జై శ్రీరాం. జయ జయ శ్రీరాం.
-
* జై శ్రీరాం. జయ జయ శ్రీరాం*
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।*
*దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణఃహనుమాన్...
9 hours ago
జై శ్రీ రామ్.
ReplyDeleteఅందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికైనా అంతా రాముడిలా సక్షెస్ఫుల్ లీడర్ ఎలా అవ్వాలో నేర్చుకుంటారని ఆశిస్తాను.
ReplyDelete12 గంటల 44 నిమిషాలకు శంఖుస్థాపన అన్నారు. రాహుకాలంలో శంఖుస్థాపన చేయవచ్చా ?
ReplyDeleteరాహుకాలం నిజానికి సూర్యోదయ సమయాన్ని బట్టి మారుతుంది. తమిళులు రాహుకాలం పాటిస్తారు. తెలుగు వారి సంప్రదాయంలో రాహు కాలం పాటించటం లేదు. ఉత్తరదేశాచారంలో కూడా లేఋపోవచ్చును.
Deleteఅన్నట్లు. మరొక ముక్కు. శంకుస్థాపన అనాలండి శంకుస్థాపన కాదు.
Deleteశ్రీరాముని సన్నిధిలో రాహుకాలం, యమగండం, వర్జ్యఘడియ, అతికమాసం, మైల, సూతకం వంటి దోషాలేవీ చెల్లవు. రాం లల్లా విరాజమాన్ దివ్య దర్శనంతో సదరు దోషాలన్నీ పటాపంచలు అవుతాయి కనుక ఇబ్బందేమీ లేదు.
Deleteమరి ఇకేం! మూహుర్తాలు చూడాల్సిన పనిలేకుండా, రాముడి బొమ్మపెట్టుకోని పనులు మొదలెట్టండి. పూజలపేరుతో అయ్యోరికివాల్సిన డబ్బులు ఏ వృధ్దాశ్రమంకో ఇచ్చెయ్యండి.
Deleteఎవరు ఏది ఎలా చెయ్యాలో వాళ్ళకి తెలుసు. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేవాళ్లతో చెప్పించుకునే అవసరమూ, ఖర్మా లేదు.
Deleteమనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలు మనం పుట్టకుముందే అక్కడనుంచి వెల్లిపోయాయి. మనం మాత్రం ఇప్పుడక్కడే ఉన్నయని భ్రమపడి ముహూర్తాలు జాతకాలు చూసుకుంటున్నాం.
Deleteదీన్ని జ్ఞానం అంటారు. ఠాట్! జ్ఞానమంటే మాదే అంటే మాత్రం వేమన పద్యం ఒకటి గుర్తుచేసుకోని కాం అవ్వడమే!
Delete@Chiru DreamsAug 8, 2020, 12:14:00 PM
Deleteమనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలు మనం పుట్టకుముందే అక్కడనుంచి వెల్లిపోయాయి. మనం మాత్రం ఇప్పుడక్కడే ఉన్నయని భ్రమపడి ముహూర్తాలు జాతకాలు చూసుకుంటున్నాం.
hari.S.babu
తిధి నుంచి ముహూర్తాల వరకు గల కాలగణన్నానికి భూమి మీద నుంచి చూస్తే వాటి స్థానం అవి వెలువరించే కాంతి మనకు కనపడటం ముఖ్యం - అది జ్ఞానం!
గ్రహణ్ అసమయంలో రోకళ్ళు ఎందుకు నిలబడుతాయో తెలుసా!భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది activaeT కావ్డానికి సైతం సూర్యకాంతి అవసరం.ఈసారి గర్హణం అప్పుడు నువ్వు ప్రయోగం చేసినా ఈ విషయం తెలుస్తుంది.గ్రహణం యొక్క చీకటి ఆవరించ్క ముందూ గరాహ్ణం యొక్క చీకటి విడిపోయిన తర్వాతా నిలబడనిది గ్రహణ సమయంలోనే ఎందుకు నిలబడుతుందో ఇది కాక వేరే కారణం నువ్వు చెప్పగలిగితే అప్పుడు నీలో ఉన్నది జ్ఞానం అని అందరికీ తెలుస్తుంది.
చెప్పగలవా?
లేదంటే,నీ జ్ఞానం ఎంతో నిరూపిణుకోవడానికి మరొక ప్రశ్న వేస్తాను.జవాబు చెప్పి నీది జ్ఞానమో ట్రోలింగో నిరూపించుకోవడానికి నువ్వు సిద్ధమా?
విశ్వాన్ని గోళాకారం అని వూహించుకుంటే సుదూర తీరంలో దాదాపు గోళం పైకప్పు దగ్గిర ఉన్నట్టు అనేకమైన నక్షత్రాలు ఉంటాయి.ఈ తారల సమూహంలో సూర్యుడూ చంద్రుడూ 16 డిగ్రీల వెడల్పు ఉన్న పటకా వంటి నక్షత్ర సమూహంలో తిరుగుతున్నట్టు మనకి అనిపిస్తుంది.ఈ నక్షత్ర చక్రాన్నే మనవాళ్ళు రాశిచక్రం లేక శింశుమార చక్రం అన్నారు.ఈ శింశుమార చక్రం లోపల సూర్యుడు ఒక బిందువు నుంచి తిరిగి అదే బిందువుకి రావడానికి 365.1/4 రోజుల సమయం పడుతుంది.ఈ మార్గాన్ని ఋగ్వేదంలో 360 భాగాలు చేశారు.ఋగ్వేదం 1వ మండలం, 164వ అనువాకం,11వ శ్లోకంలో "ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరిధ్యామృతస్య ఆ పుత్రా అగ్నే మిధునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తత్స్థుః" అని ఉన్నది.సప్త శతాని వింశతి అంటే 720, అంటే పగలూ రాత్రుల జంటల్ని విడదీసి చెప్పారు కాబట్టి సగం చేస్తే 360 వస్తుంది కదా.వృత్తానికి ఉండే డిగ్రీలు కూడా 360 కదూ!ఇప్పుడు ఈ 360 అనే అంకెని 12తో భాగిస్తే 30 వస్తుంది, అవునా!తమాషా యేంటంటే ప్రతి రాశీ తన 30 డిగ్రీల గడిలో తను ఒదిగిపోవటం - వీళ్ళు చెప్పారని ఒదిగిపోయాయా, ఆ గళ్ళలో ఉన్నవాటినే వీళ్ళు పట్టించుకున్నారా!ఇలాగ చక్రాన్ని విడగొట్టాక మీరు భూమి నుంచి సూర్యుణ్ణి చూసే చూపుని ఒక గీతలా గీస్తే ఆ గీతనుంచి ముప్పయ్ డిగీల వెడల్పులో ఉన్న ఒక నక్షత్ర సమూహం గొర్రెలా కనపడితే దాన్ని మేషరాశి అన్నారు.ఆ తర్వాత వచ్చే 30 డిగీల భాగంలో ఎద్దులా కనిపిస్తే దాన్ని వృషభ రాశి అన్నారు.రాశిచక్రంలో మొదటిది మేషం చివరిది మీనం. వీటన్నిటినీ ఇలా గుర్తించాలంటే ఎంత సమయం పడుతుంది, ఆకాశాన్ని పట్టి పట్టి చూడటానికి ఎంత ఓపిక కావాలి, తల్చుకుంటేనే చిరాకు పుడుతుంది, అప్పటివాళ్ళు ఎట్లా చేశారు?ఎవడన్నా పనీ పాటా లేకుండా కూర్చుంటేనో పనిలోకి దిగకుండా కాలయాపన చేస్తుంటేనో మీనమేషాలు లెక్కపెడుతున్నాడంటారు - ఎంత తప్పండీ!
Deleteవాస్తవ యదార్ధం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తులా రాశిలో ప్రవేశించడం అయితే, సాపేక్ష యదార్ధం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ మేషరాశిలో ప్రవేశించడం అవుతుంది!అలా సూర్యుడు మార్చి 20, 21వ తేదీలలో మేషరాశి ఉన్న 30 డిగ్రీల గడిలోకి వచ్చి 30 రోజులు అదే రాశిలో ఉంటాడు.ఇది యెలా తెలుస్తుంది?385 రోజుల్లో 360 డిగ్రీలు తిరగడాన్ని బట్టి ఒక రోజుకి యెన్ని డిగ్రీలు కదుల్తాడు అని చూస్తే 0.98 వస్తుంది.దీన్ని పూర్ణాంకం చేస్తే 1 అవుతుంది, అలా 30 రోజులకి 30 డిగ్రీలు అవుతుంది కదా!సూర్యమాసాల్లో సూర్యుడు మేషరాశిలో ఉండే మాసాన్ని మేషమాసం అని అంటారు.ఒకప్పుడు ప్రపంచం మొత్తం భారతీయులు కనిపెట్టిన ఈ కాలమానాన్నే అనుసరించేది.దానికి సాక్ష్యం చూపిస్తాను చూడండి.మన ఉగాది మార్చి నెలలోనే వస్తుంది ఇప్పటికీ. ఇదే మార్చి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తం మొదటి నెలగా ఉండేది.దానికి బలమైన సాక్ష్యం ఇప్పుడు మనం వాడుతున్న గ్రిగెరియన్ క్యాలేండరులోనే మార్చి నుంచి ఆగష్టు ఆరవ నెల కావడమే!ఆగష్టు తర్వాతి నెలకి వచ్చిన సెప్టెంబర్ సప్తమం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం.అదే వరసలో అక్టోబర్ అనేది అష్టమం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం, నవంబర్ అనేది నవం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం, డిసెంబర్ అనేది దశం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం.అంధయుగం తర్వాత కాబోలు, మొదట మార్చి నుంచి డెసెంబర్ వరకు గల పది నెలల్తోనే కొంతకాలం తంటాలు పడీ పడీ విసుగెత్తి పోయి చివర్న జనవరి ఫిబ్రవరిల్ని కలిపి మళ్ళీ వాటిని ముందుకు చేర్చి ఎన్నో కప్పల తక్కెడ యవ్వారాలు చేశాక గానీ వాళ్ళ క్యాలెండరు ఇప్పటి దారికి రాలేదు. మొదటి ఆరు నెలల్లో రెండు నెలల పేర్లని ఇద్దరు రాజులు వాళ్ళ పేర్ల మీద ఫిరాయించుకున్నారు.సూర్యుడు 360 డిగ్రీల్ని తిరగటానికి 365 రోజుల మీద 1/4 రోజు పడుతుంది కదా, దాన్ని లెక్కలోకి తీసుకోకపోతే కొన్ని వలయాల తర్వాత ఆ మాసాల పేర్లకీ ఆయా సమయాల్లో చెయ్యాల్సిన పనులకీ తేడా వచ్చేస్తుంది కాబట్టి మనవాళ్ళు అధికమాసం, క్షయమాసం వేసినట్టు కొన్ని నెలలకి 31 రోజులు వేసి నాలుగేళ్ళకొకసారి చివరిదైన ఫిబ్రవరికి ఒక రోజును కలిపేసి "హమ్మయ్య!" అనుకున్నారు.మీరు గ్రెగేరియన్ క్యాలెండరు నెలల పేర్ల చరిత్ర గురించి ఏదో ఒక ఎన్సైక్లోపెడియా చూస్తే చాలు ఈ కీలకం తెలుస్తుంది.
అంతారామమయం , జగ
ReplyDeleteమంతారామమయము , మనసంతా అతడే ,
వింతగ ఆరామునికే
పంతపు పట్టాభిషేక పనిమొదలయ్యెన్ .
నీహారిక గారు,
ReplyDeleteఇటువంటి విషయాల్లో నాకు ప్రవేశం లేదు గానీండి ఈనాటి అయోధ్య రామమందిరం భూమి పూజ కోసం "అభిజిత్ ముహూర్తం" ని తీసుకున్నట్లున్నారు (అని నాకు తోస్తోంది). అది అన్ని దోషాలకూ అతీతమైన శ్రేష్టమైన ముహూర్తం అని అంటారు. వీలయితే ఈక్రిందనిచ్చిన రెండు లింకులు చూడండి.
అభిజిత్ ముహూర్తం
అయోధ్య రామమందిరం భూమి పూజ ముహూర్తం
అభిజిన్ముహుర్తం సర్వోత్తమం, ఆముహూర్తం సమస్త పంచాగదోషాలనూ హరించి శుభం కలిగిస్తుంది. ఏప్రాంతంలో అయినా అక్కడ ఆరోజున సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయమే అభిజిత్తు. Local noon time అన్నమాట.
DeleteAccording to Hindu mythology, Abhijit Muhurta has the blessings of Lord Vishnu who with the help of Sudarshan Chakra removed many Doshas during the Abhijit Muhurta. Lord Rama, the seventh Avatar of Lord Vishnu took birth in Abhijit Muhurta.However Abhijit Muhurta is not considered good on wednesdays.
DeleteVNR sir,
Deleteమీరు ఇచ్చిన లింక్ లోనే వ్రాసి ఉంది కదా ? మిట్టమధ్యాహ్నం మంచి ముహూర్తమే కావచ్చు రాహు కాలం లోనె బుధవారమే పెట్టారు.
అవునండీ, పాయింట్ బాగానే పట్టుకున్నారు నీహారిక గారు.
ReplyDeleteఆ మినహాయింపేమిటో కాస్త వివరించమని శ్యామలరావు గారికి మనవి. థాంక్స్.
శ్యామలరావు గారు, పైన నేనడిగింది బుధవారం గురించి.
ReplyDeleteనీహారిక గారు,
ReplyDeleteఅయోధ్య ముహూర్తం గురించి “ఆలోచనా తరంగాలు” బ్లాగులోని ఇవాళ్టి ఈ తాజా పోస్ట్ 👇 చూడండి.
http://www.teluguyogi.net/2020/08/blog-post_3.html?m=1
అదన్నమాట సంగతి.
ఇక మీరడిగిన బుధవారం నాడు అభిజిత్ ముహూర్తం గురించి వివరణ కోసం శ్యామలరావు గారిని ఆల్రెడీ కోరడం జరిగింది కదా, మరి వారేమంటారో చూద్దాం.
వారు వ్రాసింది చదివాను నరసింహారావు గారు. రాహుకాలంలో అడుగుతీసి అడుగుపెట్టవద్దు అని అంటారు. ఆయనేమో రాహువు ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడంటారు. రాహు కాలంలో రాహువు ఉఛ్ఛ స్థితిలో ఉంటే ఇంకా గోల చేస్తాడు కదా ?
Deleteఅంతా అయో(రామ)మయం ....ఈ జగమంతా రాహు(ల్)మయం !
// “ ఈ జగమంతా రాహు(ల్)మయం !” //
Deleteహ్హ హ్హ హ్హ, కానీ మధ్యలో రాహులుడెందుకు, పాపం?
అయినా నిన్న శ్యామలరావు గారు చెప్పినట్లు రాహుకాలం పట్టింపు మనకు లేదండీ. ఉన్నవి చాలును 🙂.
అభిజిత్తు అనే ముహూర్తం బుధవారానికి ఎందుకు వర్తించదూ? నాకూ ఆశ్చర్యంగానే ఉందండి. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలి నేను కూడా. ప్రయత్నిస్తాను.
Deleteముహూర్తాల్దేముందండీ. దేవుడు సృష్టించినవన్నీ మంచికే అనుకుంటే పోలా!
Delete@శ్యామలీయం:
ReplyDelete"Local noon time అన్నమాట"
గురువు గారూ, సందేహనివృత్తి కోసం:
భారతీయ కాలమానం గ్రీన్విచ్ కంటే ఐదున్నర ఘంటలు ముందు లొంగిట్యూడ్ 82.5E (అనగా ప్రయాగ పరిసరాలు) ప్రకారం ఉంటుంది. అయోధ్య ఈ రేఖకు షుమారు 0.3 డిగ్రీలు (~ 82.2E) వెనక ఉంది. 15 డిగ్రీలకు ఘంట చప్పున లెక్కేస్తే అయోధ్యలో నిజ ఖగోళ సమయం భారతీయ కాలమానానికి ఒకటిరెండు నిముషాలు మాత్రమే తక్కువ.
ప్రతిపాదిత రాం లల్లా భవ్యమందిర భూమిపూజ ముహూర్తం ప్రయాగ సమయం ప్రకారం 12:44, స్థానిక నిజ మధ్యాహ్నం కాదు.
PS: నాకు మహూర్తంతో పేచీ లేదు. కాలమానాల నిర్ధారణ గురించి తెలుసుకుందామనే నా కుతూహలం.
ముహూర్తం అంటే ఒక ఖచ్చితమైన సమయబిందువు కాదండీ. మూహూర్తం ఒక కాలప్రమాణం. సదరు బిందువు నుండి ఒక ఘడియ అటూ-ఇటూ కలిపి ఒక ముహూర్తం అంటారు. అంటే ముహూర్తం అన్నది 48ని॥ వ్యవధి అన్నమాట. సాధారణంగా ఆబిందు సమయాన్ని సుమూహూర్తం అంటారు. అంటే ప్రాదేశికనిజమధ్యాహ్నసమయానికి 24ముందు నుండి 48నిముషాల పర్యంతం అభిజిన్ముహూర్తం.
Deleteఅయితే ఈ లెక్కలో 11:36 AM-12:24 PM సుమూహూర్తం అవుతుందా సార్.Thanks for the info.
Deleteగురువుగారూ నాకో అనుమానం. పంచాంగంలో రాసే దుర్ముహూర్తం, వర్జ్యం లాంటివి వేరే టైం జోన్ లో ఉండేవాళ్ళు ఎలా చూడాలి? ఉదాహరణకి 9 గంటలకి వర్జ్యం మొదలైతే, ఇంగ్లాండు వారూ ఆస్ట్రేలియా వారూ తమ ప్రాంతీయ సమయం 9కి మొదలైనట్లే భావించాలా లేక భారత దేశంలో 9కాబట్టి ఇంగ్లాండులో 3:30, ఆస్ట్రేలియా లో 14:30 అనుకోవాలా?
Delete
ReplyDeleteఇక్కడ ఏమీ తేలినట్లు లేదు :)
దేవుడు సృష్టించినవన్నీ మంచివే!
ReplyDeleteఅతడే సర్వాంతర్యా
ReplyDeleteమతడే పరమేశ్వరుండు , మహికిన్ సృష్టి
స్థితి లయకారకు డతడే,
అతనికి 🧐మేధావి🤔 ముహూర్త మందించె కడున్
అతడే సర్వాంతర్యా
ReplyDeleteమతడే పరమేశ్వరుండు , మహికిన్ సృష్టి
స్థితి లయకారకు డతడే,
అతనికి 🧐మేధావి🤔 ముహూర్త మందించె కడున్