అసంభావితాలు :)
Story continues.
కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉపయోగించకుండా కాలగర్భంలో కలిసిపోతే అవి ఓయబ్బో తప్పే తప్పూ అంటూ చాంతాడంత టపాలు రాసే విదులనబడే విదురులు గల పంచదశలోకాని కున్నూ, బ్రౌను దొరగారి నిఘంటువు లోని పదమే కదాండి అంటే ఆంధ్రభారతి లో లేదంటూ లింకు చూపించే మా వినరా వారికున్నూ, ఇదే మాట మా జైగొట్టి వారు సవాలు విసిరి మరిన్ని ఆధారాలతో వస్తే ఆయ్ చర్చ ఇంతటితో సమాప్తమనేసి ఏకపక్షాన నిర్ణయం తీసుకున్న మా శ్యామలరాయల వారికున్నూ బస్తీ మే సవాల్ ఇదిగో స్క్రీను షాటు - బ్రౌను నిఘంటువు నుండి.
కాయ్ రాజా కాయ్
ఇక్కడ కామింటడానికి
టపా అద్దెకివ్వ బడును :)
ఇట్లు
నారదీయ
జిలేబి
You are incorrigible :)
ReplyDeleteకదా, నీహారిక గారు.
Deleteసంస్కృతమైనా , మరి యేభాషాపదమైనా , కాలానుగతంగా
ReplyDeleteపదంలోనూ , అర్థంలోనూ మార్పులు సహజం . భాష పరిణామశీలి . పాఱుటేరు . మురికికూపంకాకూడదు .
ఇది ఇలానే ఉండాలి అని నిపతించబట్టి సంస్కృతం మరుగునపడింది .
తైలం అనే సంస్కృతపదానికి నువ్వులనూనె అని వ్యుత్పత్యర్థం . అంటే ఆపదం పుట్టినప్పటి అర్థం .
కాని , కొంతకాలానికి నువ్వులనుండేకాక , ఏగింజలనుండి
తీసిన ఏనూనెకైనా వ్యవహారంలో తైలమనే విస్తృతార్థం వచ్చింది . మరికొంత కాలానికి అర్థవిపరిణామం చోటుచేసుకుని తైలమంటే డబ్బు అనే అర్థం వచ్చింది .
ఈ పరిణామ క్రమం సహజం .కాదంటే దాన్ని మూర్ఖతతవమంటారు . ఇది సాధువు ,ఇది అసాధువు అనే
బొమ్మడాయిలున్నారు . జనబాహుళ్యంలో స్థిరపడ్డ నుడికారమంతా సొగసైనదే .తమకుతాము పండితుల మనుకునే పిడికెడు మందు మూర్ఖులకోసం కాదు భాష .
భాష జనబాహుళ్యపు బహుళ ప్రయోజనం కోసం .
కోక అనేశదం ఎఱ్ఱటి కట్టువస్త్రం . మొదట్లో ఇది స్త్రీ పురుషు లిరువురికీ సామాన్య కట్టువస్త్రం . కాలాంతరంలో ఏరంగుదైనా కోక అనే పిలువబడింది మరియూ స్త్రీలధారణకే పరిమితమయ్యింది .
Deleteఅలాగే ,
చెంబు అనేపదం , ఎఱ్ఱటి రాగిలోహపు పాత్రవిశేషం .
అటుపిమ్మట ఏలోహంతో తయారైనా సదరు పాత్రవిశేషాన్ని చెంబు అనడం గమనించవచ్చు .
"జిలేబి"గారు,
ReplyDeleteఓహో, ఇంగ్లీష్ నుండి తెలుగుకు వచ్చారా?
బ్రౌన్ దొరగారు తెలుగు వారికి నిస్సందేహంగా చిరస్మరణీయులే.
బ్రౌన్ దొరగారు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో చెప్పిన మాట ... బ్రౌణ్యం తరువాత అంతగానూ ప్రసిద్ధి చెంది ఏనాటి నుండో విరివిగా వాడుకలోనున్న శంకరనారాయణ గారి English-Telugu నిఘంటువులో అదే Incredibility పదానికి బ్రౌన్ గారిచ్చిన "అసంభావిత్వము" అనే అర్ధం ఇవ్వలేదేమిటో మరి?
అయినా ఎందుకులెండి పొద్దునే "జాల్రా" (మీ ఊతపదమే)?
Deleteసరే incredibility ని ఆంధ్రభారతి లోనే సర్చ్ చేసి చూడండి వినరా వారు :)
జిలేబి
అయినా ... "ఏ పందెమైన గెలుపు" మీదే "జిలేబి" పండితా.
ReplyDeleteకానివ్వండి 👍.
(శ్యామలీయం గారి ఓ పద్యం స్ఫూర్తితో 😉)
ReplyDeleteపందె మేదైన గెలుపాయె భామలదె! జి
లేబి ఆనంద మాయెను లేమ నరస
రాయ లైన నన్నోడింప రాసు కోవె
పదము లేవైన నాకేమి పాయె పోవె!
జిలేబి
పంతమేలండి ? వీడండి, పందెమనుచు
ReplyDeleteగెలుపులోటము లనుచు నుంకించ వలదు ,
అంద రరగొర ఙ్ఞానులే , ఎందుగాని
ఎఱుక గలవాడు పరమాత్మయే నిజముగ .
బంతంబు నేల బిజిలే అమ్మణ్.. సరేసరి సరాసరి ఫిలిప్ బ్రౌన్ దొరబాబు డిక్షనరి నే అమాంతం జిల్లెడ బట్టి దెచ్చితిరి.. ఇచ్చోట వ్యాఖ్యఁబులు ఆమోదంబు వొంది ప్రచురింప బడ్తాయి. జ్ఞానమనేది నది వంటిదని అనుకుంటా నేను.. ఆ నిర్ఝరులన్ని ఓ చోట చేరి నాకనే అది జ్ఞానకోశ భాండాగారమాయేను..
ReplyDeleteప్రణతితి సతి సమేత శ్రీత ధరణి.
ఇంకొన్ని ఆంధ్రభారతి ఫలితాలు, అన్నీ అచ్చ తెలుగు పదాలే.
ReplyDeleteతంబాళము: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
సుద్దరోడు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
ఔసలి: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
షడ్దకుడు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
పానాస: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
చుక్కపొద్దు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
గోరుకొయ్య: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు.
ప్రతి హిందువూ ఈ యజ్ఞ యాగాదులు మానివేసి యోగధ్యానాలు చేయడం మేలు. పైసా ఖర్చు లేకుండా డైరెక్ట్ గా వ్యక్తిగత మేలు జరుగుతుంది. ఉన్నాడో లేడో తెలియని విభునికి వేవేల నామాలు చాలవా ?
ReplyDelete"ఆంధ్రభారతి" అయినా మరోటి అయినా చివర్లో నేను అన్నది .... బ్రౌన్ vis-a-vis శంకరనారాయణ.
ReplyDeleteవిజయోత్సాహం ట్రంప్ గారి సింహనాదం లాగా ఉంది. ఏవిటో, ఎవరి ఆనందం వారిది.
ReplyDeleteమీ చిత్తమె మా భాగ్యము!
ఓ చంద్రముఖీ జిలేబి ఓ బామ్మా! మీ
రే చందమునకు చందము
వేచితిమి మరొక్క పద్యవేదన కమ్మా !
జిలేబి
ReplyDeleteప్రియమైన నేస్తమా! అ
య్యొయొ! గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనిం
చియు నీఁదె నీటిలోన్! దుమి
కి యురికి వెనువెంట తల్లి కిమ్మనక చనెన్!
జిలేబి
ReplyDeleteనేస్తమా శకార కథను నేర్పు మయ్య!
గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
వ్రాసు కొనుజిలేబి, వెనుక వాని తల్లి
చనెను పరుగులిడుచు వెస చక్కగాను!
జిలేబి
ReplyDeleteపోడిమి మీ ప్రభుత్వమున భూరిగ కాన్పడు బిల్లు బిల్లులోన్!
మోడి గవర్నమెంటిది! ప్రమోదము చేర్చుచు పార్లమెంటులో
గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్!
వేడిని చేర్చె యందరికి వెంచరు కేపిట లిస్టు లవ్వగా!
జిలేబి
ReplyDeleteఇచ్చిన తేటగీతి పాదమెక్కడే?
హరి! వేదమే ప్రమాణమ
నిరి ఫ్రెంచి జనులు! తెలుసుకొని మసలు కొనవ
య్య! రవంతైనను సంస్కృత
మరయగ చూపించు కృషిని మన్నన దక్కున్!
జిలేబి
ReplyDeleteకందోత్పలము
భగవానుని దీవెన క్ర
మ్మగ వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్
జగమెల్లఁ జాటిరే రమ
ణ గురువుల మదిని తలచుచు నను నిత్యమ్మున్!
జిలేబి
ReplyDeleteజీవితమునుండె కతలు మ
హావిష్కరణ యగుట సహజమ్మవియే నీ
భావితరానికి సూచిక
లై వెలుగును శ్రీధరణిత ! అదిద సరి దహా!
జిలేబి
ReplyDeleteచిన్ని చీమ కుట్టె చిమచిమ మంటాయె
చిన్ని చీమ కన్ను చేరెఁడంత
చిన్ని చీమ వింత చెప్ప నెవ్వారి త
రమగు శంకరాభరణ కవీశ!
జిలేబి
చేరెడంత అనరాదండీ. చేరు క్రియాపదం. ఎడు మానార్ధకం. సరైన ప్రయోగం చారెడంత అన్నది.ఇక్కడ చార అన్నది అరచేతి కొలత. చారెడు అంటే అరచేతిలో పట్టెడునంత అని.
Delete(ఇప్పుడిక ఇలా తప్పొప్పులను చూపానని నామీద దాడి మొదలు కావచ్చు. ఒకరు వెక్కిరింతగా వ్రాస్తారు. వారి మిత్రులొకరు పండితులూ మూర్ఖులూ అంటూ విసుర్లు రువ్వుతారు. నేను స్పందించను. అదిగో పారిపోయాడూ అంటారు. అంతా తెలిసే వ్రాస్తున్నాను.)
// "(ఇప్పుడిక ఇలా తప్పొప్పులను చూపానని నామీద దాడి మొదలు కావచ్చు." //
Deleteనిజమేనండోయ్, శ్యామలరావు గారు.
Deleteఅబ్బే! అననండి - చదివేటప్పుడు నాకూ అబ్బే చారెడు కదా వుండాలని అనిపించె. సమస్య ఇచ్చిన వారు సరిగానే ఇచ్చి వుంటారనుకున్నా. పూరించడం వరకే నా వంతు ( మీ ప్రకారము పదములను " కిట్టించిడం " వరకే నా కైంకర్యం :))
మీ కామింటును సదనంలో పెట్టడమైనది.
జవాబేమైన ను వచ్చిన తెలిపెదను.
ఇట్లు
అక్కడిదిక్కడదిక్కడిదక్కడ
జిలేబి
Deleteసదనపు జవాబు -౧
చేర ఎఁడు = చేరెఁడు. సాధువే. చేర = ఇంచుక వంచఁబడినచేయి, ఎఁడు = పరిమాణార్థకము.
ఇక్కడ సంధి నిత్యము.
11.
అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.
మూర + ఎఁడు = మూరెఁడు
వీసె + ఎఁడు = వీసెఁడు
అర్థ + ఇంచు = అర్థించు
నిర్జి + ఇంచు = నిర్జించు
అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది.
రాములందు - రాములయందు, హరియందు, ఎనిమిదవది - ఎనిమిదియవది.
చేరు కాదని గ్రహించఁ దగును.
పోచిరాజు కామేశ్వరరావు గారు
ReplyDeleteకందోత్పలము
కిసుమీసు పైన దాని మ
నసు! చిన్నది చీమ! లోచనము చేరెఁడు! నో
రు సురంగమార్గమే! వెస
ముసురుకొనుచు పైన తిరిగె మోహము తోడై!
జిలేబి
"చీమ కన్ను" / "లోచనము" చారెడంత ???? 🤔🤔
ReplyDelete
Deleteఆంధ్రభారతి ఉవాచ-
చేరెడు
చేరెడు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
chēr-eḍu
[Tel.] n.
1. A handful.
2. A proverb says చచ్చిన వాడికన్నులు చేరెడేసి a dead man's eyes are a hand's breadth, i.e. , very fine!
ఏమండోయ్ వినరావారు
ఇప్పుడిక ఇలా తప్పొప్పులను చూపానని నామీద దాడి మొదలు చేయమాకండి :) "మీ" ఆంధ్రభారతి లో "కలదు"
ఇట్లు
నారదీయ
జిలేబి
ఆంద్రభారతిలో ఉన్నా మరెక్కడ ఉన్నా తప్పుతప్పే. కొంచెం ప్రయోగించే ముందు ఏమాటకైనా అర్ధవివేచన చేయండి. తరువాత మీ యిష్టం. వాదనకోసం చెప్పలేదు. ఎలాగూ మీయిష్టమే ఐనా విషయం చెప్పటం మంచిది అని చెప్పాను. స్వస్తి.
Delete
Deleteబ్రౌణ్యం కూడా తప్పేనంటారాండీ శ్యామలీయం వారూ ? ( ఇదేదో మరో అసంభావితం లా అయ్యేట్టుందే ? )
జిలేబి
ReplyDeleteసేఠు బ్యాంకు షేరు ౨౮౦ టచ్ చేస్తే కొంత దిగేద్దామని చూస్తోన్న నిఫ్టీ :)
అబ్బే ! ఏనుగు పరుగులెత్తదే బిరీన :)
ఓ సేఠు బ్యాంకు స్టాకూ
నీ సొబగగు హైపు చూడ, నిఫ్టీ వేచెన్
కూసింత బిరీన దిగం
గా! సివగీ పెరగవే చకచక జిలేబీ !
జిలేబి
అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ
ReplyDeleteచేరేడమే ఐయరు మామ్మ వంతు
సమోసా పూరీ యానంలో
చేరేదెలా అయ్యారే పితూరీల తంతు
ReplyDeleteఅక్కడి దిక్కడ దిక్కడి
దక్కడ గ్రక్కున కలయుచు దాష్టీకముతో
మిక్కుటముగ పద్యమ్ముల
టక్కున గిట్టించు పంచదశలోకములో!
జిలేబి
'తరువాత చాల కార్యక్రమాలు జరిగాయి. భగవదారాధనలు ద్రావిడ వేద అధ్యయనాలు - చేరలకొద్ది నేయితో - వేలమందికి లడ్డూల సాపాట్లు - చందన గోష్ఠులు, తిరునామాలు, మంగళ హారతులు ఒక మహాపర్వ వాతావరణాన్ని కలిగించాయి.'
ReplyDeleteశ్రీ దాశరధి రంగాచార్య 'జీవనయానం'నుండి
చారెడు అన్నపదం కన్నులు అనే మాటకు ముందు వాడుతారు . అంటే వెడల్పాటి పెద్ద పెద్ద కళ్ళని అర్థం .
ReplyDeleteఅరచేతిని దొన్నెలా వంచినప్పుడు ఏర్పడే లోతును
చేర అంటారు . అందుకే 'చేరలకొద్ది నేయిని ' - అనే
ప్రయోగాలు .
'చిన్ని చీమ కన్ను చేరెఁడంత'
ReplyDeleteకన్ను విషయంలో చేరెడు తప్పు ,
చారెడు అని ఉండాలి .
అరచేతిని నిటారుగా చాచి , వ్రేళ్ళక్రిందుగా బొటవ్రేలుంచి
'ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడుదు .....'
అని వరూధుని ముద్రవేసి భూసురేంద్రునికి చూపింది .
జిలేబిగారూ , తమ గురుదేవునికి విన్ళవించండి , ఇక్కడి
దక్కడ 🙏 .
ReplyDeleteగుండెల నిండుగ భక్తిని
మెండుగ నిలుపుకొని వేయ మేలగునయ్యా
దండిగ దాష్టీకమ్ముల
హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్?
జిలేబి
ReplyDeleteజీవితమున కాధారము
మా వేల్పువు రామచంద్ర మాకన్నియు నీ
వే వేడెదమయ్య శరణు
గావు వెలసి భూజ తోడుగా హృదయమునన్
జిలేబి
ReplyDeleteబుర్రలో గుంజు ఉండాలె పూవుబోడి
విన్నకోట విజ్ఞులవలె విషయమెరిగి
వ్యాఖ్యల మహరాజయ్యిరి పండితు లెన
లేని విన్నాణపుగని జిలేబి వారు!
జిలేబి
చైంచిక్ :)
ReplyDelete"చేరెడు" కన్నులు తప్పగు
"చారెడు" కనులన వలెన్ విచారింపంగా
శ్రీరాజన్న,విదులు మా
శ్రీరాముని శ్యామలీయు సెలవిచ్చిరిగా!
జిలేబి
ReplyDeleteజయములు కలిగిన వేళల
భయమ్ము కలిగిన సమయము వలయును స్వామీ
దయ, అభయము స్వామీ రా
మయతండ్రీ గొలిచెద నిను మానక నెపుడున్
జిలేబి
ReplyDeleteరక్షణ నొసగ దగు గాచి రాధనముగ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము
కీడు సేయతలచినచో కింకరుడిని
నీతి సూత్రమిదె జిలేబి నీటుగాను !
జిలేబి
ReplyDelete"కనలించితివే బింబా
నన! మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వా
నినిఁ జంపఁగాఁ దగున్? నీ
తినివీ డితివే నెలతుక!" తిట్టెను హితుడే!
జిలేబి
ReplyDeleteఎదిగిన కొలది జిలేబీ
యొదగాలి సుజనులగుచు ప్రయోజన మపుడే
గద వారు సమాజమునకు
పద నేర్చుకొని విదురులకు వందారనవే !
జిలేబి
ReplyDeleteఅడగకూడని కోరిక నడుగ విభుని
డింగరుడు, తథాస్తనగా ఫెడేల్మటంచు
దేముడది భక్తుడు చెడగా దీవెనయగు
తెలుసు కొనుచు జిలేబి మతి చెడ నీకు
జిలేబి
తెలుసుకొనగ మతిచెడునా?
Deleteబలు ఙ్ఞానోదయమగున్ , విభవము కలుగు , త
ప్పులు పట్టంగనగును , పే
రులు వచ్చు , బుధులగుదురు , విలోకించు హితా !
ReplyDeleteతమరి కంటె నసలు తాతయ్య పెద్దయె
వరయ! ప్రణతు లివియె బ్లాగు గాంధి!
జిలేబి
ReplyDeleteఇద్దరమూ కలిసి భళా
పెద్దలకు నమస్సులనుచు వేడెదమయ్యా
ఉద్దీపనకలిగించును
హద్దరి బన్నా మనకది హాయిని జేర్చున్ :)
జిలేబి
ReplyDeleteనీకేమి వలయు నన్నది
నీకెక్కువ యెరుక లేక నీకాధారం
బై కరుణచూపెడు ప్రభువు
కా ? కొంతైనను తెలివిడి గాంచు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనాకేమి వలయు నో విను
నాకెరు కోయ్! పద పదా అనావశ్యంగా
నా కెడ పొడిగించకు రా
నీ కామింటులను శుంఠ నీకేమెరుకోయ్ ?
జిలేబి
// "శుంఠ నీకేమెరుకోయ్ ?" //
Delete"శుంఠ" అనే పదప్రయోగం శ్యామలరావు గారు చేసినట్లు లేదే? పైపెచ్చు అవతలి వారే ఏకవచన ప్రయోగం చేశారు.
మీరు వ్రాసినది తంపులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.
Deleteరీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అని ఆంగ్లంలో అంటారటండి . నా కైతే తెలియదు కానీండి... తెలిసిన వారికి తెలియవచ్చు
జిలేబి
సమఝనే వాలే సమఝగాయే; నాసమఝే ఓహ్ అనాడీ హై
Delete
ReplyDeleteదేవుని సందేశమ్మెరు
కై వరలని పామరులు నిఖార్సుగ కొరగా
రీ వసుధను బతుకంగా!
దేవా చూపుము కరుణను దీనుల పైనన్ !
జిలేబి
డిఫరెన్షియేషన్ సందేశం అందని ఇగ్నోరెంటులకు; అందికూడా తిరస్కరించిన నాస్తికులకు నడుమనండీ!
Delete
ReplyDeleteహా! మెజస్కో! ఓ కోటి షేర్లు చేతులు మారేయా! ట్యాక్సు గేములో పుణ్యము సంపాదన! వాహ్ బుర్ర!
ఎక్స్ డేట్ లో ఈ స్టాకు వేల్యూ యేమగునో !
క్రిస్మస్ తాత సాంతా వెదజల్లు దస్కాలు :)
ఓయి మెజస్కో! డివిడెండ్
సాయించుచు పుణ్యము భళి సంపాదించా
వే!యిది కనివిన్నది కా
దే! యెవరిది బుర్రయో కదే పువుబోడీ!
జిలేబి
ReplyDeleteరామ రామ :)
ఔర! మోహమందు నాభామ కెడ నన్ను
తేలు గుట్టె బాధ తెలియదింత
యైన నేమి వింత! హయ్యారె మధువును
గ్రోలి నట్టి మత్తు గ్రోల గ్రోల !
జిలేబి
ReplyDeleteకందోత్పలోత్సాహము :)
ప్రియసఖి ణిసిధాత్వర్థము
కయ! కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బా
ధ యెఱుంగఁ డింతయున్ చూ
డయో! యిదెకదా మహిమ పడతి చెంతయ్యో!
నారదా!
జిలేబి
ReplyDeleteచేద్దాము నమస్కారము
వద్దనకన్ స్వీకరించి వందనముల పా
రేద్దామోయ్ చిరునవ్వును
హద్దరి బన్న మనకేమి హాని జిలేబీ !
జిలేబి
ReplyDeleteనమ్మకమన్నది బహుమతి
నిమ్మదిగా దొరకదాయె నెందరికో సా
యమ్ముగ! విభుని కృపవలయు
నిమ్ముగ దొరకంగ సూర్యుని పలుకిది సుమీ!
జిలేబి
ReplyDeleteమనమంతా వృద్ధులమే
మునులము, జ్ఞానులము, వయసు ముదరని వార
మ్ము, నలుతెరగుల విదురులము
మనలో భేదములు లేని మాన్యులము కదా!
జిలేబి
'మనమంతా వృద్ధులమే'
Deleteఅనఘా!ఇదిమాత్రమె నిజ, మటుపైవన్నీ
ఘన యసదు ,లహంకారపు
మనుజుల మదులందు మెదలు మాయాజాలాల్ .
ReplyDeleteకట్టిరి కొత్తిల్లరరే
పెట్టిరి "స్వాగత్" అని భళి పేరు, జిలేబీ
యెట్టెట్టా! వరుసగ మీ
చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్?
జిలేబి
ReplyDeleteకందోత్పలోత్సాహము
కటక పురమున గృహంబె
న్నుట, చుట్టము వచ్చినాఁడనుచు శోకము వె
ట్టుట, ధర్మ మిద్ధరన్, కట
కట తప్పదు రాజధాని కనుక జిలేబీ !
జిలేబి
ReplyDeleteఓహ్ డౌజోన్స్! ఓహోహో నిఫ్టీ :)
డౌ జోన్సూ! ఆకాశం
పై జోరుగ యెగిరినావు ! పై మా నిఫ్టీ
తాజా గా భళిభళి యు
త్తేజమ్మును గాంచునో సుదీప్తి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteబ్రతికేయ్ నన్ను మరిచి పో
కుతకుత పడకు మతిమరుపు కూడిందనుచున్
వెతలని, తొక్కేయ్ తలపుల
వి తాకగా, తెలియ దెవరు వీరోయనుచున్
జిలేబి
ReplyDeleteటపటప కందముల తినెను
విపినమ్మున ధర్మరాజు, పిజ్జాను దినెన్,
టుపుటుపు బండిని బెంగ్లూ
రు పట్టణమెడలి జిలేబి రొప్పుచు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteబులుసు ధర్మరాజు వారి జోర్హాటు నుండి మేఘాలయా టూర్
అపురూపంబగు దృశ్యమయ్యె నయగారాలొల్కు మేఘాలయా!
చపటమ్ముల్ చలి చేత కొంకరులు! విస్తారమ్ముగా వీక్షకుల్!
విపులమ్మై చిర పుంజి నిర్ఝరమదే! విస్ఫారితంబయ్యెడా
విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో
జిలేబి
మేఘాలయాకు మీరు వెళ్ళారా? బులుసు వారు వెళ్ళారా?
Deleteఅలనాటి ప్రఖ్యాత నటుడు కీ.శే.విన్నకోట రామన్న పంతులు గారి పేరు తెలియనివారు తక్కువ. పాత "కన్యాశుల్కం" (CSR, Dr.గోవిందరాజుల సుబ్బారావు, NTR, సావిత్రి తదితరులు) సినిమాలో ముఖ్యపాత్రల్లో ఒకటైన అగ్నిహోత్రావధానులు వేషంలో మరచిపోలేని నటన రామన్న పంతులు గారిది. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా ఇవాళ్టి "ఈనాడు" దినపత్రికలో (మెయిన్ పేపర్, "వ్యాఖ్యానాలు" శీర్షిక, హైదరాబాద్ ఎడిషన్ 19-Dec-2020) వచ్చిన స్మృత్యంజలి ఈ క్రింది లింకులో చదవచ్చు.
ReplyDelete"నటనకు కంచుకోట" (విన్నకోట రామన్న పంతులు గారు)
Deleteమంచి వ్యాసం. వారి మనవడే రాసినట్టున్నారు ?
(ప్రదీప్ సినిమా నటుడు రచయిత అని వుంది)
సూచన - మీ లింకు కొత్త ట్యాబ్ లో ఓపెన్ అయ్యేటట్టుగా ఇవ్వగలరు .
జిలేబి
అంటే ఇచ్చిన లింకులో ఇతర విశేషాల లింకులు కూడా ఉన్నాయి కదా అనీ, కావాలంటే వాటి మీద కూడా క్లిక్కి చదువుకుని ఆ పేపరు వారిని ప్రోత్సహిస్తారనీ .... కొత్త ట్యాబ్ చెయ్యలేదన్నమాట 🙂.
Delete
Deleteహయ్యో! నేనన్నది వీరికర్థము కాలేదే! ఎటుల విశదీకరించుట ! Open in new Tab హైపర్ లింకు లో లేదా ! :)
జిలేబి
ReplyDeleteధనమొక శక్తి జిలేబీ
మన కవసరమైనది సరి మన్నగ నిలలో
మనుగడకు మించి వ్యర్థమ
గును సద్వినియోగము సరి గూడక సుదతీ!
జిలేబి
ప్రముఖ కార్టూనిస్ట్ రామకృష్ణ గారు నిన్న (19-12-2020) హైదరాబాదులో కాలం చేశారు 🙏.
ReplyDeleteకార్టూనిస్ట్ రామకృష్ణ గారి మరణం
------------
కొంత కాలం క్రితం "Bharat Today" వారికి రామకృష్ణ గారు ఇచ్చిన ముఖాముఖీ ఈ విడియోలో చూడవచ్చు 👇.
కార్టూనిస్ట్ రామకృష్ణ గారి 2018 నాటి interview (Bharat Today tv)
ReplyDeleteనికటంబాయెను జీవిత
పు కడపటి మజిలి! వెడలెద పుట్టిన దెసకే!
అకటా యేమిబతుకిదియొ!
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
జిలేబి
ReplyDeleteఅరకొర తెలివివలదు విను
మొర! సకల సుఖాలవాలము శ్మశానమె యం
దురు పండితోత్తముల్! కను
క రవంత విభుని తలంపు కావలె నరుడా!
జిలేబి
ReplyDeleteమానవ సంబంధాలను
మీనా! గుణగణములెల్ల మించారగ సు
మ్మీ నిండుగ శాసించెను
తానపు సుడియై విడువక దస్కంబె గదా!
జిలేబి
జిలే
ReplyDeleteకలరా అంటే కలరం
డి! లెస్స గ జనాళి సేవ డిగనురుకులతో
డిలలో చేయుచు జీవిత
ములలో మార్పులను తెచ్చు ముని రాజువలెన్
జిలేబి
ReplyDeleteహతవిధీ యేమాయెను బో మా టపాల చదువు వారు రారే!
రారు రారు రారు రాధన మిచ్చెడు
నాదు బ్లాగు చదువ! నాల్గు పాద
ములను బరుకు జనుల ముచ్చట గొల్పగ
పొగిడి పొగిడి పొగిడి పోదురయ్యొ!
నారదా
కొంత సేద దీర్చుకొందు :)
జిలేబి
పరార్ :)
ReplyDeleteఅరె! నా బ్లాగు చదువరే
పురుషులు! మూర్ఖులు! కుజనులు! పుణ్యవిదూరుల్
మరి లేరెవ్వరిల జిలే
బి! రారు రారు చదువంగ విధిరాత యిదే!
ఓ బ్లాగు బడుగు జీవి ఆర్త నాదం
జిలేబి
ReplyDeleteవరుసల్ గట్టుచు నాల్గు పాదముల జబ్బల్దట్టి కిట్టింపగా
సరిలేరెవ్వరు మీకటంచు గడనల్! స్వామిన్ ప్రశంసింపగా
నరరే! వీక్షకు లేరి! లేరె చదువంగానాదు బ్లాగ్వ్రాతలన్!
పురుషుల్ మూర్ఖులు! పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్!
నారాయణ!
జిలేబి
అకటా!అకటావికటపు
ReplyDeleteటకటక లికచాలు, చాల టముకయ్యె, కటా!
పకపక నగుటే పనియా?
శకార ! టక్కుల టమార ! సంబర మారా !
ReplyDeleteసంబర మా ? రా కుస్తీ
ఢంబము గా చేసెదమ్ము టక్కుటమారీ
జంబమ్మకో జిలేబీ?
టింబక్తూరు రమణీ ఫెడేలగు చెంపా :)
జిలేబి
ధంబోళి ఝంభ భంబా
ReplyDeleteకుంభీరానుజ నిశుంభ ఘోరాఘోరా
జంభాసుర భంభోళా
దంభము చాలించి పొర్లుదండా లిడుమా .
ReplyDeleteదండాలిడదు జిలేబీ
భండన భీముళ్లనైన వారెవ్వా నా
గండర గండలనైనన్
తిండాడేడట్లుచేయు తింగరి బుచికీ :)
జిలేబి
కోదండ దండ దండన
ReplyDeleteకోదండము తప్పదింక కోతలు విడుమా
ఏదీ మా రాము దయా
మోదప్రణుతుల్ విధించి ముదమును గనుమా .
ReplyDeleteకోదండ దండనమ్ము ప్ర
చోదిత మార్తాండ తేజ ఝుంకారము మా
కై దండగ మారు కవీ
శా! దమ్ము గలదెదురుకొన సల్లాపముతో!
జిలేబి
రామా యను నామ మొకటె
ReplyDeleteరాముని కార్ముకమునుండి రక్షించు హితా !
క్షేమము మనకా దాస సు
ధీమంతుల పాదపూజ దెలియ మహాత్మా !
ReplyDeleteరారా! సరసకు రారా
యేరాళమ్ముగ కొలువగ యీవైపెపుడై
నా! రామా! రారా! రా
రా! రాధనమిద్ది నాకు వ్రాసుకొనుటయే
జిలేబి
ReplyDeleteధీమంతులతో పోటీ
మామికి నచ్చును విరివిగ మహితాత్మా రా
జా! మించారగ సుమ్మీ
స్వాముల సన్నిధి యె భళి ప్రశాంతత తనకున్
జిలేబి
దారికి రాకా తప్పదు
ReplyDeleteదారదె రహదారి మనకు రామునిదారే
వారికృప వారియనుచర
కూరిమి మనజీవనమునగొప్ప గడింపన్ .
ReplyDeleteమనవంటి వారలు దొరుక
మునుగడ వారలు భళి తపమొనరించిరి స్వా
మిని సేవించిరి హితులుగ
మనలను బడయంగ సూవె మహిని జిలేబీ
జిలేబి
ReplyDeleteఅద్ధరణిజను హరింపగ
బుద్ధిని విడి, రాముఁ డందె భూమిజ కరమున్
యుద్ధమున రావణుని దు
ర్బుద్ధిని నడచి మన దేశపు పురాణమునన్!
జిలేబి
శుధ్ధాంతరాత్మ నిలయుని ,
Deleteబుధ్ధినివిడి గురుడు రామ భూవిభు పై దు
ర్బుధ్ధిసమస్యలనిడెడు , వి
శుధ్ధిగలుగదుగద ! కల్మషోధ్ధతుల కడన్ .
ReplyDeleteమతిలేని మూఢులయ్య ! వ
సతిగా ధ్యానమ్ము చేసి చావొచ్చుగ! తా
గి తరించి కొత్త వత్సర
పు తీరిదని చెప్పుటా! కబోదులు గాదే?
జిలేబి
ReplyDeleteఅబ్బబ్బ ఏమి చలి అండి బాబోయ్!
బలికా వద్దోయి నరుడ
చలి బాధకు, దాఁగుము హిమశైలమునందున్
చెలిచెంత వెచ్చగాను గు
హలోన కప్పుకొని కంబళమ్మువలె సుమీ
జిలేబి
ReplyDeleteబలికా వద్దు జిలేబి! మ
హిల! చలి యిడు బాధ వోవు హిమశైలమునం
దల దాఁచుకొన్నచో మగ
ని లావగు కరములలోన నిక్కముగ సుమీ !
జిలేబి
ReplyDeleteఅసలైన తెనుగు పద్యపు
మసాల కలదయ్య పద్యమందు జిలేబీ
దెస తిరిగి దండమిడి వ్రా
య,సులభ ముగ నేర్వ గలవయా శ్రీధరుడా!
జిలేబి
ReplyDeleteఅటజని గాంచె - వ్యక్తిత్వ వికాసము - గరికిపాటి వారి విశ్లేషణ -
https://youtu.be/VGg-9DfZ1qE
అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
కటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
జిలేబి
ReplyDeleteకనబడె మూడంటే మూ
డన తెనుగు పదాలు సూవె! డాంబికముగ పె
ద్దన సంస్కృతభూయిష్టమ
గు నడక నలరించెను గునగున పరుగులతో !
https://facebook.com/BashaaBharathi/photos/a.368490523299208/758985704249686/?type=3
జిలేబి
ReplyDelete"ఉస్మానూ, కృష్ణయ్యా"
ఇస్మాయిలు బిలిచె "రండి యింటికి నేడే
క్రిస్మసు పండగ గృహమున"
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్!
మెర్రీ క్రిస్మస్
ప్రభువు మిమ్ము లెల్లరిని చల్లగ చూచు గాక!
ఆమెన్!
జిలేబి
ReplyDeleteఇలలో సంభ్రమముగ బా
బులు క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూ
జ లొనర్తు రెల్లెడన్? పు
వ్వులెట్టిరి గదా చెవిని కవులకు కవివరా!
జిలేబి
ReplyDeleteమీ లాంటి వాళ్ల కంతా
యేలాగూ వెన్నతోటి విద్యే గా? మీ
కా లూటీ నేర్వగ కా
వాలంటే రాయపాటి వారి జత గొనన్ !
జిలేబి
ReplyDeleteమానమయా మా గప్పాల్
గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్,
యేనుగు నెక్కి తిరుగవలె
సోనాక్షి సమేతముగ వసుధనేలవలెన్ !
జిలేబి
ReplyDeleteకనుడు బతుకు నడకను! చు
వ్వన గానుగ నెక్కి యేగవలెఁగా శతయో
జనముల్ రయంబునన్, పా
వనమై గడుప సతితోడు వసతిగ నిలలో!
జిలేబి
ReplyDeleteకనుగొంటిరో ధనుష్పా
ణిని మన దేవుని రఘుపతిని నయోధ్యారా
ముని ధరణిజను వెతుకుచు వి
పినమున విడిసె నదిగో కపివరుల నడుమన్
జిలేబి
ReplyDeleteముని ధరణిజను వెతుక వనమున విడిసెనయా సమస్యా పాదము -
మునివరుల మన్ననల పొం
దిన కౌసల్యాయని మన దేవుని నిదిగో
కనుగొంటినినే శ్రీ రా
ముని ధరణిజను వెతుక వనమున విడిసెనయా
జిలేబి
ReplyDeleteహే ప్రభు యిడుమాకు క్షమా!
మా ప్రార్థనలివె గొను క్రిసుమస్సున వేగ
మ్మే! ప్రాపకమ్ము దక్కెను
మా ప్రభు నామమ్ము వలన మాన్యత గానన్
జిలేబి
ReplyDeleteకనబడును కవివరుల దా
రణి, పేరడి బండివరుల రావడియు , భళీ
మన రాజారావు టపా
లనఘా లలితమ్మ చెణుకు లా జ్యోతిషమున్
జిలేబి
ReplyDeleteతాత శకారుని తలచె! ప్ర
దాతగ పూరణలు కైపదములకు చేర్చం
గా తాత వలె భళా చే
యూత నిడును క్లిష్టమైన యూహలకు సుమీ !
జిలేబి
ReplyDeleteమొక్కండీ మొక్కండీ
చక్కగ రామయ్యకు తన సన్నిధి మన కెం
చక్కగ మేలు సుమండీ
తక్కువ చేయడెపుడు మన తండ్రి కదండీ !
జిలేబి
"జిలేబి" గారు,
Deleteమీరు ఈ వ్రాసినదేదో "శ్యామలీయం" గారి బ్లాగులోనే సదరు టపా క్రిందే వ్రాస్తే శ్యామలరావు గారు కూడా సంతోషిస్తారుగా?
Deleteతోషిస్తారో తోసి పడేస్తారో తెలియక అక్కడా ఇక్కడా గిద్యాల్ :)
జిలేబి
అరెహో ! సాంబా ! మీకీ
Deleteఅరదండల విభవమేలనండీ?, మాధు
ర్యరసాలు చిప్పిలు తవరి
విరచిత పద్యాలు, గిద్యవిధముల? కాదే !
Deleteకాదే కాదే అనిమన
మేదో అనుకున్ననెట్ల మేధావుల తీ
ర్పేదో వేరేగా వుం
టే? దాష్టీకమ్ము చేయుటేమేలగునోయ్ :)
జిలేబి
రమణ జిలేబీయ రసమయ పద్యాలు
Deleteతెలుగుభారతికి వాతెరమధువులు
కమనీయ పదఝరీ గంగాప్రవాహాలు
చదువుల శారద స్తన్యసుధలు
సురుచిర భావ విభావరీ దీప్తులు
అజుని పెండ్లపు విమలాంగరుచులు
ధారామనోఙ్ఞాల హార ప్రసూనాలు
నలువ పూబోడి మంగళ సరాలు
శైలి పద శయ్య భావలాలిత్య శుభగ
మధుర ధారాది లక్షణ మణిమయములు
మిసిమి మించిన వస్తు సమ్మిళిత రచిత
పసిడి భూషణనిచయాలు పద్యసిరులు .
Deleteవాహ్ వాహ్ వాహ్
ఎవరక్కడ!
ఈ కవిరాట్ గారికి ఉచిత సన్మానం చేయాలె.
ఓ వెయ్యిన్నూట పదార్లు జిలేబు పట్రాండి :)
జిలేబి
రసమయపద్యజిలేబీ
Deleteకి, సరిగ, సన్మానము జరిగేందులకే, ఈ
పసగలపొగిడింపు, గురుల
రుసరుసల నెదురు జవాబు, రూఢి గన హితా !
Deleteనమో నమః! నెనరుల్స్!
జిలేబి
ReplyDeleteకాణీపాకపు గణపతి
యీనాడనపర్తి గణపతీ భళి సాక్ష్యం
బైనారు రాజకీయపు
కైనీడపులాటలకయొ కంద జిలేబీ
జిలేబి
ReplyDeleteధైర్యము వలయు నీ కాపదలను దాట
నోర్పు కావలె సంపదలొప్ప వాసి!
నిత్య విద్యార్థి యై జవ్వని బతుకవలె
ప్రకృతి నేర్పు పాఠమ్ము లరయ జిలేబి!
జిలేబి
ReplyDeleteసోలో బతుకే బెటరోయ్
మా లచ్చిని పెండ్లి యాడి మన్నుకరచి పో
నేలా! జిలేబు లేలా
బాలా మణులు మన కేల బాబ్జీ వినవోయ్!
జిలేబి
ReplyDeleteకలదన్ని యూళ్లు! భళిరా
కలరప్పలు చెల్లలున్ సకలము రఘుపతీ
యిలలో నీదే యందురు!
ఇలు మాదైనది నిలువ మరీ యిన్నేళ్లా!!
అమాయకపు సామి
జిలేబి
ReplyDeleteవిక్రమ్! చేయును కీడా
యక్రమసంబంధ మధికయశమును దెచ్చున్
సక్రమసంబంధముల ప
రాక్రమమే, మేల్మి నడత రాధనమొసగున్!
జిలేబి
ReplyDeleteఅనుమానమేల యా భం
డన నక్రమమైన సంగడ మనంత యశ
మ్మును దెచ్చు నెప్పుడున్ మం
చిని పెంచెడు మానవత" వచించెను విదుడే
జిలేబి
ReplyDeleteఅనఘా! కొండను దింపిర
ట నడుమ! కవ్వము చిలికిరటన్న! కవుల క
ల్పన కాదె సాగరమథన
ము? నమ్మదగిన కథయకొ? నమోవాకమ్ముల్!
జిలేబి
ReplyDeleteఅధకిమ్! చూడ విచిత్ర వ
నధి! కవుల మనోజ్ఞకల్పనయె కాక పయో
దధిఁ ద్రచ్చ సాధ్యమేనా ?
సుధారసము లొల్కెడు మది సువచనములెగా!
జిలేబి
ReplyDeleteబూడి దైననమ్మి బతుకు బుర్ర వున్న
వాడు! తాత మాట వినవే వారిజాక్షి
అయిడియా వున్న చాలోయి అమెరికాను
కూడ అమ్మేసి మరి బతకొచ్చు పోవె!
జిలేబి
ReplyDeleteబుర్ర లో గుంజు గలవారు బూడిదైన
నమ్మి బతుక గల రిల లోన, మన తాత
నేటి సూక్తి జిలేబి ! మనిషి మనీషి
కా గలడు కష్ట పడగా నిఖార్సుగాను !
చైంచిక్ :)
జిలేబి
ReplyDeleteతోమరి సేవల చూడం
డీ! మా లలితమ్మగారి డిషువాషరిదం
డీ! మంచిగ చెప్పగ విన
దేమాటా బదరి దెబ్బకే గింగిరులోయ్
జిలేబి
ReplyDeleteతోమరి సేవల చూడం
డీ! మా లలితమ్మగారి డిషువాషరిదం
డీ! మంచిగ చెప్పగ విన
దే మాటా బావ దెబ్బకే తిరిగేనూ :)
ReplyDeleteమూలాలు మారవు కదం
డీ! లావుగ మరువగ గనుడీ రుద్దిరిగా
మా లెస్సగ నదె మీకిక
మేలని నాధునిక కార్పొ రేట్సు జిలేబీ
జిలేబి
ReplyDeleteతరమండి వెంటనే కా
ర్పొరేట్ల మనకేల వీరి రొచ్చు విధానాల్
నరసన్న మాట వినుడు మ
న రైతు పండించినది మనకు మేలర్రా!
జిలేబి
థాంక్యూ, "జిలేబి" గారు. ఈ పద్యంలో మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తాను.
Deleteకార్పొరేట్లను రానివ్వద్దు అంటే నా ఉద్దేశం సాఫ్ట్వేర్ తదితర అలాంటి పరిశ్రమలని కాదు. కొన్ని consumer goods రంగాల్లో (వ్యవసాయ రంగంతో సహా) వారికి ప్రవేశం నిషిద్ధం చెయ్యాలి అని నా భావం. వారికున్న మనీపవర్ వల్ల MBAలను ఇతర ఎక్స్పర్ట్లను (experts) ఉపయోగించుకుని ఆయా రంగాలను కట్టడి చెయ్యగల (మీరు కరక్ట్ గా అన్నట్లు) "రొచ్చు విధానాలు" రూపొందించగలిగిన సమర్ధులు కార్పొరేట్లు. అలాగే విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వినియోగదారుడి అలవాట్లను కూడా ప్రభావితమూ చెయ్యగలరు.
మరొక చాలా ముఖ్యమైన విషయం. మౌలిక రంగాల్లోనికి ప్రైవేట్ వారిని (ఇప్పుడు కార్పొరేట్లు అని పిలవబడుతున్న వారిని) అస్సలు రానివ్వకపోతే దేశసంపద పట్ల జాగ్రత్తను వహించినట్లవుతుంది. పవర్, ఇంధనం, నీటిపారుదల, రోడ్లు ఇతర రవాణా వ్యవస్ధలు, కమ్యూనికేషన్లు, ముడిసరుకుల మైనింగ్ & తయారీ - ఇవి దేశ ఆర్ధికవ్యవస్ధకు సంబంధించిన కొన్ని ప్రధాన బేసిక్ రంగాలు (విలువలు దాదాపు పతనమైపోయిన కాలం కాబట్టి ఇప్పుడు నేనయితే బ్యాంకింగ్, విద్య, వైద్యంను కూడా ఈ జాబితాలో జేరుస్తాననుకోండి). వీటిని ప్రైవేట్ పరం చేస్తే వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆయా రంగాలను స్తంభింప చేయగల - కనీసం శాసించగల - శక్తిని వారి చేతిలో పెట్టినట్లు అవుతుంది. దేశసంపదను ప్రైవేటు వారికి దోచిపెట్టినట్లూ అవుతుంది.
ReplyDeleteనిక్కముగ నయోధ్యాపురి
మ్రొక్కుటకుసరియగు నగర మోయీ వినవే
టక్కున భక్తుల తో స
మ్మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్!
జిలేబి
ReplyDeleteఅక్కా! ముస్లిము లెల్లరున్ పరమమై యల్లాను ప్రార్థింపగా
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు; రామయ్యన్ మహీజాపతిన్
వక్కాణింతునయోధ్య లోన బగితిన్ వందారు వందారనన్!
నిక్కంబై పరమాత్మ యెల్లరికి మన్నీడై వసించెన్ సుమా!
జిలేబి
ReplyDeleteఅంతయు మాయయె! పుట్టుక
వింతయె జీవి మరణమ్ము వింతయె నడుమన్
సొంతము కొనియాడితినే!
సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో!
జిలేబి
ReplyDeleteఅనుమానమ్ము జనాళి కింక వలదీ యభ్యంతరంబైన చే
ష్టను నిర్ముక్తుడు చేసె నంచు సభలో! సాధింప శాలీనుడై
తన తోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి మోక్షార్థియై
తన యిల్లాపెను జాగురూకుడగుచున్ తంత్రార్థసారమ్ముతో!
జిలేబి