Saturday, November 14, 2020

దీపావళీయము

 

బ్లాగ్ బాంధవులకు


కర్మ వశాత్తు జీవితంలో

పంచదశలోకంలో

కలిసి సంబరాలు

చేసుకుంటున్న 

అందరికి


ఈ దీపావళి ఇప్పటి

సంక్లిష్ట పరిస్థితి నుండి

మానవాళిని

తప్పిస్తుందన్న 

ఆశాభావంతో


దీపాలు వెలుగ వలె నీ

శాపమగు కరోన తొలగి, చక్కగ మెరుగై

వ్యాపారములు, పరమపద

సోపానపు బతుకు బండి సొబగుగ కడచన్!



శుభాకాంక్షలతో

జిలేబి

14-11-2020.


203 comments:

  1. మీకు, తదితర బ్లాగుమిత్రులకు కూడా దీపావళి శుభాకాంక్షలు, “జిలేబి” గారు.

    ReplyDelete
  2. ఖర్మవశాత్తు జీవితంలో

    పంచదశలోకంలో

    కలిసి సంబరాలు

    చేసుకుంటున్న

    అందరికి దీపావళి శుభాకాంక్షలు !

    ReplyDelete
    Replies
    1. ఓహో, బహుకాల దర్శనం, నీహారిక గారూ. అడపా దడపా మాత్రమే కనిపిస్తున్నారు బ్లాగుల్లో?

      పంచదశలోకంలో తిరుగాడటం మరీ అంత ఖర్మేమీ కాదనుకుంటానులెండి 🙂.

      మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు.

      Delete
    2. ధన్యవాదాలు vnr sir. మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు.

      Delete


  3. పంచదశలోకమును సే
    వించుకొనుచు బ్లాగులెల్ల విరివిగ నడయా
    డెంచక్కగ చదువుకొనుచు
    మించారెడు భాగ్యమెవరి కేదొరకు భువిన్

    జిలేబి

    ReplyDelete
  4. అందరికీ దీపావళి శుభాకాంక్షలు💐

    ReplyDelete
  5. ఓం చిచ్చు బుడ్డీయం నమః తుస్ తుస్ సమర్పయామి
    ఓం కాకర పువత్యీయం నమః చట్ చట్ సమర్పయామి
    ఓం హైడ్రజన్ థ్రెడ్ బాంబీయం నమః ఢామ్ ఢామ్ సమర్పయామి
    ఓం డబల్ షాట్ బాంబీయం ధన్ ధనేల్ సమర్పయామి
    ఓం ఈగల్ సౌండ్ రాకేటీయం నమః చూఁయీఁ సమర్పయామి
    ఓం థౌజండ్ వాలాయియం నమః చటర్ ఢంఢాం సమర్పయామి
    ఓం దీపావళీయం దీప ధూప ధూమ నాసిక యంత్ర కర్ణభేరి యంత్రే టెంపరరి ఆడిటరి ఫెల్యూర్ సమర్పయామి
    ఇతి దీపావళి నక్తే నానా విధానాం శోషణ వివరణ దాస్యామితి

    రెమిడి:
    దీపాలంకరణ దేదీప్యమానం లక్ష్మీం పూజనం శుభప్రదమితి

    ReplyDelete
  6. "జిలేబి" గారు,

    "నెమలికన్ను" మురళి గారి బ్లాగులో "Middleclass Melodies" సినిమా గురించి 23-11-2020 న మీరు పెట్టిన ఒక కామెంట్ "కొంపదీసి ఇది కూడా మళయాళంలో నుండి దిగుబడియా" అని అడిగారు కదా, దానికి నా వంతు వివరణ (మలయాళం అని ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం "మళయాళం" అనడం మానరు కదా). మురళి గారినెందుకు ఇబ్బంది పెట్టడం అని మీ బ్లాగులో వ్రాస్తున్నాను (ఎలాగూ నా కామెంట్ మీద మీరు లేవనెత్తిన సందేహమే కాబట్టి).

    కేరళీయులకు తాము, తమ రాష్ట్రం చాలా స్పెషల్ అనే భావన మెండు (కొన్నేళ్ళ క్రితం కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రపు ఒక భావి ఎం.పి. గారు మేమసలు ఇండియన్లమే కాదు లాంటి స్టేట్-మెంట్ ఒకటి ఇచ్చారు గుర్తుందిగా, అలాగన్నమాట ). అప్పుడెప్పుడో ఒక కేరళా రచయిత గారు కేరళా చరిత్ర గురించి వ్రాసిన పుస్తకంలో There is Kerala, there is India అని కనబడింది లెండి. ఆ రకంగా తాము "డిఫరెంట్"అనుకుంటారు.

    movie "డిఫరెంట్" గా ఉంది అంటే ఈ "Middleclass Melodies" సినిమా మలయాళం నుండి దిగుమతి అనే అర్ధంలో మాత్రం కాదు లెండి. ఆంధ్రా తెలుగు సరుకే (ఒకానొక పంటి క్రింద రాయి మినహా).

    ReplyDelete
    Replies


    1. చిత్రం‌ బావుందండీ ! ‌ఆ‌ తండ్రి పాత్ర మన బ్లాగ్ లోకపు భండారు వారేమో అనుకున్నా ! కాదని గోపరాజు గారని తరువాయి తెలిసింది.



      ఈ చిత్రం లో కూడా రెండు మూడు " అసంభావితాలు" వున్నాయి /:) ఏమిటవి ?



      జిలేబి

      Delete

    2. బై ది వే - ఈ పదం నా సొంత "సూక్షి" కాదు :) బ్రౌను దొరగారి ఇంగ్లీషు తెలుగు నిఘంటువులోనిదే :) నమ్మరామి అనెడు అర్థం లో వాడబడి వుంది.

      ఈ తెలుగోళ్లతో వచ్చిన సమస్యే యిది :) తెలుగే తెలీదు :)


      నారదా

      జిలేబి

      Delete


  7. ఆహా డౌ జోన్సూ !! ఓహో బ్యాంకునిఫ్టీ !


    డౌ జోన్సూ! బ్యాంక్నిఫ్టీ!
    బాజారున కొండనెక్కె పడతి జిలేబీ!
    తాజాగా నిఫ్టీ మర
    లా జిగి తో నాట్యమాడు లావై పోవే !



    ఇవ్వాళ బ్యాంకు నిఫ్టీ 30,500 touch చేయునా :)
    నిఫ్టీ 13,500 పోవునా :) గుర్రం గాల్లోకి అలా అలా తేలి పోవునా :)


    డౌ జోన్సూ! బ్యాంక్నిఫ్టీ!
    బాజారున కొండనెక్కె పడతి జిలేబీ!
    తాజాగా నిఫ్టీ మర
    లా జిగి తో నాట్యమాడు లావై పోవే !


    ఆహా నా మార్కెట్టూ

    :)


    జిలేబి

    ReplyDelete


  8. భానోదయమన కూడదు
    రానాన్న! తెలుగు తెలియక రాయకు మా క
    న్నా! నామాట వినదగును
    మా నాన్నవు దుగ్గిరాల మన్నించదగు‌న్ !


    జిలేబి

    ReplyDelete


  9. మూర్తీ భవించిన బెరుకు!
    స్ఫూర్తి కనబడదు రవంత! శోకమ్మెపుడున్!
    గొర్తి లలితా భవానికి
    కార్తికదీపమునుఁ గాంచఁగా భయమయ్యెన్!


    :)
    జిలేబి

    ReplyDelete


  10. సుజన జిలేబికి వరుస క
    నుజ! కార్తికదీపముం గనులఁ గాంచఁగ భీ
    తి జనించె మెండుగన్, కను
    ల జలము గంగవలె పారె లావుగ సుమ్మీ!


    జిలేబి

    ReplyDelete
  11. నిన్న రాత్రి (సోమవారం 28-12-2020) "ఈటీవీ" (తెలుగు) లో "ఆలీతో సరదాగా" కార్యక్రమం సుధా చంద్రన్ తో జరిగింది. చక్కటి తెలుగులో మాట్లాడింది. ఏమి దృఢమైన వ్యక్తిత్వం అండీ ! జీవితంలో 15 యేళ్ళ చిన్న వయసులోనే అంత కష్టం (ఒక కాలు కోల్పోవడం) వచ్చినా కూడా మొక్కవోని పట్టుదలతో కృత్రిమపాదంతోనే సాధన చేసి భరతనాట్యం డాన్సర్ గా దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం - ఆహా, హాట్సాఫ్ నిజంగా. ఆమె జీవితవిశేషాలు కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళలో పాఠ్యాంశంగా కూడా జేర్చారంటే సామాన్యమైన విషయం కాదు. చిన్నచిన్న కష్టాలకే కృంగిపోకుండా ఆమె కథ నుండి స్ఫూర్తి పొందగలగాలి.
    మహామనీషి 👏.

    ReplyDelete
    Replies


    1. భూలోకంలో అసాధారణ సేఠుగ జీవించి పంచదశలోకంలో సంపూర్ణ జ్ఞానాన్ని మానవాళికి అందిస్తూ మహత్తర గురువుగా నరస రాయలు పూజలందుకుంటున్నారు.వ్యాఖ్యాదేవి అంశ. వ్యాఖ్యాతలకే మహా వ్యాఖ్యాత‌.



      ఇట్లు
      పొర్లిదండాలిడెడు
      జిలేబి

      Delete
    2. పొగిడినట్లా, తెగడినట్లా 🤔🤔??

      Delete


    3. పొగిడి నట్లా? తె గిడినట్ల? పొర్లి దండ
      ము లనినారు జిలేబీ? నమో! పొగడ్త
      యే నరసరాయ! వ్యాఖ్యల నిండు గాను
      నోపికయు చేర్చి వ్రాయుట లో ప్రశాస్త!



      జిలేబి

      Delete
  12. పొగిడిరా మరిమరి పొర్లుదండాలెట్టి
    కనగ నెచటనొ తిరకాసు గలదు ,
    తెగిడిరా యదియును తెలియవచ్చుటలేదు ,
    దీని దెలియ గలడ దేవు డైన ?

    ReplyDelete


  13. పనిలేక అష్ట కష్టా
    లను సరి చూసుకొనువారల మనము గనవ
    చ్చును బ్లాగ్లోకంబున! రా
    యిని నెంచుకు కొట్టుకొనుకొని సుఖము బడయన్ ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "అష్టకష్టాలు" పడయినా సరే ఆ "అష్టకష్టాల" సరైన జాబితా ఏమిటో తెలుసుకుందామని కుతూహలం. "పనిలేక" అంటారా? పోనీ అలాగే అనుకుని ఆ ప్రామాణిక జాబితా ఏదో మీకు తెలిస్తే చెప్పవచ్చుగా - కొత్త సంవత్సరంలో మీ పేరు చెప్పుకుంటాం? 😳

      Delete


    2. వినరా వారు,

      అబ్బే! ఇవన్నీ మా ఇలాకా కావండీ :)
      తాతగారి ఇలాకా :) సేఠు బ్యాంకు షేరు గట్రా మా ఇలాకా :) ఇవ్వాళ ౨౮౦ :) ఎంత దాకా లాగొచ్చంటారు? :)



      జిలేబి

      Delete
  14. ఇరవయ్యొకటో వత్సర
    మిరవొందగ, నన్నికళల మెలగుచు, శుభ సం
    బరముల దేలగ గోరెద,
    బరహిత మొనరించుచున్ విభావరి వోలెన్ .

    ReplyDelete


  15. మరో వికెట్టు డౌను :)


    మరియొక వికట్టు డౌన
    య్యెరొ శ్యామలరాయరింక యెకసక్కములా
    డరు కందజిలేబులకిం
    క! రావె వ్రాయంగ నీకికయెదురు లేదోయ్! :)




    జిలేబి

    ReplyDelete


  16. ఇరవై ఒకటి జిలేబీ
    పరుగుల వచ్చెను కరోన బాధిత జనులె
    ల్లరి మది స్వాంతమ్మును పొం
    ది రాధనమునొందగాను దిల్భర్ హ్యాపీ !



    జిలేబి

    ReplyDelete
  17. హేపీన్యూఇయరాండీ
    హేపీగా ఇంకమీరు హృదయంగమమౌ
    సూపర్ కందాలల్లుచు
    మా పాఠకజగతి తలలు మార్చగవచ్చున్ .

    ReplyDelete


  18. చేతకాని పెనిమిటి విచిత్ర మైన
    మనిషి చెంతచేరడితడు మందుతాగి
    గురక బెట్టి నిదురబోయె కొండలయ్య
    దున్నపోతని నిందింప దుఃఖమేల


    జిలేబి

    ReplyDelete


  19. Conversational శార్దూలము :)



    "ఏలా దుఃఖము?"
    "దున్నపోతువని నిందింపన్ సభన్ మిత్రమా
    చాలానొచ్చెను నాదు మానసమయా! సాధింప పద్యమ్ములే
    నా లావౌ యతనమ్ము లిచ్చటగదా!"
    "నాల్గారు వాక్యమ్ములే
    చాలా గొప్పదటంచు మూర్ఖునివలెన్ సంతోషమో? అందుకే!"


    జిలేబి

    ReplyDelete


  20. అలవాటుగాను పొరపా
    టు!లావుగా మాలికను చటుక్కున తెరిచేం
    త లొసుకు కల్గె జిలేబీ
    ఫలితము నిర్ణయము కొంత పట్టుసడెలగా!


    జిలేబి

    ReplyDelete


  21. అవును గురువు గారు! ఆద్యము నాజ్యము
    పెండ్లి యేను భార్య వెంట బత్తి
    తోడు నడచు భర్త తొత్తుగ మారుచు
    బండి రావు పల్కు పసిడిమూట :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవరా గురుదేవులు?
      సివరాఖరు కీ గతేంది శ్రీమతివెంటన్
      పవరుడిగి తొత్తుమాదిరి
      రివర్సగు కతేంది మామి! రీలేయ గదే !

      Delete


    2. బండి వారిని అడగాలె :)

      Delete
    3. అడిగిన చెడుగుడు లాడు, గు
      రుడు, పెద్దలజోలికెల్ల, లోలాక్షీ! మీ
      రడుగుడు, చెడుగుడులాడుడు,
      గుడుగుడు గుంచంబు తమరె, గుండేరాగం 🙏 .

      Delete
    4. "బండి వారిని అడగాలె"

      అవునవును. దుబ్బాక గెలిచి & గ్రేటర్ హైదరాబాదులో భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ కొట్టినాక బండి సంజయ్ మాంచి ఊపుమీదున్నాడు!

      Delete
    5. ఆ "బండి" వేరు, ఈ "బండి" వేరు 😀.

      Delete
    6. విన్నకోట వారూ:

      బండెనక బండి కట్టె
      మున్నూరు బండ్లు కట్టె
      ఏ బండ్ల గణేశం వస్తడో
      బండి ఱ కెరికె బాపూ

      బాణీ మారిస్తే ఇట్లానె ఉంటాది, ఏటేటో అవుతాది:

      ఆ బండ్ల ఉంటావా బండన్న
      ఈ పొగబండికొస్తావా బండన్న
      ఆ బండిలో నెత్తి మీద బండ ఉంది
      ఈ బండ్ల బండెడు పద్దెముంది

      Delete
    7. పెద్దలగు బండిరావు ని
      బధ్దతగలవారు బుధులు పాటొకటేగా
      దుధ్ధతులు యన్నితెరగుల
      తద్దయు నమస్సులు 🙏, మహాత్మామహితులకున్ .

      Delete


  22. తీగకు తగులుకొనె సవితృ
    డే! గతిని తెలిపెడు వేధుడీ గతిని జిలే
    బీ గట్టిగముడి వడినా
    డే! గగనమణి పరుగుల వడి నిలిపినాడన్!


    జిలేబి

    ReplyDelete


  23. హేయంబియ్యది నీదు జీవితమురా హేరాళమీతప్పులున్
    గాయమ్మాయెను నాదు మానసము వక్కాణింతు నీ మేలుకై
    మాయామోహము లేల తప్పిదము సామాన్యంబు కాదోయి! పో
    నీ! యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్


    జిలేబి

    ReplyDelete


  24. మాయా మోహము లేలా!
    ప్రాయమ్మిది తప్పిదముల వరుసగ చేయన్!
    గాయాలను రేపకు! పో
    నీ! యాలిని నాకొసఁగుము నీతిపరుఁడవై!


    జిలేబి

    ReplyDelete


  25. అలుపెరుగని వ్యాఖ్యాతగ
    పులుకడిగిన ముత్యమువలె వూరించెడు వ్యా
    ఖ్యలతో బ్లాగ్లోకానికి
    జిలేబులను పంచి సంతసించున్ వినరా!


    జిలేబి

    ReplyDelete
  26. నరసింహరావు పెద్దల,
    తరమావొగడంగ , వ్యాఖ్యతా పరమే గా
    దరయగ బహుభాషల బుధ
    వరులు, నమస్సు🙏లిడి, గౌరవాలు దెలుపుదున్ .

    ReplyDelete
  27. "జిలేబి", రాజారావు మాస్టారు గార్లకు 🙏🙏.

    అరయంగా వినరా సిగ్గిలే మీరిరువురి చేతన్ 🙏.

    ReplyDelete
    Replies
    1. అవును శర్మ గారు. పైగా లేతకొమ్మల చెట్టు 😳.

      Delete
  28. సిగ్గేలా? మే మనుచిత
    మగ్గలికము లాడినామ? మహితాత్ములుగా
    నిగ్గున దేలినవారికి
    తగ్గ పదాలను వెలార్చితండీ , ప్రణతుల్ 🙏 .



    ReplyDelete
  29. సంభావన లేకుండా
    సంభవమా వొగడ పద్యసన్మానములన్?
    శుంభద్యశులకు మాత్రమె
    సంభవమగుగాక ! మాకు సంతోషమగున్ .

    ReplyDelete
    Replies


    1. రాజావారండీ

      నేను మొన్నడిగిన ఓ ప్రశ్నకు వినరా వారు మౌనము వహించి నా ప్రశ్నకు సమాధానము గా సంభావన యిచ్చి వేసినారు :)

      వినరా ! సిగ్గిలెనంటా
      వినరా అరయగ జిలేబి విన్నాణపు ప్రో
      డను భళి మనసార పొగడ
      గను! తాతయు మునగచెట్టు కతయనిరి కదా!



      జిలేబి

      Delete
    2. బండిదొరలనుగూడ తమవంతుగాగ
      బిట్టు వొగడండి, వారున్ను బిరుదుమగలు,
      సకల సన్మానగరిమల చాలు విదులు,
      పొగడదగు ఘనతగలారు, పుణ్యమతులు .

      Delete
    3. శ్యామన్నను వదిలితిమా ,
      రామన్నకు కోపమొచ్చు, రభసగు, గానన్
      ధీమంతుల వొగడగవలె,
      క్షేమంబగు మనకు , ఘనులచిత్తము వెలుగున్ .

      Delete


    4. తాత గార్నో :)

      Delete
    5. తాతా ! వారెవరండీ ?
      ఏతావత్ శర్మగార ? ఇదిబాగుందే !
      మాతామహులను వదిలిన
      నీతీ నియమాలతోటి నిల్చిబతుకుటే ?

      Delete
    6. పెద్దలు శర్మ,శ్యామలులు, పెద్దలు బండియు, విన్నకోటవా
      రుధ్ధతిలోన, ఙ్ఞానమున, నుజ్జ్వలభావనలందునన్ గడున్
      పధ్ధతిలోన, ప్రజ్వలితపాండితివైభవమందు, నందునన్
      తద్దయు పెద్దలన్ బొగడి, తద్ కృప పాత్రుడగాగ గోరితిన్ .

      Delete
    7. పొగడ మనవంతు, ఘనతల్
      బొగడొందుట వారివంతు, పుణ్యాత్ములు, ఎం
      తగ వొగిడిన వింతగదా!
      దిగదుడుపే మనము, వారితీరులు ఘనముల్ .

      Delete


    8. సూపర్ అండి....👌👌👌

      Delete


    9. మరి మా లలితమ్మగోరండీ ?

      Delete


  30. చనువుగ మేలైన ప్రవ
    ర్తనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్
    అనుమానమువలదు సుమా!
    తన భార్యను కోరె ధవుని ధర్మముగ సుమీ


    జిలేబి

    ReplyDelete


  31. అనుమానమ్ము జనాళి కింక వలదీ యభ్యంతరంబైన చే
    ష్టనునిర్ముక్తుడు చేసె నంచు సభలో! సాధింప శాలీనుడై
    తనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై
    తనయిల్లాపెను జాగురూకుడగుచున్ తంత్రార్థసారమ్ముతో!


    జిలేబి

    ReplyDelete


  32. వ్రాస్తున్నారని సంతసించవలెనా ? భాషన్ మరీ చంపి వే
    సేస్తున్నారని ఖేదమొందవలెనా ? చివ్వంచు కామెంటు కు
    మ్మేస్తూ నొక్కరి పీక బట్టుకొనె నమ్మీ బ్లాగులోకమ్ములో
    ఉస్తాదైన కవీశ్వరుండొకడు ఠావుల్దప్పగా దూకుచున్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ‌ఆదిరింది పద్య మమ్మీ!
      చదురుగలవిన్ని , నీకు , సాహో సుమ్మీ,
      కుమ్మేస్తివి కోవిదులను
      ‌అమ్మో లమ్మో మనసున కానందమ్మో !

      Delete


    2. ఏదో మా ఆసామి మాలిక చూడరన్న ధీమా అంతే నండి రాజావారు :)

      Delete
    3. చూడరనగ నమ్మక మది
      వీడండి, మహాప్రసన్నవీక్షణఝరులన్
      వీడరు మాలిక లుక్కులు,
      బాడబులకు లోచనములు బహువిథము హితా !

      Delete


  33. పచ్చి గబ్బిలపు మాంసము భళారె :)


    చింగు ! చాంగు ! కాంగు! శీఘ్రము గారండు
    కనుల విందొనర్చు గబ్బిలమ్ము!
    చక్క గాను నరికి చల్లగా తిందామ
    టంచు తినగ వచ్చె రా కరోన!


    జిలేబి

    ReplyDelete


  34. మన వూరి స్పెషాలిటి పొడ
    గను! కనులకు విందొసంగుఁ గద గబ్బిలమే
    తన సోయగమ్ముతో! విం
    దున కిదె మేలని తి‌నంగ దూకె కరోనా !


    జిలేబి

    ReplyDelete


  35. బాగుందండీ వ్యాసము
    చేగూరాలి జనులకు సశేషము శుభముల్
    సాగవలెను మీ యానము
    పాగడమై వస్తువు ప్రతి పాదింప బడన్


    జిలేబి

    ReplyDelete


  36. పెనిమిటి మాటగా

    నడుమూగ నాట్యపు నడక!
    పడిలేచెడు మెల్ల మెల్ల పైటని వడ్డూ
    పొడుగూ నిగుడారంగ చ
    వి డిగనురుక నేలుకుంటి బింబోష్ఠినిదే!


    జిలేబి

    ReplyDelete


  37. కనుమూగనీయదే! దీ
    దిని పొగడను మేలుకుంటి! దిమ్మతిరిగె వా
    రిని మెల మెల్లగ దత్తప
    దిని చేవెలుగూని చేర్చ తీరుగ సభలోన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఓగుదగిడీలె గురు , లే
      లాగూ , నిజమెల్ల దాతు రనుకుంటి హితా !
      జోగికిజోగి జతల్ వడి
      మూగంగా , ఘనులమనుచు మురియుదు రనఘా !

      Delete


  38. ఓగుదగిడీ అంటే పద్యాల్తో వాయిస్తారా :)


    ఓగుదగిడి ఓగూదగి
    డీ! గురు వొక ఓగుదగిడి ! డింగరులంతా
    ఓగుదగుడి ఓగుదగిడి
    పాగల్ఖానా మనుజులు పరిచారకులున్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. దత్తపదిని గురుడిస్తే,
      హత్తెరి పూరిస్తినండి, హనుమాయమ్మా!
      పుత్తెంచి, ఓగుదగిడీ
      గుత్తిగదా! గురుడటంచు, కుమ్మితిరి భళా !

      Delete


  39. కందాటవెలది :)


    డబ్బెవరికి చేదండీ :) మా అయ్యరు గారిస్తానంటే వద్దనటానుకి మేమెవరమండోయ్ :)


    నిజమిది యేను! పెనిమిటి వె
    దజల్లగా వలదు నాకు ధనము వలదటం
    చుఁ జనునె తన్వియు? పసిడికొ
    న జెచ్చెరన్ పరుగు దీయు నానందముగా !



    జిలేబి

    ReplyDelete


  40. ఓ తండ్రి తనయతో


    అనవరతమ్ము జీవనమహారణ మింక జిలేబి మెట్టినిం
    టనె! బతుకింక పెన్మిటి కటాంజనమందున సాగిపోవు! స్త్రీ
    ధన మును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?
    మునుపటి సాంప్రదాయము! సమున్నతమైనది చొప్పుతప్పకన్!


    జిలేబి

    ReplyDelete


  41. చల్లగ నెలుకల బెడదను
    మెల్లగ దీర్చెను గృహమున! మేవడి తోడై
    యొళ్లును వీడగ మరువక
    పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్!


    జిలేబి

    ReplyDelete


  42. తనువును వీడంగా న
    డ్డన పిల్లికి శ్రాద్ధమున్ బుడమివేలుపు వె
    ట్టెను శాస్త్రపద్ధతిన్ గా
    చె నింటి ననుచు మరువక వచించి జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  43. రాముడు తిరిగిన నేల
    ర్రా మా జానకి చరించెరా యిచ్చోటన్
    ప్రామాణికమ్ము శ్రీమ
    ద్రామాయణము! వలదు తకరారిచ్చోటన్


    జిలేబి

    ReplyDelete


  44. అర్మిలి తోడై వినరా!
    కర్మము నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్
    శర్మాజీ కుశలమ్మే?
    మర్మంబేమియొ టపాలు మాలికలో లేవ్ ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మా కుశల మడుగలేదే !
      రాకాశశివదన ! వారు ఫ్రండ్సా ? ఓహో,
      నే కాదా ? సరిద , మరే
      మో కాస్తైనా వొగుడు సుముఖుకుడు నేనే .

      Delete
    2. బుజ్జమ్మా!
      నన్ను తలుచుకున్నందుకు నా క్షేమ సమాచారం గురించి విచారించినందుకు...ఆనందం..ధన్యవాదాలు.
      గత సంవత్సరం పోతూ ఒక బహుమతి ఇచ్చిపోయింది. మందులు వాడుతున్నా! డాక్టర్ చాలా ఆంక్షలు పెట్టేరు, అందులో, ఇంటర్ నెట్ కి దూరంగా ఉండటం ఒకటి. రెండువారాలు మందులు వాడేను, ఇంకా వాడుతున్నాను. కొంచంగా పండగకి సడలింపిచ్చారు. రోజుకో పావు గంట. నేటితో అది పూర్తి.

      కుదిరితే మళ్ళీ కలుద్దాం. అంతా అమ్మ దయ.నన్ను మరువనందుకు మరో సారి ధన్యవాదాలు.

      దీర్ఘాయుష్మాన్భవ
      దీర్ఘ సుమంగళీభవ

      Delete
    3. బాగున్నారా! బుజ్జ
      మ్మా! గురుతున్నాన? నేను, మరిచితిరా? అం
      తా గురుడిమహిమ!సుదతీ!
      భోగీసంక్రాంతికూడ బోయంగదవే !




      Delete
    4. ఏమైందండీ?, నాపై
      స్వాముల,కలిగేర, ఓహొ!,బాగుందండీ!
      రామా యనినా తప్పే?
      గోముగ నొక పలకరింపు కూడా తప్పే ?

      Delete


  45. శాపాన్ని వరముగ జిలే
    బీ పద్ధతిగాను మలచి విశ్రామమ్మం
    దే పుస్తకముల నెన్నో
    నే ప్రచురించితి విభుని యునికికి ఋజువుగా


    జిలేబి

    ReplyDelete


  46. సింగారపుటమ్మణ్ణియు
    సింగము లేకున్న నెటుల సింహాచలమౌ?
    చెంగట వచ్చితి నయ కవి
    సింగము శంకరుడను నరసింహస్వామీ !


    శంకరుల వారి సతీసమేతపు విజిట్టు :)



    జిలేబి

    ReplyDelete


  47. చూచితి సిద్ధుల గుట్టను
    సాచివిలోకితముగాను సాన్నిత్యమదే
    దో చొప్పుగ గాన్పడెన
    మ్మా చక్కగ సాగిలబడి నాను జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  48. వచ్చె నిదిగొ కొత్త వాక్సీను మేలుగ
    బోగి పండ్లు గురియ! రోగమొదవె
    జనులు నొకరికొకరు సాయ మందింపగా
    ముందు బడగ శ్రేష్టముగ జిలేబి!


    సంక్రాంతి శుభాకాంక్షలతో
    ౭ సంవత్సరాలుగా గిద్యాలతో
    శంకరాభరణంలో జిలేబీలు తిప్పి
    వేసుకుంటున్న

    టైంపాసు
    జిలేబి :)

    ReplyDelete


  49. వికటింపని వాక్సీను తు
    దకు కురి యఁగ బోగి పండ్లొదవె! ఘోరముగా
    నొక రోగ మయ్యయో మన
    ల కుదిపె నొకవత్సరమ్మిలనుగా సుదతీ !


    జిలేబి

    ReplyDelete


  50. సకలము మీకెరు కయ్య! వె
    స కసురు కొననేలనయ్య సన్మానంబే
    ల కవికి సంక్రాంతికిలన్?
    చకితుల మైనామయా నిజమెరుగ లేకన్!


    జిలేబి

    ReplyDelete


  51. ఇదిగో పెంపొందించెను
    మొదవులు కర్షకుల మోదమును, దొలఁగించెన్
    హృదిని వెతల కొంతైన నొ
    డుదుడుకుల కరోన బాదుడును శార్వరిలోన్!


    జిలేబి

    ReplyDelete


  52. అందల మెక్కగ దుష్టులు
    నందనుల దహించిరంట, నాఁటి పురంధ్రుల్
    డెందమున కసిరగెలె వా
    రందరిని దునుమ విడువక రణమున సుదతీ



    జిలేబి

    ReplyDelete


  53. పోయెద ననవలదయ్యా
    నా యయ్యరువీవు! సామి! నా గేస్తువిరా!
    నీ యాన ! పద్యముల నే
    రాయను! నను వీడి పోకు, రాయను రాయా!



    జిలేబి

    ReplyDelete


  54. టపటప పద్యములను దెప
    గుప రాయను! నన్ను వీడకుము! రాయను రా
    య పరాయణోక్తులన్, వల
    దు పత్ని పైకినుకయు వలదు వలదు వలదోయ్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బ్రతుకనేదే మూడు నాళ్ళ ముచ్చట (బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం). ఈ మూడిట నలిగి సాన పడుతు ఉండటమే జీవితం. ఇందులో కలహాలు విభేధాలు సృష్టించి ఉన్న కొద్ది జీవిత కాల వ్యవధిని చేజేతుల నాశనం గావించటం మంచికీ హేతుక కాదని నా అభిమతం. పైపెచ్చు నానాటికీ సన్నగిల్లుతున్న మానవీయ బంధాలపై ఘాటుగానే సిరను ఒలికించి కలాన్ని ఝళిపించా.

      ఊపిరి ఉయ్యాలలో జీవిత పయనం
      గుండె బాధగా ఉంటే కారేదే నయనం
      కలహం పెరిగి హింసకు దిగితే కారేదే రుధిరం

      అహంకారాన్ని అలంకరణ కాకుండ చూసుకుంటే
      బ్రతుకు పథిలమే ఓర్పు సహనం నీకు తోడుంటే
      కారాలు మిరియాలైనా పొడిబారిపోవును మిక్సిలో పట్టుకుంటే

      ~శ్రీత ధరణి

      Delete
  55. సకలకళావల్లభులం
    త, కళదరిగి, కనుమరుగయి, తప్పుకొనిరి, ఈ
    తకరారేందబ్బా?, ఇం
    తకు, కతమేదో, తెలియువిధానం బేదీ ?

    ReplyDelete
    Replies
    1. 2⁴×2² కళల తోరణాల తో వెలసిల్లే మనిషి
      8²+6² ఏళ్ళ గ్యారెంటి పీరియడ్ తో భాసిల్లే మానసి

      తర్కాలతో మస్తిష్కాన్ని పదును పెడుతు 2³×3 గంటలు
      పొడుపు కథలల్లుతు 1440×60 సెకన్లు

      Delete


  56. అంధుడు తప్పక మనుజుడు
    బంధములం ద్రెంచుకొనిన, బంధు వనఁబడున్
    బంధములా యీశుని సం
    బంధముగా నెరపి బతుకు బండి నడుపగా

    జిలేబి

    ReplyDelete


  57. చెప్పెద వినవె సూత్రము చేవలతికి
    శ్రీసతీ! పద మొత్తెడి శివునిఁ గొలుతు
    వాడె నిజమైన పెనిమిటి! భార్య లెల్ల
    మెత్తు రటువంటి వారినే మీననేత్రి!


    జిలేబి

    ReplyDelete


  58. భేదమ్మేమియు లేదు స్త్రీపురుషులాపేక్షల్ క్రియాశీలముల్!
    శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునన్ గొల్చెదన్
    వాదాన్యుండతడే సుమా! మనుజులా పాగెమ్ము సాధింపగా
    నాధారమ్ముగ నిల్తురే ప్రథములై నానాటికిన్ కీర్తితో!



    జిలేబి

    ReplyDelete


  59. మన కవివరునికె భళి తగు
    కనకపు సింహాసనంబు, గాడిదకె తగున్
    వినయము తో బట్టల మూ
    టను వెతలను‌ మోసి కటకట పడను సుమ్మీ!



    జిలేబి

    ReplyDelete


  60. గద్దె నెక్కిడ వాడి శిరము పై భారముల మోత!


    ఇలలో చూడంగ మరి య
    టల! కనకపు గద్దె నెక్కుటకు గాడిదకే
    కలవన్ని యర్హతల్ మో
    యు లెస్స గా భారముల ప్రయుక్తముగ సుమీ



    జిలేబి

    ReplyDelete


  61. బదులీయలేదని మరి మ
    రి దూషణలవేలనోయి రింఛోళిని? నే
    ను దరిమిలా నీవని చిద
    గొదలేలా మానవా తగువులేలయ్యా


    జిలేబి

    ReplyDelete


  62. పల్లెత్తు మాట లాడితి ?
    విల్లెత్తితి విరిగె! వచ్చె విరిబోణియె నా
    యుల్లపు రాణిగ! చేసిన
    గల్లంతేమిగలదయ్య కవిరాట్ శ్యామా!


    జిలేబి

    ReplyDelete


  63. అమ్మ ఒడిలేని దెప్పుడు ?
    నమ్మక మేముఖ్యమౌ సునాయాసముగా
    నెమ్మది నొందగ రాజా
    వమ్మావిడ చేయదెపుడు భక్తుల గాచున్


    జిలేబి

    ReplyDelete


  64. కొందరు తిట్టెదరోయీ
    కొందరు మెచ్చెదరునన్ను, కోణంగులు భల్
    వందారనుచు వెనుకనో
    డెందంబారంగ పడిపడి చదురడతురే!


    జిలేబి

    ReplyDelete



  65. ఆరు వందల పై చేరి నారు కవులు
    దేశ భక్తి వర్రోడి ప్రోదియగు పద్య
    సంకలనము వెలువడి యెంచక్కగాను
    రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము!

    పద్య ప్రభంజనం‌ ఆవిష్కరణోత్సవానికి
    కల్వకుంట్ల కవిత జాగృతి తోడ్పడగా
    తంగేటిజున్ను వెలువడేటి శుభసందర్భానికి

    శుభాకాంక్షలతో
    జిలేబి

    ReplyDelete


  66. వడి దేశభక్తిని కవుల
    నొడి ప్రమదము గూర్ప వచ్చెను ప్రభంజన మె
    ల్లెడ వీచి తీవ్రమై జడి
    సుడిగాలివలె తెలగాణ చొప్పు కవితలై!


    జిలేబి

    ReplyDelete
  67. తెలుగు పద్య సఖియ
    --------------------------
    నెల్లూరు సన్నబియ్యము
    జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
    చల్లని మంజీర నీళ్లు
    చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్

    *****

    తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
    చెఱకు రసము కంటె , చెలిమి కంటె ,
    మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
    భాగ్య నగరి లోని బ్రతుకు కంటె

    *****

    పుట్టిల్లు తెలంగాణా ,
    మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
    పట్టము గట్టిరి తెలుగులు
    దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో

    *****

    తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
    అచ్చమైన రాజ హంస నడలు
    మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
    వేమన , గురజాడ వివిధ గతుల

    *****

    తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
    ఆట వెలదు లందు నాట్య మాడె
    కందమందు తెలుగు విందులు సమకూర్చె
    తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

    ReplyDelete


  68. పద్దెవరిదైన నేమోయ్
    కద్దగు గౌరవము గాన గంధర్వునికిన్
    తద్దయుగాదక్కె సుమీ
    ముద్దుగ తమిళుల పెరిమ సముక్షణ గానన్!


    జిలేబి

    ReplyDelete


  69. ప్రియమగును భరతమాతకు
    జయ మనువాఁడె, ఖలుఁడు తన జయమును మదిలో
    సయితము తలవని వాడే
    జయహో భారతనవే విజయమిక మనదే!



    శుభాకాంక్షలతో
    జిలేబి

    ReplyDelete


  70. సఖి! వాడే భక్తుడు బా
    యక భారతమాతకున్ జయము వల్కెడువాఁ
    డె! ఖలుండు ద్రోహియౌ సూ
    వె ఖండితము కీడు తలచు వెధవయె సుదతీ


    జిలేబి

    Note - స్వవర్గజ ప్రాసలో క-ఖ లను చెప్పలేదు. కంది‌వారి మాట.

    ReplyDelete


  71. హిందూ ధర్మమిదేనా ?
    కొందల పడినారు హితులు క్రూరంబిది యే
    చందాన నప్పనిది మా
    కందమగు సనాతనమ్ము కడగండ్లివియౌ!


    జిలేబి

    ReplyDelete


  72. నాకన్యులనెరుగవనుచు
    యే కోశాన పొసగని చెయివుల విడువకన్
    జూకాల్దిప్పుచు చేయుచు
    శోకాల్వెట్టుదువె నరుడ శోభిల్లునకో ?


    జిలేబి

    ReplyDelete


  73. ఖేద మొందితి బిడ్డడి కేరు మనెడు
    యేడ్పు విని, మోద మందితి హృదయమందు
    నాదు సతి వాని లాలింప నయ్య జోల
    పాట పాడుచు జోగాడి పరుపునంప!


    జిలేబి

    ReplyDelete


  74. నిమిషమున నొందెనరె ఖే
    దము యేడుపు విన్న నా హృదయ మెంతయొ! మో
    దమునందెఁ దృప్తిగన్ పతి
    సుముఖుని చేయ కొమరుని ప్రచోదన తోడై!


    జిలేబి

    ReplyDelete


  75. నుదురు మధ్యలో కళ్ళతో జన్మించిన వింతగొర్రె :)

    " తెలుగు విజన్" :)

    ReplyDelete


  76. మా రాముల వారొస్తు
    న్నారా! యెంత శుభవార్త! నా గుళ్ళే నా
    వారే భక్తులనుకొనక
    నేరుగ కాపుగొన సింగిణీనెక్కిడుచున్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రాముడొచ్చుడేంది ? రక్షించు పరమాత్మ
      లేనిచోటు జగతి లేదు లేదు ,
      అందు నిందు నెందు నిందీవరాక్షుండు
      మొనసి జనుల కళ్ళ ముందు గలడు .

      Delete


  77. అలవిని మీరిన సంపద
    వలయు నను ఖలుఁడు, సుజనుఁడు వలదను నెపుడున్
    కలతల యిబ్బడి చేర్చెడు
    కలిమిని సుదతీ జిలేబి కర్మవశముగా


    జిలేబి

    ReplyDelete


  78. జగడము లన్నియు తనకం
    డగ వలయు ననంగ దుష్టుఁడగు, వద్దనువాఁ
    డగు సజ్జనుండిలన్! జా
    డ గుర్తు పట్టుట సులభము డంబము పలుకున్!



    జిలేబి

    ReplyDelete


  79. భామా విలాప మదిగో
    కామిని నూపుర మలరెను; కాంతుని తలపై
    నీమము తప్పక భారము
    శ్యామల రాయా పడెను! ప్రశాంతత పోయెన్!


    జిలేబి

    ReplyDelete


  80. చేతి చమురు వదిలె :)


    అలకల పాన్పదియె! గలగ
    లల కామిని నూపురం బలరెఁ; గాంతునకున్
    దలమానికంబుగన్ రొం
    పి, లావు గా క్రెడిటు కార్డు బిల్లు జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete


  81. శివునికి నీవిచ్చేంతగ
    కవిరాట్ వుందయ్య శక్తి ? కాస్తో కూస్తో
    భువిలో నీదంటూ యే
    ది వుంది యిచ్చేందుకోయి దీనుడ నరుడా!


    జిలేబి

    ReplyDelete


  82. ఇదె సనాతన ధర్మమ్మిదె యని బల్కి
    పిల్ల వాండ్రను హతమార్చి ప్రీతియిదియె
    విభుని కని శివమెత్తుచు వెర్రిబాగు
    దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము


    జిలేబి

    ReplyDelete


  83. తృటిలో జీవింతురని య
    కట! దారుణకార్యమౌను గద దంపతు లం
    దుట సౌఖ్య మిద్ధరన్, చం
    పుట పిల్లల మూఢులై విభునిపేరిటనే!


    జిలేబి

    ReplyDelete


  84. నిన్న బడ్జెట్టు వేళ సీతారామన్ గారి సేల పసను :)



    ఎరుపు రంగు చిహ్నంబాయె ‌నే ప్రగతికి
    కనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు
    గల పసను పారు సేలయు, ఖచ్చితముగ
    దేశ మింక సాగును ముందు తీయబోడి!


    జిలేబి

    ReplyDelete


  85. సాయమ్మకు దండాలిడు
    వో యమ్మ తటాలు నీకు బోలెడు లాభా
    లేయమ్మ! వినవె నాప
    ల్కోయమ్మా సత్తెమిద్దె గొమ్మ జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  86. పుష్, కలము :)


    అరవై దాటేను వయసు
    పరువూ పోయే మరి విడువరె యత్తారిం
    టి రివాజు కట్నమును బం
    డిరావు గారడుగుటా పడిపడి జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete


  87. అనుగున నవనిజ కోరెను
    చనువుగ పెనిమిటిని బిలిచి స్వర్ణమృగముఁ దె
    మ్మని, యుమ శంకరుఁ గోరెన్
    తనవారింటికి వెడల విధాత పలుకుగా!



    జిలేబి

    ReplyDelete


  88. పెనిమిటి నడిగె కుజయె ద
    న్నున స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు, శంకరుఁ గో
    రెను గౌరి ప్రేముడిన్ భళి
    తనవారింటికి వెడల విధాత పలుకుగా!


    జిలేబి

    ReplyDelete


  89. అరరే! మాయల చేయుచు
    పరులకు కీడు తలపెట్టి ప్రబలంబవ గా
    నరె మాల వేసి దూషిం
    చి రమాత్యుఁ బ్రజలు కనలుచు చిందుల తోడై


    జిలేబి

    ReplyDelete


  90. నేలన్వీడెను! దుష్టబుద్ధి ముదురై నీమమ్ములన్ తప్పుచున్
    మూలాలన్నియు కూల్చగా ప్రజలకో ముప్పొద్దులాకష్టముల్!
    కాలాతీతము గాక మేల్కొని భళా కాండ్రించి కోపమ్ముతో
    మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్!


    జిలేబి

    ReplyDelete


  91. బ్లాగు రాయుళ్ల తలపుల పడతి వినవె
    పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును
    విడువవే నీదు యత్నము విదుల బాట
    యిది జిలేబి నీకు సరిపోదిది విడువవె!


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  92. ప్రముఖుల మాట! తగదిది! స్ఫు
    టము! పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రో
    హము మానుకొమ్మికన్ పడ
    తి! మా విదుల మార్గము తగదిది నీకు సుమా!



    జిలేబి

    ReplyDelete


  93. కిట్టి ఆత్మహత్యకుపయోగించినట్టి
    యింతకు మునుపు గన్నదే! యిపుడు గంటి
    మరల వాడిచెంతనయయొ! మదిని దొలచె
    ఘటన! కర్మ వదలదాయె గట్టి దాయె!


    జిలేబి

    ReplyDelete


  94. సుచరిత సుందరి చెఱగుపె
    నచె! ఇంతకు ముందు చూచినదె యిప్పుడు చూ
    చుచునుంటి వింతగన్ చూ
    డ చూడ వింతయె సుమా పడతుల బిగువులున్!


    జిలేబి

    ReplyDelete


  95. శివుని చేరుమార్గమరయ సేదదీర
    పనికి రాదు, మేలొసగదు, పాటిగాదు
    శిష్టులకు వారకాంతల చెలిమి; మేలు
    వారికి గురువుల కొలువు వారిజాక్షి


    జిలేబి

    ReplyDelete


  96. విటులుగ మారుచు పలుకుచు
    లట, వారక వారకాంతల నివాసముఁ జే
    రుటె శిష్టకృత్యమౌ? చే
    యుట వలదిటువంటి పనులు యుక్తము కాదోయ్!


    జిలేబి

    ReplyDelete


  97. ఆ గమ్యము చూపింపను
    మూగ, వచింపఁగఁ జెవిటియె, మోదమున వినెన్
    దాగిన నుత్సాహముతో
    వేగిర ముగ నంధుడొకడు వెంబడి చనుచున్!


    జిలేబి

    ReplyDelete


  98. అనఘా! పాపుల్లార! భు
    విని మూగ వచింపఁగన్ జెవిటి మోదముతో
    వినెఁ గాంచె నంధుఁడే! ప్రభు
    వుని దీవెన! రండిటు కొలువుడి మన నాధున్!


    పరలోకపు తండ్రీ
    వీరిని గాచుము
    ఆమెన్

    జిలేబి

    ReplyDelete


  99. ఓసి! నీపాసగూల! ప్రలోల! చుప్ప
    నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి
    వా జిలేబి ? కతలు బాగు బాగు పోవె
    నీదు డంబములు తెలియనివకొ రమణి!

    జిలేబి

    ReplyDelete


  100. వనధిని జిలేబి! బింబా
    నన! నాతి! విశాఖపట్టణమునన్ గనుగొం
    టిని, చార్మినారునున్ గం
    టిని హైద్రాబాదులో పటిష్టముగ సుమీ !


    జిలేబి

    ReplyDelete


  101. సీసాల కొలదిగా మ
    ధ్వాసవ మాయింట! గంధవహమందదుగా!
    ఆసక్తినికలిగించు ని
    వాసము వాసనల నడఁచి భాసిలు నెపుడున్!



    జిలేబి

    ReplyDelete


  102. చెలి! ప్రవహించు హల గలగ
    లల! వాసము వాసవాదులకు వాసనలన్
    దొలఁగించి భాసిలున్! తృటి
    ని లాఘవముగ తుడిచెదరని తలచెద సుమీ!


    జిలేబి

    ReplyDelete


  103. విను జిలేబి భిక్షమడుగ విభుని నీకు
    విభవములు పెక్కు దక్కును; బిచ్చమెత్త
    సాటి మనుజుల దక్కును చల్ల క్రింద
    ముంత యేను వినవె బాల మూఢురాల!


    జిలేబి

    ReplyDelete


  104. మాకందంబుగ నీరజాక్షి, "పరమాత్మా! నీవె మార్గంబనన్"
    లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్; బిచ్చమెత్తంగనే
    స్వీకారమ్ముగ నీ జనాళిని చెలీ క్షీణించు భాగ్యమ్ములే
    సాకారంబగు! నిత్యసత్యమిదియే సంత్రాణుడా క్షేత్రియే!



    జిలేబి

    ReplyDelete


  105. కందమ్మా! యిదె "ఆశలావు మరి పీకాయెన్ పరాకంబనన్"!
    మందూమాకులతోడు జీవిత మసామాన్యంబుగా బోయె! నా
    డెందంబందున శక్తి గూడె మరి నేడే కొంత! బ్లాగర్లతో
    సందర్భోచితమైన వ్యాఖ్యలిడుచున్ చక్కర్లనేకొట్టితిన్!


    జిలేబి

    ReplyDelete
  106. కంచి గరుడసేవ కందాచ్చి విడువరు ,
    గురుడు యాచకత్వసిరి వదలడు ,
    రంథి విడువలేరు రంధ్రైక శోధకుల్ ,
    జిల దొలంగు నేమి చిత్తమునకు .

    ReplyDelete


  107. చిత్తమునకేది హాయిని జేర్చు నదియె
    జేయ మేలు మనుజులు విజేయులవగ
    మార్గ మదియేను రాజన్న! మాను పెరుగు
    దానికి వలయు నీరును దానికిడగ!


    జిలేబి

    ReplyDelete


  108. రహితో నమాజు విడువక
    అహమదు ఖానుఁ డొనరించె, నాచమనంబున్
    సహనావవతని శాస్త్రియు
    నహరహ మొనరించె విభుని నమ్మి జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  109. ఒనరించె నమాజును తె
    వ్వన నహమదు ఖానుఁ డిష్టపడి యాచమనం
    బొనరించె నిష్ఠతో స్వా
    మిని తలచి ప్రభాకరుడు తిమిరము తొలంగన్


    జిలేబి

    ReplyDelete
  110. కొందరు పలుకాడరు హిత !
    యెందులకో తెలియరా , దిటేమి జరిగెనో ?
    కందుక క్రీడాడితినా ?
    కందాలతొ , నైన , నిచట కక్షలు గలవా ?

    ReplyDelete


  111. ఎవరండీ పలుకాడని
    కవులెవరండీ తెలుపుడి కందమ్ములతో
    నవిలేద్దాం వారిని రా
    జ! విదుర! తెలుపండి మాకు జగడాలేద్దాం :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కందము గట్టనేల? గడగట్టి మహాత్ములు లేనిపోని స
      మ్మందములంటగట్టుకొని మమ్ములదూరముబెట్టనేల? రా
      కేందు మనోఙ్ఞభావనల కిట్లు పెడార్థము తట్టనేల? ఈ
      చిందరవందరల్ మనకు చెల్లని , వివ్వి సహేతుకమ్ములా?

      Delete


    2. అసహనము వలదయా! నస
      నస చిందరవందరల్ మనకు చెల్లనివి
      వ్వి! సహేతుకమ్ములా? రా
      జ! సరియొ కాదో తెలియదు ! సంకటమేనూ!


      జిలేబి

      Delete
  112. కోవిదులేలెండి, కవుల
    కోవకురారండి, బుధులకోవన ప్రథముల్ ,
    భావించి🙏నమస్కరింతును ,
    సేవింతునుగాని, యేమిసేతు? పలుకమిన్ .

    ReplyDelete


  113. తెగడుట పొగడుట జిలేబి, తేనెలూరు
    మాటల వెదజల్లి జనుల మదిని కొల్ల
    గొట్టుట తమ కెదురు తిరుగు ప్రజల భళి
    పొగడినట్టి వారలను జంపుటయె నీతి!



    జిలేబి

    ReplyDelete


  114. కటకట బేడీ జీ! కు
    మ్ముట, పొగడినవారి ప్రాణముల బోరనఁ దీ
    యుటె నీతికార్యమౌ ప్రా
    కటమాయె కదా చలో జి! కాస్త రిలేక్స్ జీ ! :)



    జిలేబి

    ReplyDelete


  115. విశ్వనాథ వారి విస్తృతమగు కల్ప
    వృక్ష ము చదివి యితివృత్త మిది తె
    లుంగు వారి దని పలువిధముల పొగిడి
    రామచంద్రుఁ డాంధ్రుఁ డనిరి బుధులు!


    జిలేబి

    ReplyDelete

  116. పలుమార్లు పొగిడి రమ్మ ఘ
    నులు! రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి వి
    జ్ఞులు వంగభాషలో! ఓ
    జిలేబి! జీపియెసు వారు చెప్పినది సుమీ! :)



    జిలేబి

    ReplyDelete


  117. ఏలుదొరా! రారా న
    న్నేలందువు! వచ్చిచూడ నీవెవరంటూ
    మూలకు తోసెదవు వెసన్
    మూలాధారమ్మునే సమూలముగ కదా!


    జిలేబి

    ReplyDelete


  118. అదే !మళ్లీ కందం :)



    హద్దరి బన్నా ! చూడిటు
    వద్దని కోరినవె మరల వచ్చె! మురిసితిన్
    పద్దెములను వ్రాయుచు నే
    నద్దరి నిద్దరి తిరిగితి నవ్యపు రీతిన్


    జిలేబి

    ReplyDelete


  119. అమలా! జిలేబి ! శనివా
    రము! వద్దనుకొన్నవే మరల వచ్చెనటం
    చు ముదంబు నొందితిన్ శీ
    ఘ్రముగా పనుల తెములుకొని రావడి‌చేయన్


    జిలేబి

    ReplyDelete
  120. అసలర్థంగావట్లా ,
    రుసరుసలేలావయస్య? రొంబమహాత్ముల్
    కసిమసగి గుఱ్ఱుగుండిరి,
    విసవిసలకు పచ్చిమిర్చివిందగున? సఖా !

    ReplyDelete


  121. ఆరని దాహంబాయెను
    తీరని మోహమ్ము సాగె తిరిపెము తోడై
    ధారాపాతము! తెలుపవె
    ఓ రసనా పలుక వేలనో ‌నా చిలుకా!


    జిలేబి

    ReplyDelete


  122. మాతృభాషావమానమ్ము మాన్యత నిడు
    నా జిలేబి యెవరికైన? నాదు భాష
    నాదిగాన సంభాషణ నాట్యమాడ
    వలె మనదగు శైలిని ప్రభావమ్ము చూప!


    జిలేబి

    ReplyDelete


  123. ఆల్ గొల్టీస్ అవేక్ !


    పిడివాదము లేలా! నడు
    నడు! మానక మాతృభాష నవమాన మొన
    ర్చెడివాఁడె మాన్యుఁడౌ? తెలు
    గు డింకి గొట్టును జిలేబి గొల్టి యనంగన్ !



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. // “గొల్టీస్” //

      మీ మీదనున్న అరవ ప్రభావం కనిపిస్తూనే ఉంది. తెలుగు Telugu ==> గులుటె gulute (తిరగేస్తే) (అపభ్రంశం చెంది “గొల్టి”, అంతేనా?).
      వాళ్ళంటే అరవలు, మీకేమయింది మీరు తెలుగు లేగా?

      Delete


    2. మీరు తెలుగు "లేగా" :)

      కాదు ఆవు :)



      జిలేబి

      Delete


  124. పిలుపిదె యాప్యాయముగా
    నలుపెరుగక మీరు నడుపు హలము విడువఁ బం
    ట లధికమగును! పసిడి పం
    టలు రొయ్యలు! వేయుడీ కటకటలు తొలగున్



    జిలేబి

    ReplyDelete


  125. అవసరముల కొరకై విను
    రవి! హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లె
    క్కువ పంటఁ దీయఁగన్! విడు
    వ్యవసాయము! రొయ్య పంట పసిడి మనకగున్



    జిలేబి

    ReplyDelete


  126. ఏక పత్నీవ్రతుడు మగనిగ నిమిడెను
    జానకికి; ఘటిల్లెను గదా సవతి పోరు
    మరియొకజనన మందున మాధవుండు
    మగడుగాన! తనయుడు బ్రహ్మ కరణముగ


    జిలేబి

    ReplyDelete


  127. జగడమ్ములు తప్పవు నో
    పగ! భూమి తనూజకున్ సవతి పోరు ఘటి
    ల్లెఁ గదా యయోధ్యలోన్ కై
    క గుణము కారణముగ పతి కానన మేగన్


    జిలేబి

    ReplyDelete


  128. ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు
    చెప్పు దెబ్బలు తప్పవు చెంపపెట్టు
    తధ్య మోయి తాత విను ప్రతాప మేల
    చద్ది యన్నము తిని తొంగు జల్ది గాను!


    జిలేబి

    ReplyDelete


  129. వలపుల జూపి తినుచు పే
    లలు, ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం
    దలపోయు టొప్పగున్? దె
    బ్బలు తప్పవుగా? నదియె సఫలమాయె సుమీ!


    జిలేబి

    ReplyDelete
  130. కదిసి కపాలవల్లభము కాటికిజేరెడు త్రోవబట్టె , వే
    గదుపగరావుకాళ్ళు,చెడుగా!యిదియేమి? తవాదృశాళికిన్
    ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగందలపోయు టొప్పగున్?
    పదపడి చెప్పుదెబ్బలకు పాలగురాత గమించెనేమిరా !

    ReplyDelete


  131. చిరునవ్వులపోగొట్టును
    పురుషాధిక్యమ్మె, సిరులఁ బోగొట్టుఁ గదా,
    గరితల యాడంబరమై
    న రివాజులు! సుదతి వినవె నాదుపలుకులన్ !


    జిలేబి

    ReplyDelete


  132. జరగండీ! జరగండి! దెప్పుదురె పూజారుల్! జనుల్ స్వామి మో
    ము రవంతైనను చూడ సాధ్యమవదే! మూఢత్వమెంతేనియున్!
    పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్!
    సరియై నట్టి విధానమిద్దియకొ? మార్చంగన్ వరిష్ఠమ్మగున్!


    జిలేబి

    ReplyDelete


  133. చోద్యంబేను చినబ్బా!
    ఆద్యంత రహిత కథ విన నానందమగున్?
    వేద్యమ్ము కానిదయ్యా!
    పద్యమ్మును పూర్తి సేయ భళిసరి యంతే!


    జిలేబి

    ReplyDelete


  134. వారు మహాత్ములు! తాతా
    వీరున్ను మహాత్ములంచు విదులెల్లరినీ
    ధారాళముగా మెచ్చుట
    మా రాజావారి మంచి మనసుకు పొడయౌ!


    జిలేబి

    ReplyDelete


  135. పొడగిట్టనోళ్ల గ్రక్కున
    విడవండీ రాజ! వారి వికటపు చేష్టల్,
    మడిగట్టుకున్న పద్ధతు
    లు, డంబములు సరి విదితములు కదా యెపుడో!

    జిలేబి

    ReplyDelete


  136. నదియా! జిలేబి ! పూర్ణిమ
    ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్
    మదిలో గిలిగింతలతో
    కదలిక తెచ్చును తెలియగ కాముని కృపయే!


    జిలేబి

    ReplyDelete
  137. వినరా వారేరండీ !
    కనరా రెచ్చటను , తమకు కబురేమైనా
    వినబడెనా చెవిని , బుధులు
    పనిమీదున్నారొ యేమొ బహుశా విధులన్ .

    ReplyDelete
    Replies


    1. రాజా వారు,

      చిక్కు ప్రశ్నే :)

      పెద్దలడిగారు కనక సమాధానం చెప్పడానికి ప్రయత్నం.
      తమరేమో వినరా నామంతో కనపడుతూనే ఉన్నారు.

      నిజానికి వారిని తలవడం,వారి ఏకాగ్రతను భంగం చేయడమే.....ఇక...మిగిలినదేమి చెప్పను :)



      జిలేబి

      Delete
  138. రామనామము , వినరా నామము సమమ ?
    తలతిరగగ నేను తలచుటేమి?
    వారి తలచుటన్న వారియేకాగ్రతా
    భంగమగున విహిత ! బాగు బాగు .

    ReplyDelete
  139. శ్రీకళ్యాణగుణాభిరామునకు , రాశీభూత శుంభద్యశో
    రాకాచంద్రమనోఙ్ఞమూర్తికి , మహారాకాసి యుద్వఛ్చిరో
    ప్రాకారంబుల నేలగూల్చిన సుశౌర్యక్షిప్త దోర్దండ బా
    హాకోదండపు రామచంద్రునకు నేనర్పింతు కైమోడ్పులన్ 🙏 .

    ReplyDelete


  140. ఖాతరు చేయక యెవరిని
    జాతి వివక్ష గల నేత శాంతి నిలయమే ?
    మూతి బిగింపులు చూపెడు
    జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?


    జిలేబి

    ReplyDelete


  141. అనుకూలత గల దేశము
    గన శాంతికిఁ బుట్టినిల్లు గద! జాతి వివ
    క్షను జూపు దేశమే గతి
    పెనుపును గాంచును వివక్షు వీవు తెలుపుమా!


    జిలేబి

    ReplyDelete


  142. ఓర్ని! పాసగూల! ఒక్కరు లేరక్క
    డౌర తెలుగు తెలిసి ! డాబు చేయు
    వారు పెక్కు గలరు ! వలదు వద్దిక వద్దు
    సిద్దిపేట కేగవద్దు కవులు!

    జిలేబి

    ReplyDelete


  143. అనుభవముతో పలికితి సు
    జన! వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్!
    గనరారు సజ్జనుల్ తెలి
    యని విషయములను! విడువరయా యొరకొనకన్!


    జిలేబి

    ReplyDelete


  144. సిరియై వెలసెను లక్ష్మియె
    విరిసిన కమలమునఁ, బుట్టె విషసర్పమ్మే
    కరుకైన మనుజుని మదిని
    పరిణామము చెడు తలపుల వాడయ్యె గదా!


    జిలేబి

    ReplyDelete


  145. మనుజుని మేలు కొరకు చల
    గన విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బు
    ట్టెను, కాలనాగమే బు
    ట్టెను నరుని మదిని జిలేబి టెక్కులు బోవన్


    జిలేబి

    ReplyDelete


  146. మీ మొదటి బ్యాంకు ఖాతా
    ప్రేముడి థ్రిల్లూ జిలేబి‌ వేరు సుమండీ
    గోముగ కిడ్డీ బ్యాంకును
    నీమము తప్పక కొలుచుచు నిండుగ నింపన్


    జిలేబి

    ReplyDelete


  147. ఎంతో యెంతో బావుం
    దెంతో యెంతో గదా యిదెంతో సుమ్మీ
    వంత యిక పాడుదాము మ
    రింతో అంతో జిలేబి రివ్వున రావే !


    జిలేబి

    ReplyDelete
  148. అంతా బాలే దమ్మీ !
    కొంతా బాలే , దిదేమి కోడిపకోడా ?
    సుంతైనా బాగుందుకు
    చెంతట గల ఆవకాయ చీకుడుబద్దా ?

    ReplyDelete


  149. అరయగ జిలేబి యా భవ
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ
    నరులను మోక్షపథమ్మున
    పరుగిడ జేయు నతడి పిలుపై తూర్యంబై



    జిలేబి

    ReplyDelete


  150. సఖి! నుదిటిపై భళి మువ
    ఱ్ఱఖ! హరుని దురూహలే వరములై సిరులై
    సుఖమిచ్చు నెప్పుడున్ ! పో
    చు ఖుదా నెపుడువిడువక హుజూర్సాబనుచున్



    జిలేబి

    ReplyDelete