Saturday, April 3, 2010

జమీందారు హై స్కూలు - చిత్తూరు జ్ఞాపకాలు

బంగారుపాళ్యం జమీందారు హై స్కూలు -బీ జెడ్ హై స్కూలు - బోర్డు స్కూలు - లాంటి పేరు ప్రఖ్యాతలతో ఓ వంద సంవత్సరాలు పైగా చిత్తూరు నగరాని కి విద్యా దానం గావించిన మహోన్నత విద్యా పీఠం ఈ జమీందారు హై స్కూలు. స్వాతంత్రం మునుపు బోర్డు స్కూలు గా ఉండేది. అప్పట్లో "ఫారం" చదువులు. ఆ పై జమీందారు హై స్కూలు గా పరిణితి. దగ్గిరలో ఉన్న బంగారుపాళ్యం జమీందారు గారి పుణ్యాన ఈ నగరానికి ఈ స్కూలు ఆ కాలం లో వచ్చింది. అప్పట్లో ఈ స్కూలు ప్రఖ్యాతి రాష్ట్ర మంతటా ప్రబలి ఉండేదని వినికిడి. అంటే బెస్ట్ స్కూల్స్ లో అన్న మాట.

అప్పట్లో స్కూల్స్ తక్కువే కాబట్టి - ఈ స్కూల్కి డిమాండు ఎక్కువే. క్వాలిటీ విషయం లో పై చేయి ఉండడం తో ఇంకా ఎక్కువే అయ్యేది ఈ డిమాండు. అంటే - ఈ విషయం రామా రావు గారు విద్యని ప్రైవేటు గావించడానికి మునుపు అన్న మాట. ఆ పై ప్రైవేటు స్కూల్స్ రావడం - ఈ స్కూలు విద్యా రంగం లో వస్తున్న వేగమైన మార్పులకి అనుగుణం గా తనను తాను మలచుకోక పోవడం కారణం గా ఇప్పుడు ప్రాబల్యం తగ్గి ఓ మోస్తరు స్కూల్ గా మారి పోవడం జరిగిందన్నది సత్య దూరం కాని విషయం.

ఈ స్కూల్ గురించి - ఇందులో చదివిన విద్యార్తులు - విద్యార్థులు - వారు ఈ దేశం లో - విదేశాలలో ఎక్కడెక్కడో ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి తమ స్కూల్ - పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి తీపి జ్ఞాపకాలతో ముడి పడి ఉన్న స్కూళ్ళలో పెను మార్పిడి జరిగి - ఆ స్కూలు నామ మార్తకం గా ఉంది అన్నది విన్నప్పుడు కొంత మనసు చివుక్కు మానక మానదు.

ఈ టపా ఎందుకంటే - మన దేశం లో ఇప్పుడు ప్రాథమిక విద్య అన్నది హక్కు కింద మార్చబడడం గుర్తింపు కలిగిన విషయం. ఈ మార్పులతో - ఇట్లాంటి ఎన్నో మరుగున పడ్డ మాణిక్యాలు మళ్ళీ - కొత్త పుంతలు తోక్కుతాయని ఆశిస్తాను.

చీర్స్
జిలేబి.

Wednesday, March 31, 2010

అమ్మాయీ అబ్బాయీ నీ పేరేమిటి?

మీకు బాబు ఇష్టమా లేక పాప అంటే ఇష్టమా అని ఎ ఆడవాళ్ళని అడిగినా వెంటనే బాబు అనో కాకుంటే పాప అనో కాకుంటే ఇద్దరూ అనో - కాకుంటే ఓ బాబు ఓ పాప అనో జవాబు వస్తుంది. అట్లాగే మగవాళ్ళని అడిగితె కూడా ఇట్లాంటి జవాబే ఏదో వస్తుంది.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే - అబ్బాయి అమ్మాయి ఎవరైనా - ఇష్టా ఇష్టాలు ఏదైనా మన మిష్ట పడిన దాన్ని బట్టి బాబో కాకుంటే పాపో పుట్టడం జరుగుతుందని కొందరి ఉవాచ. అంటే యతో మనః తతో మన సంతతి.
మీ పర్సనల్ విషయాలలో ఇలాటివి ఎదుర్కోవడం జరిగిందా? అంటే మీ ఇష్టం అబ్బాయి అయితే - మొదటి సంతతి బాబు పుట్టడం లాంటి జరిగిందా? ( ఉదాహరణకి - మా వారికి బాబు పుట్టడం అన్న కల వచ్చింది. మా బాబు పుట్టే కొన్ని నెలల ముందు- స్కాన్నింగ్ చెయ్యలేదు - తెలుసుకోవాలన్న కోరిక లేక పోవడం తో - కాని వస్తుతః మనలో ఏదో ఓ మూల బాబు పుట్టడం అయితే బాగుణ్ణు అన్న కోరిక ఇలా బాబు పుట్టడంలో ప్రతి ద్వనిస్తుందా ? మీరు ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Wednesday, March 24, 2010

జర్మనీ యాత్ర విశేషాలు - త్రిబెర్గ్

కూకూ క్లాక్ - లోపలి భాగం

జర్మనీ ఈ దక్షిణ భాగం లో ఉన్నది బ్లాక్ ఫారెస్ట్ గా ప్రసిద్ధి గాంచిన స్థలం . ఇక్కడ ప్రపంచపు అతి పెద్ద కుకూ గడియారం ఉన్నది. కుకూ గడియారం విశేషం ఏమిటంటే - ప్రతి గంటకి గడియారం నుంచి ఓ కుకూ బయటకి వచ్చి కుకూ కూత తో సమయాన్ని సూచిండడం ! త్రిబెర్గ్ వెళ్ళినప్పుడు తీసిన కొన్ని చిత్రాలు -

Friday, March 19, 2010

మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్

ఈ టపా టైటిల్ గాంధిజీ గారి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ ట్రూత్ లాగ ఉందేమిటి ఆనిపించ వచ్చు మీకు. పడకకి సత్యానికి మధ్య పొందిక ఏమిటి అన్న సందేహం రావచ్చు మరి కొందరికి.

పడక సత్య దూరం కాదని ఈ మధ్య పడక లో పుణ్యాత్ములు కొందరు నిర్దా రించారు కూడా!

కాబట్టి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్ అన్నది ఈ ఇరవై ఒక్క శతాబ్దపు పాపులార్ సబ్జెక్టు.

వాటర్ బెడ్ అన్నది వెస్ట్రన్ వరల్డ్ లో ప్రసిద్ధి. ఈ వాటర్ బెడ్ లో పడుకుని నిద్రించిడం అన్నది ఓ త్రిల్- ఇది రోగ నివారిణి అని కూడా చాల మంది నమ్ముతారు.

ఆ కాలం లో భీష్ముడు అంబుల పడక పై పడుకుని పుణ్య లోకాలకి వెళ్ళ డానికి వేచి ఉన్నాడు.

ఈ కాలం లో స్వామీజీ లు కూడా "అమ్ముల" తో పుణ్య లోకాలగురించి ఎక్స్ పెరి మెంట్స్ ఇన్ బెడ్ చేస్తున్నారు.

చాల మందికి బెడ్ కాఫీ చాల పసందైన విషయం.

మహా విష్ణువు శేష సాయి ఐ పవళించి ఉండడం సదా మనం చూసే ఆయన గారి ఫోసు.

యోగా లో శవాసనం "బెడ్"ల పై చేసే వాళ్ళు ఉన్నారు.

సో , ఇలా రాసు కుంటూ పోతూంటే ఈ బెడ్ మహిమ ఇంతింత కాదయా "విశ్వ దాభి రామా" అని పించక మానదు!

చీర్స్
జిలేబి.

Thursday, March 18, 2010

అరవం అమ్మాయీ- ఆంధ్రా అబ్బాయీ - ఇడ్లీ సాంబార్

ఈ చిత్తూరు పాత కాలం నాటినుంచి అరవ దేశం లో ఉండటం తో ఇక్కడ అరవం వాళ్ళ ప్రాబల్యం ఎక్కువే అని చెప్పొచ్చు. బోర్డర్ ఏరియా కాబట్టి - ఇప్పటికి అరవం వాసన చిత్తూర్ లో ఎక్కువే ఉంటుందనుకుంటా.
ఓ మోస్తరు అరవై ఎనభై ప్రాంతాలలో ఈ ఊళ్ళో తెలుగు కన్నా అరవం తో నే కాలం గడప వచ్చు. ఇప్పటికి మారి ఉంటుందనుకుంటా.
ఈ అరవం అమ్మాయిలూ స్కూళ్ళల్లో గానివ్వండి - కాలేజీ లలో గానివ్వండి చేసే "కిసిమిసు" (అరవం వాళ్ళు మాట్లాడితే - ఏమంటారు - గులక రాళ్ళ డబ్బా సౌండా?) ఇంతా అంతా కాదు.
అబ్బాయిలని గలాటా చెయ్యడం లో వీళ్ళ చాతుర్యం వేరే వేరు. అప్పటిదాకా మాట్లాడుతున్నఅరవం యాస తెలుగు సడన్ గా అరవం లో కి మారిపోయి గల గల నవ్వు ల పరంపర ఎక్కువవడం - ఈ అబ్బాయిలు బిక్క మొహం వెయ్యడం చాల సాధారణ విషయం! ఆ పై పక్క గ్రామాలలోనించి వచ్చే తెలుగు అమ్మాయిలు(నా లాంటి వేరే ఊళ్లలో నించి వచ్చి చదిన వాళ్ళు ఇంకా చాల తక్కువే ) ఆ కాలం లో తక్కువే కాబట్టి ఈ ఆంధ్రా అబ్బాయిలకి - ఈ పాటి కాలక్షేపం వీళ్ళతోనే సరి పెట్టు కోవలసి వచ్చేది.
ఈ అమ్మాయిలకి తెలుసు - ఇడ్లీ , సాంబార్ లేకుంటే అంత గొప్పదనం దానికి లేదని. అయినా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ ఇంక వేరే ఎ కాంబినేషన్ లోను లేదు కాబట్టి - ఇడ్లీ లేకుంటే సాంబార్ వేల్యూ తక్కువే కాబట్టి - వీళ్ళ చాతుర్యానికి కొదవే లేకుండా ఉండేది.
ఇంక స్కూల్ అయ్యవార్లకి ఈ అరవం అమ్మాయిలని వాళ్ళ భాష - అంటే తెలుగు ఉచ్చారణ - మీద ఓ పాటి కామెంట్లు విసరడమూ కద్దు.
స్కూళ్ళల్లో అరవం క్లాసులు కూడా ఉండేవి.( ఇప్పుడూ ఉన్నాయా? నాకైతే తెలీదు) - ఈ గల గలా అమ్మాయిలు - ఆ ప్రక్క క్లాస్సుల్లలో "కిసిమిసు" ఈ పక్క క్లాస్సుల్లలో ఆంధ్రా అబ్బాయిలకి జోకులు వేసుకోవడానికి ఫస్ట్ క్లాసు మేటర్.
వీళ్ళ ట్రేడ్ మార్క్ - నెత్తి పై విభూతి బొట్టు- (అరవం వాళ్లకి ఈ భస్మం పెడితే నే పొద్దు పొడిచినట్టు అనుకుంటా) - దానికింద కుంకం బొట్టు - ఇవన్ని ఆ (మా ) కాలపు ముచ్చట్లు !

చీర్స్
జిలేబి.

Wednesday, March 17, 2010

వికృతి - వినా కృతి ?

వికృతి
ఆకృతి
వినా కృతి యా?
వేచి చూడవలసినదే
వికృతి గవాక్షం ఇవ్వాళ తెరుచుకుంది
గవాక్ష వీక్షణం మానవాళికి ఇప్పుడు లభ్యం

శుభాకాంక్షలతో

జిలేబి.

Sunday, March 14, 2010

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది బ్లాగు ప్రపంచం

ఎపుడో చెప్పెను ఇందిరమ్మ గారు
అపుడే చెప్పెను సోనియా గారు
ఇపుడే చెబుతా ఇనుకో బ్లాగమ్మ
జిలేబి చెప్పిన వేదం కూడా

పల్లెటూళ్ళలో డ్వాక్ర మహిళలు
పట్టణాలలో ఐ టీ గరల్సు
మగదీరులని ఎదిరించారు
కంపిటీ షన్ పెంచారు

చట్ట సభలలో రిజర్వేషన్ కోసం లల్లూ తోనే పోటీ చేసి
ఢిల్లీ సభలోడంకా భజాయించి
మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చారు -

చీర్స్
జిలేబి.

Saturday, March 13, 2010

అపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ బతుకులు

జీవన విధాల మార్పిడి , కాల గతిలో మనిషిని కుటుంబాన్ని జాయింట్ ఫ్యామిలీ నుంచి ఏకైక వ్యక్తీ కేంద్రం గా పరుగులు పెడుతున్న నేపధ్యం లో - ఆర్ధిక అభివృద్ధి కుటుంబ వ్యవస్థకి - సామాజిక తోడ్పాటుకి ఏంటి-మేటర్ గా తయారైనట్టు అనిపిస్తుంది. ఆర్ధిక అభివృద్ధి ఓ మోస్తరు ఎక్కువైన దేశాలలో కొద్ది పాటి - గిల్లి కజ్జాలు కూడా భార్యా భర్తల మధ్య మనస్తాపాలకి డివోర్స్ లకి దారి తీస్తూ కుటుంబ వ్యవస్థని దెబ్బతీయటం ఈ ఇరవై ఒక్క శతాబ్దపు పరిణామం. ఈ జాడ్యం భారత దేశానికి కూడా తప్పదన్నట్టు సిటీ లైఫ్ ల లో - కనిపించడం సొసైటీ లో చూడవచ్చు. ఇంకా మధ్య తరగతి కుటుంబాలలో ఎక్కువయ్యే సూచనలూ ఉన్నాయేమో కూడా?

సో, తీవ్ర మైన థింకింగ్ - ఈ ప్రశ్న - ఆర్ధిక అభివృద్ధి కుటుంబ వ్యవస్థ వినాశ కారియా? - మహిళా దినోత్సవాలు వందేళ్ళు అంటూ గొప్పలు చెప్పుకోకుండా - ఈ విషయం గురించి మహిళలు ఆలోచించాలి. ఆర్ధిక అభివృద్ధి ఇరవై ఒక్క శతాబ్దం లో తప్పక మన దేశానికి వస్తోంది. దానితో పాటు జాతి కి విలువైన - దేశపు ఆటపట్టు వైన కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం గాకుండా కాపాడుకోవడం ఎలాగా? మీరేమంటారు ?

చీర్స్
జిలేబి.

Friday, March 12, 2010

వేకువ వెలుగులు

వేళా వేళా భాస్కరుని రాకతో
కువ కువ మనె కామెంట్లతో
న్నె విషయాలతో
వెరైటీ రచనలతో జా
లు వారు కవితలతో
గుర్తింపు గలిగిన
లుక్ గుడ్ బ్లాగులతో
కూడలీ హారమై న తెలుగు బ్లాగు లోకానికి శుభోదయం!

చీర్స్
జిలేబి.
(టైటిల్ కర్టసీ- భారారే గారి వేకువ వెలుగులు సీరీస్ )

Thursday, March 11, 2010

బిల్లీ శూన్యం - సిల్లీ స్మశానం

ఈ మధ్య భారారే గారి - బ్లాగుల్లో సిల్లి బిల్లి గొడవలు టపాలు చదివాక భలే నవ్వొచ్చింది.

బ్లాగులు ఓ మోస్తరు టైం పాస్ కాలక్షేపం. వీటిల్లో కూడా ఇట్లాంటి హాం ఫట్ ఫైటింగ్ లు - దాడులు - ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ బిజినెస్ లాంటివి జరుగుతుంటాయని - చాల తీక్షణం గా విమర్శలు - గిల్లి కజ్జాలు జరుగు తూన్టాయని చదివాక ఈ టైటిల్ పెట్టి రాయాలని అనిపించింది. స్మశానం లో శవాలు కాల్చబడతాయి కాకుంటే పాతి పెట్ట బడతాయి. బ్లాగుల్లో రాసినవి ఇంట్రెస్ట్ ఉంటె ఎవరైనా చదువుతారు - కాకుంటే మౌస్ స్కిడ్ చేసి క్లోజ్ చేసి మరో బ్లాగు కి వెళ్తారు - సో బ్లాగు లోకం కూడా ఓ లాంటి శ్మశాన వాటికే- ఆ పాటీ దానికి - బిల్లీ శూన్య మంత్రాలలాంటి- ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ అవసరమేనా అన్న సందేహం రాక మానదు! అయినా కాలక్షేపానికి కొందరు శ్మసానాలని కూడా తవ్వే వాళ్ళు ఉండ వచ్చు - ఏమైనా నిధులు గట్రా దొరుకుతా ఏమో అన్న ఆశతో - టుటాం క మెన్ పిరమిడ్ ల తవ్వకాలలా- హరప్పా మొహన్జదారాలల - ఏదైనా విశేషమైన వస్తువు లు బయట పడతాఎమోనని చూద్దాం !

బిల్లీ శూన్యం - బ్లాగ్ మాత్రికుల్లార - మీ సిల్లీ స్మశాన తవ్వకాలని వెంటనే ప్రారంభించండి ! - అల్ ది బెస్ట్ !

చీర్స్
జిలేబి.