Monday, March 25, 2024

విన్నకోట విదుర వినుమ రాయ!!

 


కామింటు కింగు వారి మకుటము పై 

శతకమునకు నాందీ పలకడమైనది‌.


కేజ్రి వాలు వెడలె కేజు లో ఎక్సైజు
కేసు మాయ యీడి క్రేకు చేయ
అన్న యేమొ తీవ్ర మైన చింత పడెను
విన్నకోట విదుర వినుమ రాయ! (౧)


***


నిఫ్టి చార్టు లోన నిండు చుక్కయొకటి
కన్బడెనని జ్యోస్య కారు లచట
పైన పోవు ననిరి పైపైకి పోకడ
విన్నకోట విదుర వినుమ రాయ! (౨)




ఇట్లు

పనిలేని ......

జిలేబి


202 comments:

  1. కా మింట్ కింగ్ వారి ఆజ్ఞ పై కొత్త పేచీ తెరవడ మైన தீ :)

    ReplyDelete
  2. ఈ ఏర్పాటు చాలా సౌకర్యవంతం కదా. 🙂🥹
    నెంబరు కూడా ఇచ్చినట్లున్నారు (తెలుగు సంఖ్యలనుకోండి 😏)

    ధన్యవాదాలు 🙏

    ReplyDelete
  3. -
    చంద్ర బాబు మహిమ జనసేనకు తిరుక్ష
    వరము తిరుపతాయె వరము లబ్బి
    నట్టె కాన వచ్చు నట్టేట మునకేను
    విన్నకోట విదుర వినుమ రాయ ! (3)


    ReplyDelete
  4. -

    స్మార్టు వ్యసన మాయె స్టైలిష్షు మోబైలు
    చేయి చాచినంత సేవలెన్నొ
    మాటమంతిలేని మనుజుడు శవమాయె
    విన్నకోట విదుర వినుమ రాయ ! (4)

    ReplyDelete
    Replies
    1. స్మార్ట్ ఫోన్ వ్యసనం మీద తెలంగాణ గాయకుడు రషీద్ పాడిన ఈ సరదా పాట వినండి (విడియోలో మొదటి ఒకటిన్నర నిమిషాలు) 🙂👇.

      https://youtu.be/CsmIsLETNIU?si=htd9heGrFehMNW18

      Delete
  5. -

    ఎండ లెక్కువయ్యె నెండిపోవున పైరు
    లెల్ల? క్రోధి నిదుర లేచు వేళ
    సూచనలివియొ పరిశోధింప దగునకొ?
    విన్నకోట విదుర వినుమ రాయ!


    ReplyDelete
  6. -
    బాల్టిమోరు బ్రిడ్జి పడవయొక్కటితాక
    పురణ మందు కూలె పూర్ణమాసి
    రాతిరి ఫలమిదని వ్రాయ వచ్చునొ జ్యోసి
    విన్నకోట విదుర వినుమ రాయ (6)



    ReplyDelete
  7. -
    టోలు బోవునన చటుక్కున నురుకుచు
    చదువగా తెలిసెను సాటిలైటు
    మాధ్యమము కలెక్షనౌర టాక్సులకటా
    విన్నకోట విదుర వినుమ రాయ!



    ReplyDelete
  8. -
    శర్మగారి మాట చల్దివణ్ణపు మూట
    మకుట మందుకొనుచు మాటకారి
    శతముఖినటు త్రిప్పి సాయించవె జిలేబి
    సదరనానిమస్సు చక్కబోవ :)



    ReplyDelete
  9. -
    అయిటి వేసె వాటు కాంగ్రేసునకు కోట్ల
    టాక్సు ! బాజపా కుతంత్ర మంచు
    గ్రేపు వైను టాకు గీరి చూడను సుమీ
    విన్నకోట విదుర వినుమ రాయ !



    ReplyDelete
  10. -

    అప్పుడప్పు డల్లనల్లన వేయుచుం
    దును గురూజి! దూకి దుమికి చూడ
    గీత మారలేదు గిచ్చి యీడ్చపదము
    లన్ను యేమి చేతు నయ్య సామి


    ReplyDelete
  11. -

    మందు పాటల స్పెషలిస్టు మాన్యులు మన
    బండివరులు! మహా ఊపు వారి కొచ్చు
    నేమొ నా పాటలను వ్రాయ నెమ్మిమీర
    విన్న కోట నరసరాయ వినుమ విదుర


    ReplyDelete
  12. ఓ యబ్బో మా టెల్గూకీడేదీ :)

    నేనమ్మను నీకు కొమర!
    నేనమ్మను నీదు మాట ! నేద్రావంగా
    తే, నీరు! వలయు తేనీ
    రా? నేనమ్మను! తెలుగు సురభి తెలుగౌరా!




    ReplyDelete
    Replies
    1. వేడి తేనీరు …. వేడితే నీరు.
      ఇలా కోకొల్లలు ఉదాహరణలు.

      Delete
  13. -
    కడప రాయా? అవునుసుమా ! కాస్త చల్ల
    దనము చేర్చు కడపరాయ! తండ్రి నీదు
    కడ పరాయ నా దేవ వేంకటరమణుడ!
    నాగ ఫణి శర్మ వరు రచన చద వండి!


    ReplyDelete
  14. -

    ఎన్నికల లో
    ఎన్ని కలలో
    ఎన్ని, కల, లో
    ఎన్ని క లలో


    మా టెల్గూ కీడేదీ :)

    ReplyDelete
  15. -

    గురుపూర్ణిమాదినమ్మున
    సరిజేసుకొని నడవడిక సాధనను మరిం
    త రయముగా జేయను రం
    డి రహస్యమ్ములను నేర్వ డింగరు లారా!


    ReplyDelete
  16. -
    బాగా చెప్పారు జిలే
    బీ గారండోయ్! మునుపటి విదురులు శ్రీశ్రీ
    సాగించిన పోరాటపు
    వేగానికి యీడుకలద భేష్ భేషండీ!


    ReplyDelete
  17. -

    దిక్కు దిక్కులు నలు దిక్కులు తిరుగుచు
    మ్రొక్కు లంచు సిరసు మొత్తు కొనుచు
    తిరుగ నేలనొ? ప్రణతి హృదిని గానరా
    విన్న కోట విదుర వినుమ రాయ !


    ReplyDelete
  18. -

    గౌ. భారతిగారూ! యీ
    మీ బ్లాగ్పోస్టద్భుతము సుమీ! విజ్ఞానం
    తో బాటు ప్రశాంతత కూ
    డా బాగుగ జేర్చెనౌ! నమామి నమామీ !


    ReplyDelete
  19. నేను మీ భుజముల తట్టెదను మీరు నా భుజముల చరచుడీ :)

    ఆవలింపగాను నక్షరమైన రా
    దండి గురువు గారు తరచు తోచు
    నట్లు రాయు చుందు నందమాయెను మీకు
    నచ్చె విన్న కోట నరస రాయ!



    ReplyDelete
    Replies
    1. ఆమాత్రం ఇంగిలీసు నానుడులు మాకూ వచ్చు.

      Delete
  20. -
    అంతంత భయంకరమగు
    వింతైన సమాసములు గుభిల్లుమనెన్ గుం
    డెంతయొ చదువన్ సంస్కృత
    మింత కఠినమేల నయ్య మేధావులకున్


    ReplyDelete
  21. -
    హాడు చెన్నాగి దే బండి స్పీడు కూడ
    నిమగె కన్నడవూ గొత్త? నేను సారు
    తెలుగు నల్లి థింకించెద తేలు కన్న
    డ పదములు వాటికవె వడి ఢమ ఢమలని :)


    ఓ ఓ ఓ :)


    ReplyDelete
  22. -

    ఆ మాత్రపు టింగ్లీషర
    రే మాకున్ వచ్చు సుందరీ తెలు గున నే
    లా మార్చి వ్రాయు ట జిలే
    బీ? మన్నింప మని కోరు విదురుల నిపుడే !



    ReplyDelete
  23. నేను చదివిందే వేదమోయ్ !
    ఇతరులదంతా హుళు హుళుక్కియె పో :)


    తిరగేసా భాగవతము
    ను రాధ ప్రస్తావన అసలు కనుల బడలే!
    విరివిగ యిస్కానో త
    స్కరులు బ్రిటీషు చలువయొ ప్రకటనంబాయెన్


    ReplyDelete
  24. -
    శాంతి స్వరూపుని ఆత్మకు
    శాంతి కలుగుగాక! వార్త లంతయు మధురం
    బెంతయొ చదివెడు తీరు! ప్ర
    శాంతంబగు మోము వారి సౌభగమాయెన్!


    ReplyDelete
  25. -
    జయదేవుని రచనలలో
    ప్రియమగు రాధయె కనబడు విహరించుచు గ్రో
    వి యశోదేయుని పిలుపుల
    పయోఘనమున కనలేము భాగవతములో


    ReplyDelete
  26. -
    నవవిధ భక్తి తెరగులం
    దు వరలెడు విధానమిది మృదుత్వము తోడై
    జవరాండ్రులగుచు గొల్వం
    గ వెన్నుని త్వరపడుదురు జగన్నాథ యనన్



    ReplyDelete
  27. -
    గేదెలు కావా ప్రాణులు ?
    రాదా వాటికి జ్వరము, చిరాకుల్ కుట్టం
    గా దోమలు? రండి తెరల
    వేదామిక గావ పాలు వెల్లువ లెత్తన్ !




    ReplyDelete
  28. -
    అగ్గిపెట్టె ఖాళి ఔరౌర యింటిలో
    భగ్గు మంట లెగసి పడ చెకుముకి
    వ్యాఖ్య తోడు వచ్చు వడిని జిలేబియు
    వేచి చూడు మా ఉవిద! క్షణమున



    ReplyDelete
  29. -

    అందరికి శుభాకాంక్షలు !
    సందడి చేయంగ వచ్చె సరదా పర్వం
    బందరి ఆశల తీర్చన్
    డెందంబొందంగ హ్యాపి డేస్ హ్యాపీ డేస్ !

    ఉగాది శుభాకాంక్షలతో

    మీ జిలేబి

    ReplyDelete
  30. -

    ప్రాస యతి గణములను సర
    దా సన్నగ మొదలగున్ పిదప దురదగ ప
    ద్యాసక్తి కలుగు నాపై
    వ్యాసంగమగు వ్యసనమగు వరలక్ష్మి సదా!


    :)

    జి లేబుల్స్

    ReplyDelete
  31. -
    లడలకు యతి కుదురు గదా!
    వడిని జిలేబులను వేయి వరలక్ష్మీ ఢాం
    డడఢాండఢాండ నినద
    మ్ము డాబుసరి నింగికెగిరి ముద్దిడ వలెనే!



    ReplyDelete
  32. -

    తనను తాను మనిషి తరచి తెలుసుకొన
    గలడ? మరి యితరులు కనుగొనంగ
    నెట్లు వీలు కలుగు? నేర్వ సత్యమిదియె
    విన్నకోట విదుర వినుమ రాయ ! (11)

    ReplyDelete
  33. -

    హరిబాబు గారి వివరణ
    పరమాద్భుతమండి! వారి పరిపక్వత, వే
    ద రహస్యమ్ముల కర్థము
    సరియైన తెరగుల తెలుపు సహనము సెహభేష్!


    జి లే బుల్స్ :)

    ReplyDelete
  34. -

    ఏదో చెప్పాలనెడా
    వేదన కోరిక వదులుట వేంకట రమణా
    సాధించుట మాతరమా!
    క్రోధిని మముగావుమయ్య కొండలరాయా!



    ReplyDelete
  35. తిరువేంగడపు నివాసా!
    సిరితోడైనిలచినావు సిరికోరుచు నె
    ల్లరి నుండి కుబేరుని వ
    ద్ద రుణమ్మును తీర్చగాను తట్టములెన్నో!



    ReplyDelete
  36. -

    సత్యమ్మె శివమె సుందర
    మత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
    కాత్యాయనియే జోడై
    ముత్యాలసరములుగా సముచిత ప్రకృతియై


    ReplyDelete
  37. -
    కంది శంకరయ్య కవివర! మేలగు
    రామ రామ యనుట; రంకు బొంకు
    లెల్ల పనికి రావు! లేవండి ! లేకున్న
    శంకరాభరణము చవటబాఱు!


    ReplyDelete
  38. -
    అన్నమయ కీర్తనలవియె
    పెన్నిధి తిరువేంగడపతి పేరోలగమున్
    తిన్నగ చేరగ మార్గము
    లెన్నెన్నో చూపునోయి లెస్సగ లేమా!



    ReplyDelete
  39. -

    రోజూ దర్శన మివ్వరూ :)

    చైనాకు గినా మీరే
    మైన వలస బోయి నారొ మమ్మిక మరిచా
    రో నన్న సందియము కలి
    గేను సుమా! పండుగలపుడే దర్శనమా ?



    ReplyDelete
  40. -
    శ్రీరాముని మీమాంస భ
    ళారే బాగౌ! వశిష్టులనడుగ వలసిం
    దే రామనవమి కిదె మన
    సార శుభాకంక్షలండి సారూ మీకున్


    సారా శుభాకాంక్షలు :)


    ReplyDelete
  41. -

    మీకు పనీపాటా లే
    దా? కందాలల్లుకొనుట తప్పించి ? సదా
    యీ కసరత్తుల తోటే
    మీ కాలమ్ము గడిచేన మెలుత ! జిలేబీ !


    ReplyDelete
  42. -

    నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్ నానెంగే పోవేన్ :)

    ఎక్కడికీ వలసా? నే
    నెక్కడ బోదు నడుగడ్డ నే నమ్మితి నెం
    చక్కా జీవితము గడుప!
    చుక్కానిగ రఘుపతియె సుశోభిల్లంగన్!



    ReplyDelete
    Replies
    1. మీ నివాసమూ ఆ ఊరేనట కదా?
      మన YVR ని మీరు అప్పుడప్పుడు పలకరిస్తుంటే వారి భోగట్టా తెలుస్తుంటుంది కదా?

      Delete
    2. ఎవరండీ ఆ ఆసామి‌?

      Delete
  43. -
    శ్రీ శర్మగారు ! అవునూ
    ఆ సుబ్రాజున్ను సత్తి బాబను శాల్తీ
    ఆసాంతము తమరే నే
    మో సందేహము కలిగె నయో వివరింపన్


    ReplyDelete
  44. -

    సందేహపు ప్రాణి సుమా!
    కొందరిని నివాసమడుగు,కొందరినేమో
    నెందరితోడో బోల్చున్
    వందారనమను నితరుల ప్రతిదినము సుమీ :)


    ReplyDelete
    Replies
    1. // “నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్” //
      అంటూ వగచిన వారెవరో? తమరు కాదా? నివాసప్రాంతం ఏదో తెలియకుండానే వగచారా?

      Delete
  45. -
    జగమున వారెచ్చట తా
    ము గలరని తెలియక పద్యమును వ్రాసిరకో?
    వగచిన దెవరోయీ నా
    లుగు వైపుల నీరమని పలుకుచు జిలేబీ ?


    ReplyDelete
  46. -

    వ్రాయడ మదేల యెంగిలి
    రో యనెడా భాషలోన రోదించనదే
    లా యేమండీ మన్నిం
    చేయండీ తప్పులున్న నెనరులటంచు‌న్ :)

    జి- లేబుల్స్

    ReplyDelete
  47. -

    కాదెచ్చట కనరాని కనర్హం :(

    గువ్వల్లోనూ శ్రీశ్రీల్
    తవ్విన మనమదిని గలరు దండిగ తాతా!
    చివ్వున నెగయును రాగము
    లివ్వన నెన్నెన్నొ లెస్స లెస్స జిలేబుల్



    జి- లేబుల్స్


    ReplyDelete
  48. -
    పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
    కాలు లేని వాడు నడచె కష్టపడక
    కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
    ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!


    ReplyDelete
  49. -
    నా మొబయలు లోన తెలుగ
    దేమో కనరాదటంచు నేడ్వనదేలా!
    ప్రామాణికమగు గూగుల్
    మీ ముంగిట సేవ చేయ మిడిసిపడె గదా!

    గూగుల్ కీ బోరని మో బయలు గలదే :)


    ReplyDelete
  50. -
    నిజమేను! ఇంద్రునిధనువు
    సజావు గా కనబడేది ! చక్కగ చిత్ర్రం
    బు జిలేబియై నిలిచి వెలు
    గు జిలుగుల ముదావహమ్ము కురిపించేనౌ! :)



    ReplyDelete
  51. -

    కుదుమట్టంగా అను పద
    మదేమి ప్రాంతంబులోన మాట్లాడెదరో?
    సదనమ్ములోననిలడిగి
    రి! దీనికి జవాబు చెబుదెరే యెవరేనిన్ ?


    :)

    కుదువ మట్టము :)

    ReplyDelete
    Replies
    1. కృష్ణా జిల్లాలో అయితే వాడుకలో ఉంది (ఉండేది అందామా? ఈ కాలంలో తెలుగు మాట్లాడేవారే కరువైపోతున్నారు; “సెండ్ చేశాను” వంటి భాష మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇక కుదుమట్టం లాంటి పదాలు వాడడం కూడానా?)

      Delete
    2. ఏం ఫర్వాలేదండి, క్లియర్ గా అర్ధమైంది.

      Delete
  52. సుబ్బు సత్తి పేరిట తమ చురక లెల్ల
    విసురు చుండ్రి కాంగ్రేసుపై విదురులచట
    విన్న కోట రాయా కని పించ లేదు
    మీదు వ్యాఖ్యోపచర‌ణ అదేల సూవె ? :)



    ReplyDelete
    Replies
    1. సూవె లేదు, సుమ్ము లేదు. శర్మగారు చెప్పినది తేటతెల్లంగానే ఉందిగా. అయినా ప్రతి పోస్ట్ మీద ఎందుకు వ్యాఖ్యానించడం?

      Delete
    2. అబ్బే!/ టపా కన్నా మామూలుగా మీ కింగ్ కామెంట్ ముందస్తుగా కనబడేది :) కనబడకపాయె :) దాంతో తలీ ఉంగలీ దబాయా ఇస్లియె :)

      Delete
  53. వానప్రస్తాశ్రమములో చింతాగ్రస్తులు :)

    అకటా! ఈ విద్యలు తె
    ల్వక పోయెను‌ చిన్ననాట వారెవ్వా! మ్యా
    జికులెన్నెన్నో చేయం
    గ కుదర లే సూవె! యెంతగామిస్సయ్యా!




    ReplyDelete
    Replies
    1. వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేస్తారు ఎవరయినా?

      Delete
    2. తాతగారి మీద మీరు సెటైరు వేస్తున్నారా! ఎంత ధైర్యమండి మీకు !

      Delete
    3. వార్నీ, మీకలా అర్థమయిందా 😳?
      మీతో జాగ్రత్తగా ఉండాలి సుమండీ, లేకపోతే తంపులు పెట్టెయ్యగలరు 😕.

      Delete
  54. -
    ఎవరర్రా మీరంతా ?
    ప్రవచనముల మధ్య దూరి వ్యాఖ్యల హోరుల్?
    చవిలేని అవాకులతో
    చవాకులు వలదు పదండి స్థలమున్ వీడన్


    ReplyDelete
  55. -
    శీలవతి జిలేబి ! తురుము
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ
    వాలుజ డలోన నీ కో
    పాలంకారమ్ములన్ తుపాకీ గుళ్ళన్



    ReplyDelete
  56. -
    రాజుని చూసిన కన్నుల
    తో జవ్వని మగని జూచె తోనెగురున్ తా
    రాజువ్వై నాతనిపై
    మోజన్నది చూప నతడు మొత్తును తలపై


    ReplyDelete
  57. -
    మలమల మాడ్చే నెండా!
    యిలలోన పెరిగెను పాప మెంతెంతో ! కా
    వలె నుల్లిపాయ ముక్కల్
    భళి మేలొనరించునద్దె ప్రాణమ్మునకోయ్



    ReplyDelete
  58. కుష్టు ఫలములు తోడ కనికట్టు
    మాటలు జతకట్టి పల్కిన పల్కులున్
    జూడ జూడ, నోటితో నవ్వి నొసటితోన్
    వెక్కిరింప బూనిన కుత్సిత బుద్దుల్
    భహిర్గతమయ్యేన్, నిక్కము సుమతీ !

    ReplyDelete
    Replies
    1. "హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాల పా దమ్ము లతో హింస పెడతారండీ ?/ చక్కగ ఛందో " భద్దం" గా రాయకూడదూ :)

      Delete
  59. -

    ఎక్కడ సమస్యయో? రణ
    మెక్కడ నో ? పూ రణంబదెక్కడ? ఔరా
    యెక్కడ తోరణమో? తై
    తక్కల నెగిరె నొకడు కడు తల్లడిలి సుమీ :)


    ReplyDelete
  60. -

    ఎన్నిక ల తేది వరకున్
    మన్నింతురు ఓట్లకై సుమా కుర్రోకు
    ర్రన్న పిదప తుర్రో తు
    ర్రన్నన్నా ఐదు వత్సరమ్ముల దాకన్


    ReplyDelete
  61. -

    చాకి రేవు బ్లాగరు వార్ని యేకి పార
    వేసినారు వైవీయసు విదురులచట
    దీనికేమందురోకదా దీర్ఘదర్శి
    గారు వేచి చూడవలె మాకందమౌత

    ReplyDelete
    Replies
    1. సరదాగానే ...

      నారదశిష్యాయ విద్మహే కలహభోజనాయ ధీమహి
      తన్నో _ _ _ (🥨🥨🥨) ప్రచోదయాత్ 🙏😊

      Delete
    2. నేను చెప్పిన 'రేవు' తెలుగు రాష్ట్రాలది కాదండి, కర్నాటకలో వుంది.

      Delete
  62. -
    పడిపడి యేడ్వాలోయీ
    వడి కార్పోరేట్లపై దబాయింపులతో
    జడి వారల ద్రోలుడి మన
    యిడుములకరెకారకులిల వీళ్లే వీళ్ళే!


    ReplyDelete
  63. - తాతగారి నీతి బోధ :)


    తెలిపెదనిదే శుభాకాం
    క్షల నెండల వేడిమికి ప్రజలకెల్లరకున్
    విలవిలలాడండర్రా
    పలువిధములకారణమ్ము భళిమీరే సూ!

    ReplyDelete
  64. -
    సాపేక్షాలోయ్ సుఖదుః
    ఖాపచయములిలని; కార్మికసహోదరులెం
    తో పని జేయుట మనమం
    తా పరితుష్టిగ బతుకుట తవణించు సదా!


    ReplyDelete
  65. -

    ఒంటికి బట్టయె బరువై
    మంటలెగసె కాయమెల్ల జంట జిలేబీ
    వెంట పడుచు వ్యాఖ్యలతో
    తంటాలను రేపుచుండె తవణించునకో?



    ReplyDelete
  66. -
    ఎప్పటిదీ కులముల్ ? మును
    పెప్పటి కాలపు వ్యవస్థ? పెనుభూతంబై
    ముప్పుకలిగించె ప్రజలకు
    తప్పును సరిచేయ వలయు తమ్ముల్లారా!


    ReplyDelete
  67. -
    జిందా బాద్ పల్కండీ
    బిందాసుగ కల్లు తాగ బింబాధరలున్
    హుందాగా మగ రాయు
    ళ్లందరు కారేసుకు చనిరా గ్రామములన్


    ReplyDelete
  68. -
    అంతే అలాగె చేయా
    లంతే తలిదండ్రులంత నపుడె కలుగు ర
    వ్వంతైన బుద్ధి పిల్లల
    కంతా మాతృదినపు శుభకామనలండీ!


    ReplyDelete
  69. -
    తొలగిస్తున్నా బ్లాగ్పోస్ట్స్
    అలంకరించెదను పుస్తకాంతర్భాగం
    బిలవాటినెల్ల జీవిత
    ము లబ్ధి నొందు మహనీయముగ జనులారా!



    ReplyDelete
  70. -

    ఆలోచనాతరంగా
    లేలా! గాలికబురుల జిలేబీల్! పది కా
    లాలకు నిలచెడు రాతల్
    బాలా వ్రాయి విరివిగ ప్రభాసింపంగన్!

    స్వస్తి

    ReplyDelete
  71. -

    వినుమా ! కరోనిలనగా
    పని యేమియు చేయవలదు ! పైత్యం బద్వై
    తుని బుద్ధిపోకడయొ? కొం
    త నాకు కలిగెననుమానమండి తెలుపుడీ !

    ReplyDelete
  72. -
    ఓటేసా నడగకుమా
    వేటెవరికటంచు ! భాజ్ప? వేరేదా? చె
    ప్పే టయమొచ్చి నపుడు చె
    బ్తా! టాటా చెప్పెదన్ కడాదేమొ యిదే!


    ReplyDelete
  73. -
    ప్రేమా, పెండ్లియు శిక్షయె
    భామయొకతె పలుకకుండ పలికె నిజము విం
    దాము కథనమ్ము రారం
    డీ మన వనజమ్మ చెప్పెడీ విషయమ్ముల్



    ReplyDelete
  74. -
    నర జన్మనాదటంచున్
    మురిసి మురిసి పోకు ప్రకృతి ముంగిట సర్వం
    బరయన్ సమమే విదురా
    పరమాత్ముడు ప్రేమమయుడు పరిపాలకుడోయ్!



    ReplyDelete
  75. -
    సాకీ ! నెరనమ్మితి ని
    న్నే! కరుణన్ జూపి మధువు నింపవె మది నీ
    కై కలత చెందె ననుదిన
    మీ కడ గండ్ల సుడిగుండమే నను లాగన్


    ReplyDelete
  76. -

    కొందరు వచ్చిన మనకా
    నందము కొందరు వెడల మనకికన్ మహదా
    నందంబరయన్ జీవిత
    మందానందమ్మె నికర మయ్యరొ వినరా!


    ReplyDelete
  77. -
    ఈ మగ పురుషుడు తానొక
    భామయటంచు తిరిగెనయొ బ్లాగ్లోకమునన్
    ఈ మానసికపు రోగము
    నేమో అందురట వైద్య నిపుణులు వినరా!

    జి- లేబుల్స్ :)


    ReplyDelete
  78. -
    పొత్తమ్ముల మేతయకో ?
    చిత్తమ్మును దాటి గాంచి శ్రీహరిని సదా
    తుత్తునియల జేయుచు తల
    నెత్తుకొనిన వగల భక్తి నీరాజనమో!


    ReplyDelete
  79. -
    నాగరికత మాటున తూ
    నీగలు మదిని కలకలల నింపెన్ విండోస్
    బ్యాగీ ప్యాంట్లకు యాపి
    ల్లోగిలి నాభికి గరికలలో సారికలున్


    ReplyDelete
  80. -

    వీరంతా ఒకటేనా ?
    బారిస్టరటార్ని న్యాయవాది వకీలున్
    బారు కవున్సిలు ప్లీడరు?
    పోరి! తెలియజేయి తాత పొస్టు కెడ వెసన్





    ReplyDelete
  81. -
    రేవు రేవని మానవ రేవకయ్య
    రేవు లేని శ్రీ నగరికి రేవ నెవరు
    వత్తురయ్య భూతలమున ప్రాపు గాన
    కోటి కోటి జనులు పరుగులిడి వడిని

    జి- లేబుల్స్ :)


    ReplyDelete
  82. -

    తిరుమల సామియె పూనగ
    వరుసగ వచ్చెన్ తలపులు వ్యాఖ్యానములై
    పరుగులిడె నన్నెరుగకన్
    పరమాత్ముని చలువ యిద్ది భళిభళి వినరా


    ReplyDelete
  83. -
    అల్లో నేరేడు జిలే
    బుల్లాంటి మహారుచికరపు ఫలములు సుమీ
    పుల్లగ తీపిగ నోట్లో
    చల్లగ కరుగున్ పసందు సరియెచ్చటనోయ్


    ReplyDelete
  84. -

    పొత్తముల ముద్రణ వృధా
    విత్తపు కోత మదిలోన వేదన శ్యామా
    పిత్తంతయు లాభము లే
    వృత్తముల చదువు జనుల ప్రవృత్తి కలదయో!

    జి- లేబుల్స్

    చేతి చమురు గోవిందా! :)

    ReplyDelete
  85. తెలవారక ముందే E- కాకుల గోల యేమిటో ;)

    లోకులు పలుగాకులు ! హ
    య్యో! కూసెదరెన్నొ! వలదయో కొందలముల్
    ఛీ! కాకులనకు మదిలో
    చీకాకుల్ వలదయో! వచించిరి తాతా!



    ReplyDelete
  86. -

    బాలయ్య ఫిల్టరసలే
    మీ లేని మడిసి మగసిరి మించారంగా
    లోలాక్షులు కని పించిన
    చాలు కరమ్ములకు నవ్వ చట్టని కలుగున్ :)


    ReplyDelete
    Replies
    1. ఆయనగారి చుట్టూ వుండేవాళ్ళు కూడా అదే మొరటుతనం చూపిస్తుంటారు. మొన్న మే 28న వారి తండ్రిగారి పుట్టినరోజు సందర్భంగా వీరు తన తండ్రిగారి సమాధి వద్దకు వెళ్ళారట. అక్కడ వీరి కన్నా ముందర ఆల్రెడీ వున్న జనాల్ని వీరి అనుయాయమూక, అంగరక్షకులు ఎదరనున్నవారి వీపు మీద చెయ్యి పెట్టి బలంగా మోటుగా ముందుకు తోసెయ్యడం …. టీవీ మీద కనిపించింది. తన మనుషుల్ని వారించడం కూడా చెయ్యలేదు ఈ పెద్దమనిషి. కాబట్టే యథారాజా తథాప్రజా అన్నారు.

      Delete
    2. శ్రీమాన్‌ బాలయ్య , ప్రతారికాభ్రమరకేళీవిలాసునిపై ఇన్నేసి‌ అభాండాలు వేస్తున్నారేమిటండీ రావుగారు ?


      Delete
  87. రాజధాని లేని రాష్ట్రమాయె తెలుగు
    తల్లి ముద్దుబిడ్డ ధర్మమేన ?
    చంద్ర బాబు గారి జాతక మేమైన
    మారి వైభ వమ్ము మరల వచ్చు?


    ReplyDelete
  88. -


    భారతావని నూత్న శకానికై

    నిదరోతున్నాయి జనుల
    తుది నిర్ణయములు గవాంపతుని వెలుగులకై
    కదిలె గ్రహరాశులొక పొది
    ప్రధాన సేవకునికై ప్రభవ భారతికై!



    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నేడే తెలిసేది
      ఈనాడే తెలిసేది 🙂
      (ఎన్నికల ఫలితాలు)

      Delete
    2. గోవిందా
      గో బిన్ దాస్
      గో విన్ దా

      Delete
  89. -

    ఏమేమి చూడ వలసి వచ్చునో :)

    దామోదరుడొకడు! నితీ
    శో మరొకడు ! చంద్రబాబు చూడ మరొక్కం
    డీ మువ్వురు దేశ ప్రగతి
    కే మార్గము చూపెదరొ జిగేలు మనంగా!


    ReplyDelete
  90. -

    "బోల్డంత " వేదాంతమ్ము :)

    All pervasive one law :)



    వ్యాపించవలె ననంతము
    గా! పదిలము శాశ్వతమ్ముగా నానందం
    బే పరిమితిలేకన్! తరి
    తీపులివే హేతువు ప్రకృతికి మూలమిదే



    ReplyDelete
  91. -
    చెప్పేను కదా ! ఇక్కడ
    గొప్పగ చదివే జనాళి‌ కోకొల్లలు లే
    ముప్పొద్దులకొకడూ రా
    డెప్పటికిన్ వేచి జూడ డెందము డస్సెన్ :)


    హయ్యో రామా :)



    ReplyDelete
  92. -
    తాత గారిచ్చి నారయ్య తమ తరపున
    హెచ్చ రికలెన్ని యో వారి కెంత తెలివి
    యో కదా ప్రశాంతుకిశోరు వోలె! వినెడు
    నాయకులెచట గలరయ్య నారసింహ!


    ఎన్నికల ఫలితాల తరువాయి అనలిస్టుల " ఆంధీ " :)



    ReplyDelete
    Replies
    1. మోడీ గారికి చురక లేవీ లేవాండి?

      ఉండవండి. అయోధ్యలో ఎందుకు ఓడిపోయారండి? యోగి ఎందుకు ఓడిపోయారండి? ఈ వృద్ధ జంబూకం వ్రాస్తే మనం చదవడం లేదా? కాంగ్రెస్ కూడా అంతే కొందరిని వదిలించుకుందామనుకున్నా వదలరు.కాంగ్రెస్ కి పెద్ద చురకలు, బీజేపీ కి చిన్న చురకలు.సిగ్గుండాలి.

      Delete
  93. ఛైం చిక్ జాల్రా :)


    నిలువెత్తు నిదర్శనమత
    డిలలో సహనానికి గలరెవరోయీ యీ
    డిల చంద్రబాబునకు ! ఓ
    జిలేబి కందమ్ము వ్రాలు సెహబాసనవోయ్



    ReplyDelete
  94. బండి యిరుసుల పై రాసిస్తా :)

    మీరాశిస్తున్నట్టి స
    కారాత్మక మార్పు లేవి కష్టేఫలి గా
    రూ! రావండీ ! నేతలు
    మారు ప్రసక్తి మరి లే సుమా రాసిస్తా!


    జి- లేబుల్స్

    ReplyDelete
  95. -
    ప్రాచీన పట్టణముల స
    దాచారమ్ములు భళి వ్యవహారమ్ములతో
    డై చిత్రిక పట్టిన రచ
    నా చాతురి చదువవలె జనాళి వడి వడిన్


    ముఫత్ కా పీడీయెఫ్ వుంటే లింకు‌ పెట్టండి
    చదివేస్తాం వెస వెసన్ :)

    శుభాకాంక్షలు

    రచనా శైలి,
    వస్తు సేకరణ,
    వాటిని క్రోడీకరించిన
    వైవిధ్యం అమోఘం!

    చీర్స్

    జిలేబి


    ReplyDelete
  96. -

    బ్రువ్వట బాబా ! బొల్లో
    జవ్వల్ రచన యిది రండి చదివెద మండీ
    రవ్వల నెక్లేసుపదా
    లెవ్విధముగ చెక్కినారొ లెస్స! సెబాసో!



    ReplyDelete
  97. -
    తూలిక తాత్విక చింతన
    లో లయ మయ్యే సిరా తళుకులందారా
    డే లబ్జుగ విన్నాణము
    వ్రాలెన్ మాణిక్యముల్ సెబాసొ జిలేబుల్



    ReplyDelete
  98. -

    ఓ యబ్బో ! ఆశావాది :)

    ఆశావాదిని నేను! ని
    రాశ నడుమ ఆశ ఉందిరా అను కొని వ్య
    త్యాశము వెదికెడు మనుజుడ
    నా శక్తియె మూలమని సదానమ్ముదునే!


    జి- లే బుల్స్

    ReplyDelete
  99. -

    సమాధానము తెలియకుంటే ఉబోసించవలె :)

    సామాన్యుడి లచ్చనమే
    రామచిలుక ! నీకు తెలియ డానికి లేదే
    యేమాత్రమ్మవకాశ
    మ్మూ! మాటలనాపిపదవె మూతివిరువకే !



    ReplyDelete
  100. -
    ఓటరుల గురించి ఉబోస :)


    బుచికి గారన్నదే సత్యమోయి ఓట
    రులు తెలివిగలవారు వారు వలయునది
    మెచ్చి అందలమెక్కించి మెల్ల గా ని
    దురని జోగాడుదురరరె దుస్థితి యిదె :)


    ReplyDelete
  101. -

    బండి ఊచలే సాక్షిగా :)

    కాలమ్ము మారు! మనుజుల
    వేళయు మారు మినహాయి వేరెచట?! మరే
    యేలిన నేతల బోవన్
    మేలనుకున్న సరికొత్త మేళము వచ్చున్ :)




    ReplyDelete
  102. -

    హా! నిజమే ! పొర పాటే!
    మీ నేత్రమ్ములెపుడున్ సుమీ తప్పులనే
    గాన తపించునొ ? తెలుపం
    డీ! నా కన్నులు భళారె రేజర్ షార్పోయ్

    ReplyDelete
  103. -

    ఏడు కొండల సామీ :)

    హ్యాపీ జర్నీ అన్నా
    నే పరుగిడి లెట్జగో అనెక్కడ అన్నా ?
    ఓ పాఠకుడ చదువవో
    యీ పదపడి వ్రాయనేల ? యింత వెసవెసా!

    ReplyDelete
  104. -
    లాజిక్కు లేని లెక్కల
    క్రేజీనెస్సుకి జవాబరే యెన్నికలం
    దే జనులిత్తురు కాంగ్రే
    సో జేడియొ భాజపాయొ సువ్వీ సువ్వీ :)


    ReplyDelete
  105. -

    సాయిన్సు ముచ్చటలతో
    వాయింపుల విదురులట సెబాసో అనిపిం
    చే యీ వేళ భళి జిలే
    బీయమె! కందంపు మాల వేయవె అమ్మీ :)


    ReplyDelete
  106. -
    అరె ఒప్పుకొందును సరే
    సరి మీరే రైటు! తప్పసలు నాదేనూ!
    సరిగా చూడక చెప్పా
    మరి వ్రాయనిలా మరల సుమా! వందనముల్!



    ReplyDelete
    Replies
    1. Ky cheez badi hai mast mast ...
      Wow..h...wah, kya tandrusth ...
      Jawab nahi aap kaa ...
      వందనముల్ ... 🙏🙏🙏

      Delete
  107. -

    క్యా చీజ్బడి హై మస్త్ మస్త్
    వౌ! చీర్స్! క్యా! తందురుస్తి వాహ్ వాహ్! లేదం
    డీ చెక్పాయింటు జిలే
    బీ!చెప్పెద వందనములు ! బీలేజి సదా!


    ReplyDelete
  108. బండి ఊచల సాచ్చి :)

    రామ్మా ! పజ్జెమ్మేసుకొ
    బామ్మా ! యెన్నాళ్ల బతుకు బాపుకొనెదమో
    యిమ్మహిలోన జిలేబీ
    యమ్ముగ ! వెస బండి ద్రోలదామిపుడె పదా :(


    ReplyDelete
  109. -
    భయమాహారము మైథున
    మయయొ నిదుర సర్వజీవుల కిల సమాన
    మ్మె! యెట బఠానీల నములు
    ట యమ్మొ పళ్లెటగలదు కటాకట్కటటా :)


    ReplyDelete
  110. -
    ఉరికొచ్చె కవిత్వము హ
    ద్దరిబన్నా బండి వారిదన్నా పవనొం
    టరి వాడు కాడటంచున్
    పరుగెత్తించిరి పదముల వాహ్ మిత్రులకై :)


    జి లేబుల్స్ :)


    ReplyDelete
  111. -

    అంతా అశాశ్వతమె! నా
    వంతుగ పద్యాలనెల్ల పట్టిక గా బ్లా
    గాంతము గానిల్పితి హా
    సుంతయు చదువంగ రారె శుంఠలు తాతా!


    ఒకడైనా రాడా చదువ యేమందును
    అంతా వారి దయయే అయిననూ ఆశించెద
    చదువ రావలె శుంఠలు

    ReplyDelete
  112. -
    ఎటుపోతున్నామండీ ?
    కటాకటని వెనుకకేను కాదు సుమండీ
    ఇటువంటి దుబారాలే
    ల టంకశాల తెరువాటు లైన సుమండీ



    ReplyDelete
  113. -
    ఇదిగిదిగో వచ్చె సుమా
    యెదురన్నది లేని బామ్మ యెవ్వరి నైనా
    సదనమ్మున చెండాడున్
    వదలదు బరికేస్తది జన వాహిని నెపుడున్



    ReplyDelete
  114. -
    అల్లితి రాముని పై కో
    కొల్లలు గా పద్య మాలికోత్సవముగ నా
    దుల్లము పొంగిపొరల రా
    జిల్లవలె సదా భువిని సజీవము గానన్




    ReplyDelete
  115. -
    మాటికి మాటికి పోతుం
    డే టప్పనుచున్ కరంటరె కరువు సూచిం
    చే టయమని మిత్రుడొకడు
    దీటుగ చంద్రోదయమును తిన్నగ చూపెన్ :)




    ReplyDelete
  116. -

    ఏదీ జరగక ఆగదు
    మీదైన కితాబు వచ్చు మించారగ రా
    మా దయ నీదను భారము
    మీదై న తెరగగు సొమ్ము మీ కండయదే

    ReplyDelete
  117. -
    ఆ మూత్రపు జాయి జనుల
    కా మూత్రపు వాసనా నిఖార్సుగ కావా
    లే మాష్టారూ లేకుం
    టే మనుగడ సాగుటెట్లు ట్రెండిదె కాదా!

    జి లే బుల్స్

    ReplyDelete
    Replies
    1. This a truthful statement indeed🙂"

      Delete
    2. మీ అనుకరణలు, వెటకారాలకేం లెండి గానీ మీరు వ్రాసింది అచ్చుతప్పు అని ఒప్పుకోరాదూ?

      Delete
    3. మీరు చెప్పింది నిజమే


















      కాదు

      Delete
  118. -

    తాతా వారి అనాలిసి
    సేతావాతా జిలేబి సేతయె సుమ్మీ
    వేతనము లేని నౌకరి
    ఖాతరెవరు చేతురోయి కలకండయకో :)


    ReplyDelete
  119. -

    అతివృష్టి యనా వృష్టియు
    వెతలకు మూలమ్మె నోయి వినరా ఆ పై
    ఉతుకుడు తప్పదెవరి కై
    న తల్ల డిల్లంగ వలయు నయ్యరొ వినరా


    ReplyDelete
  120. -
    గలదొక యూట్యూబ్ఛానలు
    పళనిస్వామికి సుఖముగ వంట విషయముల్
    తెలిపెదరు తెలుగు లో శ్యా
    మలరాయలె మెచ్చిరోయి మహిని జిలేబీ :)


    వెట్రివేల్ మురుగనుక్కు హరోహర


    మురుగా పழమ్ నీయప్పా



    ReplyDelete
  121. -
    చింత కాయల కాజ్ఞ రుచింప వచ్చు
    గాని గుటకల కాజ్ఞ స్వీకార మవదు
    తాత నానుళ్లకసలు కొదవయె లేదు
    వాటి కి వివరణ తెలుప వారె సాటి :)



    ReplyDelete
  122. -
    శ్యామల రాయలు మెచ్చిన
    ప్రామాణిక పళని గారి వంట తయారీ
    లేమో జిలేబు లే సు
    మ్మీ! మదిదోచిరి కతల సమీకరణలలో



    ReplyDelete
  123. -
    నాకు శ్రవణ మాధ్యమమున
    కూ కంటే చుక్కెదురయ కొండంతైనా
    యేకూతయు విని పించదు
    సౌకర్యమ్ము కలదిందు శ్యామలరాయా :)



    ReplyDelete
  124. -

    నాకు ఠారెత్తి పోయెనా ? నమ్మ దగిన
    మాట యేనర్ర ? బుర్రన్న మాట లేని
    జీవు లార చీరేస్తాను సిగ్గు లేన
    నాని మస్సులార పదండి నడ్డి విరుగు

    ReplyDelete
  125. -

    ఒక చిన్న కత విను జిలే
    బి! కతల కాణాచి‌ తాత వివరించెనటన్
    ముకుదాడు కట్ట గలడిత
    డు కాలి కిన్ చేతికిన్ చెడుగుడు యటంచున్ :)


    ReplyDelete
  126. -
    నిదురన్వీడెను సింహం
    బదిరెన్ చేంతాడు నిడివి వ్యాఖ్యలు భళిరా
    చదివెడు వారెచట గలరు ?
    పదిలము గా నిదుర బోవునిక ప్రభువు కెడన్


    జి లే బుల్స్


    ReplyDelete
  127. -

    ఏల సుత్తి తాత యేల అశాశ్వత
    ములకు సృష్టి తత్వమునకు లింకు
    లేల ! బండి చుట్టుటేల నడకయు సా
    గుటకు కాదకొ ! పదుగురి కొరకయొ!


    ReplyDelete
  128. -
    శ్రమ జీవన సౌందర్యము
    మమేక మైనట్టి ప్రకృతి మట్టిమనుజులం
    దు మదిని తాకెడు సహజ
    త్వము చూడగ ముద్దుగొలిపె తనివారంగన్



    ReplyDelete
  129. -
    నా టపాలోన చెప్పినానండి లేదు
    వినుచు నాహ్లాదమును పొందు విత్తి ! వినెద
    నేను సాహిత్యముకొరకు నేటి కాల
    మందు స్పష్టత లోపించె మాట బలుక


    ReplyDelete
  130. -
    ఏదీ తిన్నగ నీ కస
    లేదీ అర్థమ్ము కాదు లే చిరు బుడతా
    వాదించడమే ముఖ్యము
    లేదా చిర్రెత్తుకొచ్చు లే చిరుబురులన్


    ReplyDelete
  131. -
    ఎందుకు దాగుడుమూతలు
    బిందాసుగ చెప్పు వూరు పేరు జిలేబీ
    అందరి కుతూహలమునకు
    వందారని కందమొకటి ప్రకటించుకొనన్


    ReplyDelete
  132. -
    సామాన్యుని సణుగుడయో
    యేమానానా గొణుగుటయే విడువడయో
    మైమరిచి ఓటు వేయును
    కామాంధులు పదవి చేర కస్టపడునయో



    ReplyDelete
  133. -

    అసమానమైన నామము
    పసందు శ్రీరామనామ పారాయణమున్
    విశదమిది విష్ణునామము
    నిశాచరుల నిదుర మాన్పు నిక్కము గానన్


    ReplyDelete
  134. -
    ఈసారికిలా పోని
    స్తే సరి యంచున్ జిలేబి జీ ఉద్దేశ
    మ్మో? సందేహము తెలిపిరి
    మా సారచట నరసింహ మాయె వినదగున్


    ReplyDelete
  135. -

    మీ వాక్యము కోసమెదురు
    మావాళ్లందరు ప్రభువు ప్రమాణముగా చె
    బ్తే వాళ్లెల్లరు సంతస
    మే వారి ధనముగ నమ్మి మిము పొగుడుదురే

    ReplyDelete
  136. -

    తెలుగు విద్యార్థులమెరికా దేశమందు
    దాడులకు గురగుట చూడ తల్లడిల్లి
    బ్లాగు రైటరొకరచట పాపమేమి
    చేసిరో మనవారని చింతపడిరి



    ReplyDelete
  137. -
    చిన్న హీరోల సినిమాలు సేదదీర
    చూసె దమ్మిక మీదట సొబగు గా థి
    యేటరులలోన మాత్రమే యిదియె నిర్ణ
    యమ్ము లలితమ్మ పలికెరోయమ్మ నేటు



    ReplyDelete
  138. -
    తంతే బూరల బుట్టలోన పడి యేతావాత పొర్లాడె మూ
    తంతావాసన హవ్వ! పొంగెనయొ! జీతంలేని ఉద్యోగమెం
    తెంతోవుండవు బోడిచేతి మెతుకుల్ దెప్పుల్ చెనిక్కాయలున్
    కాంతారమ్మున కన్నగాడు మరువన్ గాబోడుధారాంగమున్


    హేవిటో ఈ తలాతోకాలేని వాక్యాలు

    :)

    ReplyDelete
  139. -
    అయ్యయ్యో ! హరిబాబుగారు!యెపుడోఅన్నారు ఎన్టీవొడో
    భయ్యా!రెడ్డియొ! సీయెమౌననుచు అబ్బబ్బో! సెటైరేనుపో
    కుయ్యోమొర్రొ యటంచు వ్రాయుమిక మూల్గుల్తో మరోమారు రా
    వయ్యా! బ్లాగు టపాను జూసి జనులే వారెవ్వ చేంతాడనన్


    ReplyDelete
  140. -
    ఏదైనననాచారం
    బేదైనా‌ను పొరబాటు పెద్దగ లేపున్
    వేదాంతపుటాక్రోశము
    ఖేదంబల్లుకొను మేలు కేల్మోడ్చుటయే!



    ReplyDelete
  141. -
    రాముడు చెప్పెను‌ వినుమోయ్
    వేమార్లు మరల మరల నివేదింపడు సు
    మ్మీ! మడిసి విజ్ఞత గలిగి
    కామెంటిడునపుడపుడు నిఖార్సుగ నెపుడున్


    ReplyDelete
  142. -
    హాయిగ ఇంట్లో జోగక
    సైయని సినిమాకు పోయి ఛా! హెడ్డేకం
    చూ యేడ్వనేల జనులా
    రా! యీ కల్కి మన కల్కి యా!తిక్కయె పో!


    ReplyDelete
  143. ఏమి బడాయి ఏమి బడాయి :)

    తెలగాణ అసెంబ్లి కొరకు
    నలుపు కలరునద్ది వేసిన సిరా గుర్తుల్
    తిలకింపన్ పోలేదం
    డి లోక్సభాయెన్నికల గడియలవరకునే!


    ReplyDelete
  144. -

    అవి ఒంటరి పక్షులు కా
    వు!విరహమున మునిగి తేలి వూయల లాడం
    గ వురికెడు జంటపక్షులు
    కవులకు చేయూతనిచ్చు కావ్యములల్లన్


    ReplyDelete
  145. -

    గతి విడిచినావు మతిని ప్ర
    గతిని విడిచితివె జిలేబి కష్టేఫలి శ
    ర్మ తిరముగ పలికె సుదతీ
    స్థితితప్పిన అపరమేధ! తీయటి తిక్తా !

    ReplyDelete
  146. -
    హరిబాబా? లేక మజా
    క! రెచ్చితే రెచ్చి గిచ్చి ఖండించునురోయ్
    సరికిసరియంచు సైయను
    చిరుజీవుల తోలు వలిచి చీరేయునురోయ్



    ReplyDelete
  147. ఏమంటివి ? యేమంటివి ?
    యేమోయీవింటివి ? మరి యేమోయి కతల్ ?
    యేమి సెపితివొ? సెపితివే
    మో? మా కెట్లెరుకయగు ? దుముకవలదోయీ :)


    ReplyDelete
  148. -

    ధర్మంబు టకా! అరయన్
    కర్మయగు టకా! టకాయె కైవల్యమగున్
    మర్మంబెరుగు టకాయే
    అర్మిలి! బ్రహ్మము టకాయె ! హాటక లక్ష్మీ !



    ReplyDelete
  149. -

    డబ్బేనోయ్ ముఖ్యంబగు
    పబ్బము వలె నను దినమ్ము పరితుష్టిగొనన్
    డుబ్బుకు కొరగావు సుమా
    డబ్బన్నది లేనిచో ఉడాలైపోతావ్!



    ReplyDelete
  150. -

    తలపుల సుడిగుండములో
    తల మునకలయిన జనాళి తప్పించుకొనన్
    గలదొక చిట్కా కాగిత
    ములోన వ్రాసి మరచిన సుముఖమగునోయీ

    ReplyDelete
  151. -
    ఆరాటములన్ని విడిచి
    శ్రీరామునిమయముగ నివసించెను మనసే
    శ్రీరాముడె తన ప్రాణము
    గా రంజిల్లుచు వరలె ప్రగాఢముగానన్


    ReplyDelete
  152. -
    నాదు సహజ శైలి చిన
    బ్బా!దురుసుగ మాటలాడ బాదేస్తా! నా
    నా దుర్భాషల నొలిచే
    స్తా! దువ్వాడంగ ఖబడుదార్దువ్వాడ్తా!



    ReplyDelete
  153. బ్యూటిఫుల్ పోయెమ్ మిర్రర్ ఇమేజ్ :)

    శాపములను, తొలగించుము
    పాపములను దుష్టజనుల భావమ్ముల! నా
    తాపములను తొలగించుము
    శ్రీపురుషవర! పరమాత్మ! శ్రీకర! శ్యామా!



    ReplyDelete
  154. -

    చెప్పగ నుపయోగము కల
    దప్పా! వింటావ ? తెచ్చెదవు తంటాలన్
    ముప్పువలదు పైపెచ్చుగ
    దెప్పులు కూడా మొదలగు దిమ్మతిరుగునే


    ReplyDelete
  155. -
    ఓసి! ఉపేక్షిస్తున్నా
    మే! సీ! మేమింక మాట యే కలుపము నీ
    తో! సాంగత్యము వలదే
    ఓ సుబ్బాయమ్మ ! కాస్త ఓరంబోవే



    ReplyDelete
  156. -
    పిండి మావుల చూడగా వేచిరచట
    ఇడ్లి యో దోసయొ దొరకు నిక్కమంచు
    చూచి చూచివేసారిరి చోరులెల్ల
    గూడి రాజ్యమేలన్ జూడ కోటరాయ!



    ReplyDelete
  157. -

    హరిబాబేమియొ వ్రాయును
    మరి చదువరులెవ్వరో సుమా తెలియదు! పా
    మరజనుల ముంగట యతడు
    మరి శంఖమ్మూదుచుండు మాదిరి కలదౌ !



    ReplyDelete
    Replies
    1. హరిబాబేమియొ వ్రాయడు!
      మరి చదువరులెవ్వరో అసలే తెలియదు! పా
      మరజనుల ముంగట యతడు
      మరి శంఖమ్మూదుచుండు లేబిజి వలెనున్!

      Delete
  158. -
    తల్లికి వందనమనబడు
    కల్లపు జీవొయిదిగో! ప్రఖాండులు చెప్పం
    డెల్లరు దీనికి భావము
    వల్లభుడా చాకిరేవు ప్రశ్నించె సుమా!


    ReplyDelete
  159. ఏమి తెలివి ఏమి తెలివి :)

    కాదోయి మేక తోకా!
    మేధస్సది కల్పితము కమేయని బిలువం
    గా దగు సుబ్బారాయుడు!
    వాదాడుట తగదు తాత ప్రతిభా శాలీ!



    ReplyDelete
  160. -

    కమే యేమోయ్ నీ స్పెషాలిటీ ? :)


    నీకూ గూగుల్ కూ తే
    డా కాస్తా చెబ్దువంటె డాబుగ వడగ
    డ్తా కాచి తూచి యిస్తా
    నీకై యందా కమే! మనీషి జిలేబీ :)



    ReplyDelete
  161. -

    తవికల లో బూతులకో?
    కవివర! యేయ్! యేమిటిదయొ? ఖండించెనొకం
    డు! వినదగురా యటంచున్
    తవికనొకటి తాను చట్టు తాడించెనటన్

    ReplyDelete
  162. Crying baby gets milk :)

    నాపై కారుణ్యమ్మును
    చూపుమయా రఘుపతి! బెడసువలదు శ్రీరా
    మా! పాటికాదు యిడుములు
    నాపై కురియ నులుకంగనైన నులుకవే



    ReplyDelete
  163. -
    నాకేల రామ వరములు
    ఆ కోరికలున్ ధరనివి యవియు వలదురా
    నీ కోదండపు ఛాయయు
    నీ కరుణయె చాలు నాకు నిమ్మళమదియే


    ReplyDelete
  164. -
    నమ్మగ రానివి సిరులా
    కమ్మని దనిపించు ప్రేమ కంజముఖులతో
    నమ్మదగనివి తనువులిక
    నిమ్మళ మైనది ప్రభో కనికరము నీదే !


    ReplyDelete
  165. -

    వర్తింపను సవినయముగ
    ధూర్తత్వము లేక ప్రేమ తోడై "నాహం
    కర్తా హరియేను సదా
    కర్తా" యని చాగ వలయు కరుణయు నీదే


    ReplyDelete
  166. -
    వరముల ఘనముగ నిత్తువు
    పరిపరి కడగండ్లనుండి పరిరక్షణ సే
    సి రహిని కురిపింతువయా!
    సరియెవ్వరు రామ నీదు సాకతమునకున్



    ReplyDelete
  167. నిన్ను భజించెద రామా
    మిన్నగ దశకంఠుని చిదుమి విభీషణుకున్
    చెన్నుగ శరణమొసగిన స
    మున్నత పరమాత్మ వీవు మ్రొక్కెద కృపకై

    ReplyDelete
  168. -
    తెలియని తీరము చేర తె
    రలువడుచు కడలిని దాటు రవణమ్మును ప
    త్సలమరయక నిలువన్ క
    ప్పలినెక్కి రఘుపతి వచ్చె బంటుని‌ గావన్





    ReplyDelete
  169. -

    చీరల గురించి తీసిన
    ఆరా మరువరు జిలేబులౌరా వినరా
    వారుల్ జోడించిరచట
    పేరా తమదైన శైలి వేరూనంగన్ :)

    ReplyDelete
  170. -
    శ్రీనివాసులు గారేన సిడిముడిని ట
    పాను జేర్చి సెటయిరును బవిరి తీర్చి
    చెళ్ళు మనురీతి గుజరాతి శ్రీపతుల వి
    వాహము గురించి నిడివిగ వ్రాసినారు :)


    ReplyDelete
  171. -
    సేయుచు తప్పులనుదినము
    లేయపు ప్రాయమ్మునుండి లేకితనమ్ముల్
    ప్రేయపు సూచనల సదా
    ద్రోయుచు రామయ్య కావురో యన దగునా!





    ReplyDelete