Wednesday, January 22, 2025

జై జై జై ట్రంప్ ! నాలుగేళ్లు :)

 

వచ్చిండు ట్రంపమెరికా

కిచ్చిండోయ్ కిక్కు రాజకీయాల్ మారన్

బుచ్చమ్మ తూలికయొ వా

క్రుచ్చెన్ పోగాలమొచ్చె క్రొవ్వారుగనే


శుభోదయం

అందరికీ ట్రంప్ నూత్న వత్సర

శుభాకారాల్ మిరియాల్

ఢమాల్ ఢమాల్ నిఫ్టీ 

రష్యా చీనీ భాయీ భాయీ 

హెచ్చు గ హెచ్చు ఒన్నుకు ఢోకా వస్తుంద(ట)

పుడితే పిల్లల్ నో మోర్ పౌరసత్త(ట)


మరో నాలుగేళ్ల సంబడాల్


జిలేబి



51 comments:

  1. వచ్చిండు ట్రంపమెరికా
    కిచ్చిండోయ్ కిక్కు రాజకీయాల్ మారన్
    బుచ్చమ్మ తూలికయొ వా
    క్రుచ్చెన్ పోగాలమొచ్చె క్రొవ్వారుగనే



    ReplyDelete
  2. -

    హాహా కారాల్ హ ఖలకు
    బాహాటము గరికిపాటి వార్కి సవాల్ ! వా
    ర్నీ హాశ్చర్యమనానిమ
    సోహో యెవరొ తెలిసెన్ ముసుగుతొలగెనుగా

    ReplyDelete
  3. “జిలేబి” గారు తిరిగి నగరప్రవేశం చేసినట్లున్నారే।
    ఏమయిపోయారు ఇన్ని రోజులూ ?

    ReplyDelete
    Replies
    1. కొంత పైకెళ్లి క్రిందికొచ్చామండోయ్

      కుశలమేనా ?

      Delete
    2. నిజమే 😳😳??
      మరి మమ్మల్ని “కుశలమేనా” అని అడుగుతారేమిటి ?
      ఏమైనప్పటికీ వెల్కం బాక్ 🙂.

      Delete
    3. మనం పైకెళ్లి క్రిందికొస్తే అందరూ అలాగే వుంటారని అనుకోవాలంటారాండీ వినరా వారు ? :)

      Delete
  4. -

    సలహాలకు కాణాచి ప్ర
    బలమై నట్టి మన తాత బ్లాగ్లో తెలిపే
    రలవోకగ చేయదగు ప
    నుల పట్టిని కష్టకాలమునకు జిలేబీ


    ReplyDelete
  5. అందరూ మనలానే చెవిటి మేళాలుగా వున్నట్టున్నారు :(

    గరికయొ గరికియొ సాటి యె
    వరు వారికి ! త్రుప్పు పట్టెనా చెవి మన బ్లా
    గరనానినస్సుకు వినికి
    డి రాపిడికి నొగులు పడి వడి జిలేబి వలెన్

    ReplyDelete
  6. ఇతరుల ఉద్ యోగం అబ్బా ఎంత బెటరో :)

    నాకుద్యోగము మీలా
    వాకబు చేయక నొసంగు వారుంటారా
    నాకో వయసాయెను కూ
    డా! కట్టుబడదు సుమా ధడాలుద్యోగాల్


    ReplyDelete
  7. -
    ఉగ్రాణంపల్లె హరిక
    థాగ్రేసరుడచట హరికథను మొదలిడగా
    నుగ్రముగా మీదుపడుచు
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్

    ReplyDelete
  8. -
    వెంటపడన్ పువుబోడియు
    తుంటరి తనమునకు బెదిరి ద్రోణప్పయె జే
    గంటల నడుమన్ త్వరితము
    కంటను కంకణమిడె తిలకమును కరమునన్

    ReplyDelete
  9. -
    మదిలో చంచలము గనును
    మదిరాసక్తుడె; నిలుపును మర్యాద సభన్
    మదినిండుగ రఘు రాము న
    నుదినము సేవించెడా మనుజుడె జిలేబీ


    ReplyDelete
  10. -
    ఆదిభిక్షువైన వాడేల వలదోయి
    శంకరుండు, వలదు శాంతి, వలయు
    నిత్యమైన సత్యనిష్ఠ, సన్మార్గము
    బ్రహ్మవిద్య యేను బతుకు బాట



    ReplyDelete
  11. -
    ఆడువారి బొడ్డు పైన బొంగరముల
    త్రిప్పె చిన్న నాట త్రిప్పె చక్ర
    మున్ను నేడు పద్మభూషణుడైనాడు
    బాలకృష్ణ గట్టి వాడు సుమతి


    ReplyDelete
  12. --
    వగరూ చేదూ కారము
    తగుపాళ్లన్ తీసుకొన్న తాతలకున్ బా
    ధగదా! షుగరోయని తా
    తగార్లచట లాడుచుండ్రి తైతై యాటల్


    ReplyDelete
  13. -

    నా తల్లి చదువు కొనలే
    దే! తనెలా యెరుగు కుండ నెటులన్ కడితే
    శీతల మొందును జలమే!
    ఆ తరము తెలివి జిలేబులరయంగలరో ?


    ReplyDelete
  14. -
    నల్లద్రాక్షలు మాకెడ
    యెల్లపుడున్ దొరుకుచుండె యెగబడిరిపుడో
    తెల్లద్రాక్షలకొరకై
    యెల్లరు కష్టేఫలి తెలిపిరి వినరండోయ్!




    ReplyDelete
  15. -
    రాబర్టు కియోసాకీ!
    ప్రాబబ్లీ మార్కెటులిక క్రాష్ ఫిబ్రవరిన్
    జేబుల్ ఖాళీ చీనీ
    బాబాయ్ డీప్ సీకు తెలిపె వడిని జిలేబీ



    ReplyDelete
  16. -

    వ్యర్థంబాయెను యత్నం
    బర్ధాంగీ! కృతి గనుఁగొన ; వ్యర్థంబయ్యెన్
    వర్ధిల్లెడు నా కవనము
    స్పూర్థియు వీగె జవరాల పూర్తిగ మదిలోన్.

    ***

    ప్రయత్నం వ్యర్థం కాదని నమ్మకం.
    పూరణ కొరకు మాత్రమే సుమా !

    వర్ధిల్లంగను శంకరాభరణమే వాగ్దేవి హారమ్ముగా
    స్పూర్థించేర్చెడు రీతి కైపదములన్ పొత్తమ్ముగా జేర్చ నీ
    వార్ధక్యమ్మున చేయగా యతనమున్ పైకమ్ము దాకొల్పుటం
    దర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ




    ReplyDelete
  17. -
    లోకజ్ఞానంబంతే!
    మోకాళ్ళతెలివి యనుచు ప్రమోదము చెందం
    గా కాచుకొను జిలేబుల్
    ప్రాకుచు వచ్చెదరు వేయ వ్యాఖ్యలనిచటన్


    ReplyDelete
  18. -
    సూక్ష్మంబారయ ద్వారపాలకుల సంశోధింపగా మానవుం
    డై క్ష్మాజానిగ రూపమెత్తి వనవాసార్థమ్ము, కైకేయి యే
    షా, క్ష్మాభారము దీర్చగా కదలి సంస్ఫాలమ్ము తోనాందిగా
    లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో



    నంది - సంతోషము నందివాహనము పై- సంతోషమనెడు వాహనముపై
    కదలి- జింక

    --
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె
    పోవు గాలము వచ్చెను పో దశముఖు
    నికి; కరుణని విభీషణునికి చదురు! వి
    భుని శరణము కోరంగ ప్రభుతయు దక్కె



    ~

    ReplyDelete
  19. -

    వెధవల కెందుకని తెలుప
    సద‌నమ్మున విందురా ప్రసంగములన్ ?కో
    విదులని యెంచి తవికల
    ల్లుదురంతెయె బుచుకు బుచుకు లుబ్ధత్వమునన్


    ReplyDelete
  20. -

    పింజారి వెధవలారా!
    రంజన చెడిరొ హలికుల్? పరంపర వీడన్
    భంజాదేవీ భక్తులు,
    గంజాయిని సాగుచేయగా వలె, రైతుల్?



    ReplyDelete
  21. -
    సకల సుగుణరాశి శుభము
    లకు వలనగు ధరణిజయు విలసిత లపనమం
    దు కరుణయు కురియు సిరి జా
    నకి కలిమిచెలి పదములకు నమనము లివియే



    ReplyDelete
  22. -
    ఆందోళని జీవివి నీ
    వెందెందున్నను ప్రశాంతవేళయె లేదోయ్
    కందాలమ్మి జిలేబీ
    తొందర పడకే సదనపు తుంటరి బామ్మా



    ReplyDelete
  23. భవజలధి! బండి చక్రా
    లవధుల తో డిరుకు బతుకులాటలు జల్సా
    కువకువలు లేని విదురుల
    ప్రవచనముల హోరులివ్వె ప్రజలకు మత్తుల్

    ReplyDelete
  24. నారదా!

    జనులను భయపెట్టుటయే
    వినరా! జిత్తులు విదురులవీ! నేరము! శి
    క్ష! నుడివెదరు బతుకులకు ము
    డినిబెట్టుచు వ్యాఖ్యలన్ తురిమి తురిమి మరీ



    ReplyDelete
  25. -
    గాజా స్ట్రిప్పు‌నొసంగుము
    తాజా గా దాని మార్చె దము మా సత్తా
    తో జబ్బల్ బట్టి దగు
    ల్బాజీ లనణచెదము ప్రజలను గావంగా!



    ReplyDelete
  26. వ్యాకరణ మనబడెడు సైడు ట్రాకు
    మహా డేంజరైన ట్రాకు :)

    సంధుల వేట సమోసా
    లందు రుచియునొక్కటేను లలితమ్మాయీ
    ముందరి కాళ్లకు వేయును
    బంధమ్ముల రామగాధ పరుగో పరుగే :)



    ReplyDelete
  27. -
    వానరు డొక్కండు చాలు :)

    నాడు లంకను కాల్చితి వంట! నేడు
    నీదు వారసు డొక్కడు దేశమందు
    బ్లాకవుటు చేసెనంట! సెబాసొ నీదు
    వారసత్వపు ఘనత సెబాసొ హనుమ!

    https://www.barrons.com/news/sri-lankan-monkey-causes-nationwide-blackout-2c3cc8ac






    ReplyDelete
  28. -
    బొల్లోజుకు జీకేకే
    డొల్లయె పో నీటపా కడుంగడటంచున్
    త్రుళ్ళిపడగ డోసిచ్చిరి
    చళ్లుమని; జిలేబి రమ్మ! చదివెదమిపుడే




    ReplyDelete
  29. -

    పోస్టు
    https://sahitheeyanam.blogspot.com/2025/02/blog-post.html



    రిటార్టు

    https://anupallavii.blogspot.com/2025/02/blog-post_9.html


    ReplyDelete
  30. -

    మాన్యంబైనట్టి నెలవు
    ధాన్యంబున్నట్టి తావు; దడయక విడుమా
    మాన్యులు లేని తలమ్మును
    సైన్యము గావని పుడమిని చట్టని‌ సుమతీ


    ReplyDelete
  31. -
    పేరున్న గాయనీమణి!
    ప్రారబ్ధమ్మున తడుమన పడు పెనిమిటి ! కం
    జారమ్మె సభాస్థలిగా
    కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్


    ReplyDelete
  32. -
    బారెడు ప్రొద్దవకమునుపె
    సారంబొప్పగ సతియె పసందుగ చేయం
    గారో ప్రాణం బగు సాం
    బారుంగని శ్రోత్రియుండు వహ్వా యనియెన్


    ReplyDelete
  33. -
    మల్లె మాలల ఘుమఘుమ ! మత్తుగాలి!
    వళ్లి సుకుమారి వయ్యారి వచ్చె గుండె
    జల్లు మనె పుష్పకున్ సూడ సక్కగుండె
    చల్లదనమిచ్చె సూర్యుడు చందనముగ



    ReplyDelete
  34. -
    తమ్మికంటి యోరపు జూపు దాకి కూలె
    మల్లరియొకడు ; కూలెను మరుని పూల
    బాణములకు ధ్యానమ్మొక బడరునిదయొ
    తమ్మివిరి దాఁకి కూలె దంతావళమ్ము


    ReplyDelete
  35. -
    భ్రాంతి కలుగ జేయు పదము
    లంతయె! వింతగలదేమి సుంతయు కవిరాట్
    సొంతంబన్నయగు, రమా
    కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్


    ReplyDelete
  36. -
    పాపంబందరిది కరుగ
    పాపంబైనట్టి నేను బయటపడుటెలా
    పాపంబునుండి పాపం
    పాపమ్మదె చింతపడెను పాపుల్లారా



    ReplyDelete
    Replies
    1. కొంగలు జపం చేసినవి
      చేపలు స్నానం చేసినవి
      గజ స్నానం ఆచరించి
      పాపులు పునీతులైరి
      గురువులు బాధతో పద్యాల్ చెప్పిరి

      Delete
  37. -

    నిదురన్ వీడి జిలేబీ
    ని దునుమగా తాతగారు నిట్టనిలువుగా
    పదపడిరి లక్క రాజ
    న్న దయ శుభోదయమయే ప్రణతులన దగునే :)




    ReplyDelete
  38. -
    హరహర శంభో శంకర!
    వరముల నడిగిన నొసంగు పంచాననుడిన్
    పరమేశుని సతి యగు శాం
    కరి కరుణం గనుఁగొనిన సుఖప్రదమె కదా!


    ReplyDelete
  39. (జిలేబీ పై కవిత)

    జిలేబీ జిలేబీ, మధురమైన రుచి,
    చినుకులా తిరిగిన తీపి పాకం,
    బంగారు రంగులో మెరుస్తూ,
    నోటిలో కరిగే స్వర్గానుభూతి.

    చక్రాల రూపంలో తిరిగినట్టు,
    జీవితం లో తీపి క్షణాలు,
    జిలేబీ లా మెత్తన, తీయన,
    కష్టాలన్నీ మరచిపోయేలా.

    పాత్రలో నుండి బయటకు వచ్చినట్టు,
    ఆవిరి లో తేలే సువాసన,
    జిలేబీ లా జీవితం కూడా,
    తీపి గా, రుచికరంగా ఉండాలి.

    జిలేబీ జిలేబీ, ప్రేమ లా తీపి,
    చినుకులా కరిగే ఆనందం,
    తిన్నా తిన్నా తీపి కోరిక,
    జిలేబీ లా జీవితం మధురం.

    Deepseek-V3

    "DEEP SEEK" కి కూడా జిలేబీ అంటే మక్కువ .

    ReplyDelete
  40. -

    మధురంబగు రుచి జిహ్వకు
    మధురంబగు నధరములు సుమధరములగుచున్
    మధురంబున జల్లను మది
    మధురాధిపతే సకలము మధురమ్మె సదా!





    ReplyDelete
  41. -
    పేకాటలోన దక్కెను
    మా కందంబగు జిలేబి మాదిరి సున్నా !
    ఓ కైపదమ్ము చట్టం
    చా కసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్


    ReplyDelete
  42. -
    అతివయే మూలమౌ కలహమ్ములకు ను
    డువుట సహజము పెద్దలు; డోలు గట్టి
    దంచు దానిని కొట్టగ దాని నుండి
    శబ్ధము వెలువడదకొ విచారశీలి!


    ReplyDelete
  43. -
    కోడే ముందంటా! మరె
    కోడెట్లా వచ్చెనో పకోడి జిలేబీ
    బాడబుల తెలివి తెల్లా
    రే!డం డండమ ఢఢం ! మరిమరి కిలాడీ



    ReplyDelete
  44. -

    చెప్పెద శ్రీసూక్తుల్ మీ
    గొప్పల్బలుకుచు తిరుగుట కొంచెంబైనన్
    చప్పున మానండర్రా
    ముప్పుల్ తప్పువు సుమా ప్రముఖులమనంగా


    ReplyDelete
    Replies
    1. ఎన్నో పద్ధతులున్నా
      కలిగే ఫలితం సున్నా
      నానా సాధన కన్నా
      ఈ నా బోధన మిన్న
      విన్నా వినకున్నా
      మళ్ళీ చెబుతున్నా
      బాధ గురువుల బాట విడుమన్నా
      బోధ గురువుల మాట వినుమన్నా

      Delete
  45. -
    బోధ గురూజీకి మరల
    క్రోధమ్మదె వచ్చె జనుల కోరెరహంకా
    రాదుల విడువమని భళీ!
    చేదునిజమహమును తాను విడువడదేలా ?


    బడుద్దాయిలారా నన్నే అంటారర్రా ?

    ReplyDelete