Monday, March 25, 2024

విన్నకోట విదుర వినుమ రాయ!!

 


కామింటు కింగు వారి మకుటము పై 

శతకమునకు నాందీ పలకడమైనది‌.


కేజ్రి వాలు వెడలె కేజు లో ఎక్సైజు
కేసు మాయ యీడి క్రేకు చేయ
అన్న యేమొ తీవ్ర మైన చింత పడెను
విన్నకోట విదుర వినుమ రాయ! (౧)


***


నిఫ్టి చార్టు లోన నిండు చుక్కయొకటి
కన్బడెనని జ్యోస్య కారు లచట
పైన పోవు ననిరి పైపైకి పోకడ
విన్నకోట విదుర వినుమ రాయ! (౨)




ఇట్లు

పనిలేని ......

జిలేబి


67 comments:

  1. కా మింట్ కింగ్ వారి ఆజ్ఞ పై కొత్త పేచీ తెరవడ మైన தீ :)

    ReplyDelete
  2. ఈ ఏర్పాటు చాలా సౌకర్యవంతం కదా. 🙂🥹
    నెంబరు కూడా ఇచ్చినట్లున్నారు (తెలుగు సంఖ్యలనుకోండి 😏)

    ధన్యవాదాలు 🙏

    ReplyDelete
  3. -
    చంద్ర బాబు మహిమ జనసేనకు తిరుక్ష
    వరము తిరుపతాయె వరము లబ్బి
    నట్టె కాన వచ్చు నట్టేట మునకేను
    విన్నకోట విదుర వినుమ రాయ ! (3)


    ReplyDelete
  4. -

    స్మార్టు వ్యసన మాయె స్టైలిష్షు మోబైలు
    చేయి చాచినంత సేవలెన్నొ
    మాటమంతిలేని మనుజుడు శవమాయె
    విన్నకోట విదుర వినుమ రాయ ! (4)

    ReplyDelete
    Replies
    1. స్మార్ట్ ఫోన్ వ్యసనం మీద తెలంగాణ గాయకుడు రషీద్ పాడిన ఈ సరదా పాట వినండి (విడియోలో మొదటి ఒకటిన్నర నిమిషాలు) 🙂👇.

      https://youtu.be/CsmIsLETNIU?si=htd9heGrFehMNW18

      Delete
  5. -

    ఎండ లెక్కువయ్యె నెండిపోవున పైరు
    లెల్ల? క్రోధి నిదుర లేచు వేళ
    సూచనలివియొ పరిశోధింప దగునకొ?
    విన్నకోట విదుర వినుమ రాయ!


    ReplyDelete
  6. -
    బాల్టిమోరు బ్రిడ్జి పడవయొక్కటితాక
    పురణ మందు కూలె పూర్ణమాసి
    రాతిరి ఫలమిదని వ్రాయ వచ్చునొ జ్యోసి
    విన్నకోట విదుర వినుమ రాయ (6)



    ReplyDelete
  7. -
    టోలు బోవునన చటుక్కున నురుకుచు
    చదువగా తెలిసెను సాటిలైటు
    మాధ్యమము కలెక్షనౌర టాక్సులకటా
    విన్నకోట విదుర వినుమ రాయ!



    ReplyDelete
  8. -
    శర్మగారి మాట చల్దివణ్ణపు మూట
    మకుట మందుకొనుచు మాటకారి
    శతముఖినటు త్రిప్పి సాయించవె జిలేబి
    సదరనానిమస్సు చక్కబోవ :)



    ReplyDelete
  9. -
    అయిటి వేసె వాటు కాంగ్రేసునకు కోట్ల
    టాక్సు ! బాజపా కుతంత్ర మంచు
    గ్రేపు వైను టాకు గీరి చూడను సుమీ
    విన్నకోట విదుర వినుమ రాయ !



    ReplyDelete
  10. -

    అప్పుడప్పు డల్లనల్లన వేయుచుం
    దును గురూజి! దూకి దుమికి చూడ
    గీత మారలేదు గిచ్చి యీడ్చపదము
    లన్ను యేమి చేతు నయ్య సామి


    ReplyDelete
  11. -

    మందు పాటల స్పెషలిస్టు మాన్యులు మన
    బండివరులు! మహా ఊపు వారి కొచ్చు
    నేమొ నా పాటలను వ్రాయ నెమ్మిమీర
    విన్న కోట నరసరాయ వినుమ విదుర


    ReplyDelete
  12. ఓ యబ్బో మా టెల్గూకీడేదీ :)

    నేనమ్మను నీకు కొమర!
    నేనమ్మను నీదు మాట ! నేద్రావంగా
    తే, నీరు! వలయు తేనీ
    రా? నేనమ్మను! తెలుగు సురభి తెలుగౌరా!




    ReplyDelete
    Replies
    1. వేడి తేనీరు …. వేడితే నీరు.
      ఇలా కోకొల్లలు ఉదాహరణలు.

      Delete
  13. -
    కడప రాయా? అవునుసుమా ! కాస్త చల్ల
    దనము చేర్చు కడపరాయ! తండ్రి నీదు
    కడ పరాయ నా దేవ వేంకటరమణుడ!
    నాగ ఫణి శర్మ వరు రచన చద వండి!


    ReplyDelete
  14. -

    ఎన్నికల లో
    ఎన్ని కలలో
    ఎన్ని, కల, లో
    ఎన్ని క లలో


    మా టెల్గూ కీడేదీ :)

    ReplyDelete
  15. -

    గురుపూర్ణిమాదినమ్మున
    సరిజేసుకొని నడవడిక సాధనను మరిం
    త రయముగా జేయను రం
    డి రహస్యమ్ములను నేర్వ డింగరు లారా!


    ReplyDelete
  16. -
    బాగా చెప్పారు జిలే
    బీ గారండోయ్! మునుపటి విదురులు శ్రీశ్రీ
    సాగించిన పోరాటపు
    వేగానికి యీడుకలద భేష్ భేషండీ!


    ReplyDelete
  17. -

    దిక్కు దిక్కులు నలు దిక్కులు తిరుగుచు
    మ్రొక్కు లంచు సిరసు మొత్తు కొనుచు
    తిరుగ నేలనొ? ప్రణతి హృదిని గానరా
    విన్న కోట విదుర వినుమ రాయ !


    ReplyDelete
  18. -

    గౌ. భారతిగారూ! యీ
    మీ బ్లాగ్పోస్టద్భుతము సుమీ! విజ్ఞానం
    తో బాటు ప్రశాంతత కూ
    డా బాగుగ జేర్చెనౌ! నమామి నమామీ !


    ReplyDelete
  19. నేను మీ భుజముల తట్టెదను మీరు నా భుజముల చరచుడీ :)

    ఆవలింపగాను నక్షరమైన రా
    దండి గురువు గారు తరచు తోచు
    నట్లు రాయు చుందు నందమాయెను మీకు
    నచ్చె విన్న కోట నరస రాయ!



    ReplyDelete
    Replies
    1. ఆమాత్రం ఇంగిలీసు నానుడులు మాకూ వచ్చు.

      Delete
  20. -
    అంతంత భయంకరమగు
    వింతైన సమాసములు గుభిల్లుమనెన్ గుం
    డెంతయొ చదువన్ సంస్కృత
    మింత కఠినమేల నయ్య మేధావులకున్


    ReplyDelete
  21. -
    హాడు చెన్నాగి దే బండి స్పీడు కూడ
    నిమగె కన్నడవూ గొత్త? నేను సారు
    తెలుగు నల్లి థింకించెద తేలు కన్న
    డ పదములు వాటికవె వడి ఢమ ఢమలని :)


    ఓ ఓ ఓ :)


    ReplyDelete
  22. -

    ఆ మాత్రపు టింగ్లీషర
    రే మాకున్ వచ్చు సుందరీ తెలు గున నే
    లా మార్చి వ్రాయు ట జిలే
    బీ? మన్నింప మని కోరు విదురుల నిపుడే !



    ReplyDelete
  23. నేను చదివిందే వేదమోయ్ !
    ఇతరులదంతా హుళు హుళుక్కియె పో :)


    తిరగేసా భాగవతము
    ను రాధ ప్రస్తావన అసలు కనుల బడలే!
    విరివిగ యిస్కానో త
    స్కరులు బ్రిటీషు చలువయొ ప్రకటనంబాయెన్


    ReplyDelete
  24. -
    శాంతి స్వరూపుని ఆత్మకు
    శాంతి కలుగుగాక! వార్త లంతయు మధురం
    బెంతయొ చదివెడు తీరు! ప్ర
    శాంతంబగు మోము వారి సౌభగమాయెన్!


    ReplyDelete
  25. -
    జయదేవుని రచనలలో
    ప్రియమగు రాధయె కనబడు విహరించుచు గ్రో
    వి యశోదేయుని పిలుపుల
    పయోఘనమున కనలేము భాగవతములో


    ReplyDelete
  26. -
    నవవిధ భక్తి తెరగులం
    దు వరలెడు విధానమిది మృదుత్వము తోడై
    జవరాండ్రులగుచు గొల్వం
    గ వెన్నుని త్వరపడుదురు జగన్నాథ యనన్



    ReplyDelete
  27. -
    గేదెలు కావా ప్రాణులు ?
    రాదా వాటికి జ్వరము, చిరాకుల్ కుట్టం
    గా దోమలు? రండి తెరల
    వేదామిక గావ పాలు వెల్లువ లెత్తన్ !




    ReplyDelete
  28. -
    అగ్గిపెట్టె ఖాళి ఔరౌర యింటిలో
    భగ్గు మంట లెగసి పడ చెకుముకి
    వ్యాఖ్య తోడు వచ్చు వడిని జిలేబియు
    వేచి చూడు మా ఉవిద! క్షణమున



    ReplyDelete
  29. -

    అందరికి శుభాకాంక్షలు !
    సందడి చేయంగ వచ్చె సరదా పర్వం
    బందరి ఆశల తీర్చన్
    డెందంబొందంగ హ్యాపి డేస్ హ్యాపీ డేస్ !

    ఉగాది శుభాకాంక్షలతో

    మీ జిలేబి

    ReplyDelete
  30. -

    ప్రాస యతి గణములను సర
    దా సన్నగ మొదలగున్ పిదప దురదగ ప
    ద్యాసక్తి కలుగు నాపై
    వ్యాసంగమగు వ్యసనమగు వరలక్ష్మి సదా!


    :)

    జి లేబుల్స్

    ReplyDelete
  31. -
    లడలకు యతి కుదురు గదా!
    వడిని జిలేబులను వేయి వరలక్ష్మీ ఢాం
    డడఢాండఢాండ నినద
    మ్ము డాబుసరి నింగికెగిరి ముద్దిడ వలెనే!



    ReplyDelete
  32. -

    తనను తాను మనిషి తరచి తెలుసుకొన
    గలడ? మరి యితరులు కనుగొనంగ
    నెట్లు వీలు కలుగు? నేర్వ సత్యమిదియె
    విన్నకోట విదుర వినుమ రాయ ! (11)

    ReplyDelete
  33. -

    హరిబాబు గారి వివరణ
    పరమాద్భుతమండి! వారి పరిపక్వత, వే
    ద రహస్యమ్ముల కర్థము
    సరియైన తెరగుల తెలుపు సహనము సెహభేష్!


    జి లే బుల్స్ :)

    ReplyDelete
  34. -

    ఏదో చెప్పాలనెడా
    వేదన కోరిక వదులుట వేంకట రమణా
    సాధించుట మాతరమా!
    క్రోధిని మముగావుమయ్య కొండలరాయా!



    ReplyDelete
  35. తిరువేంగడపు నివాసా!
    సిరితోడైనిలచినావు సిరికోరుచు నె
    ల్లరి నుండి కుబేరుని వ
    ద్ద రుణమ్మును తీర్చగాను తట్టములెన్నో!



    ReplyDelete
  36. -

    సత్యమ్మె శివమె సుందర
    మత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
    కాత్యాయనియే జోడై
    ముత్యాలసరములుగా సముచిత ప్రకృతియై


    ReplyDelete
  37. -
    కంది శంకరయ్య కవివర! మేలగు
    రామ రామ యనుట; రంకు బొంకు
    లెల్ల పనికి రావు! లేవండి ! లేకున్న
    శంకరాభరణము చవటబాఱు!


    ReplyDelete
  38. -
    అన్నమయ కీర్తనలవియె
    పెన్నిధి తిరువేంగడపతి పేరోలగమున్
    తిన్నగ చేరగ మార్గము
    లెన్నెన్నో చూపునోయి లెస్సగ లేమా!



    ReplyDelete
  39. -

    రోజూ దర్శన మివ్వరూ :)

    చైనాకు గినా మీరే
    మైన వలస బోయి నారొ మమ్మిక మరిచా
    రో నన్న సందియము కలి
    గేను సుమా! పండుగలపుడే దర్శనమా ?



    ReplyDelete
  40. -
    శ్రీరాముని మీమాంస భ
    ళారే బాగౌ! వశిష్టులనడుగ వలసిం
    దే రామనవమి కిదె మన
    సార శుభాకంక్షలండి సారూ మీకున్


    సారా శుభాకాంక్షలు :)


    ReplyDelete
  41. -

    మీకు పనీపాటా లే
    దా? కందాలల్లుకొనుట తప్పించి ? సదా
    యీ కసరత్తుల తోటే
    మీ కాలమ్ము గడిచేన మెలుత ! జిలేబీ !


    ReplyDelete
  42. -

    నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్ నానెంగే పోవేన్ :)

    ఎక్కడికీ వలసా? నే
    నెక్కడ బోదు నడుగడ్డ నే నమ్మితి నెం
    చక్కా జీవితము గడుప!
    చుక్కానిగ రఘుపతియె సుశోభిల్లంగన్!



    ReplyDelete
    Replies
    1. మీ నివాసమూ ఆ ఊరేనట కదా?
      మన YVR ని మీరు అప్పుడప్పుడు పలకరిస్తుంటే వారి భోగట్టా తెలుస్తుంటుంది కదా?

      Delete
    2. ఎవరండీ ఆ ఆసామి‌?

      Delete
  43. -
    శ్రీ శర్మగారు ! అవునూ
    ఆ సుబ్రాజున్ను సత్తి బాబను శాల్తీ
    ఆసాంతము తమరే నే
    మో సందేహము కలిగె నయో వివరింపన్


    ReplyDelete
  44. -

    సందేహపు ప్రాణి సుమా!
    కొందరిని నివాసమడుగు,కొందరినేమో
    నెందరితోడో బోల్చున్
    వందారనమను నితరుల ప్రతిదినము సుమీ :)


    ReplyDelete
    Replies
    1. // “నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్” //
      అంటూ వగచిన వారెవరో? తమరు కాదా? నివాసప్రాంతం ఏదో తెలియకుండానే వగచారా?

      Delete
  45. -
    జగమున వారెచ్చట తా
    ము గలరని తెలియక పద్యమును వ్రాసిరకో?
    వగచిన దెవరోయీ నా
    లుగు వైపుల నీరమని పలుకుచు జిలేబీ ?


    ReplyDelete
  46. -

    వ్రాయడ మదేల యెంగిలి
    రో యనెడా భాషలోన రోదించనదే
    లా యేమండీ మన్నిం
    చేయండీ తప్పులున్న నెనరులటంచు‌న్ :)

    జి- లేబుల్స్

    ReplyDelete
  47. -

    కాదెచ్చట కనరాని కనర్హం :(

    గువ్వల్లోనూ శ్రీశ్రీల్
    తవ్విన మనమదిని గలరు దండిగ తాతా!
    చివ్వున నెగయును రాగము
    లివ్వన నెన్నెన్నొ లెస్స లెస్స జిలేబుల్



    జి- లేబుల్స్


    ReplyDelete
  48. -
    పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
    కాలు లేని వాడు నడచె కష్టపడక
    కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
    ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!


    ReplyDelete
  49. -
    నా మొబయలు లోన తెలుగ
    దేమో కనరాదటంచు నేడ్వనదేలా!
    ప్రామాణికమగు గూగుల్
    మీ ముంగిట సేవ చేయ మిడిసిపడె గదా!

    గూగుల్ కీ బోరని మో బయలు గలదే :)


    ReplyDelete
  50. -
    నిజమేను! ఇంద్రునిధనువు
    సజావు గా కనబడేది ! చక్కగ చిత్ర్రం
    బు జిలేబియై నిలిచి వెలు
    గు జిలుగుల ముదావహమ్ము కురిపించేనౌ! :)



    ReplyDelete
  51. -

    కుదుమట్టంగా అను పద
    మదేమి ప్రాంతంబులోన మాట్లాడెదరో?
    సదనమ్ములోననిలడిగి
    రి! దీనికి జవాబు చెబుదెరే యెవరేనిన్ ?


    :)

    కుదువ మట్టము :)

    ReplyDelete
    Replies
    1. కృష్ణా జిల్లాలో అయితే వాడుకలో ఉంది (ఉండేది అందామా? ఈ కాలంలో తెలుగు మాట్లాడేవారే కరువైపోతున్నారు; “సెండ్ చేశాను” వంటి భాష మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇక కుదుమట్టం లాంటి పదాలు వాడడం కూడానా?)

      Delete
    2. ఏం ఫర్వాలేదండి, క్లియర్ గా అర్ధమైంది.

      Delete
  52. సుబ్బు సత్తి పేరిట తమ చురక లెల్ల
    విసురు చుండ్రి కాంగ్రేసుపై విదురులచట
    విన్న కోట రాయా కని పించ లేదు
    మీదు వ్యాఖ్యోపచర‌ణ అదేల సూవె ? :)



    ReplyDelete
    Replies
    1. సూవె లేదు, సుమ్ము లేదు. శర్మగారు చెప్పినది తేటతెల్లంగానే ఉందిగా. అయినా ప్రతి పోస్ట్ మీద ఎందుకు వ్యాఖ్యానించడం?

      Delete
    2. అబ్బే!/ టపా కన్నా మామూలుగా మీ కింగ్ కామెంట్ ముందస్తుగా కనబడేది :) కనబడకపాయె :) దాంతో తలీ ఉంగలీ దబాయా ఇస్లియె :)

      Delete
  53. వానప్రస్తాశ్రమములో చింతాగ్రస్తులు :)

    అకటా! ఈ విద్యలు తె
    ల్వక పోయెను‌ చిన్ననాట వారెవ్వా! మ్యా
    జికులెన్నెన్నో చేయం
    గ కుదర లే సూవె! యెంతగామిస్సయ్యా!




    ReplyDelete
    Replies
    1. వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేస్తారు ఎవరయినా?

      Delete
    2. తాతగారి మీద మీరు సెటైరు వేస్తున్నారా! ఎంత ధైర్యమండి మీకు !

      Delete
    3. వార్నీ, మీకలా అర్థమయిందా 😳?
      మీతో జాగ్రత్తగా ఉండాలి సుమండీ, లేకపోతే తంపులు పెట్టెయ్యగలరు 😕.

      Delete
  54. -
    ఎవరర్రా మీరంతా ?
    ప్రవచనముల మధ్య దూరి వ్యాఖ్యల హోరుల్?
    చవిలేని అవాకులతో
    చవాకులు వలదు పదండి స్థలమున్ వీడన్


    ReplyDelete