వేరుని
కనిపించక నిలిచా
వేరని చూసేరు
వేరూనిన నాపై
వారు పెరిగినారు
పెరిగిన వారు
కనిపించేరు
మెచ్చినారు జనులు
కనిపిస్తేనే కదా
దేనికైన ఉనికి ?
ఉనికి
లేదు నాకు.
అయినా
జీవగర్రను నేను
వేరుని
వేరూని నిలచా.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
No comments:
Post a Comment