Wednesday, August 12, 2020

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో

 


కన్నా! 


మాస్క్ వేసుకుని 


వెళ్లరా


బుద్ధిమంతుడివిగదా 


నా మాట వినరా 



శ్రీకృష్ణాష్టమి

శుభాకాంక్షలతో



జిలేబి








31 comments:

  1. పూతన నే గడగడ లాడించినాను తల్లి
    కంసునినే ముప్పు తిప్పలు పెట్టి తిని కదమ్మ
    దేవకి నందనుడికి ధీటుగా ఏది సరికాదని తెలుసుగదా
    నీ చెంత ఉంటూనే ముల్లోకాలు ముమ్మారు తిరిగి వచ్చెదా
    మ్యాస్క్, శ్యానిటైజర్, పీపీఈ, ఎస్పిఓటు పల్స్ ఆక్సిమీటర్ కిట్,థర్మామీటర్
    కొవాక్సిన్, మొడెర్నా, అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫొర్డ్, సినోవ్యాక్, స్పుత్నిక్, ఫావిపిరావిర్, రెమెడెసెవిర్

    శ్రీ రాధిక కృష్ణ

    ReplyDelete
  2. అదే తల్లి మనసంటే

    ReplyDelete
  3. మాకోడలు నిద్రోవగ
    నీకొడుకొక పిడక దెచ్చి నెలతమూతికిన్
    చేకొనిగట్టెను మాస్కట!
    కేకలుబెట్టంగ నగెను కృష్ణుడు తగునా ?





    ReplyDelete


  4. బుచికి ప్రశ్న


    దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
    ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌ ఇతిమే నిశ్చితా మతిః" -ఈ వాక్యంలో ద్వైత , విశిష్టాద్వైత, అద్వైత మతముల సారం ఇమిడి ఉన్నది. ఇంతకుమించి వివరణ ఎవరూ చెప్పలేరు, అంత గొప్ప వాక్యంగా తోస్తుంది. ఈ వాక్య రచయిత ఎవరు? చెప్పగలరు.


    ఎవరో తెలియక పోతే మన క్రెడిట్ లో వేసేసుకోవచ్చు :)



    జవాబు

    నేనే‌.


    జిలేబి

    ReplyDelete
  5. నాగసాధువు అవతారం ఎత్తే విధివిధానంబెట్టిది, “జిలేబి” గారూ? ఎనీ అవుడియా? జాన్-కారీ? తెలిస్తే చెప్పగలరు. థాంక్స్. 🙂

    ReplyDelete
    Replies
    1. జిలేబి అవతారం ఎత్తే విధానం అడిగితే చెప్తారు.

      Delete
    2. జిల్ జిల్.. ..எபி எபி
      அன்போடு பக்தி *జి*ర్ణించుకునే కందము*ల్* *ఏ*కధాటిగా *బి*గపట్టి భక్తితో యుక్తితో రచించు వారే బహుశ *జిలేబి* నిర్వచనమేమో.. சிறிய உதவி சிலெபி பிசிலெ அம்மண்

      Delete
    3. నాకు అనుమానమే, బోనగిరి గారూ. తన అసలు పేరే చెప్పని మహానుభావులు ఇంత పెద్ద రహస్యం వెల్లడి చేస్తారా ?

      Delete


    4. ఎంత చక్కగా విశ్లేషించారండి!!

      చక్కని అనుమానం, ఆసాంతం ఒకే శృతి..

      నా గురించి నాకే కొత్తగా అనిపించింది మీ వ్యాఖ్య లో..




      థాంక్యూ వెరీమచ్..



      జిలేబి :)

      Delete
    5. మీరనేది శ్రీధర్ భూక్యా గురించా నా గురించా, “జిలేబి” గారూ?

      Delete
    6. ఆహా జిల్ జిల్ సారూ !
      ఓహో తమగొప్పతనము లొహటా రెండా?
      సాహోయనె గురుదేవుడు ,
      బాహాటముజేసిరెపుడొ పండితులంతా .

      Delete
    7. మన భక్తి ఎలా ఉంటే అమ్మవారి కటాక్షం అలా దొరుకుతుంది.

      Delete


    8. అమ్మ వారి గురించే నేనూ ఆలోచిస్తున్నానండీ. తరచూ కటాక్షించాల్సిన పరిస్థితులే వస్తున్నాయి. ధన్యవాదాలు నీహారిక గారూ


      జిలేబి

      Delete
    9. “నెమలికన్ను” మురళి గారి మాటలు అయింది. ఇప్పుడు ఇక “కొత్తావకాయ” గారి మాటలా? మీ paraphrasing లు ఆపరా, “జిలేబి” గారు?

      Delete

    10. హలో వినరా గారూ, ఎంతమాట ఎంతమాట ... !!
      hope all of you are doing fine.
      నేను వారి కామింట్లు చూళ్ళేదండి. మాలిక లో
      ఉంది కదా, కనబడిందండి. thanks for the visit.
      keep coming simham ji ... :



      జిలేబి

      Delete
    11. ఓహో, ఇది బండి రావు గారి (nmrao bandi) కామెంట్ ఫక్కీయా? You are incorrigible అండీ, “జిలేబి” గారూ.

      Delete


    12. అంతే కాదండీ. మనమంతా వేలూ భాగాలుగా వరుస కమింట్లతోనే నడపించాలంటే జిలేబులంతా వ్యాసుణ్ణి మించి ప్రతిభావంతులే కావాలి కదా. చెత్తపేర్చుకుంటూ పోవడం సులువు మరి. ఈడ్చుకుంటూ నడిచే వరుస వ్యాఖ్యలు కాస్తా మూల పడిపోతే ఉన్నదున్నట్లు ఒకటి రెండు కమింట్లతో టపా ఢాంమ్మని పేలి ముగుస్తుంది.



      జిలేబి

      Delete
    13. ఏదో సరికొత్త🧐ప్రయో
      గాదికి సమకట్టినట్లు కనుపట్టెడు, ఈ
      బాదుడుకు😀 తట్టుకోగల
      మాదిరి పండితులు గలర? మాకది డౌటే 🤔


      Delete


    14. వినరా వారువాచ


      ఇప్పుడు శ్యామలరావు గారి కామెంట్ మీద పేరడీ వంతా? Carry on, Jeeves అన్నట్లు Carry on, “జిలేబి” గారూ మీకు అడ్డేముంది।



      Delete
    15. వినరా గారు,
      అమ్మవారిని వచనంలో కమెంట్స్ వ్రాయమంటే అందరినీ కలిపి వాయగొడుతున్నారు.
      జిలేబీ మరీ చిలిపి.

      Delete


    16. వార్ని జిలేబిగ వ్యక్తమగుచు తాను
      రచియించు బాపురె రమణ మీర
      భళి కొట్టుకొచ్చి యా వ్యాఖ్యల మార్చుచు
      కాచి రక్షించు ప్రకటమవంగ
      జాలమ్మున పరుగులిడుచు వృష్టిని చేర్చు
      పట్టున ప్రళయ తాపములయందు
      వారు వీరని తలవక వడి జాము‌న
      సర్వము తానయి చాటిచెప్పు


      గిచ్చి గిచ్చి జనుల గిరగిరా భళి త్రిప్పు
      వేద వేద్యు లరసి వేడు నపుడు
      చిట్టి చిలక వలెను చేరు జిలేబిగ
      ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు



      జిలేబి

      Delete
    17. చిలిపా ఇంకేమన్నానా? “జిలేబి” గారికి స్వంతంగా వచనంలో వ్రాయడం అలవాటు తప్పిపోయినట్లుంది, నీహారిక గారూ ?

      Delete
    18. చూ”షా”రా నీహారిక గారూ, మీరు నేనూ అనుకున్నట్లే “జిలేబి” గారు మళ్ళీ పద్యంలోకి మారిపోయారు 🙂🙂.

      Delete

    19. ఆ పద్యంబెవరిది? రా
      జా పాటవపు టడుగుల్ సజావుగ గలదే !
      చూపుల్ద్రిప్పుచు చూడం
      గా పేరడికై జిలేబి కైబడె నకటా:)



      జిలేబి :)

      Delete
    20. అయోమయ నివృత్తి.. ఇంతకు ఈ జిల్ జిల్ జిల్ జిల్ జిలే బిరా జారా ణియెవ రనే దిమి స్టరిగా నేమి గిలి పోతుంది కా బోలో!

      వేపాకు కషాయమే అందరికి..!
      ఇమ్యూనిటి పెంచుకోవాలని.. అసలికే అదేదో మ్యుటేట్ అవుతు మలేషియ లో D614G SARS n Cov 2 version 2, Power: (CoViD-19)^10. హెచ్చరికలు జారి ఔతున్నాయట..

      https://m.timesofindia.com/life-style/health-fitness/health-news/malaysian-scientists-discover-ten-times-deadlier-coronavirus-strain-making-it-more-infectious-heres-what-it-means/photostory/77586987.cms

      Delete
  6. హా, తెలిసెన్.
    “జిలేబి” గారు, పైన మీ వ్యాఖ్య “హర్షణీయం” బ్లాగులో “నెమలికన్ను”
    మురళి గారి వ్యాఖ్యకు paraphrasing కదా? చతురులండీ మీరు.

    ReplyDelete
  7. ఏమిటో!
    కామెంట్లకి కూడ పేరడీలే, జిలేబి మాయ.

    ReplyDelete
  8. హిందువులకి,వైదిక ధర్మానుయాయులకి ఒక శుభవార్త!

    రేపు, అనగా గ్రెగరియన్ క్యాలండర్ ప్రకారం ఆగస్ట్ 19వ తేదీ ఉదయం నుంచి భాగ్యనగర యజ్ఞం పేరున హైదరాబాదులో హైందవధర్మ వైభవ పతాకం యొక్క విహరణ మొదలు కాబోతున్నది.

    ఇదే సమయంలో నేను మొదట సంకల్పించిన రాజమండ్రిలో కూడా దివ్యజ్ఞాన సమాజం వారు తమ సంస్థ తరపున చాలా పెద్ద స్థాయిలో యజ్ఞం చేస్తున్నారు.దీనివల్ల ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటువైపున ఉన్న తెలంగాణ లోని రామగుండం ప్రాంతీయులకీ ఇటువైపున ఉన్న కృష్ణా జిల్లా వాసులకీ కూడా మేలు జరుగుతుంది.

    మంధని/మంథెన నగరంలో కూడా కొందరు స్థానికులు ఇదే లక్ష్యంతో యజ్ఞం మొదలుపెట్టారు.

    ప్రస్తుతం భాగ్యనగర యజ్ఞం రేపటి నుంచి ఆరు చోట్ల మొదలవుతుంది. అక్కడ వలంటీర్లూ స్థానికులూ తమ సొంత ఖర్చులతో చేస్తున్నారు.మిగిలిన చోట్ల కూడా ఎక్కడ వీలయితే అక్కడ స్థానికులు తమ సొంత ఖర్చులతో నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ మనలాంటివారినుంచి విరాళాల సేకరణ అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకించి తాత్కాలికమైన కొత్త అక్కవుంట్ క్రియేట్ చెయ్యాలా ఇప్పటికే ఇలాంటి వ్య్వహారాల కోసం క్రియేట్ చేసి ఉంచిన అక్కవుంటుని వాడితే సరిపోతుందా అనేది ఒక చిన్న సమస్య.అది తేలగానే ఆ అక్కవుంట్ నాకు తెలుస్తుంది,దాన్ని ఇక్కడ ఉంచుతాను.ఎంత మొత్తం ఇచ్చాం అనేది ముఖ్యం కాదు, ఎంతో కొంత ఇచ్చామా లేదా అనేది ముఖ్యం!

    మొత్తానికి ఈ మూడు చోట్ల నలభై రోజుల పాటు జరిగే యజ్ఞాల వల్ల తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కరోనా లాక్ డౌన్ సమస్యల నుంచి బయటపడి ఇదివరకటి నిర్భయత్వాన్ని అనుభవించవచ్చును.రాయల సీమ నుంచి కూడా దివ్యజ్ఞాన సమాజం లాంటి సంస్థలు గానీ హిందూమతాభిమానులు గానీ ముందుకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రపంచానికి ఒక దారిని చూపించినట్టు అవుతుంది.

    చరిత్రను జల్లెడ పట్టి చూస్తే వేదం చెప్పిన యజ్ఞం నడుస్తున్నప్పుడు హిందూమతం ప్రపంచం మొత్తానికి వ్యాపించి యజ్ఞానికి దూరం అయిన నాటినుంచి కుంచించుకుపోయి స్వస్థానంలో కూడా పరాధీనతకు గురి కావడం యదార్ధం అని తెలుస్తుంది.అది బోధపడితే ఇప్పుడు యజన యాజనాలు ప్రారంభం అయితే మరోసారి వైదికధర్మం ప్రపంచవ్యాప్తం కావడం తధ్యం అనేది కూడా యదార్ధం అని తెలుస్తుంది.

    శ్యామలీయం లాంటి సాధుసజ్జనుల ధోరణి చాలా బాధ కలిగిస్తున్నది నాకు.గతంలో ఇదే చోట హిందువులకి సమాచారం అందించడం కోసం కామెంటు పెడితే ఇలాంటి విషయాలు మీ బ్లాగులో వేసుకోండి, ఇక్కడెవరికీ ఆసక్తి లేదు, మీ కామెంట్లు అస్థాన పతితాలు అని ఏవేవో దుర్వ్యాఖ్యలు చేశారు.

    మోడరేషన్ ఉండి కూడా బ్లాగరు ప్రచురించారు అంటే బ్లాగరుకి ఆసక్తి ఉంది అనే కదా అర్ధం, మరి ఆయన ఎవరికీ ఆసక్తి లేదని అనడం ఏమిటో!నేను ఆశించినది హిందువుల నుచి ప్రోత్సాహం.నా విన్నపానికీ ఆ కార్యక్రమానికీ ఆయన సుముఖమా విముఖమా అనేది నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.ఒక హిందువు సాటి హిందువులకి ఒక కార్యక్రమం గురించిన సమాచారం హిందువుల బ్లాగుల్లోనే ఇస్తే ఆయన నన్ను మీరిలాంటి కామెంట్లు ఎక్కడ బడితే అక్కడ వెయ్యకండని అనడం ఏమిటో,అయితే గియితే మీ బ్లాగులో వేసుకోండని దురుసుతనం చూపించడం ఏమిటో ఇప్పటికీ అర్ధం కావడం లేదు నాకు!

    ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలవుతున్నది.మరి,ఈ కార్యక్రమం పట్ల ఆసక్తిని చూపించి తన వంతు ప్రోత్సాహం ఇస్తారా?లేక మళ్ళీ అస్థాన పతితాలు అంటూ మరోసారి నన్ను విమర్శిస్తారా!

    P. S: చిరు డ్రేంస్ లాంటి నీచులు తమ విత్తాన్ని గానీ చిత్తాన్ని గానీ కొంచెం కూడా ఖర్చు చెయ్యనక్కర లేదు.ఇది హిందువుల సొంత వ్యవహారం.వేదాల్లో గోమాంసభక్షణ చెయ్యొచ్చని ఉందని అబద్ధాలు చెప్పిన అధముడు "నీకు డబ్బులు చాలట్లేదేమో నేనిస్తాను, చేసుకో, పాపం!" అని పిలవని పేరంటపు అసందర్భపు సుత్తి వెయ్యడం వొంటికి పట్టిన కొవ్వు వల్ల నోటినుంచి బయటికి వచ్చే అశుద్ధం అని తెలుసుకోకపోవడానికి హిందువులు గొర్రెలు కారు.అలాంటివాళ్ళు ఎంత విషం కక్కినప్పటికీ యజ్ఞం వల్ల కలిగే సత్ఫలితం వాళ్ళనీ చేరుతుంది.అదే వేదం యొక్క గొప్పతనం!

    ReplyDelete
  9. Here if you can follow the video up-to the end, you will get the URL to know all the details about raajamandri yajnam
    https://youtu.be/C_oMq7eVSSI

    ReplyDelete