మలయాళమా లేక మళయాళమా ఏది సరి ? లేక రెండూ సరియేనా ?
ఈ మధ్య ంంంంంంంంంంంం
"నాతో నేను నాగుర్ంచి" అనే బ్లాగులో ఓ తెలుగు సినిమా "పూర్తి నిడివి మళయాళ సినిమా" అంటే వినరా వారు "గయ్యిమని" లేచేరు -
"జిలేబి” గారు,
ఆ భాష పేరు “మ..ల..యా..ళం” అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా “మ..ళ..యా..ళం” అనే వ్రాస్తారేమిటి? మీరు గానీ “సీతయ్య” / సీతమ్మ బాపతా? మా నాయర్, మేనన్ స్నేహితులకు చెబుతానుండండి "రెండు రకాలుగానూ పలకవచ్చు పకృతి వికృతి రూపాలు అన్నట్లుగా అని ఉందండీ ఆంధ్రభారతి నిఘంటువులో"
అన్నారు.
దానికి మళ్లీ వినరా వారు
వేణూశ్రీకాంత్ గారు,
ఈ విషయమై కేరళలోని నా మలయాళ స్నేహితులను ఇప్పుడే సంప్రదించాను. మలయాళం (മലയാളം రెండవ అక్షరాన్ని గమనించండి) అనడమే కరక్టని చెప్పారు వారంతా. “మళయాళం” (മളയാളം) అని కూడా అనవచ్చా అని అడిగితే ఒప్పుకోలేదు .... వ్రాత లోనైనా సరే, పలుకు లోనైనా సరే.
పోనివ్వండి, మన ఆంధ్రభారతి రెండూ సరైనవే అంటోంది అంటున్నారుగా, అలాక్కానివ్వండి. ఇందులో పెద్ద ముంచుకు పోయేదేముంది."
అన్నారు
దానికి బదులుగా జిలేబి వారి జవాబు :)
"మలయాళమే సరి
అప్పుతచ్చాయ నమః
మలయ + అళము -మలయ పర్వతము + సముద్రపు ప్రదేశము కల దేశము అక్కడి భాష
ఓ సారి మీ మిత్రులను వినరా వారు కనుక్కుంటారా ఈ వివరణ సరియేనా అని ?"
ఇంతకీ ఈ మలయాళము లో యాళమనగానేమి ?
కొంటెప్రశ్నలు వెయ్యడంలో మిమ్మల్ని మించినవారు ఎవరు లెండి?
ReplyDeleteనా మలయాళ భాషా పరిజ్ఞానం అసలే అంతంత మాత్రం, పైగా అక్కడి నుండి వచ్చేసి ఎన్నో యేండ్లు గతించి పోవడం మూలాన మరీ బూజు పట్టేసింది 😗.
మలయాళ మిత్రులను అడిగేదేముంది లెండి, వాళ్ళు మామూలుగా మాట్లాడితేనే "ల" కాస్తా "ళ" లాగా పలుకుతారు (తమ భాష పేరు తప్ప) 😀. మీకోసం "మణిప్రవాళం", "సంగం" కాలం నాటి నుండీ పరిణామక్రమO వెదుకుదామనుకున్నాను కానీ అబ్బో మహా బృహత్కార్యం అనిపించింది. ప్రామాణికంగా ఉంటుందని మలయాళ మహాకవి ఉల్లూరు పరమేశ్వర అయ్యర్ గారు (19th - 20th Centuries) ఎక్కడన్నా వివరించారేమోనని కాసేపు వెదికాను కానీ నా వల్ల కాలేదు.
అయినా ఈ ప్రయాస అంతా మనకేల? కేరళ ప్రభుత్వ కల్చరల్ వ్యవహారాల శాఖ వారి వెబ్-సైట్లో ఇచ్చిన ఈ వివరణతో simple గా సరిపెట్టుకుందాం (ఇది కూడా ప్రామాణికమే అనుకుందాం 😉) ... ఈ క్రింది లింక్ చూడండి.
btw, ఆ పదం మల (= కొండ) + ఆళం (= ప్రాంతం) అనేదే జనాభిప్రాయం లాగా కనిపిస్తోంది ... మీరు నారదుడిని ఆవాహన చేస్తూ ఎన్ని permutations & combinations వేసినప్పటికిన్నూ 😄. కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం 👍😉.
Etymology of the word Malayalam
http://www.keralaculture.org/malayalam-language/547
മലയാളം: അദി മലയാലം അയിതേ കാദു ജിലേബി ഗാരു
ReplyDelete“అది మలయాళం అయితే కాదు జిలేబి గారు” అనే తెలుగు మాటలు మలయాళ లిపిలో బాగానే వ్రాశారు గానీ ఇంతకూ ఇక్కడ మీ వాక్యంలోని కవిహృదయం ఏమిటి, శ్రీధర్ గారూ?
ReplyDelete(ఏదో తెలుగు సినిమాలో ఒక సీనులో ఒక మలయాళీ అమ్మాయి మీరన్న ఈ మాటే అంటుంది లెండి 🙂)
గురువు గారు గమనించాలి.. నేను పైన తెలిపిన దానిట్లో మొదటిది మలయాళమే.. కాని ఆ వాక్యమందైతే మలయాలం అని వ్రాయటం జరిగింది. కొట్టాయమో కాసర్ గాడో, పతనంతిట్టో లేక త్రివేంద్రమో ట్రావణ్ కోరో, కణ్ణూరో, కోళికోడో.. మలయాళ ప్రాంతీయతను, నారికేళ, కాదళిఫలం, వంటి వాటితో బోల్చేటి మీ బోటి వారి ముందు ఏదో పిల్లిమొగ్గలేశా..! శాన్ స్క్రి టై జేషన్ మన భారతావని మూల భాష యని ఎక్కడో చదివా.. ఆయా మూలాల నుండే ఇతరత్ర భాషలు వేర్పాటయ్యాయని.. అందుకే తెలుగు, ಕನ್ನಡ, മലയാളം, සිංහල భాషల లిపి లోనే తేడ.. కాస్తో కూస్తో అర్థాలు ఒకటని చెప్పటానికి చేసిన చిరు ప్రయత్నం.
Deleteఅవునండేయ్, స్పెల్లింగు పొరపాటు నేను గమనించలేదు.
Deleteనిజమే, మలయాళం చాలా Sanskritised భాష.
అన్నట్లు, ఇది සිංහල ఏ భాష?
සිංහල: ශ්රීලංක
Deleteసింహల: శ్రీలంక
గురువర్య..!
లిపి అట్లా ఉంటుందిట.. మీ పేరునైతే
"වින්නකොට නර්සිංහා රාවු"
అలా అని నన్ను ఏ లంక దేశపు కుర్రాడిననుకునేరు..
శ్రీరాముని జన్మ మాసమైన చైత్రములో నే పుట్టిన వాడిని.. రామునిది ఏడవ అవతారం.. నాదేమో ఏడో తారీఖు.. బహుశ అపుడెప్పుడో మీరే నాకు బ్లాగ్ ముఖముగా విష్ చేసినట్లున్నారు..!
భారత ఉత్తరాది భాగంలోని భాషలు పాలి, ప్రాక్రిత్, బ్రజ్, ఇత్యాదులన్ని ఇండో ఆర్యన్ భాష శైలి అలానే భారత దక్షిణాది భాషలన్ని ఇండో ద్రవిడియన్ భాష శైలి.. అన్నిటికి మాతృక సంస్కృతము.
అనట్లు కర్ణాటక లోగల మత్తూర్ అనే ఊరిలో జనాలు సంభాషించేదంత సంస్కృతములో
Delete// “ అలా అని నన్ను ఏ లంక దేశపు కుర్రాడిననుకునేరు..” //
Deleteఅబ్బే, మిమ్మల్ని ఏ ఒక్క ప్రాంతానికో ఎలా పరిమితం చేస్తాం, భూక్యా నాయకా? చూస్తుంటే మీరు universal మనిషిలా ఉన్నారు కదా?
అన్నట్లు అది సింహ”ల” కాదు, సింహళ. బహుశః ముద్రారాక్షసం అయ్యుంటుంది లెండి. నా పేరు సింహళ భాష లిపిలో మీరు వ్రాసినది చూసి రాజపక్సా లాగా ఫీలయ్యాను అనుకోండి 🙂.
నా దృష్టిలో మలయాలము అనడం కూడా సమంజసమేనండి. బహూశా మలయాళము అనడం కన్నా మలయాలం అన్నడమే మిన్న. 😀 మలయాళీలు వారి భాష వారే మరచిపోయివుండవచ్చు. “మళయాళము” అనడం మాత్రము ఖచ్చితంగా తప్పు!
ReplyDeleteనా అభిప్రాయం మలయాలము అన్న పదం “మల” (కొండలు, పర్వతం) మరియు “ఆల” (ధ్వని చేయు) అన్న రెండు పదాలనుండి కలిసి వ్యుత్పత్తి అయ్యింది. మల అని తెలుగులో కూడా నల్లమల వంటి కొండలను, లేదా కేరళములోనే శబరిమల కొండను అంటాం కదా! “ఆల” అన్న పదం తెలుగులో వాడనప్పటికీ ఆలించు/ఆలకించు అంటే శ్రద్ధగా విను అని నానుడిలో ఉంది. ఆలపించుట అంటే పాడుట అని అర్థం ఉంది. కొండప్రాంతాలలో ప్రజలు మాట్లాడే భాషను మలయాలము అని అన్నారని తద్వారా నీలగిరి కొండలకు పశ్చిమాన ఆవలనున్న కేరళప్రాంతపు భాష మలయాలము అని పరిపాటి అయినదని నా నిర్ధారణ. 🙂