శరీరము ఆత్మ విడివోకుండా
ఏకీకృతంగా వుండగలవా?
అన్ని పనులూ చేసుకుంటూ
మృదుత్వాన్ని పెంపొందించుకుంటూ
అప్పుడే పుట్టిన పసిపాపలా నిర్మలంగా
వుండగలుగుతావా ?
నిర్మలీకరించుకుంటూ నీ అంతర్దృష్టిని మలినం
కాకుండా చూసుకోగలుగుతావా?
అందరిని ప్రేమిస్తూ దేశాన్ని పాలిస్తూ
నిస్వార్థుడవై వుండగలుగుతావా?
దివికి సింహద్వారమైన శక్తి స్వరూపిణి
గా మనగలుగుతావా ?
సమీక్షించుకుంటూ నిష్కపటంగా
నిష్కామివై నీ పని చేయగలుగుతావా?
క్రొంగొత్తదనానికి జీవంపోస్తూ
అన్నిటినీ కలిగి నిర్మోహంగా
నిష్కామకర్మతో
నిరంకుశత్వం లేక పరిపాలించటమే
ధర్మ ప్రవర్తన.
దావొ దే జింగ్
లావొ జు.
Source-10
Carrying body and soul and embracing the one,
Can you avoid separation?
Attending fully and becoming supple,
Can you be as a newborn babe?
Washing and cleansing the primal vision,
Can you be without stain?
Loving all men and ruling the country,
Can you be without cleverness?
Opening and closing the gates of heaven,
Can you play the role of woman?
Understanding and being open to all things,
Are you able to do nothing?
Giving birth and nourishing,
Bearing yet not possessing,
Working yet not taking credit,
Leading yet not dominating,
This is the Primal Virtue.
This is the Primal Virtue.
స్వేచ్ఛానువాదం
జి లే బి.
“జిలేబి” గారు,
ReplyDeleteఫణిబాబు గారి “హరేఫల” బ్లాగులో మీ కామెంట్ :👇
————————
“ Zilebi, on November 12, 2020 at 4:34 am said:
వినరా వారూ వింటున్నారా ?
ఇదేమి చోద్యమండీ ఇంతగా బ్యాంకు వాళ్లు వాచి పోయేరా చూడనంటున్నారు భమిడి పాటి వారు ?
హన్నా!
జిలేబి
——————————
నిన్నటి నుండీ నా ఈ జవాబు 👇 ఫణిబాబు గారి బ్లాగులో పోస్ట్ చెయ్యడానికి అనేక మార్లు ప్రయత్నించాను గానీ ఎందువలనో ఏమో విజయవంతం అవలేక పోయాను. ఇక వేరే దారి లేకన్నూ, ఫణిబాబు గారు అన్యధా భావించరనే నమ్మకంతోనూ, మీ కామెంటుకు స్పందనే కాబట్టిన్నూ మీ బ్లాగులోనే పోస్ట్ చేద్దామని నిశ్చయించుకుని .... ఆ మారి ముందుకు పోతున్నాను 🙂. చదివి ఆనందించండి.
=====================
వింటున్నా వింటున్నా “జిలేబి” గారు. అయినా బ్యాంక్ మొహం వాచిపోవడం ఏమిటండి? కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు కస్టమర్లు బ్యాంక్ లో అడుగు పెట్టకుండా ఉంటేనే వారికి మంచిదట (కస్టమర్లకు 😀), బ్యాంకులకు హాయిగా ఉంటుందట (లోపల కూర్చుని నిరాటంకంగా తమ వ్యూహరచన చేసుకుంటారేమో?). అందుకే బ్యాంక్ కు వస్తే కస్టమర్ కు సర్వీస్ ఛార్జీలు వడ్డిస్తారట. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ప్రవేశపెట్టిన ఈ అసమంజసపు విధానాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయనుకుని ప్రభుత్వ బ్యాంకులు కూడా మొదలెట్టినా మొదలెట్టే ప్రమాదం లేకపోలేదు. ఒకప్పుడు పెన్షనర్లకు బ్యాంక్ కు వెళ్ళి కాసేపు కూర్చోవడం చాలా ఆనందదాయకంగా ఉండేది. డిజిటల్ చెయ్యడం వలన ఇప్పుడు పరిస్ధితులు కూడా మారుతున్నట్లున్నాయి. అన్ని బ్యాంకుల్లోనూ అంతా impersonal గాను, కొన్నిచోట్ల insensitive గానూ తయారవుతున్నాయేమో అని అనుమానం.
ఫణిబాబు గారు “జీవనప్రమాణం” వెబ్-సైట్ ద్వారా తమ వార్షిక Life Certificate ను దఖలు చెయ్యగలగడం బాగానే ఉంది కదా. అందుకే వచ్చే యేటి నుండీ ఈ పనికి కూడా బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదని ఫణిబాబు గారు ఆనందంగా ఉన్నారు, అదృష్టవంతులు (అవసరమైన సదరు biometric device ను వారింట్లోనే పెట్టుకున్నారేమో తెలియదు మరి).
మాకు ఆ ఆస్కారం లేదండి. మా పెన్షనే బ్యాంక్ వారి పెన్షన్ కాబట్టి మా Life Certificate ను బ్యాంక్ intranet లోనే అప్-లోడ్ చెయ్యాలి (అది బ్రాంచి వారే చెయ్యాలి) … అంటే ప్రభుత్వం వారి “జీవనప్రమాణం” వెబ్-సైట్ మాకు అన్వయించదు. ఆ పని కోసం అందరమూ బ్యాంక్ ను దర్శించుకోవలసిందే. అలాగే వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేశాను (ఈ కార్యక్రమానికి ఫణిబాబు గారు వేరే పేరు పెట్టారుగా 😀).
=================
ఫణిబాబు గారు మీ కామెంటుకు నిన్నటి తన స్పందనలో “వినరా గారిని ఉసిగొలపనక్కరలేదు” అన్నారు (తన బ్లాగులో).
ఫణిబాబు గారూ, ఉసిగొలపడానికి మారు పేరే “జిలేబి” గారు కదండీ 😁? అసలే వారు నారదోపాసకులు 😁.
Deleteహన్నా! బ్యాంకు వారిని ఓ రవంత మాట అనకూడదు, వెంఠనే రోసము బుస్సు మనును :)
బ్యాంకు వారల స్టాకులు ఆకాశంలోకెగురుతున్నాయె అదే కారణమేమో కామోసు :) సేఠు బ్యాంకు ౨౫౦ కి పోతుందంటున్నారు :)
నారదా
జిలేబి
దేశ ఆర్థికవ్యవస్ధకు చక్రాల లాంటివి బ్యాంకులు. వాటికివ్వవలసిన గౌరవం వాటికివ్వాలి కదా.
Deleteఇదే అతివృష్టి అనావృష్టి అంటే. అంత పొడుగున్న నా కామెంట్ రెండు సార్లు పోస్ట్ అయింది ఇక్కడ. ఒక దాన్ని తీసెయ్యడానికి ప్రయత్నిస్తాను. నా లాప్-టాప్ లోను, మొబైల్ లోనూ కూడా బ్లాగర్ బాగా సతాయిస్తోంది ఎందుకనో.
ReplyDeleteఆహా, పొడవాటి కామెంట్ దెబ్బకు (అది కూడా రెండు సార్లు పోస్ట్ అయ్యిన కామెంట్) కామెంట్ మోడరేషన్ పెట్టేశారా, "జిలేబి" గారూ 😀?
ReplyDelete
ReplyDeleteదీనిని షట్పది చేసే
రా నవ్య జిలేబి బాగు! రాధనమాయెన్
మీ నేటి క్రీడ బామ్మా
వేనోళ్ళ పొగిడెద మిమ్ము విద్యాబాలా!
జిలేబి