    ReplyDelete


  58. బావలకు
    పవరు హవుసు
    పద్మార్పిత :)


    మనసుని మెలిపెట్టెడు భా
    వనలన్ పద్మా తెలిపెడు పవరు హవుసు వీ
    వనుటకు నే సందేహిం
    చనే వరూధిని జిలేబి చంద్రముఖి సఖీ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సారూ ! రురురూ రురు యన
      పేరు వరూధినిగ మార్చి పేర్చి వలపులన్
      తీరుగ జిలేబి చుట్టిన
      నారయ తాతయ్య బామ్మ యగునా ? తగునా ?

      Delete


    2. తాతయ్య బామ్మయగునా
      యేతావాతా జిలేబి యెవరో తెలిసిం
      దా తాతయ్య యొకరికే
      ఖాతా ముడి విప్పడతడు కవిరాట్ రాజా :)

      జిలేబి

      Delete
    3. పేరూ ఊరే తెలుపడు
      పోరీ గాదని , జిలేబి , పోకిరి సారం
      చూరించి తెలిపె , విబుధుడు ,
      నారీ జనమంత నిజము నరసి చిడి వడన్ .

      Delete


    4. పోకిరియొ, పోరియొ, జిలే
      బీ కాణాచి తెలుసును సవివరము గా రా
      జా! కానీ యేతావా
      తా కూసింతయె తెలిపె కదా! విదురులె పో :)



      నారదా
      జిలేబి

      Delete


  59. పట్నము, వాడవాడలు సవాలుని చేయుచు పాదయాత్రలం
    దట్నపు ధైర్యమున్ పగటి, దాస్యము దైన్యము శ్వేతరాజ్ఞికై
    కొట్నము వద్దటంచు, భళి కూకటి వేళ్ళను లాగి, త్రిప్పి యా
    రాట్నము, వీడి తెచ్చెను, స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్!



    జిలేబి

    ReplyDelete


  60. ఆ కరివెదను పెనుపుగొను
    పైకముతోఁ గర్షకుండు, పాడైపోవున్
    రాకున్న సరి సమయమం
    దాకసమున వర్షమా వెదను జల్లకయున్!



    జిలేబి

    ReplyDelete


  61. రాకున్నన్ సరియైన వేళ చినుకుల్ రాత్రంతయున్ చింతయే
    పైకంబున్ గొని, కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే
    మైకమ్మందున కాపిశాయనముతో మంచమ్ము చేరంగ నీ
    లాకాశమ్మదె సీరవాహకుని కైలాసంబునెద్దానికిన్


    జిలేబి

    ReplyDelete


  62. టీవీ చర్చలో పార్టీ ఛోటా నాయకుడువాచ


    వైకాపా అధినేత యేలుబడిలో వర్ధిల్లు తానెంతయో
    పైకంబున్ గొని కర్షకుండు; ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే
    శోకాల్వెట్టెడు చంద్రబాబు కెడ పస్తుల్బోయి తధ్యమ్ము! పా
    ర్టీకైవారపు నేత బల్కె వడిగా టీవీని చర్చించుచున్!



    జిలేబి

    ReplyDelete


  63. బ్లాగు కి మాడరేషను :)


    బుచికీకో బ్లాగుందోయ్
    కిచకిచ కామెంట్లనచట కీసర గా వే
    య చలో చలో జిలేబీ
    రుచిచూపవలెను కమింట్ల రువ్వలను వెసన్ :)

    http://anupallavii.blogspot.com



    :)


    జిలేబి


    ReplyDelete
    Replies
    1. ఇన్నాళ్ళూ నిద్రపోతున్నారా ? వాడు అందరి బ్లాగుల్లో విషం కక్కుతాడు. తన బ్లాగులో మాత్రం త్యాగయ్య ఫోజు !

      Delete


  64. జింగాలాలా భంగిమ
    లంగీకారమ్మొ పద్మ ! లసిత ముఖీ నీ
    చెంగట కైవారముకై
    యంగట నిలిచితిమి ఓ ప్రియమణి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  65. తనదు బ్లాగు లోన త్యాగయ్యవలె ఫోజు
    విషము కక్కు తాను విరివి గాను
    నెల్ల వేళ లందు నితరుల బ్లాగుల
    లో ననానిమసు పలుకులు గాను :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పైకూ గిద్యాలు ఒక సంకలనం ప్రచురించి ఎవరైనా మానసిక రోగం తో బాధపడుతున్న ఒక విదూషకి కి అంకితం ఇవ్వు. పాపం రోజూ చదువుకుంటుంది. - ఇదే చిరు త్యాగరాజు సలహా.😷

      Delete


    2. రా నాయనా రా మీ కోసమే వేచి వుంటిమి :)



      జిలేబి

      Delete
    3. వేచి వుంటి మసాదువు , వేచి యుంటి
      మనవలె , నిలాగ వ్యవహారమున వచింప
      మీ గురుడు బడినుండి పంపును ,మరొక్క
      బుధుడు బెత్తము తెచ్చును , బుధ్ధి గరపు .

      Delete


  66. పులిహోర ఆవకాయ క
    త లబ్జుగా తెలుపుడయ్య తరముగ నూర్రూ
    తల వేచినాము కష్టే
    ఫలివారూ ! రండి రండి భళి మా నలుడా :)


    జిలేబి

    ReplyDelete
  67. కాఫీ కలుపుట కూడా
    సాఫీగా రాదట , మరి ! సారుకివన్నీ ?
    ఊఫూ ! ఊదేస్తుండే ?
    సేఫనుకుంటే కతేంటొ చెబుదురు 🙏 కాస్తా .


    ReplyDelete


  68. ఆయన అనుకున్నాయన
    యీయమ యొకరో జిలేబి కెరుకగునయ్యా ?
    సాయంకాలపు వేళని
    మాయ కనులకప్పెనేమొ మా విబుధునికున్ :)


    జిలేబి

    ReplyDelete

  69. ఓ యబ్బో విజ్ఞత :)


    ఇనుప గుగ్గిళ్ల వ్రాయుచు నిరగ దీయు
    చుంటివే జిలేబీ పడుచు పడుచు వెస
    వెస సుమా రాశులకొలది! వీటిని‌విడి
    వాసి గా వ్రాయవమ్మరొ పరిఢవిల్ల :)


    జిలేబి

    ReplyDelete


  70. డొల్లు కర్తరి వచ్చెనుడుకుల తోడు
    నీరు కారెను వరుసగ నీళ్ళ కరువు
    మొదలగునిక వర్షమెపుడు మోదమొసగు
    వేచి "యుండవలె" జిలేబి విధియిదేను


    జిలేబి

    ReplyDelete


  71. ఇత్తరి సనాతనము విడి
    నత్తరి వేరు మతములె మనకు మేలనుచున్
    చిత్తపుటనుచరితముగ న
    నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్!

    అనత్త - అనాత్మ ఆంధ్రభారతి ఉవాచ



    జిలేబి

    ReplyDelete


  72. నేటి టపా చూడండీ
    మేటిగ తెలిపితి జవాబు మీప్రశ్నకు రా
    యా!టప్పున గుర్తుకు వా
    గ్ధాటిగ రాలేదు సూవె కతలు మిగతయున్


    జిలేబి

    ReplyDelete


  73. పెద్దలు చెప్పగ విన్నవి
    సుద్దులు జ్ఞాపకము గాను స్ఫురణకు రాగా
    దిద్దిన టపాలివి సుమా
    కొద్దిగ కొద్దిగ పెరిగెను కోటవలె సుమా :)



    జిలేబి

    ReplyDelete


  74. ఎత్తెంతయెదిగనను మే
    నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్
    విత్తుల వారి కుమారుం
    డత్తరి బెండ్లాడ గా బడాయి పిలుపులన్


    జిలేబి

    ReplyDelete


  75. కొత్తగ సంబంధమమర
    బత్తుల వారి కొమరునకు, ప్రశ్నయు రాగా
    నత్తరి పిలిచిరిగా మే
    నత్తను, బెండ్లాడవచ్చునా యని రెల్లన్!


    జిలేబి

    ReplyDelete


  76. కొత్తగ వచ్చె బంధమని కూచపు వారికొమార్తె చేరగా
    బత్తుల వారి బంధములు ప్రశ్నయె లేపును! భార్యభర్తలం
    దత్తరి ఘాడమైన పరిదానములాయె కుటుంబ మందు! మే
    నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్!



    జిలేబి

    ReplyDelete


  77. ఇత్తరి సనాతనము విడి
    నత్తరి వేరు మతములె మనకు మేలనుచున్
    చిత్తపుటనుచరితముగ న
    నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్!

    అనత్త - అనాత్మ ఆంధ్రభారతి ఉవాచ



    జిలేబి

    ReplyDelete


  78. వినుడయ్య అనామకుడా!
    పనిని వదులుకుని కమింట్ల పై వివరణయి
    వ్వను గాక యివ్వనోయీ
    కనీసమిక డబ్బులెట్టు కత ప్రచురిస్తా :)


    జిలేబి

    ReplyDelete


  79. ఇదె కరోనా సమయమున నిదె జిలేబి
    ప్రార్థనల చేయవలయు నరయ కపాలి
    గరళ కంఠుడు ఖట్వాంగి ఖరువగు హల
    హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు



    శివోహం
    జిలేబి

    ReplyDelete

  80. చంపకమాల సమస్యా పాద గర్భిత కంద పూరణము-

    ఇచ్చిన పాదమెక్కడ :)


    భగభగ కర్తరి! మండె
    న్సెగ! "హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె ది
    క్కగు నెల్లవారికిన్" సరి
    యగు వేళయిదే జిలేబియా వేడుకొనన్



    హల - నీళ్ళు - గంగను దాల్చినట్టి


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బాగుందండీ !' ఫల్టీ '
      వేగమె గురుడిచ్చు రెండు వీరో త్రాళ్ళన్ ,
      సాగి తెగమ్రొక్కి తనియుడు ,
      రోగము కడు ముదిరె , తలకు రోకలి వచ్చున్ .

      Delete


    2. నారదా !


      పాడై పోయెను బుర్రయె
      చాడీలనువినుచు సారు చక్కటి మాస్టా
      రూ! డేగిస మ్రోతలతో
      వాడి‌న పువ్వు పరిమళము పసయు కలుగునా :)



      జిలేబి

      Delete


  81. ఇలను సహాయమై జనుల కెంతయొ లాభము కూడగానికన్
    తొలకరి జల్లు రావలె ప్రదోషము లెల్ల జిలేబి‌పోవలెన్
    కొలువగ రమ్మ కర్తరి ప్రకోపము చల్లగ తగ్గి బోవ హా
    హలమును దా ల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారి కిన్


    జిలేబి

    ReplyDelete


  82. లెస్స! యని తినెను జిలేబీల విడువక
    వచ్చె కడుపు నొప్పి బామ్మ తాగ
    మనగ నొఱపు బోవ మనవడా యనుచు నా
    ముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె!



    జిలేబి

    ReplyDelete


  83. గుండు సున్న జిలేబి కత :)



    ముదము! జిలేబి! జాంగ్రియు! ప్రమోదము! భోజనమిద్దియే యటం
    చు దరువు తోడుగా కుడుచు చుండెను! వచ్చెను విడ్గ్రహమ్ము! బా
    మ్మ దళముకొల్పు వాని నపమర్ధము తీరగ నివ్వబోవ నా
    ముదమును, రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్!



    జిలేబి

    ReplyDelete


  84. ఆటవెలది పాద మణగిన కందము :)


    గుబగుబలాడు జిలేబీల్!
    దబదబ తినె నొప్పి వచ్చె తన్నుకొనుచు! బా
    డబ! నాముదము వలదటం
    చుఁ బోఱఁ డేడ్చె నొఱపు నడుచుకొనుచు నపుడున్ !


    జిలేబి

    ReplyDelete


  85. సెబాసో సెల్ఫు డబ్బా :)



    తిరుగుచు కమింట్ల చదువుచు
    సరి జూచుచు ప్రాస యతుల సవరింపులతో
    ‌డరవంపు బామ్మ యొక్కతె
    విరివిగ పద్యముల పేర్చి వెదజల్లె సుమా :)


    జిలేబి

    ReplyDelete
  86. ఒడుపుగ లేటు ప్రాయమున , నోమి , యదేపని పద్యవిద్య నే
    ర్చెడు , ఘను , లారయన్ తమరె , శ్రీకర మౌపని , కాని , సారహీ
    నుడివలె , నొక్క పూరణ వినోద విధిన్ బడు టేల ? మిత్రమా !
    కడు గడు నైపుణుల్ గలవు , కమ్మని ఖండిక వ్రాయవచ్చుగా !

    ReplyDelete
    Replies


    1. ఖండికలు ఖండికలుగా
      దండిగ వ్రాసిరి కవులు కదా నేడున్నా
      రాండీ చదివెడు వారలు ?
      దండగ నే వ్రాయుటయు పదపడి సుమండీ :)



      జిలేబి

      Delete
    2. మండిత మూర్ధన్యులు తమ
      రండగ గురుదేవులుండ రఫ్ఫాడండీ
      దండుగ పూరణ రగడల
      దండిగ గడియించు గురుడు డబ్బూ దస్కమ్ .

      Delete


  87. వాడికి స్వస్థలమది పో
    రాడె బతుక వలసకూలి రాబడి తోడై
    చూడ కరోన! రయిలు లే!
    గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వీడికి బుధ్ధీ ఙ్ఞానము ,
      వాడికి తెలివీ ధిమాకు పాడై పోయెన్ ,
      బోడితలగాడు కూసెను
      గాడిద నెక్కి , శశిధరుఁడు గాశికి నేఁగెన్!

      Delete


  88. వలస కూలి యానము


    వాడొక కూలి వాడు తను పాటికి పట్నపుటూడిగమ్ము! తె
    డ్డోడె బసాలుతోబతుక! డుండుక కూడదె కారణంబటా!
    చూడ కరోన వచ్చెనదె! సొమ్మొక రూకయు లేదు చేతిలో
    గాడిద నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై!


    జిలేబి


    డుండుక కూడు - Mean food

    ReplyDelete


  89. నారదాయ నమః !


    కంటినయ జిలేబిని తా
    నింటిని విడి తిరుగు కాంతయే! సాధ్వి యగున్
    తుంటరి తనమ్ము చేయను,
    మంటల నెగదోసినన్ సుమా నిక్కమిదే


    జిలేబి

    ReplyDelete


  90. తుంటరి గా జిలేబి వలె దొమ్మబలమ్మున గట్టివాయియౌ
    యింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత! సాధ్వియౌ
    జంటగ భర్త తోడుత సజావుగ నత్తను,మామ గార్ల, నా
    గుంటల చూచుకొంచు తన గూటిని వీడని నీరజాక్షియే !



    జిలేబి

    ReplyDelete


  91. ఆదియు నతడాయె నంతమునతడాయె
    చూడ గలడు సూవె సూటి గాను
    వాడె క్షేత్రి మరియు వాడె క్షేత్రమ్ము! చ
    క్రి కెటు కష్టమైన క్రీడ యగును.


    జిలేబి

    ReplyDelete


  92. జిలేబీయము :) ఆటవెలది పాద గర్భిత కందాట :)



    రమణయ్య! చక్రి కెటు క
    ష్టమైన క్రీడ యగును క్రికెటాటా? వాడా
    యె మగటిమి గాడు! సిక్సరు
    ల మగత కన్నుల సులువుగ లాగించు ‌కదా !


    జిలేబి

    ReplyDelete


  93. చంపకమాల పాదగర్భిత కందము :)


    అరె కుంబ్లె సుమా! వాడికి
    మరి క్రికెటు కనంగఁ గష్ట మగు క్రీడ యగున్?
    సురమౌని నారదా తెలు
    ప రాదకో మాకిపుడె సభాస్థలిని వెసన్ !


    ***

    అరె కుంబ్లె సుమా! వాడికి
    మరి క్రికెటు కనంగఁ గష్ట మగు క్రీడ యగున్?
    సురమౌని నారదా యనె
    డు రోచన జిలేబి తొరపడు తెలుపనిపుడే :)



    జిలేబి

    ReplyDelete


  94. కొసమెరుపుల సుశ్రీ మర
    ల సదనమున కొచ్చినారు లబ్జుగ కతలం
    దు సిదుగులను దోపి మన మ
    నసు మైకమ్ములనదె విడనాడ జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  95. చిలిపిగ నా దుప్పట్లో
    నలకల కొలికి గుస గుసల నడుమ వయారం
    బుల గీచి గీచి విడువక
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్



    నారదా!
    జిలేబి

    ReplyDelete


  96. ఇచ్చిన చంపకమాల పాదమెక్కడే జిలేబి‌ :)



    అలకల కొలికి జిలేబి క
    నులు పలికిన నిందలెల్లను సుభాషితముల్
    గలిగించు క్షేమమున్ జిలి
    బిలివోవు మధురిమలలర పిరియము తోడై !



    జిలేబి

    ReplyDelete


  97. పిలిచిన మాటలాడక గుభిల్లున తాకుచు పైరగాలి వా
    తులివలె మార్పునొందు! కనుదోయిని ద్రిప్పును వేగిరమ్ముగా
    జిలిబిలి వోవు వేళ! యిక చీల్చుచు గట్టిగ కత్తికోతలన్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్!


    జిలేబి

    ReplyDelete


  98. పురుగు టపా "కంబళి పూ
    చ్చి" రీతి గలదే! అరవపు జిలిబిలి చిత్రం
    బరరె జిలేబీయముగా
    పరికించగ వచ్చునిదిగొ వనితా లింకౌ :)

    https://susrihome.blogspot.com/2020/05/blog-post.html

    https://youtu.be/ltx11SO_Ftc


    జిలేబి

    ReplyDelete


  99. సాక్షాత్కారపు చింతన
    మోక్షార్థికి వలయు, మద్యమును చౌర్యంబున్
    సాక్షాత్తతనికి కీడౌ
    భిక్షార్థిగ నిలువ మేలు విశ్వపుని కెడన్


    జిలేబి

    ReplyDelete


  100. కోతి చేతికి చిక్కిన కొత్త పూమాల ఉత్పలమాల కందాట :)


    హముని సమాశ్వాసంబచ
    లము "మోక్షముఁ గోరువారలకు ముఖ్యము; చౌ
    ర్యము మద్యపానముల్" నీ
    మము తప్పుటయగు చెడును సమస్థితియె సుమీ


    జిలేబి

    ReplyDelete


  101. భిక్షము కోరగావలయు విశ్వపు డాతని ముంగిలిన్ సదా
    వీక్షణ మెప్పుడౌననుచు వేంకటనాథుని చూచు కార్యమే
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము; చౌర్యము మద్యపానముల్
    తీక్షణమైన కీడు నిడు త్రిప్పట జేర్చును జన్మజన్మలన్


    జిలేబి

    ReplyDelete


  102. మద్యమే ఎకానమీ నరుడా :)


    రక్షణ పరమాత్మయగున్
    మోక్షార్థికి; వలయు మద్యమును చౌర్యంబున్
    రక్షణగా ప్రభుతకు ! తను
    నైక్షవపు దుకాణముల జనాళికి తెరిచెన్ !



    జిలేబి

    ReplyDelete


  103. మద్యపు కిక్కు కన్నా కరెంటు బిల్లు టెక్కు ఎక్కువయి పోనాదిరో అన్నా !

    బిల్లొచ్చె కరెంట్ షాక్! మా
    కల్లో కూడ అనుకోని కాసుల బిల్లోయ్
    అల్లల్లాడిరి గా జను
    లెల్లరు జగనన్న! డబ్బు లే లేవయ్యా !


    జిలేబి

    ReplyDelete


  104. రక్తియె మేలు సదాశివ!
    భక్తుడు కన్నప్ప గాధ బాగుగ తెలిపెన్
    ముక్తిని గోరుట మూర్ఖత!
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ!


    జిలేబి

    ReplyDelete


  105. కందోత్పల :)


    అనుమానము వలదు! వచిం
    తును భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్
    జనులెల్లవారికిన్! భ
    క్తుని గాధల చదువు! రక్తి కొంతయు గలదే ?


    జిలేబి

    ReplyDelete


  106. వ్యక్తము! చెప్పెదన్ వినుము! ధ్యానము ధ్యానమటంచు మూఢులై
    ముక్తిని కోరు వారల ప్రమోదము చూచితివా? సదాశివా
    శక్తిని నిమ్మ నాకనుచు చాల ప్రలాపము లేను! చూడగా
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్!


    జిలేబి

    ReplyDelete


  107. Rs 20 lakh crore 10% of GDP package galloping ahead bharat !


    ఇరవై లక్షల కోట్ల స
    రి రొక్కము కరోన కడిది రివ్వున తొలగన్
    వరలంగ నాత్మ నిర్భర
    త రండి దేశపు పటిష్టతను పెంచుకొనన్


    జిలేబి

    బుధవారము షేరు బాజారు ఆకాశమునకు పోవునా :)



    జిలేబి

    ReplyDelete

  108. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము'
    ఈ పదాలతో ఛందస్సౌందర్యాన్ని తెలుపుతూ
    స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.



    చంపకమాల, జిలేబీ
    యింపగు మత్తేభమున్, మయిమరపు సుమ్మీ
    సొంపగు శార్దూలమ్మీ
    నుంపారెడు కందమందు నుత్పలమాలై!



    జిలేబి

    ReplyDelete


  109. ఓహో నిఫ్టీ గాలి లోన తేలుచుంటివే !

    ReplyDelete
    Replies
    1. మీరిట్లా సంబరపడినందుకే రెండ్రోజుల్లో నెలమీదకి వచ్చేసింది!

      Delete


  110. రామనామమెంతో రుచిరా

    తేటగీతి పాద గర్భిత కందము


    అరయగ రాముని నామ
    మ్మె రుచి, వలయు మనకనుచు సుమీ జన్నపుగా
    పరి, "త్రాగువాఁడె శిష్టుఁడ
    నిరి ధర్మవిదులు" జిలేబి నీవున్ గొనుమా!




    జిలేబి

    ReplyDelete


  111. కందోత్పల !

    ఉత్పల మాల పాద గర్భిత కందము


    సురుచిరము! రామనామమ
    డర "త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁజె
    ప్పిరి ధార్మికోత్తముల్" రం
    డి రాఘవుని కొలువ త్వరపడి సుజనులారా!





    జిలేబి

    ReplyDelete


  112. కలడు ప్రభువు మనుజులను ఖండితముగ
    లెక్క లడుగును శిక్షించి! లెస్సగాను
    కనుల తెరిపించెను, మనల కాచెను చెడు
    దారులం గొట్ట నేర్పె నాధ్యాత్మబోధ!



    జిలేబి

    ReplyDelete


  113. కందగీతి


    విను! చెడ్డ దారులం గొ
    ట్ట నేర్పె నాధ్యాత్మబోధ టవళిని వీడం
    గ నరులు సన్మార్గమ్మున
    మననము చేయగ ప్రభువును మనసావాచా!


    జిలేబి

    ReplyDelete


  114. చేరెన్ కూటమి కల్లరీడుల సదా చివ్వాడె దుర్మార్గుడై
    వారింపంగ హితుండు లేక లటుడై వాంఛించుచున్ దస్కమున్
    దారుల్ గొట్టుట నేర్చినాఁడు; విని యాధ్యాత్మప్రబోధమ్ములన్
    మారెన్ బుద్ధి మనస్సు లీనమయె రామాయంచు ధ్యానమ్ములో !


    జిలేబి

    ReplyDelete

  115. తేటగీతి


    కావు మమ్మ పెద్దమ్మ యీ కడిది యగు క
    రోన బారినుండి జనుల, రోయ కమ్మ
    పార్వతీ! విష్ణుపత్నివై భద్రమిడుము
    బొక్కసమునిండ ప్రభుతకు భూరిగాను!
    పలుకుజిలుకలకొల్కివి పాటి గాను
    నీవె మాకు సద్బుద్ధిని నీయవమ్మ!


    ***

    కందగీతి


    అపకరణచేసెను కరో
    న పెనుపడుచు! మాకు రక్షణవలయు పెద్ద
    మ్మ! పొసగుచు పార్వతీ! వి
    ష్ణుపత్ని వై భద్రమిడుము శుభముల నిమ్మా


    ***

    కందోత్పలం


    అవ! చూపుమమ్మ నాకిక
    సవ! పార్వతి వీవు! విష్ణుసతివై నను బ్రో
    వవె, సత్కృపామతిన్ పొ
    త్తువుగా సద్బుద్ధినిమ్మ తొలి పెద్దమ్మా!


    ***

    ఉత్పల మాల


    కర్వరి యందు సంభవము!కాలము పర్వుల బోయె వేగమై
    సర్వము నీవె నాకు, మనసా ప్రణతుల్! తొలి దొడ్డతల్లివై
    పార్వతి వీవు! విష్ణుసతివై నను బ్రోవవె! సత్కృపామతిన్
    గర్వము లేని జ్ఞానమును కబ్బము గా ప్రసరించవే సదా!



    జిలేబి

    ReplyDelete


  116. చంపకమాలా సమస్యకు కందపద్యము


    కందచంప


    క్రమముగ మారెను గా కా
    లము! "మనుజులు సంఘ జీవులను మాట యస
    త్యము గాదె చూచినన్" తమ
    తమ మొబయులులోన దూర్చి తలను గలరుగా !


    జిలేబి

    ReplyDelete


  117. కంద గీతి


    ప్రజలొకపుడొకరి కొకరై
    నిజముగ బతికిరి ! సమయము నీమములున్ మా
    రె జగమున మనుజు లను సం
    ఘజీవు లంచనుట కల్ల కంద జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  118. సీత నపహరించెనెవరు? చింత పడక
    నారు నెలలు నిదురపోయినట్టి వాడి
    తమ్ము డెవడోయి? రామయతండ్రి సూవె?
    రావణుఁడు; కుంభకర్ణుఁడు; రక్ష మనకు.


    జిలేబి

    ReplyDelete


  119. తావును వీడి సేవకులె ధాత్రిని బుట్టిరి లంకనేలుచున్
    చావును కోరి తెచ్చుకొని చచ్చిరి శ్రేష్ఠుని చేతిలో సుమా
    రావణ కుంభకర్ణులె; తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్
    పావను డాసనాతనియె! భారము వారిదె మానవా సదా

    జిలేబి

    ReplyDelete


  120. కందోత్పల


    హనుమా ! తిరుగుమికన్! ప్రబ
    లిన రావణ కుంభకర్ణులె తిరంబగు ర
    క్షణ నిచ్చు దైవముల్ మా
    కనుచున్ లంకిణి పలికెను కంద జిలేబీ



    జిలేబి

    ReplyDelete


  121. మనవడు నిదురలేచెను మా శంకరాభరణపు కామింట్లు మాలికలో గాయబయ్యెను ! సరిచేయుమయ్య మనవడా!


    మాలికలో కందివరుల
    మేలగు పద్యములకున్ కమింట్లకు తడక
    ట్టేల మనవడా ? రమ్మా
    హాలతు సరిచేయుమయ సహాయంబగునౌ!



    జిలేబి

    ReplyDelete


  122. మా మాలిక కల్నలు ఏకలింగము రంగములోకి‌దిగి స్ట్రిక్టుగా కత్తెర వేయుచుండు కరోనా వేళలో‌ :)


    మన ధైర్యమ్మును పెంచును
    హనుమంతుని జప, మిడుముల నందించుఁ గదా
    పనిలేక దారిని‌ చనుచు
    కనిపించిన బ్లాగు లెల్ల కామింట్లిడగా !




    జిలేబి

    ReplyDelete


  123. కనులాదైవమునే కనంగ వలయున్ కామేశ్వరీ! నేర్వగా
    మనసా! ధైర్యము హెచ్చు బుద్ధియునసామాన్యమ్ముగా గూడునా
    హనుమన్నామ జపానురక్తులకు, లభ్యంబౌను కష్టంబులే
    పనిలేకన్ కని పించు బ్లాగులను వెంపర్లాడి కామింట్లిడన్


    జిలేబి

    ReplyDelete


  124. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'పనిలేక' కళ. ద్రుతాంతం కాదు.


    కంది శంకరయ్య గారి మాట

    ReplyDelete


  125. యమునా తీరమున నడక
    ను మొదలు కొని హాయి హాయనుకొనుచు బోవం
    గ మొగదల దారి లో ఓ
    యమ! మహిషాగమనమున భయంపడఁ దగునా!


    మార్నింగు వాక్ వేళాయె :)

    జిలేబి

    ReplyDelete


  126. కందా చంప్స్ :)



    జగడము చేయను వరలుకొ
    నగ యమ, మహిషాగమంబున భయంబును బొం
    దఁగ నొప్పు నెవ్విధిన్ ము
    ద్దుగుమ్మ, పదపద జిలేబి దువ్వాడు పతిన్



    జిలేబి

    ReplyDelete


  127. అమరెను తాత రాతను భయానక దుర్భర జీవితమ్ము నీ
    సమరము తాళలేనిక ప్రశాంతత కావలె దీర్ఘనిద్రకై
    సమయము తక్కువాయె సఖి శ్వాసయు బోయెను‌ సన్నగాను నా
    యమ, మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్!



    జిలేబి

    ReplyDelete


  128. కరోనా హాలిడేస్ కందా చంప్స్ -


    అలుపెరుగక నాటల, గ్రే
    డుల "తప్పి పరీక్షలోఁ, గడు ముదంబున గం
    తులు వేసె ఛాత్రుఁడే" పి
    ల్లలెల్లరు కరోన తొర వలన ప్యాసనగా !


    జిలేబి

    ReplyDelete


  129. పిల్ల లెల్లరిక కరోన పీడ వలన
    ప్యాసనగ జిలేబీ, పదపడి సెలవున
    నలుపెరుగక నాటలు పాటలంచు గ్రేడు
    తప్పఁగఁ బరీక్ష, విద్యార్థి తాను మురిసె !


    జిలేబి

    ReplyDelete


  130. పీహెచ్డి స్టూడెంటు గాధ బాధ


    ముప్పది యేండ్లు పైబడెను ముద్దియ నొక్కతె కూడ చేరదే
    కప్పురగంధి వాసన నిఖార్సుగ దక్కదకో యటంచు, తా
    తప్పి పరీక్షలోఁ, గడు ముదంబున గంతులు వేసె ఛాత్రుఁడే
    కుప్పపు మేలుబంతియగు కోమలి స్కాలరు గాను చేరగా!



    జిలేబి

    ReplyDelete


  131. ఆదాము అవ్వ కతలను
    మోదము తో మందసానమునజోగుచు పి
    ల్లా!దా! విను! మాట వినక
    రోదించినఁ బిలిచెదను కరోనా బూచిన్!


    జిలేబి

    ReplyDelete


  132. రా! మాల్గాడియు కూతవెట్టి వెడలెన్ రా పొద్దుపోయేనుర
    మ్మా! మంచమ్మున తొంగుమా కతలతో మై కమ్మగా బుజ్జి! రా
    డ్రామాల్వేయకు! మంచిగానిదుర పోరా చంటి! లేదన్నచో,
    నా మాటల్ వినకుండ నేడ్చిన, కరోనా బూచినిం బిల్చెదన్!


    జిలేబి

    ReplyDelete


  133. యతిభంగము నొప్పుకొనమ
    జితుడైనన్ హరి యయినను శ్రీ చేర్చుట త
    ప్పు తడక యగు గణభంగమ
    గు తరము కాదోయి చెప్పె గురుడు జిలేబీ


    జిలేబి

    ReplyDelete

  134. చిత్రం సత్పుర వాసికి మల్లెలు నచ్చవా ? తప్పున్నర తప్పండోయ్ :)



    అల్లీ బిల్లీ అమ్మా
    యిల్లా రా పద పదండి యింతుల్లారా
    కల్లాకపటంబెరుగడు!
    మల్లె లనిన నాగరాజు మది రోసెఁ నయో?



    జిలేబి

    ReplyDelete


  135. సత్పుర వాసి నాగరాజు గారికి శుభాకాంక్షలతో


    అనుమానమువలదే పొడ
    గను! మల్లెల నాగరాజు గని! మానసమం
    దున రోసె నయ్య యో నే
    టి నూత్నమగు ప్రక్రియన్? ఘటికులు జిలేబీ !



    జిలేబి

    ReplyDelete


  136. భళ్ళున చేరు మా మదన పల్లియ పువ్వులు బెంగుళూరు! హా!
    కల్ల! జిలేబు లార ! పలుకాకులు లోకులు! గాలివార్త! ఆ
    మల్లెల, నాగరాజు గని మానసమందున రోసె నయ్యయో?
    చెల్లని మాట మీదనుచు చెప్పుట తప్పదు చక్కనమ్మలూ!


    జిలేబి

    ReplyDelete


  137. హింస కూడదనగ ముని హీనమనుకొ
    నుచు బతుకునరరె వదిలెను చరి వేట
    తనదు గాండ్రింపులనుకూడ తగ్గు చేసి
    సింహ మేనుంగు లకుఁ జిక్కెఁ జెడె య శమ్ము


    జిలేబి

    ReplyDelete


  138. రంగంపేట క్రాసు కాడి సింగము కత !


    రంగంపేట సివార్లలోన తిరుగాడంగా, భయోత్పాతులై
    రంగాస్వామిని వేడగా జనులు "సర్వంఖల్విదంబ్రహ్మ" పూ
    ర్ణంగా హింసను వీడ బోధనను నేర్పంగా పరివ్రాట్టు పొం
    గంగా ప్రేమయు మారె, మానుకొనెనా గాండ్రింపులన్ కూడ,నా
    సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్!




    రంగంపేట క్రాసెక్కుడుంది ? :)
    జిలేబి

    ReplyDelete


  139. ఏడు మల్లెపూలెత్తుల నెలతుకయె జి
    లేబి వలెవుండె రోయన్న! లెస్స లెస్స
    చూడ చూడ ముచ్చటగా ప్రచోదితమయె
    నయ్యరోమది ననలెత్తెనయ్య వేడి :)

    నారదా!

    జిలేబి

    ReplyDelete


  140. తండోప తండాలు గా వచ్చేవారు వరదా అని ! చూడ్దానికి సమయం లేక పోయె! ఒక్కడూ ఇప్పుడు రాడే!


    రావా! దేవా! మము కన
    రావా ! పడిగాపులు పడి రయ్యా భక్తుల్
    ఆ వరదుడిపుడు వేచెను
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతా దూషణ పర్వమె ,
      పంతులుగా రిట్టి దైవ పరిహాసములన్
      గంతులు విడకున్న భవిత
      చింతల వంతలను గూర్చు శ్రీవారి వగన్ .

      Delete
    2. పూరించు సమస్య రచన
      ఘోరంగా నుండ తగదు , కోరి పరములన్
      దూరు ప్రశంశ లేల ? మ
      రే రచనలు కానరావ కృత్యము లందున్ ?

      Delete
    3. // “ దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!” //

      రండి రండి, వెయిటింగ్ ఇక్కడ అంటూ పిలిచాడేమిటండీ ... “దేహీ యనెనే” అంటున్నారు?

      Delete


  141. కందోత్పల


    నియతులుగా వేచిరి వె
    న్కయ! దీవెన లిచ్చువాఁడె కడు దీనత దే
    హి యటంచు నిల్చె నేడయ!
    భయమున్ గొల్పెడు కరోన వలన కదయ్యా!



    జిలేబి

    ReplyDelete


  142. కావుము వేంకటేశ యని కన్నులు కాయలు కాయ వేచు వా
    రే! వరదా యటంచును నిరీక్షణ యే తమ గీటురాయిగా
    సేవకు లే పదండి యని చేరియు చేరక పూర్వమే వెసన్
    త్రోవను చూపుచున్ తరుము తొట్టువ గల్గిన దేవుడాతడే
    దీవెన లిచ్చువాఁడె, కడు దీనత దేహి యటంచు నిల్చెనే
    జీవిత మే కరోన సహజీవన మాయెను తాత రాతగా!



    జిలేబి

    ReplyDelete


  143. ఎవరో అంటూటేను :)


    కంగారు పడే వయసా ?
    రంగమ్ము‌న దిగ గల మగ రాయుడ రాజా
    అంగజుకేళిని తేల్చను
    పొంగుల క్షణకాలమే! ప్రబుద్ధుడ రాజా



    ReplyDelete


  144. బోడి జిలేబీ సొంపుల
    తోడు భళిర నాట్యమాడె దూకుడు తాళం
    బేడున! రికార్డు డాన్సుల
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్!


    జిలేబి

    ReplyDelete


  145. కందోత్పల

    కనులార్పక నాట్యపు పొల
    తిని చూడనిదానిఁ జూచితిని చూడకు మ
    న్నను దొంగచాటుగన్ కిసు
    కున నవ్వుచు చూచె నన్ను గువ్వల‌ చెన్నా


    జిలేబి

    ReplyDelete


  146. చూడగ చూడగాను తన‌ సొంపులె కిక్కును చేర్చెనయ్య! పూ
    బోడి రికార్డు డాన్సులను పూతలపట్టున కన్నులార్పకన్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్,
    వాడిగ నవ్వె జూచి నను పాటల కైపుల తో జిలేబియే


    సెన్సారు కత్తెర పడునా :)

    జిలేబి

    ReplyDelete


  147. వాడు సుమా లేడోయీ
    చూడకుమనఁ జూచినాఁడఁ ! జూడనిదానిన్
    లేడనుచు చెప్పు టేలా
    తోడు కలడతడు జిలేబి తొందర పడకే!


    నాస్తికత్వమేలా!నాస్తికత్వం మేలా ?


    జిలేబి

    ReplyDelete


  148. పాడెని మోసుకు నల్గురు
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    చూడ తెలిసె జీవితమే
    క్రీడ! బతుకు నాల్గు మూర్ల కీవాడ సుమీ


    వేదాంతం

    జిలేబి

    ReplyDelete


  149. వారుణీ కత :)


    వాడచట తాగె పూటుగ!
    చూడకుమనఁ జూచినాఁడఁ! జూడ నిదానిం
    చాడను కొంటి జిలేబీ
    వాడో పడె బోర్ల! త్రోవ పాన్పుగ మారెన్


    జిలేబి

    ReplyDelete


  150. వాడచట తాగె పూటుగ!
    చూడకుమనఁ జూచినాఁడఁ! జూడ, నిదానిం
    చాడను కొంటి జిలేబీ
    వాడో పడె బోర్ల! త్రోవ పాన్పుగ మారెన్


    జిలేబి

    ReplyDelete


  151. పిల్ల కుంక యేను వీధిని తిరుగాడు
    చదువు రానివాని చట్టు! సూరి
    పొసగ దయ్య నీకు పొంతము వాడితో,
    శంకరాభరణమె జట్టు నీకు!



    జిలేబి

    ReplyDelete


  152. ముదమారంగను భక్తిమార్గమున నామోక్షమ్ము సాధ్యమ్మగున్
    చదువే రాదను వానికిన్; సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగు
    న్మదమున్ వీడుచు వాని చెంత తన నానారీతి మార్గమ్ములన్
    పదిలంగానిక మూటగట్టి విసురున్ ప్రారబ్ధ‌ కర్మమ్మిదే!



    జిలేబి

    ReplyDelete


  153. చినిగి నట్టి కోటు జతను జిడ్డు ముఖము
    వాడు చూడగా కనబడు బక్క గాను
    కోటి రూప్యముల్ సమ కూర్చె మేటి పిట్ట
    ల దొర వేటలాడుచు సుమా లబ్జు గాను



    జిలేబి

    ReplyDelete


  154. కందోత్పల దలాలు స్ట్రీట్ పిచ్చుక :)


    అమరెను బజారులో న
    మ్ముమ! పిచ్చుక కోటిరూప్యముల వేగముగా
    సమకూర్చె నద్ది రా ఘన
    త, మన జిలేబమ్మదేను తర్ఫీదు సుమా !


    జిలేబి

    ReplyDelete


  155. ముచ్చట లాడె పల్కుచు ప్రమోదము చేర్చెను డిస్ని లాండులో
    మెచ్చి జనాళి కాసులను మేటగ చల్లిరి చూచి భేషుగా
    పిచ్చుక కోటిరూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా
    యిచ్చటి నేటి దండితన మించుక గొప్పగ చెప్పవచ్చు రా!



    జిలేబి

    ReplyDelete


  156. నో యూజ్ యెన్ని దఫాలు పిలిచినా రా రే :)



    అకటా! కష్టే ఫలి! వి
    న్నకోట నరసింహ! పిలచి నా నే నీహా
    రిక నా బండివరార్యుల
    నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో!



    జిలేబి

    ReplyDelete


  157. వయ్యారమ్ముగ భాస్కరార్య భళిరో బండన్న! ఓ విన్నకో
    టయ్యా! రండిటు చేయ పూరణల మిట్టాడంగ నీహారికా!
    కయ్యాలాడెద మీ ప్రకోష్టమున ఝంకారాల! బిల్వంగ నో
    రయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నేనౌననన్!



    జిలేబి

    ReplyDelete


  158. పకపక నవ్వుదురు జిలే
    బి!కందమా తేటగీతి వెలదుల వ్రాయం
    గ కదలి రండని బిల్వగ
    నొకఁడైనం బద్యరచన నొనరింపఁ డయో!


    జిలేబి

    ReplyDelete


  159. మీలో నిగూఢ నైపు
    ణ్యాలున్నాయండి చాల! నా మాట వినం
    డీ! లెస్సగ పద్యాలను
    బోలెడు వ్రాసి వెదజల్ల పోకందుకొనన్ !


    జిలేబి

    ReplyDelete
  160. ఏం, సమస్యాపూరణ చేయ రండని శ్యామలరావు గారిని, రాజారావు మాస్టారిని ఆహ్వానించలేదేం? మాకే ఎందుకు అంత అదృష్టం?

    ReplyDelete
    Replies

    1. వాళ్ళిద్దరూ ఉద్దండులండీ ! ఆడి విడిచిన వారు , తమకు తా మై యింకా ఆడుతున్న వారు :)

      మరేమో మీరూ మనమంతా ఆట నేర్చుకుంటున్న వారలము :) అందుకే అన్న మాట :)



      జిలేబి

      Delete
    2. శాయంగల ఘనులకె గద
      పాయక ఆహ్వాన మందు , వ్యవహార నుడుల్
      రాయు మము బోంట్లను సరకు
      జేయుదురె కవివృషభులు హసింతురు గాకన్ .

      Delete
    3. “ఇయ్యంగల అయ్యలకే గానీ అన్యులకేలా “ వంటి పద్యం ఎక్కడో ఎప్పుడో చదివినట్లు గుర్తు (ఎక్కడా అన్నది గానీ, పూర్తి పాఠం గానీ జ్ఞాపకం రావడం లేదు).

      అలా వుంది పైన రాజారావు మాస్టారు చెప్పినది. కానీ మేమేమీ అంత “ఘనులం” కాదు మాస్టారూ.

      Delete
    4. ఇయ్యగ లిప్పించంగల
      అయ్యలకే గాని మీస మన్యుల కేలా
      రొయ్యకు లేదా బారెడు -
      అని కవిచౌడప్ప పద్యం లెండి .

      Delete
    5. అదే అదే.
      ధన్యవాదాలు, రాజారావు మేస్టారూ.

      Delete

  161. సామాన్యుడినండీ యే
    దో మీ అభిమానమే కదూ నరసన్నా
    మా మీదలా కురిసెన
    య్యా!మాదేముంది ! పలుకులమ్మ చలువయే !



    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  162. బాగుందండి కవిత! మీ
    లో గూఢముగా కలదు కళోత్కంఠ! జిలే
    బీ గారేమో పిలిచా
    రే? గట్టిగ పద్యముల ఝరియు జొబ్బిల్లన్!



    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  163. ఆవల కలడనెడు విభుం
    డీ వల వలయమున బతికెడీ జీవి వెతల్
    కేవలముగ చూచు నేమో
    భావము గానముగ నెగడ బాధయె కల్గెన్!



    జిలేబి

    ReplyDelete


  164. కందోత్పల - ఆగప - తెడ్డు ఆంధ్తభారతి‌ ఉవాచ


    తపమున తోచె విభుడె యా
    గప! భా వము గానమై నెగడఁ బ్రా ణము ఱం
    పపుఁ గోఁతఁ బొందె "డింగరు
    డ!పరాత్పర కావుమయ కడయు నీవెనయా"


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భగవంతుడు తెడ్డయ్యెను
      డిగడిగ నగుబాటెరుగక డింగరుడయ్యెన్
      రగడల సమస్య ముంగిట
      జగనాధా!నీకు మూడె,జరభద్రంబో .

      Delete


    2. భగవంతుడ నామాత్ర
      మ్ముగా జనాళియు చనువుగ ముద్దుగుడిచెడా
      నగవులను తాళలేన
      య్య? గభాలు‌న పట్టనయ వయస్యా విడుతున్:)


      నారదా!
      జిలేబి

      Delete
    3. రగడేలరా వయస్యా !
      పగవారముగాదు , మనము పరమ హితుల మీ
      వగల సెగలు వలదు వలదు ,
      ద్విగుణీకృత స్నేహభావ స్వీ టిది గొనుమా !

      Delete


  165. కేవల మాతడే మనుపు! కిమ్మనకుండె గదా! జనాళికో
    కేవల మాయె జీవితము! కింకటచేసె కరోన ! చూడడే
    యావలి వాడు చూడడె ప్రయాస, వెతల్! తనలో నభద్రతా
    భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్!


    జిలేబి

    ReplyDelete